Home Blog Page 255

కళ్యాణ్ రామ్ కి అప్పు గా జూనియర్ ఎన్టీఆర్ అన్ని కోట్ల రూపాయలను ఇచ్చాడా..?

Jr NTR helping Kalyan Ram
Jr NTR helping Kalyan Ram

Jr NTR helping Kalyan Ram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి నటులు సైతం నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను మోస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కళ్యాణ్ రామ్ అప్పుల్లో కూరుకుపోయాడనే వార్తలైతే అప్పట్లో బాగా వినిపించాయి. ఇక దాంతో అతనికి జూనియర్ ఎన్టీఆర్ కొంతవరకు ఆర్థిక సహాయాన్ని అందించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ దగ్గర అప్పుగా కళ్యాణ్ రామ్ తీసుకున్నాడట. దాదాపు 50 కోట్ల వరకు ఎన్టీఆర్ దగ్గర అప్పు అయితే తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏదేమైనా కూడా అన్నదమ్ములే కాబట్టి వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఒకరి దగ్గర ఒకరు అప్పులు తీసుకొని మళ్ళీ చెల్లిస్తుంటారు.

కాబట్టి అది పెద్ద మ్యాటర్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఇక మొత్తానికైతే కళ్యాణ్ రామ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు ఏవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. తద్వారా ఆయన కొంతవరకు డీలా పడ్డాడనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సక్సెస్ ని సాధించి మరోసారి గాడిలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం మరోసారి లైన్ లైట్ లోకి వస్తారనే చెప్పాలి.

మరి ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేయకపోవడంతో అతను చాలావరకు లాసెస్ ని కవర్ చేయలేకపోతున్నారట. ఇక మీదటైన ఆయన బ్యానర్ నుంచి కొన్ని మంచి సినిమాలు వస్తే చూడాలని వాళ్ళ అభిమానులైతే కోరుకుంటున్నారు…

ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాలు అడిగారు.. ఆ ముఖ్యమంత్రి కేబీఆర్ పార్కు ను చేసేశారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Janardhan Reddy KBR Park history
Janardhan Reddy KBR Park history

Janardhan Reddy KBR Park history: కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి సంజీవని లాంటిది. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాదు నగరంలో ఈ పార్క్ ఒక అడవి లాగా కనిపిస్తుంది. ఈ పార్క్ ను కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఏకంగా 25 మీటర్ల వరకు సున్నితమైన పర్యావరణ జోన్ గా నిర్దేశించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పరిధిని మూడు మీటర్లకు కుదించింది. అంతేకాదు, 25 నుంచి 35 మీటర్ల ఎత్తులో ఉన్న చెట్లను నరికి వేయడానికి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ పనులు రాత్రి పగలు అని తేడా లేకుండా జరుగుతున్నాయి.

అయితే ఓ మహిళ ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆసక్తిని చూపించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు.. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి పనులు చేపట్టకూడదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి కేబీఆర్ పార్కు చుట్టూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. పైగా ఆ ప్రాంతం అత్యంత సున్నితమైనది.

కేబీఆర్ పార్క్ నేడు ఒక అడవిలాగా కనిపిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ నగరానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటి వనాన్ని ఏర్పాటు చేశారంటే దాని ఘనత ముమ్మాటికి జనార్దన్ రెడ్డిదే. నిజాం యువరాజు ముఫకంజాకు అప్పటి హైదరాబాద్ నగరంలో విపరీతంగా భూములు ఉండేవి. అప్పట్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం అమలుకు వచ్చిన తర్వాత ముఫకంజా వద్ద 390 ఎకరాల పట్టణ మిగులు భూమి ఉన్నట్టు అప్పటి ప్రభుత్వం గుర్తించింది. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటికి హైదరాబాద్ నగరం పంజాగుట్ట దాటి విస్తరించలేదు. పైగా నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతం కావడంతో అప్పట్లో శాసనసభ్యుల బృందం ముఖ్యమంత్రి ని కలిసింది.

ముఫకంజా నుంచి స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని ప్లాట్లుగా విభజించి తమకు అందజేయాలని వారు కోరారు. ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆ లేఖను నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావుకు ఇచ్చారు. పరిశీలించాలని సూచించారు. అయితే ఈ భూమి ప్రభుత్వ చట్టాల ప్రకారం పేదలకు.. ఇళ్ళు లేని వారికి మాత్రమే ఇవ్వాలని ఉందని మాధవరావు జనార్దన్ రెడ్డికి వివరించారు. దీంతో జనార్దన్ రెడ్డి ప్రత్యామ్నాయ స్థలాలలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్లాట్లు కేటాయించారు.

ముపకంజా నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమి సమస్యను పరిష్కరించడానికి జనార్దన్ రెడ్డి ఒక కీలక ప్రణాళిక రూపొందించారు. ఆ స్థలాన్ని ఉద్యానవనంగా మార్చాలని సూచించారు.అంతేకాదు, భవిష్యత్తు కాలంలో దానిని ఎవరు ఆక్రమించకుండా ఉండడానికి అనేక చట్టాలను తీసుకొచ్చారు. అలా ఆ పార్కు రూపాంతరం చెందింది. జనార్దన్ రెడ్డి పదవి నుంచి వెళ్లిపోయిన తర్వాత.. చాలా రోజులకు దానికి ఒక పేరు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. చివరికి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరును దానికి పెట్టారు. వాస్తవానికి ముపకంజా నుంచి భూమి స్వాధీనం చేసుకునే సమయానికి ముందు బ్రహ్మానందరెడ్డి కన్నుమూశారు. ఆ పార్కు పేరు పెట్టే విషయం తనకు తెలియదని.. ఒకవేళ పేరు పెట్టాల్సి వస్తే జనార్దన్ రెడ్డి పేరు ఎందుకు పెట్టాలో తాను చెప్పేవాడినని కాకి మాధవరావు అనే సందర్భాల్లో పేర్కొన్నారు.

కేవలం ఇది మాత్రమే కాదు
.. ఫిలింనగర్ ఏరియాలో ఆల్ ఇండియా అత్యున్నత సర్వే అధికారుల కోసం 50 ఎకరాల స్థలాన్ని కూడా జనార్దన్ రెడ్డి కేటాయించారు. నాడు సొంత ఇల్లు లేని 258 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు గజానికి 500 చొప్పున స్వీకరించి ఫ్లాట్లను కేటాయించారు. అధికారుల గృహాలలో పని చేసే వారి కోసం రెండు ఎకరాలను కేటాయించారు. ప్రశాసన్ నగర్ హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ కాలనీ రూపాంతరం చెందింది.

భారతీయుడిగా ఆ లెజెండరీ క్రికెటర్.. ఇండియాలో స్థిరపడటమే తరువాయి..

Foreign cricketer settles in India
Foreign cricketer settles in India

Foreign cricketer settles in India: నెత్తిమసిన స్టాలిన్ కొడుకు ఉదయనిధికి మన సనాతన ధర్మం గొప్పగా అనిపించకపోవచ్చు. అది కరోనా వైరస్ కంటే డేంజర్ లాగా అనిపించవచ్చు. అది అతడి స్థాయి. పైగా ఏమంటాడంటే సనాతన ధర్మం అనేది కుల వ్యవస్థను ఏర్పాటు చేసిందట. కుల వ్యవస్థను నిర్మూలించడమే ఆయన ధ్యేయమట. ఆ లెక్కన డిఎంకె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుల వ్యవస్థను ఎందుకు నిర్మూలించలేదు.. కులాలవారీగా ఎందుకు మీటింగ్లు పెట్టాడు. మోస్ట్ వరస్ట్ పొలిటిషన్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ.

సరే ఆ సనాతన ద్రోహిని పక్కన పెడితే.. మన ధర్మాన్ని.. మన సిద్ధాంతాలను ఆచరించేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ఆమధ్య బీహార్ లోని గయా ప్రాంతానికి.. విదేశీయులు వచ్చారు. వారంతా తమ పూర్వికులకు పిండ ప్రదానాలు చేశారు. యుద్ధంలో చనిపోయిన తమ వారి ఆత్మ శాంతి కోసం ఇక్కడికి వచ్చామని.. ఇక్కడ సనాతన ధర్మం తమను ఎంతగానో ఆకట్టుకుందని వారు చెప్పారు. తమ త్వరలోనే హిందూ మతంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు వెల్లడించారు. వారు మాత్రమే కాదు.. ఇంకా చాలామంది విదేశీయులు మన ధర్మం పట్ల ఆకర్షితులై.. భారతీయులుగా మారిపోతున్నారు.

భారతీయతపై ఆసక్తి చూపిస్తున్న వారిలో పంజాబ్ జట్టు రికీ పాంటింగ్ కూడా ఒకరు. ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఈ పేరు అత్యంత సుపరిచితం. ఐపీఎల్ లో కూడా ఈయన ఆడారు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది కుటుంబంతో కలిసి పూజలో పాల్గొన్నారు. నుదుటిమీద విభూది ధరించి కనిపించారు. ఈయడాది తన చేతికి దేవుడి దారం కట్టుకున్నారు. ఆధారాన్ని అత్యంత పరమ పవిత్రంగా పాంటింగ్ భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో పాంటింగ్ పూజలు చేసిన ఫోటోలు.. చేతికి దారం కట్టుకున్న ఫోటోలు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాంటింగ్ మాట్లాడారు. తనకు భారతదేశం అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి ప్రజలు అంటే అమితమైన ప్రేమ అని.. ఇక్కడ ధర్మం తనను ఎంతగానో ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకారం చూసుకుంటే త్వరలోనే అతడు ఆస్ట్రేలియాను పక్కనపెట్టి భారతదేశంలో స్థిరపడతాడని.. భారతీయుడుగా మారిపోతాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి..

Vijay government collapse
Vijay government collapse

Vijay government collapse: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా పూర్తి కాలేదు. కొత్త ప్రభుత్వంలో మంత్రులు శాఖలు స్వీకరించి.. ఇంకా వాటిపై పట్టు కూడా సాధించలేదు. ఆదిలోనే హంస పాదులాగా అపశకునాలు.. శాపనార్ధాలు మొదలైపోయాయి. దీంతో తమిళనాడు రాజకీయాలలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

తమిళనాడులో టీవీకే పార్టీకి అన్నా డీఎంకే చీలికవర్గం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఐయూఎంఎల్ వంటి పార్టీలు ఫ్లోర్ టెస్టులో సపోర్ట్ తెలిపాయి. దీంతో టీవీకే అధినేత విజయ్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఫ్లోర్ టెస్ట్ ముందు విజయ్ కొంతమంది ఎమ్మెల్యేలకు సోఫాలను పంపించారని వార్తలు వచ్చాయి. సోఫాలను పంపించిన తీరు పుష్ప సినిమా మాదిరిగానే ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. అవి నిజంగానే సోఫాలేనా.. ఇంకా ఏమైనా ఉన్నాయా అని డీఎంకే నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను పక్కన పెడితే విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి.. ఫ్లోర్ టెస్ట్ పాస్ కావడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి విజయం సాధించారు.

విప్లవాత్మక నిర్ణయాలతో.. వివాదాస్పద అంశాలతో విజయ్ ప్రతిరోజు మీడియాలో పతాక శీర్షికలో కనిపిస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి ప్రతిపక్షం ఆరు నెలల పాటు సమయం ఇస్తుంది. దీనిని హనీమూన్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత ఎటాక్ మొదలు పెడుతుంది. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఇటీవల కాలంలో ఇదే మాట చెప్పారు. ఆయన ఓడిపోయిన తర్వాత సొంత నియోజకవర్గం లో ప్రజలను కలుసుకున్నారు. ఓటమిని హుందాగా స్వీకరించారు. అయితే ఇప్పుడు ఆయన స్వరం పెంచారు. డీఎంకే నాయకుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. టీవీకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారు. పార్టీ నాయకులు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఓ వివాహ వేడుకకు స్టాలిన్ హాజరయ్యారు. అక్కడ కూడా ఆయన రాజకీయపరమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. విజయ్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. విజయ్ ఇన్ స్టా గ్రామ్ రాజకీయాలు చేశారని.. ప్రజలకు ఏదో చేస్తామని భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

స్టాలిన్ ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓటమినేపద్యంలో స్టాలిన్ ఏవేవో మాట్లాడుతున్నారని.. విజయ్ ప్రభుత్వానికి ఇబ్బంది లేదని.. మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ బలం ఉందని టీవీకే నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయ్ నాయకత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి డీఎంకే నేతల్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని.. దీనిని జీర్ణించుకోలేక స్టాలిన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని టీవీకే నేతలు అంటున్నారు.

'జోకర్' గా సుడిగాలి సుధీర్.. ఈ రేంజ్ టీజర్ అసలు ఊహించలేదు.. ఈసారి కొడితే కుంభస్థలమే..

Sudheer Joker Teaser Review
Sudheer Joker Teaser Review

Sudheer Joker Teaser Review: ‘జబర్దస్త్’ లో టీం లీడర్ గా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్ట కూటి కోసం మ్యాజిక్ షోస్ చేసుకుంటూ కెరీర్ ని మొదలు పెట్టిన సుధీర్, అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెర పవర్ స్టార్ అనే స్థాయికి చేరుకున్నాడు. సుడిగాలి సుధీర్ ఒక ఎంటర్టైన్మెంట్ షో ఒప్పుకున్నాడంటే , దానికి టీఆర్ఫీ రేటింగ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో అలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ కి ఎంతో మంది వెళ్లారు , ఎవ్వరూ సక్సెస్ అవ్వలేకపోయారు , కానీ సుధీర్ కి సక్సెస్ అయ్యేంత టాలెంట్ ఉంది , సరైన ప్లానింగ్ తో వెళ్తే మరో శివ కార్తికేయన్ అవ్వగలడు. అతనిలో యాక్టింగ్ స్కిల్స్ , డ్యాన్స్ స్కిల్స్ వేరే లెవెల్ లో ఉంటాయి, అదే సమయం ఫైట్స్ కూడా అద్భుతంగా చేయగలడు.

ఇలా అన్ని క్రాఫ్ట్స్ లోనూ సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్. అందుకే ఇతను ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటుంటారు విశ్లేషకులు. ఆయన హీరో గా నటించిన ‘గాలోడు’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘జోకర్’ అనే చిత్రం చేస్తున్నాడు. నేడు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ ని చూస్తుంటే చాలా రిచ్ గా , మంచి క్వాలిటీ తో ఉంది, అంతే కాకుండా, ఈ చిత్రం లో నటించే నటీనటులు కూడా పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళే. ‘బిగ్ బాస్ 9’ ఫేమ్ అయేషా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

ఒక రాయల్ కుటుంబం లో పుట్టిన ఒక యువకుడు , అవసరానికి మించి డబ్బు ఉన్నప్పటికీ కూడా దొంగతనాలు చేస్తుంటాడు , అలా చెయ్యడానికి కారణం ఏమిటి అనేది ఆసక్తికరమైన పాయింట్. సుధీర్ కూడా ఈ గ్లింప్స్ లో చాలా స్టైలిష్ గా అనిపిస్తున్నాడు. చివర్లో ఆయన చెప్పిన డైలాగ్ ‘నేను ఏదైనా గెలుస్తా.. అనే నమ్మకం ఉంటేనే దిగుతా’ బాగా పేలింది కానీ , డైలాగ్ డెలివరీ ఇంకా కాస్త పవర్ ఫుల్ గా ఉండుంటే బాగుండేది అని అంటున్నారు నెటిజెన్స్. ఈ డైలాగ్ విన్న తర్వాత కమెడియన్ గా సుధీర్ ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయని అంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

చంద్రబాబును కలిసిన బాలినేని.. మేటర్ ఏంటి?!

Balineni meets Chandrababu
Balineni meets Chandrababu

Balineni meets Chandrababu: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఆయన తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం గమనార్హం. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబుకు బద్ధ విరోధిగా ఉండేవారు బాలినేని. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమీప బంధువు కావడంతో జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండేవారు బాలినేని. రాజకీయంగానే కాదు కుటుంబ పరంగా కూడా చూసుకుంటే చంద్రబాబుకు ఎప్పుడు వ్యతిరేకమే. అటువంటి చంద్రబాబుతో బాలినేని ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జనసేన లో ఉన్నారు బాలినేని. ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే చంద్రబాబును కలిసి ఉంటారు.

కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా వ్యవహరించారు బాలినేని. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004లో తొలిసారిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో రెండోసారి గెలవడంతో రాజశేఖర్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవి వదులుకొని మరి బాలినేని జగన్ వెంటే అడుగులు వేశారు. 2014లో బాలినేని ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు జగన్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి బాలినేని గెలవడంతో మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తొలగించడంతో మనస్థాపానికి గురై జగన్మోహన్ రెడ్డికి క్రమేపి దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు.

దానిపై క్లారిటీ ఇచ్చేందుకే..
జనసేనలో చేరిన బాలినేనికి తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్న లోకల్ క్యాడర్ గుర్తించడం లేదు. ఆపై ఆయన చేరికను టిడిపి ఎమ్మెల్యే జనార్ధన కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక రకమైన గందరగోళం నడుస్తున్న క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారన్న ప్రచారం నడిచింది. తనకు అటువంటి ఆలోచన లేదని.. ఈ ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని బాలినేని విమర్శించారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సానుకూల వాతావరణం ఏర్పడడంతో నేరుగా చంద్రబాబును కలిసి.. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని భావించినట్టు ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే రాజకీయంగా బద్ధ విరోధిగా భావించే చంద్రబాబును బాలినేని కలవడం అంటే చిన్న విషయం కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని ఈ ఘటనతో స్పష్టమవుతోంది.

ఏపీలో ఆ భూములకు ఎంచక్కా రిజిస్ట్రేషన్లు!

AP house plot registrations
AP house plot registrations

AP house plot registrations: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు మోక్షం కల్పించింది. గ్రామకంఠం భూములు, ఇళ్ల స్థలాలకు సంబంధించి యాజమాన్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వెబ్ లాండ్ రికార్డుల్లో గ్రామ కంఠంగా నమోదైన ఆస్తుల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్ చేస్తూ రెవెన్యూ శాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో లక్షలాదిమందికి గ్రామకంఠం భూములు, ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులు రానున్నాయి. రిజిస్ట్రేషన్లకు సైతం అడ్డంకి తొలగనుంది. ఇది ప్రజలు హర్షించే పరిణామమే.

నిషేధిత జాబితాలో ఉన్న..
ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక సర్వే నంబర్ తో ఉన్న గ్రామ కంఠం భూమి.. సెక్షన్ 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న.. తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయవలసిందే. గత మాదిరిగా అధికారుల ధ్రువీకరణ పత్రం అవసరంలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంటే చాలు. నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపాలి అనేది ప్రభుత్వ తాజా ఆదేశం. గతంలో సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. ఒక సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉంటే.. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని చిక్కుముడులు విడిపోయినట్లు అయింది. కేవలం సామాజిక అవసరాలకు కేటాయించిన భూములు మినహా వ్యక్తిగత ఆస్తులతో పాటు ఇల్లు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయింది. గత నివాస ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

* గ్రామ కంఠంలో ఉన్న భూములు, ఇళ్లకు సంబంధించి భారీ మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. వీటి రిజిస్ట్రేషన్లకు లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు. స్థానిక సంస్థలు జారీ చేసే ఇంటి పన్ను రసీదు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

* గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఖాళీ స్థలానికి రసీదు లేకపోయినా పరవాలేదు. అమ్మకం దారుడు, కొనుగోలుదారుడు స్వయం డిక్లరేషన్ ఇస్తే చాలు. దానిని తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖతో పాటు రెవెన్యూ శాఖకు తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ సమస్యపై లక్షలాది మంది ఎదురుచూస్తుండగా సానుకూలంగా స్పందించింది ఏపీ ప్రభుత్వం.

మమతా బెనర్జీ చేస్తున్నారు.. మరి కెసిఆర్, జగన్ ఏంటి?

Mamata Banerjee KCR Jagan
Mamata Banerjee KCR Jagan

Mamata Banerjee KCR Jagan: దేశంలో దొంగ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. ఇది ఆహ్వానించదగ్గ విషయం. కానీ బిజెపి, ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు దీనిని తప్పు పడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓట్లను తొలగించడమే ఈ ప్రత్యేక ఓటరు సవరణ అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపైనే న్యాయ పోరాటం చేస్తున్నారు. స్వయంగా ఆమె వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఓటరు జాబితా సవరణ వెనుక బిజెపికి లబ్ధి ఉందన్నది మమతా బెనర్జీ ఆరోపణ. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ బాటలో నడుస్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఎన్నికల సంఘం చర్యలను అనుమానిస్తారా? అనేది చూడాలి.

స్ట్రాంగ్ గా నిలబడిన మమత..
బెంగాల్లో మమతా బెనర్జీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు. బిజెపికి వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓటమి తర్వాత కూడా దీనిపైనే గట్టిగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమె ఓటమితో ఈవీఎంలపై అనుమానం కంటే.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణతోనే బిజెపి గెలిచిందని ఆరోపణలు చేశారు. ఒకవైపు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు, ఎమ్మెల్యేలపై ప్రలోభాలు, పార్టీ శ్రేణులపై కేసులు నమోదవుతున్న మమతా బెనర్జీ వెనక్కి తగ్గడం లేదు. బిజెపి పై అదే పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ఆ ధైర్యం కేసిఆర్, జగన్ చేయగలరా అనేది ఇప్పుడు ప్రశ్న.

వైసీపీ అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దొంగ ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎలానూ ఉంటుంది. ఏపీలో అయితే తమ సానుభూతి ఓట్లు ఎక్కడ అన్న ఆందోళనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కొంది. ఆ పార్టీ శ్రేణులతో రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. అటు తెలంగాణలో గులాబీ పార్టీ నుంచి కూడా పెద్దగా కదలికలేదు. అయితే కెసిఆర్ తో పాటు జగన్ మమతా బెనర్జీని అనుసరించి బీజేపీపై పోరాటం చేస్తే ఫలితం ఉంటుంది. కానీ అంత సాహసం చేసే ఆలోచన ఆ ఇద్దరి నేతలకు లేదు. ఎందుకంటే కేసుల భయం అనేది వారికి వెంటాడుతోంది కాబట్టి.

వైసీపీలో రెడ్డి నేతలు సైలెంట్.. కాపు నేతలు యాక్టివ్!

YSRCP
YSRCP

YSRCP Reddy leaders silent: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా పదవులు, ఆర్థికంగా లాభ పొందిన వారిలో రెడ్డి సామాజిక వర్గం నేతలు అధికం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత పూర్తిగా సామాజిక వర్గం నేతలు సైలెంట్ అయ్యారు. జగన్ ఎంతవరకు కాపు నేతలతో రాజకీయం చేస్తున్నారు. తమ వారిని మాత్రం రక్షించుకునే పనిలో ఉన్నారు. ఈ రాజకీయం తెలియక వైసీపీలో కాపు నేతలు జగన్ చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా ప్రయోజనాలు రెడ్డి సామాజిక వర్గం నేతల వైతే.. కేసులతోపాటు వివాదాస్పద ముద్ర కాపు నేతలకు దక్కుతోంది. ఇది ఎంత మాత్రం కాపు నేతలు గ్రహించడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో..

ఒక వెలుగు వెలిగిన నేతలు..
వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా ఉండేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాజ్యసభ సభ్యుడితో పాటు టీటీడీ చైర్మన్ పదవి అనుభవించారు వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా ఉంటూ.. బాగానే వెనకేసుకున్నారు విజయసాయిరెడ్డి. అమరావతి పై విషం కక్కుతూ అడుగడుగునా అడ్డుకున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాయలసీమను తన కనుసైగతో శాసించారు పుంగనూరు పెద్దిరెడ్డి. తాడిపత్రిలో సవాల్ చేస్తూ నిలిచారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హడావిడి చేసేవారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. లిక్కర్ స్కాంతో ఎంతో కొంత వెనుకేసుకున్నారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డి సామాజిక వర్గమే సింహభాగం లబ్ది పొందింది. అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో వారంతా సైలెంట్ అయ్యారు.

వివాదాల్లో కాపు నేతలు..
రెడ్డి సామాజిక వర్గం వెళ్లిపోవడంతో కాపు సామాజిక వర్గంతో రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది గ్రహించక కాపు నేతలు రెచ్చిపోతున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్,బొత్స సత్యనారాయణ లాంటి వారితో రాజకీయాలు చేస్తున్నారు. మధ్యలో విడదల రజిని, జోగి రమేష్ లాంటి వారితో మాట్లాడిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయిస్తున్నారు. వీరు సైతం జగన్ ఎంత చెబితే అంతా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని, పదవులను, ఆర్థిక ప్రయోజనాలను పంచుకున్న వారు మాత్రం ఇటువైపు చూడడం లేదు. అయితే ఇందులో జగన్ కుల ప్రయోజనం ఉంది. అది గ్రహించలేకపోతున్నారు వైసీపీలో ఉన్న కాపు నేతలు. తాము బాధితులుగా జగన్ చేతిలో మారిన వారు.. కాపులు అన్యాయానికి గురైపోతున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

వైసిపి తప్పకుండా గెలుస్తుంది.. వాటిని సరి చేసుకుంటేనే..

YSRCP
YSRCP

YSRCP winning chances analysis: ఏపీలో తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తోంది.. అయితే అది ఎలా? ఆ పార్టీకి తెలియాలి. ఎందుకంటే ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయడం లేదు. శాసనసభకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం లేదు. గట్టిగా ప్రశ్నించడం లేదు కూడా. పోనీ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నారా అంటే అదీ లేదు. నిన్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. కానీ చాలా నియోజకవర్గాల్లో అసలు ఈ ఆందోళన కార్యక్రమాలు కనిపించలేదు. పెద్ద పెద్ద నేతలు అంతా ముఖం చాటేసారు. అయినా సరే అధికారంలోకి వచ్చేస్తాం అన్న ప్రకటనలు మాత్రం విపరీతంగా వినిపిస్తున్నాయి. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే 2014 నుంచి 2019 మధ్య ఓకే.. 2019లో అధికారంలోకి వచ్చాక 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొని సంక్షేమ పథకాలను విచ్చలవిడిగా అమలు చేసేసింది. అభివృద్ధిని వదిలేయడంతో ప్రజలు దానిని ఒక నిర్లక్ష్యంగా గుర్తించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ప్రజలు ఎలా భావించి కూటమికి అధికారం కట్టబెట్టారో.. అదే మాదిరిగా పాలన సాగుతోంది.

అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం
ఒకవైపు కూటమిపాలనను పరిశీలిద్దాం. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. దానిపై విషం చిమ్ముతుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ. ఇంకోవైపు పోలవరం నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఐటీ హబ్ గా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాయలసీమకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రం లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. అదే సమయంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల వేటనిషేధ భృతి, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్.. ఇలా ప్రధాన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో సంతృప్తి శాతం కనిపిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. ఇన్ని జరిగాక కూడా తాము అధికారంలోకి వచ్చేస్తాం అంటూ పగటి కలలు కంటోంది వైయస్సార్ కాంగ్రెస్.

ఇవన్నీ మైనస్ లే కదా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లడం లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రావడం లేదు. వస్తేగిస్తే ఆ పార్టీ నేతల అరెస్టు సమయంలో పరామర్శలకు వస్తున్నారు. ప్రజా పోరాటాల్లో పాల్గొనడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పై ఉన్న కోపంతో అమరావతిని పడకేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అస్తవ్యస్తం చేశారు. అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి రావాలని భావించారు. అది మొన్నటి ఎన్నికల్లో వికటించిన ఆయన గుర్తించలేకపోయారు. ఇప్పటికీ అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. అయినా అధికారం వచ్చేస్తుంది అంటూ ధీమాతో ఉన్నారు. అది ఎంత మాత్రం తగదు కూడా..

'కరుప్పు' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 'వర్కింగ్ డే' లో కూడా ఈ రేంజ్ గ్రాస్ అసలు ఊహించలేదు..

Karuppu 4 days worldwide collections
Karuppu 4 days worldwide collections

Karuppu 4 days worldwide collections: ఈ ఏడాది మన టాలీవుడ్ లో అయినా ఆరంభం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి కానీ , కోలీవుడ్ లో మాత్రం నిన్న మొన్నటి వరకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేక, థియేటర్స్ ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయం లోనే ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన హీరో సూర్య ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. థియేటర్స్ కి ఆడియన్స్ ఒక జాతర ని చూసేందుకు ఎలా వెళ్తారో , అలా వెళ్తున్నారు. ఇలా సూర్య సినిమాలకు జనాలు కదిలి 14 ఏళ్ళు కావొస్తుంది. మొదటి వీకెండ్ లో అద్భుతమైన గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , మొదటి సోమవారం రోజున కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది.

తమిళనాడు లో అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వచ్చిందో , దాదాపుగా అదే రేంజ్ గ్రాస్ నిన్న కూడా వచ్చింది. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 4 వ రోజున కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 10 కోట్ల 92 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రజినీకాంత్, విజయ్ , అజిత్ వంటి వారికి కూడా వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. దీనిని బట్టీ సూర్య ఏ రేంజ్ సూపర్ స్టార్ అనేది అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి 4 వ రోజున మొదటి రోజుతో సమానమైన వసూళ్లు వచ్చాయి. దాదాపుగా 2 కోట్ల 64 లక్షల రూపాయిలు 4 వ రోజున వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా కర్ణాటక లో ఈ చిత్రానికి 1 కోటి 60 లక్షలు రాగా , కేరళ నుండి 1 కోటి 34 లక్షలు వచ్చాయి.

కర్ణాటక , కేరళ వంటి రాష్ట్రాల్లో వర్కింగ్ డే లో ఈ రేంజ్ గ్రాస్ రావడం అంటే ఈ సినిమాని ఆడియన్స్ ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 4 వ రోజున 16 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. తమిళనాడు లో 4 రోజులకు 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 4 వ రోజున 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్ లో నాలుగు రోజులకు కలిపి 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ఓవరాల్ గా ఈ చిత్రానికి 142 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నాలుగు రోజుల్లో వచ్చాయి, షేర్ వసూళ్లు 67 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది , తమిళనాడు లో నేటితో బ్రేక్ ఈవెన్ అవ్వనుంది.

తమిళనాడు బాక్స్ ఆఫీస్ కింగ్ ఇక సూర్య యేనా..? ఇది మామూలు కం బ్యాక్ కాదు..

Suriya Tamil Nadu box office king
Suriya Tamil Nadu box office king

Suriya Tamil Nadu box office king: సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. ‘గజినీ’ చిత్రం తో ఆయన సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. కానీ గత 14 ఏళ్ళ నుండి సూర్య కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం , ఆయన తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిన్న హీరోలు కూడా ఎక్కువ వసూళ్లను రాబట్టడం వంటివి చూసి , సూర్య ఇక ఎప్పటికీ హిట్ కొట్టలేడేమో అని ఆయన అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘కరుప్పు’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి వీకెండ్ తర్వాత మొదటి వర్కింగ్ డే అయినటువంటి సోమవారం రోజున కూడా ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది.

సూర్య బాక్స్ ఆఫీస్ స్టామినా ని చూసి ట్రేడ్ వర్గాలు , నేటి తరం జెన్ జీ ఆడియన్స్ మొత్తం కంగుతిన్నారు. అయితే రాబోయే రోజుల్లో సూర్య కూడా తలపతి విజయ్ లాగా తమిళనాడు ఇండస్ట్రీ ని శాసించబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే విజయ్ సినిమా ఇండస్ట్రీ ని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు , తమిళనాడు కి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు , శాశ్వతంగా ఇక సినిమాల నుండి తప్పుకున్నట్టే . ఇక మరో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అజిత్ కూడా సినిమాలను వదిలేసి కారు రేసింగ్ పై ద్రుష్టి పెట్టాడు. ఇలాంటి సమయం లో సూర్య ఇచ్చిన ఈ కంబ్యాక్ ని చూసి , ఇక తమిళనాడు నీదే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘కరుప్పు’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అంటే, లియో , విక్రమ్ , కూలీ లాంటి హిట్ సినిమాలు కూడా సాధించలేని వసూళ్లను తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తోంది.

ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ని చూడడం వల్లే సూర్య ని అందరూ తదుపరి నెంబర్ 1 హీరో అని అంటున్నారు. ఇకపోతే సూర్య తదుపరి చిత్రాలు కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి తో ‘విశ్వనాధ్ & సన్స్ ‘ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ‘లక్కీ భాస్కర్’ రేంజ్ లో ఉంటే మరోసారి సౌత్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ‘రోలెక్స్’ తెరకెక్కనుంది. ఈ సినిమాకు జెన్ జీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం సూర్య రూల్ నడిచేలా అనిపిస్తోంది.

కేంద్రం చేతుల్లోకి చికెన్ నెక్.. బీ ఎస్ ఎఫ్ గేమ్ స్టార్ట్!

Chicken Neck corridor
Chicken Neck corridor

Chicken Neck corridor: భారత సరిహద్దులో అత్యంత కీలకమైన చికెన్ నెక్ కేంద్రం చేతుల్లోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ను ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేసే కీలకమైన ‘చికెన్ నెక్’ (సిలిగురి కారిడార్) ప్రాంతంపై కేంద్ర ఏజెన్సీల నియంత్రణ పెరిగే ముఖ్యమైన అభివృద్ధి చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని సుమారు 120 ఎకరాల భూమి, జాతీయ రహదారి మార్గాలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీ ఎస్ ఎఫ్)కు అప్పగించాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 22 కి.మీ. పొడవైన ఈ సంవేదనాత్మక ప్రాంతంపై కేంద్రం పట్టు మరింత బలపడనుంది.

చికెన్ నెక్ ఎందుకు కీలకం?
చికెన్ నెక్ అనేది భౌగోళికంగా చాలా సన్నటి, వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన కారిడార్. ఇది పశ్చిమ బెంగాల్‌ను అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాంతం ఈశాన్య భారత అభివృద్ధికి ‘జీవనాడి’లాంటిది. బంగ్లాదేశ్ సరిహద్దుతో పొరుగున ఉన్నందున, ఇక్కడ భద్రతా సవాళ్లు ఎక్కువ. సరిహద్దు అతిక్రమణలు, చొరబాట్లు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఇతర అనుచిత కార్యకలాపాలకు ఈ ప్రాంతం లక్ష్యంగా మారే అవకాశం ఉంది. తాజా నిర్ణయం ద్వారా భద్రతా దృక్పథం మార్చాలని అధికారులు భావిస్తున్నారు.

సరిహద్దుపై మరింత నిఘా..
స్థానిక అంతరాయాలు తగ్గి, భద్రతా బలగాలకు స్వేచ్ఛగా కదలికలు సాధ్యమవుతాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే సంభావ్య బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. ఈ చర్య దేశ భద్రతా దృక్పథంలో భాగంగా చూడాలి. ఇటీవలి కాలంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన కనెక్టివిటీ..
స్మగ్లింగ్, చొరబాట్లు తగ్గడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు. కేంద్ర-రాష్ట్ర సమన్వయం మెరుగు పడుతుంది. అయితే స్థానికులు, భూస్వాముల మధ్య అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ వ్యతిరేకత రావచ్చు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల సందర్భంలో. ఈ నిర్ణయం దేశ భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన మలుపుగా మారవచ్చు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం తన వ్యూహాత్మక స్థానాన్ని మరింత దృఢపరుచుకోవడం జరుగుతోంది.

చికెన్ నెక్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర నియంత్రణ పెంచడం దీర్ఘకాలికంగా దేశ అఖండత మరియు ఈశాన్యాభివృద్ధికి బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ అభివృద్ధులు భవిష్యత్తులో మరిన్ని సానుకూల మార్పులకు దారి తీస్తాయని ఆశించవచ్చు.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ సృష్టించిన 'దృశ్యం 3'.. ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Drishyam 3 Audience Response
Drishyam 3 Audience Response

Drishyam 3 advance bookings collection: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దృశ్యం 3’ ఈ నెల 21 న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు, ఎందుకంటే ముందు రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణ అలాంటిది. అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని కలిగించిన థ్రిల్లర్ సిరీస్ ఇది. అయితే ‘దృశ్యం’ చిత్రం థియేటర్స్ లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది , అంతకంటే మంచి కంటెంట్ తో వచ్చిన ‘దృశ్యం 2’ మాత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదలైంది. ఒకవేళ ‘దృశ్యం 2’ థియేటర్స్ లో విడుదల అయ్యుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది, బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ‘దృశ్యం 3’ చిత్రం మరో 3 రోజుల్లో థియేటర్స్ లో రాబోతుంది.

అయితే ee చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని ఒకసారి పరిశీలించి చూస్తే , మళయాలం మూవీస్ లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ సినిమాగా ‘దృశ్యం 3’ నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా, అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఊపు చూస్తుంటే ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 50 కోట్ల రూపాయిలు దాటేలా అనిపిస్తోంది. అదే కనుక జరిగి , పాజిటివ్ టాక్ థియేటర్స్ నుండి వస్తే మాత్రం , ఈ చిత్రానికి కచ్చితంగా మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఈ చిత్రానికి మంచి లాంగ్ రన్ వస్తే 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు లాంగ్ రన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. నార్త్ అమెరికా లో మలయాళం సినిమాలకు పెద్ద క్రేజ్ ఉండదు , అక్కడే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే , ఇక మలయాళం ఇండస్ట్రీ కి కంచుకోటగా పిలవబడే గల్ఫ్ దేశాల్లో ఏ రేంజ్ బుకింగ్స్ జరుగుతున్నాయో మీరే ఊహించుకోండి. ఇక ఇండియా లో ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 5 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రేపు ఈ సంఖ్య మూడింతలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించే విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.

అరిటాకులో భోజనం చేయడంపై ఈ బాలుడు ఏం చెప్పాడో తెలుసా.. వీడియో వైరల్

Boy speech on eating in banana leaf
Boy speech on eating in banana leaf

Boy speech on eating in banana leaf: భారతదేశంలో ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా వాటిని తినే పాత్రల ద్వారా కూడా ఆరోగ్యం ప్రసాదించాలని కొన్ని పద్దతులు పాటించారు. ఇందులో భాగంగా అరిటాకులో భోజనం చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పండుగలు, వివాహాలు, శుభకార్యాల్లో అరిటాకుపై భోజనం వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు.. దీని వెనుక ఆరోగ్య శాస్త్రం, ప్రకృతి స్నేహం, ఆహార పరిశుభ్రత వంటి ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఓ బాలుడు చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. అసలు అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?

అరిటాకుపై వేడి ఆహారాన్ని వడ్డించినప్పుడు ఆ ఆకులో ఉండే పాలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఆహారంలో కలుస్తాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే పూర్వకాలంలో సహజసిద్ధమైన ఈ విధానాన్ని పెద్దలు పాటించేవారని చెబుతారు.

అరిటాకులో సహజంగా ఉండే మెత్తటి మైనపు పొర ఆహారానికి ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది. ముఖ్యంగా వేడి అన్నం, పప్పు, కూరలు వడ్డించినప్పుడు ఆ ఆకు నుంచి వచ్చే సువాసన భోజనానుభూతిని మరింత రుచికరంగా మారుస్తుంది. అందుకే హోటళ్లలో కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా అరటాకులో భోజనం వడ్డించే సంప్రదాయం కొనసాగుతోంది.

పరిశుభ్రత పరంగా కూడా అరిటాకు ఎంతో మేలు చేస్తుంది. ప్లాస్టిక్ ప్లేట్లు లేదా పలుమార్లు వాడే పాత్రలతో పోలిస్తే అరిటాకు ఒకసారి వాడి పారేయవచ్చు. దీంతో బ్యాక్టీరియా వ్యాప్తి ప్రమాదం తక్కువగా ఉంటుంది. సహజసిద్ధంగా పెరిగే ఈ ఆకులు రసాయనాల ప్రభావం లేకుండా ఉండటం కూడా మరో ప్రయోజనం.

పర్యావరణ పరిరక్షణలో కూడా అరిటాకుల పాత్ర ఎంతో గొప్పది. ప్లాస్టిక్ లేదా థర్మకోల్ ప్లేట్లలా ఇవి కాలుష్యాన్ని పెంచవు. ఉపయోగించిన తర్వాత సులభంగా నేలలో కలిసిపోతాయి. పూర్తిగా బయోడిగ్రేడబుల్ కావడంతో ప్రకృతికి ఎలాంటి హాని కలగదు. ప్రస్తుతం పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య మధ్య అరిటాకుల వినియోగం మళ్లీ ప్రాధాన్యం పొందుతోంది.

ఆయుర్వేదం ప్రకారం అరిటాకులో భోజనం చేయడం జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుందని భావిస్తారు. ఆకులోని సహజ గుణాలు జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడంలో సహాయపడతాయని చెబుతారు. అలాగే వేడి ఆహారం ఆకుతో కలిసి తినడం వల్ల భోజనం తర్వాత తేలికగా అనిపిస్తుందని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

పూర్వీకులు పాటించిన అనేక సంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని అరిటాకులో భోజనం చేసే ఆచారం మరోసారి గుర్తుచేస్తోంది. ఆధునిక జీవనశైలిలో ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతి స్నేహపూర్వకమైన అరిటాకుల వినియోగం ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AgniV (@agniv_2018)

ఇంటర్వ్యూస్ లో డైరెక్టర్ బుచ్చి బాబు చెప్పేవి మొత్తం అబద్దాలేనా..? అడ్డంగా దొరికిపోయాడుగా..

Buchi Babu Next Movie
Buchi Babu Next Movie

Buchi Babu false statements: సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పెద్ది’ మూవీ డైరెక్టర్ బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘పెద్ది’ మూవీ జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుండడం తో , ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ నాన్ స్టాప్ గా ఇస్తూనే ఉన్నాడు. ఈ రేంజ్ లో ఇంటర్వ్యూస్ ఈమధ్య కాలంలో ఏ డైరెక్టర్ కూడా ఇవ్వలేదు. యూట్యూబ్ ఓపెన్ చేసినా , ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసినా , ఇలా ఎక్కడ చూసిన బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఆ రేంజ్ లో ఆయన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇతను మాట్లాడే ప్రతీ మాట నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. చాలా మర్యాదతో , పద్దతిగా , ఎలాంటి యాటిట్యూడ్ చూపించకుండా ఆయన మాట్లాడే మాటలను చూస్తే, దురాభిమానుల కూడా ‘పెద్ది’ కి టికెట్స్ తెంచడం ఖాయం.

అయితే ఇక్కడే కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రం లో రామ్ చరణ్ గురువు పాత్ర కోసం శివరాజ్ కుమార్ ని తీసుకున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మన తెలుగు లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు , మీరు వాళ్ళని తీసుకోవచ్చు కదా, పక్క రాష్ట్రము నుండి శివరాజ్ కుమార్ ని ఎందుకు తీసుకున్నారు’ అని అడగ్గా, శివ రాజ్ కుమార్ ముఖం మన ఆడియన్స్ కి పెద్దగా తెలియదు , నాకు కొత్త ముఖం కావలి కాబట్టి ఆయన్ని తీసుకున్నాను , తెలుగు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకున్నాము కానీ , వర్కౌట్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే పెద్ద అబద్దం ఆడాడు బుచ్చి బాబు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం ఆయన తమిళ హీరో విజయ్ సేతుపతి ని ముందుగా సంప్రదించాడు.

విజయ్ సేతుపతి కి కావాల్సినంత స్టఫ్ ఆ పాత్రలో దొరకకపోవడం తో ఆయన రిజెక్ట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఈ చిత్రాన్ని నేను ‘ఉప్పెన’ సినిమా విడుదల అవ్వకముందే పిఠాపురం లోని పాదగయ గుడిలో నా తదుపరి చిత్రం రామ్ చరణ్ తో , టైటిల్ ‘పెద్ది’ అని రాసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. ఇది కూడా పచ్చి అబద్దం అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే ఈ కథ ని ముందుగా ఆయన ఎన్టీఆర్ తో చెయ్యాలని అనుకున్నాడు. అప్పట్లో ఎన్టీఆర్ తో బుచ్చి బాబు సినిమా , టైటిల్ ‘పెద్ది’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో ఆయన తప్పుకున్నాడు , తర్వాత ఇది రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్ళింది , ఇదే జరిగిన వాస్తవం , కానీ బుచ్చి బాబు అబద్దం చెప్పాడు అంటూ సోషల్ మీడియా లో నెజిజెన్స్ ఆయనపై మండిపడుతున్నారు.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?

Nag Ashwin
Nag Ashwin

Nag Ashwin next movie after Kalki 2: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు… కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ప్రభాస్ కోసం ఎదురుచూస్తున్న నాగ అశ్విన్ ఈ గ్యాప్ లో మరో రెండు కథలను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి 2 తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ చెప్పిన కథకి ఎన్టీఆర్ ఎక్సైట్ అయ్యాడట.

మొత్తానికైతే నాగ్ అశ్విన్ తన తర్వాత సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ఎంచుకున్నాడు అంటే తప్పకుండ్ ఒక మంచి సబ్జెక్టుని రెడీ చేసి ఉంటాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కల్కి సినిమాతో 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఆయన ‘కల్కి 2’ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తానని చెబుతున్నాడు.

ఇప్పటికే ఆయన ఈ సినిమాతో 2000 కోట్ల మార్కును ఈజీగా దాటుతానని కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఒకవేళ నాగ్ అశ్విన్ జూనియర్ ఎన్టీఆర్ తో కనుక సినిమా చేసినట్లయితే తను ‘కల్కి 2’ సినిమా పూర్తి చేసే లోపు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని కంప్లీట్ చేస్తాడు.

ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. ఒకరి కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాగ్ అశ్విన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…