Homeఆంధ్రప్రదేశ్‌IMD Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో డేం*జర్ వెదర్.. వీరు ఇంట్లోనే ఉండడం మంచిది..

IMD Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో డేం*జర్ వెదర్.. వీరు ఇంట్లోనే ఉండడం మంచిది..

IMD Weather Alert: అధిక ఉష్ణోగ్రతలతపై భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మే 19 నుంచి ఎండ వేడి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ , సూర్యాపేట, భద్రాద్రి- భూపాలపల్లి, ములుగు, మహబూబూబాద్ జిల్లాలో 45 నుంచి 47 సెల్సియస్ డిగ్రీ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. అధికారిక ప్రకటనల ప్రకారం..తాగజా తెలంగాణలో మే 18న జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 20, 21వ తేదీల్లో కూడా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. మంగళవారం (మే 19)న ఏపీలోని పలు జిల్లాలలో 44 నుంచి 46 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని APSDMA అంచనా వేసింది.

ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా మారడంతో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య అత్యవసరంకాకపోతే ఇంటి నుండి బయటకు రావొద్దని IMD, APSDMA అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో సౌర వికిరణం, వాతావరణ ఉష్ణోగ్రత కలిసి హీట్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని పేర్కొంటున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బయటకు వెళ్లేవారు లేదా బయట నుంచి ఇంటికి వచ్చిన వారు తరచుగా నీళ్లు తాగాలి. తేలికపాటి దుస్తులను ధరించాలి. తలకు రుమాలు లేదా టోపీ వాడాలి. ముఖ్యమైన పనులు అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper