Sudheer Joker Teaser Review: ‘జబర్దస్త్’ లో టీం లీడర్ గా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్ట కూటి కోసం మ్యాజిక్ షోస్ చేసుకుంటూ కెరీర్ ని మొదలు పెట్టిన సుధీర్, అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెర పవర్ స్టార్ అనే స్థాయికి చేరుకున్నాడు. సుడిగాలి సుధీర్ ఒక ఎంటర్టైన్మెంట్ షో ఒప్పుకున్నాడంటే , దానికి టీఆర్ఫీ రేటింగ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో అలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ కి ఎంతో మంది వెళ్లారు , ఎవ్వరూ సక్సెస్ అవ్వలేకపోయారు , కానీ సుధీర్ కి సక్సెస్ అయ్యేంత టాలెంట్ ఉంది , సరైన ప్లానింగ్ తో వెళ్తే మరో శివ కార్తికేయన్ అవ్వగలడు. అతనిలో యాక్టింగ్ స్కిల్స్ , డ్యాన్స్ స్కిల్స్ వేరే లెవెల్ లో ఉంటాయి, అదే సమయం ఫైట్స్ కూడా అద్భుతంగా చేయగలడు.
ఇలా అన్ని క్రాఫ్ట్స్ లోనూ సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్. అందుకే ఇతను ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటుంటారు విశ్లేషకులు. ఆయన హీరో గా నటించిన ‘గాలోడు’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘జోకర్’ అనే చిత్రం చేస్తున్నాడు. నేడు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ ని చూస్తుంటే చాలా రిచ్ గా , మంచి క్వాలిటీ తో ఉంది, అంతే కాకుండా, ఈ చిత్రం లో నటించే నటీనటులు కూడా పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళే. ‘బిగ్ బాస్ 9’ ఫేమ్ అయేషా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఒక రాయల్ కుటుంబం లో పుట్టిన ఒక యువకుడు , అవసరానికి మించి డబ్బు ఉన్నప్పటికీ కూడా దొంగతనాలు చేస్తుంటాడు , అలా చెయ్యడానికి కారణం ఏమిటి అనేది ఆసక్తికరమైన పాయింట్. సుధీర్ కూడా ఈ గ్లింప్స్ లో చాలా స్టైలిష్ గా అనిపిస్తున్నాడు. చివర్లో ఆయన చెప్పిన డైలాగ్ ‘నేను ఏదైనా గెలుస్తా.. అనే నమ్మకం ఉంటేనే దిగుతా’ బాగా పేలింది కానీ , డైలాగ్ డెలివరీ ఇంకా కాస్త పవర్ ఫుల్ గా ఉండుంటే బాగుండేది అని అంటున్నారు నెటిజెన్స్. ఈ డైలాగ్ విన్న తర్వాత కమెడియన్ గా సుధీర్ ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయని అంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram
