Home Blog Page 254

నెలకు 40 లక్షలు ఇస్తేనే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో టార్చర్ పెడుతున్న సతీమణి..

Jayam Ravi wife demands alimony
Jayam Ravi wife demands alimony

Jayam Ravi wife demands alimony: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో జయం రవి విడాకులకు సంబంధించిన విషయం పై ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాల నుండి తమిళనాడు లో టాప్ హీరో గా కొనసాగుతున్న జయం రవి , తన భార్య ఆర్తి పెట్టే మానసిక క్షోభ ని తట్టుకోలేక మీడియా ముందుకొచ్చి బాధ పడడం ఆయన అభిమానులకు మాత్రమే కాదు , ఇతరులకు కూడా చాలా బాధగా అనిపించింది. మనకే ఇలా ఉంటే , ఇక జయం రవి పిల్లలకు తన తండ్రి అలా మీడియా ముందుకొచ్చి ఏడుస్తుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇద్దరు పిల్లలకు జయం రవి అంటే చాలా ఇష్టం , జయం రవి కి కూడా తన పిల్లలు అంటే ప్రాణం. కానీ ఆర్తి వీళ్ళని కలవనివ్వకుండా చేస్తుంది, అందుకు బాడీ గార్డ్స్ ని కూడా పెట్టుకోవడం గమనార్హం.

ఇవన్నీ మీడియా ముందు చెప్పుకొని బోరుమని ఏడ్చాడు జయం రవి. అంతే కాదు , ఆమెని పెళ్లి చేసుకున్న రోజు నుండి నాకంటూ ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ లేదని, నా భార్య ఆర్తి తో కలిపి జాయింట్ అకౌంట్ మాత్రమే ఉందని , ఒక్క పైసా తీసుకోవాలన్నా ఆమె అనుమతి ఉండాలని , పొరపాటున ఆమెకు తెలియకుండా చిన్న అమౌంట్ డ్రా చేసి తీసుకున్నా పెద్ద గొడవ చేస్తుందని ఆయన మీడియా ముందుకొచ్చి చెప్పుకున్న మాటలు అందరినీ కదిలించేశాయి. ఆర్తి తో విడాకులు తీసుకునే వరకు నేను సినిమాలు చెయ్యనని , చేసిన సినిమాలను కూడా నిలిపిస్తున్నాని జయం రవి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాడు. అయితే ఈ అంశం ఇప్పుడు కోర్టు లో ఉంది. విడాకులు ఇవ్వాలంటే ఆర్తి పెట్టిన కండీషన్స్ ని చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే.

విడాకులు ఇవ్వాలంటే , జీవితాంతం జయం రవి నాకు నెలకు 40 లక్షల రూపాయిలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. నెలకు 40 లక్షలు అంటే సంవత్సరానికి 4.8 కోట్లు రూపాయిలు. జయం రవి ఒక్క సినిమా చేయడానికి ఏడాది సమయం తీసుకుంటాడు , ఆయన రెమ్యూనరేషన్ 5 నుండి 6 కోట్ల రూపాయలకు మించి కూడా ఉండదు , ఒక్కోసారి ఆయన ఏడాది మొత్తం సినిమాలు చేయకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి . ఇలా నెలకు 40 లక్షల రూపాయిలు అంటే , జయం రవి ఆస్తులు అమ్ముకున్నా ఆమెని మైంటైన్ చేయడానికి సరిపోదు , పాపం నీ బాధ పగోడికి కూడా రాకూడదు అంటూ సోషల్ మీడియా లో జయం రవి పై జాలి చూపిస్తున్నారు నెటిజెన్స్.

టూరిజం శాఖలో జనసేన మార్క్.. చరిత్ర తిరగరాసిన కందుల దుర్గేష్..

Kandula Durgesh tourism reforms
Kandula Durgesh tourism reforms

Kandula Durgesh tourism reforms: కూటమి ప్రభుత్వం లో జనసేన పార్టీ తన మార్క్ పాలన ని చూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖలో సృష్టిస్తున్న అద్భుతాలు చూస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకముందే, ఈ శాఖని దేశం లోనే నెంబర్ 1 గా నిలిపి , 19 నేషనల్ అవార్డ్స్ ని దక్కించేలా చేశాడు, ఇది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో గర్వకారణమైన విషయం. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , ఆ పార్టీ కి ఇచ్చిన మిగతా మంత్రిత్వ శాఖలు కూడా బలంగా పని చేస్తున్నాయి , సమాజం లో మార్పులు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా టూరిజం శాఖని అభివృద్ధి చేయడం కోసం కందుల దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తున్నాడు.

రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖకు 8 టూరిజం ప్రాజెక్ట్స్ కి గానూ 428 కోట్ల రూపాయిలు కేటాయించింది. ఈ నిధులతో సూర్యలంక బీచ్ , బొర్రా కేవ్స్ , అఖండ గోదావరి, గండికోట , అన్నవరం , సింహాచలం, అహోబిలం , శ్రీ క్షేత్ర అహోబిలం ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కందుల దుర్గేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ తన శాఖల మీద మాత్రమే కాకుండా, ఇతర శాఖల మీద కూడా ద్రుష్టి పెట్టడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని, రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ పాలనలో తన అద్భుతమైన మార్కుని చూపించి , తమ శాఖలను దేశం లోనే ది బెస్ట్ గా నిలుపుతారని సోషల్ మీడియా లో అభిమానులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ అంశం పై సోషల్ మీడియా లో జనసేన , తెలుగు దేశం పార్టీ అభిమానుల మధ్య గొడవలు చెలరేగేలా చేశాయి. తెలుగు దేశం పార్టీ హ్యాండిల్ నుండి శుభాకాంక్షలు తెలుపుతూ , టూరిజం శాఖకు సంబంధించిన కందుల దుర్గేష్ ని కాకుండా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ని ఫోటో లో చేర్చడం పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కొడుకులను పరిచయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..

Star Producer introducing Celebrity Kids
Star Producer introducing Celebrity Kids

Star Producer introducing Celebrity Kids: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి సత్తా చాటుతున్నాడు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక అతని తర్వాత తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలో రాణించడమే కాకుండా పవర్ స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు… ఇక తన తర్వాత రామ్ చరణ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు సైతం ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్ సైతం హీరోగా రాణించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు మాస్ హీరోగా అవతరించాడు. తన తర్వాత మహేష్ బాబు సైతం సూపర్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

మహేష్ బాబు కొడుకు సైతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో అటు అఖిరానందన్, ఇటు గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీదనే అశ్విన్ దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇంతకుముందు మహేష్ బాబుని సైతం అశ్వినీ దత్ తన బ్యానర్ మీదనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కాబట్టి గౌతమ్ కృష్ణ సినిమాని సైతం అశ్విని దత్ కి అప్పజెప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్ ను సైతం అశ్వినిదత్ తన బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పుడు అఖిరానందన్, గౌతమ్ కృష్ణ ను సైతం తన బ్యానర్ నుంచే లాంచ్ చేయాలని చూస్తున్నారు.

మొత్తానికైతే వీరిద్దరిని కలిపి మొదటి సినిమాతోనే ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని అశ్వినీ దత్ భావిస్తున్నారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి ఘట్టమనేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వాళ్లు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమాను డైరెక్షన్ చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలోనే ఇంకా క్లారిటి రావడం లేదు…

ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్, వన్డే సిరీస్.. అతడికి విశ్రాంతి.. భారత జట్టు ఇదే..

India vs Afghanistan Test series squad
India vs Afghanistan Test series squad

India vs Afghanistan Test series squad: ఐపీఎల్ ముగిసిన తర్వాత.. టీమిండియా క్రికెటర్లకు కొద్ది రోజులు విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత వారు అంతర్జాతీయ క్రికెట్ లోకి దిగుతారు. ఈనెల 31న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెల 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టీమిండియా ఒక టెస్ట్, 3 వన్డేల సిరీస్ ఆడుతుంది.

మన దేశం వేదికగా ఈ సిరీస్ నిర్వహిస్తారు. ఈ సీరియస్ కోసం మేనేజ్మెంట్ జటను ప్రకటించింది. విపరీతమైన వర్కులోడు బూమ్రా కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చి. వన్డే జట్టులో రోహిత్, హార్దిక్ పాండ్యా ఆడతారు.. వారిని ఎంపిక చేసినప్పటికీ మేనేజ్మెంట్ ఒక మెలిక పెట్టింది. వారు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధిస్తేనే తుది జట్టులో చోటు లభిస్తుంది.. అయితే మహమ్మద్ షమీ కి మేనేజ్మెంట్ అవకాశం కల్పించలేదు. అతని గురించి పెద్దగా చర్చించలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

ఈ సిరీస్ లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తొలిసారిగా జట్టులో అవకాశాన్ని సాధించారు. టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తాడు. ఇతడితో పాటు జైస్వాల్ ఆడతాడు.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడికల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ సుతార్, ప్రసిద్ధి కృష్ణ, బ్రార్, జూరెల్, హర్ష్ దుబే చూడు సంపాదించుకున్నారు.

3 వన్డేలు ఆడే జట్టు కోసం టీం ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అయ్యర్, రాహుల్, హర్ష్ దుబే, ప్రిన్స్ యాదవ్, ఇషాన్ కిషన్, అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ వంటి వారు చోటు సంపాదించుకున్నారు.

తొలి టెస్ట్ జూన్ 6 నుంచి 10 వరకు చండీగఢ్ వేదికగా జరుగుతుంది.

తొలి వన్డే జూన్ 14న ధర్మశాల, రెండవ వన్డే జూన్ 17న లక్నో, మూడో వన్డే జూన్ 20న చెన్నైలో జరుగుతుంది.

అనిల్ రావిపూడి కొత్త సినిమాలో విలన్ గా తెలుగు స్టార్ హీరో..

Anil Ravipudi new movie villain
Anil Ravipudi new movie villain

Anil Ravipudi new movie villain: పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో తొమ్మిది సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇక ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతకీ ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట.

ఈ మధ్యకాలంలో కార్తీకేయ నుంచి ఏ సినిమాలో రావడం లేదు. అతను అసలు ఏం సినిమా చేస్తున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సినిమాలో విలన్ పాత్ర రావడంతో కార్తీకేయ ఆ క్యారెక్టర్ ను చేస్తానని ఒప్పుకున్నారట.

ఇప్పటికే హీరోగా కొన్ని సినిమాల ఒప్పుకున్న కార్తికేయ అటు హీరోగా చేస్తూనే ఇటు విలన్ గా కూడా రాణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా నటించాడు. ఇక దాంతో పాటుగా తమిళంలో స్టార్ హీరో అయిన అజిత్ చేసిన వలిమై సినిమాలో కూడా తను విలన్ గా చేశాడు.

ఈ మూవీలో కూడా డిఫరెంట్ విలనిజాన్ని ప్రదర్శించాడు. ఇక ఏది ఏమైనా కూడా కార్తీకేయ ఈ మధ్యకాలంలో హీరోగా రాణించలేకపోతుండడం వల్లే ఆయన ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నాడు. విలన్ గా ఆయన తన సత్తా చాటుకొని మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

USA లో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన టాప్ 3 మూవీస్ ఇవే.. 'పెద్ది' అందుకోగలదా?

Peddi Movie
Peddi Movie

Peddi movie USA box office expectations: మరో 16 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభిమానుల ఆశలతో పాటు , ట్రేడ్ కూడా ఆశలు కూడా నెరవేర్చే బాధ్యత ఈ చిత్రం పైన ఉంది. ఎందుకంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు కాబట్టి. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కచ్చితంగా కంటెంట్ బలంగానే ఉన్నట్టు గా ఉంది కానీ , థియేట్రికల్ ట్రైలర్ లో ఎలివేషన్స్ పెట్టి ఉండుంటే బాగుండేది , దాని వల్ల ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగేవి అనేది అభిమానుల అభిప్రాయం. ప్రస్తుతానికి ఈ చిత్రానికి 3 లక్షల 40 వేల డాలర్లు వచ్చాయి USA నుండి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి USA లో టాప్ 3 స్థానాల్లో ఉన్న సినిమాలేంటి , వాటికి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి?, పెద్ది ఏ రేంజ్ కి చేరుకోగలదు అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతానికి మొదటి స్థానం లో ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ఉంది. ఈ చిత్రానికి కేవలం USA లో 92132 టికెట్స్ అమ్ముడుపోగా, ఓవరాల్ నార్త్ అమెరికా లో 2.7 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి 3.9 మిలియన్ డాలర్లు (అన్ని భాషలు) వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానం లో రాజమౌళి #RRR చిత్రం ఉన్నది. ఈ చిత్రానికి కేవలం USA నుండి 89767 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రీ సేల్స్ గ్రాస్ 2.5 మిలియన్ డాలర్లు రాగా , ఓవరాల్ ప్రీమియర్స్ నుండి 3.4 మిలియన్ డాలర్లు (అన్ని భాషలు) వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానం లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నిల్చింది.

ఈ చిత్రానికి 88253 టిక్కెట్లు అమ్ముడుపోగా, 2.5 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ గ్రాస్ వచ్చింది. మూవీ టీం సమయానికి కంటెంట్ డెలివరీ చేయకపోవడం , కెనడా లో యార్క్ చైన్ లో విడుదల చేయకపోవడం వల్ల, ఈ చిత్రానికి చాలా గ్రాస్ మైనస్ అయ్యింది , లేదంటే 3 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్, 4 మిలియన్ డాలర్ల ఓవరాల్ ప్రీమియర్స్ గ్రాస్ వచ్చేది. కానీ ప్లానింగ్ లోపం కారణం 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే పెద్ది చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ వస్తుందా అంటే కచ్చితంగా రాదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ చిత్రానికి కేవలం 1.6 మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే ప్రీమియర్స్ నుండి వచ్చేలా అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ట్రెండ్ మారితే 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా రావొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' టైటిల్ విన్నర్.. రన్నర్ వీళ్ళే.. మరో జంటకు అన్యాయం..

Mad For Each Other title winner
Mad For Each Other title winner

Mad For Each Other title winner: స్టార్ మా ఛానల్ లో ఎంతో అట్టహాసం గా మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ రియాలిటీ షో , ఈ వారం తో ముగియబోతుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ గా మహేష్ – సాండ్రా , నూకరాజు – ఆసియా, పవన్ కళ్యాణ్ – వాసంతి , నటరాజ్ – నీతూ , భాను – జాను లు నిలిచారు. వీరిలో నటరాజ్ మాస్టర్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉండడం , సిద్దు – సోనియా జంట ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడల్లా ఎలిమినేషన్ ని రద్దు చేశారు. అలా రెండు సార్లు ఆయనకు లైఫ్ ఇవ్వడం వల్ల, మిగిలిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది అనేది నెటిజెన్స్ భావన.

ఇకపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి అయ్యింది. విన్నర్ ఎవరో , రన్నర్ ఎవరో తెలిసిపోయింది. టాప్ 5 స్థానం లో భాను – జానూ జంట ఎలిమినేట్ అయ్యారట. ఈ షో మొదలైన మొదటి రోజు నుండి , మొన్నటి వారం వరకు ఈ జంట ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో అందరూ చూసారు. వీళ్ళు టాప్ 2 లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ , అయినప్పటికీ కూడా టాప్ 5 లో ఎలిమినేట్ అవ్వడం నిజంగా అన్యాయమే. ఇక టాప్ 4 స్థానంలో నటరాజ్ – నీతూ జంట ఎలిమినేట్ అయ్యారు. వీళ్లకు సోషల్ మీడియా క్యాంపైన్ మామూలు రేంజ్ లో లేదు. ‘బిగ్ బాస్ 9’ రన్నర్ తనూజ, అమర్ దీప్ , అంబటి అర్జున్ ఇలాంటి టాప్ సెలబ్రిటీలందరూ ఈ జంటకు ఓటు వెయ్యమని ప్రచారం చేశారు . ఆ కారణం చేతనే ఈ జంట టాప్ 4 లో ఉందని అంటున్నారు విశ్లేషకులు.

ఇక మూడవ స్థానం లో ఎలిమినేట్ అయిన జంట మహేష్ – సాండ్రా. వీళ్ళు మొదట్లో ఎలిమినేట్ అయ్యారు , కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ జంట , తమ సత్తా చాటారు. టాస్కులు బాగా ఆడుతూ , మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు. సోషల్ మీడియా లో ప్రతీ పోలింగ్ లోనూ ఈ జంట టాప్ 2 స్థానం లోనే ఉంది . అయినప్పటికీ వీళ్ళు 3 వ స్థానం లో ఎలిమినేట్ అవ్వడం దురదృష్టకరం. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పవన్ కళ్యాణ్ – వాసంతి , రన్నర్ గా నూకరాజు – ఆసియా జంట నిలిచారు. ఈ రెండు జంటలు కూడా టైటిల్ కి అర్హత ఉన్నవాళ్లే.

లివర్ డిటాక్స్.. వీటిని అస్సలు నమ్మొద్దు

Liver Detox Myths
Liver Detox Myths

Liver Detox Myths: మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అవయవాల్లో కాలేయం అత్యంత ముఖ్యమైనది.. దీనిని మన శరీరంలో కర్మాగారం అని పిలుస్తుంటారు. హృదయం, మూత్రపిండాల స్థాయికి మించి ఇది పనిచేస్తూ ఉంటుంది. కాలేయం గనుక పని చేయకుండా ఉంటే.. శరీరం రోగాల కుప్ప అవుతూ ఉంటుంది. ఏదైనా అవాంతరం ఏర్పడితే మూత్రపిండాల పనితీరులో మార్పు వస్తుంది. గుండె పనితీరులో కూడా మార్పు వస్తుంది. కానీ కాలేయం మాత్రం పనితీరులో ఎటువంటి మార్పులు చూపించదు. విపరీతమైన సమస్యలు వస్తేనే కాలేయం ఇబ్బంది పడుతూ ఉంటుంది.

కాలేయం ముందుగానే చెప్పినట్టు మన దేహానికి ఒక కర్మాగారం లాంటిది.. బాడీలో ఉన్న చెడు పదార్థాలను మొత్తం శుద్ధి చేస్తుంది. వాటిని తొలగిస్తుంది కూడా. అయితే కొందరు లివర్ ను డిటాక్స్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అందువల్ల కొన్ని కొన్ని పదార్థాలను తీసుకోవాలని చెబుతుంటారు. ఇక మార్కెట్లో అయితే అనే కంపెనీలు ఉత్పత్తులను అమ్ముతుంటాయి. వీటిని వాడితే మీ లివర్ డిటాక్స్ అవుతుందని చెబుతుంటాయి. వైద్యుల పరిశోధన ప్రకారం లివర్ డిటాక్స్ అనేది పూర్తిగా అబద్ధం. పైగా ఏ పదార్థం కూడా లివర్ ను డిటాక్స్ చేయదు.

లివర్ అనేది ఒక రసాయన కర్మాగారం లాంటిది. దీనిని డిటాక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేక రకాల పదార్థాలు.. ఔషధాలకు సంబంధించిన విషాలను తగ్గిస్తుంది. శరీరం నుంచి వెంటనే తొలగిస్తుంది. పైగా కొవ్వులో కరిగే ఆ విషాలను, నీటిలో కరిగే విధంగా మార్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మార్కెట్లో లివర్ డిటాక్స్ ఉత్పత్తులు పూర్తిగా అటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉండవు. అవి లివర్ ఎంజాయ్ పనితీరును నేరుగా ప్రభావితం చేయగలిగితేనే ఆ స్థాయి ఉంటుంది. డిటాక్స్ ఉత్పత్తులు చెప్పుకునే స్థాయిలో ప్రభావాన్ని చూపించలేదు. ఏదో హెర్బల్ టీ తాగినంత మాత్రాన మన లివర్ ఒక్కసారిగా ప్రభావంతంగా మారిపోదు. మరింత గొప్పగా విషాలను హరించలేదు. దీనికంటే ముందు నుంచే వారంలో ఏడు రోజులు.. రోజులో 24 గంటలు లివర్ రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటుంది. అందులో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపిస్తూనే ఉంటుంది.

ఈ కథనం వివిధ వేదికల వద్ద సేకరించాం. దీనిని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదని మా మనవి. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనాన్ని పబ్లిష్ చేశాం. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలని కోరుతున్నాం.

కమ్యూనిస్టుల పరిపాలనలో శబరిమల కంపు కంపు.. ఇదిగో హైకోర్టు బయటపెట్టిన అక్రమాల చిట్టా

Communist govt Sabarimala controversy
Communist govt Sabarimala controversy

Communist govt Sabarimala controversy: దేవుడిని కొంతమంది నమ్ముతారు. ఇంకొంతమంది నమ్మరు. అయినంత మాత్రాన నమ్మేవారు పిచ్చివాళ్లు కాదు. నమ్మని వాళ్లు గొప్ప వాళ్ళు కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ కమ్యూనిస్టులు ఇలా కాదు. ఊరంతా ఒకదారిలో వెళ్తుంటే.. వారు మరొక దారిలో వెళ్తుంటారు. పైగా తమ దారిలోని రావాలని ఉపన్యాసాలిస్తుంటారు. చివరికి తమ దారి గురించి గొప్పగా చెప్పి.. మిగతావారు వెళ్లే దారి గురించి అసత్య ప్రచారం చేస్తుంటారు. అందువల్లే కమ్యూనిస్టులు ఇప్పుడు మనదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు.

కమ్యూనిస్టులు నిన్నటిదాకా పరిపాలించిన కేరళ రాష్ట్రంలో జరిగిన దారుణాలు మామూలువి కావు. భూముల ఆక్రమణ నుంచి మొదలుపెడితే.. శబరిమల ఆలయంలో జరిగిన అక్రమాల వరకు.. ఎన్నో ఉదంతాలు కేరళ రాష్ట్రంలో చోటుచేసుకొన్నాయి. అప్పట్లో శబరిమల ఆలయంలో మహిళలకు ఎందుకు ప్రవేశం కల్పించారు అంటూ జరిగిన ఉద్యమానికి కేరళ ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని ఇప్పటికి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.. పైగా శబరిమల ఆలయానికి సంబంధించిన ప్రాశస్యాన్ని దెబ్బ తీశారని విమర్శలు ఉన్నాయి. పైగా ఆలయంలో బంగారు తాపడంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని కేసులు నమోదయ్యాయి. తాజాగా శబరిమల ఆలయానికి సంబంధించిన ఒక అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.

శబరిమల ఆలయాన్ని హిందువులు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటికీటలాడుతూ ఉంటుంది. సన్నిధానం అయ్యప్ప మాలధారుల సంద్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యప్పకు ప్రతిరోజు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పూజలు సక్రమంగా జరిగితే బాగుండేది. గడచిన దశాబ్ద కాలంగా అయ్యప్ప స్వామికి జరిపే పూజలు విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి.

ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు ప్రస్తావించింది. అంతేకాదు పూజలపై ఆడిట్ నిర్వహించాలని సూచించింది. అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజా సామాగ్రి కొనుగోలు విషయంలో కూడా అవ్వక తవకలు జరిగినట్టు హైకోర్టు పేర్కొంది. శబరిమల స్పెషల్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజలలో అక్రమాలు జరుగుతున్నట్టు ఇటీవల ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. అతడు చెప్పిన విషయాల మొత్తం నిజమని విజిలెన్స్ విభాగం అభిప్రాయపడింది. ముఖ్యంగా స్వామి వారికి సంబంధించిన అష్టాభిషేకం పూజ కోసం లేత కొబ్బరికాయల పాలవినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు.. ఇంకా 8 వస్తువులకు 300 రూపాయల దాకా వసూలు చేసినట్టు విజిలెన్స్ విభాగం ఎంక్వయిరీలో తేలింది.

దశాబ్దకాలంగా ఎటువంటి బిల్లులు లేకుండానే వీటిని కొనుగోలు చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. మాస పూజ, మకర విలక్కు పూజల్లో కూడా అక్రమాలు జరిగాయి. అయితే ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల పరిపాలన కాలంలో జరగడం ఇక్కడ విశేషం. ఇప్పటికే బంగారం తాపడంలో అక్రమాలు జరిగి.. కొంతమంది జైలు పాలు కూడా అయ్యారు. ఇప్పుడు హైకోర్టు స్వయంగా రంగంలోకి దిగడంతో ఎంతమంది జైలుకు వెళ్తారనే చర్చ కేరళ రాష్ట్రంలో సాగుతోంది.

అమెరికా హెచ్చరికలు బేఖాతరు.. ఇదీ నయా ఇండియా అంటే

India ignores America warnings
India ignores America warnings

India ignores America warnings: అమెరికా.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు భారత దేశ పరిపాలకులు భయపడేవారు. అమెరికా నుంచి ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారంటే అలర్ట్ అయిపోయేవారు. అమెరికా అధ్యక్షుడు గనుక ఇండియాలో పర్యటిస్తే.. దేవుడు భూమ్మీదకి వచ్చినట్టు భావించేవారు. సకల సౌకర్యాలు చేసేవారు. గొప్ప గొప్ప సత్కారాలు చేపట్టేవారు. అమెరికా చెప్పినట్టు వినేవారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరించేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికా చెప్పినట్టు వినడం కాదు కదా.. అమెరికా గట్టిగా హెచ్చరికలు చేసిన సరే వినిపించుకునే పరిస్థితి లేదు. అమెరికా ఏం చేసినా సరే నిశ్శబ్దంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మారిపోయింది. నయా ఇండియా గా అవతరించింది. భయపడే స్థాయి నుంచి నిలబడే స్థాయికి.. వణికే స్థాయి నుంచి ఎదురు చెప్పే స్థాయికి ఎదిగింది. అందువల్లే ఇండియా విషయంలో అమెరికా ఒకప్పటి మాదిరిగా ఉండడం లేదు. ఒకప్పటి స్థాయిలో బెదిరింపులకు పాల్పడటం లేదు.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతోంది. పరిణమాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల భారత్ లాంటి అతిపెద్ద దిగుమతి దారు దేశానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. దీనివల్ల దేశంలో ధరల స్థాయి నిరంతరం పెరుగుతోంది.. ఇది ఎక్కడదాకా వెళ్తుందో తెలియదు. పైగా చమురు కంపెనీలకు ప్రతిరోజు 750 కోట్ల వరకు నష్టం వస్తుంది. కొనుగోలు ధరలు పెరిగిపోవడం.. ఇతర ఖర్చులు అధికంగా కావడంతో కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అంతకుముందే కంపెనీలకు రోజుకు 1000 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ఈనెల 15న లీటర్ పెట్రోల్, డీజిల్ మీద మూడు రూపాయలు చొప్పున పెంచడంతో.. కొంతవరకు నష్టాలు భర్తీ అయ్యాయి.

క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ ముందుచూపుతో వ్యవహరించింది. రష్యా నుంచి గతంలో భారత్ ముడి చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల రష్యా నుంచి ముడి చమురు భారత్ కొనుగోలు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. ఈనెల 16 వరకే ముడి చమురు కొనుగోలు చేయాలని డెడ్లైన్ విధించింది. ఇప్పటికే ఆ గడువు ముగిసిపోయింది. ఆయనప్పటికీ రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడం ఆగదని పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాతశర్మ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇకపై కూడా భారతదేశానికి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 17 ముందు వరకు నౌకలలో లోడ్ చేసిన రష్యా చమురును ఏ దేశమైనా కొనుగోలు చేయవచ్చు. ఆంక్షలు ఉండవు. పైగా గతంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తుంది.. అయితే భారత్ నుంచి ఈ ప్రకటన రావడంతో.. రష్యా ముడిచమురు కొనుగోలు చేయడానికి మినహాయింపులను అమెరికా మరో 30 రోజులపాటు పెంచడం ఇక్కడ విశేషం.

పాకిస్తాన్ డబుల్ గేమ్.. దొరికిపోతే ఈ భూమ్మీదనే ఉండదు..

Pakistan double game
Pakistan double game

Pakistan double game: ఏ దేశానికైనా సరే ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాల తగ్గట్టుగానే ఆదేశ విధానాలు ఉంటాయి. ఆ విధానాలు ఆమోద దాయకంగా ఉండాలి. అంతేగాని గోడ మీది పెళ్లి లాంటి వ్యవహారం లాగా ఉండకూడదు. ప్రస్తుతం ఇదే విధానాన్ని పాకిస్తాన్ పాటిస్తోంది.. ఒకవేళ దొరికిపోతే ఆ దేశానికి ప్రతిరోజు దేత్తడి పోచమ్మ గుడే.

పాకిస్తాన్ దేశానికి ఒక విదేశీ విధానం అంటూ ఉండదు.. ఎక్కడ అప్పు పుడితే అక్కడికి వెళుతుంది. ఆ దేశానికి గులాం లాగా మారిపోతుంది.. చివరికి గల్ఫ్ లో ప్రతి దేశం వద్ద అప్పు తీసుకోవడానికి వెనుకాడదు. చెల్లించమంటే మాత్రం కుంటి సాకులు చెబుతూ ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని గల్ఫ్ దేశాలు పెద్దగా నమ్మవు. ఇటీవల యూఏఈ అప్పు చెల్లించాలని గట్టిగా అడిగింది. దీంతో పాకిస్తాన్ అన్ని మూసుకొని అప్పు చెల్లించే పనిలో పడింది. అప్పు చెల్లించడానికి ఫారెక్స్ నిల్వలను ఖర్చు చేయడానికి కూడా పాకిస్తాన్ వెనుకాడ లేదు.

ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ కొనసాగుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాల్సిన పాకిస్తాన్.. డబుల్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగంగా సౌదీ అరేబియా కు 8,000 మంది సైన్యాన్ని, 16 జెట్ విమానాలను పంపించింది. చివరికి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా అందులోకి దింపింది. ఓవైపు ఇరాన్, అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇరాన్ దేశానికి బద్ధ శత్రువు సౌదీ అరేబియాతో స్నేహం కొనసాగిస్తోంది. మొత్తానికి అటు ఇటు డబుల్ గేమ్ ఆడుతూ.. పాకిస్తాన్ పబ్బం గడుపుతున్నది. అయితే ఎంతకాలం ఈ డబుల్ గేమ్ ఆడుతుందో చూడాల్సి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

పాకిస్తాన్ వ్యవహార శైలి తెలిస్తే అటు ఇరాన్ ఊరుకోదు. ఇటు సౌది అరేబియా అసలు వదిలిపెట్టదు. ఆర్థికంగా ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కంటే అత్యంత మెరుగైనవి. ఒకవేళ ఈ రెండు దేశాలకు కోపం వస్తే పాకిస్తాన్ ఈ ప్రపంచ పటం మీద ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

పైసల కోసం దేబిరిస్తున్న FIFA .. ఫుట్ బాల్ కు ఆదరణ తగ్గిపోయినట్టేనా..

FIFA financial crisis
FIFA financial crisis

FIFA financial crisis: ప్రపంచంలో ఎక్కువమంది ఆడే ఆట ఫుట్ బాల్. సాకర్ కప్ వచ్చిందంటే చాలు అమెరికా నుంచి మొదలు పెడితే అర్జెంటీనా వరకు. ఫుట్ బాల్ ఫీవర్ తో ఊగిపోతాయి. రోనాల్డో నుంచి మొదలు పెడితే ఎంబాపే వరకు అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఆట మాత్రమే కాకుండా.. వ్యాపార పరంగా కూడా సాకర్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉంటుంది. వేల కోట్ల బిజినెస్ ఈ క్రీడ చుట్టూ సాగుతూ ఉంటుంది.

అంతటి స్థాయి ఉన్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఇప్పుడు స్థాయిని కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీ హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు ముందుకు రావడంలేదని ప్రచారం జరుగుతోంది. మనదేశంలో ప్రసార హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర, అస్సాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాలలో ఫుట్ బాల్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ జాతీయ జట్టు ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. పైగా మనదేశంలో ఫుట్బాల్ మ్యాచ్లకు ఆదరణ భారీగానే ఉంటుంది. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న మనదేశంలో మార్కెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఫుట్బాల్ ప్రపంచ కప్ విషయంలో బ్రాడ్కాస్టర్లు అతగా ఆసక్తిగా లేరు. రిలయన్స్, డిస్నీ వెంచర్ బ్రాడ్కాస్టింగ్ హక్కుల కోసం 20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది. అయినప్పటికీ ఫిఫా ఒప్పుకోలేదు. తక్కువలో తక్కువ 100 మిలియన్ డాలర్లను అంచనా వేస్తోంది. చివరికి 60 మిలియన్ డాలర్ల సొమ్మును రాబట్టుకోవాలని భావిస్తుంది. అయితే పరిస్థితి అలా లేదు. మిగతా సంస్థలు పోటీలోకి రావడం లేదు. ఒకవేళ డీల్ కుదరకపోతే.. జూన్ 11న ప్రారంభమయ్యే ఈ టోర్నీని భారత దేశంలో ఫ్యాన్స్ లైవ్ లో చూసే అవకాశం ఉండదు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం యూట్యూబ్ లేదా.. ఇతర మాధ్యమాలలో స్ట్రీమింగ్ చేస్తామని ఫిఫా చెబుతోంది. అయితే 20 మిలియన్ డాలర్లకు మించి తాము ఖర్చు పెట్టలేదని ఇప్పటికే జియో హాట్ స్టార్ ప్రతినిధులు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇతర దేశాలలో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.. ఆయా దేశాలలో వివిధ బ్రాడ్కాస్టర్లకు ఫిఫా ప్రసార హక్కులు అమ్మింది. వాటి ద్వారా భారీగానే రాబట్టుకుంది. కానీ ఇండియన్ మార్కెట్ లోనే ఫిఫా అనుకున్నంత డబ్బు రావడం లేదు.

హెల్మెట్ పెట్టుకొని వెళ్లు.. మోహన్ బాబు పై మంచు మనోజ్ సెటైర్.. వీడియో వైరల్

Manchu Manoj satire on Mohan Babu

Manchu Manoj satire on Mohan Babu: గత ఏడాది మంచు కుటుంబం లో చోటు చేసుకున్న గొడవలు నెటిజెన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ని చూస్తున్నట్టే అందరికీ అనిపించింది. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు , అన్నయ్య మంచు విష్ణు లపై ఆస్తి విషయం లో తిరుగుబాటు చేయడం , వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గకుండా , మనోజ్ ని తమ ఇంటి నుండి గెంటేయడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం , మనోజ్ ఇంటి ముందు బైఠాయించి ధర్నాలు చేయడం , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో సంఘటనలు జరిగాయి . క్రమశిక్షణ కి మారుపేరు లాంటి మోహన్ బాబు ఇంట్లో గొడవలు , ఇలా రోడ్డు మీదకు వచ్చేసాయి ఏంటో అంటూ అభిమానులు బాధపడ్డారు.

అయితే ఈ విషయం పై గత ఏడాది నుండి ఎలాంటి చప్పుడు లేదు , గొడవలు సర్దుకున్నాయేమో అని అంతా అనుకున్నారు. అయితే రేపు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన హీరో గా నటించిన ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మనోజ్ ని ఒక రిపోర్టర్ ‘మీ ఇంట్లోని సమస్యలు సర్దుకున్నాయా సార్’ అని అడగ్గా, మనోజ్ సమాధానం చెప్తూ ‘అది మీరు నన్ను అడగకూడదు , ఎవరిని అడగాలో తెలుసు కదా, అయితే వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి జాగ్రత్త (నవ్వుతూ) ‘అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మనోజ్ అలా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి అనగానే మీ అందరికీ ఒక సంఘటన గుర్తుకు వచ్చే ఉంటుంది. ఈ గొడవ జరుగుతున్నా సమయం లో ఒక మీడియా రిపోర్టర్ మోహన్ బాబు వద్దకు వెళ్లగా, అతనిపై మైక్ తో దాడి చేస్తాడు.

పాపం ఆ రిపోర్టర్ కి తీవ్రమైన గాయాలై హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ని ఉద్దేశించే మనోజ్ నేడు సెటైర్లు వేశాడు . దీనిని బట్టీ చూస్తుంటే మనోజ్ ని మోహన్ బాబు ఈ జన్మలో దగ్గరకు తీసేలా లేడని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే సినిమాలకు చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ‘భైరవం’ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ , ఆ తర్వాత ‘మిరాయ్’ చిత్రం తో ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరో గా రీ ఎంట్రీ ఇస్తూ ‘డేవిడ్ రెడ్డి’ చేస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

కొత్తగా మార్పులు చేసుకొని రాబోతున్న కాంపాక్ట్ SUV కార్లు ఇవే..

Upcoming compact SUV cars
Upcoming compact SUV cars

Upcoming compact SUV cars: భారతదేశంలో SUVల హావా కొనసాగుతున్నప్పటికీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న కంపెనీలు తమ కార్లను తిరిగి కొత్త తరహాలో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. ఈ కార్లలో మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో పాటు నెక్ట్స్ జెనరేషన్ వారిని ఆకట్టుకునేవిధంగా డిజైన్ ఉండనున్నాయి. ఆ 4 కార్ల విశేషాలు ఇవే..

న్యూ మారుతి బ్రెజ్జా (New Maruti Brezza):
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మారుతి సుజుకి బ్రెజ్జా.. సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి రాబోతోంది. కొత్తగా రాబోతున్న మోడల్‌లో రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా క్యాబిన్ లోపల పెద్దదైన 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను తీసుకురానున్నారు. మైలేజ్ పరంగా ఇప్పటికే టాప్‌లో ఉన్న బ్రెజ్జా, బూట్ స్పేస్ తగ్గకుండా ఉండేలా ‘అండర్-బాడీ’ (కారు కింద భాగంలో) సీఎన్‌జీ ట్యాంక్ అమర్చే సరికొత్త టెక్నాలజీతో రాబోతుండటం గమనార్హం.

నెక్ట్స్-జెన్ టాటా నెక్సాన్ (Next-Gen Tata Nexon):
భారతదేశంలో సురక్షితమైన కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాటా నెక్సాన్, సరికొత్త జనరేషన్ అవతారంలోకి మారడానికి సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ దీనిని సరికొత్త ‘ATLAS’ ఆర్కిటెక్చర్ లేదా భారీగా మార్పులు చేసిన ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనుంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే మరింత ఫ్యూచరిస్టిక్, అగ్రెసివ్ డిజైన్‌తో రానుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లతో పాటు పవర్‌ఫుల్ ఈవీ వెర్షన్లలోనూ ఈ నెక్ట్స్-జెన్ మోడల్ అందుబాటులో ఉండనుంది.

న్యూ కియా సోనెట్ (New Kia Sonet):
ఫీచర్ల పరంగా యువతను ఎంతగానో ఆకట్టుకునే కియా సోనెట్.. సరికొత్త సెకండ్ జెనరేషన్ రూపంలో రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ సరికొత్త సోనెట్ కియా యొక్క లేటెస్ట్ ‘K1’ ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల కారు వీల్‌బేస్ పెరిగి వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు మరింత ఎక్కువ లెగ్‌రూమ్, సౌకర్యం లభించనుంది. దీని ఫ్రంట్ లుక్ గంభీరంగా, కియా సెల్టోస్ స్టైల్‌ను పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ కారులో పెద్దదైన 12.3 అంగుళాల డిస్‌ప్లేలు, లెవెల్-2 ADAS రానున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విభాగంలోనే మొదటిసారిగా సోనెట్‌లో ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా కంపెనీ పరిశీలిస్తోంది.

న్యూ మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (New Mahindra XUV 3XO)
మహీంద్రా కంపెనీ ఇటీవలే ఎక్స్‌యూవీ 300 స్థానంలో తీసుకొచ్చిన ‘XUV 3XO’ మార్కెట్లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 2026 అప్‌డేట్స్‌లో భాగంగా కంపెనీ ఇందులో సరికొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ ను సరికొత్త ఫీచర్లను జోడించింది. సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వస్తున్న అతిపెద్ద ‘స్కైరూఫ్’ లెవెల్-2 ADAS, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు దీని సొంతం. అంతేకాకుండా, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా మహీంద్రా ఇందులో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ బూట్ స్పేస్ ఫ్రెండ్లీ సీఎన్‌జీ మోడల్‌ను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది.

సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో రాబోతున్న ఈ సరికొత్త మార్పులు, కొనుగోలుదారులకు మరింత లగ్జరీ, సేఫ్టీ మరియు పవర్‌ఫుల్ ఆప్షన్లను అందించడమే కాకుండా, ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ స్థాయిని మరింత పెంచనున్నాయి.

అమెరికాలో కిలో భారత్ మామిడి రూ.1900.. ఎందుకంటే

Indian mango price in America
Indian mango price in America

Indian mango price in America: మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం కారణంగా భారత్ పై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది. దీంతో అమెరికాలోని కొన్ని వస్తువుల సేవలు భారతీయులకు ప్రియంగా మారాయి. కానీ ఈ సమయంలో భారత జాతీయ పండు అమెరికాలో సంచనలం సృష్టిస్తోంది. అక్కడివారు మామిడి పండ్లకు పడిపోయి ఎగబడి కొంటున్నారు. దీంతో భారత్ లోని మామిడి పండ్లు అమెరికాలో కిలో రూ. 1900 తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో కిలో మామిడికి రూ. 100 నుంచి రూ.200 ఉండగా.. అమెరికాలో డిమాండ్ ఎందుకు పెరిగింది? పూర్తి వివరాలు మీకోసం..

భారతీయుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న మామిడి పండ్లు ఇప్పుడు అమెరికా మార్కెట్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాలోని కొన్ని భారతీయ కిరాణా దుకాణాల్లో మాత్రమే కనిపించిన భారత మామిడిపండ్లు, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ చైన్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రావడం విశేషం. ముఖ్యంగా అమెరికాలో అతిపెద్ద హోల్‌సేల్ రిటైల్ సంస్థలలో ఒకటైన Costco Wholesale స్టోర్లలో భారత మామిడిపండ్లు విక్రయించడం భారత వ్యవసాయ రంగానికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు.

అమెరికా మార్కెట్‌లో భారత మామిడిపండ్లకు పెరుగుతున్న డిమాండ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ కేసర్ మామిడిపండ్లు అక్కడ భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి. కాస్ట్‌కో వెబ్‌సైట్‌లో ఒక కిలో కేసర్ మామిడి ధర సుమారు 20 డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1,900కు పైగా అవుతుంది. భారత్‌లో సాధారణంగా రూ. 100 నుంచి రూ. 200 వరకు అందుబాటులో ఉండే మామిడి పండ్లు విదేశాల్లో విలాసవంతమైన ఫలాలుగా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ విజయానికి వెనుక భారత దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కీలక పాత్ర పోషించాయి. అమెరికాలోని సియాటిల్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న Prakash Gupta భారత మామిడిపండ్లను ప్రధాన అమెరికన్ రిటైల్ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక కృషి చేసినట్లు వెల్లడించారు. ఆయన దీనిని ‘మామిడి దౌత్యం’గా అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది. భారతీయ ఉత్పత్తులకు అమెరికన్ వినియోగదారుల్లో విశ్వాసం పెంచేందుకు ఏడాది కాలంగా నిరంతర ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. ప్రపంచ మొత్తం మామిడి ఉత్పత్తిలో దాదాపు 45 నుంచి 50 శాతం వరకు భారత్ నుంచే వస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో పండే అల్ఫోన్సో, గుజరాత్ కేసర్, ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి, ఉత్తరప్రదేశ్ దసరి, లంగ్రా వంటి రకాల మామిడిపండ్లు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. రుచి, సువాసన, తీపి కారణంగా భారత మామిడి పండ్లకు విదేశాల్లో భారీ ఆదరణ లభిస్తోంది.

అమెరికాకు మామిడిపండ్ల ఎగుమతి అంత సులభమైన ప్రక్రియ కాదు. అక్కడి ఆహార భద్రతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. పండ్లను ప్రత్యేక హాట్ వాటర్ ట్రీట్‌మెంట్, రేడియేషన్ ప్రాసెసింగ్ వంటి విధానాల ద్వారా శుద్ధి చేసిన తర్వాతే ఎగుమతికి అనుమతి ఇస్తారు. అలాగే పండ్లు చెడిపోకుండా కోల్డ్ చైన్ వ్యవస్థ ద్వారా వేగంగా రవాణా చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నదే అయినా, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎగుమతిదారులు ముందుకు వస్తున్నారు.

2026 చివరి నాటికి రాబోయే Tata సరికొత్త కార్లు ఇవే..

Tata upcoming cars 2026 India
Tata upcoming cars 2026 India

Tata upcoming cars 2026 India: భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో దూసుకుపోతోంది. పర్యావరణహితమైన ప్రయాణాన్ని మరింత చేరువ చేస్తూ 2026 చివరి నాటికి సరికొత్త సాంకేతికతతో కూడిన సరికొత్త ఈవీలను, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతుండగా.. మరికొన్ని లగ్జరీ విభాగంలో అడుగుపెట్టబోతున్నాయి. ఆ అద్భుతమైన వాహనాల వివరాలు ఇవే..

టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV):
90వ దశకంలో భారతీయ రోడ్లపై సంచలనం సృష్టించిన ‘సియెర్రా’ సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి రాబోతోంది. టాటా కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మిడ్ సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ (SUV), కంపెనీ యొక్క సరికొత్త ‘acti.ev’ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమవుతోంది. ఇది సింగిల్ మరియు డ్యూయల్ మోటార్ (AWD) ఆప్షన్లతో రానుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 నుండి 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. క్లాసిక్ డిజైన్, లౌంజ్ లాంటి క్యాబిన్ స్పేస్ మరియు లెవెల్-2 ADAS వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోనుంది.

టాటా సఫారీ ఈవీ (Tata Safari EV):
ఈ కంపెనీకి చెందిన పాపులర్ 7-సీటర్ ఎస్‌యూవీ ‘సఫారీ’ కూడా ఈ ఏడాది ఎలక్ట్రిక్ అవతారంలో మెరవనుంది. పెద్ద కుటుంబాలకు సరిపోయేలా, లగ్జరీ, పవర్‌ కలయికగా ఈ కారును తీర్చిదిద్దుతున్నారు. ఇందులో 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఏసీ , వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. భారీ బ్యాటరీ ప్యాక్‌తో రాబోతున్న ఈ సఫారీ ఈవీ, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేవారికి ఒక అద్భుతమైన ఎంపికగా మారబోతోంది.

టాటా అవిన్య ఈవీ (Tata Avinya EV):
టాటా మోటార్స్ భవిష్యత్తు ఈవీ సాంకేతికతకు నిదర్శనంగా ‘అవిన్య’ నిలవనుంది. ఇది టాటా యొక్క సరికొత్త జనరేషన్ 3 (Gen 3) స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతున్న ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనం. కేవలం 30 నిమిషాల లోపే రాపిడ్ ఛార్జింగ్ అయ్యేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. కనీసం 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే సామర్థ్యం దీని సొంతం. గ్లోబల్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్ మరియు మినిమలిస్టిక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఒక ప్రత్యేకమైన సబ్ బ్రాండ్‌గా ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ (Tata Punch Flex Fuel):
ఈవీలతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన విభాగంలో టాటా తీసుకొస్తున్న మరో విప్లవాత్మక మార్పు ‘పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ కార్. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ కాకపోయినప్పటికీ, పర్యావరణ కాలుష్యాన్ని, ఇంధన ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ కారు పెట్రోల్ తో పాటు 20% నుంచి 85% పైగా ఇథనాల్ కలిపిన బయో ఫ్యూయల్‌తో నడవగలదు. ఇందుకోసం దీని 1.2 లీటర్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, నిఘా వ్యవస్థను ప్రత్యేకంగా రీ-ఇంజనీరింగ్ చేశారు. పెట్రోల్ ధరలతో పోలిస్తే ఇథనాల్ చౌకగా దొరికే అవకాశం ఉండటంతో, మిడిల్ క్లాస్ వినియోగదారులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందిస్తుంది.

2026లో టాటా మోటార్స్ తీసుకురాబోతున్న ఈ కార్లు, భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని మరింత పర్యావరణహితమైన మరియు స్మార్ట్ గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించనున్నాయి.

Motorola నుంచి కొత్త మొబైల్ రిలీజ్.. ఈ ఫోన్ మిడిల్ క్లాస్ కోసమే..

Moto G37 Power 5G launch
Moto G37 Power 5G launch

Moto G37 Power 5G launch: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola నుంచి మరో కొత్త బడ్జెట్ 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. Moto G37 Power 5Gను మే 19న భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీ, మెరుగైన చిప్‌సెట్, నాణ్యమైన కెమెరాలు ఉన్నా కూడా మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ధరను అందుబాటులో ఉంచింది.ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Moto G37 Power 5G‌ బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ దీని డిజైన్ ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ఈ ఫోన్ రెండు లేదా మూడు Pantone కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే పెద్ద డిస్‌ప్లే, సన్నని బేజెల్స్‌తో మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఉంది. ఇది 5G కనెక్టివిటీతో పాటు డైలీ యూజర్స్ తో పాటు సోషల్ మీడియా, స్ట్రీమింగ్, లైట్ గేమింగ్‌కు సరిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రూపొందించారు.

ఈ కొత్త ఫోన్ లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఫోటో క్వాలిటీ, డే-టు-డే షాట్స్, పోర్ట్రెయిట్‌లు, నైట్ యూజ్ కోసం ఈ కెమెరా సెటప్‌ను బడ్జెట్ రేంజ్‌లో మంచి ఆప్షన్‌గా చూస్తున్నారు. అలాగే 7000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా సేపు నడిచేలా డిజైన్ చేశారు. 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి భారీ బ్యాటరీ అయినా ఛార్జింగ్ టైమ్ కొంతవరకు కంట్రోల్‌లో ఉంటుంది. Moto G37 Power 5G ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతోంది, టాప్ వేరియంట్ రూ. 18,999 వరకు ఉంది. ఫస్ట్ సేల్ మే 25న Flipkartలో జరగనుంది. అలాగే కొన్ని ఆఫర్లతో అదనపు డిస్కౌంట్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే Motorola నుంచి ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది. దీంతో కొత్తగా మొబైల్ కొనాలని అనుకునేవారు.. ఇప్పటికే ఉన్న పాత మొబైల్ స్థానంలో కొత్తదానిని తీసుకోవాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక కానుంది.