Home Blog Page 222

ఈ స్టార్ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారా..?

Star Directors Changing Music Directors
Star Directors Changing Music Directors

Star Directors Changing Music Directors: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ సాధించిన దర్శకులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే ఆ సినిమా కథతో పాటు ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఆ సినిమాకి ఉందా? లేదా అనేది కూడా తెలియాలి. దాంతో పాటుగా మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మన స్టార్ డైరెక్టర్లందరు తమ ఆ స్థాన దర్శకులందరిని మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సుకుమార్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా కోసం తన ఆస్థాన సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అతని ప్లేస్ లో ఎవ్వరిని తీసుకోబోతున్నాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినాన కూడా సంగీత దర్శకులు ఆ సినిమాకి అందించిన మ్యూజిక్ వల్ల సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ముందు దూసుకెళ్తున్న సుకుమార్ దేవిశ్రీప్రసాద్ మార్చడం పట్ల కొన్ని విమర్శలు వస్తున్నప్పటికి తను హీరోగా మారాడు కాబట్టి సుకుమార్ తనను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ సైతం ఆయన చేసిన నాలుగు సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు.

ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ హైలెట్ గా నిలిచాయి. ఆచార్య సినిమా కోసం మణిశర్మ ని దేవర సినిమా కోసం అనిరుధ్ ని తీసుకున్నాడు. ఇక ఇప్పుడు తను బాలయ్య బాబు తో చేస్తున్న సినిమా కోసం కూడా అనిరుధ్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తుంది…

మహానాడు టీడీపీకే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతికీ కోట్ల ‘పండుగ’

Mahanadu TDP Ads
Mahanadu TDP Ads

Mahanadu TDP Ads: మనకు అనుకూలమైన వ్యక్తి పీఠం మీద కూర్చుంటే చాలు ఏదైనా సరే సాగిపోతూ ఉంటుంది. ఏదైనా కాళ్ళ ముందుకు.. కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. పైగా ఆ సమయంలో అంతకు మించి అన్నట్టుగా నగదు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు ఎదురవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన ప్రభుత్వాలు ఉండడంతో ఈ రెండు పత్రికలకు దండిగా ప్రకటనలు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఈ పత్రికల యాజమాన్యాలు ఫస్ట్ పేజీలను విపరీతంగా ప్రచురిస్తున్నాయి. ఫుల్ పేజీ యాడ్స్ ను రంగురంగులలో ప్రింట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ మహానాడు ని కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు గట్టిగానే క్యాష్ చేసుకున్నాయి.

టిడిపి నేతలు పోటీపడి ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ఆంధ్రజ్యోతి , ఈనాడు పోటీపడి ఫస్ట్ పేజీలు ప్రింట్ చేస్తున్నాయి. మొత్తం జాకెట్ యాడ్స్ వస్తున్న నేపథ్యంలో కోట్లు దండుకుంటున్నాయి. మహానాడు నిన్న ప్రారంభమైంది. తొలి రోజు టిడిపిలో ఉన్న కొంతమంది మంత్రులు.. కీలక నాయకులు ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు.. గురువారం కూడా అదే స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. అందరికీ కూడా ఫస్ట్ పేజాడ్స్ ప్రయారిటీ కావడంతో.. రెండు పత్రికలు జాకెట్ యాడ్స్ కోసం మూడు నాలుగు ఫస్ట్ పేజీలను ముద్రించాయి.

ఇప్పుడున్న లెక్కల ప్రకారం స్క్వేర్ సెంటీమీటర్ 100ల లో ఉంటుంది.. అలాంటప్పుడు ఈ రెండు పత్రికలు ఒక్కో ఫుల్ పేజీ యాడ్ కు లక్షలలో వసూలు చేస్తూ ఉంటాయి. పైగా ఏపీ మొత్తం ఈ యాడ్స్ పబ్లిష్ అవుతుంటాయి కాబట్టి భారీగానే డబ్బులు వస్తుంటాయి. ప్రింట్ మీడియాకు మార్చి నుంచి మే నెల వరకు కాస్త గడ్డు పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మహానాడు వల్ల ఈ రెండు పత్రికలు పండగ చేసుకున్నాయి. కోట్ల ప్రవాహాన్ని పాలించుకున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో ఇలా ఫుల్ పేజీ యాడ్స్ పబ్లిష్ అవుతూ ఉండేవి. ఇప్పుడు అధికారంలో వైసీపీ లేదు కాబట్టి సాక్షి కరువు కాటకాలలో ఉంది. ఈనాడు.. జ్యోతి కి మాత్రం షడ్రసోపేతమైన భోజనం లభిస్తోంది. ఇంక మూడేళ్ల పాటు ఏపీలో కూటమి అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పండగే పండుగ.

ఎకరం 237 కోట్లు.. రికార్డులన్నీ బద్దలు.. హైదరాబాద్ లో జాగాలు కొనేదెలా?

Hyderabad Land Prices 2026
Hyderabad Land Prices 2026

Hyderabad Land Prices 2026: అప్పట్లో కోకాపేట ప్రాంతంలో భూములను వేలం వేసినప్పుడు ఎకరం 100 కోట్లు పోయింది. గత ఏడాది రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ధర 100 కోట్లకు మించిపోయింది. దీంతో యావత్ దేశం మొత్తం మన వైపు ఆశ్చర్యంగా చూసింది. ముంబై.. చెన్నై.. కోల్కతా.. పూణే వంటి మెట్రో నగరాలలో కూడా ఈ స్థాయిలో ధరలు లేవు. కానీ హైదరాబాదులో మాత్రం అంతకుమించి అనే స్థాయిలో భూములకు ధరలు పలికి.. సరికొత్త రికార్డులు నమోదవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

హైదరాబాద్ నగరంలో టీజీఐఐసి భూముల వేలం నిర్వహించింది. రాయదుర్గం ప్రాంతంలోని పాన్ మక్తా ఏరియాలోని సర్వేనెంబర్ 83/1 లో ఆరు ఎకరాల 29 గుంటల భూమికి వేలం వేస్తున్నారు.. ఎకరం భూమిని 237 కోట్లకు ఓ కంపెనీ కొనుగోలు చేసింది. ఇంకా ఈ భూమికి సంబంధించి వేలం జరుగుతున్న నేపథ్యంలో భారీగా సొమ్ములు ప్రభుత్వానికి సమకూరే అవకాశం కనిపిస్తోంది.

గత ఏడాది ఇదే ప్రాంతంలో 7.6 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. అప్పుడు ఎకరం ధర 177 కోట్లు పలికింది. నాడు ప్రభుత్వానికి ఏకంగా 1357.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ధర పలకడం విశేషం. హైదరాబాద్ నగరంలో పెద్దపెద్ద కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు సాగిస్తున్నాయి. భారీగా భవనాలను నిర్మిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం.. మంచిరేవుల.. నార్సింగి.. కోకాపేట.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. నేక్నాం పుర వంటి ఏరియాలలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఎకరం ధర 100 కోట్లలో ఉంది. అందువల్లే ఇక్కడ భారీగా భవనాలను నిర్మించడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస సముదాయాలు ఏర్పాటు కావడం.. ఐటీ కంపెనీలు
.. ఫార్మా కంపెనీలు.. ఫైనాన్షియల్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు. అందువల్లే ఇక్కడ నివాస సముదాయాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫలితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ భూములను కొనుగోలు చేసి భారీ స్థాయిలో భవనాలను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రాజ్ పుష్ప.. అపర్ణ.. మై హోమ్.. జనప్రియ వంటి కంపెనీలు అత్యంత భారీగా నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ భూములను వందల కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక ఎకరం వచ్చేసి 237 కోట్లు పలికిందంటే మామూలు విషయం కాదు. దీంతో యావత్ దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కాగా, ధరలు ఈ స్థాయిలో పెరిగితే హైదరాబాదులో సామాన్యులు జాగాలు కొనే పరిస్థితి ఉండదని.. నిపుణులు చెబుతున్నారు.

సుకుమార్ - రామ్ చరణ్ మూవీలో సెకండ్ హీరోగా ఆ కుర్ర నటిస్తున్నారు..?

Ram Charan
Ram Charan

Sukumar Ram Charan Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకున్నాడు. అలాంటి సుకుమార్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం…ఇప్పటికైనా అల్లు అర్జున్ తో చేసిన పుష్ప, పుష్ప 2 సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఈ సినిమాలతో ఆయన క్రేజ్ తరా స్థాయికి వెళ్ళిపోయింది. అందువల్లే అతను మరోసారి రామ్ చరణ్ తో జతకట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు ‘రంగస్థలం’ సినిమా వచ్చింది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో అటు సుకుమార్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా భారీ క్రేజ్ ను అందుకున్నారు. ఇక అలాంటి సుకుమార్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.

‘పుష్ప 2’ 1850 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టినప్పటికి ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్న సినిమా 3000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడమే టార్గెట్ పెట్టుకున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకమైన హోదా దక్కుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఇండస్ట్రీలో సినిమాలు చేసిన వాళ్ళు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న వారు మరొక ఎత్తుగా మారబోతున్నారు.

సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో అడవి శేషు కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…ఇక ఈ మూవీ కి ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

ఇండియాలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో అత్యధిక విజయాలను సాధించిన హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్ కు పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో తనను మించిన వారు ఇంకెవరూ లేరు అనే స్థాయిలో కూడా పేరు ను సంపాదించుకోవడం విశేషం…

అమెరికాకు సినిమా చూపించిన నరేంద్ర మోడీ.. ఇక దెబ్బకు ట్రంప్ ఇండియా జోలికి రాడు

India US Relations
India US Relations

India US Relations: అమెరికా ముందు వంగిపోయాడు. అమెరికా ముందు లొంగిపోయాడు. అమెరికా చెబితే భయపడిపోయాడు.. ఇదిగో ఇలా సాగిపోతుంటాయి నరేంద్ర మోడీ గురించి రాహుల్ గాంధీ చేసే విమర్శలు. కానీ రాహుల్ గాంధీ.. మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చారు. భారత్ అంటే చాలు తల ఎగిరిసే దేశాలను సైతం కాళ్ళ కిందికి తెచ్చుకున్నారు. అందువల్లే అది నచ్చని రాహుల్ గాంధీ.. ఇంకా మిగతా నాయకులు నరేంద్ర మోడీ మీద విమర్శలు చేస్తుంటారు.

తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబీయో ఇండియాకు వచ్చారు. ఇక్కడ రెండు రోజులపాటు ఉన్నారు. రకరకాల సమావేశాలలో పాల్గొన్నారు. కనీసం ఆయనకు ఇండియన్ గవర్నమెంట్ మామూలు వెల్కమ్ కూడా చెప్పలేదు. సిఐ స్థాయి పోలీసు అధికారులతో ఆయనకు వెల్కమ్ చెప్పించింది. ప్రధానమంత్రి వెళ్లలేదు. విదేశాంగ శాఖ మంత్రి కూడా వెళ్లలేదు. ఆ శాఖలో పనిచేసే అధికారులు కూడా వెళ్లలేదు. కేవలం అమెరికా దౌత్య విభాగంలో పనిచేసే వారు మాత్రమే వెళ్లారు. రూబియోకు స్వాగతం పలికారు.

భారతదేశం నుంచి వచ్చిన ఈ నిరసనను అమెరికా అంచనా వేయలేదు. రూబియో అయితే అలానే షాక్ లో ఉండిపోయాడు.. పైగా రూబియో కు ఇండియన్ ఫారిన్ మినిస్టర్ జై శంకర్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.. వెనిజులా నుంచి మొదలు పెడితే రష్యా వరకు ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరలో చమురు లభిస్తే అక్కడ కొంటాం. ప్రతి దేశంతో బలమైన దౌత్య సంబంధాలను కొనసాగిస్తాం. మా మీద పెత్తనం సాగిస్తే అంత గట్టిగా బదులు చెబుతామని” జై శంకర్ చెప్పడంతో రూబియో కు చెమటలు పట్టాయి.

చివరికి మన దేశాన్ని వీడి అమెరికాకు వెళ్తున్న సమయంలో కూడా ఆయనకు ఘనమైన వీడ్కోలు లభించలేదు. వీడ్కోలు సమయంలో కూడా సిఐ స్థాయి అధికారితోనే భారత్ సెండాఫ్ ఇచ్చింది. కనీసం మన దేశంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకునే స్థాయిలో గౌరవ మర్యాదలు ఇవ్వలేదు భారత్. ఇటీవల కాలంలో ట్రంప్ భారత్ మీద రకరకాల వ్యాఖ్యలు చేశాడు. అందువల్లే భారత్ ఇలా రివెంజ్ తీర్చుకుంది. ఇప్పట్లో ట్రంప్ ఇండియా జోలికి రాడు. ఇండియా గురించి మాట్లాడలేడు.. ఇటీవల చైనా టూర్ కు వెళ్ళినప్పుడు కూడా అమెరికా అధినేత ట్రంప్ కు ఈ స్థాయిలో పరాభవం ఎదురు కాలేదు. ఇప్పటికైనా ఇండియా గురించి ట్రంప్ తెలుసుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా చెత్త వాగుడు మానేస్తే మరింత మంచిది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై విమర్శ తెలంగాణ అస్తిత్వ సమస్యనా?

Professor Nageshwar controversy

Professor Nageshwar controversy : ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రా తెలంగాణ మద్య వివాదంగా మార్చారు. అసలు ఇందులో ఆంధ్రా, తెలంగాణకు సంబంధించిన అంశాలే లేవు. అయినా మార్చేశారు.

సుప్రసిద్ధ జర్నలిస్ట్ గా నాగేశ్వర్ మాట్లాడిన మాటలు చాలా బూతు. అక్షరాల చూసినట్టుగా జగన్ ను అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడిగితే అమిత్ షా క్లాస్ పీకినట్టుగా చెప్పుకొచ్చారు. విశ్లేషనగా చేయడం వేరు గాసిప్ గా చెప్పడం వేరు.

నాదెండ్ల మనోహర్ దీన్ని ఖండించడంతో నాగేశ్వర్ కూడా సర్దుకున్నారు. తర్వాత పవన్ కూడా దీనిపై ఖండించాడు. నాగేశ్వర్ మాటలు తప్పు అని.. కేసులు పెట్టినదానిమీద విత్ డ్రా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్పినట్టు తెలిపారు.

పవన్ మాట్లాడాక వివాదం సమసిపోవాలి. దీన్ని పెద్దగా రాజేశారు. దీనిపై చలి కార్చుకుంటున్నారు. నాగేశ్వర్ తనను ట్రోల్ చేస్తున్నారని బీజేపీకి కంప్లీట్ ఇచ్చారు. మనకు నచ్చిన వరకూ భావస్వేచ్ఛ.. వ్యతిరేకంగా వస్తే ట్రోల్స్ అంటూ ఫిర్యాదు చేయడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై విమర్శ తెలంగాణ అస్తిత్వ సమస్యనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

కోడిపుంజును తింటే.. మూడేళ్ల జైలు.. ఎందుకిలా..

Grey Junglefowl protection laws
Grey Junglefowl protection laws

Grey Junglefowl protection laws: మనలో చాలామందికి ముక్క లేనిది ముద్ద దిగదు. ఉదయం టిఫిన్ లో, మధ్యాహ్నం భోజనంలో, రాత్రి డిన్నర్ లో ఇలా మూడు పూటలూ ముక్కలతోనే తినే మహానుభావులు చాలామందే ఉన్నారు. నాన్ వెజ్ బాగా తినేవాళ్లకు రకరకాల వెరైటీలు కావాలి. అందులోనూ చికెన్ తినేవాళ్లకు కొత్తకొత్త డిష్ లు కావాలి. అందువల్లే కొంతకాలం గా మనదేశంలో చికెన్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది.

చికెన్ ఉత్పత్తి ఒకప్పుడు ఈ స్థాయిలో లేదు. డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా కోళ్లను పెంచుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు కోళ్ల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. విరివిగా ఫామ్ లు ఏర్పాటు చేయడంతో కోళ్ల ఉత్పత్తి భారీగా ఉంటున్నది. ఉత్పత్తికి, వినియోగానికి అంతరం అంతగా లేకపోవడంతో ఫౌల్ట్రీ వ్యాపారం మూడుపూలు, ఆరుకాయలుగా సాగుతోంది.

తెలుగురాష్ట్రాల్లో ప్రతిరోజు వందల క్వింటాళ్ల చికెన్ విక్రయాలు సాగుతుంటాయి. నాటు కోళ్లు, బ్రాయిలర్ అనే సంబంధం లేకుండా జనం లాగించేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలా జిల్లా జన్నారంలో సంచరించే ఓ కోడిని వేటాడితే, దాని మాంసం తింటే మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దీని వెనుక కారణం లేకపోలేదు. జన్నారం అటవీప్రాంతంలో గ్రే జంగిల్ ఫౌల్ అనే కోడి సంచరిస్తూ ఉంటుంది. ఇది అత్యంత అరుదైనది. అందువల్లే దీనిని వణ్యప్రాణి రక్షణ చట్టం లో చేర్చారు. ఈ కోడిపుంజును వేటాడి తింటే మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది.

ఈ కోడి పుంజులు అడవిలో ప్రత్యేకంగా ఉంటాయి. మనుషుల అలికిడి వినిపించగానే పారిపోతాయి. ప్రాణాపాయం ఉంటే చెట్ల మీదికి ఎగిరిపోతాయి. గింజలను, చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. నేల మీద గూళ్లు నిర్మించుకుంటాయి. చెట్ల పై కూడా గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో ఈ కోడి పుంజులు సంచరిస్తుంటాయి.

టెక్నాలజీకి సరికొత్త పాఠాలు చెబుతున్న చైనా..

China latest technology innovations
China latest technology innovations

China latest technology innovations: తయారీ రంగంలో ఇప్పటికే చైనా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా వేగంగా పరుగులు పెడుతోంది. అమెరికాను ఇప్పటికే మించిపోయింది. జపాన్ దేశాన్ని కూడా దాటిపోయింది. చివరికి రోబోలతో పరుగుల పోటీపెడుతోంది. నిర్మాణరంగంలో రోబోలతో పని చేయిస్తోంది. ఇటీవల ఒక రైల్వే స్టేషన్ నిర్మాణంలో రోబోలతో పని చేయించి సరికొత్త చరిత్ర సృష్టించింది చైనా.

చైనా ఇంతటితోనే ఆగిపోవడం లేదు. సాంకేతిక ఉత్పత్తుల తయారీలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.. మన నిత్య జీవితంలో వాడే సెల్ ఫోన్లు.. లాప్టాప్ లు.. వ్యక్తిగత కంప్యూటర్ల విషయంలో చైనా సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఆ ఉత్పత్తులు కేవలం చేతి సైగల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి.

ఇక లాప్టాప్ లు అయితే జస్ట్ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అంతే కాదు టర్బో చార్జర్ ద్వారా అది వెంటనే చార్జింగ్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ లు అయితే అత్యంత వేగంగా పని చేస్తున్నాయి. చార్జింగ్ నుంచి మొదలుపెడితే నెట్ సర్పింగ్ వరకు అన్ని విభాగాలలో సూపర్ పనితీరు కనబరుస్తున్నాయి. చైనా ఈ స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది కాబట్టే ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తులను అమెరికాలో కాకుండా డ్రాగన్ దేశంలో అసెంబ్లింగ్ చేయిస్తోంది.

స్మార్ట్ ఫోన్ ల మార్కెట్ లో ఒకప్పుడు అమెరికా, దక్షిణకొరియా, ఫిన్ లాండ్ దేశాల హవా ఉండేది. ఆర్ అండ్ డీ మీద చైనా విపరీతంగా ఫోకస్ చేయడంతో ఉత్పత్తి పెరిగిపోయింది. ఫీచర్లు, అనేక రకాల సౌలభ్యాలు అందుబాటులోకి రావడంతో చైనా కంపెనీలు ప్రపంచ మార్కెట్ ను దున్నేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో సింహభాగానికి మించిన వాటా చైనా కంపెనీలదంటే పరిస్థితి ెలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్ కాలాన్ని ముందే ఊహించి ఉత్పత్తులు తయారు చేయడం చైనాకు మొదటి నుంచి అలవాటే. ప్రపంచం మొత్తం ఐదో తరం టెక్నాలజీ వాడుతుంటే.. చైనా కంపెనీలు ఏడోతరం ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వీటిని అత్యంత ఆధునికంగా రూపొందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ల నుంచి మొదలు పెడితే లాప్టాప్ ల వరకు చైనా కంపెనీలు ఇలా ఉత్పత్తులను తయారు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ మొత్తాన్ని శాసించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు నిజమేనా.. ఆయన వాదనలో నిజమెంత

Professor Nageshwar cases truth analysis
Professor Nageshwar cases truth analysis

Professor Nageshwar cases truth analysis: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం షేక్ చేస్తోంది. జగన్ అరెస్టు గురించి ప్రస్తావించారు కాబట్టి వైసిపి మీడియా నాగేశ్వర్ కు అనుకూలంగా రాస్తోంది. నాగేశ్వర్ వ్యవహారంలోకి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా రంగప్రవేశం చేశారు. రాజకీయ నిరుద్యోగులు కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెడితే.. ఆయనను గనక అరెస్టు చేస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి ఈ వ్యవహారంలో నాగేశ్వర్ మీద ఏపీ ప్రభుత్వం ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కేవలం జగన్ అరెస్ట్ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించినందుకు నాగేశ్వర్ మీద జనసేన నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతవరకు ఆ వ్యవహారం ఆగిపోయింది. అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అనవసరంగా రాద్ధాంతం ఎందుకని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా కేసులు నమోదు చేయకూడదని.. నాగేశ్వర్ ను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

“ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో తనకు బాజాలు మోగించుకుంటున్నారు. తనను తాను గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంతమందికి సహాయం చేశారు.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ స్థాయిలో కృషి చేశారని” జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎటువంటి కేసులు నమోదు చేయకపోయినప్పటికీ.. ఆయనను అరెస్ట్ చేయకపోయినప్పటికీ.. యుద్ధం మీరు మొదలుపెట్టారు నేను ముగింపు ఇస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఎందుకు ఈ స్థాయిలో విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.. కొంతమంది వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు చెల్లిందని జనసేన నాయకులు మండిపడుతున్నారు..

“ఏ విషయంలో కూడా నిజం లేదు. ఇలా అబద్దపు మాటలు మాట్లాడిన వ్యక్తిని విశ్లేషకుడు అనుకోవాలా.. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి విశ్లేషకుడు ఎలా అవుతాడు.. నాగేశ్వర్ న్యూట్రల్ ముసుగులో రాజకీయ పార్టీకి కొమ్ముకాసే విధానాలకు చరమగీతం పాడాలని” జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

“ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారా.. కేసులు ఏమైనా నమోదు చేశారా.. ఆయన వాదనలో నిజం ఎంత ఉంది.. అనే విషయాలను ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన అనవసరంగా గొప్పగా ఊహించుకుంటున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం గురించి ముగింపు ఇవ్వాలని చెప్పినప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అలానే మాట్లాడటం ఏమాత్రం సబబు కాదని” జనసేన నాయకులు అంటున్నారు..

కొద్దిరోజులపాటు ఈ వ్యవహారం ఇలానే సాగిపోతుందని.. ఆ తర్వాత దానంతట అదే ముగిసిపోతుందని జనసేన నాయకులు అంటున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెప్పారని.. ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని.. ఇకపై వాస్తవాలు మాత్రమే చెప్పాలని.. న్యూట్రల్ విశ్లేషణ మాత్రమే చేయాలని జనసేన నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు హితవు పలుకుతున్నారు.

రాజకీయ పార్టీ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన పాస్టర్ అభినయ దర్శన్

Pastor Abhinay Darshan
Pastor Abhinay Darshan

Pastor Abhinay Darshan: పాస్టర్లు రాజకీయాల్లోకి రావడం మనదేశంలో కొత్తేమీ కాదు. ఆ పార్టీలను ఏర్పాటు చేసి.. మీడియాలో సంచలనం సృష్టించి.. ఆ తర్వాత మూసివేసిన వారే అధికం. ఆ జాబితాలో చాలామంది ఉన్నారు. అయితే పాస్టర్ అభినయ దర్శన్ మాత్రం దీనికి పూర్తి విభిన్నం. ఆయనకు మీడియాను ఎలా అటెన్షన్ చేసుకోవాలో తెలుసు. మీడియాను తనవైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు. అందువల్ల కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో ఆయన ప్రముఖంగా కనిపిస్తున్నారు.

ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ ప్రాంతంలో పర్యటించి వస్తుండగా అభినయ దర్శన్ ప్రమాదానికి గురయ్యారు.. కొంతమంది ఆయన మీద దాడి చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియా వ్యక్తులు ఆయన గొంతుముందు మైకులు పెట్టగానే చించుకున్నారు. తాను పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని.. ప్రజల గురించి తన కొట్లాడుతుంటే కొంతమంది గిట్టనివారు ఇలాంటి దాడి చేశారంటూ గొంతు చించుకున్నాడు. దీంతో కొన్ని మీడియా సంస్థలు క్రైస్తవుల మీద జరిగిన దాడిగా దీనిని చిత్రీకరించాయి. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఘటనకు దీనికి లింకు పెట్టి స్టోరీలు అల్లాయి. అంతేకాదు ఏపీ రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత లేకుండా పోయిందని కన్నీరు కార్చాయి.

ఈ ఘటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. దీనిపై ఏపీ పోలీసులు స్పందించారు. లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంతో అసలు విషయాలు తెలుగులోకి వచ్చాయి. అభినయ దర్శన్ మీద దాడి చేసింది వేరే వ్యక్తులని.. వారికి.. అభినయ దర్శన్ కు పాత గొడవలు ఉన్నాయని తేల్చారు. అంతేకాదు తాను జనాల్లో సానుభూతి పొందడానికి ఈ తరహా డ్రామాలు ప్లే చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అనేక కేసులు అభినయ దర్శన్ మీద ఉండడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ విషయం మీద స్పందించారు. దర్శన్ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని.. ఇకపై అతని డ్రామాలకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని వ్యాఖ్యానించారు.

ఇన్ని రోజుల పాటు తనను తాను పేదల పక్షపాతిగా ప్రచారం చేస్తున్న అభినయ దర్శన్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ విషయంలో సంచలన ప్రకటన చేశారు.”భరోసా పార్టీ నాది కాదు. దీనిని వేరే వ్యక్తి స్థాపించారు. దీనిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించారు. నాకున్న ఫాలోయింగ్ చూశారు. ఏపీకి అధ్యక్షుడిగా ఉండాలని సూచించారు. అప్పటినుంచి నేను భరోసా పార్టీకి ఏపీ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను.. భరోసా పార్టీ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని” అభినయ దర్శన్ వ్యాఖ్యానించాడు.. ఇతడి మీద ఉన్న కేసులను విచారించేందుకు ఏపీ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు.. ఆ తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

1400 ఎకరాలు.. ప్రపంచంలోనే ఉత్తమమైన హోటల్ ఇది.. మనదేశంలో ఎక్కడుంది.. ప్రత్యేకతలు ఏంటంటే

worlds best hotel in Assam
worlds best hotel in Assam

worlds best hotel in Assam: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 1400 ఎకరాలు.. కనుచూపుమేరలో పచ్చదనం. విస్తారంగా పెరిగిన చెట్లు.. ఎక్కడ కూడా కాంక్రీట్ జంగిల్ కనిపించదు. కనీసం సిమెంట్ గోడ కూడా దర్శనమీయదు. అన్ని కూడా ప్రకృతిలో భాగం అన్నట్టుగా కనిపిస్తుంటాయి. చెట్లనుంచి మొదలు పెడితే పారే నీళ్ల వరకు అక్కడ ప్రతిదీ కూడా వింతగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద రిసార్ట్ విదేశాల్లో కాదు ఉన్నది.. మనదేశంలోనే ఉన్న దీని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖమైనది అస్సాం. ఈ రాష్ట్రంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో పోస్ట్ కార్డ్ లగ్జరీ రిసార్ట్ ఉంది.. ఇందులో లగ్జరీకి పర్యాయపదంగా సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ మనసారా టీ ని ఆస్వాదించవచ్చు. సరదాగా గడపవచ్చు. ఇక్కడ విలాసవంతమైన విల్లాల తో పాటు.. పర్యటకులను ఆకట్టుకునేందుకు అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ కూడా మనకు కృత్రిమతత్వం కనిపించదు. హోటల్ గదులలో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్.. స్పా.. ఫిట్నెస్ సెంటర్ వంటివి బోలెడు ఉంటాయి. సంప్రదాయ వంటలు కూడా ఇక్కడ ఎక్కువగా వండుతూ ఉంటారు. టీ పొడి తయారీలో ప్రముఖంగా ఉపయోగించే తేయాకు మొక్కలను నాటడం దగ్గరనుంచి.. టీ పొడిగా మార్చే వరకు అన్నింటిని ఇక్కడ చూపిస్తారు.

ఇక్కడ విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఉంటాయి. కపుల్స్ కు ప్రత్యేకమైన గదులు ఉంటాయి. ఈ రిసార్ట్ మొత్తం తిరిగిరావడానికి దాదాపు 10 రోజుల దాకా పడుతుంది. అందువల్లే అక్కడక్కడ సోలార్ వెహికల్స్ ఉంటాయి. వాటి ద్వారా ప్రయాణం సాగించవచ్చు. ఒకరోజు ఇక్కడ స్టే చేయడానికి రూ. వేలల్లో వసూలు చేస్తూ ఉంటారు. మెచ్చిన వంటలు కూడా ఇక్కడ ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి. కోరుకున్న రుచులను అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటారు.. తేయాకు ను లైవ్ లో తెంపి.. టీ తయారు చేసి ఇస్తూ ఉంటారు. నచ్చిన మొక్కల ఆకులను తెంపి.. టీ పొడిగా మార్చి ఇస్తూ ఉంటారు.. అందువల్లే ఈ రిసార్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్ గా ఎంపికైంది. ఇక్కడ పరిశుభ్రత కూడా అద్భుతంగా ఉంటుంది..

ఈ రిసార్ట్ ను పర్యవేక్షించడానికి భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు నిత్యం ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది పహారా కాస్తూ ఉంటారు. 1400 ఎకరాల చెట్టు భారీగా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల సెక్యూరిటీ మాత్రమే కాకుండా.. బయోడైవర్సిటీని కూడా కాపాడుతున్నారు దీని నిర్వాహకులు.. అందువల్లే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్ గా పేరు తెచ్చుకుంది.

ఆ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ఆశలు వదులుకున్నట్టే!

YCP political strategy changes
YCP political strategy changes

YCP political strategy changes: వైయస్సార్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. నిన్న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని.. ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జిలపై వేటు పడుతుందని హెచ్చరించినంత పని చేశారు. అయితే అక్కడే ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు.. బాధ్యతలు చూస్తున్న తమపై కాదు.. ఆ కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి అన్నట్టు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కనీసం వైసిపి ఉనికి లేదు. నేతల జాడలేదు. ముందుగా అక్కడ పని చూడండి అన్నట్టు వైసిపి నేతల సూచన ఉంది. గత రెండేళ్లలో ఆ మూడు నియోజకవర్గాల్లో వైసిపి చేసిన కార్యక్రమం అంటూ లేకపోవడం విశేషం.

వై నాట్ కుప్పం అంటూ సౌండ్ చేశారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంను గెలిచేస్తాం అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు పెద్దదిక్కుగా మారిపోయారు. తన పుంగనూరు విడిచిపెట్టి మరి కుప్పం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క పదవి కూడా వదలకుండా అంతా తీసుకున్నారు. అభివృద్ధి పనులు కూడా పగబట్టి మరీ చేశారు. కానీ కుప్పం ప్రజలు మాత్రం మళ్లీ చంద్రబాబునే పట్టం కట్టారు. ప్రస్తుతం అక్కడ వైసిపి ఇన్చార్జిగా ఉన్న భరత్ జాడలేదు. వైసిపి కార్యక్రమాలు జరగడం లేదు. పట్టించుకునే నాధుడు కూడా అక్కడ లేడు.

ఇక మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ మానియా నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి లోకేష్ వినూత్న తరహాలో ముందుకు వెళ్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా. 2019లో ఓడిపోయిన తర్వాత సొంత ఖర్చుతో అభివృద్ధి చేసి చూపించారు. ఇప్పుడేమో ప్రభుత్వపరంగా చేసి చూపిస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి జాడలేదు. మొన్న పోటీ చేసిన మహిళా నేత కనిపించడం లేదు. పైగా అక్కడ మాజీ మంత్రి ఒకరు లోకేష్ పట్ల అనుకూల ప్రకటనలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు ముద్రగడ పద్మనాభం. అయితే ఓడించలేక తన పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబు సైతం జనసేనలోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన వంగా గీత ఆచూకీ లేదు. కనీసం అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు లేవు. ఈ మూడు చోట్ల ముందు చూడండి.. తరువాత మాట్లాడండి అన్నట్టు ఉంది వైసీపీ నేతల వ్యవహార శైలి.

అనిల్ రావిపూడి కొత్త మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చడానికి కారణమేంటి..?

Anil Ravipudi music director change reason
Anil Ravipudi music director change reason

Anil Ravipudi music director change reason: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సినిమా మ్యూజిక్ బాగుండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడంలో మ్యూజిక్ కీలకపాత్ర వహిస్తుంది. ఒకప్పుడు పాటలు బావుండి సినిమాలు ఫెయిల్యూర్ అయిన కూడా చాలామంది స్క్రీన్ మీద పాటలు చూడడానికి థియేటర్ కి వచ్చేవాళ్లు… ఇక అలాంటి క్రమంలోనే మన దర్శకులు ప్రస్తుతం మ్యూజిక్ విషయంలోనే స్పెషల్ కేర్ తీసుకుంటూన్నారు. కొన్ని మ్యూజిక్ విషయంలో చాలా వరకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుండడం వల్ల కూడా సక్సెస్ ని సాధించాయి అంటే మ్యూజిక్ అనేది సినిమాలో ఎంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో మన అర్థం చేసుకోవచ్చు…

ఇప్పటివరకు మన స్టార్ డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లను మాత్రమే తీసుకుని వాళ్ళతో మ్యూజిక్ చేయించుకున్నారు. ఇక ప్రస్తుతం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి ప్రాధాన్యత పెరగడంతో చాలామంది మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

దాంతో పాటుగా ఇతర భాషల్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు… ఈ క్రమంలో అనిల్ రావిపూడి సైతం ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న కొత్త సినిమా కోసం జీవి ప్రకాష్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జీవి ప్రకాష్ కి మ్యూజికల్ గా చాలా మంచి హిట్స్ పడుతున్నాయి. గతంలో అనిల్ రావిపూడి దేవి శ్రీ ప్రసాద్, భీమ్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకున్నప్పటికి ఇప్పుడు వారిని పక్కన పెట్టి జీవి ప్రకాష్ కుమార్ దగ్గరికి వెళ్తున్నాడు.

కారణం ఏంటి అంటే ఆయన చేసే మ్యూజిక్ లో చాలా వరకు మ్యాజిక్ ఉంటుందని దానికి తగ్గట్టుగానే ప్రతి సాంగ్ లో ఒక ఫీల్ క్యారీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా తన సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇప్పుడు సిద్ధరామయ్య.. అప్పుడు బంగారప్ప.. నాడు కర్ణాటక లో ఏం జరిగిందంటే..

Karnataka Politics
Karnataka Politics

Karnataka Politics: కొన్నాళ్లు కర్ణాటక రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి. మళ్లీ ఇప్పడు రైజింగ్ వ్యవహారం లాగా మారిపోయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. గతంలో ఒప్పందం జరిగిందని, దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి మార్పు జరుగుతోందని సమాచారం.

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇటువంటి పరిణామమే చోటు చేసుకుంది.1992లో కర్ణాటకలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బంగారప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవినీతికి పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరుచూ బంగారప్ప మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేసేవారు.

నాడు ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు. అప్పడు ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్నడ సీమలో జరుగుతున్న వ్యవహారాలు ఆయనకు తీవ్రమైన శిరోభారం లాగా మారాయి. అంత ఇబ్బందిలో కూడా పీవీ నరసింహారావు బంగారప్పను ఢిల్లీ పిలిపించుకున్నారు. నాడు తన ఎదుటకు వచ్చిన ఫిర్యాదులను పీవీ నరసింహారావు చదివి బంగారప్పకు వినిపించారు. పీవీ అలా చేస్తారని బంగారప్ప ఊహించలేదు. ఆయన అలా చదువుతుండగా బంగారప్ప మౌనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నానని పీవీ చెప్పడంతో బంగారప్ప అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బంగారప్ప బయటకి రాగానే మీడియా చుట్టుముట్టింది. సార్ మీరు రాజీనామా చేస్తున్నారా అని ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెప్పకుండానే నేరుగా.. తన మంత్రివర్గం.. ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అంతేకాదు.. విమానాశ్రయానికి తన మద్దతుదారులు భారీగా రావాలని పిలుపునిచ్చారు. తన బలాన్ని అధిష్టానం ముందు ప్రదర్శించాలని బంగారప్ప అనుకున్నారు. ఆ మరుసటి రోజు బంగారప్ప బెంగళూరు వెళ్ళిపోయారు. విమానాశ్రయం లో దిగారు. ఆయన ఊహించని సన్నివేశం అక్కడ చోటుచేసుకుంది. ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ ఉన్నారు. కొంతమంది మద్దతుదారులు మాత్రమే అక్కడ దర్శనమిచ్చారు.

పరిస్థితి అర్థం కావడంతో బంగారప్ప వెంటనే తన రిజైన్ లెటర్ అందజేశారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరప్ప మొయిలీ కర్ణాటక ముఖ్యమంత్రిగా 1992 నవంబర్ 19 ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండవ వ్యక్తి సిద్ధరామయ్య. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.

అమెరికాతో అంట కాగారో.. పాకిస్తాన్ పీఎం.. ఆర్మీ చీఫ్ చీఫ్ కు లష్కరే తోయిబా హెచ్చరిక

Pakistan PM Shehbaz Sharif
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్.. ఆర్మీ చీఫ్ మునీర్ కు రోజులు బాగున్నట్టు లేవు. అమెరికాతో అంటకాగుతున్న వారికి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. అమెరికాతో ఇంకా ఎక్కువ రెచ్చిపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సంకేతాలు పంపించింది. అమెరికా వద్ద పాకిస్తాన్ ప్రయోజనాలను తాకట్టు పెడితే పరిణామాలు తీవ్రంగా మారుతాయి అని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి కి.. ఆర్మీ చీఫ్ కు భయం పట్టుకుంది.

అబ్రహం అకార్డ్స్ లో ఇజ్రాయిల్ దేశాన్ని కూడా గుర్తించాలని కొంతకాలంగా అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది.. అంతేకాదు ఇజ్రాయిల్ దేశంతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని సూచిస్తుంది.. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు.. ఇస్లాం దేశాలు మొత్తం ఇజ్రాయిల్ తో వ్యాపారం నుంచి మొదలుపెడితే దౌత్యం వరకు అన్ని విషయాలలో మెరుగైన సంబంధాలు పాటించాలని చెబుతోంది అమెరికా.. దీనిని ఇప్పటికే కొన్ని గల్ఫ్ దేశాలు వ్యతిరేకించాయి. పాకిస్తాన్ మాత్రం ఎటువంటి విషయాన్నీ బయటకి వెల్లడించడం లేదు. నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తీరు పట్ల ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా స్పందించింది.. అబ్రహం అకార్డ్స్ విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ కనుక తలవంచితే.. అప్పుడు పరిణామాలు అంతకుమించి అనే విధంగా ఉంటాయని లష్కరే తోయిబా హెచ్చరించింది.

ఇటీవల కాలంలో మధ్య ప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మధ్య చోటుచేసుకున్న యుద్ధాన్ని తగ్గించేందుకు దాయాది దేశం చర్చలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. అయితే ఇంతవరకు రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసే దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు కూడా రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ఇది ఇలా ఉండగానే అబ్రహం అకార్డ్స్ విషయంలో అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి పాకిస్తాన్ దేశానికి మింగుడు పడనివ్వడం లేదు. ఒకరకంగా పాకిస్థాన్ పరిస్థితి కుడితి లో పడిన ఎలుక మాదిరిగా ఉంది. ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఒకవేళ అమెరికా విధించిన షరతులకు ఒప్పుకోకపోతే అంతర్జాతీయంగా అప్పులు పుట్టే అవకాశం లేదు. ఉగ్రవాదులను కాదని ముందడుగు వేస్తే బతికే పరిస్థితి ఉండదు.

ఒకవేళ ఉగ్రవాద సంస్థలకు తిక్క రేగితే పాకిస్తాన్ దేశంలో ఏదైనా చేస్తారు. పాకిస్తాన్ దేశం మీద అక్కడి ఆర్మీ కంటే కూడా ఉగ్రవాద సంస్థలకే పట్టు ఎక్కువగా ఉంటుంది. పైగా రాత్రికి రాత్రే వారు ప్రభుత్వాలను మార్చగలరు. అవసరమైతే ప్రభుత్వ పెద్దలను బహిరంగంగా చంపగలరు. అందువల్లే మునీర్.. షరీఫ్ ఉగ్రవాదులు అంటేనే భయపడిపోతున్నారు. మరి ఈ భయం నుంచి వారికి అమెరికా రక్షణ కల్పించగలదా.. అమెరికాను కాదని వారు నిర్ణయాలు తీసుకోగలరా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

తెలుగు లో బెస్ట్ స్క్రీన్ ప్లే రాసే ఇద్దరు కుర్ర దర్శకులు వీళ్లేనా..?

Best Screenplay Writers
Best Screenplay Writers

Best Screenplay Writers: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమా కథతో పాటు దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుండాలి. ముఖ్యంగా కథ బాగుండి స్క్రీన్ ప్లే అద్భుతంగా కుదిరినప్పుడే అది స్క్రీన్ మీద అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ప్రేక్షకులు దానిని చూసి ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్లను స్క్రీన్ మీద ఎలివేట్ చేయడంలో దర్శకులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. అయితే ఒక సినిమాకి స్క్రీన్ ప్లే అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. అది బాగున్నప్పుడే సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతిని పొందగలుగుతారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరి స్క్రీన్ ప్లేని అద్భుతంగా రాస్తారని ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులను మించిన స్క్రీన్ ప్లే రాసేవారు ఎవరు లేరని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది.

ఇంతకు ముందు చేసిన సినిమాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి సినిమాలో కూడా వాళ్ళ తాలూకు ఇంటెన్స్ కనిపించింది. నిజానికి స్క్రీన్ ప్లే లో సత్తా చాటాలి అంటే అది చిన్న హీరోలతో చేసినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. పెద్ద హీరోలతో చేసినప్పుడు స్క్రీన్ ప్లే మీద పెద్దగా వర్క్ చేయకపోయిన కమర్షియల్ ఎలెమెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.

కాబట్టి వారికి అంత ఫ్రీడం ఉండకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం మొదటి సినిమాలతోనే వాళ్ళ సత్తా ఏంటో చూపించారు…మొత్తానికైతే ఇండస్ట్రీ లో ఈ దర్శకులకు చాలా మంచి క్రేజ్ దక్కుతుంది…ఇక రాబోయే సినిమాలతో కూడా వాళ్ళు డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

చంద్రబాబు ముందు అంత మాట.. కిరాక్ ఆర్పి పంట పండినట్టే

Kirak RP
Kirak RP

Kirak RP Speech: రాష్ట్రవ్యాప్తంగా మహానాడు కొనసాగుతోంది. అమరావతి లోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడుకు అనుసంధానంగా.. హైబ్రిడ్ విధానంలో అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఈ మహానాడులో లక్షలాదిమంది టిడిపి కార్యకర్తలు భాగం అవుతున్నారు. అయితే ఈసారి మహానాడులో 65 మంది వక్తలు మాట్లాడారు. ప్రధానంగా మహిళా నేతలకు ఈసారి ప్రాధాన్యమిచ్చారు. అయితే బుల్లితెర నటుడు కిరాక్ ఆర్పి ఈసారి ప్రత్యేకంగా నిలిచారు మహానాడులో. ఆయన మాట్లాడిన తీరు చంద్రబాబును ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు తనతో పాటు తన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానాలు, కుప్పంలో వైసిపి హయాంలో జరిగిన గోబెల్స్ ప్రచారం వంటి వాటిపై మాట్లాడారు కిరాక్ ఆర్పి. ఈ నేపథ్యంలో ఆయనకు త్వరలో ఓ మంచి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం ప్రారంభం అయింది. టిడిపి తో పాటు కూటమికి బలమైన మద్దతు దారుడుగా నిలుస్తున్నారు కిరాక్ ఆర్పి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం టార్గెట్ అయ్యారు.

* జబర్దస్త్ ద్వారా ఫేమస్..
ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు కిరాక్ ఆర్పి. తనదైన సొంత కంటెంట్తో.. మంచి టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించగలిగారు. అయితే జబర్దస్త్ షోలో ఉండగానే.. కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉండగానే పక్కకు తప్పుకున్నారు ఆర్పి. వ్యాపారంలో అడుగుపెట్టారు. నెల్లూరు చేపల వ్యాపారం పేరుతో బాగా ఫేమస్ అయ్యారు. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి వ్యతిరేకంగా గళం ఎత్తారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆర్పి.. జనసేన కుసైతం మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టిడిపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.

* సామాజిక స్పృహతో..
కేవలం నటుడిగానే కాకుండా సామాజిక స్పృహ కూడా ఉంది ఆర్పి కి. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల పేర్లను అలవోకగా చెప్పగల నేర్పరి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతంలో చేసిన సవాల్ కు ధీటుగా నియోజకవర్గాల పేర్లు చెప్పి అబ్బురపరిచారు. అయితే ఈసారి మహానాడులో వక్తగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆర్పీ మాట్లాడుతున్నంత సేపు చంద్రబాబు కూడా ఎంతగానో ఆసక్తి కనబరిచారు.. అందుకే పార్టీ పరంగా ఆయనకు గుర్తింపు ఇవ్వడంతో పాటు త్వరలో నామినేటెడ్ పోస్ట్ సైతం కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.