Home Blog Page 221

మూలాల్లోకి వెళ్తున్న పాకిస్తాన్.. ప్రపంచం ముందు తలవంచక తప్పదుగా..

Pakistan Indian Roots
Pakistan Indian Roots

Pakistan Indian Roots: మాది ముస్లిం దేశం. మాది ముస్లిం వ్యవహార శైలి.. మేము ఇస్లాం వ్యవహారాలను పాటిస్తూ ఉంటాం. మాకు అల్లా బోధనలు నిత్య కృత్యం.. ఖురాన్ మాకు అత్యంత పరమ పవిత్రం.. ఇదిగో ఇలా సాగిపోతుంటాయి పాకిస్తాన్ పాలకులు.. ఇతర వ్యక్తులు చెప్పే మాటలు. కానీ ఇస్లాం దేశాలకు.. పాకిస్తాన్ కు చాలా తేడా ఉంటుంది.

పాకిస్తాన్ పాలకులు చెబుతున్నట్టు అరబ్ సంస్కృతి ఉండదు. అలాగని మక్కా మదీనా మాదిరిగా వ్యవహారాలు కూడా వ్యవహారాలు సాగవు. దక్షిణాసియా మాదిరిగా ఇస్లాం మతం అక్కడ కనిపించదు. స్థూలంగా చెప్పాలంటే పాకిస్తాన్ థర్డ్ రేట్ అరబ్ కూడా కాదు. ముమ్మాటికి ఇండియన్ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ మన దేశం నుంచి వేరు పడిపోయింది. అంతేతప్ప మన మూలాల నుంచి కాదు.

పాకిస్తాన్ దేశంలో ప్రతి నగరాన్ని తరచి చూస్తే భారతీయ మూలాలు కనిపిస్తాయి.. కాకపోతే ఇస్లాం చాందసవాదులు పాకిస్తాన్ కోసం అనేక రకాలుగా మార్పు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మెజారిటీ మతంగా వ్యాప్తి చెందిన హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కాకపోతే వారు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ తన మూలాలను వెతుక్కునే పనిలో పడింది. ఆ మూలాలు కనుక వెలుగులోకి వస్తే పాకిస్తాన్ ప్రపంచం ముందు తలవంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇటీవల లాహోర్ నగరంలో అక్కడ హెరిటేజ్ ను కాపాడుకునేందుకు.. చరిత్రను పరిరక్షించుకునే పనులు చేస్తున్నారు. పాకిస్తాన్లో లాహోర్ అనేది అత్యంత కీలకమైన నగరం. ఈ నగరంలో ఉన్న ఇస్లాంపూర అనే ప్రాంతాన్ని కృష్ణా నగర్ గా మార్చేశారు. బాబ్రీ మసీద్ ప్రాంతాన్ని జైన్ మందిర్ గా మార్చారు. రెహమాన్ గల్లీ కాస్త రామ్ గల్లి అయిపోయింది. ఫాతిమా జీనా రోడ్డు క్వీన్స్ రోడ్డు అయిపోయింది.. మిగతా ప్రాంతాలకు కూడా పేర్లు మార్చే ప్రక్రియ అక్కడ జోరుగా సాగుతోంది. దీనికోసం 50 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు పెడుతున్నారు. గత ఎడాది మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ లాహర్లో ఈ పనికి శ్రీకారం చుట్టగా.. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది. మరియం పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఇటీవల కాలంలో మన దేశంలో త్రివేండ్రం పేరు కాస్త తిరువనంతపురం అయింది.. కలకత్తా పేరు కాస్త కోల్కతా అయింది. కేరళ పేరు కాస్త కేరళం అయిపోయింది.. ఇలా భారతదేశంలో మూలాలను పరిరక్షించుకునే పని మొదలైన నేపథ్యంలో.. పాకిస్తాన్ కూడా హెరిటేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ లాహోర్లో ఈ ప్రాంతాలను పేరు మార్చడం పట్ల ముస్లిం మత ఛాందసవాదులు రంగంలోకి వచ్చారు. ఇలా పేర్లు మార్చి లాహోర్ నగరాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అక్కడ కొద్దిరోజులుగా ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి మరియం వెనక్కి తగ్గడం లేదు.. ఆమెకు పాకిస్తాన్ ప్రధానమంత్రి సపోర్టు ఉంది. అయితే ఇది ఎక్కడదాకా దాడి తీస్తుందో తెలియదు గానీ.. పాకిస్తాన్ చేస్తున్న పని వల్ల ఇప్పుడు ఆ దేశ మూలాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. ఇన్నాళ్లపాటు భారత్ మీద నిత్యం విషం చిమ్మి.. లేనిపోని ప్రచారాలు చేసిన పాకిస్తాన్ పాలకులు.. వారికి అనుకూలంగా ఉండే ఉగ్రవాదులు ఇప్పుడు ప్రపంచం ముందు తల వంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

అమెరికాలో భారతీయులకు ఎంతకాలం ఈ జాతి వివక్ష.. వైరల్ వీడియో

Indian Discrimination In America
Indian Discrimination In America

Indian Discrimination In America: గూగుల్ సీఈఓ గా సుందర్ పిచాయ్ ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నాడు. ఇంకా అనేక మంది భారతీయులు అమెరికా దేశంలో పేరు పొందిన కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. చివరికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య కూడా భారతీయ మూలాలు ఉన్న మహిళ. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ప్రస్థానంలో భారతీయులు చాలామంది ఉన్నారు. ఇకముందు కూడా ఉంటారు.

అమెరికా ఆర్థిక అభివృద్ధిలో.. భారతీయులు విశేషమైన కృషి చేస్తున్నారు. కొంతమంది భారతీయులు అక్కడే స్థిరపడి అమెరికన్ పౌరులుగా కొనసాగుతున్నారు. అమెరికా రాజకీయాలలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఇంతటి ఖ్యాతి ఉన్న భారతీయులను అమెరికా దేశస్తులు చులకనగా చూస్తున్నారు. దారుణంగా మాట్లాడుతున్నారు. భారతీయులతో పోటీ పడలేక.. భారతీయుల మాదిరిగా కష్టపడి పని చేయలేక.. చివరికి ద్వేషాన్ని నమ్ముకున్నారు. ఒళ్ళు వంచి పని చేయడం చేతకాక.. నోటికి పని చెబుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ సంఘటనలు అనేకం జరిగాయి. భారతీయుల మీద అమెరికా దేశస్థులు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అమెరికా దేశస్థులు తీరు మార్చుకోవడం లేదు.

తాజాగా అమెరికాలో ఒక దారుణం జరిగింది. భారతదేశానికి చెందిన ఇద్దరు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అక్కడికి అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. “మీరు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. మీరు భారతీయులా” ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అడిగాడు.. దానికి వారు పెద్దగా సమాధానం చెప్పలేదు..”మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మీకు ఇండియా అంటే ఇష్టమైతే అక్కడే ఉండాలి కదా. ఇక్కడ దాకా రావడం ఎందుకు.. మీ దేశానికి వెళ్లిపోండి..”అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడాడు. అంతేకాదు పరుష పదజాలాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ భారతీయ కుటుంబం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అమెరికాలో భారతీయులకు భద్రత అనేది ఎండమావిలాగా మారుతుంది. అమెరికాలో పేరుపొందిన కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే భారతీయులకు అక్కడ ఆ స్థాయిలో గౌరవం లభించడం లేదు. పైగా వేధింపులు పెరిగిపోతున్నాయి. పని ప్రదేశాలలో భారతీయులు నరకం చూస్తున్నారు. కొన్ని సందర్భాలలో అమెరికా దేశస్తులు భారతీయులను అంతం కూడా చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో భౌతికపరమైన దాడులకు కూడా పాల్పడుతున్నారు..కష్టపడి పని చేయడమే భారతీయులకు శాపంగా మారింది.. అందువల్లే అమెరికా దేశస్తులు ఈ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా భారతీయుల మీద అమెరికా పౌరులు విపరీతమైన ద్వేషంతో ఉంటున్నారు.. ఇటీవల అమెరికా దేశస్థులపై భారతీయులు అక్కడి పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు అంతగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఐస్ క్యూబ్స్ తో జ్యూస్ మాత్రమే కాదు.. ఇవి కూడా చేయొచ్చు.. తెలుసుకోండి..

Ice Cubes Uses
Ice Cubes Uses

Ice Cubes Uses: మన ఇళ్లలో సాధారణంగా ఐస్ క్యూబ్స్‌ను జ్యూస్, కూల్‌డ్రింక్స్ లేదా నీటిని చల్లగా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ చిన్న ఐస్ ముక్కల్లో ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇంటి పనుల నుంచి చర్మ సంరక్షణ వరకు ఐస్ క్యూబ్స్ ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన విధంగా ఉపయోగిస్తే ఇవి రోజువారీ సమస్యలకు సులభమైన పరిష్కారంగా మారుతాయి. అవేంటో చూద్దాం..

చాలామంది బట్టలు ఉతికిన తర్వాత అవి ఎక్కువగా మడతలు పడటంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా షర్ట్లు, టాప్స్ వంటి దుస్తులు ఇస్త్రీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే డ్రై మోడ్‌లో ఉన్న వాషింగ్ మెషిన్‌లో మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి పది నిమిషాలు ఉంచితే ఆవిరి ఏర్పడి బట్టలపై ఉన్న మడతలు తగ్గుతాయి. దీంతో బట్టలు మరింత సాఫ్ట్‌గా కనిపిస్తాయి. సమయం ఆదా కావడంతో పాటు ఇస్త్రీ పని కూడా తక్కువ అవుతుంది.

చిన్నపిల్లలు లేదా కొందరు పెద్దలు కూడా అనుకోకుండా చూయింగ్ గమ్‌ను బట్టలకు, సోఫాలకు లేదా జుట్టుకు అంటించుకుంటుంటారు. దీన్ని తీసేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఐస్ క్యూబ్ ఎంతో ఉపయోగపడుతుంది. గమ్‌పై కొద్దిసేపు ఐస్ క్యూబ్ రుద్దితే అది గట్టిపడుతుంది. తర్వాత దాన్ని సులభంగా తీసేయవచ్చు. ఇలా చేయడం వల్ల బట్టలు లేదా ఇతర వస్తువులు దెబ్బతినకుండా ఉంటాయి.

మాంసాహారం వండినప్పుడు పైన కొవ్వు పొరలా తేలుతూ ఉంటుంది. చాలా మంది దీనిని తీసేయడానికి ఇబ్బంది పడతారు. అయితే ఒక ఐస్ క్యూబ్‌ను టిష్యూ పేపర్ లేదా గుడ్డలో చుట్టి ఆ కొవ్వు మీద మెల్లగా తిప్పితే, చల్లదనం కారణంగా కొవ్వు గట్టిపడి కాగితానికి అంటుకుంటుంది. దీంతో వంటలో అదనపు ఆయిల్ తగ్గి తినడానికి తేలికగా ఉంటుంది.

కొన్నిసార్లు ముల్లు, చిన్న గాజు ముక్కలు లేదా సూదిలాంటి పదార్థాలు చర్మంలో గుచ్చుకుంటాయి. వాటిని తీసేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఐస్ క్యూబ్ రాస్తే చర్మం మొద్దుబారుతుంది. దీంతో నొప్పి తక్కువగా అనిపిస్తుంది. అయితే గాయాలు తీవ్రమైతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

ఇంట్లో పెంచే చిన్న మొక్కలకు ఒకేసారి ఎక్కువ నీరు పోస్తే కొన్ని సార్లు వేర్లు దెబ్బతింటాయి. అలాంటి సమయంలో మట్టి మీద ఐస్ క్యూబ్స్ ఉంచితే అవి నెమ్మదిగా కరిగి మొక్కలకు తగినంత తేమను అందిస్తాయి. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్‌కు ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో నీరు వృథా కాకుండా కూడా ఉంటుంది.

చర్మంపై వాపులు, అలసట లేదా కళ్ల కింద ఉబ్బరం ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్‌తో మెల్లగా మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చల్లదనం కారణంగా రక్త ప్రసరణ మెరుగుపడి వాపు తగ్గుతుంది. అలాగే ముఖం తాజాగా కనిపించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అయితే ఐస్‌ను నేరుగా ఎక్కువసేపు చర్మంపై ఉంచకుండా గుడ్డలో చుట్టి వాడడం మంచిది.

సాధారణంగా కనిపించే ఐస్ క్యూబ్స్ కేవలం చల్లదనం కోసం మాత్రమే కాకుండా, ఇంటి పనులు, ఆరోగ్యం, అందం, శుభ్రత వంటి అనేక పనుల్లో ఉపయోగపడతాయి. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే చిన్న చిన్న సమస్యలకు సులభ పరిష్కారంగా మారతాయి. అందుకే ఐస్ క్యూబ్స్‌ను కేవలం ఫ్రిజ్‌లో ఉండే చల్లని ముక్కలుగా కాకుండా, బహుముఖ ఉపయోగాలున్న గృహ చిట్కాగా కూడా చూడవచ్చు.

మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అడ్డంగా బుక్కయ్యారా?!

Vijaya Sai Reddy
Vijaya Sai Reddy

Vijayasai Reddy: ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఒకవైపు విచారణ చేపడుతుండగా.. సమాంతరంగా ఈడి కూడా దర్యాప్తు చేస్తోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ మాజీ నేత విజయసాయిరెడ్డిని పిలిచి మరి విచారణ చేసింది ఈడి. ఏకంగా ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది. విజయసాయిరెడ్డిని ఈడి విచారణ చేపట్టడం ఇది మూడోసారి. అయితే ఈసారి విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ చుట్టూ విచారణ కొనసాగినట్లు సమాచారం. గతసారి ఈడి తనిఖీల సమయంలో విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ ను ఈడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డి ఎదుట ఆ సెల్ ఫోన్ లో ఉన్న వివరాలను ఫోరెన్సిక్ నిపుణులు క్లోనింగ్ చేపట్టారు. ల్యాబ్ నివేదిక వచ్చిన వెంటనే మరోసారి విజయసాయిరెడ్డిని విచారించే అవకాశం ఉంది.

* ఏడు గంటల పాటు విచారణ..
దాదాపు 7 గంటల పాటు ఈడి ఎదుట ఉండిపోయారు విజయసాయిరెడ్డి. హైదరాబాదులోని ఈడీ కార్యాలయం వద్ద ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు అనంతరం మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి అసలు తనను విచారణ చేపట్టలేదని.. తన సమక్షంలో ఫోన్లో ఉన్న వివరాలను తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ల్యాబ్ నివేదిక వచ్చిన వెంటనే మరోసారి సమన్లు జారీ చేసి తనను పిలిచే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి స్వయంగా పేర్కొనడం విశేషం. అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని.. మొత్తం వ్యవహారం నడిపింది రాజ్ కసిరెడ్డి అని.. ఈ విషయం ఎన్నిసార్లు అడిగినా చెబుతానని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి.

* ఫోన్ లోనే చిట్టా అంతా..
అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోన్ కీలకంగా మారింది. ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి ద్వారా జరిగిన లావాదేవీల లోగుట్టులు బయటపడే అవకాశం ఉంది. మద్యం కంపెనీల విషయంలో తాను మధ్యవర్తిత్వం వహించానని.. ఇప్పటికే పలుమార్లు హింట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఏకంగా ఆయన సెల్ఫోన్ దొరకడంతో ఈడి అధికారులు డొంక మొత్తం కదిలించనున్నారు. విజయసాయిరెడ్డి నేరుగా చెప్పడం కంటే తన సెల్ ఫోన్ ద్వారా మొత్తం గుట్టు రట్టు చేశారు అనడం వాస్తవం. వైసిపి హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ పై ఉన్నారు. అంటే మద్యం కుంభకోణంలో ఆయన అప్రూవర్ గా మారారు అన్నమాట. కానీ తనకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని.. తాను అప్రూవర్ గా మారలేదని చాలాసార్లు చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ తన సెల్ ఫోన్ చుట్టూ విచారణ కొనసాగుతోందని.. మరోసారి ఇది తనను పిలిచే అవకాశం ఉందని స్వయంగా విజయసాయిరెడ్డి ధ్రువీకరించడం విశేషం.

మద్యం కుంభకోణం.. జగన్ పిఎ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

AP Liquor Scam
AP Liquor Scam

AP Liquor Scam: ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించారు. వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారం కూడా జరిగినట్టు తేలడంతో.. ఈ వ్యవహారంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. వారి వద్ద నుంచి కీలకమైన ఆధారాలు సేకరించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి.. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బులను వేరే వాటిలో పెట్టుబడులుగా పెట్టినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మని లాండరింగ్ కూడా చోటుచేసుకుందని దర్యాప్తు బృందం అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇప్పుడు ఏకంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి మీద దృష్టి సారించారు. విజయవాడలో గురువారం 9 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయనను విచారించారు. ఆయన బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులు వివరాలు కూడా సేకరించారు. నాగేశ్వర్ రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బులతో తన కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది..

నాగేశ్వర్ రెడ్డి మీద కొంతకాలంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టిసారించారు. నాడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగేశ్వర్ రెడ్డి మద్యం కుంభకోణం లో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో నాగేశ్వర్రెడ్డి మాటకు ఎదురులేకుండా పోయిందని.. పైగా మద్యం కుంభకోణంలో ఇతడు ముఖ్య పాత్ర పోషించాడని తెలుస్తోంది.. విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఏ క్షణమైన సరే నాగేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏపీ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇదే కనుక జరిగితే తర్వాత టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అని రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తదుపరి అడుగులు ఎలా వేస్తారో చూడాల్సి ఉంది.

గొర్రెలు కాస్తారా.. నెలకు 1.1 లక్షలు ఇస్తారు..

Sheep Herder Salary In China
Sheep Herder Salary In China

Sheep Herder Salary In China: శీర్షిక చదివి ఆశ్చర్యపోతున్నారా.. గొర్రెలు కాస్త నెలకు 1.1 లక్షలు ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా.. మీరు ఎలా అనుకున్న సరే మీరు చదివింది నూటికి నూరు శాతం నిజం. కేవలం జీతం మాత్రమే కాదు.. వసతి కల్పిస్తారు. ఇంకా కొన్ని రకాల ప్రయోజనాలు కూడా అందిస్తారు.. నేటి కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ.. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ స్థిరత్వం లేకుండా పోతుంది. పైగా కంపెనీలు అడ్డగోలుగా తీసివేయడంతో ఉద్యోగం అనేది ఎండ మావిలాగా మారిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం వల్ల జీవితానికి ఆర్థిక స్థిరత్వం లేకుండా పోతుంది.

ఇటువంటి విపత్కర పరిస్థితిలో గొర్రెలు కాసే వాళ్లకు ప్రతినెల 1.1 లక్షలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అయితే ఈ స్థాయిలో వేతనం ఇస్తున్నది మనదేశంలో కాదు. మన పక్కనే ఉన్న చైనాలో. చైనా దేశంలో గొర్రెల కాపరులకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లే అక్కడ గొర్రెలను కాయడానికి ప్రతినెల 1.1 లక్షలు వేతనంగా ఇచ్చేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. దానికి సంబంధించిన ప్రకటనను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త విపరీతంగా సర్కులేట్ అవుతుంది. ఇప్పటికే ఆ ప్రకటన కోట్లల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.

చైనా దేశంలో జూవో జియోవో యాంగ్ అనే వ్యక్తికి విస్తారంగా గొర్రెలు ఉన్నాయి. అయితే వాటిని మేపడానికి కాపరులు కావాలి. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపరులుగా పని చేయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని అతడు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. కాపరులుగా పని చేసే వ్యక్తులకు ప్రతినెల 1.1 లక్షలు వేతనంగా ఇస్తానని.. వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు. అతడు చేసిన ప్రకటన విపరీతంగా చర్చకు దారితీసింది. అంతేకాదు చాలామంది తాము కాపరులుగా పని చేస్తామని ముందుకు వచ్చారు. ఇందులో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. చివరికి గొర్రెల కాపరులుగా పని చేయడానికి అయినా సిద్ధమేనని ముందుకు వస్తున్నారు. అయితే భారీగా దరఖాస్తులు రావడంతో.. వారు గొర్రెలు కాసే విధానాన్ని చూసిన తర్వాత పనిలోకి తీసుకుంటానని జివో చెబుతుండటం విశేషం.

గొర్రెల పెంపకం ద్వారా జివో భారీగా సంపాదిస్తుంటాడు. గొర్రెల మాంసంతో పాటు వాటి వెంట్రుకలను కూడా విక్రయిస్తుంటాడు. చైనాలో గొర్రెల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్లే జివో భారీగా గొర్రెలను సాకుతూ ఉంటాడు. ఇతడికి భారీ ఎత్తున గొర్రెల ఫామ్ లు ఉన్నాయి.

ఈ రాశుల వారికి ఈరోజు అరుదైన అవకాశాలు..

Today 23 June 2026 Horoscope
Today 23 June 2026 Horoscope

Today 29 may 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అరుదైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు తోటి వారి నుంచి పరిక లాభాలు ఉండలున్నాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. శక్తి సామర్థ్యానికి మించి పనులు ఉండే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. అయితే ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈరోజు గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేపట్టిన పనులు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు మాటలు మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు పై శుభవార్తలు వింటారు. అవసరమైన రుణాలు అందుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల దుబారా ఖర్చులను నియంత్రించాలి. తల్లితండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. స్నేహితులు బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారులకు పెద్దల అండదండలు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పడతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. వీరితో ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులను నమ్మొద్దు. రుణం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి లక్ష్మీదేవి అండదండలు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. దీంతో వ్యాపారులు కొత్తగా పెట్టుకోవడలు పెడతారు. ఉద్యోగులకు అవసరమైన ఆదాయం అందుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అదనంగా పనులు ఉంటాయి. వీటిని పూర్తి చేయడానికి తోటి వారి సహాయాన్ని తీసుకుంటారు. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో అన్ని సైనికుల ఫలితాలు ఉంటాయి. అయితే డబ్బు వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంటుంది..

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెట్టే పెట్టుబడులతో ప్రయోజనాలు ఉంటాయి. మానసికంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇతరుల సహాయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మాటల పనితీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తను అందుతాయి . కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈ రోజు పాత స్నేహితులు కలుస్తారు. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అవసరమనుకున్న డబ్బు అందుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

పెళ్ళి చేస్తామంటే ఎగిరి గంతులు వేశారు.. చివరికి ఈ ప్రసాదుల పరిస్థితి ఇలా అయిపోయింది..

Marriage Scam In Uttar Pradesh
Marriage Scam In Uttar Pradesh

Marriage Scam In Uttar Pradesh: బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరారు అంటారు. పాపం వీరి పరిస్థితి కూడా అలానే ఉంది. వయసు 30 దాటినా సరే పెళ్లి కాకపోవడంతో.. వారిలో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియడం లేదు. విద్యార్హత.. ఉద్యోగం.. ఆస్తి వంటివి ఉన్నప్పటికీ వారికి పెళ్లిళ్లు కావడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన ఉపయోగం ఉండడం లేదు. దీంతో పెళ్లిళ్ల పేరయ్యల దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ కల్యాణ తంతు జరగడం లేదు.

ఎడారిలో తిరుగుతున్న వాడికి ఓయాసిస్ తగిలినట్టు.. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి కొందరు తారసపడ్డారు. పెళ్లి చేస్తామని చెప్పారు. ఖర్చులకు 15000 ఇస్తే చాలు అన్నారు. అందమైన అమ్మాయిలు మీకోసం సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. దీంతో ఆ బ్రహ్మచారులు ఎగిరి గంతులు వేశారు. కళ్యాణం జరుగుతోందని సంబరపడ్డారు. ఖరీదైన బట్టలు కొనుక్కున్నారు. బంగారం.. ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేశారు. సరిగ్గా ఆరోజు రానే వచ్చింది. నిర్వాహకులు చెప్పిన వేదిక వద్దకు గుర్రాల మీద ఆ పెళ్ళికొడుకులు గా ముస్తాబై ఆ యువకులు వచ్చేసారు. కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో ఆ యువకులలో ఆందోళన పెరిగిపోయింది.

నిర్వాహకులను అడుగుదామంటే వారు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఆ నిర్వాహకులు చెప్పినట్టు అదేమీ నిజమైన పెళ్లి వేడుక కాదు. మోసం చేసేందుకు వారంతా ఈ ప్రణాళిక రూపొందించారు. ఏకంగా 42 మంది యువకుల వద్ద 15 వేల చొప్పున వసూలు చేశారు. చివరికి ప్లేటు ఫిరాయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు.

ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. చాలా రాష్ట్రాలలో అమ్మాయిలు లేక యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. వివాహాలు జరగని వారిని లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదని యువకులు వాపోతున్నారు. పెళ్లి జరుగుతుంది అంటే డబ్బులు చెల్లించామని.. చివరికి పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వారు చెబుతుండడం ఆవేదన కలిగిస్తోంది.

పాపం సన్ రైజర్స్.. కల చెదిరిపోయింది... గుండె పగిలిపోయింది

Sunrisers Hyderabad
Sunrisers Hyderabad

Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ జట్టుకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. హైదరాబాద్ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తారు. పరుగులను సునాయాసంగా తీస్తారు. అందువల్లే హైదరాబాద్ ప్లేయర్లను కాటేరమ్మ కొడుకులు అని పిలుస్తారు. మిగతా జట్లు ఆడుతున్నప్పుడు గెలిస్తే చాలు అనుకుంటాయి. కానీ హైదరాబాద్ జట్టు ఆడుతున్నప్పుడు గెలవడం మాత్రమే కాదు.. రికార్డులు బద్దలు ఎలా కొట్టాలో ఆలోచిస్తూ ఉంటుంది. అదే మిగతా జట్లను సన్ రైజర్స్ ను ప్రత్యేకంగా ఐపీఎల్లో చూపుతూ ఉంటుంది.

ఈ సీజన్లో కూడా హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడింది. గొప్ప గొప్ప జట్లను ఓడించి ప్లే ఆఫ్ దాకా వచ్చింది. దీంతో హైదరాబాద్ జట్టు ట్రోఫీ గెలుస్తుందని.. 2026 లో 2016 నాటి సీన్ రిపీట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను హైదరాబాద్ జట్టు ప్లేయర్లు తలకిందులు చేశారు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. అసలు ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇలా ఎందుకు ఆడారు.. ఆర్ ఆర్ ముందు ఎందుకు తలవంచారు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. భయంకరంగా బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. హెడ్ తన విశ్వరూపం చూపించలేకపోయాడు..క్లాసెన్ తన మార్క్ ఆట తీరును చూపించలేదు. ఇషాన్ మెరుపులు సరిపోలేదు. కీలకమైన ప్లేయర్లు చేతులెత్తేయడంతో హైదరాబాద్ జట్టు దారుణమైన ఓటమి మూట కట్టకుంది..

ఈ సీజన్లో క్లాసెన్ 624 పరుగులు చేశాడు. ఈశాన్ 602 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 563 పరుగులు చేశాడు. హెడ్ 410 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 302 పరుగులతో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇషాన్ మాలింగ 20 వికెట్లు సాధించాడు. సాకిబ్ 15 వికెట్లు, ప్రపుల్ 14.. శివాంగ్ తొమ్మిది.. కమిన్స్ ఎనిమిది వికెట్లను పడగొట్టారు. ఈ స్థాయిలో ఆడినప్పటికీ హైదరాబాద్ జట్టు అత్యంత కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఓడిపోవడం విశేషం. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ప్లే ఆఫ్ మ్యాచ్లో సరైన ప్రణాళికలు కూడా అమలు చేయలేకపోయింది హైదరాబాద్ జట్టు. ఫలితంగా ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది.

కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తరుపున కొంతమంది ఆటగాళ్లు సత్తా చూపిస్తే తిరుగు ఉండేది కాదు. ముఖ్యంగా టాస్ గెలిచినప్పుడు కెప్టెన్ వెంటనే బ్యాటింగ్ వైపు ఆసక్తి చూపించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ప్రధాన అవరోధం. బౌలింగ్లో వైవిద్యం లేకపోవడం కూడా జట్టు ఓటమికి కారణమైంది. అభిషేక్ శర్మ తేలిపోవడం హైదరాబాద్ జట్టు పతనానికి దారితీసింది.

సరిహద్దు ప్రాంతాలకు అమిత్ షా.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

Amit Shah Border Security Plan
Amit Shah Border Security Plan

Amit Shah Border Security Plan: ఒక దేశంలో అంతర్గత భద్రత పటిష్టంగా ఉంటేనే .. అక్కడి ప్రజలకు మెరుగైన జీవనం లభిస్తుంది. అలాకాకుండా అంతర్గత భద్రత ఇబ్బందికరంగా ఉంటే ప్రజల పరిస్థితి దారుణంగా ఉంటుంది. గతంలో మన దేశంలో అంతర్గత భద్రత అంత గొప్పగా ఉండేది కాదు. ముఖ్యంగా బిఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న 15 రాష్ట్రాలలో చొరబాట్లు ఉండేవి. ఫలితంగా ఆయుధాలు అక్రమంగా మనదేశంలోకి రవాణా అయ్యేవి. నకిలీ నోట్లు, మాదకద్రవ్యాలు వచ్చేవి. దీనివల్ల దేశంలో ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకునేవి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి భారీగా వలసలు ఉండేవి. మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ప్రజలకు మన దేశ పౌరసత్వం లభించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అస్సాం.. త్రిపుర రాష్ట్రాలలో కూడా బంగ్లాదేశ్ ప్రజలకు మన దేశ పౌరసత్వం సులభంగానే లభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలలో ఒక్క మతానికి సంబంధించిన జనాభా అధికంగా పెరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలలో ఒక మతానికి సంబంధించిన జనాభా అధికంగా పెరుగుతోందని.. దీనివల్ల సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన మాటలను చాలామంది తేలికగా తీసుకున్నారు.

ప్రధానమంత్రి ఆ మాటలను ఇప్పుడు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి మనదేశంలో ఉన్న 15 రాష్ట్రాల సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏకంగా కంచెలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ హై లెవెల్ కమిటీ అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలను పరిశీలిస్తుంది. ఒక మతంలో అధికంగా పెరుగుదల ఉంటే.. అది ఎందుకు సాధ్యమైందో లోతుగా విశ్లేషణ చేస్తుంది. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.

ఇప్పటికే హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ సరిహద్దులను పరిశీలించారు. మరోవైపు అస్సాం, త్రిపుర ప్రాంతాలలో ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారిని బయటికి పంపించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా పంపిస్తున్నారు. మిగతా ప్రాంతాలలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారని తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటించడం.. కంచె నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో.. ఇకపై చొర బాట్లు.. అక్రమ కార్యకలాపాలకు తావుండదని జాతీయ వాదులు చెబుతున్నారు.

ఆయేషా శర్మ అందాలు కేక..

Aisha Sharma Bold Look
Aisha Sharma Bold Look

అనుష్క.. బీచ్ లో నీ అందాలు కేక

Anushka Sen Beach Look
Anushka Sen Beach Look

ఎకరం 237 కోట్లు.. హైదరాబాద్ రాయదుర్గానికి ఎందుకంత డిమాండ్..

Rayadurg Land Auction 237 Crore Per Acre
Rayadurg Land Auction 237 Crore Per Acre

Rayadurg Land Auction 237 Crore Per Acre: హైదరాబాద్ పని అయిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది. హైదరాబాద్ స్థాయి హైడ్రా వల్ల నాశనం అయిందని గులాబీ పార్టీ నుంచి మొదలు పెడితే కొంతమంది సో కాల్డ్ యూట్యూబర్ల వరకు విష ప్రచారం చేస్తుంటారు కదా.. వారి నెత్తి మాసిన దిక్కుమాలిన ప్రచారానికి హైదరాబాదులో కోట్లు పలుకుతున్న భూముల ధరలే చెంపపెట్టు.

గత ఏడాది హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి 177 కోట్ల పలికింది. దీంతో చాలామంది ముక్కున వేలేసుకున్నారు. గతంలో కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమి 100 కోట్లు పలికింది. అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. సరిగ్గా గత ఏడాది రాయదుర్గంలో ఎకరం 177 కోట్ల పలకడం పాత రికార్డులను చెరిపి వేసింది. కొత్త రికార్డులను నమోదు చేసింది. వాస్తవానికి ఈ స్థాయిలో భూములకు ధర పలకడం హైదరాబాద్ నగరంలో సరికొత్త ఘనతలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.

రాయదుర్గంలో ఇప్పుడు టి జి ఐ ఐ సీ వేలం వేసిన భూములలో ఎకరం ధర 237 కోట్లు పలకడం సరికొత్త రికార్డులను సృష్టించింది. రాయదుర్గంలో ఈ స్థాయిలో భూములకు ధర పలకడం వెనక ఏం జరుగుతోంది.. అక్కడ ఏమైనా లంక బిందెలు ఉన్నాయా.. గోల్డ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా.. అనే ప్రచారం కూడా జరుగుతుంది. రాయదుర్గంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉండడానికి ప్రధాన కారణం.. ఇది హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉంటుంది. మియాపూర్ మెట్రో.. ఔటర్ రింగ్ రోడ్డు.. శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఐటి.. హెల్త్ కేర్.. లైఫ్ సైన్సెస్.. ఎడ్యుకేషన్.. ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్ గా ఉంది. దీంతో పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్లే రాయదుర్గం హైదరాబాద్ నగరానికి గుండెకాయ లాగా మారింది.

గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కూడా రాయదుర్గం ప్రాంతంలో విపరీతంగా ఏర్పాటు అవుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఆఫీస్ స్పేస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. గ్రేడ్ ఏ ఆఫీసు స్పేస్ లో చదరపు అడుగుకు అద్దె భారీగా పలుకుతోంది. భవిష్యత్ కాలంలో హైదరాబాద్ నగరంలో గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లు భారీగా ఏర్పాటయ్యే అవకాశం కల్పిస్తోంది. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్ వంటి విభాగాలలో జీసిసి సెంటర్లు ఇక్కడ ఏర్పాటు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాయదుర్గం హాట్ కేక్ లాగా మారింది. అందువల్లే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ భారీ అంతస్తులు నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ప్రాజెక్టులు కూడా భారీగా ఏర్పాటు అవుతున్నాయి. అందువల్లే వందల కోట్లు ఖర్చుపెట్టి భూములను కరుగులు చేస్తున్నాయి.

2017లో రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాలను ప్రభుత్వం వేలం వేస్తే 42.59 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది నాలెడ్జి సిటీ ప్రాంతంలో ఎకరం ధర 177 కోట్ల పలికింది. ఈ ఏడాది ఏకంగా ఆ ధర ఏకంగా 237 కోట్లకు చేరుకోవడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఎకరానికి 60 కోట్లు అదనంగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

మోక్షజ్ఞ సినిమా కోసం నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నాడా..?

Mokshagna Movie Update
Mokshagna Movie Update

Mokshagna Movie Update: బాలయ్య బాబు నట వారసుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి. గత సంవత్సరం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఒక సినిమాని కూడా అనౌన్స్ చేశారు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి తన ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికి ప్రేక్షకులు మాత్రం ఆ మాటలు నమ్మడం లేదు. ఎందుకంటే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి సంవత్సరం ముందే రావాల్సింది. ఇక ఇప్పుడు తనకి 30 సంవత్సరాల వయసుకు వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఏం చేస్తాడు…ఆయన ఏం చేసిన కూడా మరో 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ లోగా 40 సంవత్సరాల వయసుకి దగ్గరవుతాడు. అప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తాడు. అనేది కూడా తెలియాల్సి ఉంది.

నిజానికి మోక్షజ్ఞ కి సినిమా ఇండస్ట్రీకి రావడం ఇంట్రెస్ట్ లేకపోతే అది స్ట్రైయిట్ గా బాలయ్య బాబుకి చెప్పేసి కామ్ గా ఉంటే సరిపోతుంది. అలా కాదని ప్రతి నెలకొకసారి మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అయిపోతుంది అంటూ అభిమానుల్లో ఒక ఆనందాన్ని నింపి మళ్లీ అంతలోనే అది లేదు అంటూ అసంతృప్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

దీని వల్ల అటు అభిమానులతో పాటు, ఇటు నందమూరి ఫ్యామిలీ కూడా చాలా వరకు డిస్టబెన్స్ గా ఫీల్ అవుతున్నారు. ఇకప్రస్తుతం మోక్షజ్ఞ వల్ల బావ అయినా నారా లోకేష్ సైతం రంగంలోకి దిగి తన బామ్మర్దిని హీరోగా మార్చాలనే ప్రయత్నం చేయబోతున్నాడట. మోక్షజ్ఞ కోసం లోకేష్ స్వయంగా ఒక రెండు కథలను విని సెలెక్ట్ చేసి మరి పెట్టాడట.

మోక్షజ్ఞ ఆ కథలలో నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఇంతకీ ఈ సినిమాలను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు నందమూరి అభిమానులు మోక్షజ్ఞ కోసం ఎదురు చూశారు. కానీ ఇక మీదట వాళ్లకు ఎదురుచూసే అంత ఓపిక లేదు ఇప్పటికైనా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది. విమర్శలు వచ్చే ప్రమాదం కూడా ఉంది…

ఈ స్టార్ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారా..?

Star Directors Changing Music Directors
Star Directors Changing Music Directors

Star Directors Changing Music Directors: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ సాధించిన దర్శకులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే ఆ సినిమా కథతో పాటు ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఆ సినిమాకి ఉందా? లేదా అనేది కూడా తెలియాలి. దాంతో పాటుగా మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మన స్టార్ డైరెక్టర్లందరు తమ ఆ స్థాన దర్శకులందరిని మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సుకుమార్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా కోసం తన ఆస్థాన సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అతని ప్లేస్ లో ఎవ్వరిని తీసుకోబోతున్నాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినాన కూడా సంగీత దర్శకులు ఆ సినిమాకి అందించిన మ్యూజిక్ వల్ల సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ముందు దూసుకెళ్తున్న సుకుమార్ దేవిశ్రీప్రసాద్ మార్చడం పట్ల కొన్ని విమర్శలు వస్తున్నప్పటికి తను హీరోగా మారాడు కాబట్టి సుకుమార్ తనను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ సైతం ఆయన చేసిన నాలుగు సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు.

ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ హైలెట్ గా నిలిచాయి. ఆచార్య సినిమా కోసం మణిశర్మ ని దేవర సినిమా కోసం అనిరుధ్ ని తీసుకున్నాడు. ఇక ఇప్పుడు తను బాలయ్య బాబు తో చేస్తున్న సినిమా కోసం కూడా అనిరుధ్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తుంది…

మహానాడు టీడీపీకే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతికీ కోట్ల ‘పండుగ’

Mahanadu TDP Ads
Mahanadu TDP Ads

Mahanadu TDP Ads: మనకు అనుకూలమైన వ్యక్తి పీఠం మీద కూర్చుంటే చాలు ఏదైనా సరే సాగిపోతూ ఉంటుంది. ఏదైనా కాళ్ళ ముందుకు.. కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. పైగా ఆ సమయంలో అంతకు మించి అన్నట్టుగా నగదు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు ఎదురవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన ప్రభుత్వాలు ఉండడంతో ఈ రెండు పత్రికలకు దండిగా ప్రకటనలు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఈ పత్రికల యాజమాన్యాలు ఫస్ట్ పేజీలను విపరీతంగా ప్రచురిస్తున్నాయి. ఫుల్ పేజీ యాడ్స్ ను రంగురంగులలో ప్రింట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ మహానాడు ని కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు గట్టిగానే క్యాష్ చేసుకున్నాయి.

టిడిపి నేతలు పోటీపడి ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ఆంధ్రజ్యోతి , ఈనాడు పోటీపడి ఫస్ట్ పేజీలు ప్రింట్ చేస్తున్నాయి. మొత్తం జాకెట్ యాడ్స్ వస్తున్న నేపథ్యంలో కోట్లు దండుకుంటున్నాయి. మహానాడు నిన్న ప్రారంభమైంది. తొలి రోజు టిడిపిలో ఉన్న కొంతమంది మంత్రులు.. కీలక నాయకులు ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు.. గురువారం కూడా అదే స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. అందరికీ కూడా ఫస్ట్ పేజాడ్స్ ప్రయారిటీ కావడంతో.. రెండు పత్రికలు జాకెట్ యాడ్స్ కోసం మూడు నాలుగు ఫస్ట్ పేజీలను ముద్రించాయి.

ఇప్పుడున్న లెక్కల ప్రకారం స్క్వేర్ సెంటీమీటర్ 100ల లో ఉంటుంది.. అలాంటప్పుడు ఈ రెండు పత్రికలు ఒక్కో ఫుల్ పేజీ యాడ్ కు లక్షలలో వసూలు చేస్తూ ఉంటాయి. పైగా ఏపీ మొత్తం ఈ యాడ్స్ పబ్లిష్ అవుతుంటాయి కాబట్టి భారీగానే డబ్బులు వస్తుంటాయి. ప్రింట్ మీడియాకు మార్చి నుంచి మే నెల వరకు కాస్త గడ్డు పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మహానాడు వల్ల ఈ రెండు పత్రికలు పండగ చేసుకున్నాయి. కోట్ల ప్రవాహాన్ని పాలించుకున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో ఇలా ఫుల్ పేజీ యాడ్స్ పబ్లిష్ అవుతూ ఉండేవి. ఇప్పుడు అధికారంలో వైసీపీ లేదు కాబట్టి సాక్షి కరువు కాటకాలలో ఉంది. ఈనాడు.. జ్యోతి కి మాత్రం షడ్రసోపేతమైన భోజనం లభిస్తోంది. ఇంక మూడేళ్ల పాటు ఏపీలో కూటమి అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పండగే పండుగ.

ఎకరం 237 కోట్లు.. రికార్డులన్నీ బద్దలు.. హైదరాబాద్ లో జాగాలు కొనేదెలా?

Hyderabad Land Prices 2026
Hyderabad Land Prices 2026

Hyderabad Land Prices 2026: అప్పట్లో కోకాపేట ప్రాంతంలో భూములను వేలం వేసినప్పుడు ఎకరం 100 కోట్లు పోయింది. గత ఏడాది రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ధర 100 కోట్లకు మించిపోయింది. దీంతో యావత్ దేశం మొత్తం మన వైపు ఆశ్చర్యంగా చూసింది. ముంబై.. చెన్నై.. కోల్కతా.. పూణే వంటి మెట్రో నగరాలలో కూడా ఈ స్థాయిలో ధరలు లేవు. కానీ హైదరాబాదులో మాత్రం అంతకుమించి అనే స్థాయిలో భూములకు ధరలు పలికి.. సరికొత్త రికార్డులు నమోదవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

హైదరాబాద్ నగరంలో టీజీఐఐసి భూముల వేలం నిర్వహించింది. రాయదుర్గం ప్రాంతంలోని పాన్ మక్తా ఏరియాలోని సర్వేనెంబర్ 83/1 లో ఆరు ఎకరాల 29 గుంటల భూమికి వేలం వేస్తున్నారు.. ఎకరం భూమిని 237 కోట్లకు ఓ కంపెనీ కొనుగోలు చేసింది. ఇంకా ఈ భూమికి సంబంధించి వేలం జరుగుతున్న నేపథ్యంలో భారీగా సొమ్ములు ప్రభుత్వానికి సమకూరే అవకాశం కనిపిస్తోంది.

గత ఏడాది ఇదే ప్రాంతంలో 7.6 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. అప్పుడు ఎకరం ధర 177 కోట్లు పలికింది. నాడు ప్రభుత్వానికి ఏకంగా 1357.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ధర పలకడం విశేషం. హైదరాబాద్ నగరంలో పెద్దపెద్ద కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు సాగిస్తున్నాయి. భారీగా భవనాలను నిర్మిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం.. మంచిరేవుల.. నార్సింగి.. కోకాపేట.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. నేక్నాం పుర వంటి ఏరియాలలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఎకరం ధర 100 కోట్లలో ఉంది. అందువల్లే ఇక్కడ భారీగా భవనాలను నిర్మించడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస సముదాయాలు ఏర్పాటు కావడం.. ఐటీ కంపెనీలు
.. ఫార్మా కంపెనీలు.. ఫైనాన్షియల్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు. అందువల్లే ఇక్కడ నివాస సముదాయాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫలితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ భూములను కొనుగోలు చేసి భారీ స్థాయిలో భవనాలను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రాజ్ పుష్ప.. అపర్ణ.. మై హోమ్.. జనప్రియ వంటి కంపెనీలు అత్యంత భారీగా నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ భూములను వందల కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక ఎకరం వచ్చేసి 237 కోట్లు పలికిందంటే మామూలు విషయం కాదు. దీంతో యావత్ దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కాగా, ధరలు ఈ స్థాయిలో పెరిగితే హైదరాబాదులో సామాన్యులు జాగాలు కొనే పరిస్థితి ఉండదని.. నిపుణులు చెబుతున్నారు.