Home Blog Page 213

పెద్ది మూవీ లో విలన్ గా మొదట ఆ హీరోను అనుకున్నారా..?

Ram Charan
Ram Charan

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో విలన్ గా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మని తీసుకున్నారు. అయితే అతని స్థానంలో మొదట ఒక తెలుగు హీరోని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదు నిజానికి దివ్యేందు శర్మ ఈ సినిమాకి ఎంత బాగా సెట్ అయ్యాడనే విషయం పక్కనబెడితే అతని ప్లేస్ లో తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బండి సరోజ్ కుమార్ ని తీసుకోవాలనుకోవడం విశేషం… ఆయన నిర్బంధం, మాంగల్యం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అలాగే అతనికి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అతను ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యేవాడని బుచ్చిబాబు భావించాడు.

కానీ అతను తను మాత్రం తన సినిమాలోనే హీరోగా నటిస్తానని ఇతర హీరో సినిమాల్లో నటించలేనని కరాకండిగా చెప్పడంతో బుచ్చిబాబు దివ్యేందు శర్మ దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికైతే ఆ పాత్ర బండి సరోజ్ కుమార్ చేసి ఉంటే బాగుండేదేమో అని సినిమా చూడక ముందు నుంచే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో దివ్యేందు శర్మ పోషించిన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట.

అది హీరో రామ్ చరణ్ ను ఢీకొట్టే పాత్ర కావడంతో బండి సరోజ్ కుమార్ చేసి ఉంటే బాగుండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దివ్యేందు శర్మ కూడా చాలా మంచి నటుడు. ఆయన ఆ పాత్రలో బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడా…తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలిగాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక బుచ్చిబాబు ఇంతకు ముందు ఉప్పెన సినిమా చేశాడు. ఈ సినిమాతో 100 కోట్లు కలెక్షన్స్ ని కొల్లగొట్టినప్పటికి అతను పెద్ద హీరోని ఇప్పటివరకు హ్యాండిల్ చేయలేదు. ఇక రామ్ చరణ్ ను ఎలా హ్యాండిల్ చేశాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇకనుంచి టిడిపిలో ఎమ్మెల్సీలుగా వారికే ఛాన్స్!

TDP
TDP

TDP MLC Seats: తెలుగుదేశం పార్టీలో యువరక్తం ఎక్కించారు. పార్టీలోని అన్ని విభాగాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు . పొలిట్ బ్యూరోలో కొత్తవారిని నియమించారు. ముఖ్యంగా పార్టీలో యువ, మహిళా నాయకత్వం పెరుగుతూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు తమ వారసులకు అవకాశం ఇస్తున్నారు. అయితే సీనియర్ల సేవలను సైతం తెలుగుదేశం పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్లను శాసనమండలికి పంపించడం అనేది ఒక సంప్రదాయంగా టిడిపి మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనుభవజ్ఞుల సలహాలు రాజకీయంగాను, రాష్ట్ర ప్రయోజనాలపరంగా కీలకం. అందుకే ఇక్కడ నుంచి ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో సీనియర్లతోనే భర్తీ చేసేందుకు దాదాపు టిడిపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* ఆమోదించని రాజీనామాలు..
సాధారణంగా శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కూటమి బలం అక్కడ పదిమంది వరకు ఉంది. వైసిపి అధికారానికి దూరమయ్యే సమయంలో అక్కడ వైసిపి బలం దాదాపు 40 గా ఉండేది. క్రమేపి ఎమ్మెల్సీల రాజీనామాతో అది తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే దాదాపు ఓ ఏడుగురు ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించలేదు మండలి చైర్మన్. చివరకు కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే వారి రాజీనామాతో ఖాళీలు ఏర్పడితే కూటమి నేతలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే మండలిలో వైసీపీ బలం తగ్గి కూటమి బలం పెరుగుతుంది. అందుకే రాజీనామాలను ఆమోదించడం లేదు. ఈ రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం పార్టీలో సీనియర్లకు ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

* భారీగా ఖాళీలు..
2027- 28లో 25 మందికి పైగా వైసీపీ సభ్యులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ఆ జాబితాలో ఉన్నారు.వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యం. అందుకే ఎమ్మెల్సీ పదవులు ఈసారి సీనియర్ల కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంపు ఖాయం. ఎమ్మెల్యేలుగా జూనియర్ నేతలకు, వారసులకు ఛాన్స్ ఇచ్చి.. ఎమ్మెల్సీలుగా సీనియర్లకు అవకాశం కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

రెండు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఎవరికి ఏదీ బెస్ట్ అంటే..

Tata Tiago EV vs MG Comet EV
Tata Tiago EV vs MG Comet EV

Tata Tiago EV vs MG Comet EV: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ఇప్పటికే ఆదరణ పొందని హ్యాచ్ బ్యాక్ కార్లు ఇప్పుడు EVగా మారి మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో టాటా టియాగో EV (Tata Tiago EV), ఎంజి కామెట్ EV (MG Comet EV) అనే రెండు కార్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందాయి. అయితే, వీటి డిజైన్, పనితీరు మరియు వినియోగం పూర్తిగా భిన్నమైనవి. వీటి మధ్య ప్రధాన వ్యత్యాసాలు మరియు పనితీరుపై ఉన్న తేడాలు ఏవీ? వీటిలో ఏది బెటర్?

డిజైన్:
Tata Tiago EV ఒక పూర్తి స్థాయి 5 డోర్ల హ్యాచ్‌బ్యాక్. ఇది సాధారణ కార్ల మాదిరిగానే ఉంటుంది. కాబట్టి కుటుంబ అవసరాలకు, హైవే ప్రయాణాలకు ఎక్కువ మంది ప్రయాణించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి మంచి బూట్ స్పేస్ కూడా ఉంది.
MG Comet EV ఒక చిన్నకాంపాక్ట్ సిటీ కారు. ఇది కేవలం నగరంలో రోజువారీ చిన్న ప్రయాణాల కోసం, ఆఫీసు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇరుకైన గల్లీల్లో సులభంగా నడపడానికి దీనిని రూపొందించబడింది. దీని చిన్న పరిమాణం వల్ల పార్కింగ్ సమస్యలు ఉండవు. కానీ ఇది కేవలం చిన్న కుటుంబాలకు లేదా సింగిల్ యూజర్లకు మాత్రమే అనువుగా ఉంటుంది.

బ్యాటరీ:
టాటా టియాగో EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో 19.2 నుంచి 24 కిలోవాట్ వరకు ఉంటుంది. ఈ బ్యాటరీ 75 హార్స్ పవర్ ను అందిస్తుంది. అలాగే ఈ బ్యాటరీకి DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 226 నుంచి 285 కిలోమటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
ఎంజి కామెట్ EVలో 17.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది సుమారు 230km రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ పరిమితంగా ఉంటుంది. టియాగోతో పోలిస్తే కామెట్ పవర్ తక్కువ. ఇది కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం.

ఫీచర్లు, భద్రత :
టాటా టియాగో EVలో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా టాటా కార్లకు మంచి గుర్తింపు ఉంది. ఇది పటిష్టమైన బాడీ బిల్డ్‌ను కలిగి ఉంటుంది.
ఎంజి కామెట్ EVలో కూడా డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు వాయిస్ కమాండ్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఇది చాలా ఆధునికంగా అనిపిస్తుంది, కానీ భద్రత మరియు స్థలం పరంగా టియాగో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

కుటుంబంతో కలిసి దూర ప్రయాణం చేయాలని అనుకుంటే ‘టాటా టియాగో EV’ ఉత్తమమైన ఎంపిక. కార్యాలయ అవసరాలకు ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి, తక్కువ ఖర్చుతో కూడిన చిన్న కారు కావాలనుకుంటే ‘ఎంజి కామెట్ EV’ని ఎంచుకోవచ్చు.

చెత్తతో రూ.రూ.42 లక్షల కోట్ల సంపద.. త్వరపడండి

CEEW Report Waste Economy
CEEW Report Waste Economy

CEEW Report Waste Economy: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యను చాలా మంది భారంగా చూస్తుంటే.. అది భవిష్యత్తులో భారీ ఆర్థిక అవకాశంగా మారబోతోందని CEEW (Council on Energy, Environment and Water) తాజా అధ్యయనం వెల్లడించింది. వంటగది వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, పూలు, మాంసం అవశేషాలు, ఉద్యానవన వ్యర్థాలు వంటి సేంద్రియ చెత్తను సమర్థంగా నిర్వహిస్తే 2047 నాటికి దాదాపు 51 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లకు పైగా) మార్కెట్ ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత లక్ష్యానికి చెత్త సమస్య ఆర్థికంగా కీలకంగా మారవచ్చని CEEW అధ్యయనం తెలుపుతోంది . ప్రస్తుతం భారత నగరాలు ప్రతిరోజూ సుమారు 1.71 లక్షల టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో దాదాపు సగం సేంద్రియ వ్యర్థాలే. నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో 2047 నాటికి పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాల పరిమాణం ఏటా సుమారు 208 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ వ్యర్థాలను సరైన పద్ధతిలో ప్రాసెస్ చేస్తే కంపోస్ట్.. బయోగ్యాస్, బయో-సీఎన్‌జీ, సేంద్రియ ఎరువులు వంటి విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చు. దీంతో ఒకవైపు చెత్త సమస్య తగ్గడమే కాకుండా మరోవైపు స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు లభిస్తాయి. దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చని నివేదిక చెబుతోంది.

ఉద్యోగాల పరంగా కూడా ఈ రంగం భారీ అవకాశాలను కలిగి ఉంది. అనుకూల విధానాలు అమలైతే 2047 నాటికి సేంద్రియ వ్యర్థాల నిర్వహణ రంగంలో సుమారు 26 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని CEEW అంచనా వేసింది. వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్లాంట్ల నిర్వహణ, సాంకేతిక సేవలు, బయోగ్యాస్ ఉత్పత్తి, ఎరువుల తయారీ వంటి అనేక విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.

పర్యావరణ పరంగా కూడా ఈ మార్పు ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చెత్తను బహిరంగంగా కాల్చడం వల్ల నగరాల్లో హానికరమైన PM2.5 కాలుష్యంలో దాదాపు 10 శాతం వరకు వాటా ఉందని అధ్యయనం పేర్కొంది. అలాగే సేంద్రియ వ్యర్థాలు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోవడం వల్ల మీథేన్ వంటి హరిత గృహ వాయువులు విడుదలవుతున్నాయి. వీటిని ప్రాసెస్ చేయడం ద్వారా గాలి కాలుష్యం, దుర్వాసన, అగ్ని ప్రమాదాలు, భూగర్భ జలాల కలుషితాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

అధ్యయనం ప్రకారం.. సరైన విధానాలతో 95 శాతం పట్టణ సేంద్రియ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేయగలిగితే 2047 నాటికి సుమారు 68 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి కొనసాగితే వ్యర్థాల రంగం నుంచి వెలువడే ఉద్గారాలు మరింత పెరిగి 120 మిలియన్ టన్నుల స్థాయికి చేరవచ్చని హెచ్చరించింది.

ఈ రంగం అభివృద్ధికి సుమారు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని CEEW పేర్కొంది. ఇందుకోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు, గ్రీన్ బాండ్లు, హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్లు వంటి వినూత్న ఆర్థిక విధానాలను ప్రోత్సహించాలని సూచించింది. అలాగే చెత్తను ఇంటి వద్దే వేరు చేయడం, నగరాల స్థాయిలో ఖచ్చితమైన డేటా సేకరణ, నాణ్యత ఆధారిత ఒప్పందాలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వంటి అంశాలు విజయానికి కీలకమని తెలిపింది.

ఇప్పటివరకు పర్యావరణ సమస్యగా భావించిన చెత్తనే భారత్ భవిష్యత్తులో ఆర్థిక వనరుగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. సరైన విధానాలు, సాంకేతికత, పెట్టుబడులు అందుబాటులోకి వస్తే చెత్త కుప్పలు ఉద్యోగాలు, ఆదాయం, స్వచ్ఛమైన ఇంధనం, పరిశుభ్రమైన నగరాలకు మార్గం చూపే ‘గ్రీన్ ఎకానమీ’ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థినులకు గొప్ప వరం..

Kerala Government
Kerala Government

Kerala Government: కేరళంలో అధికారంలోకి వచ్చిన కొత్త UDF ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్యార్థినుల ఆరోగ్యం, ఉద్యోగినుల హక్కుల పరిరక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, అనాథల సంక్షేమం వంటి అంశాలను కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవులు ఎందుకంటే?

రుతుక్రమ సమయంలో అనేక మంది విద్యార్థినులు శారీరక, మానసిక అసౌకర్యాలను ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజుల ప్రత్యేక రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థినుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వారి విద్యపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

మహిళా ఉద్యోగులకు కుటుంబం, ఉద్యోగం మధ్య సమతుల్యత కల్పించేందుకు జీతంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రసవానంతర కాలంలో తల్లి, శిశువు ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, ఈ సెలవులు మహిళలకు మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు శిశు సంరక్షణకు తగిన సమయం కల్పిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఉద్యోగిణుల కోసం మరో కీలక నిర్ణయంగా, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలు, సంస్థల్లో నాణ్యమైన డేకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. చిన్నపిల్లలను చూసుకునే బాధ్యతతో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితులు రాకుండా చేయడం, మహిళల ఉపాధి అవకాశాలను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

కేరళను “అనాథలు లేని రాష్ట్రం”గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలు, అనాథ పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించేందుకు దత్తత ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది. సమాజంలో ప్రతి చిన్నారికి భద్రత, ప్రేమ, విద్య లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ నిర్ణయాలన్నీ మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా భావిస్తున్నారు. రుతుక్రమ సెలవులు, ప్రసూతి సెలవులు, డేకేర్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు మహిళల జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మహిళా సంక్షేమం, బాలల సంరక్షణ, అనాథల పునరావాసం వంటి అంశాల్లో కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమాలు విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మహిళలకు మరింత అనుకూలమైన, సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణం వైపు కేరళ మరో ముందడుగు వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

'డీఎస్సీ 2025' పై వైసిపి వద్ద ఆధారాలు ఉన్నాయా

YSRCP Allegations DSC
YSRCP Allegations DSC

YSRCP Allegations DSC: ఏపీలో డీఎస్సీ 2025 పై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో.. ఏపీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ప్రారంభించింది. స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. అయితే ఆధారాలు దొరికితే న్యాయపోరాటమైన చేయాలి. అలా చేయడం లేదు సరి కదా ఫేక్ ఐడి లతో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మందికి పైగా ఆందోళనతో గడుపుతున్నారు. కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే డీఎస్సీ ప్రక్రియపై బురద జల్లుతున్నారు అని ఉపాధ్యాయలుగా నియమితులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి పశువులు చేయొద్దని కోరుతున్నారు..

* ఏడాది కిందట పూర్తయిన ప్రక్రియ..
ఏడాది కిందట డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నోటిఫికేషన్ అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. వందలాది పిటిషన్లు కూడా కోర్టుల్లో దాఖలు చేశారు. కానీ పగడ్బందీగా అటు యంత్రాంగం.. ఇటు ప్రభుత్వం వ్యవహరించడంతో సకాలంలో ఈ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయింది. ఎక్కడికక్కడే ఉపాధ్యాయులు నియామకం కూడా జరిగిపోయింది. ఏడాది పాటు విద్యా బోధన కూడా పూర్తి చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవో సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం చూసి ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా డీఎస్సీ పై బురదజల్లేశారు.

* ఒక్క ఉపాధ్యాయుని నియమించలేదు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక్క డీఎస్సీ నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. ఒక్క ఉపాధ్యాయుడిని భర్తీ చేయలేదు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డీఎస్సీ అని 2019 ఎన్నికలకు ముందు చెప్పారు. దీంతో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అహోరాత్రులు శ్రమించారు కూడా. కానీ ఒక్క డీఎస్సీ కూడా తీయలేదు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నోటిఫికేషన్ అంటూ హడావిడి చేశారు. అది కూడా 6000 ఉపాధ్యాయ పోస్టులతోనే. ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కాకముందే నిలిచిపోయింది. కూటమి వచ్చిన తర్వాత ఆ 6000 పోస్టులకు మరో 10 వేలు పోస్టులను కలుపుతూ మెగా డీఎస్సీ ప్రకటించింది ప్రభుత్వం. నియామక ప్రక్రియను సజావుగా పూర్తిచేసింది.

* ఫేక్ ప్రచారం..
ఇటీవల నీట్ ప్రశ్న పత్రాలు లీకు అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డీఎస్సీ నియామకాల్లో సైతం అవకతవకలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. దానిని రాజకీయంగా మలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిపై ఆరోపణలు చేసేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. దీంతో 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో గడపాల్సి వస్తోంది. అహోరాత్రులు శ్రమించి ఉపాధ్యాయులుగా ఎంపిక అయితే ఇప్పుడు తమ చుట్టూ రాజకీయం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఆధారాలు లేవు. అవే ఉంటే న్యాయపోరాటం చేసేది. కానీ ఫేక్ ప్రచారంతో మాత్రం ఉపాధ్యాయులను ఆందోళనలో నెడుతోంది.

బొల్లా బ్రహ్మనాయుడు.. ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్ కు పడిపోయారా!

Bolla Brahmanaidu
Bolla Brahmanaidu

Bolla Brahmanaidu: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది గండిపేట భూముల వివాదం. ఏకంగా 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేయాలని స్కెచ్ వేసి అడ్డంగా బుక్కయ్యారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండ ఎమ్మెల్యేగా వైసిపి హయాంలో ఐదేళ్ల పాటు కొనసాగారు. ఇప్పుడు ఏకంగా 12 ఎకరాల ప్రభుత్వ భూమిని.. అదే ప్రభుత్వ జీవోలను మార్చి కాజేయాలని చూశారు. భూమి ఆక్రమణ వరకు ఓకే… కానీ ప్రభుత్వ జీవోలను మార్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పట్లో ఉన్న రెండు ప్రభుత్వాల సహకారంతోనే ఆయన ఈ బరితెగింపునకు పాల్పడి ఉంటారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాతనే ఆయనలో ఈ కోణం బయటపడటం విశేషం.

* డైరీ రంగంలో దిగ్గజం.
బొల్లా బ్రహ్మనాయుడు అంటే డైరీ రంగంలో ది గ్రేట్ అన్నట్టు ఉండేది. శూన్యంలో ఉన్న తిరుమల డైరీ ని లాభాల బాట పట్టించిన ఘనత ఆయనది. ఆ డైరీలో తన వాటాలను విక్రయించి రెండు వేల కోట్ల రూపాయలు పొందారు. వందల కోట్ల వ్యాపారాలతో హాయిగా గడిచిపోతుంది ఆయన జీవితం. అటువంటిది హైదరాబాద్ శివారులలో గండిపేట వద్ద 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ జీవోలను మార్చి.. తన భూమి అన్నట్టు చూపి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అరెస్టు కాక తప్పదు కూడా.

* వైసీపీలో చేరిన తర్వాత..
ఒక మంచి పేరుతో పాటు పరపతిని సొంతం చేసుకున్నారు బ్రహ్మానాయుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు ఇటువంటి బుద్ధి పుట్టినట్టు ఉంది. ఎందుకంటే వ్యాపారంతో పాటు తన వ్యక్తిత్వాన్ని సైతం ఆయన కాపాడుకుంటూ వచ్చారు. కానీ అదే వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టి.. గౌరవాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుని కబ్జాలు, ఆక్రమణలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బొల్లా బ్రహ్మనాయుడు అంటే ఒక కబ్జాకోరుగా చూస్తున్నారు. ఐదేళ్లపాటు వినుకొండ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ భూ వివాదంతో ఐదేళ్ల ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో వినుకొండలో చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరింత మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

బాలయ్య బాబు చిన్న కూతురు.. పోలా అదిరిపోలా.. ఇలా షేక్ చేసిందేంటి? వైరల్ డ్యాన్స్ వీడియో

Nandamuri Tejaswini Dance Video
Nandamuri Tejaswini Dance Video

Nandamuri Tejaswini Dance Video: సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది చెరగని ముద్ర. ఆ కుటుంబ మహిళలు రాజకీయాల్లో సైతం రాణించగలుగుతున్నారు. వ్యాపారాల్లో సైతం అగ్రగామిగా నిలిచారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని డాన్స్ తో ఇరగదీసారు. ప్రస్తుతం ఆమె డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కొరియోగ్రాఫర్ తో లయబద్ధంగా డాన్స్ చేస్తున్న వీడియో అదరగొడుతోంది. నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా సినిమాలతో పాటు పబ్లిక్ ఫంక్షన్లలో తేజస్విని కనిపించింది అరుదు. కానీ ఇటీవల తన తండ్రి నటించిన సినిమా నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా డాన్స్ వీడియోతో అదరగొట్టారు.

* ఒక్కొక్కరిది ఒక్కో రూటు..
నందమూరి బాలకృష్ణ కు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు కోడలు. మంత్రి లోకేష్ భార్య. ప్రస్తుతం వాణిజ్య వేత్తగా రాణిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల బాధ్యతలను చూస్తున్నారు. రెండో కుమార్తె తేజస్విని సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. దశాబ్ద కాలం కిందట విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీ భరత్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రీ భరత్ విశాఖ ఎంపీగా కూడా ఉన్నారు. ఇక బాలకృష్ణ ఒక్కగానొక్క కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. అయితే గతంలో తేజస్విని ఓ టీవీ యాడ్లో కనిపించారు. తరువాత ఆమె నటన వైపు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు స్టెప్పులతో అలరించారు. ప్రొఫెషనల్ డాన్సర్ మాదిరిగా ఇరగదీశారు.

* తండ్రికి తగ్గ తనయగా..
నందమూరి బాలకృష్ణ కు ప్రస్తుతం 66 సంవత్సరాలు. అయినా సరే తనలో జోష్ తగ్గలేదని నిరూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన కుమార్తె తేజస్విని స్టెప్పులతో వీర విహారం చేస్తుండడంతో అనేక అంచనాలు వెలువడుతున్నాయి. తనకు ఉన్న ప్రతిభకు.. సినీ రంగంలోకి ప్రవేశిస్తారా అని అడుగుతున్న వారు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే సినిమాల్లో రాణిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్ ప్రతిభతో ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే ఇప్పుడు తేజస్విని సైతం డాన్స్ తో అదరగొట్టారు. సోషల్ మీడియాను షేక్ చేశారు. బాలయ్య బాబు బిడ్డ అంటే అట్లా ఉంటది అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

హార్ముజ్‌ ఓపెన్‌... ట్రంప్‌ తీపికబురు!

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంపింపజేసిన హార్ముజ్ జలసంధి సమస్యలో కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్‌ మీడియా సంస్థ అయిన ట్రూత్ సోషల్‌లో చేసిన ప్రకటన ప్రపంచానికి ఊరటనిచ్చింది. యుద్ధ సమయంలో అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్‌ను ఎత్తేస్తున్నట్లు, జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించారు. ఇది దీర్ఘకాలిక ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చలకు కొత్త బాట వేసే వ్యూహాత్మక నిర్ణయం.

ట్రంప్ సందేశం..
ట్రంప్ తన పోస్ట్‌లో స్పష్టంగా చెప్పినట్లు, చిక్కుకున్న నౌకలు ఇక సురక్షితంగా ఇంటికి వెళ్లవచ్చు. “మీ భార్యలు, భర్తలు, పేరెంట్స్, కుటుంబాలకు మీ ఫేవరెట్ ప్రెసిడెంట్ అయిన నా తరఫున హలో చెప్పండి” అని ఆయన రాయడం ద్వారా మానవీయ స్పర్శను జోడించారు. ఇది ట్రంప్ శైలి బలప్రయోగం ద్వారా ఒత్తిడి తెచ్చి, ఆ తర్వాత చర్చల ద్వారా ఫలితాలు సాధించడం. ఈ ప్రకటన వెనుక ఉన్న వాస్తవాలు మరింత లోతుగా ఉన్నాయి. 2026లో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యల నేపథ్యంలో హార్ముజ్‌లో బ్లాకేడ్ విధించింది. దీని వల్ల ప్రపంచ ఆయిల్ సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడి, ధరలు పెరిగి, గ్లోబల్ సప్లై చైన్‌లు స్తంభించాయి. ఇప్పుడు ట్రంప్ బ్లాకేడ్‌ను ఎత్తేయడం, సీజ్‌ఫైర్‌ 60 రోజులు పొడిగింపు, ఇరాన్ అణు కార్యక్రమం పరిమితి వంటి అంశాలపై చర్చలు ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచం ఊపిరి పీల్చుకుంది..
హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడి చమురు రవాణాలో సుమారు 20 నుంచి 25 శాతం ఈ మార్గంగుండా సాగుతుంది. బ్లాకేడ్ సమయంలో ఈ ట్రాఫిక్ నామమాత్రపాలైంది. ఇప్పుడు తెరవడంతో:ఆయిల్ ధరలు స్థిరపడి, ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థలు (ముఖ్యంగా ఆసియా దేశాలు) ఊరట పొందతాయి. చిక్కుకున్న వందలాది నౌకలు, వాటి సిబ్బంది కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, చైనా వంటి దేశాలు ఈ పరిణామాన్ని సానుకూలంగా చూస్తున్నాయి.

పూర్తి విజయం కాదు..
బ్లాకేడ్ ఇరాన్‌పై మాత్రమే కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అంటే, ఒప్పందం పూర్తి కాకపోతే మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ట్రంప్ యొక్క ‘ఆర్ట్ ఆఫ్ డీల్’ట్రంప్ ఎప్పుడూ బలం ద్వారా చర్చలకు రావాలని నమ్మేవాడు. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి, ఆ తర్వాత ఒప్పందం వైపు తీసుకెళ్లడం ఆయన వ్యూహం. ఇది స్వల్పకాలిక ఊరటనిస్తుంది కానీ, ఇరాన్ అణు సమస్య, ప్రాంతీయ స్థిరత్వం వంటి మూల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇంకా చాలా దూరం నడవాలి. ఇరాన్ వైపు నుంచి పూర్తి స్పందన ఇంకా స్పష్టంగా రాలేదు. కానీ చర్చలు జరుగుతున్నాయన్నది సానుకూల సంకేతం. ప్రపంచం ఇప్పుడు ఒక్క విషయం కోరుకుంటోంది ఈ ఒప్పందం దీర్ఘకాలిక శాంతిని తెచ్చి, హార్ముజ్‌ను ఎప్పటికీ సురక్షితమైన మార్గంగా మార్చాలి.

ట్రంప్ ప్రకటన యుద్ధ భయాల నుంచి శాంతి వైపు మలుపు తిప్పిన ముఖ్యమైన అడుగు. అయితే ఇది మొదటి అడుగు మాత్రమే. పూర్తి ఒప్పందం, అమలు, పరస్పర విశ్వాసం లేకపోతే ఈ ఊరట తాత్కాలికంగానే మిగులుతుంది. ప్రపంచం ఇప్పుడు ట్రంప్-ఇరాన్ చర్చల తదుపరి అడుగుల వైపు ఆసక్తిగా చూస్తోంది. శాంతి సాధ్యమైతే అది కేవలం మధ్యప్రాచ్యం కాక, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బహుమతి అవుతుంది.

రమేష్ బాబు హీరోగా మహేష్ బాబు క్లాప్ కొట్టిన ఆ సినిమా ఆగిపోయిందా..?

Ramesh Babu
Ramesh Babu

Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. తన వారసులు సైతం ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండడం విశేషం… కృష్ణ పెద్ద కుమారుడు అయిన రమేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఫేడ్ ఔట్ అయిపోయాడు. అతనికి అనుకున్న సక్సెసులైతే రాలేదు. 1999 సంవత్సరంలో ‘భూలోకవీరుడు జగదేక సుందరి’ అనే ఒక సినిమా ఓపెనింగ్ అయితే జరిగింది. కొద్దిరోజుల పాటు షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆ సినిమాని ఆపివేశారు. అయితే ఈ సినిమాను 1999 జూన్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. దానికి మొదటి క్లాప్ ని మహేష్ బాబు కొట్టడం విశేషం… ఇక ఈ సినిమాని జానపద చిత్రంగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికి అది వర్కౌట్ కాలేదు.

ఇక ఇంద్రజ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని కూడా తెలియజేశారు. అయినప్పటికి ఈ సినిమా ముందుకైతే సాగలేదు. ఇక జానపద బ్రహ్మ విఠలాచార్య కొడుకు అయిన శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది.

నిజానికి ఈ సినిమా కనుక చేసి ఉంటే రమేష్ బాబు ఒక మంచి సక్సెస్ ని అందుకొని హీరోగా తన పరను కొనసాగించేవాడు అంటూ ఇప్పటికీ కృష్ణ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. ఇక మహేష్ బాబు మాత్రం ఆచి తూచి సినిమాలను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరును కూడా సంపాదించుకున్నాడు.

రమేష్ బాబు ను హీరోగా నిలబెట్టలేకపోయిన కృష్ణ మహేష్ బాబు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాడు. ప్రతి సినిమా కథని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అతనితో సినిమా చేయించే ప్రయత్నాలైతే చేశాడు. మొత్తానికైతే మంచి సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఆర్బిఐ కీలక నిర్ణయం.. ఇకపై కరెన్సీ నోట్లు ఉండవు

RBI Plastic Currency Notes
RBI Plastic Currency Notes

RBI Plastic Currency Notes: కరెన్సీ నోట్లు చూడగానే చాలామందికి ఒక రకమైన ఆనందం.. ఆసక్తి ఉంటాయి. ఆగర్భ శ్రీమంతుడి నుంచి మొదలు పెడితే పేదవాళ్ల వరకు కరెన్సీ నోట్లు చూస్తే మురిసిపోతారు. వాటిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారు. తడిసిపోయినా.. వాటిని వేరే విధంగా మడతపెట్టినా.. అవి చినిగిపోతాయని భయపడిపోతుంటారు. పైగా కొంతకాలంగా అసలు నోట్లను పోలివున్న నకిలీ నోట్లు మార్కెట్లో విపరీతంగా కనిపిస్తున్నాయి.

నకిలీ నోట్లకు చెక్ పెట్టే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను ఎక్కువ కాలం ఉండేవిధంగా.. ఆత్యాధునిక ఫీచర్లతో ప్లాస్టిక్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగం తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

కోవిడ్ తర్వాత మన దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. చిన్న స్థాయిలో మాత్రమే యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయి. డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిగితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి పెడతారని చాలామంది భావిస్తున్నారు. అందువల్లే వ్యాపారులు నగదు ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాలలో ధర తగ్గించి చెల్లింపులు స్వీకరిస్తున్నారు.

ఇక మనదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయం అంతగా లేదు. స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా తక్కువగానే ఉంది. అందువల్లే ఆన్లైన్ చెల్లింపులు తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. అందువల్లే నగదు వినియోగం పెరిగిపోతున్నది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మన దేశంలో 42.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఇది 11.5% ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అందువల్లే రిజర్వ్ బ్యాంకు ప్లాస్టిక్ కరెన్సీ ని తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది.. ఇక మనదేశంలో పాత, చినిగిన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్వంసం చేస్తూ ఉంటుంది. వాటి స్థానంలో కొత్త నోట్లోను విడుదల చేస్తూ ఉంటుంది. 2023 – 24 సంవత్సరంలో కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,101 కోట్లను ఖర్చుపెట్టింది.

2024 -25 సంవత్సరంలో కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు ఏకంగా 6372 కోట్లకు పెరిగింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల వ్యయం ఎక్కువైంది. ఇక ఇటీవల కాలంలో పాట్నా, ముంబై నగరాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశాలు నిర్వహించింది. అక్కడ ప్లాస్టిక్ కరెన్సీ విషయం గురించి చర్చ నడిచింది. అయితే ముందుగా 10, 20 నోట్లను ప్లాస్టిక్ విధానంలో విడుదల చేయాలని.. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా.. మిగతా నోట్లకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బట్టలిప్పేసి అర్థరాత్రి టాలీవుడ్ నటుడి వీరంగం...వైరల్ వీడియో...

Srikanth Iyengar
Srikanth Iyengar

Srikanth Iyengar: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు వాళ్లు చేసే పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిలో విశేషమైన మన్ననలను పొందుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ అయ్యంగర్ ప్రతి పాత్రతో తను చాలా వరకు పాపులారిటి సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బ్రోచేవారు ఎవరురా’ సినిమాతో ఆయనకు చాలా మంచి ఫేమైతే దక్కింది. ఇక అలాంటి శ్రీకాంత్ అయ్యంగర్ గత కొన్ని రోజుల నుంచి ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు. కావాలనే తను కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకని ఆయన అలా చేస్తున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మరోసారి బట్టలిప్పుకొని వీడియో చేసి వార్తల్లో నిలిచాడు. ఆయన ఆ వీడియోలో ఏం మాట్లాడడంటే షర్ట్ లేకుండా వీడియోని రికార్డ్ చేస్తున్నాడు అనుకోకండి… ఏదో వర్కౌట్ కెళ్ళి అలసిపోయాను షర్టు లేకుండా వీడియో చేస్తున్నాను. దీన్ని రాద్ధాంతం చేసి షర్ట్ లేకుండా వీడియో చేశాడంటూ అనే కథనాలు పెట్టకండి అంటూ ఆయన మాట్లాడాడు. నిజానికి శ్రీకాంత్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో ఆయనకు అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు.

కారణం ఏంటి అంటే ప్రతి సారి ఎవర్నో ఒకరిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరికి పెద్దగా నచ్చడం లేదు. దాని వల్లే ఆయన మీద చాలా వరకు నెగెటివిటి వస్తుంది. దానివల్ల అతన్ని సినిమాల్లో తీసుకోవడానికి ఆయా దర్శకులు భయపడిపోతున్నారు.

కారణమేంటి అంటే నెగెటివిటి రావడం వల్ల ఆయా సినిమాల్లో అతను నటిస్తే సినిమా మొత్తానికి దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని సినిమాల్లో తీసుకోవడానికి కూడా దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు… ఒక నటుడు అంటే చాలా డిగ్నిటిని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలి. అంతే తప్ప కాంట్రవర్సీ లను క్రియేట్ చేసిన వాళ్లను ఎవ్వరు పట్టించుకోరు. వాళ్లకి ఇండస్ట్రీ అవకాశాలు కూడా తగ్గిపోతాయి…

ఇంతకు ముందు చాలా మంది నటులు ఇలాంటి వాటినే ఎంచుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఫేడ్ ఔట్ అయిపోయారు. మరి శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పటికైనా తన బాటను మార్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి పాత్రలు చేయగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

రేయ్ బుడ్డోడా.. ఏడవకురా.. నిన్ను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి

Vaibhav Suryavanshi Emotional
Vaibhav Suryavanshi Emotional

Vaibhav Suryavanshi Emotional: తన తోటి ఓపెనర్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. కీలకమైన వన్ డౌన్ ఆటగాడు కొద్ది పరుగులు మాత్రమే చేసి వెనక్కి వెళ్లిపోయాడు. కెప్టెన్ చేతులెత్తేశాడు. మిగతా ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఓపెనర్ గా వచ్చిన అతడు దాదాపు చివరి వరకు ఉన్నాడు. ఏకంగా 96 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. తాను సెంచరీ కోల్పోయినప్పటికీ.. తిరుగులేని తెగువ చూపించాడు.

ఈ ఉపోద్ఘాతం మొత్తం వైభవ్ సూర్య వంశి గురించి. రాజస్థాన్ ఆటగాడిగా అతడు ఈ ఐపిఎల్ సీజన్లో తిరుగులేని రికార్డులను సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసి తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి గుజరాత్ గట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో అదరగొట్టాడు. జట్టు కోసం చివరి వరకు గట్టిగా నిలబడ్డాడు. అయితే మిగతా ప్లేయర్ల నుంచి అతడికి అంతగా సపోర్ట్ లభించలేదు. అయినప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

భారీగా పరుగులు చేసినప్పటికీ గుజరాత్ జట్టు చేతిలో రాజస్థాన్ ఓడిపోవడంతో వైభవ్ సూర్య వంశీ లో దుఃఖం కట్టలు తెంచుకుంది. అతడు తన ఆవేదన తట్టుకోలేక.. జట్టు ఓడిపోవడంతో మైదానంలో కూర్చుండిపోయాడు.. బౌండరీ లైన్ వద్ద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించేందుకు సూర్య వంశీ ప్రాణం పెట్టి ఆడాడు.

గుజరాత్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చివరి వరకు నిలబడ్డాడు. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఎంత ఓపికతో పరుగులు సాధించాడు. గుజరాత్ మందు రాజస్థాన్ 200కు పైగా టార్గెట్ విధించింది అంటే దానికి ప్రధాన కారణం సూర్య వంశీ. కానీ ఫైనల్ చేరుకునే క్రమంలో ఒక్క అడుగు దూరంలో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది.

రాజస్థాన్ జట్టు ఓటమిని అతడు తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే అతడికి ఆట మీద.. జట్టు మీద ఈ స్థాయిలో డెడికేషన్ ఉండడం పట్ల క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి ఆటగాడు ఈ తరంలో ఉండడం గొప్ప విషయమని వ్యాఖ్యానిస్తున్నారు.

రిచెస్ట్‌ రీజినల్‌ పార్టీ టీడీపీ.. ఇన్వెస్ట్‌ పార్టీ వైసీపీ!

TDP Richest Regional Party
TDP Richest Regional Party

TDP Richest Regional Party: దేశంలో రిచెస్ట్‌ రీజినల్‌ పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆదాయంతో రికార్డు సృష్టించింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, టీడీపీ రూ.228.31 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మొత్తం 36 పార్టీల ఆదాయంలో సుమారు 19.14% వాటా. ఇది టీడీపీకి మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అధికారం సాధించిన తర్వాత పార్టీ ఆర్థిక బలం ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. అయితే, ఈ నివేదిక మొత్తం రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను, పారదర్శకత లోపాన్ని కూడా బయటపెడుతోంది.

పార్టీల వారీగా ఆదాయం..
టీడీపీ రూ.228.31 కోట్లు మొదటి స్థానంలో ఉండగా, టీఎంసీ రూ.219.35 కోట్లుతో రెండో స్థానంలో ఉంది. వైఎస్సార్‌సీపీ రూ.140.39 కోటుతో మూడోస్థానంలో ఉంది. 36 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.1,192.94 కోట్లు ఉంది.

ఖర్చుల్లో వైసీపీ ఫస్ట్‌..
ఇక డబ్బులు ఖర్చు చేయడంలో వైసీపీ రూ.340 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బీజేడీ రూ.288 కోట్లు, టీఎంసీ రూ.228 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా 21 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి

టాప్‌ ఐదు పార్టీలు మొత్తం ఆదాయంలో 69 శాతం వాటా, ఖర్చుల్లో 77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇది రాజకీయ ఆర్థిక అసమానతలను స్పష్టంగా చూపిస్తోంది.

టీడీపీ ఆదాయం పెరగడానికి కారణం..
టీడీపీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో సాధించిన భారీ విజయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ దాతలు, వ్యాపారవేత్తలు, సభ్యుల నుంచి వచ్చిన విరాళాలు భారీగా పెరిగినట్లు అనిపిస్తోంది. ఇది రాజకీయంగా విజయవంతమైన పార్టీలకు ఆర్థిక లాభాలు ఎలా అందుతాయో చూపే ఉదాహరణ.అయితే, వైఎస్సార్‌సీపీ ఖర్చు ఆదాయం కంటే దాదాపు రెట్టింపు ఉండటం ఆసక్తికరం. ఎన్నికల ప్రచారం, సంక్షేమ కార్యక్రమాలు, సభలు, ఆస్తి నిర్వహణ ఇవన్నీ భారీ ఖర్చులకు దారితీశాయి. ఇలాంటి లోటు దీర్ఘకాలంలో పార్టీని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తుంది.

ఆడిట్‌ రిపోర్టు ఇవ్వని పార్టీలు..
దేశంలో 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, కేవలం 36 మాత్రమే ఆడిట్‌ రిపోర్టులు సమర్పించాయి. మిగిలిన 31 పార్టీలు ఇంకా నివేదికలు అందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజా సంస్థలు కాబట్టి, వాటి ఆర్థిక వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. ఎన్నికల బాండ్లు రద్దు అయిన తర్వాత కూడా రాజకీయ నిధుల మూలాలు పూర్తిగా స్పష్టంగా లేవు. ఎవరు ఎంత ఇచ్చారు, ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతోంది ప్రజలకు తెలియాలి. లేకపోతే, రాజకీయాలు కొన్ని కార్పొరేట్‌ సమూహాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

బలం మంచిదే, కానీ బాధ్యత కూడా టీడీపీ రికార్డు సాధించడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సానుకూల అభివృద్ధిగా చూడవచ్చు. అయితే, ఇది రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలో మాత్రమే కాకుండా, ఆ బలాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలా ఉపయోగించాలో కూడా గుర్తు చేస్తుంది ఏడీఆర్‌.నివేదికలు ప్రజాస్వామ్యానికి అద్దంగా ఉంటాయి. కానీ ఆ నివేదికలు పూర్తిగా రావాలంటే అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన చట్టాలు, స్వతంత్ర ఆడిట్, పూర్తి పారదర్శకత అమలు చేయాల్సిన అవసరం ఈ గణాంకాలు మరోసారి ఉద్ఘాటిస్తున్నాయి.

రెండుసార్లు అలానే.. సాయి సుదర్శన్ చేతులు అంత వీకా..

Sai Sudharsan Hit Wicket
Sai Sudharsan Hit Wicket

Sai Sudharsan Hit Wicket: ఒకసారి జరిగితే దురదృష్టం అనుకుంటాం. మళ్లీ అదే జరిగితే దరిద్రం అనుకుంటాం. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ విషయంలో ఇదే జరుగుతోంది. అతడి నిర్లక్ష్యం కొంపముంచుతోంది. ఇటీవల క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బెంగళూరు చేతిలో హిట్ వికెట్ గా సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు.

14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డఫీ బౌలింగ్లో.. అతడు హిట్ వికెట్ గా వెను తిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయింది. చివరికి బెంగళూరు జట్టు ముందు తలవంచింది.. సాయి సుదర్శన్ అలా అవుట్ కావడం పట్ల గుజరాత్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలా జరిగింది ఏంటని బాధ పడ్డారు.

రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు.. ఏకంగా 58 పరుగులు చేసి జోరు మీద కనిపించాడు. తొలి వికెట్ కు గిల్ తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో.. బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో హిట్ వికెట్ గా అవుట్ అయ్యాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.

బెంగళూరు చేతిలో.. రాజస్థాన్ చేతిలో వరుసగా రెండుసార్లు హిట్ వికెట్ గా ఔట్ కావడంతో సాయి సుదర్శన్ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయాడు. బంతిని గట్టిగా కొట్టే క్రమంలో రెండుసార్లు కూడా అతడి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. అంతేకాదు వికెట్ల మీద పడిపోయింది. ఫలితంగా అతడు నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

సాయి సుదర్శన్ అలా అవుట్ కావడంతో గుజరాత్ కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం చేశాడు.. అలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ మండిపడ్డాడు. చేతుల్లో బలం లేదా.. పటుత్వం తగ్గిపోయిందా.. అంటూ కామెంట్లు చేశాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత సాయి సుదర్శన్ వ్యవహారంపై వ్యాఖ్యాత ప్రశ్నించగా.. దానికి గిల్ తనదైన శైలిలో స్పందించాడు.

సాయి సుదర్శన్ చేతికి ఇకపై ప్లాస్టర్లు వేస్తామని.. అప్పుడైనా కనీసం బ్యాట్ సమర్థవంతంగా పట్టుకుంటాడని వ్యాఖ్యానించాడు. దీంతో మైదానంలో నవ్వులు వెల్లి విరిశాయి.. ఐపీఎల్ లో బ్యాటర్లు అందరూ బౌలర్ల చేతుల్లో అవుట్ అయితే.. సాయి సుదర్శన్ మాత్రం తన వికెట్ తను తీసుకోవడం.. అది కూడా రెండుసార్లు అలానే జరగడం నిజంగా ఆశ్చర్యకరం.

టచ్లోకి కాంగ్రెస్ అగ్ర నేతలు.. జగన్ ఆలోచన అదే!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ఒక బద్ధ శత్రువుగా చూడడంతో జగన్ విషయంలో బిజెపి కూడా సానుకూల వైఖరితోనే ఉండేది. ఒక ప్రాంతీయ పార్టీగా దానిని చూసుకుంటూ వచ్చింది. స్నేహితుడిగా చంద్రబాబు ఉన్నా.. ఆయన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్నర్ గానే ఉండేది. ఏపీ రాజకీయ పరిణామాలు దృష్ట్యా బిజెపి సైతం చూసి చూడనట్టుగా ఉంటూ వచ్చింది. అటు తన ప్రత్యర్థి భాగస్వామ్య పార్టీ అయిన బిజెపి విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే వెళ్లేవారు. ఇలా పరస్పరం సానుకూలత నడుమ బిజెపి, వైసిపి ఇన్నేళ్లపాటు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. వైసిపి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో చూస్తాం అంటే బిజెపికి కుదిరే పని కాదు. బిజెపి ద్వారా కొన్ని రకాల రాజకీయ ప్రయోజనాలు పొందుతామంటే వైసీపీకి కుదరదు.

* బిజెపి మనసు మారుతోంది..
కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి విషయంలో బిజెపి అలా సానుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు టిడిపి కీలక భాగస్వామి. ఆ పార్టీ అవసరం బిజెపికి ఉంది. అందుకే టిడిపికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది బిజెపి. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత తగ్గించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారు. బిజెపితో ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలిపారు. తాజాగా ప్రత్యేక ఓటరు సవరణ జాబితాను కూడా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీకి దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చారు.

* విరుద్ధ భావజాలం..
బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది విరుద్ధ భావజాలం. నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు ఆ రెండు పార్టీలకు. అలాగని సానుకూలతను ఎల్లకాలం కొనసాగించలేవు. రాజకీయంగా అది రెండు పార్టీలకు మైనస్ కాక తప్పదు. పైగా ఏపీలో కూటమి స్ట్రాంగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జాతీయస్థాయిలో మరోకూటమిగా ఉన్న కాంగ్రెస్ తో స్నేహం చేయక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చారు. కలిసికట్టుగా ఉంటే ఏపీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జగన్ మనసు మారినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

YS Sharmila Rajya Sabha Seat
YS Sharmila Rajya Sabha Seat

YS Sharmila Rajya Sabha Seat: వైయస్ షర్మిల కు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం ప్రారంభం అయింది. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. కీలక చర్చలు కూడా జరిపారు. ఒకవైపు కర్ణాటక రాజకీయంతో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్న తరుణంలో షర్మిలను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలను పిలిచిన రాహుల్ గాంధీ ఏపీ విషయంలో కీలక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ముందుగా షర్మిల కు ప్రమోషన్ కల్పించి.. ఆమె ద్వారా ఏపీ రాజకీయాలను మార్చాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

* అప్పట్లోనే హామీ..
షర్మిలకు రాజ్యసభ పదవి హామీ ఇప్పటిది కాదు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు షర్మిల. ఆ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి షర్మిల పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలకు ఆమెకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు హై కమాండ్. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే కచ్చితంగా రాజ్యసభ పదవి ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అక్కడ మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యకు రాజ్యసభ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. ఎందుకంటే సీఎం గా ఉన్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చివరిగా మిగిలిన పదవి షర్మిలకు ఇస్తారని తెలుస్తోంది.

* వైయస్ అభిమానుల్లో సంతృప్తి..
షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైయస్ అభిమానులను సంతృప్తి పరచాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో పూర్వ కాంగ్రెస్ నాయకులంతా హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలకు రాజ్యసభ పదవి ఇచ్చి.. ఆమెను ప్రోత్సహించి పార్టీని అభివృద్ధి చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేతల పిలుపుతో షర్మిల ఢిల్లీ వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ పదవి ఎంపికపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.