Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila Rajya Sabha Seat: షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

YS Sharmila Rajya Sabha Seat: షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

YS Sharmila Rajya Sabha Seat: వైయస్ షర్మిల కు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం ప్రారంభం అయింది. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. కీలక చర్చలు కూడా జరిపారు. ఒకవైపు కర్ణాటక రాజకీయంతో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్న తరుణంలో షర్మిలను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మూడు […]

YS Sharmila Rajya Sabha Seat: వైయస్ షర్మిల కు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం ప్రారంభం అయింది. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. కీలక చర్చలు కూడా జరిపారు. ఒకవైపు కర్ణాటక రాజకీయంతో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్న తరుణంలో షర్మిలను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలను పిలిచిన రాహుల్ గాంధీ ఏపీ విషయంలో కీలక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ముందుగా షర్మిల కు ప్రమోషన్ కల్పించి.. ఆమె ద్వారా ఏపీ రాజకీయాలను మార్చాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

* అప్పట్లోనే హామీ..
షర్మిలకు రాజ్యసభ పదవి హామీ ఇప్పటిది కాదు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు షర్మిల. ఆ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి షర్మిల పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలకు ఆమెకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు హై కమాండ్. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే కచ్చితంగా రాజ్యసభ పదవి ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అక్కడ మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యకు రాజ్యసభ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. ఎందుకంటే సీఎం గా ఉన్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చివరిగా మిగిలిన పదవి షర్మిలకు ఇస్తారని తెలుస్తోంది.

* వైయస్ అభిమానుల్లో సంతృప్తి..
షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైయస్ అభిమానులను సంతృప్తి పరచాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో పూర్వ కాంగ్రెస్ నాయకులంతా హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలకు రాజ్యసభ పదవి ఇచ్చి.. ఆమెను ప్రోత్సహించి పార్టీని అభివృద్ధి చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేతల పిలుపుతో షర్మిల ఢిల్లీ వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ పదవి ఎంపికపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper