Homeక్రీడలుక్రికెట్‌Sai Sudharsan Hit Wicket: రెండుసార్లు అలానే.. సాయి సుదర్శన్ చేతులు అంత వీకా..

Sai Sudharsan Hit Wicket: రెండుసార్లు అలానే.. సాయి సుదర్శన్ చేతులు అంత వీకా..

Sai Sudharsan Hit Wicket: ఒకసారి జరిగితే దురదృష్టం అనుకుంటాం. మళ్లీ అదే జరిగితే దరిద్రం అనుకుంటాం. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ విషయంలో ఇదే జరుగుతోంది. అతడి నిర్లక్ష్యం కొంపముంచుతోంది. ఇటీవల క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బెంగళూరు చేతిలో హిట్ వికెట్ గా సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డఫీ బౌలింగ్లో.. అతడు హిట్ వికెట్ గా వెను తిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు తీవ్రమైన ఒత్తిడిలో […]

Sai Sudharsan Hit Wicket: ఒకసారి జరిగితే దురదృష్టం అనుకుంటాం. మళ్లీ అదే జరిగితే దరిద్రం అనుకుంటాం. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ విషయంలో ఇదే జరుగుతోంది. అతడి నిర్లక్ష్యం కొంపముంచుతోంది. ఇటీవల క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బెంగళూరు చేతిలో హిట్ వికెట్ గా సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు.

14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డఫీ బౌలింగ్లో.. అతడు హిట్ వికెట్ గా వెను తిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయింది. చివరికి బెంగళూరు జట్టు ముందు తలవంచింది.. సాయి సుదర్శన్ అలా అవుట్ కావడం పట్ల గుజరాత్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలా జరిగింది ఏంటని బాధ పడ్డారు.

రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు.. ఏకంగా 58 పరుగులు చేసి జోరు మీద కనిపించాడు. తొలి వికెట్ కు గిల్ తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో.. బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో హిట్ వికెట్ గా అవుట్ అయ్యాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.

బెంగళూరు చేతిలో.. రాజస్థాన్ చేతిలో వరుసగా రెండుసార్లు హిట్ వికెట్ గా ఔట్ కావడంతో సాయి సుదర్శన్ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయాడు. బంతిని గట్టిగా కొట్టే క్రమంలో రెండుసార్లు కూడా అతడి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. అంతేకాదు వికెట్ల మీద పడిపోయింది. ఫలితంగా అతడు నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

సాయి సుదర్శన్ అలా అవుట్ కావడంతో గుజరాత్ కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం చేశాడు.. అలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ మండిపడ్డాడు. చేతుల్లో బలం లేదా.. పటుత్వం తగ్గిపోయిందా.. అంటూ కామెంట్లు చేశాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత సాయి సుదర్శన్ వ్యవహారంపై వ్యాఖ్యాత ప్రశ్నించగా.. దానికి గిల్ తనదైన శైలిలో స్పందించాడు.

సాయి సుదర్శన్ చేతికి ఇకపై ప్లాస్టర్లు వేస్తామని.. అప్పుడైనా కనీసం బ్యాట్ సమర్థవంతంగా పట్టుకుంటాడని వ్యాఖ్యానించాడు. దీంతో మైదానంలో నవ్వులు వెల్లి విరిశాయి.. ఐపీఎల్ లో బ్యాటర్లు అందరూ బౌలర్ల చేతుల్లో అవుట్ అయితే.. సాయి సుదర్శన్ మాత్రం తన వికెట్ తను తీసుకోవడం.. అది కూడా రెండుసార్లు అలానే జరగడం నిజంగా ఆశ్చర్యకరం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper