Home Blog Page 212

వెంకటేష్ చేయాల్సిన ఈ మూడు సినిమాలను చిరంజీవి, బాలయ్య, నాగార్జున చేశారా..?

Venkatesh
Venkatesh

Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు తన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ తను సినిమాలను చేస్తూ ఉంటాడు. అలాంటి వెంకటేష్ చేయాల్సిన ఒక మూడు సినిమాలను చిరంజీవి, బాలయ్య, నాగార్జున ముగ్గురు చేసి ప్లాప్ లను మూటగట్టుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు…ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే… చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన ‘డాడీ’ సినిమా కథను మొదట వెంకటేష్ కోసం అనుకున్నారు. కానీ అది అనుకోకుండా చిరంజీవితో చేయాల్సి వచ్చింది. నిజానికి సినిమా ఓకే అనిపించినప్పటికి వెంకటేష్ తో చేసి ఉంటే సినిమా బాగా ఆడుండేదని వెంకటేష్ స్వయంగా చిరంజీవికి చెప్పారట.

ఈ విషయాన్ని చిరంజీవి ఒక ఈవెంట్లో బహిరంగంగా చెప్పడం వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి నిదర్శనం అనే చెప్పాలి… ఇక బాలయ్య బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘గొప్పింటి అల్లుడు’ సినిమా మొదట వెంకటేష్ కోసం అనుకున్నారు.

కానీ వెంకటేష్ డేట్స్ లేకపోవడం వల్ల బాలయ్య బాబుతో చేయాల్సి వచ్చింది. అయితే ఆ సినిమాలో వెంకటేష్ కోసం మొదలు కామెడీ ట్రాక్ ని రాసుకున్నారు. కానీ బాలయ్య బాబు హీరో అవ్వడంతో ఆ ట్రాక్ మొత్తాన్ని చేంజ్ చేయడం వల్ల సినిమాలో సోల్ చెడిపోయి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…నాగార్జున హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘బావ నచ్చాడు’ సినిమా సైతం మొదట వెంకటేష్ తో చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ కూడా వెంకటేష్ చేయకపోవడంతో నాగార్జున దగ్గరికి వెళ్ళింది.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. మొత్తానికైతే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన జానర్ లో ఈ ముగ్గురు హీరోలు సినిమాలను చేసి డిజాస్టర్ లను మూట గట్టుకున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాలంటే అది వెంకటేష్ వల్ల మాత్రమే అవుతుందని ఆయన ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు…

భారత్ లో ‘పాకిస్తాన్’ రివర్స్ దురంధర్ యాక్షన్.. వెలుగులోకి సంచలన నిజం

Pakistan Reverse Action
Pakistan Reverse Action

Pakistan Reverse Action: దురంధర్.. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మన దేశంలో భారీగా వసూళ్లను సాధించింది. అంతేకాదు, మన దేశం మీద పాకిస్తాన్ సాగించిన దుర్మార్గాన్ని బయటపెట్టింది. భారతదేశానికి సంబంధించిన రా ఏజెంట్లు పాకిస్థాన్లో ఎలా ఉన్నారు.. దేశంలో అంతర్గత భద్రతను పెంపొందించడానికి వారు ఏ విధంగా కృషి చేస్తున్నారు.. ఉగ్రవాదులను వారు ఏ విధంగా అంతం చేస్తున్నారు.. అనే విషయాల మీద ఈ సినిమా రూపొందింది.

దురంధర్ సినిమాను పాకిస్తాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. కొంతమంది కూహాన లౌకికవాదులు కూడా మన దేశంలో ఉంటూ ఈ సినిమా గురించి చెత్త వాగుడు వాగారు. దురంధర్ సినిమా విడుదలైన తర్వాత పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాళ్లను.. మతిస్థిమితం లేని వాళ్లను అక్కడి సర్కార్ అదుపులోకి తీసుకుంది. వారు ఏమైనా దురంధర్ల మాదిరిగా పనిచేస్తున్నారేమోనని అనుమానంతో ఇంటరాగేషన్ చేసింది. పాకిస్తాన్లో భారత్ తరఫున దురంధర్ల గురించి మనం సినిమాలో చూసాం. కానీ మనదేశంలో కూడా పాకిస్తాన్ రివర్స్ యాక్షన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మనదేశంలో జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూర్చుతున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం ఓ ఏఎస్ఐ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో అతడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు దర్యాప్తు జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేస్తే దాని వెనుక ఉన్న అసలు కథ తెలిసింది. ఆ తర్వాత హర్యానాలో ఓ పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి జరిగింది. ఈ కేసును విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.. ఢిల్లీలో పోలీసులు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే అసలు కథ తెలిసింది.. ఇక గురుదాస్ పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారించిన పోలీసులకు అసలు కథ తెలిసింది.

మనదేశంలో జరిగిన వేరువేరు సంఘటనలలో పోలీసులు విచారణ సాగిస్తే తెలిసిన అసలు కథలలో ఉన్న సూత్రధారి పేరు షహజాద్ భట్టి. ఇతడు పాకిస్తాన్లో ఉంటాడు. మాఫియా డాన్.. మాదకద్రవ్యాలు.. అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. భారతదేశం అంటే విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.

మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి.. దారుణాలు జరగడానికి సోషల్ మీడియాను.. ఆన్లైన్ వేదికలను ఉపయోగించుకుంటాడు. కొంతమంది వ్యక్తులను తనకు స్లీపర్ సెల్స్ గా మార్చుకున్నాడు. వారందరికీ కూడా టర్కీ ప్రాంతం నుంచి డబ్బులు సరఫరా చేస్తున్నాడు. ఇతడు భారతదేశంలో ఇంతవరకు అడుగుపెట్టలేదు. కానీ దురంధర్ మాదిరిగా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి.. అసాంఘిక పనులు జరగడానికి.. ప్రజల్లో భయం దిగడానికి ఇతడు కారణమవుతున్నాడు. ఇతడు 17 దేశాల్లో తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 300 మంది వ్యక్తులు ఇతడికి సహకారం అందిస్తున్నారు.. ఆమధ్య నేషలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్ధికి హత్యకు గురయ్యాడు. ఆ కేసును పోలీసులు విచారిస్తే ఇతడి గురించి తెలిసింది..

ఇతడు కేవలం మాదకద్రవ్యాలు.. అక్రమ ఆయుధాల వ్యాపారం మాత్రమే కాదు, తెహరిక్ ఏ తాలిబన్ హిందుస్థాన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హిజిబుల్ ముజాహిద్దీన్, లష్కరే ఏ తోయి బా వంటి సంస్థలను మించి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.. అయితే ఇతడిని అజ్ఞాత సాయుధ దళాలు అంతం చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కొంతకాలంగా ఇతడి మీద అజ్ఞాత సాయుధ దళాలు దృష్టిపెట్టాయి. ఈ క్షణమైనా సరే ఇతడు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జాతీయవాదులు చెబుతున్నారు.

'తల్లికి వందనం'.. మీరు అర్హులో..కాదో తెలుసుకోండి!

Talliki Vandanam  Scheme
Talliki Vandanam  Scheme

Talliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం విషయంలో బిగ్ అప్డేట్. విద్యార్థుల వివరాల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది రాష్ట్రవ్యాప్తంగా. విద్యాశాఖ అందించిన వివరాలతో సరిపోల్చుకుంటూ గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వివరాల సేకరణ ముగించి తిరిగి విద్యాశాఖకు నివేదించాల్సి ఉంటుంది. కొన్ని రకాల సాంకేతిక సమస్యల దృష్ట్యా లబ్ధిదారులు నష్టపోకుండా ఉండేందుకు.. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ వెరిఫికేషన్ కొనసాగుతుండడం విశేషం. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ 12న తల్లికి వందనం నిధులు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

* ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమ్మ ఒడి పేరుతో పథకాన్ని అమలు చేసేవారు. అయితే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పథకాన్ని అమలు చేశారు. గత ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద నిధులు జమ చేశారు. కానీ కొన్ని రకాల సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో అప్పట్లో కొంతమందికి పథకం వర్తించలేదు. అయితే ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి వారందరి నుంచి ధ్రువపత్రాలు తీసుకుని తప్పులను సరిచేసి అందించారు. అయితే ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను ముందుగానే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి సర్వే చేయిస్తున్నారు.

* వివరాల సేకరణ
ఏప్రిల్ 24 నుంచి విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12న ఈ సెలవులు ముగియనున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఇంకోవైపు జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు కూడా తెరుచుకొనున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తల్లికి వందనం నిధులు అందిస్తున్నారు. అయితే ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకునే క్రమంలో భాగంగా.. సచివాలయ సిబ్బందితో వివరాల సేకరణ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మరోవైపు ఈ పథకానికి అర్హత సాధించిన వారి వివరాల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ కారణంతో నైనా తిరస్కరణకు గురైతే.. అందుకు సంబంధించిన కారణాలను కూడా వివరించనున్నారు. వాటిని సరిచేసే అవకాశం కూడా కల్పించనున్నారు.

నాగార్జున తండ్రి గా, మామ గా ఫెయిల్ అయ్యాడా..?

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున…కెరియర్ మొదట్లోనే హీరోగా నిలదొక్కుకున్న ఆయన ఆ తర్వాత మాస్ హీరోగా అవతరించడమే కాకుండా రొమాంటిక్ హీరోగా కూడా తన మార్క్ ను చూపించాడు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త ప్రయోగం చేయాలన్నా కూడా అది నాగార్జున నుంచే వస్తుంది అనే ఒక పేరునైతే మూటగట్టుకున్నాడు. ఇండస్ట్రీ కి చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునకే దక్కుతుంది. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ఏమాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు. మంచి క్యారెక్టర్ దొరికితే విలన్ పాత్రలో కూడా నటించడానికి తన సిద్ధంగా ఉన్నానని చెప్పడమే కాకుండా రజినీకాంత్ హీరోగా చేసిన కూలీ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక అలాంటి నాగార్జున తన కొడుకులను, అల్లుళ్లను మాత్రం స్టార్ హీరోలుగా మార్చడంలో ఫెయిల్ అయిపోయాడు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు, నాగార్జున ను మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా స్టార్ హీరోలుగా మారలేదు. కారణం ఏంటంటే నాగార్జున వాళ్ళ కెరియర్ల మీద పెద్దగా ఫోకస్ చేయకపోవడమే అని కొంతమంది చెబుతున్నారు. నాగార్జున తన సినిమాల మీద తన ఫోకస్ చేసుకుంటూ తన బిజినెస్ ను చూసుకుంటున్నాడు.

కానీ తన కొడుకుల విషయంలో గానీ అల్లుళ్ళ విషయంలో కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదని అందువల్లే వాళ్ళు సక్సెస్ లను సాధించలేకపోతున్నారని చెబుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

ఇక ఇప్పటికైనా ఆయన తన సినిమాలు చూసుకుంటూ తన కొడుకుల విషయంలో కానీ, అల్లుళ్ల విషయంలో కానీ స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి నాగార్జున ఇక మీదటైన తన ఆయన పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడా లేదంటే వాళ్ల కి నచ్చిన సినిమాలు చేసుకోండి అనే స్వేచ్ఛ ను ఇస్తాడా అనేది…

ఆ దర్శకులు చిరంజీవి చెప్పిన చేంజెస్ చేయలేదా..అందుకే ఆ మూవీస్ తేడా కొట్టాయా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi Director Changes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతులు ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా లో సినిమాలను చేస్తూ గొప్ప పేరు ను తెచ్చుకుంటున్నారు… మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో సైతం 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఇప్పటికీ వరుస సినిమాలను చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన ఇప్పుడున్న యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుపోని రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తే మాత్రం మరోసారి ఆయన పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించి పెట్టడం లేదు. ఒక రకంగా విజయవంతంగా నిలుస్తున్నప్పటికి చిరంజీవిలోని పూర్తి నటుడిని బయటికి తీసే సినిమాలైతే రావడం లేదు.

చిరంజీవి చేసే ప్రతి సినిమాలో అతని ఇన్పుట్స్ కొన్ని ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే దర్శకుడు సరైన మార్గంలో వెళ్తున్నాడా లేదా అతను ఎలాంటి కథలు రెడీ చేశాడు. ఆ కథ ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా తనని జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అనే కొన్ని సందేహాల నుంచి చిరంజీవి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు.

ఒక ఇద్దరు దర్శకులు మాత్రం చిరంజీవి చెప్పిన చేంజెస్ వినలేదట. అందువల్లే సినిమాలు తేడా కొట్టాయి అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. వాళ్ళలో డైరెక్టర్ సురేష్ కృష్ణగా మొదటి స్థానంలో ఉన్నాడు. ‘డాడీ’ సినిమా విషయంలో చిరంజీవి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చాడట.

కానీ సురేష్ కృష్ణ వాటిని పట్టించుకోకపోవడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదని భారీ విజయాన్ని సాధించాల్సిన సినిమా కేవలం ఆవరేజ్ దగ్గరే ఆగిపోయిందని చాలామంది చెబుతూ ఉంటారు…ఇక రీసెంట్ గా కొరటాల శివ సైతం ‘ఆచార్య’ సినిమా విషయంలో చిరంజీవి మాట వినకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది…

సజ్జల అలా దొరికేశారు!

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి తరువాత సజ్జల అన్నట్టు పరిస్థితి మారింది. ఎక్కడో సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న ఆయన వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తరవాత పార్టీలో నెంబర్ 2 గా మారిపోయారు. ఆయన ప్రమేయం లేకుండా వైసీపీలో ఎటువంటి పరిణామాలు జరిగేవి కావు. ప్రభుత్వంలో సైతం కదలికలు ఉండేవి కావు. అంతలా సాగింది ఆయన హవా. కానీ కూటమి వచ్చిన తర్వాత సజ్జల అడ్డంగా బుక్ అవుతారని అంతా భావించారు. కానీ అప్పట్లో మంత్రులుగా పదవులు చేపట్టిన వారు, కీలక నాయకుల అవినీతి బయటకు వచ్చింది కానీ.. సజ్జల పేరు ఎక్కడ వెలుగులోకి రాలేదు. దీంతో సజ్జల సేఫ్ జోన్ లో ఉన్నారని అంతా భావించారు. ఇటువంటి తరుణంలోనే మద్యం కుంభకోణంలో ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

* స్వల్ప కాలంలోనే పార్టీలో ఎదిగి..
సజ్జల వైసీపీలో ఎదిగిన తీరు ఆ పార్టీ సీనియర్లకు కూడా మింగుడు పడదు. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సమానంగా రాజకీయం చేసిన వారు వైసీపీలో ఉన్నారు. అటువంటి వారిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి సజ్జల ద్వారా తనదైన రాజకీయాలు చేశారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిని కలవాలన్నా, ప్రభుత్వంతో ఏ పనులు జరగాలన్న ముందుగా కలవాల్సింది సజ్జలను. చివరకు టికెట్ల కేటాయింపు, పదవుల పంపకాలు అన్ని సజ్జల కనుసన్నల్లోనే జరిగాయి. కూటమి వచ్చిన తర్వాత వరుసగా వైసిపి నేతలు అరెస్టులు జరుగుతున్న వేళ.. కేసులు నమోదవుతున్న వేళ.. సజ్జల విషయంలో ఏం జరుగుతుందని చర్చ నడిచేది. తప్పకుండా ఆయన పై సైతం కేసులు నమోదవుతాయని.. అరెస్టు కూడా ఉంటుందని చాలా ప్రచారం నడిచింది. కానీ ఒక్కటంటే ఒక్క అవినీతి కేసు ఆయనపై బయటకు రాలేదు. ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు పెట్టినందుకు గాను ఒకే ఒక్క కేసు నమోదయింది.

* చాలా రకాలుగా జాగ్రత్తలు..
స్వతహాగా జర్నలిస్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వ విధానాలకు సంబంధించి, ప్రభుత్వ జీవోలకు సంబంధించి ఎక్కడా తన ముద్ర కానీ, తన సంతకం కానీ లేకుండా చూసుకున్నారు. భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కోకుండా వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడే జాగ్రత్త పడ్డారు. దాదాపు వ్యవహారాలన్నీ ఆయన కంట్రోల్లో నడిచినా.. ఎక్కడా చేతికి మట్టి అంటకుండా చూసుకున్నారు. అయితే మనిషన్న తర్వాత ఎక్కడో ఒక తప్పు చేయడం ఖాయం. ఏవో బలహీనమైన క్షణాల్లో తప్పులు జరిగిపోతూ ఉంటాయి. సజ్జల విషయంలోనూ అలానే ఒక తప్పు తాజాగా బయటపడినట్లు ప్రచారం నడుస్తోంది.

మద్యం కుంభకోణం పై లోతైన దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరకు జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ను సైతం దర్యాప్తు బృందం వదల్లేదు. అదే సమయంలో ఈడీ విచారణ చేపడుతోంది. నిన్ననే విజయసాయిరెడ్డి ఈడి ఎదుట హాజరయ్యారు. అయితే డిజిటల్ అంశంలో, నేరుగా నగదు చెల్లింపుల్లో భాగంగా ఓ కీలకమైన ఆధారం సజ్జలపై లభించినట్లు తెలుస్తోంది. వైసిపి హయాంలో మద్యం అమ్మకాల్లో కేవలం నగదు విక్రయాలకు ప్రాధాన్యమిచ్చారు. అలా ఆ క్యాష్ రూపంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఓ డిజిటల్ అంశం బయటపడింది దర్యాప్తులో. అందులో సజ్జల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మద్యం కుంభకోణంలో సజ్జల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.

జారిపోతున్న ‘జర’ అందాలు

Zahrah S Khan
Zahrah S Khan

సామాన్యులకు అలర్ట్: జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

June 1 New Rules
June 1 New Rules

June 1 New Rules: జూన్ నెల ప్రారంభం కానుండటంతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రతి నెల మొదటి తేదీ నుంచి కొన్ని ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన సంబంధిత నిబంధనలు మారడం సహజమే. అయితే ఈసారి బ్యాంకింగ్ సేవలు, ఎల్పీజీ గ్యాస్ ధరలు, సోలార్ ప్యానెల్ నిబంధనల్లో వస్తున్న మార్పులు నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పుల గురించి తెలుసుకోవడం అవసరం.

ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త ధరలను ప్రకటిస్తాయి. జూన్ 1న కూడా వాణిజ్య, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు కొత్త ధరల ప్రకటనపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

జూన్ నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ వేడుకలు, వారాంతపు సెలవులు కలిపి బ్యాంకులకు పలు రోజులు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకింగ్ సంబంధిత ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త రూల్స్
జూన్ 1 నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC Bank కొన్ని ఖాతాలకు సంబంధించిన నగదు డిపాజిట్ నిబంధనలను సవరించనుంది. బ్యాంకు బ్రాంచ్‌లలో పెద్ద మొత్తంలో నోట్లు, నాణేలు డిపాజిట్ చేసే ఖాతాదారులపై కొత్త ఛార్జీలు అమలు చేయనుంది. ముఖ్యంగా వ్యాపార ఖాతాదారులు ఈ మార్పులను గమనించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం నిర్దిష్ట పరిమితికి మించి నోట్లు డిపాజిట్ చేస్తే 4 శాతం వరకు ఛార్జీలు విధించనున్నారు. అలాగే కాయిన్ల డిపాజిట్‌పై 5 శాతం వరకు ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది. బ్యాంకు నగదు నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తరచూ నగదు లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు దీనివల్ల అదనపు ఖర్చులు భరించాల్సి రావచ్చు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.20 నోట్ల డిపాజిట్ విలువ రూ.10 వేల పరిమితిని దాటకూడదు. అలాగే కాయిన్ల డిపాజిట్ రూ.5 వేల వరకు మాత్రమే సాధారణంగా అనుమతించనున్నారు. ఈ పరిమితులు మించితే ఇప్పటికే ఉన్న ఛార్జీలకు అదనంగా మరో 2 శాతం రుసుము వసూలు చేసే అవకాశం ఉంది. అందువల్ల పెద్ద మొత్తంలో చిల్లర నగదు డిపాజిట్ చేసే వారు ముందుగానే బ్యాంక్ నిబంధనలను తెలుసుకోవడం అవసరం.

సోలార్ ప్యానెళ్లపై కేంద్రం కొత్త నిబంధనలు
పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్ల వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తోంది. జూన్ 1 నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఆమోదిత జాబితాలో ఉన్న సోలార్ ప్యానెళ్లను మాత్రమే సబ్సిడీ పథకాల కింద ఉపయోగించాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలను పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.ప్రభుత్వ ఆమోదిత ప్యానెళ్లకే సబ్సిడీ వర్తించడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో కొన్ని రకాల సోలార్ ప్యానెళ్ల ధరలు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే నాణ్యమైన పరికరాలు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ఉత్పత్తి, తక్కువ నిర్వహణ ఖర్చులు లభించే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను దూరం పెట్టడానికి కారణాలు ఇవే...

Pawan Kalyan And Bandla Ganesh
Pawan Kalyan And Bandla Ganesh

Pawan Kalyan And Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. యూత్ ఐకాన్ గా కూడా తను మారడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైల్ ని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే వారు అతని హెయిర్ స్టైల్ నుంచి ఇతని డ్రెస్సింగ్ స్టైల్ వరకు ప్రతి ఒక్కరు దానిని ఇమిటేట్ చేస్తూ వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తనకు ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తున్నాడు. కానీ ఆయన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి మాత్రం సినిమాలు చేయలేకపోతున్నాడు అనే ధోరణిలో కూడా కొంతమంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ఆప్తుడు, ఫ్రెండు అయిన బండ్ల గణేష్ ని ప్రొడ్యూసర్ గా మార్చింది కూడా తనే కావడం విశేషం… తీన్మార్, గబ్బర్ సింగ్ లాంటి రెండు సినిమాలతో అతన్ని ప్రొడ్యూసర్ గా మార్కెట్లోకి వదిలాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో బండ్ల గణేష్ ఓవర్ నైట్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ బండ్ల గణేశ్ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ చాలావరకు వార్తలైతే వస్తున్నాయి.

నిజానికి వీళ్ళిద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు వినిపించాయి. ఇక రీసెంట్ గా చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న ‘మెగా 158’ సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడం ఇక అదే ఈవెంట్ కి బండ్ల గణేష్ వచ్చి పవన్ కళ్యాణ్ ను పలకరిస్తూ అతనితో మాట్లాడి ఫోటో కూడా దిగాడు.

మొత్తానికైతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి ప్రూవ్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను దూరం పెట్టడానికి గల కారణం ఏంటి అంటే బండ్ల గణేష్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తన అభిమానాన్ని బయటకి చెబుతున్నా కూడా అది వినే వాళ్ళకి డబ్బా కొట్టినట్టుగా అనిపిస్తుంది.

దాని వల్ల పవన్ కళ్యాణ్ ని జెన్యూన్ గా ఇష్టపడే వాళ్ళు సైతం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనే దృక్పథంతోనే బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది…ఇక మొన్న ఈవెంట్ లో కలవడంతో దీని మీద ఒక క్లారిటి వచ్చింది…

మహేష్ బాబు ఆ రెండు సినిమాలతో ఎంట్రీ ఇవ్వాల్సిందా..? ఎలా మిస్ అయిందంటే..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇకమీదట కూడా ఆయన తన నుంచి రాబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం తేడా జరిగినా కూడా ఆయన చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది… ఇక మహేష్ బాబు తన కెరియర్ స్టార్టింగ్ లో ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక అంతకన్నా ముందే రెండు సూపర్ హిట్ సినిమాలతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆయన ఆ సినిమాలను వదిలేశాడు.

అందులో ఒకటి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమా కాగా, మరొకటి జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ఆహా’ సినిమా కావడం విశేషం…ఈ రెండు సినిమాలను మహేష్ బాబు తో చేయాలని అనుకున్నారట. ఈ స్క్రిప్ట్ ను మొదట మహేష్ బాబు కోసం రెడీ చేసినప్పుడు అందులో కొన్ని యూత్ ఎలిమెంట్స్ ని కూడా ఎక్కువగా ఆడ్ చేసి సినిమాను రన్ చేయాలని చూశారు.

కానీ కృష్ణ ఆ కథ ను రిజెక్ట్ చేయడంతో జగపతిబాబు ఇమేజ్ కి తగ్గట్టుగా కథను మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాని చేశారు. ఇక ఫైనల్ గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వైవిద్య భరితమైన పాత్రలను చేస్తూ వచ్చాడు… ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే సూపర్ హిట్ సినిమాలను చేసి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

నందమూరి ఫ్యామిలీ లో బాలయ్యకు బాగా ఇష్టమైన వాళ్లు ఎవరో తెలుసా..?

Balakrishna
Balakrishna

Balakrishna: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్లింది అంటే అది ఎన్టీఆర్ వల్లే అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. కారణం ఏదైనా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత చాలామంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు. ఇక అందులో బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు… మొత్తానికైతే బాలయ్య బాబు నట వారసుడిగా తన సత్తా చాటడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకపాత్ర వహించాడు. అయితే బాలయ్య బాబు గతంలో చాలా సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబుకి తన తండ్రి అయిన తారక రామారావు గారి తర్వాత ఆ ఫ్యామిలీలో బాగా నచ్చిన వారు ఎవరు అంటే ఆయన మాత్రం హరికృష్ణ పేరు చెబుతుంటాడు.

కారణం ఏంటి అంటే హరికృష్ణ ఏది ఉన్నా కూడా ఓపెన్ గా చెబుతారని అక్కడ ఒక మాట, ఇక్కడొక మాట మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళ నాన్నను సైతం ఎదిరించి మాట్లాడగలిగే కెపాసిటీ కేవలం హరికృష్ణకు మాత్రమే ఉందని పలు సందర్భాల్లో బాలయ్య బాబు చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య కి హరికృష్ణ అంటే ఇష్టం ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ కి హరికృష్ణ చాలా దగ్గరగా ఉండేవాడు. అలాగే బాలయ్య చిన్నతనంలో ఉన్నప్పుడు తనకు ఏది కావాలన్నా కూడా హరికృష్ణ ను అడిగి తీసుకునేవారట. ఎన్టీఆర్ ఎప్పుడు సినిమాల్లో, పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండేవాడు.

కాబట్టి అతనితో ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం బాలయ్య బాబుకు దొరకలేదు. దానివల్ల హరికృష్ణ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…ప్రస్తుత హరికృష్ణ మన మధ్య లేకపోయిన కూడా బాలయ్య బాబు అలాగే వాళ్ళ అభిమానులు సైతం అప్పుడప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు…

పెద్ది మూవీ లో విలన్ గా మొదట ఆ హీరోను అనుకున్నారా..?

Ram Charan
Ram Charan

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో విలన్ గా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మని తీసుకున్నారు. అయితే అతని స్థానంలో మొదట ఒక తెలుగు హీరోని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదు నిజానికి దివ్యేందు శర్మ ఈ సినిమాకి ఎంత బాగా సెట్ అయ్యాడనే విషయం పక్కనబెడితే అతని ప్లేస్ లో తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బండి సరోజ్ కుమార్ ని తీసుకోవాలనుకోవడం విశేషం… ఆయన నిర్బంధం, మాంగల్యం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అలాగే అతనికి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అతను ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యేవాడని బుచ్చిబాబు భావించాడు.

కానీ అతను తను మాత్రం తన సినిమాలోనే హీరోగా నటిస్తానని ఇతర హీరో సినిమాల్లో నటించలేనని కరాకండిగా చెప్పడంతో బుచ్చిబాబు దివ్యేందు శర్మ దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికైతే ఆ పాత్ర బండి సరోజ్ కుమార్ చేసి ఉంటే బాగుండేదేమో అని సినిమా చూడక ముందు నుంచే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో దివ్యేందు శర్మ పోషించిన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట.

అది హీరో రామ్ చరణ్ ను ఢీకొట్టే పాత్ర కావడంతో బండి సరోజ్ కుమార్ చేసి ఉంటే బాగుండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దివ్యేందు శర్మ కూడా చాలా మంచి నటుడు. ఆయన ఆ పాత్రలో బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడా…తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలిగాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక బుచ్చిబాబు ఇంతకు ముందు ఉప్పెన సినిమా చేశాడు. ఈ సినిమాతో 100 కోట్లు కలెక్షన్స్ ని కొల్లగొట్టినప్పటికి అతను పెద్ద హీరోని ఇప్పటివరకు హ్యాండిల్ చేయలేదు. ఇక రామ్ చరణ్ ను ఎలా హ్యాండిల్ చేశాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇకనుంచి టిడిపిలో ఎమ్మెల్సీలుగా వారికే ఛాన్స్!

TDP
TDP

TDP MLC Seats: తెలుగుదేశం పార్టీలో యువరక్తం ఎక్కించారు. పార్టీలోని అన్ని విభాగాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు . పొలిట్ బ్యూరోలో కొత్తవారిని నియమించారు. ముఖ్యంగా పార్టీలో యువ, మహిళా నాయకత్వం పెరుగుతూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు తమ వారసులకు అవకాశం ఇస్తున్నారు. అయితే సీనియర్ల సేవలను సైతం తెలుగుదేశం పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్లను శాసనమండలికి పంపించడం అనేది ఒక సంప్రదాయంగా టిడిపి మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనుభవజ్ఞుల సలహాలు రాజకీయంగాను, రాష్ట్ర ప్రయోజనాలపరంగా కీలకం. అందుకే ఇక్కడ నుంచి ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో సీనియర్లతోనే భర్తీ చేసేందుకు దాదాపు టిడిపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* ఆమోదించని రాజీనామాలు..
సాధారణంగా శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కూటమి బలం అక్కడ పదిమంది వరకు ఉంది. వైసిపి అధికారానికి దూరమయ్యే సమయంలో అక్కడ వైసిపి బలం దాదాపు 40 గా ఉండేది. క్రమేపి ఎమ్మెల్సీల రాజీనామాతో అది తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే దాదాపు ఓ ఏడుగురు ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించలేదు మండలి చైర్మన్. చివరకు కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే వారి రాజీనామాతో ఖాళీలు ఏర్పడితే కూటమి నేతలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే మండలిలో వైసీపీ బలం తగ్గి కూటమి బలం పెరుగుతుంది. అందుకే రాజీనామాలను ఆమోదించడం లేదు. ఈ రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం పార్టీలో సీనియర్లకు ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

* భారీగా ఖాళీలు..
2027- 28లో 25 మందికి పైగా వైసీపీ సభ్యులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ఆ జాబితాలో ఉన్నారు.వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యం. అందుకే ఎమ్మెల్సీ పదవులు ఈసారి సీనియర్ల కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంపు ఖాయం. ఎమ్మెల్యేలుగా జూనియర్ నేతలకు, వారసులకు ఛాన్స్ ఇచ్చి.. ఎమ్మెల్సీలుగా సీనియర్లకు అవకాశం కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

రెండు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఎవరికి ఏదీ బెస్ట్ అంటే..

Tata Tiago EV vs MG Comet EV
Tata Tiago EV vs MG Comet EV

Tata Tiago EV vs MG Comet EV: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ఇప్పటికే ఆదరణ పొందని హ్యాచ్ బ్యాక్ కార్లు ఇప్పుడు EVగా మారి మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో టాటా టియాగో EV (Tata Tiago EV), ఎంజి కామెట్ EV (MG Comet EV) అనే రెండు కార్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందాయి. అయితే, వీటి డిజైన్, పనితీరు మరియు వినియోగం పూర్తిగా భిన్నమైనవి. వీటి మధ్య ప్రధాన వ్యత్యాసాలు మరియు పనితీరుపై ఉన్న తేడాలు ఏవీ? వీటిలో ఏది బెటర్?

డిజైన్:
Tata Tiago EV ఒక పూర్తి స్థాయి 5 డోర్ల హ్యాచ్‌బ్యాక్. ఇది సాధారణ కార్ల మాదిరిగానే ఉంటుంది. కాబట్టి కుటుంబ అవసరాలకు, హైవే ప్రయాణాలకు ఎక్కువ మంది ప్రయాణించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి మంచి బూట్ స్పేస్ కూడా ఉంది.
MG Comet EV ఒక చిన్నకాంపాక్ట్ సిటీ కారు. ఇది కేవలం నగరంలో రోజువారీ చిన్న ప్రయాణాల కోసం, ఆఫీసు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇరుకైన గల్లీల్లో సులభంగా నడపడానికి దీనిని రూపొందించబడింది. దీని చిన్న పరిమాణం వల్ల పార్కింగ్ సమస్యలు ఉండవు. కానీ ఇది కేవలం చిన్న కుటుంబాలకు లేదా సింగిల్ యూజర్లకు మాత్రమే అనువుగా ఉంటుంది.

బ్యాటరీ:
టాటా టియాగో EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో 19.2 నుంచి 24 కిలోవాట్ వరకు ఉంటుంది. ఈ బ్యాటరీ 75 హార్స్ పవర్ ను అందిస్తుంది. అలాగే ఈ బ్యాటరీకి DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 226 నుంచి 285 కిలోమటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
ఎంజి కామెట్ EVలో 17.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది సుమారు 230km రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ పరిమితంగా ఉంటుంది. టియాగోతో పోలిస్తే కామెట్ పవర్ తక్కువ. ఇది కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం.

ఫీచర్లు, భద్రత :
టాటా టియాగో EVలో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా టాటా కార్లకు మంచి గుర్తింపు ఉంది. ఇది పటిష్టమైన బాడీ బిల్డ్‌ను కలిగి ఉంటుంది.
ఎంజి కామెట్ EVలో కూడా డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు వాయిస్ కమాండ్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఇది చాలా ఆధునికంగా అనిపిస్తుంది, కానీ భద్రత మరియు స్థలం పరంగా టియాగో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

కుటుంబంతో కలిసి దూర ప్రయాణం చేయాలని అనుకుంటే ‘టాటా టియాగో EV’ ఉత్తమమైన ఎంపిక. కార్యాలయ అవసరాలకు ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి, తక్కువ ఖర్చుతో కూడిన చిన్న కారు కావాలనుకుంటే ‘ఎంజి కామెట్ EV’ని ఎంచుకోవచ్చు.

చెత్తతో రూ.రూ.42 లక్షల కోట్ల సంపద.. త్వరపడండి

CEEW Report Waste Economy
CEEW Report Waste Economy

CEEW Report Waste Economy: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యను చాలా మంది భారంగా చూస్తుంటే.. అది భవిష్యత్తులో భారీ ఆర్థిక అవకాశంగా మారబోతోందని CEEW (Council on Energy, Environment and Water) తాజా అధ్యయనం వెల్లడించింది. వంటగది వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, పూలు, మాంసం అవశేషాలు, ఉద్యానవన వ్యర్థాలు వంటి సేంద్రియ చెత్తను సమర్థంగా నిర్వహిస్తే 2047 నాటికి దాదాపు 51 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లకు పైగా) మార్కెట్ ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత లక్ష్యానికి చెత్త సమస్య ఆర్థికంగా కీలకంగా మారవచ్చని CEEW అధ్యయనం తెలుపుతోంది . ప్రస్తుతం భారత నగరాలు ప్రతిరోజూ సుమారు 1.71 లక్షల టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో దాదాపు సగం సేంద్రియ వ్యర్థాలే. నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో 2047 నాటికి పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాల పరిమాణం ఏటా సుమారు 208 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ వ్యర్థాలను సరైన పద్ధతిలో ప్రాసెస్ చేస్తే కంపోస్ట్.. బయోగ్యాస్, బయో-సీఎన్‌జీ, సేంద్రియ ఎరువులు వంటి విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చు. దీంతో ఒకవైపు చెత్త సమస్య తగ్గడమే కాకుండా మరోవైపు స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు లభిస్తాయి. దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చని నివేదిక చెబుతోంది.

ఉద్యోగాల పరంగా కూడా ఈ రంగం భారీ అవకాశాలను కలిగి ఉంది. అనుకూల విధానాలు అమలైతే 2047 నాటికి సేంద్రియ వ్యర్థాల నిర్వహణ రంగంలో సుమారు 26 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని CEEW అంచనా వేసింది. వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్లాంట్ల నిర్వహణ, సాంకేతిక సేవలు, బయోగ్యాస్ ఉత్పత్తి, ఎరువుల తయారీ వంటి అనేక విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.

పర్యావరణ పరంగా కూడా ఈ మార్పు ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చెత్తను బహిరంగంగా కాల్చడం వల్ల నగరాల్లో హానికరమైన PM2.5 కాలుష్యంలో దాదాపు 10 శాతం వరకు వాటా ఉందని అధ్యయనం పేర్కొంది. అలాగే సేంద్రియ వ్యర్థాలు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోవడం వల్ల మీథేన్ వంటి హరిత గృహ వాయువులు విడుదలవుతున్నాయి. వీటిని ప్రాసెస్ చేయడం ద్వారా గాలి కాలుష్యం, దుర్వాసన, అగ్ని ప్రమాదాలు, భూగర్భ జలాల కలుషితాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

అధ్యయనం ప్రకారం.. సరైన విధానాలతో 95 శాతం పట్టణ సేంద్రియ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేయగలిగితే 2047 నాటికి సుమారు 68 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి కొనసాగితే వ్యర్థాల రంగం నుంచి వెలువడే ఉద్గారాలు మరింత పెరిగి 120 మిలియన్ టన్నుల స్థాయికి చేరవచ్చని హెచ్చరించింది.

ఈ రంగం అభివృద్ధికి సుమారు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని CEEW పేర్కొంది. ఇందుకోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు, గ్రీన్ బాండ్లు, హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్లు వంటి వినూత్న ఆర్థిక విధానాలను ప్రోత్సహించాలని సూచించింది. అలాగే చెత్తను ఇంటి వద్దే వేరు చేయడం, నగరాల స్థాయిలో ఖచ్చితమైన డేటా సేకరణ, నాణ్యత ఆధారిత ఒప్పందాలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వంటి అంశాలు విజయానికి కీలకమని తెలిపింది.

ఇప్పటివరకు పర్యావరణ సమస్యగా భావించిన చెత్తనే భారత్ భవిష్యత్తులో ఆర్థిక వనరుగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. సరైన విధానాలు, సాంకేతికత, పెట్టుబడులు అందుబాటులోకి వస్తే చెత్త కుప్పలు ఉద్యోగాలు, ఆదాయం, స్వచ్ఛమైన ఇంధనం, పరిశుభ్రమైన నగరాలకు మార్గం చూపే ‘గ్రీన్ ఎకానమీ’ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థినులకు గొప్ప వరం..

Kerala Government
Kerala Government

Kerala Government: కేరళంలో అధికారంలోకి వచ్చిన కొత్త UDF ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్యార్థినుల ఆరోగ్యం, ఉద్యోగినుల హక్కుల పరిరక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, అనాథల సంక్షేమం వంటి అంశాలను కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవులు ఎందుకంటే?

రుతుక్రమ సమయంలో అనేక మంది విద్యార్థినులు శారీరక, మానసిక అసౌకర్యాలను ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజుల ప్రత్యేక రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థినుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వారి విద్యపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

మహిళా ఉద్యోగులకు కుటుంబం, ఉద్యోగం మధ్య సమతుల్యత కల్పించేందుకు జీతంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రసవానంతర కాలంలో తల్లి, శిశువు ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, ఈ సెలవులు మహిళలకు మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు శిశు సంరక్షణకు తగిన సమయం కల్పిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఉద్యోగిణుల కోసం మరో కీలక నిర్ణయంగా, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలు, సంస్థల్లో నాణ్యమైన డేకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. చిన్నపిల్లలను చూసుకునే బాధ్యతతో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితులు రాకుండా చేయడం, మహిళల ఉపాధి అవకాశాలను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

కేరళను “అనాథలు లేని రాష్ట్రం”గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలు, అనాథ పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించేందుకు దత్తత ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది. సమాజంలో ప్రతి చిన్నారికి భద్రత, ప్రేమ, విద్య లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ నిర్ణయాలన్నీ మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా భావిస్తున్నారు. రుతుక్రమ సెలవులు, ప్రసూతి సెలవులు, డేకేర్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు మహిళల జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మహిళా సంక్షేమం, బాలల సంరక్షణ, అనాథల పునరావాసం వంటి అంశాల్లో కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమాలు విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మహిళలకు మరింత అనుకూలమైన, సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణం వైపు కేరళ మరో ముందడుగు వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

'డీఎస్సీ 2025' పై వైసిపి వద్ద ఆధారాలు ఉన్నాయా

YSRCP Allegations DSC
YSRCP Allegations DSC

YSRCP Allegations DSC: ఏపీలో డీఎస్సీ 2025 పై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో.. ఏపీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ప్రారంభించింది. స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. అయితే ఆధారాలు దొరికితే న్యాయపోరాటమైన చేయాలి. అలా చేయడం లేదు సరి కదా ఫేక్ ఐడి లతో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మందికి పైగా ఆందోళనతో గడుపుతున్నారు. కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే డీఎస్సీ ప్రక్రియపై బురద జల్లుతున్నారు అని ఉపాధ్యాయలుగా నియమితులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి పశువులు చేయొద్దని కోరుతున్నారు..

* ఏడాది కిందట పూర్తయిన ప్రక్రియ..
ఏడాది కిందట డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నోటిఫికేషన్ అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. వందలాది పిటిషన్లు కూడా కోర్టుల్లో దాఖలు చేశారు. కానీ పగడ్బందీగా అటు యంత్రాంగం.. ఇటు ప్రభుత్వం వ్యవహరించడంతో సకాలంలో ఈ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయింది. ఎక్కడికక్కడే ఉపాధ్యాయులు నియామకం కూడా జరిగిపోయింది. ఏడాది పాటు విద్యా బోధన కూడా పూర్తి చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవో సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం చూసి ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా డీఎస్సీ పై బురదజల్లేశారు.

* ఒక్క ఉపాధ్యాయుని నియమించలేదు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక్క డీఎస్సీ నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. ఒక్క ఉపాధ్యాయుడిని భర్తీ చేయలేదు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డీఎస్సీ అని 2019 ఎన్నికలకు ముందు చెప్పారు. దీంతో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అహోరాత్రులు శ్రమించారు కూడా. కానీ ఒక్క డీఎస్సీ కూడా తీయలేదు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నోటిఫికేషన్ అంటూ హడావిడి చేశారు. అది కూడా 6000 ఉపాధ్యాయ పోస్టులతోనే. ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కాకముందే నిలిచిపోయింది. కూటమి వచ్చిన తర్వాత ఆ 6000 పోస్టులకు మరో 10 వేలు పోస్టులను కలుపుతూ మెగా డీఎస్సీ ప్రకటించింది ప్రభుత్వం. నియామక ప్రక్రియను సజావుగా పూర్తిచేసింది.

* ఫేక్ ప్రచారం..
ఇటీవల నీట్ ప్రశ్న పత్రాలు లీకు అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డీఎస్సీ నియామకాల్లో సైతం అవకతవకలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. దానిని రాజకీయంగా మలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిపై ఆరోపణలు చేసేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. దీంతో 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో గడపాల్సి వస్తోంది. అహోరాత్రులు శ్రమించి ఉపాధ్యాయులుగా ఎంపిక అయితే ఇప్పుడు తమ చుట్టూ రాజకీయం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఆధారాలు లేవు. అవే ఉంటే న్యాయపోరాటం చేసేది. కానీ ఫేక్ ప్రచారంతో మాత్రం ఉపాధ్యాయులను ఆందోళనలో నెడుతోంది.