Homeఆంధ్రప్రదేశ్‌Nandamuri Tejaswini Dance Video: బాలయ్య బాబు చిన్న కూతురు.. పోలా అదిరిపోలా.. ఇలా షేక్...

Nandamuri Tejaswini Dance Video: బాలయ్య బాబు చిన్న కూతురు.. పోలా అదిరిపోలా.. ఇలా షేక్ చేసిందేంటి? వైరల్ డ్యాన్స్ వీడియో

Nandamuri Tejaswini Dance Video: సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది చెరగని ముద్ర. ఆ కుటుంబ మహిళలు రాజకీయాల్లో సైతం రాణించగలుగుతున్నారు. వ్యాపారాల్లో సైతం అగ్రగామిగా నిలిచారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని డాన్స్ తో ఇరగదీసారు. ప్రస్తుతం ఆమె డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కొరియోగ్రాఫర్ తో లయబద్ధంగా డాన్స్ చేస్తున్న వీడియో అదరగొడుతోంది. నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా సినిమాలతో పాటు పబ్లిక్ […]

Nandamuri Tejaswini Dance Video: సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది చెరగని ముద్ర. ఆ కుటుంబ మహిళలు రాజకీయాల్లో సైతం రాణించగలుగుతున్నారు. వ్యాపారాల్లో సైతం అగ్రగామిగా నిలిచారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని డాన్స్ తో ఇరగదీసారు. ప్రస్తుతం ఆమె డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కొరియోగ్రాఫర్ తో లయబద్ధంగా డాన్స్ చేస్తున్న వీడియో అదరగొడుతోంది. నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా సినిమాలతో పాటు పబ్లిక్ ఫంక్షన్లలో తేజస్విని కనిపించింది అరుదు. కానీ ఇటీవల తన తండ్రి నటించిన సినిమా నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా డాన్స్ వీడియోతో అదరగొట్టారు.

* ఒక్కొక్కరిది ఒక్కో రూటు..
నందమూరి బాలకృష్ణ కు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు కోడలు. మంత్రి లోకేష్ భార్య. ప్రస్తుతం వాణిజ్య వేత్తగా రాణిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల బాధ్యతలను చూస్తున్నారు. రెండో కుమార్తె తేజస్విని సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. దశాబ్ద కాలం కిందట విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీ భరత్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రీ భరత్ విశాఖ ఎంపీగా కూడా ఉన్నారు. ఇక బాలకృష్ణ ఒక్కగానొక్క కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. అయితే గతంలో తేజస్విని ఓ టీవీ యాడ్లో కనిపించారు. తరువాత ఆమె నటన వైపు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు స్టెప్పులతో అలరించారు. ప్రొఫెషనల్ డాన్సర్ మాదిరిగా ఇరగదీశారు.

* తండ్రికి తగ్గ తనయగా..
నందమూరి బాలకృష్ణ కు ప్రస్తుతం 66 సంవత్సరాలు. అయినా సరే తనలో జోష్ తగ్గలేదని నిరూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన కుమార్తె తేజస్విని స్టెప్పులతో వీర విహారం చేస్తుండడంతో అనేక అంచనాలు వెలువడుతున్నాయి. తనకు ఉన్న ప్రతిభకు.. సినీ రంగంలోకి ప్రవేశిస్తారా అని అడుగుతున్న వారు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే సినిమాల్లో రాణిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్ ప్రతిభతో ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే ఇప్పుడు తేజస్విని సైతం డాన్స్ తో అదరగొట్టారు. సోషల్ మీడియాను షేక్ చేశారు. బాలయ్య బాబు బిడ్డ అంటే అట్లా ఉంటది అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper