Home Blog Page 193

రేవంత్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్.. తెలంగాణలో ఎందుకిలా..

Revanth Reddy Vs Pawan Kalyan
Revanth Reddy Vs Pawan Kalyan

Revanth Reddy Vs Pawan Kalyan: సాధారణంగా రాజకీయాలలో కొందరి మధ్య వైరం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకంటే వారి మధ్య అటువంటి వ్యవహారాలు ఎప్పుడూ చోటు చేసుకోవు కాబట్టి.. ప్రజలు ఆ విధంగా ఆలోచించరు. కానీ తెలంగాణలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి.. ఎవరు ఊహించని విధంగా.. కలలో కూడా అనుకోని విధంగా రాజకీయ వైరం ఏర్పడింది. అది కాస్త ఒక రకమైన సంచలనానికి దారితీసింది. ఇది ఎటువైపు వెళుతుంది.. దేని వైపు దారితీస్తుందో చూడాలి.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల తర్వాత.. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించిన తర్వాత.. ఈ ఎపిసోడ్లోకి కాంగ్రెస్ నాయకులు వచ్చేసారు. ఆ విశ్లేషకుడిని బాధిత పక్షం లాగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. డిమాండ్ చేశారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అంటూ మండిపడ్డారు. ఇక టీఆర్ఎస్ అధినేత్రి పళ్లు రాలుతాయి అంటూ పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ బిజెపి, బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన వ్యక్తి అని.. ఆయన ఒక ప్యాకెజిస్టార్ అంటూ ఆరోపించారు..

ఈ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే హస్తం పార్టీ నాయకులు తనమీద విమర్శలు చేయడం మొదలుపెట్టారో ఆయన నేరుగా రంగంలోకి దిగారు. అంతేకాదు.. తెలంగాణలోని గచ్చిబౌలి ప్రాంతంలో సంధ్య కన్వెన్షన్ హాల్ లో అంతర్గత సమావేశం నిర్వహించుకుంటామని తెలంగాణ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చింది. దీనికి తెలంగాణ పోలీసులు చెప్పిన కారణమేంటంటే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద జనసేన నాయకులు విమర్శలు చేయడం ద్వారా.. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది.. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంగా ఉన్నారు.. అందువల్ల ఈ సమావేశానికి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జన సేన అధినేత తన గృహం నుంచి విలేకరుల సమావేశం నిర్వహించారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. తాను ఇక్కడ పోటీ చేసే విషయం మీద స్పష్టత ఇచ్చారు. పోరాటల పురిటిగడ్డలో ఎందుకు సమావేశంనిర్వహిస్తున్న విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత మీద కవిత ఆరోపణలు చేస్తే ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అందువల్లే ఆమె అలా చేస్తుందనుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే.. దాన్ని కూడా ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి ఆంధ్రా ప్రాంతం మీద.. అక్కడి రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తేనే ఆ పార్టీకి మనుగడ. అదే గనుక లేకపోతే ఆ పార్టీకి తెలంగాణలో కొనసాగింపు ఉండదు.

భారత రాష్ట్ర సమితి నుంచి కవిత వరకు ఏపీ డిప్యూటీ సీఎం మీద విమర్శలు చేశారంటే దాని వెనక ఒక అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ స్థాయిలో జనసేన అధినేత మీద విమర్శలు చేయడం నిజంగా ఆశ్చర్యం. రేవంత్ రెడ్డి ఆదేశాల లేకుండా వారు ఇలా చేశారనుకోవడానికి లేదు. కానీ ఈ ఉద్దేశ్యాలు ఆశించి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విమర్శలు చేస్తుందో అర్థం కావడం లేదు..

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలితేనే ఓట్లు పడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందువల్లే జనసేన అధినేత మీద ఈ స్థాయిలో విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. కానీ హైదరాబాదులో సెటిలర్ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే..ఆంధ్రా వాదం మీద ఆరోపణలు చేస్తే అప్పుడు ఆ ఓట్లు వేరే పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేనాని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు అతడిని టార్గెట్ చేసినట్టు.. కాంగ్రెస్ జాతీయ పార్టీ.. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ ఇలాంటి వైఖరి ఎందుకు తీసుకున్నారు.. భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇవ్వకూడదనా.. పవన్ కళ్యాణ్ వస్తే భారత రాష్ట్ర సమితికి ప్రయోజనం దక్కుతుందనా.. ఈ ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు.. ఒకవేళ ఇదే విధానం కనుక రేవంత్ రెడ్డిది అయితే.. ఆయన ముందుగానే మేల్కొన్నట్టు..

కానీ, గత ఎన్నికల్లో సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితి వైపు మొగ్గు చూపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ రెడ్డి కొనసాగించిన వైఖరి వల్ల వారి ఓట్లు ఎటువైపు వెళ్తాయో చూడాల్సి ఉంది. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న వ్యాఖ్యల ద్వారా గోటితో పోయే వ్యవహారాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చారు. అయితే ఇది ఎక్కడదాకా దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

ఆ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ నోరు మూయించిన గద్దర్ కూతురు.. సంచలనం రేపుతున్న వీడియో..

Gaddar Daughter Vennela
Gaddar Daughter Vennela

Gaddar Daughter Vennela: పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కాకను రేపుతోంది. మండే ఎండాకాలంలో మరింత నిప్పులను రాజేస్తోంది.. పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రతి మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా గద్దర్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయంగా కలకలం రేపాయి.

పవన్ కళ్యాణ్ గద్దర్ బతికున్నప్పుడు ఆయనకు కారు కొనిచ్చాను అని చెప్పారు. ఆయన శరీరంలో బుల్లెట్లు దిగాయని.. తెలంగాణను ప్రేమించిన గద్దర్ విషయంలో తెలంగాణ ప్రాత నాయకులు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని పవన్ కళ్యాణ్ విమర్శించారు..”గద్దర్ గొప్ప గాయకుడు. తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి తెలంగాణ లో ఉన్న నాయకులు ఏ విధమైన గౌరవం ఇచ్చారు.. కనీసం ఆయనకు ఎటువంటి గుర్తింపు కూడా ఇవ్వలేదు కదా. ఆయనకు నేను కారు కొనిచ్చాను. ఆయన నా దగ్గరికి వచ్చేవారు. నాతో ప్రశాంతంగా మాట్లాడేవారని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

గద్దర్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు అన్నట్టుగా వ్యవహరించాయి. అయితే ఈ ఎపిసోడ్లో గద్దర్ కుమార్తె వెన్నెల తెరపైకి వచ్చారు. “తెలంగాణ గడ్డ.. పోరాటాల గడ్డ. పొత్తులతో తెలంగాణ రాలేదు. రాజకీయ పార్టీలతో తెలంగాణ రాలేదు. ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది. గడపగడపకు సాంస్కృతిక వైవిధ్యాన్ని తీసుకెళ్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఎంతమంది పిల్లలు తమ శరీరాలను బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అస్తిత్వ పోరాటమని” వెన్నెల వ్యాఖ్యానించారు.

“తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీర్.. ఇందులో అనుమానం లేదు. మా నాన్న కు పవన్ కళ్యాణ్ అభిమాని. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్న ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటాల వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ తెలంగాణ గడ్డమీద తెలంగాణ ప్రజలకు మాత్రమే హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రజలు మాత్రమే ఇక్కడ పరిపాలించాలి. పాలన సాగించాలని” వెన్నెల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మీద పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. గద్దర్ గురించి పదేపదే మాట్లాడిన నేపథ్యంలో.. వెన్నెల స్పందించడం విశేషం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద కాంగ్రెస్ నాయకులతోపాటు గులాబీ పార్టీ.. ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. గద్దర్ గురించి పవన్ పదే పదే ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన కుమార్తె కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడించుకుంటారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి ఆ స్థాయిలో మాట్లాడితే.. ఆయనకు వెన్నెల ద్వారా కౌంటర్ ఇప్పించడం సంచలనం గా మారింది. దీనిపై జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

పెద్ది' హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇలా ఉందేంటి..? 'గేమ్ చేంజర్' కంటే తక్కువ..

Peddi Hindi Version Advance Bookings
Peddi Hindi Version Advance Bookings

Peddi Hindi Version Advance Bookings: మన టాలీవుడ్ నుండి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో బాలీవుడ్ ఆడియన్స్ కి మొదటి నుండి పరిచయం ఉన్న హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రభాస్, అల్లు అర్జున్ కంటే ముందే , రామ్ చరణ్ కి నార్త్ ఇండియా లో క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే ‘మగధీర’ చిత్రాన్ని హిందీ ఆడియన్స్ ఎగబడి చూశారు కాబట్టి. ఆ చిత్రం అక్కడ థియేటర్స్ లో విడుదల కాకపోయినప్పటికీ కూడా, టీవీ టెలికాస్ట్ ద్వారా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో అప్పట్లో రామ్ చరణ్ ‘జంజీర్’ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేశాడు . భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆరోజుల్లోనే హిందీ లో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చాయి.

ఆ తర్వాత రామ్ చరణ్ డైరెక్ట్ గా ఎలాంటి హిందీ సినిమాల్లో నటించలేదు కానీ , #RRR చిత్రం ద్వారా ఆయన నార్త్ ఇండియా లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చేంజర్ ‘ భారీ అంచనాల నడుమ హిందీ లో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది , అయినప్పటికీ కూడా 30 కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చాయి. అయితే రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అలా అనిపించడం లేదు . పెద్ది చిత్రం ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంటుందేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆ చిత్రానికి కేవలం 36 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని , తద్వారా 76 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంటున్నారు. అందుకు కారణం నేషనల్ ముల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టకపోవడం వల్లే అని తెలుస్తోంది. అసలు ఆ థియేటర్స్ లో విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఓజీ చిత్రానికి కూడా ఇలాగే చేశారు , ఫలితంగా ఆ సినిమాకు క్లోజింగ్ లో కేవలం 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టకపోతే ఓజీ రేంజ్ వసూళ్లే ఈ చిత్రానికి హిందీ లో వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

'పెద్ది' ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ టాక్ వచ్చేసింది.. సినిమాలోని ప్లస్సులు , మైనస్సులు ఇవే..

Peddi Movie Success
Peddi Movie Success

Peddi Overseas Premier Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం మరి కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో ఇది వరకే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో మనమంతా చూశాము. ఈ చిత్రం కోసం ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేసాడు , ఎన్నో దెబ్బలు కూడా తగిలించుకున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చడం తో ఈ చిత్రం పై హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఆ హైప్ కి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లో జరిగాయి. ట్రేడ్ అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కి కలిపి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని కాసేపటి క్రితమే లండన్ లో ప్రదర్శించారు. అక్కడి నుండి వచ్చిన పబ్లిక్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఎవ్వరూ ఊహించని రేంజ్ లో, చాలా అద్భుతంగా ఉండబోతుందని , రంగస్థలం చిత్రం ఒక మూలకు కూడా సరిపోదని , కచ్చితంగా ఆయన ఈ సినిమాతో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంటాడని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుందని , సరదాగా సాగిపోతుందని , ఇంటర్వెల్ నుండి వేరే లెవెల్ కి వెళ్తుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ ఆరంభం లో ఒక అరగంట వరకు సినిమా స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉంటుందని, ఆ తర్వాత చివరి 45 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి కాళ్ళు కూడా పోతాయట. అయినప్పటికీ ఒలింపిక్స్ లో గేమ్స్ ఆడి గెలిచి , తన ఊరికి ఎనలేని ప్రతిష్టని తీసుకొచ్చే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ తర్వాత , ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకుని మరో క్యారెక్టర్ జగపతి బాబు పోషించిన అప్పలసూరి క్యారెక్టర్. ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని , హీరో తన ఊరి కోసం పోరాటం చేయడానికి ఈ పాత్ర ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని , ఈమధ్య కాలం లో జగపతి బాబు కి ఇంతటి సాలిడ్ క్యారెక్టర్ పడలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

అర్థాంతరంగా ఆగిపోయిన అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ మూవీ.. కారణం ఏంటంటే..

Allu Arjun Lokesh film stopped
Allu Arjun Lokesh film stopped

Allu Arjun Lokesh film stopped: ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పుష్ప 2’ తర్వాత ఎలాంటి డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనే ప్రశ్నలకు తెరదించుతూ , ఒక సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ జానర్ ‘రాకా’ చెయ్యబోతున్నాని, ఈ చిత్రానికి తమిళం లో అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ దర్శకత్వం వహిస్తాడని , ఒక క్రేజీ వీడియో తో ప్రకటన చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమాని ప్రకటించి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు .

ఈ ప్రకటన కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో కి సంబంధించిన మ్యూజిక్ తో మిలియన్ల సంఖ్యలో రీల్స్ కూడా పడ్డాయి. ఆ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అంత గ్రాండ్ గా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అట్టకెక్కిందని ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్న వార్త. చెన్నై లో ఉండే లోకేష్ కనకరాజ్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చి , ఆయనకు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గత నాలుగు నెలలుగా ఆయన ఆ ఆఫీస్ లో తన రైటింగ్ టీం తో కలిసి అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్టోరీ ని రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు.

రీసెంట్ గా పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని అల్లు అర్జున్ కి వినిపించాడట లోకేష్ కనకరాజ్. ఆయనకు సరిగా నచ్చకపోవడం తో మార్పులు చేర్పులు చేసుకొని రమ్మని సూచించాడట. కొన్ని రోజులు తర్వాత అల్లు అర్జున్ సూచించిన మార్పులు చేసి , స్క్రిప్ట్ ని డెవలప్ చేసి గత వారమే వినిపించాడట లోకేష్. కానీ అల్లు అర్జున్ కి ఏ మాత్రం నచ్చలేదట. ఇలాంటి స్క్రిప్ట్ తో వెళ్తే ఫ్లాప్ తప్పదని భావించిన అల్లు అర్జున్ , ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందుగా ఆయన మలయాళం డైరెక్టర్ తో పని చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడట . లోకేష్ కనకరాజ్ తో పూర్తిగా సినిమాని రద్దు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా ఔట్?

Mamata Banerjee

Mamata Banerjee : రాజకీయాల్లో అప్పుడప్పుడు అణువిస్ఫోటనాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీలో 80కి 59 ఎమ్మెల్యేలు బెంగాల్ స్పీకర్ కు ఒక లెటర్ సమర్పించారు. మాదే నిజమైన టీఎంసీ అని.. మా లెజిస్లేటివ్ పార్టీని గుర్తించాలని వినతిపత్రం ఇచ్చారు. ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు.

మమత ఒక కను సైగ చేస్తే టీఎంసీలో భయపడేవారు. అధికారులు పరుగులు పెట్టేవారు. ఆ స్థితి నుంచి ఇప్పుడు మమత పెట్టిన పార్టీనే ఆమె చేతుల్లో లేకుండా పోయింది.

ఎన్నికలు ఫలితాలు వచ్చిన రోజునే గెలిచిన ఎమ్మెల్యేలందరుతో మీటింగ్ పెట్టారు. మే 9న మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్పీకర్ సోమన్ దేవ్ ను లెజిస్లేచర్ పార్టీ నేతగా నియమిస్తున్నట్టు లెటర్ రాశాడు. సహజంగానే జరిగేదే.కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే.. సందీపన్ సాహా, బెనర్జీ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు మా సంతకాలు ఫోర్జరీ చేసి స్పీకర్ కు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై సీఐడీ విచారణను స్పీకర్ ఆదేశించారు. దీంతో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదైంది.

మమతా బెనర్జీ ఆదివారం మీటింగ్ పెడితే 80కి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ధర్నా చేస్తే కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 40కిపైగా టీఎంసీ ఎంపీల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. 59మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లెటర్ ఇచ్చారు. నెలరోజుల్లో ఇంత అసంతృప్తి ఎందుకొచ్చింది అన్నది చూస్తే..

తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా ఔట్? ఎందుకయ్యారు.. దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఈ మందు ప్రాణాలను నిలబెడుతుంది..! ఎలాగంటే..

Trikafta medicine uses and benefits
Trikafta medicine uses and benefits

Trikafta medicine uses and benefits: వైద్య శాస్త్ర చరిత్రలో కొన్ని మందులు ఒక వ్యాధి చికిత్స విధానాన్నే పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ఔషధాల్లో ‘ట్రికాఫ్టా’ (Trikafta) ఒకటి. గతంలో ప్రాణాంతకంగా భావించిన ‘సిస్టిక్ ఫైబ్రోసిస్’ అనే జన్యు వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఈ మందు కొత్త ఆశాకిరణంగా మారింది. ఈ వ్యాధితో ఒకప్పుడు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు సాధారణ జీవితానికి దగ్గరగా జీవించే అవకాశాన్ని ఈ ఔషధం కల్పిస్తోంది. అసలు ఈ టీకా చరిత్ర ఏంటీ? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే?
సిస్టిక్ ఫైబ్రోసిస్ (Cystic Fibrosis) అనేది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఒక జన్యు లోపం. శరీరంలోని CFTR అనే ప్రొటీన్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాల్లో మందంగా, జిగటగా ఉండే శ్లేష్మం (మ్యూకస్) పేరుకుపోతుంది. ఫలితంగా తరచూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు సిస్టిక్ ఫైబ్రోసిస్‌కు పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో లేదు. వైద్యులు కేవలం లక్షణాలను నియంత్రించేందుకు మాత్రమే మందులు ఇచ్చేవారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తగ్గించడం, శ్వాసను మెరుగుపరచడం, పోషకాహారం అందించడం వంటి చర్యలతోనే రోగులను చూసుకునేవారు. అయినప్పటికీ చాలా మంది రోగులు 30 నుంచి 40 ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోయేవారు.

అయితే ఇప్పుడు ట్రికాఫ్టా ప్రాణాలను కాపాడుతోందని అంటున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది వ్యాధి లక్షణాలను మాత్రమే కాకుండా అసలు కారణాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. CFTR ప్రొటీన్‌లో ఉన్న లోపాన్ని సరిచేసి, అది సాధారణంగా పనిచేసేలా సహాయపడుతుంది. దీంతో శరీరంలో ఉప్పు, నీటి సమతుల్యత మెరుగుపడి, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే జిగట శ్లేష్మం తగ్గుతుంది. ఫలితంగా శ్వాసకోశ పనితీరు మెరుగుపడటంతో పాటు ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుంది.

ట్రికాఫ్టా అందుబాటులోకి వచ్చిన తర్వాత వేలాది మంది రోగుల జీవితాలు మారిపోయాయి. గతంలో రోజూ గంటల తరబడి చికిత్సలు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు చాలామంది సాధారణ విద్య, ఉద్యోగాలు, కుటుంబ జీవితం కొనసాగించగలుగుతున్నారు. శ్వాస సమస్యలు తగ్గడంతో పాటు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాలు కూడా గణనీయంగా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మందు ప్రభావంతో సిస్టిక్ ఫైబ్రోసిస్ రోగుల సగటు ఆయుర్దాయం భారీగా పెరిగింది. ఒకప్పుడు 40 ఏళ్లలోపే మరణించే ప్రమాదం ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం 60 నుంచి 65 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జన్యు వ్యాధుల చికిత్సలో అత్యంత పెద్ద విజయాల్లో ఒకటిగా భావిస్తున్నారు.

యమునా పుష్కరాలు.. ఎక్కడ పుణ్యస్నానం చేయాలి..

Yamuna Pushkaralu 2026
Yamuna Pushkaralu 2026

Yamuna Pushkaralu 2026: భారతీయ సనాతన సంప్రదాయంలో పుష్కరాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అవకాశంగా నిలవనున్నాయి. ఈ ఏడాదిలో యమునా పుష్కరాలు సాగనన్నాయి. గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించే సందర్భంగా యమునా నదికి పుష్కర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ పుష్కరాల ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల్లో ఏం చేయాలి?

యమునా పుష్కరాలు 2026 జూన్ 2వ తేదీన ప్రారంభమై జూన్ 13వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు ‘ఆది పుష్కరం’, చివరి రోజు ‘అంత్య పుష్కరం’గా పరిగణిస్తారు. ఈ రెండు రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. బ్రహ్మముహూర్తంలో, ముఖ్యంగా ఉదయం 4:30 నుంచి 7 గంటల మధ్య పుష్కర స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

యమునా దేవి సూర్యభగవానుడి కుమార్తె. యమధర్మరాజు సోదరిగా పురాణాల్లో వర్ణించబడింది. అలాగే శ్రీకృష్ణుడి లీలలతో యమునా నదికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పుష్కర కాలంలో యమునా జలాల్లో స్నానం చేస్తే పాప విమోచనం, పితృదేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని విశ్వాసం.యమునా నది ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి నుంచి ప్రారంభమై హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి ప్రయాగ్‌రాజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. ఈ మొత్తం ప్రవాహ ప్రాంతంలో పుష్కర స్నానం చేయవచ్చు. అయితే కొన్ని క్షేత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

యమునా నది జన్మస్థానంగా ప్రసిద్ధి చెందిన యమునోత్రిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది.

శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురలోని విశ్రాంత్ ఘాట్ యమునా పుష్కరాలకు ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. కంసుడిని సంహరించిన అనంతరం శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాలు చెబుతాయి.

కేశీ ఘాట్, ఇతర యమునా తీర్థాలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. శ్రీకృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు.

నిగంబోధ్ ఘాట్ వద్ద కూడా వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు.

త్రివేణి సంగమం వద్ద గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యకరంగా భావిస్తారు. పితృకార్యాలకు ఇది ప్రముఖ క్షేత్రం.

పుష్కరాల్లో ఏ దానాలు చేయాలి?
పుష్కర కాలంలో దానం చేయడం ద్వారా స్నాన ఫలితం మరింత పెరుగుతుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి. ముఖ్యంగా అన్నదానం అత్యుత్తమ దానంగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ద్వారా అపార పుణ్యం లభిస్తుందని చెబుతారు. వస్త్రదానం, గోదానం, విద్యార్థులకు పుస్తకాల దానం, పేదలకు చెప్పులు, గొడుగులు, నీటి పాత్రలు, ధాన్యాలు దానం చేయడం కూడా శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. వేసవి కాలం కావడంతో చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయడం విశేష పుణ్యప్రదమని పండితులు సూచిస్తారు.

ప్రీమియం ఫీచర్లు.. Motorola కొత్త ఫోన్ గురించి తెలుసా..

Motorola Edge 2026
Motorola Edge 2026

Motorola Edge 2026: Motorola తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ Edge ను విస్తరిస్తూ సరికొత్త ఫోన్ ను ఆవిష్కరించింది. Motorola Edge 2026 మోడల్‌ను ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే పరంగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉందవి. ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల అద్భుతమైన డిస్‌ప్లేతో వస్తోంది. 1.5 కె రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ సిరీస్ ప్రత్యేకత అయిన స్లిమ్ , ప్రీమియం డిజైన్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఇది చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ ఫోన్ గుండెకాయ వంటి చిప్‌సెట్ విషయానికొస్తే, ఇందులో లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7450 SoCని పొందుపరిచారు. ఇది అద్భుతమైన మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని 5G కనెక్టివిటీని అందిస్తుంది. గేమర్స్ కోసం మరియు భారీ అప్లికేషన్లను వాడే వారి కోసం ఈ ప్రాసెసర్ తక్కువ శక్తిని వినియోగించుకుంటూ ఎక్కువ వేగాన్ని అందిస్తుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో ట్రపుల్ కెమెరాను అమర్చారు. సోని లిటియా 710 సెన్సార్ లో కూడిన 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను అమర్చారు. అల్ట్రావైడ్ లెన్స్ 50 మెగా పిక్సెల్ తో పని చేస్తుంది. 10 మెగా పిక్సెల్ తో టెలిఫొటో కెమెరా కూడా ఉంది. సెల్ఫీ కోసం 50 మెగా పిక్సెల్ ను ఉపయోగించారు. అత్యంత స్పష్టమైన, షార్ప్ చిత్రాలను తీయడంలో పాటు అదనంగా ఉన్న అల్ట్రా-వైడ్ మరియు మాక్రో సెన్సార్ల వల్ల వైవిధ్యమైన యాంగిల్స్‌లో ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. రాత్రిపూట ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకమైన నైట్ మోడ్ ఫీచర్లను కూడా ఇందులో మెరుగుపరిచారు.

దీర్ఘకాలం పాటు ఫోన్ వాడకానికి వీలుగా ఇందులో శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు మోటోరోలా అందించే 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల, నిమిషాల్లోనే బ్యాటరీని గణనీయంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫోన్ దుమ్ము, ధూళి తో పాటు నీటి నంచి రక్షణ పొందేందుకు IP68 రేటింగ్ ను పొంది ఉంది. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ బాగుండటం వల్ల, బ్యాటరీ లైఫ్ మరింత మెరుగ్గా ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 2026 మోడల్ మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన ధరలతో అమెరికా మార్కెట్లోకి వచ్చింది. దీనిని రూ. 57,000 తో విక్రయిస్తున్నారు. పాంటోన్ మార్టిని ఆలివ్ కలర్ వేలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి ఫీచర్లు ఉన్నాయి.

Lava నుంచి క్రేజీ డిస్ ప్లే ఫోన్.. ధర బడ్జెట్ లోనే..

Lava N2 5G specifications
Lava N2 5G specifications

Lava N2 5G specifications: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Lava కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. ఈ సంస్థ తాజాగా ‘లావా బ్లేజ్’ సిరీస్‌లో భాగంగా N2 5G అనే మొబైల్ ను ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ఉండడంతో పాటు శక్తివంతమైన ఫీచర్లతో వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

లావా బ్లేజ్/బోల్డ్ సిరీస్ ఫోన్లు సాధారణంగా ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వస్తాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన N2 5G ఫోన్ కూడా స్టైలిష్ లుక్‌ను కలిగి ఉండి, వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఇందులో 6.75 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. దీంతో వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండడంతో ఫోన్ స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఈ ఫోన్‌లో యూనిసోక్ T8200 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు మల్టీ టాస్కింగ్‌ను చాలా సులువుగా నిర్వహించగలదు. అలాగే, ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 16 ఉండటంతో పాటు, లావా సంస్థ సాఫ్ట్‌వేర్ విషయంలో చాలా వరకు యాడ్స్ లేని, క్లీన్ అనుభవాన్ని అందించడానికి ప్రాధాన్యత ఇస్తుంది.

బ్యాటరీ మరియు ఛార్జింగ్
ఈ ఫోన్ యొక్క ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యం. మీరు పేర్కొన్న విధంగా 6,000mAh బ్యాటరీ లేదా భారీ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉండటం వల్ల, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఎలాంటి ఆందోళన లేకుండా వాడుకోవచ్చు. ఈ బ్యాటరీకి 18 W ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా నిండుతుంది.ఈ మొబైల్ IP64రేటింగ్ ను కలిగి ఉండడంతో దుమ్ము, ధూళితో పాటు నీటి బిందువుల నుంచి రక్షణగా ఉంటుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఫ్రంట్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ను అందించారు. ఇది తక్కువ కాంతిలో కూడా మెరుగైన ఫోటోలను తీయడానికి సహాయపడుతుంది. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను అందించారు. 5G కనెక్టివిటీ ఉండటం వల్ల హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది.

ధర మరియు లభ్యత
లావా తన ఫోన్‌లను ఎప్పుడూ సరసమైన బడ్జెట్ ధరలలోనే విడుదల చేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.7,499 నుంచి ప్రారంభం అవుతుంది. కూడా మిడ్-రేంజ్ లేదా బడ్జెట్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ సైట్లలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

భారత్‌పై అమెరికా మరోబాంబ్‌.. 12.5 శాతం అదనపు సుంకాలకు ప్రతిపాదన!

US tariff proposal on India
US tariff proposal on India

US tariff proposal on India: భారత్‌పై అమెరికా మరో బాంబు పేల్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రతీకార సుంకాలతో భారత ఎగుమతులు తగ్గాయి. ఇక అమెరికా–ఇరాన్‌ యుద్ధం కారణంగా ఆయిల్‌ సంక్షోభం నెలకొంది. మరోవైపు ఆర్థికంగానూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా మరోసారి తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కఠిన వైఖరి చూపించింది. వెట్టిచాకిరీ (బలవంతపు లేబర్‌) నిర్మూలనలో పలు దేశాలు విఫలమవుతున్నాయని ఆరోపిస్తూ, వాటి దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో భారత్‌తో పాటు మొత్తం 60 దేశాలు ఉన్నాయి.

అమెరికా తీవ్ర ఆరోపణలు..
యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ అంబాసిడర్‌ జెమీసన్‌ గ్రీర్‌ ఒక ప్రకటనలో వెల్లడించినట్లు, వెట్టిచాకిరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించడంలో అనేక దేశాలు సమర్థవంతంగా వ్యవహరించలేదని ఆరోపించారు. దీని వల్ల అమెరికా కార్మికులు అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని, ఈ అసమానతలను ఇక సహించలేమని స్పష్టం చేశారు. 54 దేశాలపై 12.5 శాతం, మరికొన్నింటిపై 10 శాతం సుంకాలు విధించాలని యూఎస్‌టీఆర్‌ ప్రతిపాదించింది.

సుంకాల జాబితాలో ఇవీ..
యూఎస్‌టీఆర్‌ సుంకాలు ప్రతిపాదించిన దేశాల జాబితాలో భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా వంటి ప్రధాన దేశాలు ఉన్నాయి. కెనడా, ఈయూ, మెక్సికో, ఇండోనేసియా, పాకిస్తాన్, ఈక్వడార్‌ వంటి దేశాలు రెండవ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌ స్పందన..
అదనపు సుంకాల ప్రతిపాదన అంశంపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. సెక్షన్‌ 301 దర్యాప్తు సంబంధించి అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా, మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం సంబంధించి కూడా సమాంతర చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఈ సుంకాలు ఇంకా ఖరారు కాలేదని, జూన్‌ 22లోగా సంప్రదింపులు జరపాలని, జులై 6 వరకు లిఖితపూర్వక అభిప్రాయాలు సమర్పించవచ్చని యూఎస్‌టీఆర్‌ ఆ దేశాలను ఆహ్వానించింది.

ఈ పరిణామాలు భారత్‌తో సహా పలు దేశాల వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఈ కొత్త చర్యల ద్వారా తన కార్మికులను రక్షించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

లే ఆఫ్ ల వేళ.. కోట్లే కోట్లు.. ఇండియన్ ఐటీ ఉద్యోగులు రెడీనా..

IT layoffs India latest news
IT layoffs India latest news

IT layoffs India latest news: లే ఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఐటీ ఉద్యోగుల జాబ్ లు పోతున్నాయి. మనదేశం నుంచి మొదలు పెడితే అమెరికా వరకు ఇదే పరిస్థితి. ఉద్యోగాలు పోతే వచ్చే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఐటీ విభాగంలో పని చేసే వారు నరకం చూస్తున్నారు. ఉద్యోగం లేక.. వచ్చే అవకాశం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చెల్లించాల్సిన ఈఎంఐలు, అప్పులు కొండల మాదిరిగా పేరుకుపోతున్నాయి.

లే ఆఫ్ ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎన్విడియా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో ఉంటున్న భారతీయ హెచ్ 1 బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు మొత్తం ఉద్యోగాలను తొలగిస్తున్న నేపథ్యంలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది.

ఈక్రమంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఎన్ వీడియా విదేశాలలో ఉన్న ప్రతిభావంతులపై ఫోకస్ పెట్టింది. ఈనేపథ్యంలో హెచ్ 1 బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ఇచ్చే నియామకాలను పెంచింది. ఈ ఏడాది తొలి రెండు క్వార్టర్ లలో 1200మంది హెచ్ 1 బీ విభాగం కింద ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనుమతులను అమెరికా ప్రభుత్వం నుంచి పొందింది.

అమెరికాకు హెచ్ 1 బీ వీసాదారులను భారత్ అధికంగా అందిస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ హెచ్ 1బీ వీసాదారుల కేటగిరీలో వేయి మందికి ఉద్యోగాలు కల్పించింది ఎన్ వీడియా. ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్1 బీ వీసాదారుల్లో 70 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఆ వీసా కింద ఉద్యోగాలు కల్పించే స్థాయి పెరిగితే భారతీయుల పంట పండినట్టే.

ఎన్విడియా నియామకాలను జోరుగా పెంచుతోంది. ఇంజనీరింగ్, ఏఐ విభాగాలలో భారీగా ఉద్యోగులను భర్తీ చేస్తోంది. భారీగా వేతనాలు కూడా ఇస్తోంది. ఒక ఇంజనీర్ కు ఏకంగా 3.72 కోట్లు, రీసెర్చ్ శాస్త్రవేత్తకు రూ.3.39 కోట్లు, ప్రొడక్ట్ మేనేజర్ కు రూ.3.61 కోట్లు, హార్డ్ వేర్ ఇంజనీర్ మేనేజర్లకు రూ. 3.50 కోట్లు, డైరక్టర్ స్థాయి వ్యక్తులకు రూ. 4.64 కోట్ల దాకా ఇస్తోంది. స్టాక్ గ్రాంట్లను, బోనస్ లు కూడా ఇస్తోంది.

ముఖ్యంగా ఏఐ అల్గారిథంఇంజనీర్లు, ప్రిన్సిపల్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ఇంజనర్లకు రూ.4 కోట్లకు పైగా వేతనాలు ఇస్తోంది. కస్టమర్ ఫేజింగ్, క్లౌడ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, చిప్ డిజైన్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఎన్వీడియా.

ఆటోమోబైల్ మార్కెట్ కు కొత్త కార్ల శోభ.. ఏమేం రాబోతున్నాయో తెలుసా..

New cars launching in India 2026
New cars launching in India 2026

New cars launching in India 2026: భారతదేశంలో కొత్త కార్లు కొనుగోలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జూన్ నెలలో భారత ఆటోమోబైల్ మార్కెట్ సరికొత్త ఆకర్షణలతో కళకళలాడుతోంది. విలాసవంతమైన సెడాన్ల నుంచి శక్తివంతమైన SUVల వరకు, ఈ నెలలో విడుదల కాబోయే ప్రముఖ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

హోండా ZR-V (Honda ZR-V):
ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలోకి హోండా తన ZR-Vని తీసుకువస్తోంది. ఇది 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అత్యుత్తమ పనితీరును మరియు మైలేజీని అందిస్తుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఇందులో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) మరియు 360-డిగ్రీ కెమెరాను అమర్చారు. వినోదం కోసం బోస్ (Bose) ఆడియో సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ధర రూ. 40 లక్షల నుండి రూ. 50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

స్కోడా కోడియాక్ RS (Skoda Kodiaq RS):
పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం స్కోడా కోడియాక్ RS సిద్ధమవుతోంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండి, అద్భుతమైన శక్తిని అందిస్తుంది. దీని స్పోర్టి డిజైన్ మరియు ఇంజనీరింగ్ వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. లగ్జరీ మరియు వేగం కలగలిసిన ఈ కారు ధర రూ. 45 లక్షల నుండి రూ. 55 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా.

టాటా సియెర్రా EV (Tata Sierra EV):
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మోడల్ సియెర్రా EV. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లలో లభ్యం కానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా సుదూర ప్రయాణాన్ని అందించేలా దీనిని రూపొందించారు. ఆధునిక ఫీచర్లు మరియు టాటా విశ్వసనీయతతో రానున్న ఈ కారు ధర రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల మధ్య ఉండవచ్చు.

BYD PHEV (అట్టో 2 లేదా సీలయన్ 6):
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీలో BYD సంచలనం సృష్టించబోతోంది. అట్టో 2 లేదా సీలయన్ 6 మోడల్‌లో రానున్న ఈ వాహనం, ఒక్కసారి ఛార్జింగ్ మరియు ఫ్యూయెల్ కలిపి సుమారు 998 నుండి 1,092 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించడం విశేషం. సుదూర ప్రయాణాలకు ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. దీని అంచనా ధర రూ. 40 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఉంది.

మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ (Mercedes-Benz S-Class Facelift):
అతి విలాసవంతమైన కార్లలో ఒకటైన మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వస్తోంది. ఇందులో 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు, ఇది అత్యున్నత డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ప్రీమియం ఫీచర్లు మరియు అద్భుతమైన ఇంటీరియర్‌తో రానున్న ఈ కారు ధర రూ. 1.95 కోట్లుగా నిర్ణయించారు.

పెట్రోల్ వద్దు.. డిజీల్ అవసరం లేదు.. ఈ కారు వస్తోంది వెంటనే త్వరపడండి

Electric car without petrol diesel
Electric car without petrol diesel

Electric car without petrol diesel: అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట అనే సినిమా వచ్చింది గుర్తుందా..అందులో ఓ కారులో వచ్చే సన్నివేశాలు నవ్వుతెప్పిస్తాయి. నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ ప్రయాణించే కారు ఆకస్మాత్తుగా సూపర్ కారుగా మారిపోతుంది. ఎటువంటి చమురు అవసరం లేకుండానే ఈ కారు ముందకు సాగుతుంది. అప్పట్లో ఈ సినిమా పెను సంచలనం కలిగించింది.

ఇప్పటికాలంలో ఆ తరహాలోనే కార్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. కాకపోతే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికాలంలో పెట్రోల్, డీజిల్ లేకుండా, ఈవీ తో సంబంధం లేకుండా కార్లను రూపొందిస్తున్నాయి కంపెనీలు. ఈ జాబితాలో మారుతీ సుజుకీ సింహభాగంలో నిలుస్తోంది. ఈకంపెనీ తయారు చేసిన కారు పూర్తిగా ఇథనాల్ తో నడుస్తుంది. అంతే కాదు, రోడ్ల మీద నుంచి రయ్యిమంటూ దూసుకుపోతుంది.

జూన్ ఐదున పర్యావరణ దినోత్సవం సందర్భంగా మారుతీ సుజుకీ ఈ కారును విడుదల చేయబోతోంది. ఇది పూర్తిగా ఇథనాల్(e100)తో నడుస్తుంది. మనదేశంలో ఇదే తొలి ఇథనాల్ ప్లెక్స్ ప్యూయల్ కారు కావడం గమనార్హం. మనదేశంలో ఇప్పటికే 20శాతం ఇథనాల్ మిళితమైన పెట్రోల్ అమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా ఇథనాల్ పర్సంటేజ్ ను 30 కి పెంచే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో మారుతీ పూర్తిగా ఇథనాల్ తో నడిచే కారును ఆవిష్కరించడం గమనార్హం. పూర్తి ఇథనాల్ వల్ల ఇంధనం ఖర్చు 25 నుంచి 35 శాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఇంధనం మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా కారు కోసం పెట్టే నిర్వహణ ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది.

అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంధనం మీద ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఆయిల్ తయారీ దేశాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇంధనం ధరలలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ధరల స్థాయి నిరంతరం ఒత్తిడికి గురవుతోంది. అందువల్లే ఇథనాల్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇథనాల్ వల్ల తక్కువ ఖర్చుతో వాహనాలను నడపవచ్చు. అంతేకాదు, వాహనాల పనితీరు కూడా బాగుంటుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది.

అధికారమే లక్ష్యంగా కేటీఆర్ పాదయాత్ర... పెద్ద ప్లానింగే..

KTR
KTR

KTR padayatra: ఏ పార్టీ నేత పాద యాత్ర చేసే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఖాయం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పదేళ్ల టీడీపీని గద్దెలోకి దించేందుకు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్‌ తనయుడు జనగ్‌ కూడా పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు. ఇక 2023లో టీడీపీ నేత లోకేశ్‌ పాదయాత్ర చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే సెంటిమెంటు కొనసాగించేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా పాదయాత్రను ఎంచుకున్నారు.

2027లో జనంలోకి..
2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు తాజాగా కేటీఆర్‌ ప్రకటించారు. గతంలో కూడా చెప్పాడు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది. తాజాగా ‘‘ఈలోపు ఫిట్‌ అవుతాను’’ అని చెప్పుతూ, పాదయాత్ర మార్గం పార్టీ చర్చల అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావడంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం లక్ష్యంగా ఈ పాదయాత్రం ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌కు ప్రజల మధ్య ఒక దూరం ఏర్పడిందని. ఇది చాలా ముఖ్యమైన అంగీకారం. ఎందుకంటే, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పాలనా యాంత్రికత, అధికార దూరం వల్ల గ్రామీణ–ప్రజా స్థాయి సంబంధాలు బలహీనపడతాయి. బీఆర్‌ఎస్‌ ఈ వాస్తవాన్ని అంగీకరించి, పాదయాత్ర ద్వారా ఆ అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా బాధ్యతావంతమైన వైఖరి.

ఏ పార్టీ నేత పాద యాత్ర చేసే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఖాయం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పదేళ్ల టీడీపీని గద్దెలోకి దించేందుకు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్‌ తనయుడు జనగ్‌ కూడా పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు. ఇక 2023లో టీడీపీ నేత లోకేశ్‌ పాదయాత్ర చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే సెంటిమెంటు కొనసాగించేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా పాదయాత్రను ఎంచుకున్నారు.

2027లో జనంలోకి..
2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు తాజాగా కేటీఆర్‌ ప్రకటించారు. గతంలో కూడా చెప్పాడు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది. తాజాగా ‘‘ఈలోపు ఫిట్‌ అవుతాను’’ అని చెప్పుతూ, పాదయాత్ర మార్గం పార్టీ చర్చల అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావడంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం లక్ష్యంగా ఈ పాదయాత్రం ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌కు ప్రజల మధ్య ఒక దూరం ఏర్పడిందని. ఇది చాలా ముఖ్యమైన అంగీకారం. ఎందుకంటే, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పాలనా యాంత్రికత, అధికార దూరం వల్ల గ్రామీణ–ప్రజా స్థాయి సంబంధాలు బలహీనపడతాయి. బీఆర్‌ఎస్‌ ఈ వాస్తవాన్ని అంగీకరించి, పాదయాత్ర ద్వారా ఆ అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా బాధ్యతావంతమైన వైఖరి.

పాదయాత్రలు శక్తివంతమైన సాధనమే..
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు, రాహుల్‌ గాంధీ వరకు అనేక నాయకులు పాదయాత్రల ద్వారా తమ రాజకీయ జీవితాల్లో కీలక మలుపులు తిప్పుకున్నారు. కేటీఆర్‌ కూడా ఇప్పుడు అదే మార్గం ఎంచుకోవడం ఆయన ఇమేజ్‌ను ‘హై–టెక్, అర్బన్‌ నాయకుడి’ నుంచి ‘ప్రజా నాయకుడి’గా మార్చుకోవాలన్న తపనను సూచిస్తోంది. కేటీఆర్‌ మరో ముఖ్యమైన విషయం స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎలాంటి కూటములు లేవని. ఇది ఒకవైపు ధైర్యవంతమైన నిర్ణయం కాగా, మరోవైపు ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఆఖకి పెద్ద సవాలు కూడా. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తున్నప్పటికీ, పార్టీ సంస్థాగత బలం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా కేడర్‌ను పునరుజ్జీవింపజేయడం, కొత్త నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం అత్యంత కీలకం.

కేటీఆర్‌ పాదయాత్ర విజయవంతమైతే, అది బీఆర్‌ఎస్‌ను మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ఆప్షన్‌గా నిలబెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ ఉన్న సానుభూతిని మళ్లీ సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడవచ్చు. అయితే, పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు. దాని వెనుక స్పష్టమైన అజెండా, ప్రజల సమస్యలపై నిజమైన దృష్టి, స్థిరమైన సందేశం ఉండాలి. లేనప్పుడు ఇది ఒక ఏడాది ముందు ఎన్నికల డ్రామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 2027లో ఆయన పాదయాత్ర ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటుందనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు, రాహుల్‌ గాంధీ వరకు అనేక నాయకులు పాదయాత్రల ద్వారా తమ రాజకీయ జీవితాల్లో కీలక మలుపులు తిప్పుకున్నారు. కేటీఆర్‌ కూడా ఇప్పుడు అదే మార్గం ఎంచుకోవడం ఆయన ఇమేజ్‌ను ‘హై–టెక్, అర్బన్‌ నాయకుడి’ నుంచి ‘ప్రజా నాయకుడి’గా మార్చుకోవాలన్న తపనను సూచిస్తోంది. కేటీఆర్‌ మరో ముఖ్యమైన విషయం స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎలాంటి కూటములు లేవని. ఇది ఒకవైపు ధైర్యవంతమైన నిర్ణయం కాగా, మరోవైపు ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఆఖకి పెద్ద సవాలు కూడా. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తున్నప్పటికీ, పార్టీ సంస్థాగత బలం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా కేడర్‌ను పునరుజ్జీవింపజేయడం, కొత్త నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం అత్యంత కీలకం.

కేటీఆర్‌ పాదయాత్ర విజయవంతమైతే, అది బీఆర్‌ఎస్‌ను మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ఆప్షన్‌గా నిలబెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ ఉన్న సానుభూతిని మళ్లీ సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడవచ్చు. అయితే, పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు. దాని వెనుక స్పష్టమైన అజెండా, ప్రజల సమస్యలపై నిజమైన దృష్టి, స్థిరమైన సందేశం ఉండాలి. లేనప్పుడు ఇది ఒక ఏడాది ముందు ఎన్నికల డ్రామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 2027లో ఆయన పాదయాత్ర ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటుందనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

Credit Card తో ఇబ్బంది పడేవారికి గుడ్ న్యూస్.. ఈ కొత్త కార్డుతో బోలెడు లాభాలు..

Slice UPI credit card benefits
Slice UPI credit card benefits

Slice UPI credit card benefits: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకోవడానికి వెనుకాడే ప్రధాన కారణం వార్షిక ఫీజులు, జాయినింగ్ ఛార్జీలు, ఇతర ఫెనాల్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో Slice UPI Credit Card వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ కార్డు జీవితకాలం ఉచితంగా అందుబాటులో ఉండటంతో పాటు రోజువారీ UPI చెల్లింపులకూ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?

UPIతో సులభ చెల్లింపులు:
స్లైస్ సూపర్ కార్డు ఒక RuPay ఆధారిత UPI క్రెడిట్ కార్డు. దీన్ని Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్‌లతో లింక్ చేసుకుని QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. చిన్న మొత్తాల లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల కొనుగోళ్ల వరకు సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు లేదా డెబిట్ కార్డు అవసరం లేకుండా రోజువారీ ఖర్చులను క్రెడిట్ ద్వారా నిర్వహించవచ్చు.

ఈ కార్డు ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు లేదా మెయింటెనెన్స్ ఛార్జీలు లేకపోవడం. అందువల్ల అదనపు ఖర్చుల భయం లేకుండా దీర్ఘకాలం వినియోగించుకోవచ్చు. సంప్రదాయ క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఇది వినియోగదారులకు ఆర్థికంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. స్లైస్ కార్డుతో చేసిన లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. వినియోగదారులు కొన్ని షరతులు నెరవేర్చితే గరిష్టంగా 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ప్రాథమిక స్థాయిలో 1 శాతం రివార్డులు లభిస్తాయి. ఎక్కువ రివార్డుల కోసం నిర్దిష్ట ఖర్చులు లేదా సేవింగ్స్ బ్యాలెన్స్‌కు సంబంధించిన అర్హతలు ఉండొచ్చు.

రూ.2,000 పైబడిన చెల్లింపులకు ‘నో కాస్ట్ ఈఎంఐ’:
ఈ కార్డులో మరో ముఖ్యమైన ఫీచర్ ‘Slice in 3’. సాధారణంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలను జరిపితే.. మూడు నెలల నో-కాస్ట్ EMIగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయంపై అదనపు వడ్డీ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంటోంది. దీంతో పెద్ద మొత్తాల ఖర్చులను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా దేశీయ UPI చెల్లింపులతో పాటు ఈ కార్డును అంతర్జాతీయంగా కూడా ఉపయోగించుకోవచ్చు. 200కు పైగా దేశాల్లో కార్డు ఆమోదం పొందుతుందని సంస్థ వెల్లడించింది. తరచుగా విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇది అదనపు ప్రయోజనంగా మారుతుంది.

ఈ కార్డు పొందాలంటే:
Slice UPI Credit Card పొందాలనుకునేవారు స్లైస్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. KYC ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఆధారంగా క్రెడిట్ లిమిట్ మంజూరు చేస్తారు. అనుమతి వచ్చిన వెంటనే వర్చువల్ కార్డు లభించగా, తర్వాత ఫిజికల్ కార్డును కూడా అందజేస్తారు.

రూపాయి ఢమాల్..స్టాక్ మార్కెట్ గుబేల్..మనకే ఎందుకీ దురవస్థ

Rupee fall against Dollar
Rupee fall against Dollar

Rupee fall against Dollar: వందకోట్లకు మించిన జనాభా.. సుస్థిరమైన ప్రభుత్వం.. విలువైన మానవ వనరులు..అంతకుమించి పని చేసే సత్తా ఉన్న వ్యక్తులు.. ఇన్ని అనుకూలతలున్నప్పటికీ భారత్ ఇబ్బందిపడుతోంది. ఎదిగే క్రమంలో బొక్కాబోర్లాపడుతోంది. మన కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వ్యాల్యూ కూడా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

యుద్దం, డాలర్ విలువ పెరిగిపోవడం, ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కొనుగోళ్లలో ఆటుపోట్లు ఇవన్నీఅంతర్జాతీయంగా రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రూపాయి విలువ కొంత కాలంగా దారుణంగా పడిపోతోంది. అంతేకాదు, జీవితకాల కనిష్టాన్ని చేరుకుని, పాలకులకు కన్నీరు మిగుల్చుతోంది. కరెన్సీ విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో ఫారెక్స్ నిల్వల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.

రూపాయి విలువ ఈస్థాయిలో పతనమవుతుంటే.. స్టాక్ మార్కెట్ కూడా నేల చూపులు చూస్తోంది. ఇటీవల తైవాన్ స్టాక్ మార్కెట్ భారతదేశాన్ని వెనక్కి నెట్టింది. ఐదో స్థానానికి చేరుకుంది. తాజాగా ఆరోస్థానాన్ని దక్షిణ కొరియా సొంతం చేసుకుంది. ఏఐ జమానాలో సెమీ కండక్టర్లు, మెమొరీ పరికరాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి తోడు సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ కంపెనీల షేర్లు ర్యాలీ కొనసాగించాయి.

సౌత్ కొరియా ప్రమాణిక ఈక్విటీ సూచి కోస్పీలో సామ్ సంగ్ అత్యధిక వెయిటేజీ సాధించాయి. సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీలుగా నిలిచాయి. ఇవన్నీ కూడా లక్ష కోట్ల డాలర్ల జాబితాలో చేరాయి. సౌత్ కొరియా కంపెనీలు సెమీ కండక్టర్ల తయారీలో దూసుకుపోతున్నాయి. విపరీతమైన లాభాలను నమోదు చేస్తున్నాయి. అందువల్లే సౌత్ కొరియా కెనడా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్లను సైతం దాటేసింది.

మనదేశంలో చిప్ ల తయారీ అంతగా ఊపందుకోలేదు. సెమీకండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఏఐ యుగంలో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. అందువల్లే వీటి విలువ చూస్తుండగానే లక్షలకోట్లను దాటేస్తోంది. ఇది మార్కెట్ నిపుణులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది.