Home Blog Page 194

రూపాయి ఢమాల్..స్టాక్ మార్కెట్ గుబేల్..మనకే ఎందుకీ దురవస్థ

Rupee fall against Dollar
Rupee fall against Dollar

Rupee fall against Dollar: వందకోట్లకు మించిన జనాభా.. సుస్థిరమైన ప్రభుత్వం.. విలువైన మానవ వనరులు..అంతకుమించి పని చేసే సత్తా ఉన్న వ్యక్తులు.. ఇన్ని అనుకూలతలున్నప్పటికీ భారత్ ఇబ్బందిపడుతోంది. ఎదిగే క్రమంలో బొక్కాబోర్లాపడుతోంది. మన కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వ్యాల్యూ కూడా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

యుద్దం, డాలర్ విలువ పెరిగిపోవడం, ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కొనుగోళ్లలో ఆటుపోట్లు ఇవన్నీఅంతర్జాతీయంగా రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రూపాయి విలువ కొంత కాలంగా దారుణంగా పడిపోతోంది. అంతేకాదు, జీవితకాల కనిష్టాన్ని చేరుకుని, పాలకులకు కన్నీరు మిగుల్చుతోంది. కరెన్సీ విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో ఫారెక్స్ నిల్వల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.

రూపాయి విలువ ఈస్థాయిలో పతనమవుతుంటే.. స్టాక్ మార్కెట్ కూడా నేల చూపులు చూస్తోంది. ఇటీవల తైవాన్ స్టాక్ మార్కెట్ భారతదేశాన్ని వెనక్కి నెట్టింది. ఐదో స్థానానికి చేరుకుంది. తాజాగా ఆరోస్థానాన్ని దక్షిణ కొరియా సొంతం చేసుకుంది. ఏఐ జమానాలో సెమీ కండక్టర్లు, మెమొరీ పరికరాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి తోడు సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ కంపెనీల షేర్లు ర్యాలీ కొనసాగించాయి.

సౌత్ కొరియా ప్రమాణిక ఈక్విటీ సూచి కోస్పీలో సామ్ సంగ్ అత్యధిక వెయిటేజీ సాధించాయి. సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీలుగా నిలిచాయి. ఇవన్నీ కూడా లక్ష కోట్ల డాలర్ల జాబితాలో చేరాయి. సౌత్ కొరియా కంపెనీలు సెమీ కండక్టర్ల తయారీలో దూసుకుపోతున్నాయి. విపరీతమైన లాభాలను నమోదు చేస్తున్నాయి. అందువల్లే సౌత్ కొరియా కెనడా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్లను సైతం దాటేసింది.

మనదేశంలో చిప్ ల తయారీ అంతగా ఊపందుకోలేదు. సెమీకండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఏఐ యుగంలో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. అందువల్లే వీటి విలువ చూస్తుండగానే లక్షలకోట్లను దాటేస్తోంది. ఇది మార్కెట్ నిపుణులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

చిరంజీవి హీరోగా నాగార్జున విలన్ గా ఒక సినిమా చేయబోతున్నారా..?

Chiranjeevi and Nagarjuna movie
Chiranjeevi and Nagarjuna movie

Chiranjeevi and Nagarjuna movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నాగార్జున విలన్ గా ఒక సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నాగార్జున విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టే చిరంజీవి సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఆ మూవీలో హీరోకి పాటకి తగ్గట్టుగానే విలన్ పాత్ర కూడా ఉంటుందని అందువల్లే తను ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.

అలా అయితేనే చిరంజీవితో పాటు ప్రతి ఒక్కరు అతనికి డేట్స్ ఇవ్వడమే కాకుండా అతని సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే అతను టాప్ డైరెక్టర్ గా మారడానికి కూడా అవకాశాలైతే ఉంటాయి. నాగార్జున ఈ సినిమాలో నటిస్తే మాత్రం చిరంజీవి నాగార్జున లను ఒకే సినిమాలో చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్లను చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తాడు తద్వారా నాగార్జున ఇమేజ్ ని ఎలా పెంచుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

చిరంజీవి సైతం బాబీ తో చేస్తున్న సినిమా విషయంలో చాలా కసరత్తులను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రాబోతుందనేది విషయం తెలియాలంటే ప్యారడైజ్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా రిజల్ట్ ను బట్టే చిరంజీవి అతనితో సినిమా చేస్తాడా? లేదా అనేది తెలుస్తుంది…

ఓవర్సీస్ లో 'రాజాసాబ్' ని కూడా దాటలేకపోయిన 'పెద్ది '.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Peddi Hindi Version Advance Bookings
Peddi Hindi Version Advance Bookings

Peddi movie overseas box office collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం కొద్దీ గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై ఉత్కంఠ ని రేపాయి, అంచనాలను భారీ రేంజ్ లో పెంచేలా చేశాయి, కానీ ఇండియా లో ఈ సినిమాకు ఉన్నంత డిమాండ్ , ఎందుకో ఓవర్సీస్ లో లేదు అనేది కఠోరమైన నిజం. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై నెల రోజులు దాటింది. ఈ చిత్రానికి ఉన్నటువంటి హైప్ ని చూసి , ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఓజీ, దేవర, కల్కి , పుష్ప 2 తరహా ఓపెనింగ్ వస్తుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ‘రాజాసాబ్’ కంటే తక్కువ గ్రాస్ ఓవర్సీస్ నుండి నమోదైంది, ఇదే అభిమానులను కంటతడి పెట్టిస్తున్న విషయం.

ప్రీమియర్ షోస్ కి గానూ ‘రాజా సాబ్’ చిత్రానికి ఓవర్సీస్ మొత్తం మీద 1.65 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, ‘పెద్ది’ చిత్రానికి కేవలం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. నార్త్ అమెరికా లోని USA లో కూడా ఇదే పరిస్థితి. రాజా సాబ్ చిత్రానికి 1700 షోస్ కి గానూ 1.032 మిలియన్ డాలర్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వగా , ‘పెద్ది’ చిత్రానికి 1.022 మిలియన్ డాలర్లు మాత్రమే నమోదైంది. మరోపక్క ఇండియా లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి భిన్నంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ లో బుకింగ్స్ మొదలు పెట్టారు , తెలంగాణ లో కాసేపటి క్రితమే పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలయ్యాయి. అప్పుడే 10 లక్షలకు పైగా టికెట్స్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ నుండి అమ్ముడుపోయాయి అంటే సాధారణమైన విషయం కాదు.

ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. బుక్ మై షో లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కచ్చితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి సెన్సేషనల్ ఓపెనింగ్ రాబోతుంది , వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఓవర్సీస్ బుకింగ్స్ మాత్రమే కాస్త ట్రేడ్ ని , అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇదంతా పక్కన పెడితే , టాక్ వస్తే ఓవర్సీస్ లో కూడా సునామీ లాంటి వసూళ్లను చూడొచ్చు అనేది వాస్తవం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ‘పెద్ది’ ఎలాంటి వసూళ్లను రాబడుతుంది అనేది.

‘మృగశిర’లో ఎటువంటి పంటలు వేస్తే రైతులకు లాభం..

Mrugashira Nakshatra farming crops
Mrugashira Nakshatra farming crops

Mrugashira Nakshatra farming crops: వ్యవసాయంలో మృగశిర కార్తెకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సాధారణంగా జూన్ నెల ప్రారంభంలో వచ్చే మృగశిర కార్తెతోనే దక్షిణ భారతదేశంలో వర్షాకాల వ్యవసాయ పనులు మొదలవుతాయి. రైతులు ఈ సమయంలో కురిసే తొలకరి వర్షాలను ఆధారంగా చేసుకుని ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమవుతారు. నేలలో తగిన తేమ ఏర్పడటంతో విత్తనాల మొలక శాతం కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ ఖరీఫ్ సాగులో ఎలాంటి పంటలు వేస్తే లాభంగా ఉంటుంది? దీని కోసం రైతులు ఎటువంటి పనులు చేయాలి.

పత్తి:
మృగశిర కార్తెలో ఎక్కువ మంది రైతులు పత్తి విత్తనాలు వేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో వర్షాలు సక్రమంగా కురిస్తే పత్తి మొక్కలు బలంగా ఎదిగి మంచి దిగుబడిని ఇస్తాయి. ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో మృగశిర సమయంలో వేసిన పత్తి పంటకు నీటి అవసరం కూడా కొంత వరకు తగ్గుతుంది. సరైన రకాలను ఎంపిక చేసుకుంటే ఎకరానికి అధిక దిగుబడి సాధించవచ్చు.

మొక్కజొన్న:
మొక్కజొన్న పంట కూడా మృగశిర కార్తెలో వేయడానికి అనువైన పంటగా వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ వ్యవధిలో పంట చేతికి రావడం, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం దీని ప్రత్యేకత. వర్షాధార ప్రాంతాల్లో కూడా మొక్కజొన్న సాగు విజయవంతంగా సాగుతుంది. ప్రారంభ దశలో తగిన తేమ లభిస్తే మొలకలు బాగా వస్తాయి.

కంది, పెసర, మినుము:
మృగశిర వర్షాల తరువాత కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాల సాగు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ పంటలు తక్కువ నీటితో పెరుగుతాయి. నేల సారాన్ని పెంచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎండలను తట్టుకునే స్వభావం ఉండటంతో వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు భరోసానిస్తాయి.

వేరుశెనగ:
ఎర్ర నేలలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మృగశిర కార్తెలో వేరుశెనగ విత్తడం ఉత్తమం. నేలలో తగిన తేమ ఉన్నప్పుడు విత్తనాలు వేగంగా మొలకెత్తి ఆరోగ్యకరమైన మొక్కలుగా ఎదుగుతాయి. వర్షపాతం సాధారణంగా ఉంటే వేరుశెనగ రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

జొన్న, సజ్జ, రాగి:
వాతావరణ మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెడుతున్నారు. జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు తక్కువ నీటితో పెరుగుతాయి. మృగశిర కార్తెలో విత్తితే మంచి దిగుబడులు సాధించవచ్చు. వీటికి మార్కెట్‌లోనూ డిమాండ్ పెరుగుతోంది.

వరి:
నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రైతులు మృగశిర కార్తె సమయంలో వరి నర్సరీలను ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో వేసిన నారు ఆరోగ్యంగా పెరిగి తర్వాత ప్రధాన పొలంలో నాటేందుకు సిద్ధమవుతుంది. మంచి వర్షపాతం ఉంటే వరి సాగుకు ఇది ఉత్తమ ప్రారంభ దశగా భావిస్తారు.

రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
మృగశిర కార్తెలో పంట ఎంపిక చేసే ముందు స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యతను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన అధిక దిగుబడి రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అలాగే విత్తన శుద్ధి, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నివారణ చర్యలు చేపడితే దిగుబడి మరింత పెరుగుతుంది.

హైదరాబాద్ 'విమల్' థియేటర్ లో 'స్పిరిట్' మూవీ షూటింగ్.. వైరల్ అవుతున్న వీడియో..

Spirit movie shooting in Hyderabad
Spirit movie shooting in Hyderabad

Spirit movie shooting in Hyderabad: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘స్పిరిట్’. ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ నుండి తెరకెక్కుతున్న చిత్రం కావడం , అది కూడా బలమైన పోలీస్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కే యాక్షన్ సినిమా కావడం తో ఈ సినిమా పై ఆ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రభాస్ కి ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడం అలవాటు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ కారణం చేత ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యింది , కానీ రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. ఒక్క రోజు గ్యాప్ కూడా లేకుండా షూటింగ్ చేస్తున్నారు.

ఇటీవలే ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి దిమిరి పై పలు సన్నివేశాలను తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ వంగ, నిన్న హైదరాబాద్ లోని మూవీ లవర్స్ కి లేటెస్ట్ ఫేవరేట్ స్పాట్ గా మారిన విమల్ థియేటర్ లో షూటింగ్ చేసాడు. వర్షం బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ థియేటర్ లో తెరకెక్కించారు. కేవలం ఒక్క రోజు మాత్రమే ఈ థియేటర్ లో షూటింగ్ జరిగిందట. నేటి నుండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ ప్రదర్శితం అవ్వనుంది. అయితే పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్న ‘స్పిరిట్’ వంటి బడా మూవీ షూటింగ్ హైదరాబాద్ విమల్ థియేటర్ లో జరిపించడం నిజంగా విశేషమే. ఈ థియేటర్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్వాలిటీ పరంగా ఎలాంటి రాజీ లేకుండా రీ మోడలింగ్ చేసిన విమల్ థియేటర్ లో సినిమా తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్స్ నమోదు అవుతుంటాయి.

ఇప్పుడు ప్రభాస్ మూవీ షూటింగ్ అక్కడ జరిగింది అనే క్రేజ్ తో ఈ థియేటర్ లో ఫుట్ ఫాల్స్ ఇంకా భారీ రేంజ్ లో పెరుగుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ విమల్ థియేటర్ లో జరుగుతుంది అనే విషయం సోషల్ మీడియా లో బాగా వ్యాప్తి చెందడం తో అభిమానులు వేల సంఖ్యలో థియేటర్ వద్ద చేరుకున్నారు. ప్రభాస్ ని చూడగానే అదుపుతప్పిన ఉత్సాహం తో కాస్త ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పారు. పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని పరిస్థితి ని అదుపులోకి తీసుకొని రావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకు సంబంధించినా వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by AD!TYA (@cult_rebel)

అటు పవన్‌ కు.. ఇటు కాంగ్రెస్‌కు.. ఇచ్చిపడేసిన కేటీఆర్‌..

KTR
KTR

KTR sensational comments: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు అయింది. హస్తం పార్టీపై రాష్ట్రంలో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కూడా అన్నదాత ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) కాంగ్రెస్‌ 30 నెలల పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌..
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల అభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు ‘‘ఎంత కండలు తిరిగిన పెహల్వాన్‌ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టించలేడు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి తీవ్ర స్పందన ఇచ్చిన కేటీఆర్‌ ‘‘సరే మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి? మిమ్మల్ని ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం రెండున్నరేళ్లలో కనీస ఫలితాలు కూడా ఇవ్వలేకపోవడాన్ని ఎండగట్టారు.

బంగారు తెలంగాణ సర్వనాశనం..
తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే సర్వనాశనం చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిదని, కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక ఆ పురోగతి నిలిచిపోయిందని ఆరోపించారు. 30 నెలలుగా ఒక్కటి కూడా గుర్తింపు తెచ్చే పని చేయలేదని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌పై ఫైర్‌…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించాలనుకున్న సభ వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ విభజన సమయంలో పవన్‌ చూపిన వైఖరి ఇప్పుడు హైదరాబాద్‌లో సభ పెట్టడానికి సరిపోదన్నారు. గతంలో తెలంగాణ విభజనపై పవన్‌ తీసుకున్న ధోరణి, ప్రస్తుతం ఆవిర్భావ దినోత్సవం రోజున సభ పెట్టడంపై మండిపడ్డారు. తెలంగాణ 4 కోట్ల భూమిపుత్రుల జాగీర్‌ అన్నారు. ఉద్యమం ద్వారా సాధించిన విజయాన్ని ఎవరూ తమ రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. కేటీఆర్‌ ఈ వివాదం ద్వారా తెలంగాణ గర్వాన్ని మళ్లీ రేకెత్తించి, తమ పార్టీని రీబ్రాండ్‌ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించిందనడంలో సందేహం లేదు. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ గతం, వర్తమానం మరియు భవిష్యత్‌ మధ్య జరుగుతున్న సంభాషణగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలా మార్పులు తీసుకురాబోతోందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

తాజా విమర్శల ద్వారా కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టారు. తెలంగాణకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పకనే చెప్పారు. దీంతో ప్రభుత్వం తన 30 నెలల ప్రగతిని స్పష్టమైన గణాంకాలు, ఫలితాలతో నిరూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ తనను తాను ‘‘తెలంగాణ అభివృద్ధి రక్షకుడు’’గా ప్రదర్శించుకోవడానికి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది.

అన్నం, చపాతీ కలిపి తింటున్నారా..ఏం జరుగుతుందంటే..

Eating Rice and Chapati together
Eating Rice and Chapati together

Eating Rice and Chapati together: ప్రస్తుతం మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో అన్నం, చపాతీ రెండింటినీ ఒకేసారి భోజనంలో తీసుకోవడం మంచిది కాదని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అన్నం, చపాతీ కలిపి తింటే ఏం జరుగుతుందంటే?

అన్నం మరియు చపాతీ రెండూ ప్రధానంగా కార్బోహైడ్రేట్లను అందించే ఆహార పదార్థాలు. శరీరంలో కార్బోహైడ్రేట్లు జీర్ణమైన తర్వాత గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరతాయి. ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండింటినీ కలిపి తినడం వల్ల కార్బోహైడ్రేట్ల పరిమాణం ఒక్కసారిగా ఎక్కువవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఏ ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత మేర పెరుగుతుందో గ్లైసెమిక్ లోడ్ ద్వారా అంచనా వేస్తారు. అన్నం, చపాతీ రెండింటినీ కలిపి తినడం వల్ల భోజనం మొత్తం గ్లైసెమిక్ లోడ్ పెరుగుతుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ స్పైక్స్‌కు దారితీస్తుంది. తరచూ ఇలా జరగడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించలేకపోవడం లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో అధిక కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుంది. అందువల్ల వైద్యులు ఒకే భోజనంలో అన్నం లేదా చపాతీ.. వీటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

భోజనంలో కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్, ప్రోటీన్లు కూడా ఉండటం చాలా ముఖ్యం. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, శనగలు వంటి ఆహారాలు ఫైబర్ మరియు ప్రోటీన్లను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా చేరేలా చేస్తాయి. ఫలితంగా షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి.

పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం, భోజన ప్లేట్‌లో సగం భాగం కూరగాయలు, పావు భాగం ప్రోటీన్ ఆహారాలు (పప్పులు, పెరుగు, గుడ్లు మొదలైనవి), మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీలకు కేటాయించడం ఉత్తమం. ఈ విధానం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

'పెద్ది' సినిమాపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. సంచలనం రేపుతున్న వీడియో..

Pawan Kalyan emotional post on Peddi
Pawan Kalyan emotional post on Peddi

Pawan Kalyan emotional post on Peddi: మరి కొద్దీ గంటల్లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ మొదలయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ 60 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ ‘పెద్ది’ చిత్రం గురించి తన సోషల్ మీడియా మాధ్యమాలలో వేసిన పోస్టులు ఇప్పుడు సంచనలనం గా మారాయి. ఈ పోస్టులను చూస్తే రామ్ చరణ్ పై తనకు ఎలాంటి ప్రేమ ఉందో మరోసారి స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ది గ్లింప్స్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేల యొక్క గొప్పతనాన్ని తెలిపే చిత్రమిది. చిన్న తనం నుండి గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగేంత వరకు రామ్ చరణ్ ప్రయాణాన్ని చూస్తూనే ఉన్నాను. కానీ ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగిపోయే మనస్తత్వం ఉన్న మనిషి మా రామ్ చరణ్. ఇక పిఠాపురం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ దర్శకుడు బుచ్చి బాబు కి తన మాతృ నేల పై ఎలాంటి ప్రేమ ఉందో , ఈ సినిమా తో కూడా హీరో పాత్ర ద్వారా మాతృ భూమి గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అందించిన సంగీతం , సినిమా పై అంచనాలను , ఆసక్తి ని తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి’.

‘అదే విధంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థని ప్రత్యేకంగా అభినందించాలి. ఇలాంటి సినిమాని ఈ రేంజ్ స్కేల్ తో , భారీ తారాగణం తో తెరకెక్కించడం చిన్న విషయం కాదు. ఈ చిత్రానికి విడుదలకు ముందు ఎదురైనా అడ్డంకులను నేనంతా గమనిస్తూనే ఉన్నాను. కానీ ఆంజనేయ స్వామి ఎలా అయితే అడ్డంకులను జయించి , లక్ష్యాన్ని చేధించాడో, మా రామ్ చరణ్ కూడా అలాంటి అడ్డంకులను ఛేదించి ఘన విజయం సాధిస్తాడు అనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మూవీ టీం మొత్తానికి విజయం ప్రాప్టించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అంతే కాదు , ఒక వీడియో ని ఆయన తన టీం తో ప్రత్యేకంగా ఎడిట్ చేయించి విడుదల చేయించడం కూడా హైలైట్ గా మారింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

బుద్ధిమంతుడని ఉద్యోగమిస్తే..ల్యాప్ టాప్ ఎత్తుకుపోయాడు

Employee laptop theft incident
Employee laptop theft incident

Employee laptop theft incident: పాపమని పాతబట్టలు ఇస్తే గోడచాటుకు పోయి కోలుచుకున్నాడట వెనుకటికి ఒకడు. ఇతడి యవ్వారం పై సామెత మాదిరిగానే ఉంది. ఉద్యోగాలున్నాయి.. అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోండి. మెరుగైన జీతం,ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ఉబర్ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఇవ్వడమే ఆ కంపెనీ పాలిటి శాపమైంది.

ఉబర్ కంపెనీ మనదేశంలో కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆన్ లైన్ లో ఫుడ్, ట్రావెలింగ్ వంటి విభాగాలలో సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ ఇటీవల ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఇవ్వడమే ఆ కంపెనీ పాలిట పాపమైంది. కంపెనీ ఇంటర్వ్యూకు ఓ యువకుడు హాజరయ్యాడు. అన్ని రౌండ్లను క్లియర్ చేశాడు. అంతే కాదు, వెళ్తూవెళ్తూ కంపెనీ కొత్త మ్యాక్ బుక్ ను చోరీ చేశాడు. హైదరాబాద్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఉబర్ కంపెనీలో ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. దీనిపై రిక్రూటర్ చేసిన వ్యక్తి లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ‘ఫోన్ స్విచ్చాప్,లింక్ డ్ ఇన్ ప్రొఫైల్ కనిపించడం లేదు. ల్యాప్ టాప్ పంపించిన చిరునామాలో వెతికితే అక్కడ అతడు లేడు. పైగా అతడు ఆ రూమ్ ను ఖాళీ చేశాడు. ల్యాప్ టాప్ ను అతడు ఫ్యాక్టరీ రీసెట్ చేశాడు. ఇదంతా ఒక ప్రణాళిక మాదిరిగా కనిపిస్తోందని’ ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

ఇటీవల కాలంలో కంపెనీలు ఉద్యోగార్థులు ఎటువంటి మోసాలు చేయకుండా ఉండేందుకు ఇంటర్వ్యూల సమయంలో ల్యాప్ టాప్ లను నేరుగా వారి దగ్గరికి పంపిస్తున్నాయి. ఈ సమయంలో కొంతమంది ల్యాప్ టాప్ లను చోరీ చేస్తున్నారు. తాజాగా ఉబర్ కంపెనీకి ఈ పరిణామం ఎదురుకావడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కంపెనీలు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల వల్ల అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరం పరువుపోతుందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ల సమయంలో అభ్యర్థుల ప్రవర్తన, వ్యవహార శైలి మీద ఫోకస్ పెట్టాలని వారు సూచిస్తున్నారు.

ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మామూలుగా ఉండదంటున్న స్టార్ హీరో..

Prabhas
Prabhas

Prabhas friendship with star heroes: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చో బెట్టాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా బాలీవుడ్ హీరోలకు సైతంకి పోటీని ఇచ్చాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక బాహుబలి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ క్రేజ్ ను టచ్ చేయడం బాలీవుడ్ హీరోల వల్ల కావడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అందుకే ఆయన చాలావరకు సక్సెస్ లను సాధిస్తున్నాడు… ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టమని చాలా మంది చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ప్రభాస్ హీరో గానే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ గా కూడా కొనసాగుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా అతనే దగ్గరుండి సాల్వ్ చేస్తూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఫ్రెండ్స్ అందరికి విపరీతంగా భోజనం పెట్టించేస్తుంటాడట. తన ఇంట్లోనే డిఫరెంట్ కర్రీస్ ను చేయించి ఫ్రెండ్స్ కి దగ్గరుండి మరి తనే వడ్డిస్తూ వాళ్ళందరికీ ఫుల్లుగా తినిపిస్తుంటాడట. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తమ ఫ్రెండ్స్ కి చాలా ఇబ్బంది అవుతుందని అయినప్పటికి ప్రభాస్ వదలకుండా గట్టిగా తినాలని చెబుతూ ఉంటాడట.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేయడం అన్ని విధాలుగా ప్లస్ అయినప్పటికి భోజనం విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్టార్ హీరో గోపీచంద్ సైతం పలు సందర్భాల్లో తెలియజేశారు. నిజానికి ప్రభాస్ గోపీచంద్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. వీరిద్దరు వర్షం సినిమాలో కలిసి నటించారు. ఇక అప్పటినుంచి వీళ్ల మధ్య విపరీతమైన బాండింగ్ ఏర్పడింది.

ఒకరకంగా చెప్పాలంటే యూవీ క్రియేషన్స్ లో గోపీచంద్ ను హీరోగా పెట్టి చాలా సినిమాలను నిర్మించడానికి కారణం ప్రభాస్ అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇలానే కలకాలం కొనసాగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు…

'ఇరుముడి' గ్లింప్స్ లో కొత్త రవితేజ కనిపించాడా..? స్టోరీ ఇదేనా..?

Irumudi Movie
Irumudi Movie

Ravi Teja Irumudi movie story: కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చిన రవితేజ…వాటితోనే భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. నిజానికి శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి గత కొద్దిసేపటి క్రితమే ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. రవితేజ తన కూతురితో ఆడుకుంటున్న కొన్ని షాట్స్ వేశారు. అలాగే తన కూతురు తను ఇద్దరు కూడా అయ్యప్ప మాల ధరించినట్టుగా చూపించారు. మొత్తానికైతే తన కూతురికి ఏదో ఇబ్బంది జరుగుతుంది. దాని వెనక ఎవరున్నారు అనేది తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని ఏరుపారేస్తూ ఉండడమే ఈ సినిమా కథగా తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో రవితేజ చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. శివ నిర్వాణ సైతం ఇంతకు ముందు చేసిన ఖుషి సినిమాతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు.

దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో అటు రవితేజ, ఇటు శివ నిర్వాణ ఇద్దరికి సక్సెస్ దక్కుతుందని చాలా మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ను కనుక చూసినట్లయితే మాత్రం గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులందరి చేత ప్రశంసలైతే దక్కుతున్నాయి…

గ్లింప్స్ అంటే రొటీన్ రెగ్యులర్ గా ఇవ్వకుండా డిఫరెంట్ గా సినిమా లోని కంటెంట్ ను చెప్పకనే చెప్పినట్టుగా రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరు కూడా ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది… చూడాలి మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది…

ఎన్టీఆర్ మొహమాటానికి పోయి చేసిన రెండు సినిమాలు ఇవే...కోలుకోలేని దెబ్బ కొట్టాయిగా...

NTR
NTR

NTR career mistakes: సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వస్తే చాలు హీరోలు టాప్ పొజిషన్ కి వెళ్తారు. అదే ఒక ఫ్లాప్ సినిమా పడితే మాత్రం పాతాళానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే మొహమాటానికి పోయి సినిమాలను చేసి ప్లాప్ లను మూట గట్టుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే మొహమాటానికి పోయి రెండు సినిమాలతో భారీ ప్లాప్ లను మూట గట్టుకున్నారు. సింహాద్రి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన సినిమాతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక దానికి తోడుగా ఆయన బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన నరసింహుడు సినిమా ఘోరంగా విఫలమైంది. ఆ ప్రొడ్యూసర్ ట్యాంక్ బండ్ లో దూకి మరి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కి ఎంత భారీ నష్టాలను మిగిల్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ముళ్ళపూడి వర దర్శకత్వంలో చేసిన ‘నా అల్లుడు’ సినిమా కూడా డిజాస్టర్ అయింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించినప్పటికి ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేదు.

రాజమౌళి ఉన్నాడనే ఒక దృక్పథంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేశాడు. ఇక ముళ్ళపూడి వర ఈ సినిమా ని అనుకున్న రేంజ్ లో తీయకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. మొత్తానికైతే మొహమాటానికి పోయి ఆయన చేసిన ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.

ఈ రెండు మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ను భారీగా డౌన్ చేశాయి.
అలాగే తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోయేలా చేశాయి. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మొహమాటానికి పోవడం తగ్గించుకుంటే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్లకు చెబుతుంటారు.

సినిమా కథను బట్టి దర్శకుడిని బట్టి ముందుకెళ్లాలి తప్ప ఏదో మొహమాటానికి వెళ్ళి సినిమాలు తీస్తే ఇప్పటి వరకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న మార్కెట్ కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

రెండో పెళ్లాం.. ది క్యాన్సర్ హబ్.. మీకో దండం రా అయ్యా

Rendo Pellam
Rendo Pellam

Rendo Pellam: మనుషులకు మాత్రమే కాదు, వ్యాపార సంస్థలకు కూడా పేర్లు ఉంటాయి. పేర్ల ఆధారంగానే ఆయా వ్యాపార సంస్థలు ప్రజల్లో ఒక బ్రాండ్ విలువను సొంతం చేసుకుంటాయి. ఒకప్పుడు వ్యాపార సంస్థలకు పేర్లను పెట్టే విషయంలో ఇప్పుడున్న స్థాయిలో వినూత్న విధానాన్ని అవలంబించేవారు కాదు. రానురాను జనాల మైండ్ సెట్ మారిన నేపథ్యంలో వ్యాపార సంస్థల పేర్లు కూడా విచిత్రంగా ఉంటున్నాయి.

నేటికాలంలో యువత వినూత్నమైన పేర్లు ఉన్న వ్యాపారసంస్థలలోనే కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్ల విషయంలో మాత్రం తమకు నచ్చిన పేరు ఉన్న వాటిల్లోనే దండిగా తినేస్తున్నారు. దీంతో క్యాచీ పేర్లు పెట్టేందుకు వ్యాపార సంస్థల నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖపట్టణంలో ఇద్దరు వ్యక్తులు వ్యాపారసంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి అత్యంత వినూత్నమైన పేర్లను పెట్టారు. దీంతో అవి సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.

విశాఖపట్టణంలోని మర్రిపాలెంలో రెండో పెళ్లాం అనే పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. మరో వైపు ఓ పాన్ షాప్ యజమాని విచిత్రంగా తన దగ్గర లభ్యమయ్యే పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా తన షాపునకు ది క్యాన్సర్ హబ్ అనే పేరు పెట్టాడు.

రెండో పెళ్లాం.. ది క్యాన్సర్ హబ్ అనే పేర్లు నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. మీ వ్యాపారం జోరుగా సాగేందుకు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు. మీరు మాములోళ్లు కాదు.. మీ వ్యాపారం మరింత గొప్పగా సాగాలి.. మీరు గొప్పగా వెలుగొందాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

పిల్లలను బడికి పిలిచే ఓ సిక్కోలు పాట.. కదిలిస్తోంది.. రప్పిస్తోంది..

Srikakulam Viral Song
Srikakulam Viral Song

Srikakulam Viral Song: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఈనెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. పిల్లలకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. సెలవుల్లో బంధువుల ఇంటికి, విహారయాత్రలకు వెళ్లిన వారు ఇంటి ముఖం పడుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలను చూపుతూ సాగిన ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భీమ్లా నాయక్ పాటతో..
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో టైటిల్ సాంగ్ ను జతచేస్తూ.. పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని.. పిల్లలు రావాలని సూచిస్తూ సాగిన పాట.. తెర వెనుక ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలను చూపుతూ సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఔత్సాహిక యువకులు ఈ పాటను రూపొందించి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఇనిస్టా తో పాటు రీల్స్ లో ఈ పాట దుమ్ము దులుపుతోంది. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ముగుస్తున్న సెలవులు..
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. విద్యార్థులకు అవసరమైన పుస్తకాల సేకరణలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. బ్యాగులు, షూస్, యూనిఫారం వంటివి సేకరిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. సాధారణంగా వేసవి సెలవులు అంటేనే విహారయాత్రలకు, బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఇప్పుడు పాఠశాలలు తెరిచే సమయం సమీపిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆందోళన. ఫీజులతోపాటు ఇతర ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ నెలలో. పెరిగిన ఖర్చులను ఊహించుకుని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరోవైపు విద్యార్థులు సైతం తమకు ఇష్టమైన సెలవులు ముగిస్తుండడంతో వారి ముఖంలో కూడా కాస్త బాధ కనిపిస్తోంది. కానీ పాఠశాలలకు పిల్లలను స్వాగతిస్తూ భీమ్లా నాయక్ తరహాలో వైరల్ అవుతున్న ఆ పాట మాత్రం ఆకట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Hari Rocky (@hari_hockey_13_travelr)

మా రాజకీయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోము అంటూ పవన్ కళ్యాణ్ కి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..

KTR CM Candidate
KTR CM Candidate

KTR strong warning to Pawan Kalyan: గత కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. అనవసరంగా ఆయన్ని గెలుకుతూ , మేధావుల ముసుగులో కొంతమంది విశ్లేషకులు పుట్టించిన పుకార్ల నుండి ఈ వివాదం మొదలైంది. తర్వాత ఆ ప్రముఖ మేధావి విశ్లేషకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేసి క్షమాపణలు చెప్పడం , అక్కడితో ఆగకుండా సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ మీద ముప్పేట దాడి చేస్తూ ప్రెస్ మీట్ ని నిర్వహించడం , ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా , నవ తెలంగాణ నిర్మాణ సభ ని ఏర్పాటు చేయడం , అందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం వంటివి పొలిటికల్ హీట్ ని తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి.

ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కూడా , పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , తెలంగాణ లో తనని అడుగుపెట్టనివ్వం అంటూ ప్రగల్భణాలు పలికిన కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీల నాయకులపై తీవ్రమైన విమర్శలు చేయడం వంటివి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ పై కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ మీరు అయ్యా జాగీరా ? అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మీరు ఒక్క విషయాన్నీ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరు. ఈ నేల కోసం కష్టపడినా వారు , ఈ నేల కోసం త్యాగం చేసిన వాళ్ళ నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికీ తెలంగాణ , 4 కోట్ల భూమి పుత్రుల జాగీరు’ అంటూ చెప్పుకొచ్చాడు కేటీఆర్.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మీరు ఇక్కడే ఉన్నారు , మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు , అలాగే ఉండండి , ఎవరికీ ఇబ్బంది లేదు , 10 , 12 ఏళ్ళ నుండి చిన్న సమస్య అయినా వచ్చిందా?, మేము ఎలాంటి వాళ్ళమంటే , వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రవేటీకరిస్తున్నారు అంటే , వాళ్ళ తరుపున మేము పార్లమెంట్ లో పోరాడాము బీజేపీ తో’ అంటూ ఆయన గుర్తు చేసాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ లో పోటీ చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, 2023 లో ఆయన పోటీ కూడా చేసారని, కానీ ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అలోచించి మాట్లాడండి అని , మిమ్మల్ని ఎవరూ అడ్డుకోవట్లేదని, మీరే ఊహాజనితమైన ప్రభంజనాలు సృష్టించుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు . పవన్ కళ్యాణ్ నుండి ఓజీ అనే సినిమా వచ్చిందని , మాకు తెలంగాణ లో ఇప్పటికే కేసీఆర్ అనే ఓజీ ఉన్నాడని , మరో ఓజీ అవసరం లేదని, మా రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ ఊరుకోము అంటూ కేటీఆర్ హెచ్చరించాడు.

‘కట్‌ మనీ’ తిరిగిచ్చేస్తున్నారు. ప్రజల తిరుగుబాటుతో ఉ*చ్చ పోసుకుంటున్న టీఎంసీ నేతలు!

TMC cut money controversy
TMC cut money controversy

TMC cut money controversy: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. దీంతో 15 ఏళ్ల తృణమూల్‌ పాలన ముగిసింది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ నాయకులు 15 ఏళ్లు సాగించిన అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. ఇటీవల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ప్రజలు గతంలో సాగించిన అరాచకాలను గుర్తుచేసుకుంటూ టీఎంసీ నేతలపై తిరగబడుతున్నారు. ఇటీవల మమత బెనర్జీ మేనల్లుడిపై దాడిచేశారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ రాజకీయాలు మళ్లీ ఒక వికృతమైన సత్యాన్ని బయటపెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ‘కట్‌ మనీ’ పేరుతో లక్షలు, కోట్లు కొల్లగొట్టిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఆ డబ్బును ప్రజలకు తిరిగి ఇస్తున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

బెంగాల్‌లో కట్‌ మనీ వ్యవస్థ..
2021 నుంచి ముఖ్యంగా కూచ్‌ బెహర్‌ జిల్లాలో టీఎంసీ నేతలు ప్రభుత్వ పథకాల డబ్బు వచ్చినప్పుడు ప్రతీ లబ్ధిదారుడి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కట్‌ చేసి వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఒక్క జిల్లాకు పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అవినీతి సంస్కృతి లోతుగా వ్యాపించింది. ఇప్పుడు అదే నేతలు గ్రామాల్లోకి వెళ్లి, డబ్బు తిరిగి ఇస్తూ, క్షమాపణ చెప్పుతున్నారు. అయితే ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు..అధికారం కోల్పోయిన భయం నుంచి పుట్టిన భయం.

అధికారంలో ఉన్నంత కాలం అరాచకం..
అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ నేతలు ప్రజల డబ్బును సులభంగా కొల్లగొట్టారు. అధికారం పోవడం, ప్రజలు తిరుగుబాటు చేయడం, టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్‌ కావడంతో నేతలు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.

బెంగాల్‌లో ఇప్పుడు జరుగుతున్న ఈ ‘‘కట్‌ మనీ రిటర్న్‌’’ డ్రామా ఒక విషయం స్పష్టం చేస్తోంది. అధికారం లేని చోట మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న భయానకమైన సందేశం ప్రజల మనసుల్లోకి వెళ్తోంది. నిజమైన ప్రజాస్వామ్యం అధికారం ఉన్నా, లేకపోయినా న్యాయం జరిగే వ్యవస్థను కోరుకుంటుంది. కానీ బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్నది దానికి భిన్నం. ఈ ఘటనలు తృణమూల్‌కు మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థకు ఒక హెచ్చరిక.

ఇరాన్‌ ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యం మళ్లీ భీకర యుద్ధం!

Iran retaliatory attacks latest news
Iran retaliatory attacks latest news

Iran retaliatory attacks latest news: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం రాజుకుంటోంది. ఒకవైపు అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌లోని హార్ముజ్, క్వెష్మ్‌ ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే దాడులు ప్రారంభించిన అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి తీవ్రమైన ప్రతీకార చర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. హార్ముజ్‌ ప్రాంతం, క్వెష్మ్‌ దీవి పై అమెరికా చేసిన దాడులకు ఇది సమాధానమని ఇరాన్‌ ప్రకటించింది. ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరింత అగ్నిగుండంగా మార్చే అవకాశం ఉంది.

ప్రతీకార యుద్ధం షురూ..
ఇరాన్‌ తన దాడులను స్పష్టంగా ‘‘ప్రతీకారం’’గా ప్రకటించడం గమనార్హం. హార్ముజ్‌ జలసంధి సమీపంలోని క్వెష్మ్‌ దీవిపై అమెరికా చేసిన దాడులు ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈ దీవి ఇరాన్‌ సైనిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇరాన్‌ ఇప్పుడు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ దాడులు ఎంతవరకు సఫలమయ్యాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇరాన్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ సమర్థవంతంగా పని చేస్తున్నాయని చెప్పినప్పటికీ, కువైట్, బహ్రెయిన్‌ దేశాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశాయి.

హార్ముజ్‌పై ప్రభావం..
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో కీలకమైనది. ప్రపంచంలోని 20 శాతం ఆయిల్‌ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇరాన్‌ ఈ ప్రాంతంపై ఎక్కువ నియంత్రణ కోరుకుంటుంది, అమెరికా, దాని మిత్రదేశాలు దాన్ని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు, ఆర్థిక యుద్ధంగా కూడా మారుతున్నాయి. ఈ ఘర్షణలు ఇప్పటికే గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్లను కదిలించాయి. ఆయిల్‌ ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా భారత్‌ వంటి ఆయిల్‌ దిగుమతి ఆధారిత దేశాలు ఇందుకు ఎక్కువగా గురవుతాయి.

ప్రాంతీయ స్థిరత్వం ఎటువైపు..
ఇరాన్‌–అమెరికా మధ్య ఈ తాజా ఘర్షణ గల్ఫ్‌ దేశాలను కూడా నేరుగా బలిపీఠం చేస్తోంది. కువైట్, బహ్రెయిన్‌ వంటి దేశాలు తమ భూభాగంపై జరుగుతున్న దాడుల వల్ల అనవసరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇది ఇప్పటికే సున్నితంగా ఉన్న గల్ఫ్‌ రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టంగా చేస్తోంది. ఇరాన్‌ తన సైనిక బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా తన మిత్రదేశాల భద్రతను కాపాడుతూ, ఇరాన్‌ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పరస్పర చర్యలు పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.

తాజా దాడులు ఇరాన్‌–అమెరికా మధ్య ఉన్న ఏవైనా డిప్లమసీ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తాయి. రెండు వైపులా ఉన్న హెచ్చరికలు, ప్రతీకార వాగ్దానాలు యుద్ధం మరింత విస్తరించే అవకాశాలను పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యం ఇప్పటికే చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో రెండు పక్షాలు కూడా సంయమనం పాటించి, డిప్లమసీ మార్గాన్ని ఎంచుకోవడం అవసరం ఉంది. ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే, ధరల పెరుగుదల రూపంలో ప్రపంచం మొత్తం దాని ధర చెల్లించాల్సి వస్తుంది.