Homeబిజినెస్Slice UPI credit card benefits: Credit Card తో ఇబ్బంది పడేవారికి గుడ్ న్యూస్.....

Slice UPI credit card benefits: Credit Card తో ఇబ్బంది పడేవారికి గుడ్ న్యూస్.. ఈ కొత్త కార్డుతో బోలెడు లాభాలు..

Slice UPI credit card benefits: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకోవడానికి వెనుకాడే ప్రధాన కారణం వార్షిక ఫీజులు, జాయినింగ్ ఛార్జీలు, ఇతర ఫెనాల్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో Slice UPI Credit Card వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ కార్డు జీవితకాలం ఉచితంగా అందుబాటులో ఉండటంతో పాటు రోజువారీ UPI చెల్లింపులకూ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?

UPIతో సులభ చెల్లింపులు:
స్లైస్ సూపర్ కార్డు ఒక RuPay ఆధారిత UPI క్రెడిట్ కార్డు. దీన్ని Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్‌లతో లింక్ చేసుకుని QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. చిన్న మొత్తాల లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల కొనుగోళ్ల వరకు సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు లేదా డెబిట్ కార్డు అవసరం లేకుండా రోజువారీ ఖర్చులను క్రెడిట్ ద్వారా నిర్వహించవచ్చు.

ఈ కార్డు ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు లేదా మెయింటెనెన్స్ ఛార్జీలు లేకపోవడం. అందువల్ల అదనపు ఖర్చుల భయం లేకుండా దీర్ఘకాలం వినియోగించుకోవచ్చు. సంప్రదాయ క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఇది వినియోగదారులకు ఆర్థికంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. స్లైస్ కార్డుతో చేసిన లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. వినియోగదారులు కొన్ని షరతులు నెరవేర్చితే గరిష్టంగా 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ప్రాథమిక స్థాయిలో 1 శాతం రివార్డులు లభిస్తాయి. ఎక్కువ రివార్డుల కోసం నిర్దిష్ట ఖర్చులు లేదా సేవింగ్స్ బ్యాలెన్స్‌కు సంబంధించిన అర్హతలు ఉండొచ్చు.

రూ.2,000 పైబడిన చెల్లింపులకు ‘నో కాస్ట్ ఈఎంఐ’:
ఈ కార్డులో మరో ముఖ్యమైన ఫీచర్ ‘Slice in 3’. సాధారణంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలను జరిపితే.. మూడు నెలల నో-కాస్ట్ EMIగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయంపై అదనపు వడ్డీ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంటోంది. దీంతో పెద్ద మొత్తాల ఖర్చులను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా దేశీయ UPI చెల్లింపులతో పాటు ఈ కార్డును అంతర్జాతీయంగా కూడా ఉపయోగించుకోవచ్చు. 200కు పైగా దేశాల్లో కార్డు ఆమోదం పొందుతుందని సంస్థ వెల్లడించింది. తరచుగా విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇది అదనపు ప్రయోజనంగా మారుతుంది.

ఈ కార్డు పొందాలంటే:
Slice UPI Credit Card పొందాలనుకునేవారు స్లైస్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. KYC ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఆధారంగా క్రెడిట్ లిమిట్ మంజూరు చేస్తారు. అనుమతి వచ్చిన వెంటనే వర్చువల్ కార్డు లభించగా, తర్వాత ఫిజికల్ కార్డును కూడా అందజేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular