Homeఎంటర్టైన్మెంట్Peddi first day collections: 'దేవర', 'ఓజీ' మొదటి రోజు వసూళ్లను అందుకోలేకపోయిన 'పెద్ది'.. కానీ...

Peddi first day collections: ‘దేవర’, ‘ఓజీ’ మొదటి రోజు వసూళ్లను అందుకోలేకపోయిన ‘పెద్ది’.. కానీ ఇది ఆరంభం మాత్రమే..

Peddi first day collections: ప్రస్తుత పరిస్థితిలో నేటి తరం స్టార్ హీరోలు తమ సినిమాలకు కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు మొదటి రోజే కొట్టాలి , లేదంటే యావేరేజ్ ఓపెనింగ్ గా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన మార్కెట్ ఆ రేంజ్ లో వృద్ధి చెందిది కాబట్టి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మాత్రమే తమ సినిమాలతో 100 కోట్ల గ్రాస్ […]

Peddi first day collections: ప్రస్తుత పరిస్థితిలో నేటి తరం స్టార్ హీరోలు తమ సినిమాలకు కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు మొదటి రోజే కొట్టాలి , లేదంటే యావేరేజ్ ఓపెనింగ్ గా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన మార్కెట్ ఆ రేంజ్ లో వృద్ధి చెందిది కాబట్టి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మాత్రమే తమ సినిమాలతో 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని కొల్లగొట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ జాబితాలోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చి చేరాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని 115 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

ఓవర్సీస్ ఓపెనింగ్స్ బాగా నిరాశకు గురి చేసినప్పటికీ , తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం. కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ఎన్టీఆర్ ‘దేవర’ ఓపెనింగ్ వసూళ్లను అందుకోవడం లో విఫలం అయ్యింది. ఎన్టీఆర్ దేవర చిత్రానికి వరల్డ్ వైడ్ గా 148 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘పెద్ది’ కేవలం 115 కోట్ల వద్దనే ఆగాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ‘దేవర’, ‘ఓజీ’ కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది. దేవర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ జీఎస్టీ తో కలిపి 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

కానీ పెద్ది చిత్రానికి కేవలం 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రిటర్న్ జీఎస్టీ తో కలిపి వచ్చాయి. అయితే ఇది తక్కువ ఓపెనింగ్ ఏమి కాదు , చాలా బలమైన ఓపెనింగ్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస ఫ్లాప్స్ , సినిమా సినిమాకు భారీ గ్యాప్, ఇవన్నీ రావడం వల్ల, రామ్ చరణ్ ఓపెనింగ్స్ స్టామినా ఈమధ్య కాలం లో కాస్త తగ్గింది , అయినప్పటికీ కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే , మరో సూపర్ హిట్ చిత్రం పడితే మాత్రం రామ్ చరణ్ కి పూర్వ వైభవం వచ్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రామ్ చరణ్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper