Home Blog Page 186

'పెద్ది' లో రజినీకాంత్ వదులుకున్న పాత్ర అదేనా.. చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది..

Rajinikanth rejected role in Peddi
Rajinikanth rejected role in Peddi

Rajinikanth rejected role in Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపానికి నిదర్శనం లాగా నిల్చిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఆయన భుజాల మీదనే నడిచింది. రామ్ చరణ్ వెండితెర పై కనిపించినంతసేపు మరో ఆర్టిస్ట్ ఆయన ముందు షైన్ అవ్వలేకపోయాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు , రామ్ చరణ్ ఏ రేంజ్ లో నటించాడు అనేది. ఈ చిత్రం లో జగపతి బాబు , దివ్యేన్దు శర్మ, శివరాజ్ కుమార్ వంటి టాప్ ఆర్టిస్టులు ఉన్నారు, అదే విధంగా కమెడియన్ సత్య , రావు రమేష్ వంటి వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కథ మొత్తం రామ్ చరణ్ చుట్టూనే తిరిగింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత అత్యధిక స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే , అది శివరాజ్ కుమార్ మాత్రమే.

కన్నడ లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన ఆయన , ఈ చిత్రం లో రామ్ చరణ్ మీద అభిమానంతో అడగగానే నటించాడు. గౌర్ నాయుడు పాత్రలో, రామ్ చరణ్ కి గురువుగా ఆయన నటించిన తీరు అద్భుతం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనేక మంది సూపర్ స్టార్స్ ని సంప్రదించాలని అనుకున్నాడట డైరెక్టర్ బుచ్చి బాబు. విడుదలకు ముందు ఇంటర్వ్యూస్ లో ఆ పాత్ర కోసం డైరెక్ట్ గా శివ రాజ్ కుమార్ ని మాత్రమే సంప్రదించినట్టుగా చెప్పుకొచ్చాడు కానీ , వాస్తవం మాత్రం అది కాదని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట. ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతి ని సంప్రదించాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ఆయన నాకు ఈ పాత్ర సరిపోదని రిజెక్ట్ చేసాడు. స్వయంగా ఈ విషయాన్ని విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చాడు.

అదే విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి , ఈ కథని వినిపించి , గౌర్ నాయుడు పాత్ర చేయించే ప్రయత్నం కూడా చేశాడట బుచ్చి బాబు. రజినీకాంత్ కి ఇలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయడం కొత్తేమి కాదు. కెరీర్ లో ఎన్నో స్పెషల్ రోల్స్ ఇతర హీరోల సినిమాల్లో ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పాత్ర చెప్పినప్పుడు రజినీకాంత్ కి చాలా బాగా నచ్చిందట , కానీ కొన్ని మార్పులు సూచించాడట , ఆ మార్పులు బుచ్చి బాబు చేసినప్పటికీ కూడా రజిని సంతృప్తి చెందలేదట. ఆ కారణం చేత ఈ చిత్రంలో రజినీకాంత్ నటించే ఛాన్స్ పోయింది. ఒకవేళ రజినీకాంత్ చేసుంటే , ఈ సినిమా రేంజ్ ఇంకా ఎలా ఉండేదో ఊహించుకోండి , తమిళనాడు లో రికార్డ్స్ క్రియేట్ అయ్యేవి , బ్యాడ్ లక్ అనుకోవచ్చు.

'పెద్ది' థియేటర్ లో అభిమాని పై చిరాకుపడ్డ ఉపాసన.. సంచలనం రేపుతున్న వీడియో..

Upasana angry at fan in Peddi theatre
Upasana angry at fan in Peddi theatre

Upasana angry at fan in Peddi theatre: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఓపెనింగ్స్ కూడా సెన్సేషనల్ రేంజ్ లోనే వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజు 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. గతం లో ఏ రామ్ చరణ్ సినిమాకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు , ఒక్క #RRR చిత్రాన్ని మినహాయిస్తే. ఒకప్పుడు ఓపెనింగ్స్ లో పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ తరహా రేంజ్ హీరో అయినటువంటి రామ్ చరణ్, చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కాస్త డౌన్ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ చరణ్ కి ఓపెనింగ్స్ పరంగా పూర్వ వైభవం దక్కింది.

ఇకపోతే అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిన్న అభిమానులతో కలిసి హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ఈ చిత్రాన్ని వీక్షించింది. అభిమానులతో కలిసి ఆమె ఈలలు కొడుతూ, పేపర్స్ ఎగురవేస్తూ ఎంజాయ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. అయితే ఒక సందర్భం లో ఆమె అభిమానులపై కోపం తెచ్చుకొని అరవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. అభిమానులు ఎవరైనా ఉపాసన తో తప్పుగా ప్రవర్తించారో , లేదంటే ఆమెకు కోపం కలిగించే పని ఏదైనా చేశారో తెలియదు కానీ , ఆమెలోని ఫైర్ ని చూసి సోషల్ మీడియా లో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.

ఉపాసన లో ఇలాంటి యాంగిల్ ని ఇప్పటి వరకు చూడలేదని , ఆమెకు కోపం తెప్పించిన ఆ సందర్భం ఏంటో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెద్ది రెండవ రోజు ట్రెండ్ విషయానికి వస్తే , మార్నింగ్ షోస్ నుండే రామ్ చరణ్ శివ తాండవం ఆడడం మొదలు పెట్టేశాడు . బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 25 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చిన్న సెంటర్స్ నుండి పెద్ద సెంటర్స్ వరకు , అన్ని చోట్ల అద్భుతమైన హోల్డ్ ని కనబరుస్తూ , బ్లాక్ బస్టర్ లాంగ్ రన్ ని సూచిస్తోంది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

రాహుల్ గాంధీ గ్రేట్ నికోబార్ ఎందుకు వెళ్లారు..సముద్రంలోకి ఎందుకు దూకారు..కోటిన్నర చెట్ల కథేంటి..

Rahul Gandhi Great Nicobar visit
Rahul Gandhi Great Nicobar visit

Rahul Gandhi Great Nicobar visit: నేడు పర్యావరణ దినోత్సవం. ధరిత్రిని కాపాడాలని.. పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని ప్రతి ఒక్కరూ ప్రతీన బూనుతున్నారు. పర్యావరణాన్ని కాపాడతామని చెబుతున్నారు. ఇదే సమయంలో దేశ ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ఒక వీడియోను విడుదల చేశారు.అంతేకాదు, సంచలన విషయాలను బయట పెట్టారు.

రాహుల్ గాంధీ ఉన్నట్టుండి గ్రేట్ నికోబార్ వెళ్లారు. ఆయన వెంట కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యారవణ విధ్వంసాన్ని రాహుల్ గాంధీ వివరించారు. సముద్రంలోకి వెళ్లి అక్కడి మత్స్య సంపదను చూశారు. చూడటం మాత్రమే కాదు, దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.

నరేంద్రమోడీ ఓ వ్యాపారవేత్త కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రేట్ నికోబార్ ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త హోటళ్లు,కాసినోలు నిర్మిస్తున్నారని, దీనికోసం కోటిన్నర చెట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఆ వ్యాపారవేత్త పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ మార్మికతను ప్రదర్శించారు. అయితే ఇదంతా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు రక్షణ అవసరాల కోసమని మోడీ చెబుతున్నారని.. అది నిజం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఐఎన్ఎస్ భజరంగ్ కోసం ఇదంతా చేస్తే మాత్రం తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

గ్రేట్ నికోబార్ అనేది అందమైన సముద్రప్రాంతం. ఇక్కడి తీరం అత్యంత విస్తారమైనది. అరుదైన జంతువులు ఇక్కడ అనేకం ఉంటాయి. సముద్ర జంతువులు, శైవలాలు,నాచు, చెట్లు విస్తారంగా ఉంటాయి. మాంగ్రూవ్ చెట్లు ఇక్కడి తీరాన్ని కాపాడుతూ ఉంటాయి. దేశ రక్షణ కోసం ఐఎన్ఎస్ భజరంగ్ ను కేంద్రం ఇక్కడి నిర్మిస్తున్నామని చెబుతోంది. దీనిపై రాహుల్ గాంధీ వాదన మరో విధంగా ఉంది. రాహుల్ గాంధీ కీలకమైన వీడియో విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ బీజేపీ గనుక వివరణ ఇస్తే అప్పుడు ఈ వ్యవహారం మరింత రంజుగా మారుతుంది.

ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీలు కూడా.. మమత కు బంగ్లాదేశే దిక్కు

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: మనలో ఎవరికైనా ఊహించని కష్టం ఎదురైతే.. భర్తీ చేయలేని నష్టం ఎదురైతే.. ఇక వాడి బతుకు అస్సామే అంటాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అక్కడ ఎప్పుడైతే బిజెపి అధికారంలోకి వచ్చిందో.. వరుసగా పరిణామాలు మారిపోతున్నాయి. దేశ భద్రత విషయంలో.. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ దేశస్థుల విషయంలో.. సరిహద్దుల విషయంలో.. అవినీతి అక్రమాలపై విచారణ సాగిస్తున్న విషయంలో స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్లే మమతా బెనర్జీకి శంకరగిరి మాన్యాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు మొత్తం తిరుగుబాటు జెండా ప్రదర్శిస్తున్నారు. ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు వేరే దారి చూసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎంపీలు కూడా అదే దారిలో ప్రయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది ఎంపీలు బిజెపిలోకి వెళ్తామని సంకేతాలు ఇస్తున్నారు. హై లెవెల్ చర్చలు కూడా సాగుతున్నట్టు సమాచారం.

ఒకవేళ ఆ ఎంపీలు కనుక బిజెపిలోకి వెళ్ళిపోతే మమతా బెనర్జీకి చుక్కలు కనిపించడం ఖాయం. మమతా పార్టీకి పార్లమెంట్లో 28 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని పై దారుణం జరిగింది. నాడు ఈ ఘటనపై మమత వ్యవహరించిన తీరు ఆమె ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. నాడు మమత వ్యవహార శైలిని తప్పు పట్టిన వారు ఇటీవల సువెందు అధికారి నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. వారంతా కూడా తమ బాధను చెప్పుకున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మమతా బెనర్జీ పార్టీలో చిలిక ఖాయం అన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే మమత పార్టీ ప్రతిపక్ష నేత పదవిని కోల్పోయింది. రెబల్ నాయకుడు రుత వ్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను స్వీకరించారు. దీనికి తోడు కోల్కతా మేయర్ పదవికి పర్హద్ హకీం రాజీనామా చేశాడు. అంతేకాదు బెంగాల్ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాకీమ్ వెల్లడించాడు. అంతేకాదు ఈ విషయాన్ని అతడు మమతతో కూడా చెప్పాడు.

విధాన నగర్ కార్పొరేషన్ కు అక్కడి మేయర్ కృష్ణ చక్రవర్తి కూడా రాజీనామా చేశారు. ఆమె కూడా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు. కృష్ణ చక్రవర్తి దాదాపు 16 సంవత్సరాలుగా ఈ పదవిలోనే ఉన్నారు. తాను సాధారణ కౌన్సిలర్ గా ఉంటున్నానని.. తన రాజీనామా విషయంలో ఎవరివతుడు లేదని కృష్ణ చక్రవర్తి ఈ సందర్భంగా వెల్లడించడం విశేషం. ఇలా పార్టీ మొత్తం ముక్కలు అవుతున్న నేపథ్యంలో మమతకు బంగ్లాదేశే దిక్కని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సక్రమంగా పరిపాలన సాగించి ఉంటే మమతా బెనర్జీకి ఈ కష్టం వచ్చేది కాదని వారు చెబుతున్నారు.

షర్మిల రాజ్యసభ సభ్యురాలు కాకుండా అడ్డుకున్నదెవరు.. ఏం జరిగింది

Sharmila Rajya Sabha
Sharmila Rajya Sabha

Sharmila Rajya Sabha: మొన్నటి వరకు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా షర్మిల ఎన్నిక అవుతారని.. ఆమె ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గే ను తన భర్త అనిల్ తో కలిసినప్పుడు అందరూ ఇదే అనుకున్నారు. పైగా రాహుల్ గాంధీ ఆశీస్సులు కూడా ఆమెకు ఉన్నాయని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కావడంతో ఆమెకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని అందరూ భావించారు. షర్మిల కూడా ఇదేవిధంగా సంకేతాలు ఇచ్చారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు కనిపించలేదు.

మొత్తం ఏడుగురు సభ్యులతో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక నుంచి మల్లికార్జున కర్గే, పవన్ కేరా, మన్సూర్ అలీఖాన్ ను అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి.. నీరజ్ డాంగ్లి ని రాజస్థాన్ నుంచి.. ప్రణవ్ ఝా జార్ఖండ్ నుంచి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఇప్పటికే రాజ్యసభలో ఆ పార్టీకి సభా పక్ష నేతగా ఉన్నారు. ఎంపీగా ఆయన పదవీకాలం కూడా ముగింపు దశలో ఉంది. అందువల్లే పార్టీ మరొకసారి ఆయనకు అవకాశం కల్పించింది. తమిళనాడు రాష్ట్రంలో అన్నా డీఎంకే ఎంపీ రాజీనామాతో ఆస్థానం ఖాళీ అయింది. దీంతో ఆస్థానాన్ని టీవీకే పార్టీ అధినేత విజయ్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి ప్రవీణ్ చక్రవర్తి రంగంలో నిలిచారు.

ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిలకు కర్ణాటక నుంచి అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఆమెకు ఆ అవకాశం లభించలేదు. షర్మిలకు ఆ అవకాశం లభించకుండా చేసింది ఎవరనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ.. చాలా ప్రాంతాలలో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించింది.

ఈ నేపథ్యంలో షర్మిలకు ఎంపీ పదవి ఇచ్చి.. అధిష్టానం ఆమెకు గౌరవం కల్పిస్తుందని అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. కొన్ని కోటరీలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేశాయని.. అందువల్లే ఆమెకు ఆ పదవి లభించలేదని సమాచారం. అభ్యర్థిగా తన పేరు ఖరారు కాకపోవడంతో షర్మిల ఒకింత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది..

దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీలో నాలుగు.. గుజరాత్ లో నాలుగు.. కర్ణాటకలో నాలుగు.. మధ్యప్రదేశ్లో మూడు.. రాజస్థాన్లో మూడు.. జార్ఖండ్లో రెండు.. మణిపూర్ ప్రాంతంలో ఒకటి.. మేఘాలయ ప్రాంతాల్లో ఒకటి.. అరుణాచల్ ప్రదేశ్ లో ఒకటి.. మిజోరం రాష్ట్రంలో ఒక స్థానం ఉన్నాయి. ఇవే కాకుండా తమిళనాడు.. ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఒక్కొక్క స్థానానికి ఇదే రోజున ఉప ఎన్నికలు జరుగుతాయి.

లక్ష కోట్ల డాలర్ల మస్క్.. ఇతడికి డబ్బు ఏమైనా చెట్లకు కాస్తోందా

Elon Musk Prediction
Elon Musk Prediction

Elon Musk Net Worth: మనలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఒకవేళ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం గనుక ఉంటే ఒకటో తేదీ వచ్చేవరకు ఎదురు చూడాలి. ఒకటో తారీకు ఇలా వస్తుందో లేదో.. డబ్బులు ఇలా పడతాయో లేదో.. వెంటనే ఖాళీ అయిపోతుంటాయి. ఆ తర్వాత ఖర్చులకు రుణం తీసుకోవాలి.. లేదా బదులు తీసుకోవాలి. అవకాశం ఉంటే సర్దుబాటు చేయాలి.

ఈ స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఖరీదైన ఇంట్లో ఉండలేక.. ఖరీదైన కారు కొనుగోలు చేయలేక.. డొక్కు బండి నడపలేక.. మనల్ని మనమే తిట్టుకుంటూ బతుకు బండిని సాగించాలి. కానీ కొందరికి అలా కాదు.. డబ్బు వద్దన్నా సరే వస్తూనే ఉంటుంది. అతడు సినిమాలో చెప్పినట్టుగా డబ్బు వీళ్లకు చెట్లకు కాస్తుంది.

ఇలా డబ్బుకు చెట్లకు కాసే జాబితాలో ఎలాన్ మస్క్ ప్రథమ స్థానంలో ఉంటాడు. నిజమే మరి.. ఎందుకంటే అతడి సంపాదన ఆ స్థాయిలో ఉంది మరి. టెస్లా కంపెనీ పేరుతో కార్లను తయారు చేస్తున్న ఇతడు.. ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు. తాజాగా ఇక్కడి గురించి బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ఒక నివేదిక విడుదల చేసింది. వ్యక్తిగత సంపాదన దాదాపు 72,600 కోట్ల డాలర్లు.. త్వరలోనే ఇతడు సంపాదన ట్రిలియన్ డాలర్లుగా మారిపోతుంది. ఈ ప్రకారం చూసుకుంటే అతడు చేతిలో 96 లక్షల కోట్లు ఉంటాయి.

మస్క్ కు సంబంధించిన అంతరిక్ష రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్ ఎక్స్.. ఈ నెలలో తొలి పబ్లిక్ ఆఫర్ కు వెళ్తోంది. ఈ క్రమంలో అతడు 55.5 6 కోట్ల చేర్లను ఒక్కొక్కటి 135 డాలర్ల చొప్పున వికరించబోతున్నాడు. పబ్లిక్ ఇష్యూ ద్వారా స్పేస్ ఎక్స్ దాదాపు 7.20 లక్షల కోట్లను సమీకరిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐపిఓ. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ దాదాపు 170 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ కంపెనీలో మస్క్ దాదాపు 82.4% ఓటింగ్ హక్కులను కలిగివున్నాడు. అందువల్లే అతడి వ్యక్తిగత సంపాదన 96 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది.. మస్క్ టెస్లా, ఎక్స్ వంటి కంపెనీలకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఉంది. శాటిలైట్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఈ కంపెనీ కల్పిస్తోంది.

అంతరిక్షంలో ఇప్పటివరకు అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ మాత్రమే మస్క్ కు పోటీ దారుడిగా ఉన్నాడు. అతడు కూడా ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. కానీ మస్క్ మాత్రం దూకుడు మీద ఉన్నాడు. ఈ స్థాయిలో పెట్టుబడులు సమీకరించి.. తన కంపెనీని మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. అందువల్లే అతడికి ఎదురనేది లేకుండా పోతుంది. భవిష్యత్తు కాలంలో అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు మస్క్ సిద్ధమవుతున్నాడు. చెల్లింపు ఆధారిత సేవలను ప్రవేశపెడతానని ఇప్పటికే అతడు సంకేతాలు ఇచ్చాడు.

'పెద్ది' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహకందని మాస్ ర్యాంపేజ్ ఇది.. ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Peddi Box Office Collection
Peddi Box Office Collection

Peddi First Day Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రేంజ్ లో ఒక స్టార్ హీరో సినిమాకు పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ రావడం అనేది గడిచిన 5 ఏళ్లలో ఎవరికీ కూడా జరగలేదు. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాస్టింగ్ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలు ఈ చిత్రానికి 135 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ఒక పోస్టర్ ని విడుదల చేశారు కానీ , అంత గ్రాస్ రాలేదని , కేవలం 110 నుండి 115 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చిందో , ఈ చిత్రానికి సెన్సేషనల్ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. ఆ కారణం చేత ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 18 కోట్ల 20 లక్షలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే సీడెడ్ ప్రాంతం నుండి 7 కోట్ల 70 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 7 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 6 కోట్ల 50 లక్షలు , తూర్పు గోదావరి నుండి 5 కోట్ల 15 లక్షలు , పశ్చిమ గోదావరి నుండి 3 కోట్ల 85 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 3 కోట్ల 70 లక్షలు , నెల్లూరు నుండి 2 కోట్ల 22 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 75 లక్షలు , ఓవర్సీస్ నుండి 11 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 70 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రమే , హిందీ మరియు ఇతర బాషల నుండి ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

చరిత్ర సృష్టిస్తున్న నరేంద్ర మోదీ.. నెహ్రూ రికార్డు బ్రేక్‌!

Narendra Modi
Narendra Modi

Narendra Modi: జూన్‌ 10, 2026.. ఈ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, స్వాతంత్య్ర భారతదేశం తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సాధించిన 4,398 రోజుల రికార్డును బ్రేక్‌ చేయబోతున్నారు. ఇది కేవలం సంఖ్యల విజయం కాదు.. ఒక నాయకుడిపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేసిన అపూర్వమైన ఆమోదం. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ, 2019లో రెండోసారి, 2024లో మూడోసారి వరుసగా ఎన్నికై మూడు పూర్తి టర్ములు కొనసాగుతున్నారు. నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు 4,398 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఆ రికార్డు 62 ఏళ్లుగా అధిగమించలేకపోయింది.

రికార్డు వెనుక లోతైన అర్థం..
నెహ్రూ కాలం స్వాతంత్య్ర భారతదేశం నిర్మాణ దశ. కాంగ్రెస్‌ ఆధిపత్యం, ఒక దేశం ఒక నాయకుడి యుగం. అయితే మోదీ కాలం వేరు. బహుపక్ష వ్యవస్థ, తీవ్రమైన పోటీ, సోషల్‌ మీడియా ప్రభావం ఉన్న ఆధునిక భారతదేశంలో వరుసగా మూడు ఎన్నికల్లో బలమైన మ్యాండేట్‌ సాధించడం చిన్న విషయం కాదు. ఇది భారత రాజకీయాల్లో స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వం, ప్రజలు ఒక నాయకుడి మీద చూపిన నమ్మకానికి నిదర్శనం. స్వాతంత్య్రం తర్వాత ఏ ప్రధాని కూడా ఇంతకాలం నిరంతరం ప్రజాసమ్మతితో పాలన కొనసాగించలేదు.

స్వచ్ఛమైన రాజకీయ విజయం…
మోదీ పాలనను స్వచ్ఛమైన రాజకీయ విజయంగా చూడాలి. ఒక వ్యక్తి చుట్టూ ఇంత బలమైన నాయకత్వం ఏర్పడటం భారతదేశం వంటి వైవిధ్యమయమైన, సంక్లిష్టమైన దేశంలో అరుదైన విషయం. ఇది రాజకీయ స్థిరత్వాన్ని ఇచ్చి, దీర్ఘకాలిక పథకాలు అమలు చేయడానికి అవకాశం కల్పించింది. అయితే దీనితోపాటు ఒక హెచ్చరిక కూడా ఉంది. దీర్ఘకాలిక నాయకత్వం ఎంతో బాధ్యతను తీసుకురావాలి. అభివృద్ధి, ఉపాధి, సామాజిక న్యాయం, సంస్థాగత సంస్కరణలు వంటి సవాళ్లను మరింత తీవ్రంగా పరిష్కరించాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉంది. రికార్డులు సాధించడం ఒక విషయం, ఆ రికార్డును చరిత్రలో గొప్పగా నిలబెట్టడం మరొక విషయం.

జూన్‌ 10న మోదీ సాధించనున్న ఈ చారిత్రక మైలురాయి భారత రాజకీయాల్లో ఒక యుగం ముగిసి, కొత్త యుగం మొదలవుతోందని సూచిస్తోంది. నెహ్రూ యుగం నుంచి మోదీ యుగం వరకు భారతదేశం చాలా దూరం వచ్చింది. ఇకపై ఈ దీర్ఘకాలిక నాయకత్వం దేశానికి ఎంతటి మేలు చేస్తుందనేది కాలం చెప్పాలి. ఈ రికార్డు మోదీకి మాత్రమే కాదు.. భారత ప్రజలు ఒక నాయకుడిని ఎంతకాలం నమ్ముతారో చెప్పే సందేశం.

ఎల్ఐసి ని ₹3,000 కోట్లకు ముంచారు.. రాజేష్ ఎక్స్ పోర్ట్స్ మోసం ఇలా బయటకు

Rajesh Exports Scam
Rajesh Exports Scam

Rajesh Exports Scam: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. భారతీయులు పొదుపు చేసిన డబ్బు ద్వారా ఈ స్థాయికి ఎగిరింది. ఎల్ఐసికి ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది. అటువంటి ఈ సంస్థ దాదాపు 3 వేల కోట్లు నష్టపోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ మోసానికి బలైపోయింది. సెబి బయటపెట్టిన వివరాల ద్వారా రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ మోసం బయటపడగా.. ఎల్ఐసి ఏకంగా 3000 కోట్లు నష్టపోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఎల్ఐసి కి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

రాకేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసి 10.8 శాతం వాటాలో సమానమైన షేర్లు కొనుగోలు చేసింది.. ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ధర పడిపోతున్నప్పటికీ విక్రయించలేదు. ఇలా ఎందుకు విక్రయించలేదో అర్థం కాని పరిస్థితి. 2019 అక్టోబర్, 2021 మే మధ్యలో ఒక్కొక్క షేర్ కు దాదాపు 700 నుంచి 1000 వరకు చెల్లించి 3.19 కోట్ల షేర్లను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సొంతం చేసుకుంది. ఒక దశలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ షేర్ ధర 1029 కు చేరుకుంది. ఇది జీవిత కాల గరిష్టంగా నమోదయింది. అయినప్పటికీ ఎల్ఐసి వాటిని అమ్మలేదు. ఎందుకు అమ్మ లేదో తెలియదు. దీని వెనక ఎవరు ఉన్నారో తెలియదు.

రాజేష్ కంపెనీ 2019లో 1861 కోట్ల నిర్వహణ లాభాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది నాటికి 285 కోట్లకు కంపెనీ లాభం పడిపోయింది. లక్షల కోట్లలో వ్యాపారం చేస్తున్నామని ఆ కంపెనీ చెప్పినప్పటికీ.. లాభం 0.1 శాతానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఈ ప్రకారం కోటి రూపాయలు వ్యాపారం చేస్తే కేవలం 10,000 వరకే లాభం వచ్చినట్టు లెక్క..

రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన షేర్లను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. ఇతర పెట్టుబడిదారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.. ఇక ఎల్ఐసి కూడా తమ వద్ద అద్భుతమైన పరిశోధన బృందం ఉందని.. షేర్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తామని చెబుతూ ఉంటుంది. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది.. ఎల్ఐసి కంపెనీని ఎవరు మిస్ లీడ్ చేశారు అనేది అర్థం కావడం లేదు. ఈ కంపెనీ ఏకంగా వేల కోట్ల రూపాయల విలువచేసే రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ షేర్లు కొనుగోలు చేసింది..

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఈ కంపెనీ షేర్ ధర 1029 కు చేరుకుంది. నాటి రోజుల్లో ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 30 వేల కోట్లకు పైగా ఉండేది. ఇప్పుడు కంపెనీ షేర్ ధర 103.92 పడిపోయింది. దీంతో కంపెనీ విలువ కూడా 3070 కోట్లకు తగ్గిపోయింది. ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు ఎల్ఐసి వద్ద ఉన్నాయి. వాటి విలువ నాటి రోజుల్లో 3280 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు అది 330 కోట్లకు పడిపోయింది. ఈ ప్రకారం ఎల్ఐసి దాదాపు 3 వేల కోట్లు నష్టపోయింది.

ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భర్త చేస్తారు.. ముందస్తు అంచనా వేయకుండా షేర్లు కొనుగోలు చేయమని చెప్పింది ఎవరు.. అసలు ఎటువంటి బ్యాలెన్స్ షీట్ చూడకుండానే షేర్లు కొనుగోలు చేస్తే తదుపరి నష్టాలకు బాధ్యులు ఎవరు.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఇంత జరిగినప్పటికీ ఎల్ఐసి నుంచి ఇంతవరకు ఒక ప్రకటన కూడా రాలేదు. దీనినిబట్టి ఆ సంస్థ నిర్వహణ ఎంత అద్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన కుక్క.. జాతీ గర్వం కోసం యుద్ధం!

Brazil Caramel Dog Controversy
Brazil Caramel Dog Controversy

Brazil Caramel Dog Controversy: కుక్క విశ్వాసమైన జంతువుగా గుర్తింపు పొందింది. అందుకే శతాబ్దాలుగా కుక్కలు మనుషులతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఇక పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో, ఆర్మీకి సహకారంలోనూ శునకాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఒక కుక్క రెండు దేశాల మధ్య చిచ్చు రేపింది. మీరు చదివింది నిజమే కుక్క రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటా అనుకుంటున్నారా.. హాస్యాస్పందగా ఉన్నా ఇది నిజం. ఈ ‘‘కారామెల్‌ చిచ్చు’’ వెనుక జాతీయ గుర్తింపు, సాంస్కృతిక గర్వం, ఆధునిక కాలపు సామాజిక మాధ్యమాల శక్తి దాగి ఉన్నాయి. ఇది ఆధునిక లాటిన్‌ అమెరికా ఆత్మగౌరవం ఎలా పని చేస్తుందో చెప్పే కథ.

బ్రెజిల్‌కు ‘వీరా–లాటా కారామెలో’ ప్రాణం..
బ్రెజిల్‌లో గోధుమ/కారామెల్‌ రంగు మిశ్రమ జాతి కుక్కలను ‘‘వీరా–లాటా కారామెలో’’ (కారామెల్‌ డస్ట్‌బిన్‌ టిప్పర్‌) అంటారు. ఇవి వీధుల్లో తిరిగే సాధారణ కుక్కలు కావు. బ్రెజిల్‌ సమాజం యొక్క వైవిధ్యం, సహనం, జీవన సామర్థ్యం, సాధారణ ప్రజల ఆత్మను ప్రతిబింబించే జీవంత చిహ్నం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కుక్కలు సోషల్‌ మీడియా మీమ్స్‌ ద్వారా భారీ జనాభిమానానిన సాధించాయి. పిటిషన్లు, డ్రాఫ్ట్‌ లెజిస్లేషన్, రియో కార్నివాల్‌లో సాంబా స్కూల్‌ ప్రదర్శనలో పిల్లలు కారామెల్‌ కుక్కల దుస్తుల్లో పాల్గొనడం, మరీ ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ ఫిల్మ్, కారామెలో వంటి అనేక కార్యక్రమాలు దీనిని బ్రెజిల్‌ యొక్క అనధికారిక జాతీయ చిహ్నంగా మార్చాయి. బ్రెజిలియన్లు దీనిని ‘‘మా సంస్కృతి, మా ఆత్మ’’గా భావిస్తారు.

మెక్సికో అధికారిక గుర్తింపు..
ఈ ఏడాది ఏప్రిల్‌ 16న మెక్సికో రాష్ట్ర పర్యావరణ సంరక్షణ సంస్థ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. దేశం నాలుగో జాతీయ చిహ్న కుక్కగా ‘‘పెర్రో కారామెలో’’ను అధికారికంగా గుర్తించింది. ఇప్పటికే ఉన్నXoloitzcuintli (ùÌZ), Chihuahua, Calupoh జాతులతో పాటు ఇది నాలుగోది. మెక్సికో వైపు నుంచి చూస్తే ఇది చాలా సానుకూల చర్య. వీధి కుక్కలు, మిశ్రమ జాతి కుక్కలను గౌరవించి, వాటి అవలంబనను ప్రోత్సహించడం, వాటిని ‘‘కేవలం వీధి కుక్కలు’’గా చూడకుండా సామాజిక గౌరవం ఇవ్వడం లక్ష్యం. ‘‘మా దేశంలో కూడా ప్రతి ఇంటికి ఒక కారామెలో ఉంటుంది’’ అని మెక్సికన్లు చెబుతున్నారు.

సోషల్‌ మీడియా యుద్ధం..
మెక్సికో ‘‘ఇది మా కుక్క! PROPAEM పోస్ట్‌ వెలువడిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో భారీ వివాదం మొదలైంది. బ్రెజిలియన్లు తీవ్రంగా స్పందించారు. ‘Caramelo é brasileiro! ‘‘మా సంస్కృతిని దొంగిలించవద్దు’’, ‘‘ఇది మా జాతీయ చిహ్నం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెక్సికన్లు ‘‘మేము దోపిడీ చేయడం లేదు, మా దేశంలోని కుక్కలను గౌరవిస్తున్నాం’’ అని సమాధానం ఇస్తున్నారు. ఈ వివాదం New York Times వంటి ప్రముఖ మీడియాలో కూడా స్థానం సంపాదించింది.

బ్రెజిల్‌ యొక్క భావోద్వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మెక్సికో చేసిన పని కూడా మంచి ఉద్దేశంతోనే జరిగింది. వీధి కుక్కల సంరక్షణ, అవలంబనను ప్రోత్సహించడం. ఈ వివాదం హాస్యాస్పదంగా ముగిస్తే మంచిది. రెండు దేశాలు కలిసి ‘‘లాటిన్‌ అమెరికా వీధి కుక్కల సంరక్షణ’’ వంటి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడు ఈ కారామెల్‌ కుక్క నిజంగా ‘‘ఏకత్వం’’కు చిహ్నం అవుతుంది. చివరికి, ఒక చిన్న గోధుమ రంగు కుక్క రెండు గొప్ప దేశాలను ఒకేసారి నవ్వించడం, ఆగ్రహపడేయడం, ఆలోచింపజేయడం గమనార్హం.

దావూద్ ఇబ్రహీం చెప్పలేడు.. పాకిస్తాన్ విప్పలేదు.. ఒక్క ఇండియన్ సినిమాతో ఇంత విధ్వంసమా

Durandhar Movie Controversy
Durandhar Movie Controversy

Durandhar Movie Controversy: నిజమే..దురందర్ రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మనదేశంలో ఉన్న కుహనా లౌకికవాదులకు చుక్కలు చూపించింది. కమ్మీలకు, కాంగీలకు నోరు మెదపలేని పరిస్థితి కల్పించింది. ఇది కేవలం సినిమానే కాదు.. అంతకుమించి.. దెబ్బకు బాలీవుడ్ ముఠా కూడా సైలెంట్ అయిపోయింది. ఖాన్ లు ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ చేయలేదు. కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఈ సినిమా ద్వారా రణ్వీర్ సింగ్ ఒకసారి గా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. అతడు ఈ సినిమా తర్వాత డాన్ 3 చేయాలి. కానీ బాలీవుడ్ అతనికి సపోర్ట్ చేయడం లేదు. ఈ సినిమాలో అతడు నటిస్తాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

దురంధర్ సినిమా కేవలం ఇండియన్ సినిమా మార్కెట్లోనే కాదు.. చివరికి పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పాకిస్తాన్లో విపరీతంగా ఓటిటి ద్వారా చూశారు. పాకిస్తాన్ పాలకుల దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్టు ఆ సినిమా చూపించడంతో.. పాకిస్థాన్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. అది అంతర్గత పోరుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని అక్కడి రాజకీయ వర్గాలు అంటున్నాయి. దురంధర్ సినిమా తర్వాత పాకిస్తాన్ మీద దాడులు పెరిగిపోయాయి. అంతర్గతంగా ఉగ్రవాదులు జరిపే విధ్వంసాలతో పాటు పాకిస్తాన్లో ఉండబోమంటూ బలూచిస్తాన్ వేర్పాటు వాదులు చేస్తున్న ఉద్యమాలు కూడా హింసాత్మకంగా మారుతున్నాయి.

దురంధర్ సినిమాలో బడే బాయ్ పాత్ర దావూద్ ఇబ్రహీం ను పోలి ఉంటుంది. ఇంతవరకు బాలీవుడ్ లో దావూద్ ఇబ్రహీం పాత్ర గురించి ఏ దర్శకుడు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేదు. దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాడు. అనారోగ్యం వల్ల మంచానికే పరిమితమయ్యాడు. కనీస మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అతడు చుట్టూ అనుచరులు ఉంటున్నారు. అతడు ఇది కావాలని చెప్పలేడు. వారే తెలుసుకొని ఆ సమయంలో అతని అవసరం తీరుస్తున్నారు. దురంధర్ సినిమా విడుదలైన తర్వాత బడే బాయ్ పాత్రలో చాలామంది దావూద్ ఇబ్రహీం ను ఐడెంటిఫై చేసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి పాకిస్థాన్లో విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. సాయుధ అజ్ఞాత దళాలు దావూద్ ఇబ్రహీం మీద దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ బయపడుతోంది.

బయటికి ఈ విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ అంతర్గత వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే కరుడుగట్టిన ఉగ్రవాదులు మొత్తం పాకిస్థాన్లోనే ఉంటున్నారు.. అమెరికా చేసిన దాడి వల్ల లాడెన్ చనిపోయాడు. అతడిని అమెరికా దళాలు చంపింది పాకిస్తాన్లోనే. ఆల్కైదా మంచి మొదలు పెడితే హిజిబుల్ ముజాహిద్ ఇన్ వరకు అన్ని ఉగ్రవాద సంస్థల అధిపతులు తలదాచుకున్నది పాకిస్థాన్ లోనే. అలాంటప్పుడు దురంధర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని అజ్ఞాత సాయుధ దళాలు కాల్పులకు పాల్పడితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలియక పాకిస్తాన్ కలవర పడుతోంది. ఒక సినిమా ఇండియన్ సినిమా మార్కెట్ మాత్రమే కాదు.. పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది.

లోన్లు తీసుకున్న వారికి ఆర్బిఐ గుడ్ న్యూస్

RBI Good News For Loan Borrowers
RBI Good News For Loan Borrowers

RBI Good News For Loan Borrowers: అంతర్జాతీయంగా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. బయట ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సగటు మనిషి జీవితం దుర్భరంగా మారింది. ఇక అప్పులు తీసుకొని గృహాలు.. ఇతర కార్యకలాపాలు చేపట్టిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానంలో వడ్డీరేట్లు పెంచుతుందని అందరు అనుకున్నారు. పైగా అంతర్జాతీయంగా పరిస్థితులు బాగా లేవు కాబట్టి వడ్డీ రేట్లు పెంచడం అనివార్యమని ఆర్థికవేత్తలు కూడా భావించారు.

అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. దేశీయంగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని గమనంలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేట్లు (5.25%) వద్ద కొనసాగిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర వెల్లడించారు. ద్రవ్య పరపతి విధానంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.. గ్లోబల్ క్రైసిస్.. నిత్యావసరాల ధరలు పెరగడం.. రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు భావించారు.

కేంద్రీయ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వ్యక్తిగత.. గృహ రుణాలు తీసుకున్న వారికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే వడ్డీరేట్లు పెరిగితే వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. ఇప్పటికే అన్ని ధరలు పెరిగాయి. గ్యాస్ నుంచి మొదలు పెడితే ఇంధనం వరకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనీ స్పెక్యులేషన్ అనేది తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు గనుక పెంచితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అందువల్లే వడ్డీరేట్లను పెంచలేదు.

కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది.. ముఖ్యంగా ధరల స్థాయిని తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. స్థిరమైన వృద్ధిని కొనసాగించాలంటే వడ్డీరేట్లు ఒకే విధానంలో ఉంచాలని రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. అందువల్లే కీలకమైన వడ్డీరేట్లను స్థిరంగా ఉంచుతోంది. ఇన్ని చేసినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో రూపాయి ధర పడిపోవడం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగిపోతోంది.. రూపాయి విలువ పెరిగితేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రద్దు.. ఏంటి ఈ పాలసీ.. ఎందుకు ఈ చర్చ..

Delhi Bed And Breakfast Policy
Delhi Bed And Breakfast Policy

Delhi Bed And Breakfast Policy: సాధారణంగా పర్యటక రంగం అనేది ఆ దేశ పరిస్థితులు ఆధారంగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటే.. పర్యాటక రంగానికి అనుకూలంగా విధానాలను మార్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రపంచంలో పర్యాటక స్వర్గధామాలుగా పేరుపొందిన ప్రాంతాలు.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మన దేశానికి కూడా పర్యాటక రంగంలో మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వాలు రకరకాల విధానాలను అమలు చేస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లక్షలాదిమంది ఢిల్లీ నగరానికి వస్తుంటారు. ఇక్కడి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే అందరూ పర్యటకులు లగ్జరీ సౌకర్యాల కోసం ఖర్చుపెట్టరు. కొందరు పరిమిత బడ్జెట్లోనే తమ టూర్ మొత్తం పూర్తి కావాలని భావిస్తుంటారు. అదే అటువంటి వారికోసం గతంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. బెడ్, బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలామంది హోటల్ అనుకుంటారు.. కానీ అది కాదు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి.. దానిని మరింత బలోపేతం చేయడానికి.. స్థానికులకు అదనపు ఆదాయాన్ని కల్పించడానికి ఢిల్లీలో ఈ వసతి విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఈ పాలసీనే కారణమని.. దానిని రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

అగ్ని ప్రమాదం వల్ల చాలామంది చనిపోయారు. అదే స్థాయిలో గాయపడ్డారు. అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన మంటలు ఢిల్లీలో చాలా నష్టాన్ని కలుగజేసాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని పక్కన పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ప్రకారం ఇంటి ఓనర్లు తమ ఇంట్లో ఉన్న కొంత భాగాన్ని పర్యాటకులకు కల్పిస్తారు. వారికి వసతి.. ఆహారం.. ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దీనివల్ల కొంతమేర ఆదాయాన్ని వారు సంపాదిస్తారు. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో గరిష్టంగా ఆరుగదులకు అనుమతి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానం కారణమని నిపుణులు అంటున్నారు. సరైన విధానాలు పాటించకపోవడం.. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పక్కన పెట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. అసలే ఎండాకాలం.. దానికి మంటలు కూడా తోడు కావడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. అందువల్లే ప్రాణం నష్టం చోటుచేసుకుంది. ఇంతటి ప్రమాదానికి ఆ విధానం కారణమని భావించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఇకపై దానిని పక్కన పెడతామని.. భవిష్యత్తులో కూడా అమలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామందికి ఉపాధి దూరమైనప్పటికీ.. ప్రజల ప్రాణాల దృష్ట్యా తీసుకోవడం తప్పడం లేదని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

రెండేళ్ల పాలన.. కూటమి కొత్త ఆలోచన!

AP Coalition Government Achievements
AP Coalition Government Achievements

AP Coalition Government Achievements: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈనెల 12 నాటికి రెండేళ్ల పాలన పూర్తి కానుంది. మరోవైపు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన పుష్కరకాలం పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ ప్రగతి సభలు నిర్వహించాలని టిడిపి కూటమి నిర్ణయించింది. నిన్న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 9 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మూడు సభలను వేర్వేరు ధీమ్ లతో నిర్వహించాలని నిర్ణయించారు.. కేవలం పండుగలా కాకుండా తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేసింది… అనేది వివరించే ప్రయత్నం చేయనున్నారు.

* మూడు ప్రాంతాల్లో సభలు..
జూన్ 9న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాయలసీమ రీజియన్ లో నిర్వహించనున్న ఈ సభ ద్వారా.. సంక్షేమాలను వివరించనున్నారు. ఉచిత పథకాలతో పాటు సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ అమలు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. జూన్ 12న అమరావతి ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. సుపరిపాలనతోపాటు అమరావతి రాజధాని నిర్మాణంలో కూటమి ప్రభుత్వం అనుసరించిన వైఖరి గురించి వివరించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన అడ్డంకులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అన్నది ప్రధాన అజెండా. జూన్ 15న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఐటీ సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరిస్తారు.

* ఐక్యతను చాటే ప్రయత్నం..
అయితే ఈ భారీ బహిరంగ సభల ద్వారా కూటమిలో ఉన్న ఐక్యతను చాటాలని చూస్తున్నారు చంద్రబాబు. కూటమి విచ్చిన్నానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు వ్యతిరేక ప్రచారం కూడా చేస్తోంది. కానీ ఏది వర్కౌట్ కావడం లేదు. మూడు పార్టీల మధ్య గందరగోళానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి భారీ బహిరంగ సభల ద్వారా తమ ఐక్యతతో విపక్షాలకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభల ద్వారా గట్టిగానే చాటి చెప్పాలని చూస్తోంది.

జనసేన రాజ్యసభ అభ్యర్థి ఫిక్స్!

Jana Sena Rajya Sabha Candidate
Jana Sena Rajya Sabha Candidate

Jana Sena Rajya Sabha Candidate: ఏపీ నుంచి జనసేన రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కించుకోనుంది. ఆ పార్టీకి ఒక రాజ్యసభ ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తుండగా ఆ నాలుగు పదవులు కూటమికి దక్కనున్నాయి. అయితే తీవ్ర తర్జన భర్జన నడుమ బిజెపికి ఈసారి ఛాన్స్ లేదని తేలిపోయింది. నాలుగు పదవుల్లో టిడిపికి మూడు, జనసేనకు ఒకటి కేటాయించారు. రెండుసార్లు బిజెపికి అవకాశం ఇవ్వడంతో ఈసారి ఛాన్స్ లేదని కేంద్ర పెద్దలకు చెప్పారు. వారు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. టిడిపి తో పాటు జనసేన తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. అయితే జనసేన రాజ్యసభ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

* తొలిసారిగా ప్రాతినిధ్యం..
జనసేన ఇప్పటివరకు శాసనసభలో ప్రాతినిధ్యం దక్కించుకుంది. శాసనమండలిలో సైతం ప్రాతినిధ్యం దక్కించుకుంది. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో సైతం ఆ పార్టీ తన కోటాను దక్కించుకోగలిగింది. ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కించుకోవడం ద్వారా పార్లమెంటులో సైతం ప్రాతినిధ్యం పెంచుకోనుంది. అయితే తొలిసారి రాజ్యసభ సీటు కావడంతో పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మంచి నేతను తొలిసారిగా రాజ్యసభకు పంపడం ద్వారా.. జాతీయ స్థాయిలో సైతం ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు.

* మరో రెండు పదవులు సైతం..
అయితే జనసేన తరఫున రాజ్యసభకు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఖరారు చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు ఆయనే ముందు వరుసలో ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన లింగమనేని రమేష్ జనసేనకు అండగా నిలుస్తూ వచ్చారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు, బండారు నరసింహారావు తో పాటు తెలుగు చిత్ర ప్రముఖుడు పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో లింగమనేని రమేష్ కే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని జనసేనలో సైతం మార్పులు చేసే అవకాశం ఉంది. నాగబాబును పంపించిన ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా నాగబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. 2029 ఎన్నికల్లోగా రాజ్యసభలో జనసేనకు మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈసారికి లింగమనేని రమేష్ ను పంపించి మిగతా వారికి తరువాత ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

బాలయ్య పిలిచి అవకాశాన్ని ఇస్తే ప్రూవ్ చేసుకోలేకపోయిన ఇద్దరు స్టార్ డైరెక్టర్స్...

Balakrishna
Balakrishna

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… అలాంటి బాలయ్య బాబు తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇద్దరు దర్శకులకు ఆయన పిలిచి మరి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు అవకాశాన్ని వాడుకోలేదనే చెప్పాలి. యజ్ఞం సినిమాతో సక్సెస్ ని సాధించిన ఏ ఎస్ రవికుమార్ చౌదరి కి బాలయ్య పిలిచి మరి ఒక సినిమా చేయమని ఛాన్స్ ఇచ్చాడు. దాంతో ఆయన ‘వీరభద్ర’ అనే సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు మరింత డౌన్ ఫాల్ అయిపోయాడు. ఇక దేవదాసు సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన వైవిఎస్ చౌదరికి సైతం బాలయ్య పిలిచి మరి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దాంతో ఆయన ఒక దేశభక్తికి సంబంధించిన కథను చేస్తానని చెప్పి భారతీయుడు సినిమా కథనే అటు ఇటు తిప్పి ‘ఒక్క మగాడు’ మూవీ చేశాడు. ఈ సినిమా బాలయ్య బాబు కెరియర్ లోనే వరస్ట్ సినిమా అని చెప్పొచ్చు.

అయితే ఇద్దరు దర్శకులు బాలయ్య ఇచ్చిన ఆఫర్ ని వాడుకోలేకపోయారు. కానీ బాలయ్య బాబుతో చాలామంది దర్శకులు సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. వాళ్లకి ఒక్క అవకాశం వస్తే చాలు బాలయ్య బాబుని టాప్ లెవెల్లో చూపించి సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలుపుతామంటూ మంచి కథలను పట్టుకొని తిరుగుతున్నారు.

అయినప్పటికి వాళ్ళకి అవకాశాలైతే రావడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య ఈ ఏజ్ లో కూడా వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే ఆయన ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు…

రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు అనిపించుకున్న కేవీపీ!

KVP Ramachandra Rao
KVP Ramachandra Rao

KVP Ramachandra Rao: వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పై రాజకీయ విమర్శలు వస్తుంటాయి. రాజకీయాలు అన్నాక అవి సర్వసాధారణం కూడా. కానీ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నేతలు సైతం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి తో అనుబంధం ఉన్నవారు మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండిస్తుంటారు. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతగానే ఇష్టపడేవారు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా రాజశేఖర్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందించారు కెవిపి రామచంద్ర రావు. ఏకంగా పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. 10 కోట్ల రూపాయల సవాల్ అది. ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం ఒక్క మాట అనలేదు తన తండ్రి పై జరుగుతున్న ప్రచారంపై. మొన్న కూడా తన తాత రాజారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి.. కుటుంబంపై ప్రచారం జరిగేలా చేశారు.

* వైఎస్ పై పవన్ విమర్శలు..
ఇటీవల తెలంగాణలో రాజకీయ వ్యవహారాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టే వరకు తెచ్చింది పరిస్థితి. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయ వాదం పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనుమతులు ఇవ్వక పోవడాన్ని ఆక్షేపించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన విషయంలో ఇలానే వ్యవహరించేందుకు ప్రయత్నం చేశారని.. ఓ ఐపీఎస్ అధికారి ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని.. తాను రాజకీయాల్లోకి అందుకే వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు కెవిపి రామచంద్రరావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేర్కొనే రామచందర్రావుకు అప్పట్లో జరిగిన పరిణామాలు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ మాటలను ఖండించారు. పవన్ ఆధారాలతో రుజువు చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల రూపాయలు ఇస్తానని సవాల్ చేశారు. లేకుంటే పవన్ తన ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఆత్మీయ స్నేహితుడిగా కెవిపి రామచంద్రరావు సవాల్ లో ఎటువంటి తప్పిదం లేదు.

* రాజశేఖర్ రెడ్డి తో రాజకీయ లబ్ధి..
రాజశేఖర్ రెడ్డి ముఖాన్ని పెట్టుకుని రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి. నిత్యం తన సాక్షి మీడియాలో రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి పై రాజకీయం విమర్శలు వచ్చిన సమయంలో జగన్ మాట్లాడడం లేదు. తన పార్టీ నేతలతో మాట్లాడించడం లేదు. ఈ విషయంలో షర్మిల 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆమె రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తన బాధను వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యర్థుల ఆరోపణలను ఖండిస్తుంటారు. తన తాతను చంపిన వారిని క్షమించానని.. తనకంటే గొప్ప వారు ఎవరు ఉంటారు అంటూ జగన్ ఆ మధ్యన మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అటు తరువాత వైయస్ కుటుంబం పై ప్రత్యర్ధులు ఎదుర దాడి చేశారు. కానీ జగన్ మాత్రం మీడియా ముందుకు వస్తున్నారే కానీ తన తండ్రి పై ఆరోపణలను ఖండించడం లేదు. అయితే తన తండ్రిని ఏమైనా అంటే జగన్ ఊరుకుంటారో ఏమో కానీ తన స్నేహితుడిని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని కెవిపి రామచంద్రరావు చాటిచెప్పారు.