Homeక్రీడలుక్రికెట్‌Sunil Gavaskar wife phone call video: భార్య నుంచి ఫోన్.. సునీల్ గవాస్కర్ లో...

Sunil Gavaskar wife phone call video: భార్య నుంచి ఫోన్.. సునీల్ గవాస్కర్ లో భయాన్ని చూడాలి.. మామూలు వీడియో కాదు ఇది

Sunil Gavaskar wife phone call video: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాడిగా, సారధిగా, వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఇలా అనేక రకాల పాత్రలు పోషించాడు అతను. 70 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఇప్పటికి ఆయన క్రికెట్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జట్టు బాగా ఆడితే అభినందిస్తారు. సరిగ్గా ఆడకపోతే ముఖం మీద తిడతారు. ఎలాంటి ప్రణాళికల రూపొందించుకోవాలి.. ప్రత్యర్థి జట్లను ఎలా ఓడించాలి.. అనే […]

Sunil Gavaskar wife phone call video: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాడిగా, సారధిగా, వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఇలా అనేక రకాల పాత్రలు పోషించాడు అతను. 70 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఇప్పటికి ఆయన క్రికెట్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జట్టు బాగా ఆడితే అభినందిస్తారు. సరిగ్గా ఆడకపోతే ముఖం మీద తిడతారు. ఎలాంటి ప్రణాళికల రూపొందించుకోవాలి.. ప్రత్యర్థి జట్లను ఎలా ఓడించాలి.. అనే అంశాల మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటారు. యంగ్ ప్లేయర్లకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉంటారు.

సునీల్ గవాస్కర్ మొహమాటం లేకుండా మాట్లాడుతారు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. అతని దగ్గరికి వెళ్లి కరచాలనం తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్లో సూర్య వంశీ అదరగొడుతుంటే.. లగే రహో బేటా అంటూ దీవెనలు అందించారు. ఇలా తను గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప భావాలున్న మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

గవాస్కర్ సీరియస్ గా కామెంట్రీ చెప్తారు. అదే సమయంలో జోకులు కూడా వేస్తారు. ఆయనకు హాస్య స్ఫూరకమైన వ్యక్తిత్వం అధికంగా ఉంటుందని అనేకమంది దిగ్గజ ప్లేయర్లు చెప్పారు. దానిని అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు సునీల్ గవాస్కర్. అయితే అతడిలో భయాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు చూడలేదు. తొలిసారి దానిని చూసే అవకాశం ఇటీవల లభించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సునీల్ గవాస్కర్ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటాడు. ఇటీవల అతడు ముంబైలో రోటరీ క్లబ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతుండగా.. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చూడకుండానే అతడు తన భార్య అయి ఉంటుందని భావించి.. లిఫ్ట్ చేసాడు. షార్ట్ స్పీచ్ అని పెట్టేశాడు.. ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పడానికే నా భార్య ఇలా కాల్ చేసి ఉంటుందని గవాస్కర్ అనడంతో.. అక్కడున్నవారు మొత్తం గట్టిగా నవ్వేశారు.” నా భార్య నన్ను అనేక సందర్భాలలో హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎక్కువ మాట్లాడకూడదు అని చెబుతూనే ఉంటుంది. అందువల్ల నేను షార్ట్ స్పీచ్ అని చెప్పాను” అని గవాస్కర్ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper