Home Blog Page 178

అప్పుడూ ఇప్పుడూ కేటీఆర్ మాదిరిగానే.. కవిత మాటలో ఇంత అర్థం ఉందా..

Kavitha statement on KTR
Kavitha statement on KTR

Kavitha statement on KTR: టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె సంచలన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా కూడా ఆమె కొన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది కాస్త తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి సంచలనంగా మారాయి.

తెలంగాణలో 10 సంవత్సరాలపాటు భారత రాష్ట్ర సమితి పరిపాలన సాగించింది. ఈ క్రమంలో నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కల్వకుంట్ల కవిత బయట పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా కూడా తన తండ్రి పరిపాలన కాలంలో చోటుచేసుకున్న విషయాలను ఆమె మొహమాటం లేకుండా చెప్పేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేటీఆర్ పరిపాలన సాగేదని చెప్పారు. కే అంటే కెసిఆర్.. టి అంటే తన్నీరు హరీష్ రావు.. ఆర్ అంటే కల్వకుంట్ల తారకరామారావు.. అని ఆ పేరుకు సంక్షిప్త నామం చెప్పారు కవిత. ఇప్పుడు కూడా తెలంగాణలో కేటీఆర్ పరిపాలన సాగుతోందని కవిత ఆరోపించారు. కే అంటే కొండల్ రెడ్డి.. టి అంటే తిరుపతిరెడ్డి.. ఆర్ అంటే రేవంత్ రెడ్డి అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రా విష కోరల నుంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ తమ జాగీర్ అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేక పవన్ కళ్యాణ్ తో రెండు ఓట్లు తెచ్చుకుందామని అనుకుంటుందని.. అందువల్ల ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని కవిత ఆరోపించారు.

కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకంటూ సొంత రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు జాగృతి ద్వారా కార్యకలాపాలు సాగించారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రారంభ సభలోనే కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు సాగించారు. ఇప్పుడు కేటీఆర్ పరిపాలన సాగుతోంది అన్నట్టుగా ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మోడల్ లోనే పరిపాలన సాగిందని మండిపడ్డారు.

కవిత వ్యాఖ్యలను లోతుగా గమనిస్తే తన తండ్రి పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ ఇష్టానుసారంగా సాగిందని.. అవినీతి వ్యవహారాలు అడ్డులేకుండా జరిగాయని కవిత చెబుతున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిఆర్ఎస్ ప్రారంభ సభలో తన తండ్రిని మర మనిషి అని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ పరిపాలనకు, కెసిఆర్ పరిపాలనకు పెద్దగా తేడా లేదని.. ఏకంగా ఇద్దరి పరిపాలనకు సంబంధించి కేటీఆర్ అనే సంక్షిప్త నామాన్ని కవిత జత చేశారు. అయితే విలేకరులతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ కవిత ఏదో ఒక సంచలనాన్ని బయటపెడుతూనే ఉన్నారు. వచ్చే రోజుల్లో ఆమె ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి తెస్తారు.. ఎన్ని సంచలనాలకు కారణమవుతారో చూడాల్సి ఉంది.. ఏది ఏమైనప్పటికీ కవిత ద్వారా గులాబీ పార్టీ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో అయితే కవిత వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ట్రోలింగ్ మామూలుగా లేదు.

'ఓజీ' సినిమాని చూపిస్తూ పేషంట్ కి వైద్యం చేసిన వైద్యులు.. చరిత్రలో ఇది రెండోసారి..

Doctors Screen OG Movie for Patient
Doctors Screen OG Movie for Patient

Doctors Screen OG Movie for Patient: పేషెంట్స్ కి వైద్యం చేసేటప్పుడు అప్పుడప్పుడు డాక్టర్లు కొన్ని పద్ధతులు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా మెదడుకి సంబంధించిన వైద్యం చేసేటప్పుడు , పేషెంట్ స్పృహలోనే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయం లో వైద్యం చేయడం చాలా కష్టం. అందుకే పేషెంట్ దృష్టిని మరలించడానికి వాళ్లకు ఇష్టమైన సినిమాలను చూపించడమో , లేదా వాళ్ళని మాటల్లో పెట్టడమో చేస్తుంటారు. గతం లో ఒక పేషెంట్ కి ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే , ఆ పేషెంట్ కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అదుర్స్ సినిమాని చూపిస్తూ ఆపరేషన్ చేశారు . సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృత్తం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలోని దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. రీసెంట్ గానే ఆమెకు మూర్ఛ రావడం తో కిందపడిపోయారు.

ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుగా MRI స్కాన్ ద్వారా గుర్తించారు వైద్యులు. దీంతో ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స చేసి ట్యూమర్ ని తొలగించాలి. కానీ ఆమె స్పృహ లో ఉన్నప్పుడే ఈ వైద్యం చెయ్యాలని డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఆమెకు మానసికంగా ఎలాంటి భయం కలగకూడదని, ఆమె దృష్టిని మరలించి వైద్యం చేయడానికి , ఆమెకు ఎంతో ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ చిత్రాన్ని చూపిస్తూ ఈ సర్జరీ నిర్వహించారు. ఈ టెక్నీక్ వల్ల రోగి మెదడు పనితీరుని సర్జరీ సమయంలోనే మానిటర్ చేసే అవకాశం డాక్టర్లకు దక్కింది. దీంతో చాలా తేలికగా, తలలోని కీలక భాగాలకు హాని కలగకుండా , ట్యూమర్ ని తొలగించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఒక మహిళా ప్రాణాలను కాపాడిందని పవన్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

భార్య నుంచి ఫోన్.. సునీల్ గవాస్కర్ లో భయాన్ని చూడాలి.. మామూలు వీడియో కాదు ఇది

Sunil Gavaskar wife phone call video
Sunil Gavaskar wife phone call video

Sunil Gavaskar wife phone call video: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాడిగా, సారధిగా, వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఇలా అనేక రకాల పాత్రలు పోషించాడు అతను. 70 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఇప్పటికి ఆయన క్రికెట్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జట్టు బాగా ఆడితే అభినందిస్తారు. సరిగ్గా ఆడకపోతే ముఖం మీద తిడతారు. ఎలాంటి ప్రణాళికల రూపొందించుకోవాలి.. ప్రత్యర్థి జట్లను ఎలా ఓడించాలి.. అనే అంశాల మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటారు. యంగ్ ప్లేయర్లకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉంటారు.

సునీల్ గవాస్కర్ మొహమాటం లేకుండా మాట్లాడుతారు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. అతని దగ్గరికి వెళ్లి కరచాలనం తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్లో సూర్య వంశీ అదరగొడుతుంటే.. లగే రహో బేటా అంటూ దీవెనలు అందించారు. ఇలా తను గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప భావాలున్న మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

గవాస్కర్ సీరియస్ గా కామెంట్రీ చెప్తారు. అదే సమయంలో జోకులు కూడా వేస్తారు. ఆయనకు హాస్య స్ఫూరకమైన వ్యక్తిత్వం అధికంగా ఉంటుందని అనేకమంది దిగ్గజ ప్లేయర్లు చెప్పారు. దానిని అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు సునీల్ గవాస్కర్. అయితే అతడిలో భయాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు చూడలేదు. తొలిసారి దానిని చూసే అవకాశం ఇటీవల లభించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సునీల్ గవాస్కర్ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటాడు. ఇటీవల అతడు ముంబైలో రోటరీ క్లబ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతుండగా.. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చూడకుండానే అతడు తన భార్య అయి ఉంటుందని భావించి.. లిఫ్ట్ చేసాడు. షార్ట్ స్పీచ్ అని పెట్టేశాడు.. ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పడానికే నా భార్య ఇలా కాల్ చేసి ఉంటుందని గవాస్కర్ అనడంతో.. అక్కడున్నవారు మొత్తం గట్టిగా నవ్వేశారు.” నా భార్య నన్ను అనేక సందర్భాలలో హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎక్కువ మాట్లాడకూడదు అని చెబుతూనే ఉంటుంది. అందువల్ల నేను షార్ట్ స్పీచ్ అని చెప్పాను” అని గవాస్కర్ పేర్కొన్నాడు.

రుతురాజ్ కాదు.. ఆప్ఘనిస్థాన్ సిరీస్ లో విరాట్ స్థానంలో ఆడేది అతడే..

Virat Kohli
Virat Kohli

Virat Kohli replacement: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఈనెల 13 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది.. 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకునట్టు కనిపిస్తోంది. అయితే ఈ సిరీస్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడే అవకాశం కనిపించడం లేదు. అతడికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్నాడు.

ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు జట్టు తరుపున ఆడిన విరాట్ కోహ్లీ వేగంగానే పరుగులు చేశాడు. అయితే అతడికి గాయం కావడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీనికి తోడు 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిన్నటి వరకు మీడియాలో విరాట్ కోహ్లీ స్థానంలో ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్ గైక్వాడ్ కు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై అధికారికంగా మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి ఇదంతా నిజమేనని అందరు అనుకున్నారు. కానీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

విరాట్ కోహ్లీ స్థానంలో గైక్వాడ్ కాకుండా జైస్వాల్ ఆడతాడని అగార్కర్ స్పష్టం చేశాడు. “విరాట్ కు గాయం కావడంతో ఈ సిరీస్ లో ఆడటం లేదు. అతడి స్థానంలో జైస్వాల్ ఆడుతాడు. సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్ లో లేకపోవడంతో టి20 జట్టుకు అతని ఎంపిక చేయలేదు. వైభవ్ ఆట తీరు చూసిన తర్వాత ఎంపిక చేయక తప్పలేదు.. కొన్ని సంవత్సరాలుగా అయ్యర్ అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. అందువల్లే సారధిగా అతడిని ఎంపిక చేసామని” అగార్కర్ స్పష్టం చేశాడు. మరోవైపు గైక్వాడ్ ఇటీవల సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్లో అదరగొట్టాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అయితే జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. అతడికి అవకాశం ఇచ్చినట్టు తీరుస్తోంది. ఒకవేళ జైస్వాల్ గనక విఫలమైతే అప్పుడు గైక్వాడ్ కు చోటు లభించే అవకాశం ఉంది.

ఐపీఎల్ లో గైక్వాడ్ చెన్నై జట్టును ఆశించిన స్థాయిలో ముందుకు నడిపించలేకపోయాడు. ఆటగాడిగా కొన్ని సందర్భాలలో విఫలమయ్యాడు. నాయకుడిగా కూడా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. అందువల్లే అతడికి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో అవకాశం లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గైక్వాడ్ కు త్వరలోనే జాతీయ జట్టులో చోటు లభిస్తుందని అతడి అభిమానులు భావిస్తున్నారు.

బెంగళూరు ప్లేయర్ల మీద గౌతమ్ గంభీర్ కు ఎందుకింత కక్ష..

Gautam Gambhir vs Bengaluru players
Gautam Gambhir vs Bengaluru players

Gautam Gambhir vs Bengaluru players: ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ లో భారత టి20 జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. అయ్యర్ భారత జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. తిలక్ వర్మ ఉపసారధిగా ఎంపిక అయ్యాడు. ఇంకా కొంతమంది ప్లేయర్లు జట్టులో చోటు సంపాదించుకున్నారు. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ ఉద్వాసనకు గురయ్యారు. అయితే జట్టు ఎంపిక విషయంలో సానుకూల వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గౌతమ్ గంభీర్ t20 జట్టులో రకరకాల మార్పులు తీసుకొచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశామని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇంగ్లాండ్.. ఐర్లాండ్ సిరీస్లలో కొంతమంది ప్లేయర్లను ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. గౌతమ్ గంభీర్ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు అందరికీ చోటు లభించింది. కానీ బెంగళూరు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభించలేదు.

ఇటీవల ipl ట్రోఫీని బెంగళూరు జట్టుకు వరుసగా రెండవసారి అందించి కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడికి చోటు లభించలేదు. నిలకడగా ఆడిన దేవదత్ పడికల్ కు చోటు లభించలేదు. హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ.. ఇషాన్ కిషన్.. నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు సంపాదించుకున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ ఏకంగా వైస్ కెప్టెన్ హోదా పొందాడు. చెన్నై జట్టు ప్లేయర్లు సంజు శాంసన్, శివం దుబే చోటు సంపాదించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ కు అవకాశం దక్కుతుంది అనుకున్నప్పటికీ అతడికి చోటు లభించలేదు. సూర్య వంశీ రవి కి చోటు లభించింది. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి వరుణ్ చక్రవర్తి.. హర్షిత్ రానాకు అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్.. పంజాబ్ జట్టు నుంచి అర్ష్ దీప్ సింగ్, లక్నో జట్టు నుంచి ప్రిన్స్ యాదవ్.. గుజరాత్ పేట నుంచి సుందర్, సిరాజ్ కు చోటు లభించింది.

వాస్తవానికి పాటిదార్, పడికల్ నిలకడగా ఆడుతున్నారు. పైగా యంగ్ ప్లేయర్లు కూడా.. వీరికి అవకాశం ఇస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బలంగా నిలబడడం వీరిద్దరికి అలవాటు. వీరికి అవకాశం ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ గౌతమ్ గంభీర్ ఏకంగా ఆర్సిబి జట్టు మొత్తానికి షాకిచ్చాడు. అయితే ఇది కావాలని జరిగిందా.. యాదృచ్ఛికంగా చోటు చేసుకుందా.. భవిష్యత్తు కాలంలో వీరికి అవకాశాలు లభిస్తాయి.. అనే ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్నాయి. మరి వీటికి గౌతమ్ గంభీర్ తన చేతల ద్వారా ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.

డీకే శివ కుమార్: ట్రబుల్ షూటర్ కు వరుస ట్రబుల్స్.. ఇలాగైతే సీఎం పోస్టు నిలబడేది కష్టమే..

DK Shivakumar political troubles
DK Shivakumar political troubles

DK Shivakumar political troubles: కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆర్థికంగా బలవంతుడు. ఆలోచనలో ఉన్నత వంతుడు. పైగా అనేక సంక్షోభాలలో పార్టీని గట్టెక్కించాడు. పైగా సోనియాగాంధీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అందువల్లే అంతటి సిద్ధరామయ్యను కూడా పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసింది.

శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అంతా కూడా సానుకూలంగా ఉంటుందని.. మంత్రులు.. మిగతా ఎమ్మెల్యేలు మొత్తం సహకరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించిన ఒక్కరోజు వ్యవధిలోనే కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తన కోరుకున్న శాఖ రాలేదని రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు. తన కోరుకున్న శాఖ ఇవ్వలేదని మరో మంత్రి మునియప్ప నిరసన తెలిపారు. తనకు చెప్పకుండా అధికారులను మార్చారని ఇంధన మంత్రి జార్జ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.. పీసీసీ పగ్గాలు తనకు అప్పగించలేదని మరొక మంత్రి సతీష్ అలక పాన్పు ఎక్కారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. తమిళనాడులో ఐదు స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. విజయ్ పార్టీకి అవసరం కాబట్టి కాంగ్రెస్ పరువు కాస్త నిలబడింది. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిపోతుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను మొత్తం శాసించిన హస్తం పార్టీ ఇప్పుడు ఇలా మారిపోవడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.

దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక అత్యంత కీలకమైనది. ఈ రాష్ట్రం మీద బిజెపి అధినాయకత్వం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. వాస్తవానికి బిజెపికి దక్కకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయాలు చేయాల్సి ఉండేది. కానీ సిద్ధరామయ్య.. డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది.

అనేక రకాల చర్చల తర్వాత శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ మంత్రులు బహిరంగం గానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం.. రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అంతటి ట్రబుల్ షూటర్ డీకే కూడా తలనొప్పితో బాధపడుతున్నాడు అంటే కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఓయో రూమ్ కు వెళ్తున్నారా.. ఇలాగైతే అడ్డంగా బుక్ అయినట్టే..

OYO room booking
OYO room booking

OYO room booking: నేటి కాలంలో చాలామంది ప్రైవసీని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మూడవ కంటికి కనపడకుండా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఓయో రూములకు ఓటు వేస్తున్నారు. అక్కడైతే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని.. 4 గోడల మధ్య అంతకుమించిన ఏకాంతం లభిస్తుందని భావిస్తున్నారు. అందువల్లే ఓయో రూంలలో అపరిమితమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఓయో రూమ్ లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నట్టు కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓయో రూములపై పోలీసులు నిఘా పెట్టారు. తనిఖీలు ముమ్మరం చేశారు.

హైదరాబాద్ నగరంలో ఓయో రూంలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏకంగా 5000 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. కొంతకాలంగా ఈ స్థాయిలో పోలీసులు తనిఖీలు చేసినట్టు చరిత్రలో లేదు. ఆపరేషన్ లో భాగంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రికార్డులు.. కస్టమర్ల వివరాలను సేకరించారు. ఓయో రూంలలో ఉన్న భద్రతా ప్రమాణాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

అలా వెళ్తే మాత్రం..
ఓయో రూములకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెంట ఐడి కార్డులు లేకుండా వెళ్తే మాత్రం బుక్ అయినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ ఓయో రూములలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. పైగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం.. దాంతోపాటు గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నేపథ్యంలో.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించకుండా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో 5000 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు అంటే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

“వ్యక్తిగత స్వేచ్ఛకు మేము భంగం కలిగించేది లేదు. మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. శాంతి భద్రతలను పరిరక్షించడమే మా ధ్యేయం. అందువల్లే ఓయో గదులలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల కాలంలో వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. భద్రత ప్రమాణాలను.. ఓయో గదులలో ఉన్న సౌకర్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని” పోలీస్ అధికారులు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by NewsMeter (@newsmeter_in)

సాలరీ స్లిప్, ఇన్ కం సర్టిఫికెట్ లేకుండా క్రెడిట్ కార్డు పొందడమెలా..

How to get credit card without salary slip
How to get credit card without salary slip

How to get credit card without salary slip: ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అనేది కేవలం ఖర్చుల కోసం మాత్రమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఆర్థిక సహాయంగా కూడా ఉపయోగపడుతోంది. సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేసే ముందు దరఖాస్తుదారుడి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, రుణ చెల్లింపు చరిత్ర వంటి అంశాలను పరిశీలిస్తాయి. తమ నుంచి ఇచ్చే క్రెడిట్‌ను వినియోగదారు తిరిగి చెల్లించగలడా లేదా అన్నది అంచనా వేయడానికి ఈ వివరాలు కీలకంగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి వద్ద జీత స్లిప్‌లు, ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఇతర ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా, కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్:
ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడానికి అత్యంత సులభమైన మార్గం సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. ఇందులో దరఖాస్తుదారు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రూపంలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయాలి. ఆ డిపాజిట్‌ను భద్రతగా తీసుకుని బ్యాంకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. సాధారణంగా FD మొత్తంలో 75 నుంచి 90 శాతం వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. బ్యాంకుకు రిస్క్ తక్కువగా ఉండటంతో ఆదాయ పత్రాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం ఉపాధి చేసుకునే వారు ఈ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

బ్యాంకుతో సత్సంబంధాలు:
కొన్ని సందర్భాల్లో బ్యాంకుతో చాలా కాలంగా ఖాతా నిర్వహిస్తున్న కస్టమర్లకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌లో క్రమం తప్పకుండా లావాదేవీలు జరిపే కస్టమర్ల ఆదాయ ప్రవాహాన్ని బ్యాంకులు స్వయంగా అంచనా వేయగలవు. ఖాతాలో మంచి బ్యాలెన్స్ ఉండటం, రెగ్యులర్ ట్రాన్సాక్షన్లు జరగడం వంటి అంశాల ఆధారంగా కొన్ని బ్యాంకులు ముందస్తుగా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లను అందిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆదాయ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకపోవచ్చు.

డిపాజిట్ల ఆధారంగా..
కొన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని కూడా క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. వ్యక్తి వద్ద స్థిరమైన ఆదాయ పత్రాలు లేకపోయినా, గణనీయమైన పెట్టుబడులు ఉన్నట్లు నిరూపించగలిగితే బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ విధానం సాధారణంగా అధిక విలువ గల కస్టమర్లకు వర్తిస్తుంది.

యాడ్-ఆన్ కార్డ్స్:
ఇన్‌కమ్ ప్రూఫ్ లేని వారికి మరో మార్గం యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇప్పటికే క్రెడిట్ కార్డ్ ఉంటే, వారి ఖాతాపై అదనపు కార్డును పొందవచ్చు. దీనిని యాడ్-ఆన్ కార్డ్ లేదా సప్లిమెంటరీ కార్డ్ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కో-అప్లికెంట్‌గా ఉండటం ద్వారా కూడా క్రెడిట్ సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రధాన బాధ్యత మాత్రం ప్రైమరీ కార్డ్ హోల్డర్‌పైనే ఉంటుంది.

క్రెడిట్ హిస్టరీ :
ఆదాయ పత్రాలు లేకపోయినా, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే బ్యాంకులు మీ దరఖాస్తును పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం, EMIలు ఆలస్యం చేయకపోవడం, మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం వంటి అంశాలు విశ్వసనీయతను పెంచుతాయి. ముఖ్యంగా 750కు పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు సులభంగా అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది.

ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం సాధ్యమైనా, కార్డు పొందిన తర్వాత బాధ్యతాయుతంగా వినియోగించడం చాలా ముఖ్యం. క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా వినియోగించడం, బిల్లులు ఆలస్యంగా చెల్లించడం లేదా కనీస మొత్తం మాత్రమే చెల్లించడం వల్ల భారీ వడ్డీ భారం పడుతుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసి, బిల్లులను గడువులోపు చెల్లించడం ఉత్తమం.

సూర్యవంశీ పంట పండింది.. టీమిండియాకు ఆడకముందే సచిన్ రికార్డు బద్దలు..

Vaibhav Suryavanshi Sachin record broken
Vaibhav Suryavanshi Sachin record broken

Vaibhav Suryavanshi Sachin record broken: అండర్ 19 లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో సత్తా చూపించాడు. అనేక రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియాలో చోటు సంపాదించాడు. టీమిండియాలో ఆడకముందే సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు. అతడు మరెవరో కాదు వైభవ్ సూర్యవంశీ.

వైభవ్ సూర్యవంశీకి అనుకున్నట్టుగానే జాతీయ జట్టులో చోటు లభించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ‘అతడి ఆట తీరు చూసిన తర్వాత జాతీయ జట్టులోకి ఎంపిక చేయకుండా ఎలా ఉంటాం. అతడు ఆడుతున్న తీరు అమోఘంగా ఉందని’ అంతటి గౌతమ్ గంభీర్ అన్నాడంటే బుడ్డోడి విధ్వంసం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జాతీయ జట్టుకు ఎంపిక కావడం ద్వారా వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్న యంగ్ క్రికెటర్ గా అతడు ఘనత వహించబోతున్నాడు. సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజులకు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సూర్యవంశీ 15 సంవత్సరాల వయసులోనే టీమిండియాలోకి ప్రవేశించబోతున్నాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యవంశీ.. సరికొత్త ఘనతను తన పేరు మీదు రాసుకున్నాడు.

ఈనెల 26 నుంచి ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ లో గొప్పగొప్ప ప్లేయర్లు ఆడుతున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ మీదే అందరి కళ్లూ ఉన్నాయి. ఎందుకంటే అతడు గనుక సత్తా చూపిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఈ ఐపీఎల్ ఆడినట్టుగానే ఆడితే మాత్రం టీమిండియా స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న వయసులోనే టీమిండియాలో చోటు సంపాదించుకున్న సూర్యవంశీ అనేక రికార్డులను బద్దలు కొట్టాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

ఆటగాడిగా ఇప్పటికే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సూర్యవంశీ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. దిగ్గజ ప్లేయర్లు కూడా అతడితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్య వంశీ ఈ సిరీస్ లలో కూడా ఓపెనర్ గానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. అతడి మీద మేనేజ్మెంట్ భారీగానే ఆశలు పెట్టుకుంది. వాటిని అతడు అందుకుంటే అనతికాలంలోనే జట్టు పగ్గాలు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగులో 150 సెంటర్స్ లో 100 రోజులు ఆడిన మొదటి మూవీ ఆ స్టార్ హీరోదేనా..?

First Telugu movie to run 100 days
First Telugu movie to run 100 days

First Telugu movie to run 100 days: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. అయినప్పటికి చాలా సినిమాలు 20, 30 రోజులకే తోకముడస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు కేవలం 10, 20 రోజులకే పరిమితమవుతున్నాయి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫుల్ సినిమా అయినా కూడా 10 రోజుల తర్వాత ఆ సినిమాకి కలెక్షన్స్ అయితే భారీగా పడిపోతున్నాయి.

దానికి తోడుగా ఓటిటి హవా ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఓటిటి కి వచ్చిన తర్వాత సినిమాను చూద్దాంలే అని లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో 50 రోజులు, 100 రోజులైతే సినిమాలు ఆడటం లేదు. అయితే గతంలో 150 సెంటర్లలో వంద రోజులను పూర్తి చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

నిజానికి బాలయ్య బాబు హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమా 150 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. మొదటిసారి ఆ ఫీట్ ని అందుకున్న సినిమాగా నరసింహ నాయుడు చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

అలాంటి నటుడి నుంచి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం అతని అభిమానులతో పాటు ఆయనకు కూడా చాలా వరకు సంతృప్తినైతే ఇచ్చింది… ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా చేసిన ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాలు సైతం 150 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. మొత్తానికైతే 150 సెంటర్లలో 100 రోజులను పూర్తి చేసుకున్న సినిమా బాలయ్య బాబుదే కావడం విశేషం…

ఇథనాల్‌ ఇంధనం వచ్చేసింది.. పెట్రోల్‌ కన్నా చీప్!

Ethanol Fuel in India
Ethanol Fuel in India

Ethanol Fuel in India: ప్రపంచ పర్యావదన దినం సందర్భంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇంధన రంగంలో కీలక మలుపు. కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి ఢిల్లీలో ఈ–85 ఇంధనాన్ని అధికారికంగా లాంచ్‌ చేశారు. ఇందులో 80–85% ఇథనాల్, 14–19% పెట్రోల్‌ ఉంటాయి. ఢిల్లీలో దీని ధరూ.82.12గా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్‌ ధరకన్నా రూ.20 తక్కువకే ఈ–85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది.ఈ–20ను షెడ్యూల్‌ కంటే ముందే సాధించిన భారత్, ఇప్పుడు ఉన్నత స్థాయి ఇథనాల్‌ బ్లెండింగ్‌ దిశగా ధైర్యవంతమైన అడుగు వేసింది.

ఈ–85 అంటే ఏమిటి?
ఈ–85 అనేది ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెహికిల్స్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఇంధనం. సాధారణ కార్లు, బైకులు దీన్ని ఉపయోగించలేవు. ఇంజన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు మాత్రమే ఈ–85ను సమర్థవంతంగా ఉపయోగించగలవు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌ (స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్, ఏఊ డీలక్స్‌), సుజుకి గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 వంటి కొన్ని మోడల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి వాగన్‌ఆర్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెర్షన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

ఆర్థిక ప్రయోజనాలు…
ఈ–85 ధర తగ్గడం వినియోగదారులకు తక్షణ ప్రయోజనం. కానీ నిజమైన లాభం దేశ స్థాయిలో ఉంది. ఈ–20 పాలసీ ద్వారా ఇప్పటికే రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని మంత్రి పురి తెలిపారు. ఈ–85 విస్తరణతో ఈ సేవింగ్స్‌ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇథనాల్‌ దేశీయంగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు తగ్గుతాయి, డాలర్‌ ఖర్చు తగ్గుతుంది. రైతులకు అదనపు ఆదాయం (పంచదార, మొక్కజొన్న, 2ఎ ఇథనాల్‌ ద్వారా వ్యవసాయ వ్యర్థాలు) వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుంది.

పర్యావరణ ప్రయోజనాలు..
ఈ–85 సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే 50–60% తక్కువ కార్బన్‌ ఎమిషన్లను విడుదల చేస్తుంది. వాయు కాలుష్యం తగ్గడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం దీర్ఘకాలిక లాభాలు. వరల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డే రోజే ఈ – 85ను లాంచ్‌ చేయడం యాదృచ్ఛికం కాదు. ఇది సవాలుతో కూడిన మార్గం. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు ఇంకా చాలా తక్కువ.

ప్రస్తుతం ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పూణే, నాగ్‌పూర్‌లో మాత్రమే 50 పెట్రోల్‌ బంకుల్లో అందుబాటులో ఉంది. 2026 చివరి నాటికి 500 స్టేషన్లు, 2027 నాటికి 5,000 స్టేషన్లు అన్నది లక్ష్యం.
ఇంజన్‌ పనితీరు, మైలేజ్, శీతాకాలంలో కోల్డ్‌ స్టార్ట్‌ సమస్యలు కూడా పరిశీలించాల్సి ఉంది.

ఈ–85 లాంచ్‌ భారత్‌ను ఇంధన దిగుమతి భారం నుంచి విముక్తి కగిలిస్తుంది. ఇది రైతు, పర్యావరణం, ఆర్థిక స్వావలంబన, శక్తి భద్రత నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో సాధించే అవకాశం ఇస్తోంది. ఇది విజయవంతం కావాలంటే కేవలం లాంచ్‌ చేయడం సరిపోదు. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం, ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను త్వరగా విస్తరించడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం ఇవన్నీ ఒకేసారి జరగాలి.

సహారాలో మరణ మృదంగం.. నీళ్లు దొరకక 49 మంది బలి

Sahara water crisis tragedy
Sahara water crisis tragedy

Sahara water crisis tragedy: ఎడారిలో ప్రయాణం ఒక నరకం. ఇక సహారా ఎడారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎడారి ప్రయాణంలో మంచినీళ్లు చాలా ముఖ్యం. అయితే ఈడ్‌ అల్‌–అధా పండుగను మాలి దేశంలో జరుపుకుని తిరిగి వెళ్తున్న కుటుంబాలు వారు ప్రయాణిస్తున్న లారీ సహారా ఎడారి మధ్యలో చెడిపోయింది. మండే ఎండలు, నీళ్లు దొకక, సహాయం చేసేవారు లేక మూడు రోజుల్లో 49 మంది ప్రాణాలు వదిలారు. ఇద్దరు మాత్రం 50 కిలోమీటర్లకు పైగా నడిచి, నీటి వనరును చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారు రక్షణ బృందాలను పంపించగా లారీ ఆగిపోయిన ప్రదేశంలో 49 మృతదేహాలను కనిపించాయి.

ఎడారిలో ఏం జరిగిందంటే..
మాలి–నైజర్‌–ఆల్జీరియా సరిహద్దుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఎడారి ప్రయాణాలకు ప్రసిద్ధి. అగాడెజ్‌ ప్రాంతంలో అస్సమాకా సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో పండుగకు వెళ్లి వస్తున్న వారి లారీ ఇంజిన్‌ పనిచేయక ఆగిపోయింది. ప్రయాణికులు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. కానీ తీవ్రమైన వేడి, నీటి కొరత మధ్య ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక్కొక్కరు దాహం, డీహైడ్రేషన్‌కు బలైపోయారు. మృతదేహాలు లారీ కింద, చుట్టుపక్కల చెల్లాచెదురుగా కనిపించాయి.

సహారా ఎడారి అనేక మరణాలు..
సహారా ఎడారి ఎప్పటికప్పుడు ఇలాంటి విషాదాలకు సాక్షిగా నిలుస్తోంది. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాల్లోని అస్థిరత కారణంగా ప్రజలు ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సారి వారు మైగ్రంట్లు కాదు.. సాధారణ ప్రజలు, పండుగ సంబరాలు ముగించుకొని తిరిగి వస్తున్నవారు. ఈ ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు, ఎమర్జెన్సీ సహాయం, కమ్యూనికేషన్‌ సదుపాయాలు చాలా పరిమితం. పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, సరిహద్దు భద్రతా సమస్యలు. పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణించడం, అయినా భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ దుర్ఘటనకు దోహదపడింది. గతంలో కూడా సహారాలో ఇలాంటి బహుళ మరణాలు జరిగాయి.

ఈ విషాదం నుంచి పాఠం నేర్చుకొని, ఎడారి ప్రయాణాలను సురక్షితం చేయడానికి నైజర్‌ ప్రభుత్వం మాత్రమే కాదు, పొరుగు దేశాలు కూడా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే ఎడారి దాహం ఎవరినైనా మింగేస్తుంది. పండుగ సంబరాల నుంచి వస్తున్న సాధారణ ప్రజలనైనా. ఈ దుర్మరణాలు గుండెను కలచివేస్తాయి.

మెహర్ రమేష్ సినిమాను కాపీ చేసిన అల్లు అర్జున్, రాజమౌళి.. వీళ్లేంటి ఇలా తయారయ్యారు..

Allu Arjun Rajamouli copy allegation
Allu Arjun Rajamouli copy allegation

Allu Arjun Rajamouli copy allegation: బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం బీట్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ని సాధించింది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ ఈ ఫీట్ ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా మన ఇండస్ట్రీ ఘన కీర్తిని అందుకుంటుందనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది హీరోలు వాళ్ల నుంచి వచ్చే సినిమాలు అద్భుతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ‘బాహుబలి’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మరోసారి ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన అల్లు అర్జున్ సైతం ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు…

ఈ రెండు సినిమాలు కూడా మెహర్ రమేష్ చేసిన ‘శక్తి’ సినిమా నుంచి కాపీ చేస్తున్నారు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి కథపరంగా కాపీ కాకపోయిన శక్తి సినిమాలో ఎంటైర్ క్యారెక్టర్ పేరు రుద్ర… ఇక వారణాసిలో మహేష్ బాబు పేరు కూడా రుద్ర కావడం విశేషం…

ఇక అదే సినిమాలో విలన్ పేరు ‘రాకా’… అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ కూడా రాకా నే కావడం విశేషం…ఇలా వీళ్ళిద్దరు మెహర్ రమేష్ సినిమాని కాపీ చేశారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వీళ్ళిద్దరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నారనే చెప్పాలి…

ఇక రాబోయే సినిమాలతో అటు అల్లు అర్జున్, ఇటు రాజమౌళి భారీ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల చాటి చెబుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఎలాంటి కథాంశంతో తెరకెక్కబోతున్నాయనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. అందుకే ఈ మూవీస్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి…

పూణే జాతరలో ‘మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌’ బెడ్‌షీట్‌ కలకలం.. అక్రమ సరఫరా అడ్డా!

Made in Pakistan bedsheet issue in Pune
Made in Pakistan bedsheet issue in Pune

Made in Pakistan bedsheet issue in Pune: మహారాష్ట్రలోని ఒక సాధారణ జాతర కొనుగోలు చేసిన ఒక వస్తువు భారతీయుల జాతీయ భావనలను, భద్రతా ఆందోళనలను, వాణిజ్య నియంత్రణలను ఏకేసారి ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. పూణేలోని పింప్రి–చించ్వాడ్‌లోని ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయం వద్ద జరిగిన సంకష్ట చతుర్థి జాతరలో ఒక మహిళ కొన్న బెడ్‌షీట్‌పై రహస్యంగా ఉన్న ‘మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌’ లేబుల్‌ బయటపడింది. ఇది దేశంలోని అక్రమ వాణిజ్య వ్యవస్థ ఎంత సున్నితంగా, ఎంత సాహసోపేతంగా పనిచేస్తోందన్న హెచ్చరిక.

వాష్‌ చేసే సమయంలో..
మహిళ ఇంటికి వచ్చి బెడ్‌షీట్‌ను తొలి సారి వాష్‌ చేసినప్పుడు మూలలో దాచిన లేబుల్‌ స్పష్టంగా కనిపించింది. ఆమె వెంటనే వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అయింది. జాతరలో కొనుగోలు సమయంలో లేబుల్‌ కనిపించలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా దాచి అమ్ముతున్నారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి, కోపం కలిగించింది. హిందూ ఆలయ జాతరలో పాకిస్తాన్‌ ఉత్పత్తి విక్రయం అనేది కేవలం వాణిజ్య ఉల్లంఘన కాదు, జాతీయ భావాలకు గాయం.

స్పందించిన పోలీసులు..
పింప్రి–చించ్వాడ్‌ పోలీసులు తక్షణం స్పందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెడ్‌షీట్‌ను అమ్మిన వీధి వ్యాపారి ఎవరు? ఆ స్టాక్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మార్గంలో స్థానిక మార్కెట్లోకి ప్రవేశించింది? అనే సప్లై చైన్‌ను పూర్తిగా ఛేదించాలని నిర్ణయించారు. అంతేకాకుండా, పింప్రి–చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు లేఖ రాసి జాతరలు, ఆలయ పరిసరాల్లో అనధికారిక వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని నెలల క్రితమే ఛత్రపతి శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌)లో ‘మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌’ కాస్మెటిక్‌ ఉత్పత్తులు విక్రయించిన ముగ్గురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ.60 వేల విలువైన సరుకు సీజ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు ఒక పెద్ద, సంఘటిత అక్రమ నెట్‌వర్క్‌ ఉన్నట్టు తెలియజేస్తున్నాయి.

పుల్వామా ఘటన తర్వాత రద్దు..
2019 పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ స్థితిని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌ నుంచి దిగుమతులు దాదాపు పూర్తిగా నిషేధించబడ్డాయి. అయినప్పటికీ ఇలాంటి వస్తువులు దేశంలోకి వస్తున్నాయంటే ఇది సరిహద్దు భద్రత, కస్టమ్స్, ఇంటెలిజెన్స్‌ యంత్రాంగాల్లో ఉన్న లోపాలను సూచిస్తోంది. డబాయ్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల ద్వారా భారత్‌లోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.

వోకల్‌ ఫర్‌ లోకల్‌ కేవలం నినాదం కాకుండా వాస్తవ అమలులోకి రావాలి. జాతరలు, స్థానిక మార్కెట్లు, ఆలయ పరిసరాల్లో విక్రయించే ప్రతి ఉత్పత్తిపై కఠిన నిఘా అవసరం. వినియోగదారులు కూడా లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవాలి. ఒక్క బెడ్‌షీట్‌ ఘటన దేశ ఆర్థికం మాత్రమే కాదు జాతీయ భద్రత, స్వావలంబన, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి పెద్ద సమస్యలను మన ముందుకు తెచ్చింది. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, స్థానిక పరిపాలన కలిసి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.

అనిల్ రావిపూడి కి సక్సెస్ సీక్రెట్ తెలుసా..? ఆయనకి ఎందుకు సాధ్యం అవుతుంది..

Anil Ravipudi success secret
Anil Ravipudi success secret

Anil Ravipudi success secret: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ని సాధించడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అలాంటిది మొదటి నుంచి కూడా వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. కామెడీ ప్లస్ యాక్షన్ జానర్ లో ఆయన చెలరేగుతూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో తొమ్మిది కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇదంతా చూస్తున్న చాలామంది సినిమా మేధావులు సైతం అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లే ను చాలా బాగా వాడుకుంటూ ఎక్కడ ఏ ఎలిమెంట్ అయితే కావాలో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందువల్లే అతనికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆయన సినిమాలను చూసిన ప్రేక్షకులు ఒక హై ఫీల్ కి లోనవుతుంటారు.

అందువల్లే ఆయన రొటీన్ ఫార్మాట్ ని ఫాలో అయినా కూడా సక్సెస్ ల మీద సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది దర్శకులు పాన్ ఇండియాలో తమ సత్తాను చూపిస్తుంటే అనిల్ రావిపూడి మాత్రం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిసారి నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు…

సూర్యను పక్కనపెట్టి.. అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది అందుకే..

Shreyas Iyer Captaincy
Shreyas Iyer Captaincy
Shreyas Iyer replaces Suryakumar Yadav: వన్డే, టెస్ట్ మాత్రమే కాదు.. టి20 ఫార్మాట్లో కూడా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు మొదలుపెట్టాడు. టీమ్ ఇండియాకు పొట్టి ఫార్మాట్ లో తిరుగులేదు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 2024 నుంచి ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. పైగా వరుసగా 2026 లో కూడా t20 వరల్డ్ కప్ గెలిచింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. అంతకుముందు అంటే 2007లో ధోని నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధించింది.

ఐపీఎల్ వల్ల కొత్త కొత్త ప్లేయర్లు అందుబాటులోకి వస్తున్నారు. వారంతా కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అందువల్లే పొట్టి ఫార్మాట్ లో కూడా ప్రయోగాలు చేసేందుకు గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లకు టీమిండియా ను ప్రకటించాడు.. ఇదే జట్టు ఏషియన్ గేమ్స్ లో కూడా ఆడుతుందని ప్రకటించాడు.. భారత జట్టుకు అయ్యర్ నాయకత్వం వహించబోతున్నాడు. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. యువ సంచలనం సూర్య వంశీకి జట్టులో చోటు లభించింది.. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. సంజు శాంసన్ ,అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, శివం దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్య వంశీ వంటి ప్లేయర్లకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం లభించింది. ఇక ఏషియన్ గేమ్స్ లో బుమ్రా కు చోటు లభించింది.

కొంతకాలంగా సూర్య ఆటగాడిగా తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు. జట్టు ను ముందుకు నడిపించడంలో అతడు విజయవంతమవుతున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగులు తీయలేకపోతున్నాడు. తాజాగా ఐపీఎల్లో కూడా అతడు అంతగా సత్తా చూపించలేకపోయాడు. అందువల్ల మేనేజ్మెంట్ అతడికి రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ప్రస్తుతం టి20 జట్టులో విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీ ఎలా ఉంటుందో సూర్యకు తెలిసినప్పటికీ.. అతడు సరిగ్గా తన ఆటతీరును మెరుగుపరుచుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. రింకూ సింగ్ కూడా అలానే ఆడలేక పోవడంతో.. వీరి ముగ్గురిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది.

అయ్యర్ కొంతకాలంగా స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు.. అతడికి టి20 లలో అంతగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఐపీఎల్ ద్వారా తాను ఏమిటో నిరూపించుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అతడు అదరగొట్టాడు. పక్కటెముకలు గాయం కారణంగా కొద్దిరోజులపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 2024లో అయ్యర్ నాయకత్వంలో కోల్కతా ఐపిఎల్ ఛాంపియన్గా ఆవిర్భవించింది.. ఆటగాడిగా ఏ స్థానంలోనైనా అయ్యర్ బ్యాటింగ్ చేయగలడు. అందువల్లే గౌతమ్ గంభీర్ అయ్యర్ వైపు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. వరుసగా మూడు సిరీస్ లకు నాయకుడిగా అయ్యర్ కు ప్రమోషన్ లభించిన నేపథ్యంలో ఇన్ని రోజులపాటు చూసిన ఎదురుచూపుకు ఫలితం లభించింది.

ఏసీని ఇలా ఆఫ్ చేస్తున్నారా..

How to switch off AC correctly
How to switch off AC correctly

How to switch off AC correctly: వేసవి కాలంలో ఎయిర్ కండీషనర్ (AC) అనేది చాలా ఇళ్లలో నిత్యావసరంగా మారిపోయింది. అయితే ACని ఎలా ఉపయోగిస్తున్నామన్నది దాని పనితీరు, విద్యుత్ వినియోగం, జీవితకాలంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఏసీని వాడే క్రమంలో చాలా మంది గది చల్లబడగానే దానిని ఆఫ్ చేసి, కొద్ది సేపటి తర్వాత మళ్లీ ఆన్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కరెంట్ ఆదా అవుతుందని భావిస్తారు. వాస్తవానికి ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కాకుండా ACలోని కీలక భాగాలపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.అదెలాగో చూద్దాం..

ACలో అత్యంత ముఖ్యమైన భాగం కంప్రెసర్. ఇది గదిలోని వేడిని బయటకు పంపించే ప్రధాన యంత్రాంగం. ACని ఆన్ చేసిన ప్రతిసారి కంప్రెసర్ ప్రారంభమయ్యేందుకు ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. గది చల్లబడగానే ఆఫ్ చేసి, 10 లేదా 15 నిమిషాల తర్వాత మళ్లీ ఆన్ చేస్తే కంప్రెసర్ పదేపదే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం కంటే పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడి పడటంతో దాని జీవితకాలం కూడా తగ్గవచ్చు.

తరచూ ఆన్-ఆఫ్ చేసే అలవాటు వల్ల కంప్రెసర్ మోటార్ అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాత ACలు లేదా సరైన మెయింటెనెన్స్ లేని యంత్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలంలో కంప్రెసర్ పనితీరు తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం లేదా పూర్తిగా దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కంప్రెసర్ మార్పిడి ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

రాత్రంతా AC నడిపితే ఉదయం ఎలా ఆఫ్ చేయాలి?
చాలామంది రాత్రంతా AC నడిపిన తర్వాత ఉదయం లేవగానే నేరుగా ఆఫ్ చేస్తారు. కానీ నిపుణుల సూచనల ప్రకారం.. వెంటనే పూర్తిగా ఆఫ్ చేయకుండా ముందుగా కొంతసేపు ఫ్యాన్ మోడ్‌లో నడపడం మంచిది. ఇలా చేయడం వల్ల AC లోపల ఉన్న కాయిల్స్‌పై పేరుకున్న తేమ ఆవిరైపోతుంది. దీంతో ఫంగస్, బ్యాక్టీరియా, దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే AC అంతర్గత భాగాలు పొడిగా ఉండటంతో వాటి పనితీరు కూడా మెరుగుపడుతుంది.

రిమోట్‌తో ఆఫ్ చేయడం ఎందుకు అవసరం?
చాలామంది ACని నేరుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి నిలిపేస్తుంటారు. అయితే ముందుగా రిమోట్ ద్వారా ACని ఆఫ్ చేసి, కొన్ని క్షణాల తర్వాత అవసరమైతే మెయిన్ పవర్‌ను నిలిపేయడం ఉత్తమ పద్ధతి. రిమోట్ ద్వారా ఆఫ్ చేసినప్పుడు ACలోని నియంత్రణ వ్యవస్థలు సక్రమంగా షట్‌డౌన్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఇది ఎలక్ట్రానిక్ భాగాల భద్రతకు సహాయపడుతుంది.

విద్యుత్ ఆదా చేయాలంటే ACని 18 లేదా 20 డిగ్రీల వద్ద కాకుండా 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం మంచిది. ఈ ఉష్ణోగ్రత వద్ద గది సౌకర్యవంతంగా చల్లబడటమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. అదనంగా సీలింగ్ ఫ్యాన్‌ను ఉపయోగిస్తే చల్లదనం మరింత సమానంగా వ్యాపిస్తుంది.