Home Blog Page 173

రామ్ చరణ్ పెద్ది సినిమాకోసం బాడీ బిల్డ్ చేయడానికి ఏం ఫుడ్ తిన్నాడంటే..?

Ram Charan
Ram Charan

Ram Charan: రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు… అలాంటి స్టార్ హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు. దాంతో రీసెంట్ గా వచ్చిన పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక పెద్ది సినిమాలో కుస్తీ ఫైట్ కోసం ఆయన బాడీని ఎఫెక్టివ్ గా బిల్డ్ చేశాడు. నిజానికి రామ్ చరణ్ కి ఉన్న డెడికేషన్ చాలా గొప్పదనే చెప్పాలి… తను సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ ఈ సినిమాలో కుస్తీ ఫైట్ లో తన బాడీని చాలా అద్భుతంగా మౌల్డ్ చేసుకోగలిగాడు.

అయితే తన బాడీని బిల్ట్ చేసుకోవడానికి ఆయన మాంసాన్ని ఎక్కువగా తినేవాడట. అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి అయితే ఈజీగా మజిల్స్ గ్రోత్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే తన జిమ్ కోచ్ తన కి ఎప్పుడు నాన్ వెజ్ తినిపిస్తూ ఉండేవారట. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.

పెద్ది సినిమా కొన్ని చోట్ల డివైడ్ టాక్ ను మూట గట్టుకున్నప్పటికి ఓవరాల్ గా ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా?

లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రామ్ చరణ్ సోలోగా ఇప్పటి వరకు ఏ సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేదు. కానీ మొదటి సారి ఈ సినిమా ఆ రికార్డ్ ను బీట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

సుకుమార్ శిష్యుడిని ప్రమోట్ చేసి విమర్శలను అందుకుంటున్నాడా..?

Sukumar
Sukumar

Sukumar: ఆర్య సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన సుకుమార్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ మూవీ అల్లు అర్జున్ కి టర్నింగ్ పాయింట్ అయింది. సుకుమార్ సైతం మొదటి సినిమాతోనే సత్తా చాటుకున్న దర్శకుడిగా విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇప్పటి వరకు వరుస సినిమాలను చేస్తూ వచ్చిన ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాడు. తన శిష్యుడు ఆయన బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉప్పెన అనే సినిమా చేశాడు.

మొత్తానికైతే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో రామ్ చరణ్ ను హీరోగా పెట్టి ‘పెద్ది’ అనే సినిమా చేశారు. మొత్తానికైతే ఈ సినిమా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని అందరు అనుకున్నారు.కానీ ఈ సినిమా మీద భారీ విమర్శలు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా డివైడ్ టాక్ తో సైతం ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక సుకుమార్ బ్రాండ్ వాల్యూ ను గత కొద్ది రోజులుగా కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఇప్పుడు పెద్ది సినిమాతో ఆ బ్రాండ్ వాల్యూ కొంతవరకు పడిపోయే ప్రమాదం కూడా ఉందని, మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంత తన శిష్యుడైన కూడా సినిమాలో కోర్ ఎలిమెంట్ అనేది సినిమాని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అలా కాకుండా పెద్ది సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేదు. ఇక ఈ విషయం మీదనే సుకుమార్ మీద కూడా కొన్ని విమర్శలైతే వస్తున్నాయి.

సుకుమార్ దగ్గరుండి మరి సినిమా చేయించినప్పుడు జాగ్రత్తలు తీసుకోలేదా? అయినా కూడా బుచ్చిబాబు సుకుమార్ చెప్పిన సలహాలు, సూచనలను వినలేదా? సినిమా ని స్క్రీన్ మీద అంత ఎఫెక్ట్ గా ప్రజెంట్ చేయడం బుచ్చిబాబుకి రాదా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు సుకుమార్ బ్రాండ్ వాల్యూ కొంతవరకు పడిపోయే ప్రమాదం ఉంది…

సూర్య, హార్దిక్ మధ్య ఏం జరుగుతోంది.. ఎందుకి చర్చ..

Suryakumar Yadav Hardik Pandya Controversy
Suryakumar Yadav Hardik Pandya Controversy

Suryakumar Yadav Hardik Pandya Controversy: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో భీకరమైన ప్లేయర్లుగా పేరుపొందారు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో హార్థిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ ముఖ్యపాత్రలు పోషించారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుతున్నాడు. అతడి స్థానంలో హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు.. హఠాత్తుగా సూర్య కుమార్ యాదవ్ టీమిండియా కు కెప్టెన్ అయ్యాడు.

సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 2024 నుంచి 2026 ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. ప్రస్తుతం టీమిండియా పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కలేదు. అలాగని హార్దిక్ పాండ్యాకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. అతడిని ఆటగాడిగా కూడా ఎంపిక చేయలేదు.

వీరిద్దరిని ఎంపిక చేయకపోవడం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వీరిద్దరి వ్యవహారంలో జాతీయ మీడియా ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది.. 2024 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రోహిత్ అనంతరం హార్దిక్ కెప్టెన్ అవుతారని భావించారు. అయితే సూర్యకు గంభీర్ నుంచి విపరీతమైన మద్దతు ఉండడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాలేకపోయాడు. దీనికి తోడు జాతీయ జట్టులో ఉన్న ఒక ఆటగాడు కూడా సూర్య విషయంలో సానుకూలంగా స్పందించడంతో మేనేజ్మెంట్ అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి డ్రెస్సింగ్ రూమ్ లో ఇద్దరికీ పెద్దగా సానుకూలమైన సంబంధాలు లేవని సమాచారం.

ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నప్పుడు వీరిద్దరు కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించే వాళ్ళని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో మెజారిటీ ప్లేయర్లు సరిగా ఆడలేదు. అందువల్లే ఆ జట్టు 2024 నుంచి ఈ సీజన్ వరకు అంతగా ప్రతిభ చూపలేదు. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి పక్కకు తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

లక్నో లేదా మరో జట్టుకు అతడు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే త్వరలో జరగబోయే టోర్నీలలో వీరిద్దరికీ మేనేజ్మెంట్ అవకాశాలు కల్పించలేదు. వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ మేనేజ్మెంట్ దాకా వెళ్ళినట్టుంది.. అందువల్లే అవకాశాలు ఇవ్వలేదని స్పోర్ట్స్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై t20 లీగ్ లో ఆడుతున్నాడు.

సూర్య, హార్దిక్ మధ్య ఏం జరుగుతోంది.. ఎందుకి చర్చ..

Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో భీకరమైన ప్లేయర్లుగా పేరుపొందారు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో హార్థిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ ముఖ్యపాత్రలు పోషించారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుతున్నాడు. అతడి స్థానంలో హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు.. హఠాత్తుగా సూర్య కుమార్ యాదవ్ టీమిండియా కు కెప్టెన్ అయ్యాడు.

సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 2024 నుంచి 2026 ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. ప్రస్తుతం టీమిండియా పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కలేదు. అలాగని హార్దిక్ పాండ్యాకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. అతడిని ఆటగాడిగా కూడా ఎంపిక చేయలేదు.

వీరిద్దరిని ఎంపిక చేయకపోవడం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వీరిద్దరి వ్యవహారంలో జాతీయ మీడియా ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది.. 2024 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రోహిత్ అనంతరం హార్దిక్ కెప్టెన్ అవుతారని భావించారు. అయితే సూర్యకు గంభీర్ నుంచి విపరీతమైన మద్దతు ఉండడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాలేకపోయాడు. దీనికి తోడు జాతీయ జట్టులో ఉన్న ఒక ఆటగాడు కూడా సూర్య విషయంలో సానుకూలంగా స్పందించడంతో మేనేజ్మెంట్ అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి డ్రెస్సింగ్ రూమ్ లో ఇద్దరికీ పెద్దగా సానుకూలమైన సంబంధాలు లేవని సమాచారం.

ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నప్పుడు వీరిద్దరు కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించే వాళ్ళని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో మెజారిటీ ప్లేయర్లు సరిగా ఆడలేదు. అందువల్లే ఆ జట్టు 2024 నుంచి ఈ సీజన్ వరకు అంతగా ప్రతిభ చూపలేదు. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి పక్కకు తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

లక్నో లేదా మరో జట్టుకు అతడు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే త్వరలో జరగబోయే టోర్నీలలో వీరిద్దరికీ మేనేజ్మెంట్ అవకాశాలు కల్పించలేదు. వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ మేనేజ్మెంట్ దాకా వెళ్ళినట్టుంది.. అందువల్లే అవకాశాలు ఇవ్వలేదని స్పోర్ట్స్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై t20 లీగ్ లో ఆడుతున్నాడు.

టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.3.35 లక్షల బెనిఫిట్స్..

Tata EV Discounts
Tata EV Discounts

Tata EV Discounts: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో దూసుకుపోతోంది. తాజాగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ధర తగ్గింపులను ప్రకటించి, ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశాన్ని కల్పించింది. టాటా తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిపై మోడల్‌ను బట్టి రూ. 3.35 లక్షల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు వేరియంట్ల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్న ఆ ప్రధాన కార్ల వివరాలు ఇవే..

టాటా కర్వ్ EV (Tata Curvv EV):
టాటా ఎలక్ట్రిక్ లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న కారు ‘కర్వ్ EV’. ఈ కారుపై ఏకంగా రూ.2.85 నుంచి రూ.3.35 లక్షల వరకు ధర తగ్గింది. ఇది టాటా యొక్క అత్యాధునిక డిజైన్ శైలిని ప్రతిబింబించే కూపే స్టైల్ SUV. అద్భుతమైన ఏరోడైనమిక్స్‌, శక్తివంతమైన బ్యాటరీ రేంజ్ మరియు లగ్జరీ ఫీచర్లతో రూపొందిన ఈ కారు, ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

టాటా హారియర్ EV (Tata Harrier EV)
టాటా హారియర్ EVపై సుమారు రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలను సంస్థ అందిస్తోంది. హారియర్ దాని బోల్డ్ లుక్, దృఢమైన నిర్మాణానికి ప్రసిద్ధి. ఎలక్ట్రిక్ రూపంలో ఇది మరింత శక్తివంతమైన పర్ఫామెన్స్ ను అందిస్తూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. కుటుంబ అవసరాలకు సరిపోయేలా విశాలమైన లోపలి భాగం లో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి.

టాటా పంచ్ EV (Tata Punch EV):
కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో తిరుగులేని కారుగా పంచ్ EV నిలిచింది. దీనిపై దాదాపు రూ. 95,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. నగర ప్రయాణాలకు అత్యంత అనువైనదిగా.. సులభమైన హ్యాండ్లింగ్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. మొదటిసారి EV కొనుగోలు చేసే వారికి ఇది ఒక చక్కని ఎంపికగా నిలుస్తుంది.

టాటా టియాగో EV & నెక్సాన్ EV (Tiago EV & Nexon EV):
బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారి కోసం టియాగో EVపై రూ.65,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. చిన్న కుటుంబాలకు, సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరోవైపు, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ SUV అయిన ‘నెక్సాన్ EV’పై రూ. 50,000 వరకు ధర తగ్గింపును టాటా ప్రకటించింది. అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, మంచి రేంజ్, టాటా యొక్క నమ్మకమైన సర్వీస్ ఈ కార్లను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ పై భారీ తగ్గింపు.. వెంటనే తెలుసుకోండి..

Samsung Galaxy A35 5G
Samsung Galaxy A35 5G

Samsung Galaxy A35 5G: సామ్‌సంగ్ గెలాక్సీ A35 5G మిడ్ రేంజ్ పీపుల్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మొబైల్ లో డిస్ ప్లేతో పాటు కెమెరా పనితీరు మెరుగ్గా ఉండడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వినియోగదారులన ఆకట్టుకునేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్డ్ ఈ మొబైల్ న భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుత ధర ఎంత? ఎంత వరకు తగ్గింపుతో వస్తోంది?

సామ్‌సంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగం ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో, ఐకానిక్ గెలాక్సీ డిజైన్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల కదిలేటప్పుడు కూడా ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా స్పష్టంగా వస్తాయి. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP కెమెరాను అందించారు. నైటోగ్రఫీ ఫీచర్ ఉండటం వల్ల తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీసుకోవచ్చు.

ఈ ఫోన్ ‘సామ్‌సంగ్ ఎక్సినోస్ 1380’ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్‌ను సులభంగా నిర్వహించడానికి ఇది తగిన పవర్ అందిస్తుంది. ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఇందులో పెద్ద ‘వేపర్ ఛాంబర్’ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇందులో 8GB RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందవచ్చు, దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌లో 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు, ఇది సాధారణ వినియోగంతో దాదాపు రెండు రోజుల వరకు వస్తుంది. ఇది 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత విషయానికొస్తే.. ఇందులో ‘సామ్‌సంగ్ నాక్స్ వాల్ట్’ ఉంది. ఇది మీ పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు మరియు వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుతుంది. అలాగే, ఇది IP67 రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి దుమ్ము మరియు నీటి నుంచి ఫోన్‌కు రక్షణ ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. Samsung A35 5G ఫోన్ ధరపై సుమారు రూ. 14,000 వరకు ధర తగ్గడంతో, మధ్యతరగతి వినియోగదారులకు ఇది ఒక గొప్ప డీల్‌గా మారింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 18,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు..ఈ జాగ్రత్తలతో సేఫ్..

Monsoon Health Tips
Monsoon Health Tips

Monsoon Health Tips: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోనున్నాయి. వర్షాలు వ్యవసాయానికి మేలు చేసినప్పటికీ, ఈ కాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కలుషిత నీరు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల నీటిని బాగా కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో నిల్వ ఉంచే నీటి పాత్రలను కూడా శుభ్రంగా ఉంచడం అవసరం.

చాలామంది వర్షంలో తడవడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వర్షంలో తడిస్తే వెంటనే పొడి బట్టలు మార్చుకోవడం, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. వైరస్‌లు, బ్యాక్టీరియా వ్యాప్తిని అడ్డుకోవడంలో చేతుల పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుంది. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, భోజనం చేసే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

వర్షాకాలంలో నిల్వ నీరు ఎక్కువగా ఉండటం వల్ల దోమలు వేగంగా పెరుగుతాయి. దీంతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రాత్రివేళల్లో దోమతెరలు ఉపయోగించడం, దోమల నివారణ క్రీములు లేదా రిపెల్లెంట్లు వాడడం ద్వారా రక్షణ పొందవచ్చు.

వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం విటమిన్-C అధికంగా ఉండే నిమ్మకాయ, కమలా, ఉసిరికాయ, జామపండు వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే తాజా కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. పరిశుభ్రమైన నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, దోమల నుంచి రక్షణ పొందడం, పోషకాహారం తీసుకోవడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లతో వర్షాకాలాన్ని ఆనందంగా, సురక్షితంగా గడపవచ్చు.

అప్పుడు 13 లక్షల కోట్లు.. ఇప్పుడు 41 లక్షలు కోట్లు.. మరి వాటి సంగతేంటి..

AI Water Consumption
AI Water Consumption

Digital Payments: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. అయితే చాలామంది ఆర్థికవేత్తలు డిజిటల్ చెల్లింపుల వల్ల నగదు లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయని.. మామూలు టీ షాప్ నుంచి కార్పొరేట్ హోటల్ వరకు అన్నింట్లోనూ డిజిటల్ విధానంలో చెల్లింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ డిజిటల్ యుగంలో కూడా పాత పరిస్థితే ఉంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదే విధంగా ఉంది.

ఇప్పటి కాలంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. అలాగని నగదు చెల్లింపులు తగ్గుముఖం పట్టలేదు. దేశంలో చలామణి అవుతున్న నగదు లెక్కలు ఇదే విషయాన్ని తేడా తెలియచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 10 సంవత్సరాల కాలంలో ఇది మూడు రెట్లు పెరిగింది. 2017 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా నగదు చలామణి 13 లక్షల కోట్లు ఉండేది.. 2026 ఆర్థిక సంవత్సరానికి అదేకంగా 41 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఏటీఎం నెట్వర్క్ మాత్రం దారుణంగా పడిపోయింది. 2023లో 2.19 లక్షలకు పైగా ఏటీఎం యంత్రాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 2.09 లక్షలకు పడిపోయింది. నగదు ఉపసంహరణలు కూడా 32.6 లక్షల కోట్ల నుంచి 28.6 లక్షల కోట్లకు పడిపోయాయి.

ఏటీఎంల సంఖ్య పడిపోవడంతో నగదును ఉపసంహరించుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల నుంచి ఏటీఎంలోకి వచ్చే నగదు పడిపోయిందని తెలుస్తోంది.. మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన దేశ వ్యాప్తంగా ఏటీఎంలో స్టోర్ చేసేందుకు 94 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మార్చి నెలలో 61 వేల కోట్లు.. ఏప్రిల్ నెలలో 54 వేల కోట్లు మాత్రమే సమకూర్చారు. ఇక కేంద్రీకృత బ్యాంకు నివేదిక ప్రకారం గడిచిన నెల 22 నాటికి దేశంలో మొత్తం 42.54 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉందని తెలుస్తోంది. ఇక ఏటీఎం లావాదేవీలు గత ఏడాదితో పోల్చి చూస్తే 10.4% తగ్గింది.

ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. డిజిటల్ తో పాటు నగదు లావాదేవీలు కూడా ప్రజలు నిర్వహిస్తున్నారు. అందువల్ల క్యాష్ స్పెక్యులేషన్ కూడా విపరీతంగా ఉంది. అయితే వచ్చే రోజుల్లో ఇది తగ్గే అవకాశం ఉంటుందా.. పెరుగుతుందా.. అనే విషయాలను ఇప్పుడే చెప్పలేమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఇలాగైతే ఏఐ కుప్పకూలిపోవడం ఖాయం

AI Water Consumption
AI Water Consumption

AI Water Consumption: ఏదైనా సరే వాడకం ఎక్కువైపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా అలానే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏ ఐ చుట్టూ తిరుగుతోంది. కంపెనీలు ఉద్యోగులను పక్కనపెట్టి ఏఐ ద్వారానే పనిచేయిస్తున్నాయి. కీలక ప్రాజెక్టులను సైతం ఏ ఐ ద్వారా పూర్తి చేస్తున్నాయి. దీంతో చాలామంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. రోడ్డున పడుతున్నారు.

ఏ ఐ వల్ల మనుషులకు సంబంధించి ఇది ఒక విపత్తు అయితే.. భవిష్యత్తు కాలంలో మరో విపత్తు కూడా పొంచి ఉంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించి సమాచార కేంద్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపై యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి 130 కోట్ల మందికి సరిపడా నీరు వీటికి అవసరమవుతుందని.. సర్వర్లను చల్లపరిచేందుకు.. విద్యుత్ వాడకానికి సంబంధించిన యంత్రాలను కూల్ చేసేందుకు విపరీతంగా నీరు కావాలి. ప్యూచర్ లో హ్యూమన్స్ కంటే ఎక్కువ ఇవే వాటర్ తాగేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫోటోలు.. వీడియోలను జనరేట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరమవుతుందని.. కంపెనీలు.. ప్రభుత్వాలు.. యూసర్లు జాగ్రత్తగా ఉండాలని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది.

ఇటీవల కాలంలో డాటా సెంటర్ల ఏర్పాటు పెరిగిపోయింది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా ఎక్కువైంది. ఈ టెక్నాలజీ ద్వారా ఫోటోలు రూపొందించడం.. వీడియోలు రూపొందించడం.. ఇంకా అనేక రకాల పనులు చేయడంతో టెక్నాలజీకి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఫలితంగా డాటా సెంటర్ల మీద ఒత్తిడి ఎక్కువైంది. డాటా సెంటర్ల పనితీరు పెరిగిపోతే.. విద్యుత్ చాలా అవసరం పడుతుంది. డాటా సెంటర్ల యంత్రాలను చల్లపరచాలి. ఇదంతా జరగాలంటే కచ్చితంగా నీరు కావాలి. ఆ నీటితోనే వాటిని కూల్ చేయవచ్చు.

ఇప్పుడంటే పర్వాలేదు కానీ.. భవిష్యత్తు కాలంలో వీటి వినియోగం ఇలానే పెరిగిపోతే అప్పుడు నీరు మరింత అవసరం పడుతుంది. ఇప్పటికే భూగోళంలో చాలావరకు ప్రాంతాలలో నీటి కొరత తీవ్రంగా ఉంది. భవిష్యత్తు కాలం ఎలా ఉంటుందో చెప్పలేము. పైగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు డాటా సెంటర్లకు కావలసిన నీటిని ఎలా సరఫరా చేస్తారు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. అందువల్లే టెక్నాలజీని పరిమిత స్థాయిలో వాడుకోవాలని.. అనవసరమైన కార్యకలాపాలకు టెక్నాలజీని ఉపయోగించుకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు నేచురల్ రిసోర్సెస్ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

విజయ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. సర్కార్ కూలిపోతుందట..

Vijay Government
Vijay Government

Vijay Government Countdown: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి. మొన్నటిదాకా ముఖ్యమంత్రి స్థానాన్ని సాధించడానికి టీవీకే అధినేత విజయ్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో తన వద్ద బలం లేకపోవడంతో.. కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఇతర పార్టీల సపోర్ట్ తీసుకున్నారు. కొంతమంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఫలితంగా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తనదైన మార్క్ పరిపాలన తమిళనాడులో సాగిస్తున్నారు విజయ్.

విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత అనేక రకాల సమస్యలు అనేక స్వాగతం పలుకుతున్నాయి. అయితే వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్నారు విజయ్. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కి ఆదిలోనే దెబ్బ తలిగే పరిణామం ఒకటి చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే విజయ్ పరిపాలనకు ముగింపు పలకాలని డిఎంకె అధినేత స్టాలిన్ పిలుపునివ్వడం తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారింది. విజయ్ ప్రభుత్వం తమ మాజీ మిత్రపక్షల దయ మీద ఆధారపడి పనిచేస్తుందని స్టాలిన్ ఆరోపించడం కలకలం రేపుతోంది.. అయితే ఆ పార్టీలు కూడా డీఎంకే గెలవాలని కోరుకున్నాయట. అనూహ్యంగా టీవీ కేకు ఆ పార్టీలు సపోర్ట్ చేయడం పట్ల స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే త్వరలోనే తమిళనాడు రాజకీయాలలో మార్పు వస్తుందని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన రావడం తనకి ఇష్టం లేదని స్టాలిన్ అనడం సంచలనం కలిగిస్తోంది.

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం నెల కూడా కాకముందే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించడం విశేషం. పైగా విజయ్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ పిలుపునివ్వడం విశేషం. దీనిపట్ల టీవీ కేనేతలు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఆయన మాటలను అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని.. తమిళ ప్రజలు ఓటు వేసి విజయ్ ని ముఖ్యమంత్రిని చేశారని.. ప్రజలకు ఏం చేయాలో విజయ్ కి తెలుసని టీవీకే నేతలు అంటున్నారు.

పార్టీ అధికారాన్ని కోల్పోవడం.. ఎమ్మెల్యేగా గెలవలేకపోవడంతో స్టాలిన్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని.. అందువల్లే ఏదేదో మాట్లాడుతున్నారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డీఎంకే నేతలకు బుద్ధి రావడం లేదని.. అధికారానికి కనీసం నెలరోజులు కూడా దూరంగా ఉండలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహస్యం చేస్తున్నారని .. స్టాలిన్ తన అనుభవాన్ని పక్కనపెట్టి ఇలాంటి దిగువ స్థాయి మాటలు మాట్లాడటం దారుణమని టీవీకే నేతలు చెబుతున్నారు. మరి స్టాలిన్ చెప్పినట్టు టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుందా.. అలా ప్రభుత్వం కూలిపోవడం సాధ్యమవుతుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి

భారత అమ్ముల పొదిలో మరో యుద్ధ విమానా.. అమెరికా ఐదో తరానికి ప్రత్యామ్నాయం!

India SU-57 Fighter Jet
India SU-57 Fighter Jet

India SU-57 Fighter Jet: ప్రపంచంలో తమదే అత్యాధునిక యుద్ధ విమానం అని అమెరికా ఎఫ్‌ – 35 స్టెల్త్‌ విమానాల గురించి ప్రచారం చేసుకుంటోంది. ట్రంప్‌ కూడా వ్యాపారం పెంచుకునేందుకు ప్రపంచ దేశాల్లో ప్రచారం చేస్తున్నాడు. అయితే తాజాగా ఇరాన్‌తో యుద్ధం సందర్భంగా ఇరాన్‌ ఎఫ్‌–35 యుద్ధ విమానాన్ని భుజంపై తీసుకెళ్లే లాంచర్‌తో కూల్చివేసింది. దీంతో ఎఫ్‌–35 ప్రచారంలో లోపాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో భారత్‌ అమెకా ఆధునియ యుద్ధ విమానాలకు దీటుగా రష్యాతో కలిసి సుఖోయ్‌ ఎస్‌యూ–57 యుద్ధ విమానాన్ని మరింత అభివృద్ధి చేసి, ఉమ్మడి ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంచనుంది. ఎస్‌యూ–57 రష్యా మొదటి పూర్తి స్థాయి ఐదో తరం స్టెల్త్‌ ఫైటర్‌గా పరిగణింపబడుతుంది. దీన్ని అమెరికా ఎఫ్‌–22 రాప్టర్, ఎఫ్‌–35 లైట్నింగ్‌–2 విమానాలతో సమానంగా రూపొందించారు.

డిజైన్, ఇంజిన్‌ సామర్థ్యాలు..
ఎస్‌యూ–57 సింగిల్‌ సీట్, రెండు ఇంజిన్లతో కూడిన బహుళ ప్రయోజనకర విమానం. ప్రస్తుతం శాటర్న్‌ ఏఎల్‌–41ఎఫ్‌1 ఇంజిన్లు ఉపయోగించబడుతున్నాయి. ఇందులో మరింత అధునాతన ఏఎల్‌–51ఎఫ్‌1 ఇంజిన్‌ను అంతర్గతంగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. రెండు ఇంజిన్ల వల్ల ఒకటి పని చేయకపోయినా విమానం సురక్షితంగా తిరిగి రాగలదు. ఇది ఎఫ్‌–35లోని సింగిల్‌ ఇంజిన్‌ డిజైన్‌తో పోలిస్తే భిన్నమైన లాభం. ఆయుధాలను విమానం లోపల (స్టెల్త్‌ మోడ్‌లో), బయట కూడా మోసుకెళ్లవచ్చు. దీంతో గాలి నుంచి గాలి లక్ష్యాలు, గాలి నుంచి నేల లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే సామర్థ్యం ఉంది.

వేగం, సూపర్‌ క్రూయిజ్‌ ప్రయాణ సామర్థ్యం..
ఇది మాక్‌ 2.0 వేగాన్ని చేరుకునే సూపర్‌ సోనిక్‌ విమానం. గంటకు సుమారు 2,458 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఆఫ్టర్‌బర్నర్‌ లేకుండానే మాక్‌ 1.3 వేగంతో సూపర్‌ క్రూయిజ్‌ చేయగలదు. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుంది, స్టెల్త్‌ లక్షణాలు మరింత మెరుగవుతాయి. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే దాదాపు 1,900 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఇది ఎఫ్‌–35 సాధారణ పరిధి (సుమారు 1,100 కి.మీ.) కంటే గణనీయంగా ఎక్కువ. అధునాతన రాడార్, సెన్సార్‌ వ్యవస్థలు దీనికి అదనపు బలం ఇస్తాయి.

స్టెల్త్‌ సామర్థ్యం, ఆధునిక వ్యవస్థలు..
ఆధునిక గాలి రక్షణ వ్యవస్థలకు తప్పించుకునేలా రూపొందించబడిన ఈ విమానం స్టెల్త్‌ టెక్నాలజీని కలిగి ఉంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యాలు, సెన్సర్‌ ఫ్యూజన్‌ దీన్ని గగనతలంలో ఆధిపత్యం చలాయించేలా చేస్తాయి. అయితే, అమెరికా విమానాల మాదిరిగా అన్ని కోణాల్లోనూ పూర్తి స్టెల్త్‌ కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధర తక్కువ, పని ఎక్కువ..
ఒక్కో ఎస్‌యూ–57 విమానం ధర సుమారు 35 నుంచి 50 మిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది. అదే సమయంలో ఎఫ్‌–35 ధర 80 నుంచి 100 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. ఈ తక్కువ ఖర్చు, ఉమ్మడి ఉత్పత్తి సాధ్యత భారత్‌కు ఆర్థికంగా, సాంకేతికంగా ప్రయోజనకరం. ఇది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యానికి దోహదపడవచ్చు.

అమెరికా విమానాలతో పోలిక..
ఎఫ్‌–22 రాప్టర్‌ ఎయిర్‌ సూపీరియారిటీలో అత్యుత్తమం. అయితే ఎస్‌యూ–57 తక్కువ ధర, మంచి పరిధి, సూపర్‌ మెన్యూవరబిలిటీలో పోటీ పడుతుంది. ఎఫ్‌–35 లైట్నింగ్‌ 2 సెన్సార్‌ ఫ్యూజన్, నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ వార్‌ఫేర్‌లో ముందంజలో ఉంది. కానీ ఎస్‌యూ–57 రెండు ఇంజిన్లు, ఎక్కువ వేగం, సూపర్‌ క్రూయిజ్, తక్కువ ధరలో ఆధిక్యత చూపుతుంది.

మొత్తంమీద ఎస్‌యూ–57 వేగం, పరిధి, ఖర్చు, బహుళ ప్రయోజనాల్లో బలమైన ప్రదర్శన ఇస్తుంది. అయితే అమెరికా విమానాలు స్టెల్త్, ఏవియానిక్స్‌ ఇంటిగ్రేషన్‌లో ముందున్నాయి. భారత్‌తో జాయింట్‌ డెవలప్‌మెంట్‌ జరిగితే రెండు దేశాలూ సాంకేతికంగా లాభపడి, ఈ విమానాన్ని మరింత ఆధునికం చేయవచ్చు. ఈ ప్రతిపాదన భారత వైమానిక దళం ఆధునికీకరణకు కీలకమైన అవకాశం.

ఆస్ట్రేలియాలో బొద్దింకల అక్రమ పెంపకం.. అధికారులు దాడితో గుట్టు రట్టు!

Australia Cockroach Farming
Australia Cockroach Farming

Australia Cockroach Farming: బొద్దింక, కాంక్రోచ్‌.. ఇటీలికాలంలో ఈ పేరు బాగా పాపులర్‌ అయింది. దానిని చూస్తేనే వెగటుగా, చికాకుగా అనిపిస్తుంది. అంటి బొద్దికలతో యువతను ఓ జడ్జి పోల్చడం చర్చనీయాంశమైంది. తర్వాత దానిపై వివరణ కూడా ఇచ్చారు. కానీ అది క్రమంగా కాంక్రోచ్‌ జనతా పార్టీ పేరుతో సోషల్‌ మీడియాతో యుద్ధమే మొదలైంది. తాజాగా జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతాపార్టీ మద్దతుదారులు ధర్నా కూడా చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా కాంక్రోచ్‌ల అక్రమ పెంపకం గుట్టు ఆస్ట్రేలియాలో రట్టయింది. అక్రమంగా బొద్దింకలను పెంచి, విక్రయిస్తున్న ఒక కేంద్రంపై స్థానిక అధికారులు ఇటీవల ఆకస్మిక దాడి చేశారు. న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలోని బథరస్ట్‌ నగరంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో దాదాపు ఒక లక్ష మంది బొద్దింకలను సీజ్‌ చేశారు.

మొదటిసారి ఇలా..
దేశంలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కీటకాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. సీజ్‌ చేసిన బొద్దింకల్లో ప్రధానంగా మడగాస్కర్‌ హిస్సింగ్, దుబియా జాతులు ఉన్నట్లు వెల్లడైంది. మడగాస్కర్‌ హిస్సింగ్‌ బొద్దింకలు ప్రపంచంలోనే అతి పెద్దవి. ఇవి సాధారణ బొద్దింకల కంటే చాలా పెద్దవి. ఒక్కొక్కటి 5 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. మెరిసే గోధుమ రంగులో ఉండే ఈ కీటకాలు మనిషి వేలు కంటే కూడా పెద్దగా కనిపిస్తాయి.

పెంపకం ఎందుకు అక్రమం..
ఆస్ట్రేలియాలో స్థానిక వన్యప్రాణులు, జీవవైవిధ్యానికి తీవ్ర హాని కలిగించే సామర్థ్యం ఉన్నందున ఈ జాతి బొద్దింకలను దిగుమతి చేసుకోవడం, పెంచడం, విక్రయించడం చట్టపరంగా నిషేధించబడింది. అయినప్పటికీ ఒక వ్యాపారి లాభాపేక్షతో ఈ కార్యకలాపాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.

ఎందుకు పెంచుతున్నారు?
నిపుణుల ప్రకారం, ఈ పెద్ద సైజు బొద్దింకలను ప్రధానంగా పెంపుడు సరీసృపాలు (పాములు, బల్లులు, గెక్కోలు మొదలైనవి) కోసం ఆహారంగా విక్రయిస్తారు. పెంపుడు జంతువుల యజమానుల మధ్య ఇవి డిమాండ్‌లో ఉండటం వల్ల అక్రమ వ్యాపారం జరుగుతోంది. ఆస్ట్రేలియా వంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కలిగిన దేశంలో విదేశీ కీటకాలను అనుమతి లేకుండా పెంచడం తీవ్రమైన పర్యావరణ ప్రమాదం. ఒకసారి వీటి నుంచి ఏదైనా తప్పించుకుంటే స్థానిక జాతులపై ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు.

ఈ ఘటన దేశంలో అక్రమ కీటకాల వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన అవసరాన్ని మరింత బలంగా ఉద్ఘాటిస్తోంది. ఈ దాడి ఆస్ట్రేలియా పర్యావరణ రక్షణ యంత్రాంగం ఎంత కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఉదాహరణగా నిలుస్తోంది.

కాక్రోచ్ పార్టీ నిరసన..వాపు చూసుకుని బలుపనుకున్నారు..బొక్కా బోర్లా పడ్డారు

Cockroach Party Protest
Cockroach Party Protest

Cockroach Party Protest: సోషల్ మీడియాలో కనిపించే వారంతా మనవాళ్లు కాదు. ఒక రకంగా సోషల్ మీడియా అనేది కృత్రిమ ప్రపంచం. అందులో ఉన్నది ఏది కూడా నిజం కాదు. పైగా అందులో కనిపించే వారంతా మనవాళ్లు అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా ఇదే జరిగినట్టు కనిపిస్తోంది.. నీట్ పేపర్ లీకేజ్.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. అనే డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది.

ఆ పార్టీ అధినేత అభిజిత్ అమెరికా నుంచి వచ్చాడు. చేతిలో అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని పట్టుకొని ఇదే రాజ్యాంగం అంటూ బ్రహ్మ కల్పించాడు. అంతేకాదు ఆజాది జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ ఖలీల్ మాకు ఆదర్శం అంటూ నినాదాలు చేశాడు. పోనీ ఆ పార్టీకి ఉన్న ఫాలోవర్స్ మొత్తం హస్తిన రాలేదు. అసలు అక్కడికి చెప్పుకునే స్థాయిలో రాలేదు జనం.

ఢిల్లీ యూనివర్సిటీలో లెఫ్ట్ వింగ్ భావజాలం ఉండే ప్రొఫెసర్లు.. కొంతమంది యువకులు మాత్రమే వచ్చారు. వాస్తవానికి అక్కడ యువకులు ఎక్కువగా కనిపించాలి. కానీ మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా నీట్ పేపర్ గురించి మాట్లాడకుండా.. ఉమర్ ఖలీల్ గురించి.. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడటం విశేషం.

నిరసనకు పిలుపునిచ్చిన అభిజిత్ ఎండకు తట్టుకోలేక ఏసీ కార్లలోకి వెళ్లిపోయాడు. సౌరవ్ దాస్ కోల్డ్ కాఫీ తాగుతూ అక్కడి వాతావరణంలో ఎంజాయ్ చేశాడు. అక్కడ మీడియా హైప్ ఇచ్చినట్ట ఏదీ లేదు. పైగా అభిజిత్ నిరసన మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆందోళన నెలకొంది. కొంతమంది అతడిని అడ్డుకున్నారు. వాస్తవానికి దేనికోసం నిరసన చేస్తున్నామో అక్కడి వారికి తెలియదు. కొంతమంది దారుణమైన వస్త్రధారణతో అక్కడికి వచ్చారు. వారంతా కూడా లెఫ్ట్ వింగ్ భావజాలాన్ని ప్రదర్శించే విధంగా ప్రవర్తించారు. కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అక్కడికి వచ్చారు. వారు కూడా సంఘీభావం తెలిపారు. దీనినిబట్టి ఇదంతా కూడా కావాలని చేస్తున్న వ్యవహారం లాగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాక్రోచ్ పార్టీ నాయకులకు చీపురు పార్టీ నాయకులు సపోర్ట్ చేయడం ఇక్కడ విశేషం.

ఈ నిరసనలో వేల మంది పాల్గొంటారని.. ఆగమాగం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఎందుకంటే నిరసనకారుల కంటే కంటెంట్ క్రియేటర్లు.. పాత్రికేయులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. వచ్చిన వారిలో మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇదంతా కూడా ఒక ప్లాఫ్ షో మాదిరి మారిపోయింది . పైగా అక్కడ ఆజాది అని నినాదాలు చేయడం.. ఆర్టికల్ 370 రద్దు చేయాలని డిమాండ్ చేయడం.. ఉమర్ ఖలీల్ గురించి నినాదాలు చేయడం వంటి పరిణామాలను గమనిస్తే.. అక్కడ ఏం జరిగింది.. దీని వెనుక ఉన్నది ఎవరు.. వారి లక్ష్యం ఏమిటి అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

'రాకా' మూవీలో అల్లు అర్జున్ వాడే ఊతపదం చాలా డిఫరెంట్ గా ఉందే..?

Raka Movie Updates
Raka Movie Updates

Raka Movie Updates: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎవరికి వాళ్ళు తమ సత్తా చూపిస్తూ మంచి సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీలో రాణిస్తారు. లేకపోతే మాత్రం ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న షెడ్డు కి వెళ్లి పోవాల్సిందే… ఇక మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ సైతం స్టార్ హీరోగా అవతరించడమే కాకుండా తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా వెలుగొందుతున్న ఆయన అల్లు ఫ్యామిలీ అంటూ తనకంటూ ఒక రేంజ్ ను క్రియేట్ చేసుకునేలా వాళ్ళ ఫ్యామిలీని ఎలివేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి ఒక ఊత పదం అయితే ఉంటుందట. ఇంతకుముందు ఆయన చేసిన ‘రేసుగుర్రం’ సినిమాలో ‘దేవుడా’ అంటూ ఎలాగైతే ఒక ఊత పదం ఉండేదో ఇప్పుడు రాకా సినిమాలో కూడా అలాంటి ఒక పదాన్ని యాడ్ చేస్తున్నారట.

నిజానికి ‘ రుద్రమదేవి ‘ సినిమాలో కూడా అల్లు అర్జున్ చేసిన గోనాగన్నారెడ్డి పాత్రలో కూడా ‘నీ మొలతాడులో నా తయత్తు’ అనే ఉత్తపదాన్ని వాడాడు… ఇక ఇప్పుడు రాకా లో కూడా ఆయన ఒక ఊత పదాన్ని పెట్టుకున్నాడట. ఆ పదాన్ని పదేపదే అంటూ ఉంటాడట. ఇంతకీ ఆ ఊతపదం ఏంటంటే ‘ఇప్పుడే చెప్పిన కదా’ అనే మాటని అనే పదే పదే వాడుతూ ఉంటారట.

దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆ ఊత పదం కలిసేలా డైలాగులను కూడా చాలా అద్భుతంగా రాసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా సూపర్ మేన్ సినిమాకు సంబంధించిన మూవీగా తెలుస్తుంది. మరి ఇందులో కూడా అల్లు అర్జున్ అవకాశం దొరికినప్పుడు తన ఊత పదాన్ని వాడుతూ కామెడీని కూడా జనరేట్ చేసే ప్రయత్నం చేశారట.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అలా వైకుంఠపురంలో సినిమా నుంచి పుష్ప, పుష్ప 2 సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఈ మూడు సినిమాలతో ఆయన గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు రాకా సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

'ది ప్యారడైజ్' స్థానాన్ని కబ్జా చేసిన 'ఇరుముడి'.. పాపం నాని కి ఇలాంటి పరిస్థితి ఊహించలేదు..

Nani Paradise Movie
Nani Paradise Movie

The Paradise Movie Postponed: పాపం ఏ ముహూర్తం లో నేచురల్ స్టార్ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మొదలు పెట్టాడో తెలియదు కానీ, ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాని చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రమిది. ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ వీడియో, ఆయా షేర్ పాటకు ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తోంది. ఇలా ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం తో అంచనాలు ఎవ్వరును ఊహించనంత రేంజ్ కి వెళ్లిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఎలాంటి అంచనాలు అయితే ఉంటాయో ఈ చిత్రానికి కూడా అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి.

ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం , రీ షూటింగ్స్ కి ఎక్కువగా జరుగుతుండడం వల్ల ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని స్పష్టంగా నేడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అదే రోజున రవితేజ ‘ఇరుముడి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ‘ది ప్యారడైజ్’ వాయిదా పడిందని అంటున్నారు విశ్లేషకులు. కొన్ని రోజుల క్రితమే ‘ది ప్యారడైజ్’ చిత్రం నాన్ స్టాప్ గా రీ షూటింగ్స్ ని జరుపుకుంటూ ఉంది , ఈ సినిమా చెప్పిన సమయానికి విడుదల అవ్వడం కష్టం అని ఒక ఆర్టికల్ వస్తే , అదంతా ఫేక్ అని , ఆన్ టైం లోనే ఈ చిత్రం పూర్తి అవుతుందని , రీ షూటింగ్స్ జరగడం లేదని , ఆగస్టు 21 న ఈ సినిమా విడుదల అవుతుందని టీం ఒక క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇప్పుడు సడన్ గా ఈ ట్విస్ట్ వచ్చేలోపు ‘ది ప్యారడైజ్’ మరోసారి వాయిదా పడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి చూస్తే , ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ లో ఉన్నారట, అది కూడా కుదరకపోతే వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇక ఇరుముడి విషయానికి వస్తే ఈ చిత్రానికి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.

రామ్ చరణ్ ను నమ్మించి మోసం చేసిన ముగ్గురు దర్శకులు...

Ram Charan
Ram Charan

Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… కెరియర్ మొదట్లోనే పరస విజయాలను అందుకున్న ఆయన ఆ తర్వాత టాప్ హీరోగా మారాడు. ముఖ్యంగా మగధీర సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్ల గొట్టిన మొదటి హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను క్రియేట్ చేశాడు. మరి అలాంటి రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు తడబడుతున్నాడు. నిజానికి ఆయన నమ్మిన ముగ్గురు దర్శకులు అతన్ని దారుణంగా మోసం చేశారు… వాళ్లెవరూ అంటే మగధీర మూవీ తర్వాత ఆరెంజ్ మూవీతో బొమ్మరిల్లు భాస్కర్ అతన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

మూవీ కల్ట్ క్లాసికల్ గా మిగిలిపోయిన కూడా సక్సెస్ ల పరంగా ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మిగిల్చింది. ఇక వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి శ్రీను సైతం తనకి భారీ విజయాన్ని అందిస్తాడు అనే ఆలోచనలో రాంచరణ్ ఉండేవాడు. కానీ బోయపాటి శ్రీనుతీసిన ‘వినయ విధేయ రామ’ మూవీ రామ్ చరణ్ కెరియర్ లోనే వరెస్ట్ మూవీగా నిలిచిందని చాలామంది చెబుతున్నారు…

ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘గేమ్ చేంజర్’ సినిమా కూడా రామ్ చరణ్ కెరియర్ ని బాగా దెబ్బతీసింది. ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత ఉన్న డేట్స్ అన్నింటిని గేమ్ చేంజర్ మీదే పెట్టిన రామ్ చరణ్ ఆ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తానని అనుకున్నాడు. కానీ శంకర్ మేకింగ్ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. కథ విషయంలో కూడా చాలా క్లారిటిని మిస్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో చాలా వరకు నష్టపోయాడు.

ఇక ఆయన త్రిబుల్ ఆర్ రెంజ్ సక్సెస్ ని సాధించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికి తన దగ్గర ఉన్న నాసిరకం ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అంటూ చాలామంది విమర్శకులు సైతం కామెంట్లు చేశారు. మొత్తానికైతే పెద్ది సినిమాతో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని చాలా మంది రామ్ చరణ్ ను ప్రశంసిస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయం….

చిరంజీవి సినిమాల్లో ఆ ఒక్కటి మిస్ అవుతుందా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ప్రస్తుతం సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటూనే తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతనికి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన చిరంజీవి ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పూర్వ వైభవాన్ని పొందలేకపోతున్నాడు. కారణమేదైనా కూడా తను నటనలో వైవిధ్యాన్ని చూపిస్తున్నప్పటికి ఒకప్పుడు చిరంజీవి అంటే ఈజీగా నవరసాలను చేది మెప్పించగల నటుడు అంటూ కామెంట్స్ చేసేవారు. మొత్తానికైతే చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉండేది. మరలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో తన నటనలో ఏదో క్లారిటి మిస్ అవుతున్నాడు. ఇక దానికి తోడుగా ఏదో తెలియని అసంతృప్తిలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అతన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా తన యాక్టింగ్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించడం లేదు. మరి ఎందుకని ఆ ఒక్కటి తను కోల్పోతున్నాడు. నిజానికి చిరంజీవి ఏజ్ పెరిగింది కాబట్టి నటన లో వైవిధ్యాన్ని చూపిస్తూ డిఫరెంట్ యాక్టింగ్ చేస్తే ఇప్పుడున్న హీరోలకు సైతం పోటీని ఇచ్చినవాడవుతాడు.

మరి చిరంజీవి రాబోయే రోజుల్లో ఇంక భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే చిరంజీవి ఈ మధ్యకాలంలో చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తున్నాడు. ఎంత మంది దర్శకులు తన వెంటపడినా కూడా తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు…

చిరంజీవి అంటే ఖైదీ, ఇంద్ర, ఠాగూర్,శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలు గుర్తుకొస్తాయి. ఒక్కో సినిమాలో ఒక్కో వైవిద్య భరితమైన పాత్రలను చేసి మెప్పించాడు. కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఘనత తనకే దక్కుతుంది.

ఇక అలాంటి చిరంజీవి ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని పలికించడంలో కొంతవరకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఏజ్ పెరిగినా కొద్ది ఆయన ఫేస్ లో వచ్చిన మార్పులే దానికి కారణం అని కొంతమంది అంటున్నారు. మరి కొంత మంది మాత్రం చిరంజీవి ఇంకా ట్రై చేస్తే పూర్వ వైభవాన్ని తీసుకురాగలరని మరి కొంత మంది తెలియజేస్తున్నారు. రాబోయే సినిమాల్లో ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…