Homeజాతీయ వార్తలుCockroach Party Protest: కాక్రోచ్ పార్టీ నిరసన..వాపు చూసుకుని బలుపనుకున్నారు..బొక్కా బోర్లా పడ్డారు

Cockroach Party Protest: కాక్రోచ్ పార్టీ నిరసన..వాపు చూసుకుని బలుపనుకున్నారు..బొక్కా బోర్లా పడ్డారు

Cockroach Party Protest: సోషల్ మీడియాలో కనిపించే వారంతా మనవాళ్లు కాదు. ఒక రకంగా సోషల్ మీడియా అనేది కృత్రిమ ప్రపంచం. అందులో ఉన్నది ఏది కూడా నిజం కాదు. పైగా అందులో కనిపించే వారంతా మనవాళ్లు అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా ఇదే జరిగినట్టు కనిపిస్తోంది.. నీట్ పేపర్ లీకేజ్.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. అనే డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో […]

Cockroach Party Protest: సోషల్ మీడియాలో కనిపించే వారంతా మనవాళ్లు కాదు. ఒక రకంగా సోషల్ మీడియా అనేది కృత్రిమ ప్రపంచం. అందులో ఉన్నది ఏది కూడా నిజం కాదు. పైగా అందులో కనిపించే వారంతా మనవాళ్లు అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా ఇదే జరిగినట్టు కనిపిస్తోంది.. నీట్ పేపర్ లీకేజ్.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. అనే డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది.

ఆ పార్టీ అధినేత అభిజిత్ అమెరికా నుంచి వచ్చాడు. చేతిలో అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని పట్టుకొని ఇదే రాజ్యాంగం అంటూ బ్రహ్మ కల్పించాడు. అంతేకాదు ఆజాది జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ ఖలీల్ మాకు ఆదర్శం అంటూ నినాదాలు చేశాడు. పోనీ ఆ పార్టీకి ఉన్న ఫాలోవర్స్ మొత్తం హస్తిన రాలేదు. అసలు అక్కడికి చెప్పుకునే స్థాయిలో రాలేదు జనం.

ఢిల్లీ యూనివర్సిటీలో లెఫ్ట్ వింగ్ భావజాలం ఉండే ప్రొఫెసర్లు.. కొంతమంది యువకులు మాత్రమే వచ్చారు. వాస్తవానికి అక్కడ యువకులు ఎక్కువగా కనిపించాలి. కానీ మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా నీట్ పేపర్ గురించి మాట్లాడకుండా.. ఉమర్ ఖలీల్ గురించి.. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడటం విశేషం.

నిరసనకు పిలుపునిచ్చిన అభిజిత్ ఎండకు తట్టుకోలేక ఏసీ కార్లలోకి వెళ్లిపోయాడు. సౌరవ్ దాస్ కోల్డ్ కాఫీ తాగుతూ అక్కడి వాతావరణంలో ఎంజాయ్ చేశాడు. అక్కడ మీడియా హైప్ ఇచ్చినట్ట ఏదీ లేదు. పైగా అభిజిత్ నిరసన మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆందోళన నెలకొంది. కొంతమంది అతడిని అడ్డుకున్నారు. వాస్తవానికి దేనికోసం నిరసన చేస్తున్నామో అక్కడి వారికి తెలియదు. కొంతమంది దారుణమైన వస్త్రధారణతో అక్కడికి వచ్చారు. వారంతా కూడా లెఫ్ట్ వింగ్ భావజాలాన్ని ప్రదర్శించే విధంగా ప్రవర్తించారు. కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అక్కడికి వచ్చారు. వారు కూడా సంఘీభావం తెలిపారు. దీనినిబట్టి ఇదంతా కూడా కావాలని చేస్తున్న వ్యవహారం లాగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాక్రోచ్ పార్టీ నాయకులకు చీపురు పార్టీ నాయకులు సపోర్ట్ చేయడం ఇక్కడ విశేషం.

ఈ నిరసనలో వేల మంది పాల్గొంటారని.. ఆగమాగం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఎందుకంటే నిరసనకారుల కంటే కంటెంట్ క్రియేటర్లు.. పాత్రికేయులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. వచ్చిన వారిలో మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇదంతా కూడా ఒక ప్లాఫ్ షో మాదిరి మారిపోయింది . పైగా అక్కడ ఆజాది అని నినాదాలు చేయడం.. ఆర్టికల్ 370 రద్దు చేయాలని డిమాండ్ చేయడం.. ఉమర్ ఖలీల్ గురించి నినాదాలు చేయడం వంటి పరిణామాలను గమనిస్తే.. అక్కడ ఏం జరిగింది.. దీని వెనుక ఉన్నది ఎవరు.. వారి లక్ష్యం ఏమిటి అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper