Home Blog Page 174

పెద్ది లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొట్టచ్చు...

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి నటుడు మరొకరు లేరనేది వాస్తవం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని స్టార్ హీరోగా మార్చాయి. పాన్ ఇండియాలో సైతం విపరీతమైన పోటి ఉన్నప్పటికి రామ్ చరణ్ సినిమాల కోసం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా పెద్ది సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే పెద్దికి మొదటి షో తోనే డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ కొంతవరకు తగ్గుతున్నాయనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ పెద్ది సినిమాతో లాంగ్ రన్ లో 600 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొడతాడు అంటూ మేకర్స్ అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

మూడు రోజుల్లో ఈ మూవీ 193 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అయితే రాబట్టాయి. ఇక ఈ మూవీ మీద దాదాపు 350 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేటాయించారు. 600 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టకపోతే మాత్రం ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నప్పటికి ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

గత సంవత్సరం ‘గేమ్ చేంజర్’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు లను బ్రేక్ చేస్తాడని అభిప్రాయపడ్డ తన అభిమానులకు నిరాశే మిగిలింది. భారీ బడ్జెట్ తో ఆ సినిమా రావడం రామ్ చరణ్ క్రేజ్ ని ఏమాత్రం టచ్ చేయలేకపోవడం వల్ల సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

తద్వారా రామ్ చరణ్ మార్కెట్ భారీగా పడిపోయిందనే చెప్పాలి. ఇక పెద్ది సినిమాతో తన యాక్టింగ్ పర్ఫామెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించినప్పటికి కథ విషయంలో గాని, దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ ప్రేక్షకులకు కొంతవరకు నచ్చలేదు. దాంతో మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

పెద్ది లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొట్టచ్చు...

Ram Charan
Ram Charan

Ram Charan Peddi Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి నటుడు మరొకరు లేరనేది వాస్తవం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని స్టార్ హీరోగా మార్చాయి. పాన్ ఇండియాలో సైతం విపరీతమైన పోటి ఉన్నప్పటికి రామ్ చరణ్ సినిమాల కోసం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా పెద్ది సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే పెద్దికి మొదటి షో తోనే డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ కొంతవరకు తగ్గుతున్నాయనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ పెద్ది సినిమాతో లాంగ్ రన్ లో 600 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొడతాడు అంటూ మేకర్స్ అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

మూడు రోజుల్లో ఈ మూవీ 193 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అయితే రాబట్టాయి. ఇక ఈ మూవీ మీద దాదాపు 350 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేటాయించారు. 600 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టకపోతే మాత్రం ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నప్పటికి ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

గత సంవత్సరం ‘గేమ్ చేంజర్’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు లను బ్రేక్ చేస్తాడని అభిప్రాయపడ్డ తన అభిమానులకు నిరాశే మిగిలింది. భారీ బడ్జెట్ తో ఆ సినిమా రావడం రామ్ చరణ్ క్రేజ్ ని ఏమాత్రం టచ్ చేయలేకపోవడం వల్ల సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

తద్వారా రామ్ చరణ్ మార్కెట్ భారీగా పడిపోయిందనే చెప్పాలి. ఇక పెద్ది సినిమాతో తన యాక్టింగ్ పర్ఫామెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించినప్పటికి కథ విషయంలో గాని, దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ ప్రేక్షకులకు కొంతవరకు నచ్చలేదు. దాంతో మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా బడ్జెట్ పెడిగిపోతుందా..?

Balakrishna Gopichand Malineni Movie
Balakrishna Gopichand Malineni Movie

Balakrishna Gopichand Malineni Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలలో బాలయ్య బాబు ఒకరు. సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో చెలామణి అవుతూనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ మధ్యకాలం లో వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఘనత కూడా తనకే దక్కింది. మధ్యలో ‘అఖండ 2’ సినిమా ఫ్లాప్ అయినప్పటికి ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అనుకొని బరిలోకి దిగారు.

కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ మరింత పెరిగిపోతుందట. దాంతో ఏం చేస్తే బాగుంటుందనే దోరణిలో బాలయ్య బాబు ఆలోచిస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ సినిమా నుంచి తొందరలోనే గ్లింప్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు ఇంతకుముందు చేసిన ‘అఖండ 2’ సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగానే ఆ సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. మరి ఈ సినిమాతో మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు బాలయ్య నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులను నిరాశపరచలేదు. బాలయ్య ఏజ్ పెరిగిన కూడా ఇప్పుడు చాలా యంగ్ గా కనిపిస్తూ ప్రేక్షకులు ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో ఆయన సినిమా సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా తన కూతురు అయిన తేజస్విని బాలయ్యకి ఎలాంటి కథలు అయితే సెట్ అవుతాయో అలాంటి స్టోరీస్ ను సెట్ చేసి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య లాంటి నటుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది…

భారత్‌లో జనన రేటు పతనం.. ఎలాన్‌ మస్క్‌ హెచ్చరిక దేనికి సంకేతం!

India Birth Rate Decline
India Birth Rate Decline

India Birth Rate Decline: భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశం.. యువతే మన బలం. ఇప్పటికీ యూతే మన పవర్, ఎంపవర్‌.. అయితే ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలిక జనాభా భారత భవిష్యత్తు గురించి కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ప్రపంచ కుబేరుడు, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ట్వీట్‌ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశం చేశాయి.

పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు..
టోటల్‌ ఫెర్టిలిటీ రేటు అంటే ఒక మహిళ జీవితకాలంలో సగటున ఎంత మంది పిల్లలు కనగలదో సూచించే సంఖ్య. జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలి. ఇటీవలి డేటా ప్రకారం భారత్‌ టోటల్‌ ఫెర్టిలిటీ రేటు దశాబ్దంలో 2.3 నుంచి 1.9కి పడిపోయింది. ఇది మొదటిసారి రీప్లేస్‌మెంట్‌ లెవల్‌ కంటే తక్కువకు దిగజారిన సందర్భం. విద్యావంతుల్లో బర్త్‌ రేటు చాలా కాలం క్రితమే పడిపోయింది. మస్క్‌ ప్రధానంగా హైలైట్‌ చేసిన అంశం ఇది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆధునిక జీవనశైలి కారణంగా చదువుకున్న వర్గాల్లో జననాలు చాలా సంవత్సరాల క్రితమే తగ్గిపోయాయి. ఇది సమాజంలోని ఆర్థికంగా ముందున్న, నగరాల్లో నివసించే వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.

దీర్ఘకాలిక ప్రభావం..
విద్య, సామాజిక ఎదుగుదల సానుకూలమైనప్పటికీ, ఇది జనాభా నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. జాతీయ స్థాయిలో టోటల్‌ ఫెర్టిలిటీ రేటు 1.9గా ఉన్నప్పటికీ, దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఇంకా తక్కువ స్థాయిలో ఉంది. ఈ రాష్ట్రాల డేటా చార్ట్‌లో స్పష్టంగా కనిపించడం గమనార్హం. దక్షిణ భారతదేశం ఇప్పటికే జనాభా స్థిరీకరణ వైపు వేగంగా ముందుకు వెళ్తోంది. ఇది విద్య, ఆరోగ్యం, మహిళల సాధికారతలో సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తుంది కానీ, భవిష్యత్తులో యువత లభ్యత, ఉద్యోగ శక్తి మీద ప్రభావం చూపవచ్చు.

పతనానికి ప్రధాన కారణాలు..
టోటల్‌ ఫెర్టిలిటీ రేటు పడిపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు చెబుతున్నారు. అందులో ప్రధానమైనవి మహిళల విద్యా స్థాయి పెరగడం, వృత్తి అవకాశాలు పెరగడమే. మరో కారణం ఆలస్యంగా వివాహం, పిల్లలను కనడం. నగరీకరణ, ఆర్థిక ఒత్తిడి, జీవన వ్యయం పెరగడం కూడా పతనానికి మరో కారణం. కుటుంబ నియంత్రణ సాధనాలు, అవగాహన పెరగడం ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోంది.

భవిష్యత్‌పై ప్రభావం..
ఇప్పటికీ భారత్‌ యువ జనాభా కలిగిన దేశమే అయినా, కొన్ని దశాబ్దాల్లో వృద్ధాప్య జనాభా పెరగడం, డిపెండెన్సీ రేషియో పెరగడం, కార్మిక శక్తి తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక వృద్ధి, పెన్షన్‌ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మస్క్‌ ఆందోళన చెందుతున్నట్లుగా, తక్కువ జననాలు దీర్ఘకాలికంగా సమాజాలను బలహీనపరుస్తాయి.

పరిష్కారం ఏమిటి..
జననాలను బలవంతంగా పెంచడం కాకుండా, సమతుల్య విధానాలు అవసరం. మహిళలకు మద్దతు (చైల్డ్‌కేర్, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌)
యువతకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆరోగ్యకరమైన వలస విధానాలు, జనాభా మార్పులకు అనుగుణంగా విద్య, సాంకేతికత, ఆటోమేషన్‌పై దృష్టి పెట్టాలి.

భారత్‌ ఇప్పటికే డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు డెమోగ్రాఫిక్‌ ట్రాన్సిషన్‌ తర్వాతి దశకు సిద్ధమవ్వాల్సిన సమయం ఇది. మస్క్‌ ట్వీట్‌ కేవలం హెచ్చరిక మాత్రమే కాదు.. భవిష్యత్తు గురించి సకాలంలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

6000 తో ఇతడి జీవితం మొదలైంది.. కోట్ల స్థాయికి ఎదిగింది.. కానీ అక్కడే ట్విస్ట్.. స్కిప్ చేయకుండా చదవాల్సిన స్టోరీ..

Baikunthanath Behera
Baikunthanath Behera

Baikunthanath Behera: ఎవరైనా సరే జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెడతారు. కష్టపడి పనిచేసినవారు ఎదుగుతారు. కష్టాన్ని తట్టుకోలేక మధ్యలో వదిలేసినవారు అక్కడే ఉండిపోతారు. ఇతడు కూడా తన జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెట్టాడు.. కాదు కాదు 6000 నుంచి మొదలుపెట్టాడు. అదేంటి 6000 అంటున్నారు అనే ప్రశ్న మీ నుంచి వ్యక్తమవుతుందని మాకు తెలుసు. అయితే ఇంకెందుకు లేటు.. చదివేయండి ఈ స్టోరీ.. మామూలుగా ఉండదు..

అది ఒడిశా రాష్ట్రం. అక్కడి ఐటీడీఏ కార్యాలయంలో ఏఈఈ బైకుంఠనాథ్ బెహరా పని చేస్తున్నారు. ఈయన ప్రారంభ వేతనం 6000 మాత్రమే.. ఆ తర్వాత సార్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారో.. అప్పటినుంచి ఆయన తన ఆలోచన ధోరణి మొత్తాన్ని మార్చుకున్నారు. కేవలం సంపాదనకు మాత్రమే అలవాటు పడ్డారు. అది కూడా మామూలు సంపాదన కాదు.. అవినీతి, అక్రమం కలబోతతో సంపాదించుకున్న సంపాదన.

ప్రతిపనికి ఒక రేటు నిర్ణయించుకున్నారు.. డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నారు. ఐటీడీఏలో ఒక సమాంతర వ్యవస్థను నడపడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే కోట్లకు ఎదిగిపోయారు. సదరు సార్ ఒకే చోట పనిచేసేవారు. పైగా బదిలీలు లేకుండా చూసుకునేవారు. తద్వారా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడం మాత్రమే కాదు.. పది తరాలు కూర్చొని తిన్నా కూడా ఒడవని ఆస్తులను సంపాదించుకున్నారు.

రోజులు మొత్తం ఒకేలా ఉండవు కదా.. బెహరా అవినీతి వ్యవహారం బయటపడడం మొదలైంది. ఇతడి అక్రమాలు వెలుగులోకి రావడం స్టార్ట్ అయింది. ఒడిశా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. బెహరా చిట్టా మొత్తం విప్పడం ప్రారంభించారు.. మొత్తంగా బ్యాంకు లాకర్లలో రెండు కోట్ల విలువైన నగదు గుర్తించారు. బంగారం.. ఇతర ఖరీదైన లోహాలు ఇతడి వద్ద బాగానే ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు.. ఐదు భవనాలు.. 13 ఫ్లాట్లు ఇతడి వద్ద ఉన్నాయి.

అధికారులకే దిమ్మ తిరిగిపోయే స్థాయిలో ఇతడి సంపాదన ఉండడంతో ఒడిశాలో సంచలనంగా మారింది. అవినీతి అధికారుల మీద ఒడిశా ప్రభుత్వం కొద్దిరోజులుగా ఉక్కు పాదం మోపుతోంది.. ఇంతవరకు అక్కడి అధికారులు ఎంతోమంది అవినీతిపరులైన ఆఫీసర్లను పట్టుకున్నారు. కానీ ఈ స్థాయిలో అవినీతి తిమింగలాన్ని తాము చూడలేదని వారు చెబుతున్నారు అంటే.. బెహరా సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 6000 తో మొదలైన జీవితం కోట్లకి ఎదిగింది. ఈ కథనం ప్రారంభంలో శీర్షిక చదివి ఇదేదో బిజినెస్ మాన్ స్టోరీ అనుకున్నారు కదా.. కాదు కాదు కరప్షన్ ఆఫీసర్ డర్టీ పిక్చర్..

అనిల్ రావిపూడి మీద నమ్మకం కోల్పోయిన కళ్యాణ్ రామ్... కారణం ఏంటంటే..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నా
యి. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలతో విజయాలను అందుకున్న దర్శకుడిగా తనకంటూ పేరు ప్రఖ్యాతలనైతే ఏర్పాటు చేసుకున్నాడు. మరి అలాంటి అనిల్ రావిపూడి ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి కి సైతం భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు. ‘మనశంకర వరప్రసాద్’ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో అనిల్ రావిపూడి తన మొదటి సినిమాను చేయాలి అనుకున్నప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగాడట.

కానీ ఎవరు కూడా ఆయనకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఇక ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ ను హీరోగా పెట్టి ఆయన ప్రొడక్షన్ లోనే సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు…కళ్యాణ్ రామ్ సైతం తనకి ఇష్టం లేకపోయిన ఆ సినిమా కథ బాగుందని చెప్పి ఒప్పుకొని సినిమానైతే చేశాడు.

ఒక మూడు షెడ్యూల్ అయిపోయేంత వరకు కూడా కళ్యాణ్ రామ్ కి అనిల్ రావిపూడి మీద పెద్దగా నమ్మకం కుదరలేదట. ఏదో నార్మల్ సినిమా చేస్తాడులే అని లైట్ తీసుకున్నాడు. కానీ మూడు షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత సినిమా అద్భుతంగా వస్తుంది అంటూ అందరు చెప్పడంతో కళ్యాణ్ రామ్ సైతం ఒకసారి రషెస్ చూసి సినిమాని చాలా ఎఫెక్టివ్ గా చేద్దామని అనిల్ రావిపూడి తో చెప్పారట…

దాంతో అప్పటినుంచి కళ్యాణ్ రామ్ దాని పూర్తి ఫోకస్ పెట్టి చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది… ఇక మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

రవితేజ మరోసారి ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే టాప్ లోకి వస్తాడా..?

Ravi Teja Next Movie
Ravi Teja Next Movie

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో కమర్షియల్ సినిమాలను నమ్ముకునే ముందుకు సాగిన ఆయన ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి ‘ సినిమాతో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో రవితేజను స్టార్ హీరోగా నిలిపిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు రావడం దాంతో రవితేజ స్టార్ హీరోగా మారిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రవితేజ మరోసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు.

ఇక పూరి జగన్నాధ్ తో ఆయన సినిమా చేస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ మరోసారి బాగా వర్కౌట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి 10 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది కదా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సినిమా మేధావులు సైతం రవితేజ పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ అని వాళ్ళ కాంబినేషన్లో హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వాళ్ళిద్దరి మధ్య ఉండే ర్యాపో తో ఒక మంచి సినిమా అయితే వస్తుందని భావిస్తున్నారు. ఇక పూరి జగన్నాధ్ గతంలో లాగా ఇప్పుడుఫామ్ లో లేడు. అయినప్పటికి రవితేజ దొరికితే తను కచ్చితంగా హిట్ సినిమా తీస్తాడని మరి కొంతమంది భావిస్తున్నారు. ఇక పూరి ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…

ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ సైతం ప్రస్తుతం కొత్త సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. కాబట్టి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేయడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే పూరి జగన్నాధ్ రొటీన్ టెంప్లేట్ లోనే సినిమాలు చేస్తుంటాడు. కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడప్పుడే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలైతే లేవు…

ఇంటర్‌లో మార్కులు తగ్గినా కల సాకారం.. ఐఐటీ రూర్కీ బంపర్‌ ఆఫర్‌!

IIT Roorkee
IIT Roorkee

IIT Roorkee: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్‌ మార్కుల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉన్న వేలాది మెరిట్‌ విద్యార్థులకు ఐఐటీ రూర్కీ ఒక బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఇంటర్‌లో నిర్ణీత శాతం మార్కులు ఇంకా సాధించని విద్యార్థులు కూడా జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇది చాలా మంది విద్యార్థులకు కొంత ఆశ కలిగించిన వార్త. అయితే ఇది పూర్తి సడలింపు కాదు.. తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.

ఎవరికి ఈ అవకాశం?
ఇంటర్‌లో 75 శాతం మార్కులు రాకపోయినా ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల విద్యార్థులు 65% మార్కులు సాధించకపోయినా ఆప్షన్లు నమోదు చేయవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది. అయితే సీటు చివరికి నిర్ధారణ కావాలంటే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

ముఖ్యమైన షరతులు..
విద్యార్థులు తమ సవరించిన మార్క్‌షీట్‌ (75 శాతం లేదా 65 శాతం అర్హత పూర్తి చేసినది) జులై 15, 2026 లోగా orgjee@iitr.ac.in ఈమెయిల్‌కు పంపించాలి. నాలుగో రౌండ్‌ ముగిసిన తర్వాత సరైన మార్కులు సమర్పించిన వారికి మాత్రమే సీటు ఖాయం చేస్తారు. ఇది
సీబీఎస్‌ఈ ఆన్‌–స్క్రీన్‌ మార్కింగ్‌ వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, రీ–ఎవాల్యుయేషన్‌ ఆలస్యం వల్ల మార్కులు తగ్గిన విద్యార్థుల కోసం తీసుకున్న తాత్కాలిక చర్య.

ఈ నిర్ణయం పెద్ద ఊరట..
ఈ ఏడాది బోర్డు ఫలితాల్లో అనేక అసంబద్ధతలు, మార్కుల తగ్గుదల వల్ల జేఈఈలో అద్భుతమైన ర్యాంకు సాధించిన విద్యార్థులు కూడా ఐఐటీ సీటు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ఐఐటీ రూర్కీ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి కేంద్రీకృత వైఖరిని చూపిస్తోంది. ఇది విద్యార్థులకు ఊరట నిచ్చింది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. 75 శాతం (లేదా 65 శాతం) నిబంధన ఇప్పటికీ అమలులోనే ఉంది. జులై 15 లోపు మార్కులు సవరించుకోకపోతే సీటు రద్దు అయ్యే అవకాశం ఉంది.

ఈ తాత్కాలిక చర్య స్వాగతించదగ్గదే. కానీ ఇది ఒక ప్రశ్నను మళ్లీ లేవనెత్తుతోంది. బోర్డు మార్కులు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల మధ్య ఉన్న అసమానతలను ఎప్పటికైనా పరిష్కరించాలా? ఒకే విద్యార్థి జేఈఈలో అద్భుతం చేస్తే, బోర్డు ఎవాల్యుయేషన్‌ లోపాల వల్ల ఆ అవకాశం కోల్పోవడం న్యాయమా? వివిధ బోర్డులు ఉన్న వ్యవస్థలో ఏకరూపత లేకపోవడం, మార్కింగ్‌ వివాదాలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీర్ఘకాలికంగా బోర్డు ఎవాల్యుయేషన్‌ వ్యవస్థలో పారదర్శకత, ఆధునికీకరణ, ఏకరూప మూల్యాంకనం అవసరం.

కష్టపడి ప్రిపేర్‌ అయిన విద్యార్థుల డ్రీమ్‌ను వ్యవస్థ ఒక్కసారిగా కాల్చివేయడం సరికాదు. అయితే విద్యార్థులు కూడా డెడ్‌లైన్‌లను తీవ్రంగా తీసుకోవాలి. మీరు ఈ సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థి అయితే, ఇప్పుడే చర్య తీసుకోండి. మీ కష్టం వృథా కాకుండా ఐఐటీ డ్రీమ్‌ సాకారం కావాలని ఆశిద్దాం.

అమెరికాపై ఇజ్రాయెల్‌ నిఘా.. ఇరు దేశాల బంధానికి బీటలు..

US Israel Relations
US Israel Relations

US Israel Relations: పశ్చిమాసియాలో ఆధిపత్యం.. సామ్రాజ్యవాద విస్తరణ కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు. ఇందుకు ఇజ్రాయెల్‌ సహాయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌ కూడా లెబనాన్‌ను టార్గెట్‌ చేయడానికి అమెరికాకు సహాయం చేసింది. అయితే దాదాపు రెండు నెలల యుద్ధం తర్వాత అమెరికాకు వాస్తవం తెలిసి వచ్చింది. ఇరాన్‌ను గెలవడం అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో ట్రంప్‌ శాంతిమంత్రం వల్లించడం మొదలు పెట్టాడు. ఇది ఇజ్రాయెల్‌కు నచ్చడం లేదు. లెబనాన్‌లోని హెజ్‌బుల్లాను అంతం చేయాలన్న ఇజ్రాయెల్‌ లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్రమంగా అవి పెరిగి పెద్దవవుతున్నాయి. తాజాగా పెంటగాన్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ను ‘‘క్రిటికల్‌’’ నిఘా బెదిరింపు రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపింది.

పెంటగాన్‌ ఆందోళన..
డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ) ఇటీవలి వారాల్లో ఇజ్రాయెల్‌పై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ థ్రెట్‌ లెవల్‌ను అత్యున్నత స్థాయికి పెంచింది. ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్లు అమెరికా అధికారులను, ముఖ్యంగా ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని సీనియర్‌ అధికారులపై నిఘా పెట్టినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్‌తో అమెరికా అంతర్గత చర్చలు, వ్యూహాలు, నిర్ణయాల గురించి తెలుసుకోవడం. ఇజ్రాయెల్‌ ఈ సమాచారాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధికారులు ఇజ్రాయెల్‌కు వెళ్లేటప్పుడు లేదా ఇజ్రాయెల్‌ అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్నర్‌ ఫోన్లు (డిస్పోజబుల్‌ ఫోన్లు), క్లీన్‌ ల్యాప్‌టాప్‌లు వాడటం, హోటల్‌ గదుల్లో సెన్సిటివ్‌ చర్చలు నివారించడం వంటి చర్యలు ఇప్పుడు స్టాండర్డ్‌ ప్రొటోకాల్‌గా మారుతున్నాయి.

ట్రంప్‌–నెతన్యాహు మధ్య పెరుగుతున్న దూరం..
ఈ నిఘా ఆరోపణలు ఇరాన్‌ యుద్ధం తర్వాతి దశ గురించి రెండు దేశాల మధ్య ఏర్పడిన వ్యూహాత్మక అసమ్మతులతో ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మరిన్ని కఠిన చర్యలు కోరుతుంటే, ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇరాన్‌తో డిప్లమాసీ, సీజ్‌ఫైర్‌ దిశగా ముందుకు వెళ్తోంది. ఇటీవలి ఫోన్‌ సంభాషణలో ట్రంప్‌ నెతన్యాహుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్‌ తన జాతీయ భద్రతా ప్రాధాన్యతలను అమెరికా వ్యూహాలకు ముందు ఉంచుతోంది. అమెరికా తన మిత్రదేశం మీద కూడా పూర్తి విశ్వాసం ఉంచడం లేదు. ఇరాన్‌ సమస్యపై రెండు దేశాల లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయనడానికి ఇది బలమైన సంకేతం.

ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్‌..
ఇజ్రాయెల్‌ తరపున ఈ ఆరోపణలను ఖండించారు. ఇది కేవలం అమెరికా అంతర్గత రాజకీయాలు లేదా ఇంటెలిజెన్స్‌ సంస్థల మధ్య ఉద్రిక్తత కావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనలు అమెరికా–ఇజ్రాయెల్‌ మధ్య సమాచార మార్పిడి, సంయుక్త ఆపరేషన్లు, సైనిక సహకారంపై ప్రభావం చూపవచ్చు. దీర్ఘకాలికంగా మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా వ్యూహాలు మరింత స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే, ఇరు దేశాల మధ్య లోతైన స్ట్రాటజిక్, సైనిక, ఆర్థిక సంబంధాలు ఉన్నందున పూర్తి విచ్ఛేదనం సులభం కాదు. ఈ తాజా పరిణామాలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి.

మారుతున్న లద్దాక్‌.. పోటెత్తుతున్న టూరిస్టులు..!

Ladakh Tourism
Ladakh Tourism

Ladakh Tourism: వేసవిలో టూరిస్టు ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. అయితే మన దేశంలో అందమైన కశ్మీర్‌లోని పహల్గాంలో గతేడాది జరిగిన ఘటనలో పర్యాటకులు కాస్త తగ్గారు. కానీ కేంద్రం, ఆర్మీ తీసుకున్న రక్షణ చర్యలతో ఈ వేసవిలో లద్దాక్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ మే నెలలో మొత్తం 72,834 మంది పర్యాటకులు లద్దాక్‌ను సందర్శించారు. గత ఏడాది మే నెలలో 32,927 మంది మాత్రమే వచ్చిన విషయాన్ని పోలిస్తే ఇది 121.2% అద్భుత పెరుగుదల. లద్దాక్‌ టూరిజం చరిత్రలో ఇది ఒక నిజమైన మైలురాయి. జనవరి నుంచి మే వరకు మొత్తం 1,17,546 మంది సందర్శకులు వచ్చారు. గతేఏడాది అదే కాలంతో పోలిస్తే 43.65% వృద్ధి. ఇందులో దేశీయ పర్యాటకుల సంఖ్య 1,10,585 (45.9% పెరుగుదల), విదేశీయులు 6,961 (15.5% పెరుగుదల). లద్దాక్‌ ఆర్థిక వ్యవస్థలో టూరిజం ఎంత కీలక పాత్ర పోషిస్తోందో స్పష్టంగా చెప్పే సంకేతాలు.

ప్రభుత్వ చర్యలతో సానుకూల వాతావరణం..
లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఈ వృద్ధిని సమర్థించడమే కాకుండా, టూరిజం రంగానికి స్థానికులకు ఉపాధి కల్పించే ముఖ్యమైన ఇంజిన్‌గా అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో గత కొన్ని నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. హోటల్స్, హోమ్‌స్టేలు, టూర్‌ ఆపరేటర్ల కోసం ఏకీకృత, సరళీకృత రిజిస్ట్రేషన్‌ విధానం, టూరిజం యూనిట్లకు ‘‘ఇండస్ట్రీ’’ స్టేటస్‌ ఇవ్వడం
కాంప్లయన్స్‌ భారం తగ్గించి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను ప్రోత్సహించాయి.

యువతకు ఉపాధి..
ఈ సంస్కరణలు స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాయి. హోమ్‌స్టేలు, ట్రాన్స్‌పోర్ట్, హ్యాండిక్రాఫ్ట్, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ రంగాల్లో ఉపాధి పెరిగింది. మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, ఎక్కువ విమాన సర్వీసులు, సోషల్‌ మీడియా ద్వారా లద్దాక్‌ సౌందర్యం వైరల్‌ కావడం, పోస్ట్‌–పాండమిక్‌ ట్రావెల్‌ బూమ్‌ ఈ సీజన్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. ప్రత్యేకించి మే నెలలో రోడ్లు తెరవడం, అనుకూల వాతావరణం, పర్వతాలు, సరస్సులు, మఠాలు, అడ్వెంచర్‌ యాత్రలు కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ అపూర్వ వృద్ధి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, లద్దాక్‌ పర్యావరణ సున్నితత్వాన్ని మరచిపోకూడదు. ఇప్పటికే పాపులర్‌ స్పాట్లైన పాంగాంగ్‌ లేక్, నుబ్రా వ్యాలీ, లే–మనాలి హైవేల్లో క్రౌడింగ్, వాస్తే మేనేజ్‌మెంట్, నీటి కొరత, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లద్దాక్‌ ఒక ఫ్రాజైల్‌ ఎకోసిస్టమ్‌. ఇక్కడ టూరిజం వృద్ధి చెందాలంటే అది సస్టైనబుల్, రెస్పాన్సిబుల్‌ టూరిజంగా మాత్రమే ఉండాలి. ప్రభుత్వం, స్థానికులు, టూరిజం స్టేక్‌హోల్డర్లు కలిసి పనిచేసి, క్యాపాసిటీ బిల్డింగ్, ఆఫ్‌–సీజన్‌ టూరిజం ప్రోత్సాహం, ఎకో–టూరిజం, వేస్ట్‌ మేనేజ్‌మెంట్, కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ తగ్గించడం వంటి వ్యూహాలను అమలు చేయాలి.

లద్దాక్‌ టూరిజం ప్రస్తుతం చూస్తున్న ఈ బూమ్‌ ఒక అపూర్వ అవకాశం. సరైన ప్రణాళిక, స్థానికుల పాల్గొన్నత, పర్యావరణ సంరక్షణతో కూడిన విధానాలతో ఈ వృద్ధిని మరింత స్థిరంగా, అర్థవంతంగా మార్చుకోవాలి. లద్దాక్‌ కేవలం ఒక టూరిస్ట్‌ డెస్టినేషన్‌ కాదు.. ఇది ఒక ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి, ప్రకృతి. దానిని కాపాడుకుంటూ అభివృద్ధి చేయడమే నిజమైన విజయం.

డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ విలనా..? మరి హీరో ఎవరు..?

NTR Dragon movie action episodes
NTR Dragon movie action episodes

NTR Dragon Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతు ముందుకు దూసుకెళ్తుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న మన హీరోలందరు పాన్ ఇండియాలో సంచాలనాలను క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి నటుడు పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. గతంలో ‘దేవర’ సినిమాతో సోలోగా 600 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే రామ్ చరణ్ జూనియర్ – ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా 1300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడినప్పటికి ఆ సినిమా క్రెడిట్ ఇద్దరికి వెళ్లిపోయింది.

కాబట్టి ఇప్పుడు ఆయన సోలో హీరోగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. డ్రాగన్ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషిస్తున్నాడనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తే నిజానికి ఈ సినిమాలో హీరో ఎవరు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక పాత్రలో హీరోగా కనిపిస్తే, మరొక పాత్రలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్, జై లవకుశ లాంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్, త్రిబుల్ రోల్స్ కూడా ప్రోషించారు.

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాలో చేయబోతున్న డ్యూయల్ రోల్ మీదనే ప్రతి ఒక్కరు చూపైతే ఉంది. సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు అనే విషయం బయటకు రాకపోయిన కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ వదులుతున్నారు. కాబట్టి వాటిని అంచనాగా వేసుకొని చాలామంది ఈ సినిమా మీద రెస్పాండ్ అవుతున్నారు…మొత్తానికైతే ఎన్టీఆర్ ఈ సినిమాతో సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

చిరంజీవి తో ఎలాంటి సినిమా చేయాలో బాబీ కి బాగా తెలుసా..?

Chiranjeevi Bobby Movie
Chiranjeevi Bobby Movie

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఒక రకంగా చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ సక్సెస్ గా చెప్పుకునే సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా ఒకటి కావడం విశేషం… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవిని ఎలా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే విషయం బాబీ కి బాగా తెలిసినట్టుంది. అందుకే అలాంటి కథలతోనే చిరంజీవి దగ్గరికి వెళ్లి అతన్ని మెప్పించి మరి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాబీ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు…

గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాబీ లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. మరలాంటి దర్శకుడు చిరంజీవిని ఇప్పుడు ఎలా చూపించబోతున్నాడు. డిఫరెంట్ కోణంలో చూపిస్తాడా? లేదంటే రొటీన్ గానే చూపించి బోర్ కొట్టిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి కూడా ఈ సినిమాలో చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాబట్టి తను కథ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కథని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే బాబీ చిరంజీవితో మరో సక్సెస్ ని సాధించడం పక్కానా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక చిరంజీవి తనకు ఎవరైతే సక్సెస్ లను అందిస్తారో వాళ్లకి మాత్రమే సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు.

నిజానికి చిరంజీవి తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్లెవరికి అవకాశం ఇవ్వడం లేదు. కారణం ఆయన చెప్పినట్టుగా సినిమాను చేస్తూ కమర్షియల్ హంగులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయగలిగే దర్శకులను మాత్రమే ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి బాబీ కే ఆయన ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాడు…

చిరంజీవి vs బాలయ్య... వచ్చే సంక్రాంతి మాములుగా ఉండదా..?

Balakrishna Vs Chiranjeevi
Balakrishna Vs Chiranjeevi

Chiranjeevi Vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో చిరంజీవి, బాలయ్య బాబులు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళిద్దరూ తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం… ఇండస్ట్రీ లో ఎంత కంది హీరోలు ఉన్నా బీ,సీ సెంటర్లోని ప్రేక్షకులు వీళ్లిద్దరి సినిమాలను మాత్రమే రిపీట్ గా చూస్తారు…ఇక ఇప్పుడు వీళ్ళు సీనియర్ హీరోలుగా కూడా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికి వల్ల సినిమాలతో పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఇక బాలయ్య బాబు మపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండడం విశేషం… వీళ్లిద్దరు 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరోసారి చిరంజీవి, బాలయ్య బాబులు పోటీ పడుతున్నారనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో విజయాన్ని సాధించేది ఎవరు? ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 2023 వ సంవత్సరంలో కూడా వీళ్ళిద్దరు వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలతో పోటీపడ్డారు.

ఆ సినిమాల దర్శకులు కూడా బాబీ, గోపీచంద్ మలినేని నే కావడం విశేషం… ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలు మళ్ళీ ఆ ఇద్దరు దర్శకులనే రిపీట్ చేస్తున్నారు. దాంతో పాటుగా సంక్రాంతికి మళ్లీ పోటీకి వస్తున్నారు. మరి అప్పుడు ఇద్దరు హీరోలు విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఎవరు సక్సెస్ ని సాధిస్తారు ఎవరు డీలా పడిపోతారు అనేదే ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న…

ఇక ఏది ఏమైనా కూడా ఇద్దరు స్టార్ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను అందించారు. నిజానికి వాళ్లిద్దరు చూడని సక్సెస్ లు లేవు. కాబట్టి కాసేపు వాటిని పక్కనపెడితే ఈ ఏజ్ లో కూడా మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరి కి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు దూసుకెళ్లడం నిజంగా చాలా గొప్ప విషయం అంటూ సినిమా మేధావులు సైతం వాళ్లను ప్రశంసిస్తున్నారు…

మహేష్ బాబు మెయింటెనెన్స్ కోసం ఒక్క రోజుకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆయన రాజకుమారుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికి మురారి, ఒక్కడు లాంటి సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమాలన్నీ అతనికి ఒక డిఫరెంట్ ఇమేజ్ అయితే ఇచ్చాయి. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమాతో ఆయన మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఎప్పుడు పడనంత కష్టమైతే పడుతున్నాడట. కారణం ఏంటంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం అలాగే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి.

కాబట్టి రాజమౌళి ఈ సినిమాని ఒక్కొక్క ఫ్రేమ్ చెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం మహేష్ బాబు సైతం విపరీతంగా కష్టపడుతున్నారట. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మరొక సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు.

50 సంవత్సరాల వయసులో కూడా అలా ఉండడం అనేది మామూలు విషయం కాదు. మరి మహేష్ బాబు ఎందుకని రోజు రోజుకి అందంగా తయారవుతున్నాడు. ఏజ్ పెరిగే కొద్ది ఆయన ఇంకా యాక్టివ్ గా, అందంగా ఎలా కనిపిస్తున్నాడనే విషయంలోనే చాలా వరకు చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి మహేష్ బాబు ఫుడ్ డైట్ అయితే తీసుకుంటూ ఉంటాడు.

తను లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఆయన తినే తిండికి మైంటైన్ చేసి లగ్జరీ లైఫ్ కి తను తాగే వాటర్ కి, తన డ్రెస్ లకు తన హెయిర్ మెయింటెనెస్ మొత్తం అన్నింటికి కలిపి దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందట… మొత్తానికైతే నెలకి దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుందట…

నాగార్జున ఆ దర్శకులను తన వెంట తిప్పుకొని అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున… కెరీర్ మొదట్లో రొమాంటిక్ సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత క్లాస్ మాస్ అనే తేడా లేకుండా డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తన వందో సినిమా విషయంలో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది దర్శకులను తన వెంట తిప్పుకొని మరి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారట.

కారణం ఏంటంటే నాగార్జున తనకు మంచి కథని చెప్పమని కొంతమంది దర్శకులకు ఆఫర్ అయితే ఇచ్చాడట. వాళ్ళు కథ లైన్ తో ఇంప్రెస్ చేసినప్పటికి మొత్తం స్టోరీని డెవలప్ చేయడంలో చాలావరకు డిసప్పాయింట్మెంట్ ని చూపించారట. కథ ఏమాత్రం కూడా ఆ లైన్ కి అనుసంధానంగా ఉండకపోవడంతో ఆ స్టోరీ నాగార్జునకు నచ్చకపోవడం వల్ల ఆ దర్శకులను రిజెక్ట్ చేసారట.

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నాగార్జున సీనియర్ హీరోలతో పోటీపడుతూ టాప్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాంటి నాగార్జున శతమానం భవతి మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న, అలాగే ప్రస్థానం మూవీ ఫేమ్ దేవకట్ట లాంటి దర్శకులతో సినిమాలు చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చాడట…

ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలందరు సక్సెస్ ఫుల్ సినిమాలను అందించే దర్శకులకు అవకాశం ఇస్తారు. ముందుగా కథల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అలాగే దర్శకులను ఏరికోరి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఈ దర్శకులు చెప్పిన కథ నాగార్జున కి నచ్చలేదా లేదంటే వాళ్ళు చెప్పిన స్టోరీ బాగున్నప్పటికి దాన్ని స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా ప్రాజెక్ట్ చేయలేరని పక్కన పెట్టేసాడా అనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే నాగార్జున ఈ దర్శకులను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది…

డిజిటల్ చెల్లింపులు.. అయినా నగదుకు డిమాండ్..లెక్కలు ఇవే..

Digital Payments India
Digital Payments India

Digital Payments India: భారతదేశంలో ప్రస్తుతం నగదు వ్యవహారాలకంటే డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా మారాయి. కిరాణం షాపు నుంచి పెద్ద పెద్ద చెల్లింపులు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదని కొన్ని నివేదికలను బట్టి తెలుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం.. గత పదేళ్లలో చలామణిలో ఉన్న నగదు విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితె..

RBI లెక్కల ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరంలో దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ సుమారు రూ. 13 లక్షల కోట్లు. అయితే 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ. 41 లక్షల కోట్లకు చేరింది. యూపీఐ, మొబైల్ వాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ నగదు అవసరం తగ్గకపోవడం విశేషం.

తగ్గుతున్న ఏటీఎంలు
ఒకవైపు నగదు చలామణి పెరుగుతుండగా.. మరోవైపు ATM నెట్‌వర్క్ క్రమంగా తగ్గుతోంది. 2023లో దేశవ్యాప్తంగా 2.19 లక్షలకు పైగా ATMలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 2.09 లక్షలకు పడిపోయింది. బ్యాంకులు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, డిజిటల్ లావాదేవీలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి కారణాలు దీనికి ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇదే సమయంలో ATMల ద్వారా నగదు ఉపసంహరణలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. 2023లో ATMల నుంచి సుమారు ₹32.6 లక్షల కోట్ల నగదు ఉపసంహరించగా, ప్రస్తుతం అది ₹28.6 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ప్రజలు నగదును పూర్తిగా వదిలేయకపోయినా, అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటూ రోజువారీ లావాదేవీలకు డిజిటల్ పద్ధతులను ఎక్కువగా వినియోగిస్తున్నారని అర్థమవుతోంది.

యూపీఐ విప్లవం భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. చిన్న టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు QR కోడ్ చెల్లింపులు సాధారణమయ్యాయి. దీంతో చిన్న మొత్తాల కోసం ATMలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది. ఫలితంగా ATMల వినియోగం తగ్గినా, అత్యవసర పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపార లావాదేవీల కోసం నగదు డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.

బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఇంట్లో ఉండే లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..

JanSamarth Loan Portal
JanSamarth Loan Portal

JanSamarth Loan Portal: ఎంత శ్రీమంతులకైనా సరే ఆర్థిక అవసరాలు ఉంటాయి. సమయానికి డబ్బు దొరికితేనే అవి తీరుతాయి. డబ్బు లభించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. సకాలంలో డబ్బు లభించని పక్షంలో పడే కష్టాలు మామూలుగా ఉండవు. అలాంటప్పుడు అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది. వడ్డీ ఎంతైనా పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అవసరం అలాంటిది కాబట్టి..

మనదేశంలో వ్యవసాయ సీజన్ మొదలైనప్పుడు రైతులకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. విద్యా సంవత్సరం మొదలైనప్పుడు తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించడానికి డబ్బు అవసరం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఇక వ్యాపారవేత్తలకు వ్యాపార విస్తరణకు డబ్బు అవసరం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో డబ్బు దొరకకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ చాలా మంది తిరుగుతుంటారు. అన్ని సందర్భాలలో బ్యాంకులు రుణాలు ఇవ్వవు. పైగా రకరకాల కొర్రీలు పెడుతుంటాయి. ఇటువైపు ఏమో అవసరాలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు బయట వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు తెచ్చుకొని చాలామంది అవసరాలు తీర్చుకుంటారు. ఆ తర్వాత తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఆ అప్పులు తీర్చుకుంటారు.

అయితే ఇలాంటి వారి కోసం సులభంగా రుణం పొందేందుకు కేంద్రం ఒక పోర్టల్ తీసుకువచ్చింది.. ఇది నాలుగు సంవత్సరాల క్రితమే మొదలైంది. దీని పేరు janasamarth.in/ login. రుణం తీసుకోవాలంటే ఇందులో మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన పాత్రలు మాత్రం అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు.. పాన్ కార్డ్.. ఇన్కమ్ సర్టిఫికెట్.. బ్యాంకు ఎకౌంటు స్టేట్మెంట్ కచ్చితంగా ఉండాలి.

దాదాపు 32 బ్యాంకులు ఇందులో లోన్ ఆఫర్ చేస్తుంటాయి. స్థానిక భాష కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న రైతులు.. సామాన్యులు.. వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా.. రుణాలు వెంటనే మంజూరు చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన పోర్టల్ ఇది. ఇటువంటి పోర్టల్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. అందువల్లే దేని గురించి కేంద్రం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. దీన్ని సేవలు వినియోగించుకొని ఆర్థిక అవసరాలు తీర్చుకుంటే.. చాలావరకు ఇబ్బందులు తప్పుతాయి. అందువల్ల దీనిని ఉపయోగించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.