Home Blog Page 172

కుక్కలతో మనుషులకు పెళ్లా.. ఇదేం ఆచారం రా నాయనా

Dogs And Humans Marriage Tradition
Dogs And Humans Marriage Tradition

Dogs And Humans Marriage Tradition: మన దగ్గర వర్షాలు సరిగా కురువకపోతే కప్పలకు పెళ్లి చేస్తారు. అప్పటికి వర్షాలు కురువకపోతే వరద పాశం వండి.. దేవతామూర్తులకు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆలయాలలో దేవతామూర్తులకు జలాభిషేకం చేస్తారు.

ఇక కొన్ని ప్రాంతాలలో అయితే వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహాలు జరిపిస్తారు. ఇలా చేస్తే త్వరగా కాయలు కాస్తాయని.. పెద్దలు నమ్ముతుంటారు. కానీ.. మనుషులకు కుక్కలకు వివాహం జరపడం.. ఎప్పుడైనా చూశారా.. లేదా విన్నారా.. చదువుతుంటే వింతగా ఉంది కాదు.. మీకే కాదు మాకు కూడా అలానే ఉంది. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడుంది.. ఎందుకు జరుపుతారు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం ఏంటంటే..

జార్ఖండ్ రాష్ట్రంలో ఆటవిక తెగలు అధికంగా ఉంటాయి. వీరి నమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత.. వారు పెద్దగా అవుతున్న క్రమంలో.. వచ్చే దంతాలు.. కింది దవడకు కాకుండా.. పై దవడకు వస్తే దానిని అరిష్టమని భావిస్తుంటారు. అందువల్లే అలా దంతాలు వచ్చిన పిల్లలకు కుక్కలతో పెళ్లిళ్లు చేస్తారు. ఇలా చేస్తే కీడు తొలగిపోతుందని నమ్ముతుంటారు. ఆ పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కీడు తొలగించుకోవడానికి మాత్రమే ఇలాంటి పని చేస్తుంటారు.

కుక్కలతో పెళ్లి చేసే క్రతువును కూడా గొప్పగా జరుపుతారు.. ఇంటిల్లిపాది వేడుకలు నిర్వహిస్తారు. పండగలాగా దానిని భావిస్తుంటారు. దగ్గర బంధువులను పిలుచుకొని విందు భోజనాలు చేస్తారు. దానికంటే ముందు నిండుకుండ అన్నాన్ని తీసి గ్రామదేవతకు నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల పీడ వదిలి పోతుందని వారు నమ్ముతుంటారు.

అప్పట్లో ఐశ్వర్యరాయ్ కి జాతకంలో కీడు ఉందని ఆమెకు ఒక చెట్టుతో పెళ్లి చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇక ఇదే జార్ఖండ్లో పెళ్లి నిశ్చయమైన యువతీ యువకులకు జాతకం చూసే క్రమంలో విచిత్రమైన విధానాన్ని పాటిస్తుంటారు. ఒక నాటుకోడిని కోస్తారు. ఆ తర్వాత దాని కాలేయం రంగును బట్టి ఆ యువతి యువకుల జాతకాన్ని చెబుతుంటారు. ఆ జాతకం ఆధారంగానే పెళ్లి ముహూర్తాలు ఖరారు చేస్తారు.. ఇలా ఎన్నో ఆచారాలు ఝార్ఖండ్ ఆటవిక తెగలు కొనసాగిస్తుంటాయి.

లక్షల్లో జీతం.. వీకెండ్స్ లో రాపిడో బైక్ డ్రైవర్.. అలా అయిపోయింది ఐటీ ఉద్యోగి బతుకు

IT Employee Working As Rapido Bike Driver
IT Employee Working As Rapido Bike Driver

IT Employee Working As Rapido Bike Driver: ఐటి ఉద్యోగం అంటే ఎవరైనా సరే భారీ జీతం వస్తుంది అనుకుంటారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఖరీదైన ఇల్లు.. లావిష్ కారు.. వీకెండ్స్ పార్టీలతో దుమ్ము రేపు తారు అనుకుంటారు.. ఒకప్పుడు ఇలా ఉండేదేమో గాని.. ఇప్పుడు అలా లేదు. లక్షలలో జీతాలు.. ఉన్నప్పటికీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నట్టుండి ఆఫీసు నుంచి గెంటేస్తే ఏం చేయాలో కూడా తెలియదు.

ఈ పరిణామాలు ముందుగానే ఊహించిన కొంతమంది ప్రత్యామ్నాయలు చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకుంటూనే.. ఆదాయం వచ్చే పనులు చేసుకుంటున్నారు. అయితే పెరిగిన ఖర్చులు చాలామంది ఐటీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాదు ఇంటి నిర్వహణకు నగదు సర్దుబాటు ఎలా చేయాలో అర్థం కాక చాలామంది వేరే వేరే పనులు చేసుకుంటున్నారు. మన దేశ ఐటీ క్యాపిటల్ గా పేరుపొందిన బెంగళూరులో చాలామంది ఐటీ ఉద్యోగులు వేరే పనులు చేస్తున్నారు. లక్షలలో జీతం వస్తున్నప్పటికీ ఇంటి ఖర్చులకు సరిపోక.. అప్పులు తెచ్చే మార్గం లేక.. వేరే వేరే ఉద్యోగాలు.. ఇతర పనులు చేసుకుంటున్నారు.

బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగికి నెలకు లక్షలలో వేతనం వస్తూ ఉంటుంది. అతడు ఉండేది ఓ ఖరీదైన ప్రాంతంలో.. అయితే ఇటీవల కాలంలో ధరలు పెరిగిన నేపథ్యంలో ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాక అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకున్న ద్విచక్ర వాహనాన్ని బయటకి తీశాడు. దానిని రాపిడోలో నమోదు చేయించాడు.. ప్రతి శని, ఆదివారాల్లో అతడు రాపిడో డ్రైవర్ గా పనిచేయడం మొదలు పెట్టాడు. ఇటీవల బెంగళూరులో అతడు ఒక రైడ్ కోసం కస్టమర్ ను ఎక్కించుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ నేపథ్యంలో తన బాధను మొత్తం ఆ ఐటి ఉద్యోగి చెప్పాడు.

“నాకంటూ ఒక కుటుంబం ఉంది. వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నామీద ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో కుటుంబ నిర్వహణను ఎటువంటి ఆటుపోట్లు లేకుండా చూసుకోవాలి. అది జరగాలంటే ఆదాయం సంపాదించాలి. అందువల్లే ఈ మార్గం ఎంచుకున్నాను. ప్రతి వారం లో శని, ఆదివారాల్లో ఈ పని చేస్తాను. ఇలా వచ్చిన డబ్బు కుటుంబ నిర్వహణకు సరిపోతుంది. వచ్చే వేతనం ఇతర ఖర్చులకు.. సేవింగ్స్ కు సరిపోతున్నాయని” ఆ ఐటి ఉద్యోగి చెప్పాడు. ఈ విషయాన్ని ఆ కస్టమర్ సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ఆర్థిక మాంద్యం రాకముందే యుద్ధం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయని.. దీనివల్ల సగటు మనిషి జీవితం ఇలా మారిపోయిందని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో రాసుకు వచ్చాడు. ఇది కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.

ఆసియా సంపన్నుడిగా అదానీ.. పడిపోయిన అంబానీ ర్యాంకు!

Adani Overtakes Mukesh Ambani
Adani Overtakes Mukesh Ambani

Adani Overtakes Mukesh Ambani: ఆసియా అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఇది భారతీయ వ్యాపార రంగంలో స్థిరత్వం, వ్యూహాత్మక పునరుద్ధరణ, పెట్టుబడిదారుల విశ్వాసం ఎంత శక్తివంతమైనవో చూపించే ఒక ముఖ్యమైన సంకేతం.ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగి 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (88 బిలియన్ డాలర్లు), సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ (87 బిలియన్ డాలర్లు)ను అధిగమించారు. గత నెలలోనే అదాని సంపద 10 బిలియన్ డాలర్లు పెరగింది.

పెరుగుతున్న అదానీ సంపద..
అదానీ సంపద వృద్ధికి ప్రధాన కారణం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో నమోదైన బలమైన ర్యాలీ. అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 7 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.8 శాతం పెరగడంతో పాటు అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి ప్రధాన కంపెనీలు కూడా గణనీయమైన లాభాలు సాధించాయి. ప్రస్తుతం గ్రూప్‌కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గ్రూప్ యొక్క మార్కెట్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

చట్టపరంగా క్లియరెన్స్‌..
ఈ ర్యాలీ వెనుక మరో కీలకమైన అంశం ఉంది.. అదే చట్టపరమైన స్పష్టత. గతంలో అదానీ గ్రూప్‌పై వచ్చిన మోసపూరిత ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయశాఖ ఇటీవల అన్ని క్రిమినల్ చార్జీలను విరమించుకోవడం పెట్టుబడిదారులలో విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి పెద్ద కారణమైంది. ఆ ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చినా, ఈ చట్టపరమైన మేఘాలు తొలగిపోవడంతో మార్కెట్ సెంటిమెంట్ బలంగా మారింది. కొన్నేళ్ల క్రితం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. షేర్లు భారీగా పడిపోయాయి, సంపద కోల్పోయింది, విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఆ సవాళ్లను అధిగమించి, ఆపరేషనల్ పనితీరు మెరుగుపరచడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, ఎయిర్‌పోర్టులు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వ్యూహాత్మక విస్తరణ చేపట్టడం ద్వారా గ్రూప్ తిరిగి బలంగా లేచింది.

ఆరోగ్యకరమైన పోటీ..
భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బూమ్, ఎనర్జీ ట్రాన్సిషన్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ సెక్టర్ సామర్థ్యాన్ని మరోసారి హైలైట్ చేస్తోంది. తాజాగా అదానీ అంబానీని అధిగమించడం రెండు భారతీయ వ్యాపార దిగ్గజాల మధ్య ఉన్న తీవ్రమైన కానీ ఆరోగ్యకరమైన పోటీని ప్రతిబింబిస్తోంది. ఒక వైపు డైవర్సిఫైడ్ ఎకానమీ (రిలయన్స్), మరో వైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్‌ ఎనర్జీ ఫోకస్ (అదానీ). ఈ పోటీ రెండు గ్రూపులను మరింత మెరుగైన పనితీరు చేసేలా చేస్తోంది, దీని ప్రయోజనం చివరికి దేశ ఆర్థిక వ్యవస్థకు చేకూరుతుంది.

గౌతమ్ అదానీ ఈ తిరిగి రావడం వ్యాపారంలో ఎదురయ్యే తుఫానులను ఎదుర్కొని, సరైన వ్యూహం, ఆపరేషనల్ ఎక్సలెన్స్, ట్రాన్స్‌పరెన్సీతో తిరిగి ఎదగడం సాధ్యమని నిరూపిస్తోంది. ఇది భారత్ అభివృద్ధి కథలో ప్రైవేట్ సెక్టార్ పాత్ర ఎంత కీలకమో మరోసారి గుర్తు చేస్తోంది. అయితే, ఈ విజయం దీర్ఘకాలం కొనసాగాలంటే గవర్నెన్స్, సస్టైనబిలిటీ, స్టేక్‌హోల్డర్ విశ్వాసాన్ని నిరంతరం కాపాడుకోవాలి.

కాక్రోచ్ జనతా పార్టీ పై హిట్ స్ప్రే.. నరేంద్ర మోడీ ప్లాన్ అదిరిపోయిందిగా..

Cockroach Janata Party : ఏదో అనుకుంటే ఏదో జరిగింది.. వెస్ట్రన్ మీడియా గట్టిగా అనుకుంది.. ఇంకా కొంతమంది లెఫ్ట్ జర్నలిస్టులు ఏదో చేద్దామనుకున్నారు. మొత్తానికి వీళ్ళ ప్లాన్ మొత్తం దెబ్బతిన్నది. ఏదో జరిగిపోతుంది అనుకుంటే మొత్తానికి తుస్సుమన్నది. ఇదంతా కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల చేపట్టిన ఆందోళన గురించి

బంగ్లాదేశ్ మాదిరిగా.. శ్రీలంక మాదిరిగా.. నేపాల్ మాదిరిగా ఆందోళనలు పుట్టించి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించాలని కొంతమంది బలంగా అనుకున్నారు. నీట్ పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకొని.. దీని అంతటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కారణమని.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ పార్టీ నేతలు హంగామా సృష్టించడం.. మనదేశంలో కొన్ని మీడియా సంస్థలు ఈ పార్టీకి సపోర్ట్ చేయడంతో వ్యవహారం కాస్త పెద్దదిగానే మారిపోయింది.

దీనివల్ల ఏదైనా జరగొచ్చు.. ఏమైనా కావచ్చు అని కొంతమంది ఉదారవాదులు భావించారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. టీవీ స్టూడియోలలో గొంతులు చించుకొని అరిచారు. కానీ జరిగింది వేరు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ లాస్ట్ మినిట్లో అనుమతులు అడిగినప్పటికీ.. ఢిల్లీ పోలీసులు ఆందోళనకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పటిష్టమైన బందోబస్తు కల్పించారు.

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తారని ముందుగానే కొంతమంది ఊహించారు. వెస్ట్రన్ మీడియా సంస్థలు కూడా అక్కడ కాచుకొని ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయకుండా అతనిని వదిలేశారు. విఐపి లాంజ్ నుంచి అతడు వస్తుంటే.. సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత అతడు విలేకరులను చూసి గట్టిగా అరుస్తుంటే కూడా మిన్న కుండిపోయారు.

ఇలా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రచించిన ప్రణాళికలు మొత్తం ఎక్కడికి అక్కడ ఫ్లాప్ కావడంతో.. చివరికి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా జనం సరిగ్గా రాలేదు.. యువత భారీగా వస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులు.. కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలు మాత్రమే అక్కడికి వచ్చారు. వారంతా కూడా కొందరేమో ఉమర్ ఖలీల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. 370 అధికరణ రద్దు చేయాలని.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని వేరే లాగా ఉంచాలని.. ఇలా రకరకాల డిమాండ్లు చేశారు.

నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం గురించి.. ఆందోళన చేస్తామని చెప్పిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు.. చివరికి ఇలా చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడి ఆందోళనకు ఒక వృద్ధుడు వచ్చాడు.. అతడు ఉమర్ ఖలీల్ గురించి నినాదాలు చేశాడు. దీనిపై ఒక మహిళా జర్నలిస్ట్ స్పందిస్తే..”అతడు నిన్నేమైనా చేశాడా.. పోనీ మీ అమ్మని ఏమైనా చేశాడా” అంటూ అత్యంత దారుణంగా మాట్లాడాడు.

ఈనేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను నిలదీశారు. ఇదేం విధానం అంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ భారీ ఎత్తున గొడవ కూడా జరిగింది.. ఇలా చెప్పుకుంటూ పోతే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో చోటు చేసుకున్న పరిణామాలు చాలానే ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్స్ లాగా ఉన్నాయి. బంగ్లాదేశ్ మాదిరిగా.. శ్రీలంక మాదిరిగా.. చేద్దామనుకొని చివరికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు బొక్క బోర్లా పడ్డారు.

సైబర్ మోసాలకు ‘వర్చవల్ డెబిట్ కార్డు’తో చెక్.. అసలేంటిది..

Virtual Debit Card
Virtual Debit Card

Virtual Debit Card: ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే వీటితో పాటు సైబర్ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫేక్ వెబ్‌సైట్లు, డేటా చోరీ, కార్డు క్లోనింగ్ వంటి మోసాల కారణంగా చాలా మంది తమ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు బ్యాంకులు అందిస్తున్న వర్చువల్ డెబిట్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా మారాయి. అసలు వర్చువల్ డెబిట్ కార్డు అంటే ఏమిటీ?

వర్చువల్ డెబిట్ కార్డ్:
వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే కార్డు. దీనికి కూడా సాధారణ డెబిట్ కార్డు మాదిరిగానే 16 అంకెల కార్డు నంబర్, గడువు తేదీ , CVV నంబర్ ఉంటాయి. అయితే ఇది భౌతిక కార్డు కాదు. మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవసరమైనప్పుడు సృష్టించుకుని ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించవచ్చు.

సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో మన అసలు డెబిట్ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వెబ్‌సైట్ భద్రంగా లేకపోతే కార్డు సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉంటుంది. కానీ వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తే అసలు కార్డు నంబర్‌ను ఎక్కడా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రధాన బ్యాంకు ఖాతా వివరాలు మరింత సురక్షితంగా ఉంటాయి.

దొంగల నుంచి రక్షణ:
వర్చువల్ కార్డుల ప్రధాన ప్రయోజనం భద్రత. చాలాసార్లు ఈ కార్డులకు పరిమిత కాలపరిమితి లేదా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే సదుపాయం ఉంటుంది. లావాదేవీ పూర్తయ్యాక కార్డు పనిచేయకపోవడం వల్ల సమాచారం లీక్ అయినా దుర్వినియోగం చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో సైబర్ మోసగాళ్లు కార్డు వివరాలను పొందినా బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని దోచుకోవడం కష్టమవుతుంది.

వర్చువల్ డెబిట్ కార్డులో మరో ప్రత్యేకత ఏమిటంటే ఖర్చు పరిమితిని వినియోగదారుడే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రూ.1,000 విలువైన వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే అదే మొత్తానికి కార్డును సెట్ చేయవచ్చు. దీంతో ఆ మొత్తానికి మించి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఖాతాలో లక్షల రూపాయలు ఉన్నా, కార్డులో నిర్ణయించిన పరిమితి మాత్రమే ఉపయోగించబడుతుంది.

ఈ కార్డు పొందడం ఎలా?
చాలా బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డు సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత ‘Virtual Debit Card’, ‘Generate Card’లేదా ఇలాంటి ఆప్షన్‌ను ఎంచుకుని కార్డును సృష్టించుకోవచ్చు. కొన్ని సెకన్లలోనే కొత్త కార్డు నంబర్, CVV, గడువు తేదీ జనరేట్ అవుతాయి. వెంటనే వాటిని ఉపయోగించి ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయవచ్చు.

'ఇరుముడి' సినిమాలో నటిస్తున్న మరో స్టార్ హీరో..

Ravi Teja Irumudi
Ravi Teja Irumudi

Irumudi movie star hero entry: మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది…ఈ సినిమాతో రవితేజ ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఈ మూవీ తో ఆయన మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిసారి ఆయన థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన అలాంటి జానర్ లో సినిమాలైతే చేయలేదు. కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. వరుసగా ప్లాప్ సినిమాలు రావడంతో ఆయన థ్రిల్లర్ సినిమాలవైపు ఎక్కువగా మొగ్గు చూపాడు. అయినప్పటికి తను అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తు మొత్తానికైతే టాప్ హీరో పొజిషన్ ను అందుకున్నాడు.

ఇక ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేయడం లేదు. దాంతో మరోసారి ఆయన డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇరుముడి సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన దశ తిరిగిపోతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సైతం ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట.

అయితే ఆయన క్యామియో రోల్ ప్లే చేస్తున్నాడా లేకపోతే ఈ సినిమాలో భాగమై సినిమా స్టోరీ కి ఇంటర్ లింక్ అయి ఆయన క్యారెక్టర్ ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఈ సినిమా మొత్తం రవితేజ కూతురు కోసమే ఉంటుందట. అయ్యప్ప మాల ధరించిన రవితేజ ఈ సినిమాను శాంతిగా ఉంటూనే ఉగ్రరూపాన్ని కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ లో రవితేజ ఒక మాస్ యాక్షన్ ఎపిసోడ్ లో కూడా పాల్గొన్నాడు అంటే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటేనే రవితేజ ఇండస్ట్రీలో మరోసారి తన సత్తా చూపించగలుగుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడిపోయే ప్రమాదం కూడా ఉంది…

 

ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు అనుకోని అదృష్టం..

Today 21 July 2026 Horoscope
Today 21 July 2026 Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై శతభిష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా గడుస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగుల నైపుణ్యం ఆధారంగా పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని నిరాశకరమైన వార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉండడంతో వ్యాపారులు రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని సమస్యల పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పూర్వికులు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులు గురువుల మద్దతుతో కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఎక్కువగా ఖర్చులు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మద్దతుతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొందరికి శివయ్య ఆశీస్సులు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తమ జీవనశైలిని మార్చుకోవడంతో సంతోషంగా గడుపుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన వ్యక్తులు కలుస్తారు. స్నేహితుల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపార లాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలిగి అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పనులను పూర్తి చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్త ఆదాయాన్ని పొందుతారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదనపు బాధ్యతలు రావడంతో కొన్ని పనులు కష్టంగా పూర్తవుతాయి. సంబంధాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు చేకూరుతాయి

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఉద్యోగులకు అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అన్ని విజయాలే సమకూర్తాయి. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. అనుకోకుండా అదృష్టం పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అంకితభావంతో పనిచేయడం వల్ల పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకున్న పనులను పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు కొత్తగా పెట్టుబడును పెడతారు.

రిషబ్ పంత్ కొట్టుడుకు.. డ్రోన్ ముక్కలైంది.. వైరల్ వీడియో

Rishabh Pant Viral Video
Rishabh Pant Viral Video

Rishabh Pant Viral Video: టీమిండియాలో రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఎలాంటి ఫార్మాట్ అయినా సరే దూకుడు మంత్రాన్ని మాత్రమే పాటిస్తాడు. బంతి ఏ దిశలో వచ్చినా సరే దానిని బౌండరీ వైపు మాత్రమే పంపిస్తాడు.. ఎందుకంటే అతడికి అలాంటి బ్యాటింగ్ మాత్రమే వచ్చు. సుదీర్ఘ ఫార్మాట్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్.. పొట్టి ఫార్మాట్.. ఇలా అన్ని విభాగాలలో అతడు అదరగొడతాడు. ఇటీవల ఐపీఎల్లో అతడు సత్తా చూపించలేకపోయినప్పటికీ.. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో అతడు హాఫ్ సెంచరీ చేసి సత్తా చూపించాడు.

రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 121 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు.. మూడు సిక్సర్లు ఉన్నాయి. వాస్తవానికి సెంచరీకి చేరువగా వచ్చినప్పటికీ.. షాహిది బౌలింగ్ లో అతడు అవుట్ అయ్యాడు. దీంతో నిరాశతో అతడు మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ బౌలింగ్లో అతడు గట్టిగా కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడుకు బంతి గాల్లోకి లేచింది. అంతేకాదు నేరుగా డ్రోన్ ను తగిలింది. అది వెంటనే కింద పడిపోయింది. ఆ సమయంలో ఆఫ్గనిస్తాన్ ఫీల్డర్లు ఎవరు కూడా ఆ బంతిని అందుకోవడానికి ప్రయత్నించలేదు.

ఈ సంఘటన నిజమా.. కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే.. అది అబద్ధం అని తేలింది. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వీడియోను రూపొందించినట్టు సమాచారం. మ్యాచ్ జరుగుతున్నప్పుడు రిషబ్ పంత్ అలాంటి షాట్ ఆడలేదని.. బంతి అలా పైకి వెళ్లలేదని అభిమానులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు డ్రోన్ అంత తక్కువ ఎత్తులో ఉండదు. పైగా ఇటీవల కాలంలో రోబోటిక్ కెమెరాలు వాడుతున్నారు.

“రిషబ్ పంత్ ఇలాంటి బ్యాటింగ్ చేయడం కొత్త కాదు. ఇలా దూకుడుగా ఆడటం కూడా తొలిసారి కాదు. కాకపోతే అతడు కొడితే బంతి ఎన్నడు కూడా డ్రోన్ కెమెరాలను తాకలేదు. వాటిని కింద కూల్చలేదు.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చూస్తుంటే ఆనందంగా ఉందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మానవ్ సుతార్.. టీమ్ ఇండియా స్పిన్ కు సరికొత్త అవతార్..

Manav Sutar
Manav Sutar

Manav Sutar: అప్పుడప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి బౌలింగ్ వేసేవాడు. రవీంద్ర జడేజా ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేసేవాడు. కులదీప్ యాదవ్ ఇప్పుడు ఒకసారి ఇలాంటి మ్యాజిక్ ప్రదర్శించేవాడు. కానీ ఇన్ని రోజులకు.. టీమిండియా స్పిన్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఈ 23 సంవత్సరాల యువకుడు చూపించాడు. మైదానం నుంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ..పిచ్ లో జీవం కనిపించకపోయినప్పటికీ.. బంతిని గింగిరాలు తిప్పిన తీరు అద్భుతం.. అనన్య సామాన్యం. ఇతడిని గనక సాన పెడితే ఖచ్చితంగా మరో రవిచంద్రన్ అశ్విన్ అవుతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రెండవ రోజు టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ గిల్ 126, రిషబ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేసి సత్తా చాటడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 564 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ భారత బౌలర్ల ముందు తలవంచింది.. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. టీమిండియా బోర్డర్లలో సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు.. అందులో 7 ఓవర్లను మెయిడ్ ఇన్ గా వేశాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి ఎకానమీ 1.30 అంటే బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇతడికి ప్రసిద్ కృష్ణ తోడయ్యాడు. అతడు కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ తో సుతార్ అదరగొట్టాడు. పరుగులు తీయడం కాదు కదా.. బంతిని అడ్డుకుంటే చాలు అనేతీరుగా ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లలో భయం పుట్టించాడు.

ఐపీఎల్ లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఇతడి మీద గౌతమ్ గంభీర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఏకైక టెస్ట్ కు అవకాశం కల్పించాడు. వచ్చిన అవకాశాన్ని సుతార్ సద్వినియోగం చేసుకున్నాడు. రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్ లో పుట్టిన ఇతడు.. ఎడమ చేతివాటం బ్యాటింగ్ చేస్తాడు. ఎడమచేతి వాటం బౌలింగ్ తో ఆకట్టుకుంటాడు. ఇండియా అండర్ 19, రాజస్థాన్, సెంట్రల్ జోన్, జైపూర్ ఇండియన్స్, ఇండియా ఏ, గుజరాత్ టైటాన్స్, ఇండియా సి, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఇతడు ఆడాడు. ఎడమచేతి అర్ధడాక్స్ స్పిన్నర్.. అంతేకాకుండా లోయర్ ఆర్డర్లో సమర్థవంతంగా ఆడతాడు.

2022 – 23 రంజి ట్రోఫీ సీజన్లో సుతార్ ఆరు మ్యాచ్ లు ఆడి.. 20.33 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో రాజస్థాన్ జట్టు తరుపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఆవిర్భవించాడు. అంతేకాదు రెండు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. 2023 ఎసిసి మెన్స్ ఎమర్జింగ్ కప్ లో టీమిండియా కు ఎంపిక అయ్యాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడి 19.50 సగటు, 4.21 ఎకనామి రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆవిర్భవించాడు. ఐపీఎల్ 2024 కోసం సుతార్ ను గుజరాత్ జడ్పీ కొనుగోలు చేసింది. 2002లో జరిగిన దిలీప్ కప్ ట్రోఫీలో సుతార్ 7 వికెట్లు పడగొట్టాడు. 2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ జట్టు అతడిని 30 లక్షలకు కౌనుగోలు చేసింది.

మద్యం షాపుల నుంచి 1600 కోట్ల లంచాల వసూలు.. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం..

CM Vijay
CM Vijay

Tamil Nadu Liquor Scam: తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పరిణామం దేశ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న రాజకీయ.. ఇతర పరిణామాలు ఏకంగా దేశాన్ని కదిలించే స్థాయిలో ఉంటున్నాయి. గతంలో తమిళనాడులో ఇలా ఉండేది కాదు. ఇటీవల కాలంలో ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా దేశ రాజకీయాలను కదిలిస్తోంది. నేషనల్ మీడియా కూడా తమిళనాడులో జరుగుతున్న పరిణామాల పట్ల విపరీతమైన అటెన్షన్ తో ఉంటుందంటే మామూలు విషయం కాదు.

తమిళనాడులో మొన్నటిదాకా డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అక్కడ 4048 మద్యం షాపులు ఉన్నాయి. గతంలో విచ్చలవిడిగా అక్కడ మద్యం షాపులు ఉండేవి. అయితే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడులు.. మసీదులు. చర్చిల దగ్గర ఉన్న మద్యం షాపులను తొలగించారు. పాఠశాలలకు.. విద్యాలయాలకు దగ్గరగా ఉన్న మద్యం షాపులను కూడా తొలగించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన మద్యం షాపుల విషయంలో కూడా ఆయన అదే నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం మద్యం షాపులను అక్కడ నిర్వహిస్తోంది. అయితే గత డీఎంకే ప్రభుత్వంలో పార్టీకి విరాళాల పేరుతో మద్యం షాపుల వద్ద దాదాపు 1600 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం గత డీఎంకే హయాంలో జరిగిన ఈ పరిణామంపై తీవ్రంగా దృష్టి పెట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయం మీద విచారణ సాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ.. అప్పటి అధికార పార్టీ నేతలే ఇష్టానుసారంగా వ్యవహరించాలని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ ఫండ్ పేరుతో 1600 కోట్లు వసూలు చేయడానికి విజయ్ తీవ్రంగా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది.

మద్యం షాపుల విషయంలో ఎవరు ఎంత తీసుకున్నారు.. 1600 కోట్ల రూపాయలను ఎలా వసూలు చేశారు.. ఇందులో ఏదైనా మనీలాండరింగ్ జరిగిందా.. నాటి ప్రభుత్వ పెద్దలలో ఎవరి వాటా ఎంత.. ఈ డబ్బులు వారు ఏం చేశారు.. ఎక్కడికి తరలించారు అనే కోణంలో తమిళ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే ఇందులో నాటి ప్రభుత్వ పెద్దలలో అత్యంత కీలకంగా ఉన్న వారికే వాటాలు వెళ్లినట్టు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై విచారణ నిర్వహించిన తర్వాత.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. అయితే తదుపరి పరిణామాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.

రష్యాలో లోకేష్.. వైజాగ్ స్టీల్ కు ఏడు వేల కోట్లు.. తెర వెనక ఏం జరిగింది..

Vizag Steel Plant
Vizag Steel Plant

Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలను ఆయన కలుస్తున్నారు. అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రష్యా ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అంశాలను ఆయన అక్కడి ప్రభుత్వానికి వివరిస్తున్నారు. మొత్తంగా ఏపీ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామం లాగా ఉంది అనేలా నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు.

దోహా ప్రాంతంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో నారా లోకేష్ అప్పట్లో పాల్గొన్నారు. అనే కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పించారు. అధికారులతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇందులో కొన్ని కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు మొదలుపెట్టాయి. మిగతా కంపెనీలు కూడా క్యూలో ఉన్నాయి. ఐటి నుంచి మొదలుపెడితే ఇన్ఫ్రా వరకు అన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని నారా లోకేష్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ రష్యాలో పర్యటించడం.. అక్కడి వ్యాపారవేత్తలను కలవడం సంచలనంగా మారింది. అంతేకాదు నారా లోకేష్ రష్యాలో ఉండగానే.. వైజాగ్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊహించని కానుక ఎదురయింది. అది కాస్త విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరోసారి ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది.

విశాఖ ఉక్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అనేక రకాల సమస్యలు ఆ కర్మగారాన్ని వేధిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి కాస్త జవసత్వం లభించింది అని చెప్పవచ్చు. ఇదంతా జరుగుతుండగానే రష్యాలో పర్యటిస్తున్న నారా లోకేష్.. విశాఖ ఉక్కు కర్మగారానికి గుడ్ న్యూస్ లభించేలా చేశారు. ఎందుకంటే రష్యా దేశానికి చెందిన నోవోస్టల్ ఎం అనే కంపెనీ 7వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం తయారు చేసే మెరైన్ స్టీల్ కు రష్యాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా ఇప్పుడు మెరైన్ స్టీల్ ఆధారంగా అక్కడ అనేక రకాల కట్టడాలు నిర్మిస్తున్నారు. అందువల్లే నోవోస్టల్ కంపెనీ విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీని తెర వెనుక నారా లోకేష్ ఉన్నట్టు సమాచారం.

నారా లోకేష్ కొద్దిరోజులుగా రష్యాలో ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడ అనేక రకాల వ్యాపార కార్యకలాపాలను.. ఇతర సంస్థలను పరిశీలిస్తున్న విషయం విదితమే. అయితే ఆయన తెర వెనుక అనేక రకాల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన నేపథ్యంలోనే.. విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి సంస్థలు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఇన్వెస్ట్ కార్యరూపం దాల్చితే విశాఖ ఉక్కు కర్మాగారం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు..

Housewarming Ceremony
Housewarming Ceremony

Housewarming Ceremony: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే సందర్భాన్ని ప్రతి కుటుంబం ఎంతో శుభప్రదమైన ఘట్టంగా భావిస్తుంది. అందుకే గృహ ప్రవేశ కార్యక్రమంలో అనేక సంప్రదాయాలను పాటిస్తారు. వాటిలో ముఖ్యమైనది పాలు పొంగించడం. కొత్త ఇంటి వంటగదిలో మొదటిసారిగా పాలను మరిగించి పొంగించడం ద్వారా శుభారంభాన్ని సూచిస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక భావాలను కూడా కలిగి ఉంది.

పాలు భారతీయ సంస్కృతిలో పవిత్రత, స్వచ్ఛత, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. గృహ ప్రవేశ సమయంలో పాలు పొంగిపొర్లడం అంటే ఆ ఇంట్లో సంపద, సుఖసంతోషాలు, ఆనందం కూడా అదే విధంగా పెరిగి పొంగిపొర్లాలని సంకేతంగా భావిస్తారు. అందుకే పాలు గిన్నె అంచులు దాటి బయటకు రావడాన్ని శుభ సూచకంగా చూస్తారు.

ఈ ఆచారం వెనుక మరో విశ్వాసం కూడా ఉంది. కొత్త ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి, ధనానికి, సంతోషానికి కొరత ఉండకూడదనే సంకల్పాన్ని పాలు పొంగించడం ద్వారా వ్యక్తపరుస్తారు. ఇంట్లోని ప్రతి సభ్యుడు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, కుటుంబం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

హిందూ సంప్రదాయంలో పాలు అత్యంత పవిత్రమైన పదార్థంగా భావిస్తారు . దేవతల అభిషేకాల్లో, పూజా కార్యక్రమాల్లో పాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. అందువల్ల కొత్త ఇంటిని పవిత్రంగా మార్చి, సానుకూల శక్తులను ఆహ్వానించేందుకు కూడా పాలు పొంగించడం ఒక ముఖ్యమైన ఆచారంగా మారింది.

శాస్త్రీయంగా చూస్తే, పూర్వకాలంలో కొత్త ఇంట్లో వంట మొదలైందని సూచించేందుకు మొదట పాలను మరిగించేవారు. వంటగది ఉపయోగానికి సిద్ధమైందని, ఆ ఇంట్లో జీవనం ప్రారంభమైందని తెలియజేసే సంకేతంగా దీనిని భావించేవారు. కాలక్రమేణా ఇది సంప్రదాయంగా స్థిరపడిపోయింది.

అంతిమంగా, గృహ ప్రవేశంలో పాలు పొంగించడం అనేది కేవలం ఒక పూజా కార్యక్రమం కాదు. కొత్త ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, సమృద్ధి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకునే శుభసంకల్పానికి ప్రతీక. అందుకే ఈ ఆచారం నేటికీ ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది.

అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే..

Annamalai
Annamalai

Annamalai: శీర్షిక చదివారు కదా.. అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్ గానే మాకు తెలుసు.. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ నాయకుడిగానే తెలుసు.. ఇప్పుడు బిజెపి నుంచి పక్కకు తప్పుకొని.. సొంత పార్టీ పెడుతున్న వ్యక్తిగానే తెలుసు.. కానీ ఆయన ఎ ప్పుడు హీరో అయ్యాడు.. ఎప్పుడు సినిమాలు తీశాడు.. అవి ఎప్పుడు విడుదలయ్యాయి.. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రీ రిలీజ్ అవుతున్నాయి.. ఇన్ని ప్రశ్నలు మీలో వ్యక్తం అవుతున్నాయి కదా.. వాటన్నింటికీ సమాధానమే ఈ కథనం.

తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు అక్కడి రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అన్నామలై. బిజెపికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు. దానికంటే ముందు ఆయన వీ ది లీడర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆన్లైన్లో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆయన ఏర్పాటుచేసిన ఈ సంస్థకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున స్పందన వస్తోంది. ఈ క్రమంలో అన్నామలై ఏర్పాటు చేసిన వీ ది లీడర్స్ సంస్థపై టీవీకే నేతలు రియాక్డ్ అయ్యారు.

అన్నామలై ఏర్పాటుచేసిన వీ ది లీడర్స్ అనే సంస్థ మళ్ళీ విడుదల చేసిన పాత చిత్రం లాంటిదేనని.. ఈ ఉద్యమం ప్రజలను అంతగా కదిలించదని టీవీకి నేతలు అంటున్నారు. ప్రతిసారి మళ్లీ విడుదలైన చిత్రాన్ని ప్రజలు అంతగా చూడరు. అన్నమలై పరిస్థితి ఏమిటో ఆయనకు తెలుసు. అలాంటప్పుడు తమిళనాడు రాజకీయాలలో ఏ మేరకు ఆయన ప్రభావం చూపించగలరు అంటూ టీవీకే నేత.. మంత్రి కేజీ అరుణ్ రాజు ఆరోపించారు.. “బిజెపిలో ఆయన పరిస్థితి బాగోలేదు. అందువల్లే బయటికి వచ్చారు. ఎన్నికల్లో ఆయన సేవలను పార్టీ ఎలా ఉపయోగించుకుందో అందరికీ తెలుసు. పైగా ఆయన నాయకత్వంలో బిజెపి తమిళనాడులో ఏ స్థాయిలో ఎదిగిందో కూడా అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఆయన ఏదో సంస్థ పెడితే తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోతాయి. తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అందువల్లే ఈ స్థాయిలో తమిళనాడు రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి స్థానం మీద అందరికీ ఆశలుంటాయి. అందులో తప్పులేదు. కానీ ముఖ్యమంత్రి కావడం అంత సులభం కాదని” అరుణ్ రాజ్ పేర్కొన్నారు.

అన్నామలై ఏర్పాటు చేసిన వీ ది లీడర్స్ క్యాంపెయిన్ లో ఇప్పటికే లక్షలమంది రిజిస్టర్ చేసుకున్నారు. అసంఖ్య 15 లక్షలను దాటిపోయింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే అది త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉంది. అదే గనక జరిగితే తమిళనాడు రాజకీయాలలో సంచలనం నమోదు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే..

Best Handheld Gaming Devices 2026
Best Handheld Gaming Devices 2026

Best Handheld Gaming Devices 2026: మొబైల్ లో గేమింగ్ కోరుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే గేమింగ్ కు ప్రత్యేకంగా డివైజ్ ఉండం వల్ల మరింత అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే ఇలాంటి డివైజ్ లు మార్కట్లోకి వచ్చాయి. అయితే 2026 సంవత్సరంలో హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ ప్రపంచం విప్లవాత్మక మార్పులకు లోనైంది. ఆండ్రాయిడ్ ఆధారిత రెట్రో గేమింగ్ నుంచి శక్తివంతమైన విండోస్ పీసీ గేమింగ్ వరకు, గేమర్లు తమకు నచ్చిన పరికరాన్ని ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్కెట్లో నిలుస్తున్న అత్యుత్తమ 6 హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ డివైజ్‌ల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

స్టీమ్ డెక్ OLED:
హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ కేటగిరీలో ఇది ఇప్పటికీ రారాజుగా కొనసాగుతోంది. అద్భుతమైన OLED డిస్‌ప్లే, తక్కువ బరువు, మెరుగైన బ్యాటరీ లైఫ్ దీని ప్రధాన ఆకర్షణలు. స్టీమ్ ఓఎస్ ) ద్వారా లభించే సాఫీ గేమింగ్ అనుభవం, గేమర్లకు అత్యంత సౌకర్యవంతమైన గేమింగ్‌ను అందిస్తుంది.

ఆసుస్ రోగ్ ఎక్స్‌బాక్స్ అలై X20 :
ఆసుస్ రోగ్ 20వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పరికరం, గేమింగ్ ప్రపంచంలో ఒక కొత్త బెంచ్‌మార్క్. ఇందులో 7.4-అంగుళాల HDR OLED డిస్‌ప్లే ఉండటమే కాకుండా, వినూత్నమైన ‘ట్రాన్స్‌ఫార్మింగ్ డి ప్యాడ్’ని అమర్చారు. ఇది విండోస్ 11తో పనిచేస్తుంది కాబట్టి. భారీ గేమ్స్ ఆడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

ఎంఎస్ఐ క్లా 8 EX AI ప్లస్:
పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ పరికరం అద్భుతమైన సామర్థ్యాన్ని చూపుతుంది. ఇంటెల్ ఆర్క్ G3 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ పరికరం, గేమింగ్ ఫ్రేమ్ రేట్లను పెంచడానికి AI ఆధారిత ఫీచర్లను వాడుకుంటుంది. ఇది హై-ఎండ్ పీసీ గేమింగ్‌ను హ్యాండ్‌హెల్డ్ రూపంలో అనుభవించాలనుకునే వారికి సరైన ఎంపిక.

వన్ ఎక్స్ ప్లేయర్ 3 :
ఇది కేవలం గేమింగ్ పరికరం మాత్రమే కాదు, ఒక 3 ఇన్ వన్ డివైజ్. ఇది గేమింగ్, ప్రొడక్టివిటీ AI పనులకు అనువుగా రూపొందించబడింది. ఇందులో 8.8 అంగుళాల భారీ 144Hz OLED డిస్‌ప్లే ఉంటుంది. పెద్ద స్క్రీన్, అత్యుత్తమ గ్రాఫిక్స్ కోరుకునే వారికి ఇది ఒక పవర్‌హౌస్ లాంటిది.

రెట్రాయిడ్ పాకెట్ 5 :
రెట్రో గేమింగ్ అంటే ఇష్టమైతే, ఇది అత్యుత్తమ ఆండ్రాయిడ్ హ్యాండ్‌హెల్డ్. ఇది చాలా కాంపాక్ట్‌గా, తక్కువ బరువుతో ఉంటుంది. పాత కాలపు ఎమ్యులేషన్ గేమ్స్ మరియు ఆధునిక ఆండ్రాయిడ్ గేమ్‌లను ఆడటానికి ఇది చాలా సరసమైన మరియు శక్తివంతమైన ఎంపిక.

వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా

Real Life Peddi Athletes
Real Life Peddi Athletes

Real Life Peddi Athletes: రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది చిత్రం ఇటీవల విడుదలైంది. క్రీడా నేపథ్యంలో రూపొందిని ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రాస్ అథ్టెట్ గా నటించాడు. క్రికెటర్, కుస్తీ వీరుడు, పరుగులు పెట్టే వీరుడిగా అతడు త్రిముఖ పాత్రలలో అతడు నటించాడు. ఈనేపథ్యంలో అలాంటి పాత్రలను రియల్ లైఫ్ లో పోషించిన క్రీడాకారుల గురించి ఈకథనంలో తెలుసుకుందాం.

క్రాస్ అథ్లెట్ ల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తే ఈ జాబితాలో యుజువేంద్ర చాహల్, వీవ్ రిచర్డ్స్, సుజీ బేట్స్, ఎలిస్ ఫెర్రీ, రూడీ వాన్ వూరెన్ ఉన్నారు. వీరంతా మొదట్లో ఒక విభాగంలో ప్రవేశించారు. ఆతర్వాత క్రికెట్ లో సత్తా చూపించారు. తద్వారా మల్టీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ గా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు, ఆ క్రీడల్లో పేరు తెచ్చుకున్నారు. వేలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పెద్ది సినిమా కూడా ఇలాంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నేపథ్యాన్ని తీసుకునే రూపొందించినట్టు తెలుస్తోంది.

వెస్టిండిస్ క్రికెట్ ఆటగాడు వీవ్ రిచర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడు 1974లో వెస్టిండిస్ లో ఫుట్ బాట్ ఆడేవాడు. వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత క్రికెట్ లోకి ప్రవేశించాడు. వెస్టిండిస్ క్రికెట్ జట్టులో తనకంటూ గొప్ప ముద్ర వేసుకున్నాడు.

యుజువేంద్ర చాహల్ భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించడానికి ముందు చదరంగంలో సత్తా చూపించాడు. 2003లో ప్రపంచ యూత్ చాంపియన్ షిప్ లో ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ లోకి ప్రవేశించాడు. టీమిండియా తరపున తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికీ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు.

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ గా పేరుపొందింది సుజీ బేట్స్. ఈమె బాస్కెట్ బాట్ ప్లేయర్. 2008లో ఒలంపిక్స్ లో ఈమె న్యూజిలాండ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టులో ఆడింది. కివీస్ జట్టులో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేశాడు.

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ గా పేరుపొందింది ఎలీస్ ఫెర్రీ. ఈమె గతంలో ఆస్ట్రేలియా ఫుట్ బాట్ జట్టులో ప్లేయర్ గా ఆడింది. 2011 ఫిపా వరల్డ్ కప్ లో ఆసీస్ జట్టు తరఫున ఆడింది. అనంతరం ఆసీస్ క్రికెట్ జట్టులో ప్రవేశించింది. ఆసీస్ జట్టులో తనదైన ముద్ర వేసింది.

నమీబిమా క్రికెట్ జట్టులో రూడీ వాన్ వూరెన్ కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో నమీబియా జట్టు తరఫున ఆడాడు. క్రికెటర్ కంటే ముందు ఇతడు నమీబియా దేశం తరఫున రగ్బీ వరల్డ్ కప్ లో ఆడాడు. అనంతరం నమీబియా క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. కొంతకాలం నమీబిమయా జట్టులో క్రికెటర్ గా ఆడాడు.

బాలయ్య కి ఆ దర్శకుడంటే చాలా ఇష్టమా..? అతనితో ప్రేమలో పడిపోయాడా..?

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని హీరోగా నిలబెట్టడమే కాకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చి పెట్టాయి. అలాంటి బాలయ్య బాబుకి ఒక దర్శకుడంటే చాలా ఇష్టమట. అతనితో సినిమాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని బాలయ్య గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ కావడం విశేషం… వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు ‘పైసా వసూలు’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. కమర్షియల్ గా ప్లాప్ గా మిగిలిన ఈ సినిమా తన ఇమేజ్ ను మాత్రం చాలా వరకు పెంచిందనే చెప్పాలి. ఇక తన డైలాగ్ డెలివరీలో కూడా వేరే లెవెల్ మాడ్యులేషన్ ని చూపించారు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబుకి పూరి జగన్ను అంటే చాలా ఇష్టం ఏర్పడిందట. ఎందుకంటే పూరి చాలా తక్కువ సమయంలో బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే సినిమాని తీశాడు. కాబట్టి పూరి అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక దాంతో పాటుగా పూరి జజగన్నాధ్ తో ప్రేమలో పడిపోయానని కూడా బాలయ్య చాలా ఫన్నీ కామెంట్స్ చేయడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలావరకు వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఒకప్పుడు మూస ధోరణిలో ఉండే సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు వైవిధ్యభరితమైన క్యారెక్టర్ లో కనిపించడం అలాగే మరికొన్ని డిఫరెంట్ క్యారెక్టర్ లను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పడితే చూడాలని అటు పూరి అభిమానులు, ఇటు బాలయ్య బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

వైభవ్ సూర్య వంశే తుఫాన్ అనుకుంటే.. అతడి తమ్ముడు సునామి.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: జాతీయ క్రికెట్ జట్టుకు వైభవ్ సూర్య వంశీ ఎంపికయ్యాడు. ఇటీవలి ఐపిఎల్ లో తిరుగులేని స్థాయిలో ఆడిన తర్వాత అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. అతడి గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్ టూర్ లో గనుక అతడు అదరగొడితే ఇక తిరుగు ఉండదు. సూర్య వంశీ గురించి ఇప్పటికే అనేక కథనాలు మీడియాలో వచ్చాయి.

సూర్య వంశీ వంతు అయిపోయింది. ఇప్పుడు అతడి తమ్ముడు మొదలుపెట్టాడు. సూర్య వంశీ కి తమ్ముడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలో ఉంది.. భారత క్రికెట్లో సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు వైభవ్ సూర్య వంశీ. అతడి తమ్ముడు కూడా క్రికెటర్ కావాలని అనుకుంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో తన అన్నను బీట్ చేస్తానని చెబుతున్నాడు.

సూర్య వంశీ తమ్ముడు పేరు ఆశీర్వాద్ సూర్య వంశీ. ఇతడు బీహార్లో చదువుతున్నాడు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అతడు పాల్గొన్నాడు.”భవిష్యత్తు కాలంలో క్రికెట్ ఆడతావా.. మీ అన్నను నువ్వు అధిగమిస్తావా.. భారీగా పరుగులు చేయగలుగుతావా.. ఐపీఎల్ లో ఆడతావా” అని యాంకర్ ప్రశ్నలు అడిగితే.. అతడు అన్నింటికీ సమాధానం అవును అని చెప్పాడు.. “ఏది అడిగినా సరే అతడు అవును అంటున్నాడని.. ఇతడు కూడా సూర్య వంశీ లాగానే ఆడతాడేమోనని” సోషల్ మీడియాలో కామెంట్ లో వినిపిస్తున్నాయి.

ఆశీర్వాద్ కూడా దృఢంగా ఉన్నాడు.. సూర్య వంశీ మాదిరిగానే బలిష్టంగా కనిపిస్తున్నాడు. సూర్య వంశీ ఇప్పటికే తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ అనేకం ఆడాడు. ఆశీర్వాద్ క్రికెట్లోకి వస్తే సునామి తరహా లోనే బ్యాటింగ్ చేస్తాడేమో.. అన్నను మించిపోయి అదరగొడతాడేమోనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే ఆశీర్వాద్ మాట్లాడుతుంటే భలే అందంగా ఉన్నాడు. ప్రతి ప్రశ్నకు అతడు అవును అని సమాధానం చెబుతూ.. తనదైన హావభావాన్ని ప్రదర్శించాడు. అతడి క్యూట్ మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అతడు భవిష్యత్తు కాలంలో మంచి పేరు తెచ్చుకుంటాడని పేర్కొంటున్నారు.