Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie Postponed: 'ది ప్యారడైజ్' స్థానాన్ని కబ్జా చేసిన 'ఇరుముడి'.. పాపం...

The Paradise Movie Postponed: ‘ది ప్యారడైజ్’ స్థానాన్ని కబ్జా చేసిన ‘ఇరుముడి’.. పాపం నాని కి ఇలాంటి పరిస్థితి ఊహించలేదు..

The Paradise Movie Postponed: పాపం ఏ ముహూర్తం లో నేచురల్ స్టార్ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మొదలు పెట్టాడో తెలియదు కానీ, ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాని చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రమిది. ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ వీడియో, ఆయా షేర్ పాటకు ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ […]

The Paradise Movie Postponed: పాపం ఏ ముహూర్తం లో నేచురల్ స్టార్ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మొదలు పెట్టాడో తెలియదు కానీ, ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాని చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రమిది. ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ వీడియో, ఆయా షేర్ పాటకు ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తోంది. ఇలా ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం తో అంచనాలు ఎవ్వరును ఊహించనంత రేంజ్ కి వెళ్లిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఎలాంటి అంచనాలు అయితే ఉంటాయో ఈ చిత్రానికి కూడా అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి.

ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం , రీ షూటింగ్స్ కి ఎక్కువగా జరుగుతుండడం వల్ల ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని స్పష్టంగా నేడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అదే రోజున రవితేజ ‘ఇరుముడి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ‘ది ప్యారడైజ్’ వాయిదా పడిందని అంటున్నారు విశ్లేషకులు. కొన్ని రోజుల క్రితమే ‘ది ప్యారడైజ్’ చిత్రం నాన్ స్టాప్ గా రీ షూటింగ్స్ ని జరుపుకుంటూ ఉంది , ఈ సినిమా చెప్పిన సమయానికి విడుదల అవ్వడం కష్టం అని ఒక ఆర్టికల్ వస్తే , అదంతా ఫేక్ అని , ఆన్ టైం లోనే ఈ చిత్రం పూర్తి అవుతుందని , రీ షూటింగ్స్ జరగడం లేదని , ఆగస్టు 21 న ఈ సినిమా విడుదల అవుతుందని టీం ఒక క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇప్పుడు సడన్ గా ఈ ట్విస్ట్ వచ్చేలోపు ‘ది ప్యారడైజ్’ మరోసారి వాయిదా పడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి చూస్తే , ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ లో ఉన్నారట, అది కూడా కుదరకపోతే వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇక ఇరుముడి విషయానికి వస్తే ఈ చిత్రానికి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper