Home Blog Page 167

ఎన్ని కోర్టులు తీర్పులిచ్చినా తిక్క ట్రంప్ ఊరుకునే రకం కాదు

H1B Visa Fee Ruling
H1B Visa Fee Ruling

H1B Visa Fee Ruling: హెచ్ 1 బీ వీసా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న లక్ష డాలర్ల ఫీజు వసూలు నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రవాస భారతీయ సంఘాలు స్వాగతిస్తున్నాయి.. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

“అమెరికా దేశంలో సాంకేతిక విభాగాలలో పనిచేయడానికి.. హెల్త్ కేర్ లో పని చేయడానికి.. ఆత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలలో పనిచేయడానికి.. ప్రతిభావంతులు అవసరం. చైనా ఈ విభాగాలలో అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను భర్తీ చేసుకున్నది. అందువల్లే ఈ రంగాలలో అద్భుతాలు చేస్తోంది. అమెరికా మాదిరిగా పనికిమాలిన ఫీజులను వసూలు చేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం లేనిపోని నిబంధనలను తీసుకొస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నారు. దీనివల్ల అమెరికా వెనుకబడిపోతుంది. ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో మాలాంటి వాళ్ళలో హర్షం వ్యక్తం అవుతుందని” ప్రభాస భారతీయులు చెబుతున్నారు.

అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఫెడరల్ కోర్టు తీర్పును ట్రంప్ ఏ విధంగా చూస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అనే అంశాలపై రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ యంత్రాంగానికి.. న్యాయవ్యవస్థలకు మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు జరుగుతున్నాయి. చట్ట విరుద్ధమైన అంశాలను ట్రంపు ప్రభుత్వం పదేపదే తెరపైకి తీసుకువస్తుంది. విధానపరమైన అంశాలలో కూడా అనవసరమైన వేలుపెడుతోంది. దీనివల్ల న్యాయవ్యవస్థలు ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా తీర్పులు ఇస్తున్నాయి. అయితే విధానపరమైన అంశాలలో ట్రంప్ ప్రభుత్వం వేలు పెడుతుందని.. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా దారులకు రకరకాల సమస్యలను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెచ్ వన్ బీ వీసా ఫీజును లక్ష దారాలకు పెంచుతూ గత ఎడాది ట్రంప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్.. డెమోక్రటిక్ పార్టీ కోర్టులో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో బోస్టన్ కోర్టు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం తీసుకొస్తుందని మండిపడింది. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. అయితే బోస్టన్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల.. శ్వేత సౌధం లోని యంత్రాంగం పైకోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మారుతి సుజుకీ మతిపొగోట్టే సేల్స్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ 10 కార్లు ఇవే..

Maruti Suzuki Sales May 2026
Maruti Suzuki Sales May 2026

Maruti Suzuki Sales May 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మే 2026 నెల అమ్మకాల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చిన్న కార్ల నుంచి SUVల వరకు వివిధ విభాగాలకు చెందిన వాహనాలు వినియోగదారుల ఆదరణ పొందాయి. ముఖ్యంగా Maruthi Suzuki తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకోగా.. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీలు కూడా బలమైన పోటీని కొనసాగించాయి. మే నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఏ మోడళ్లు చోటు దక్కించుకున్నాయో చూద్దాం.

1. మారుతి సుజుకి డిజైర్
మే 2026లో అత్యధికంగా అమ్ముడైన కారుగా Maruti Suzuki Dzire నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మొత్తం 24,546 యూనిట్ల విక్రయాలు చేసుకుంది. గత ఏడాది మే నెలలో నమోదైన 18,084 యూనిట్లతో పోలిస్తే ఇది 36 శాతం వృద్ధి. కుటుంబ వినియోగానికి అనుకూలమైన డిజైన్, మెరుగైన మైలేజ్, అందుబాటు ధరలు ఈ కారుకు భారీ డిమాండ్‌ను తీసుకొచ్చాయి. దీని ధర రూ.6.26 లక్షల నుంచి రూ.9.31 లక్షల వరకు ఉంది.

2. ఫ్రాంక్స్‌కు భారీ డిమాండ్:
Maruti Suzuki Fronx మే నెలలో 20,686 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే 52 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. క్రాస్‌ఓవర్ SUV సెగ్మెంట్‌లో యువతను ఆకట్టుకుంటున్న ఫ్రాంక్స్, స్టైలిష్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్ల కారణంగా వేగంగా ప్రజాదరణ పొందుతోంది. దీని ధర రూ.6.85 లక్షల నుంచి రూ.11.84 లక్షల వరకు ఉంది.

3. ఎర్టిగా:
MPV విభాగంలో అగ్రగామిగా ఉన్న Maruti Suzuki Ertiga వరుసగా రెండో నెల కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. మే 2026లో 20,350 యూనిట్లు విక్రయించి 26 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. పెద్ద కుటుంబాలకు అనువైన సీటింగ్ సామర్థ్యం, మంచి మైలేజ్, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం ఎర్టిగా విజయానికి ప్రధాన కారణాలు. దీని ధర రూ.8.80 లక్షల నుంచి రూ.12.94 లక్షల వరకు ఉంది.

4.మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్..
Tata Punch, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కలిపి మే నెలలో 20,208 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఇది 54 శాతం వార్షిక వృద్ధి. గతంలో రెండో స్థానంలో ఉన్న పంచ్, ఇతర మోడళ్ల వేగవంతమైన వృద్ధి కారణంగా నాలుగో స్థానానికి పడిపోయినా అమ్మకాల పరంగా బలమైన ప్రదర్శన కొనసాగించింది. ఈ శ్రేణి ధర రూ.5.65 లక్షల నుంచి రూ.10.60 లక్షల వరకు ఉంది.

5. టాటా నెక్సాన్‌ :
Tata Nexon , దాని ఈవీ వెర్షన్ కలిసి 19,100 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచాయి. 46 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఎంపికలతో అందుబాటులో ఉండటం వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని ధర రూ.7.37 లక్షల నుంచి రూ.14.02 లక్షల వరకు ఉంది.

6. బాలెనో అమ్మకాల వృద్ధి:
Maruti Suzuki Baleno మే నెలలో 18,396 యూనిట్లు విక్రయించి ఈ జాబితాలో అత్యధికంగా 58 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాలెనోకు ఉన్న ఆదరణ ఇంకా తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.10 లక్షల వరకు ఉంది.

7. వ్యాగన్ ఆర్‌ డిమాండ్ కొనసాగింపు:
Maruti Suzuki WagonR మే 2026లో 18,076 యూనిట్లు విక్రయించి ఏడో స్థానంలో నిలిచింది. 30 శాతం వార్షిక వృద్ధి సాధించినప్పటికీ నెలవారీ అమ్మకాలు కొంత తగ్గడంతో ర్యాంకింగ్‌లో రెండు స్థానాలు కోల్పోయింది. విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్ కారణంగా ఇది ఇప్పటికీ భారత కుటుంబాల ప్రియమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.40 లక్షల వరకు ఉంది.

8. స్విఫ్ట్‌ సైతం..
Maruti Suzuki Swift మే నెలలో 17,519 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. 24 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన ఈ హ్యాచ్‌బ్యాక్, స్పోర్టీ డిజైన్ , డ్రైవింగ్ అనుభవంతో యువతలో మంచి ఆదరణ పొందుతోంది. దీని ధర రూ.5.79 లక్షల నుంచి రూ.8.64 లక్షల వరకు ఉంది.

9. స్కార్పియో మెరుపు:
Mahindra Scorpio-N, స్కార్పియో క్లాసిక్ కలిపి 15,774 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. 10 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన ఈ ఎస్‌యూవీ, ఏప్రిల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల సాధించి హ్యుందాయ్ క్రెటాను వెనక్కి నెట్టింది. స్కార్పియో-ఎన్ ధర రూ.13.49 లక్షల నుంచి రూ.24.95 లక్షల వరకు ఉంది.

10. టాప్-10లో క్రెటా:
మిడ్‌సైజ్ SUV విభాగంలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్న Hyundai Creta, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కలిసి 15,523 యూనిట్లు విక్రయించాయి. అయితే కేవలం 3 శాతం వార్షిక వృద్ధి మాత్రమే నమోదు కావడంతో ఈ జాబితాలో అత్యల్ప వృద్ధి రేటు కలిగిన మోడల్‌గా నిలిచింది. అయినప్పటికీ మార్కెట్లో తన ప్రాధాన్యాన్ని కొనసాగిస్తూ టాప్-10లో స్థానం దక్కించుకుంది. దీని ధర రూ.10.90 లక్షల నుంచి రూ.19.91 లక్షల వరకు ఉంది.

డ్రైవింగ్ చేస్తే ఎందుకు అంత త్వరగా అలసిపోతారు? కారణం ఏంటో తెలుసా?

Driving Fatigue Causes
Driving Fatigue Causes

Driving Fatigue Causes: కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేయడం సహజం. అయితే ఇలాంటి సమయంలో ప్రయాణించే వారిలో డ్రైవింగ్ చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన డ్రైవింగ్ మీదనే మిగతావారి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. కానీ చాలా దూరం వెళ్లాక ఈ డ్రైవర్ కూడా అలసిపోయే ప్రమాదం ఉంది. అసలు ఎలాంటి శారీరక కదలిక లేకుండా డ్రైవర్ ఎలా అలసిపోతాడు? డ్రైవింగ్ చేయడం వల్ల శరీరంలో ఎలాంటి అవయవాలు పనిచేస్తాయి?

వాహనం నడపడం అనేది బయటకు చూస్తే చాలా సాధారణమైన పనిలా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది మన మెదడుకు అత్యంత శ్రమను కలిగించే కార్యకలాపాల్లో ఒకటి. డ్రైవింగ్‌ సమయంలో రహదారిపై దృష్టి పెట్టడం, వాహనాల కదలికలను గమనించడం, ట్రాఫిక్‌ సంకేతాలను అర్థం చేసుకోవడం, ప్రమాదాలను ముందుగానే ఊహించడం, స్టీరింగ్‌, బ్రేక్‌, యాక్సిలేటర్‌లను సమన్వయంతో నియంత్రించడం వంటి అనేక పనులను మెదడు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది.

మెదడులోని అనేక భాగాలు డ్రైవింగ్‌ సమయంలో చురుకుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా శరీర కదలికలను సమన్వయం చేసే సెరెబెల్లమ్‌, కదలికలకు ముందస్తు ప్రణాళిక రూపొందించే ప్రీమోటార్‌ కార్టెక్స్‌, చుట్టూ ఉన్న దృశ్యాలను విశ్లేషించే విజువల్‌ ప్రాసెసింగ్‌ ప్రాంతాలు నిరంతరం పనిచేస్తుంటాయి. అలాగే అప్రమత్తతను కొనసాగించే థాలమస్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భాగాలన్నీ ఎక్కువసేపు నిరంతరంగా పనిచేయడం వల్ల మానసిక అలసట ఏర్పడుతుంది.

డ్రైవింగ్‌లో ఒక పెద్ద సవాలు ఏమిటంటే, ఇది నిరంతర ఏకాగ్రతను కోరుతుంది. ఇతర పనుల్లో మధ్య మధ్యలో విశ్రాంతి లభించినా, డ్రైవింగ్‌లో మాత్రం క్షణకాలం కూడా దృష్టి మరల్చకూడదు. పరిశోధనల ప్రకారం, ఒక గంటకు పైగా నిరంతరంగా డ్రైవింగ్‌ చేసిన తర్వాత చాలా మందిలో ఏకాగ్రత క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రయాణ సమయం పెరిగే కొద్దీ అలసట కూడా పెరుగుతూ ఉంటుంది.

రాత్రి వేళల్లో లేదా పొడవైన, ఏకరీతి రహదారులపై డ్రైవింగ్‌ చేసే సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. చుట్టూ మార్పులు తక్కువగా ఉండటం, తక్కువ వెలుతురు ఉండటం వల్ల మెదడు నిద్రావస్థకు దగ్గరవుతుంది. ఫలితంగా ప్రతిస్పందన వేగం తగ్గిపోతుంది. ప్రమాదాన్ని గుర్తించడంలో ఆలస్యం కావడం, తప్పు నిర్ణయాలు తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి.

అలసటతో డ్రైవింగ్‌ చేయడం ఎంత ప్రమాదకరమో అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లు ఇది మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలకు సమానంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అలసట వల్ల మెదడు సమాచారాన్ని వేగంగా విశ్లేషించలేకపోతుంది. దృష్టి, జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం, స్పందన వేగం అన్నీ తగ్గిపోతాయి.

డ్రైవింగ్‌ అలసటలో అత్యంత ప్రమాదకరమైన అంశం “మైక్రోస్లీప్‌”. ఇది కొన్ని సెకన్లపాటు తెలియకుండానే వచ్చే చిన్న నిద్ర. సాధారణంగా 1 నుంచి 15 సెకన్ల వరకు కొనసాగవచ్చు. ఈ సమయంలో డ్రైవర్‌కు తాను నిద్రలోకి జారుకున్నాననే విషయం కూడా తెలియదు. కానీ వాహనం మాత్రం అదే వేగంతో ముందుకు సాగుతుంది. కేవలం కొన్ని సెకన్ల మైక్రోస్లీప్‌ కూడా పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది.

అందుకే నిపుణులు ప్రతి రెండు గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకుండా ప్రయాణం ప్రారంభించకూడదు. రాత్రివేళల్లో పొడవైన ప్రయాణాలను వీలైనంత వరకు నివారించడం మంచిది. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కళ్లు భారంగా అనిపించడం, తరచూ ఆవలింతలు రావడం, దృష్టి చెదిరిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే సురక్షితమైన ప్రయాణానికి వాహనం స్థితి ఎంత ముఖ్యమో, డ్రైవర్‌ అప్రమత్తత కూడా అంతే ముఖ్యమైనది.

యుక్త వయసులోనే ముసలి వాళ్ళయిపోయారు.. ఇంతకీ ఏమైంది వీళ్లకు..

Progeria Disease India
Progeria Disease India

Progeria Disease India: చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టుగానే చనిపోతారు. కొందరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతారు. అక్కడి నీళ్లు తాగినవాళ్లు ఏమాత్రం బతికి బట్ట కట్టలేరు.. చూస్తుండగానే ఆ గ్రామములో ఒక్కొక్కరు చనిపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది. చదువుతుంటే ఖలేజా సినిమా గుర్తుకొస్తుంది కదూ. అదంటే సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా జరిగితే.. యుక్త వయసు ఉన్న అమ్మాయిలు వృద్దులుగా మారిపోతే.. ఆ కష్టం పగవాడికి కూడా రావద్దు.. ఆ బాధను ఈ ఇద్దరు అమ్మాయిలు అనుభవిస్తున్నారు. ప్రతిక్షణం నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు.

ఆ ఇద్దరు అమ్మాయిలు పేరు రాజకుమారి.. రోషిని. ఇందులో రాజకుమారి వయసు 19 సంవత్సరాలు. రోషిని వయసు 14 సంవత్సరాలు. టీనేజ్ పిల్లలు ఎంతో అందంగా ఉంటారు. పైగా చలాకీగా కూడా కనిపిస్తుంటారు. కానీ ఇద్దరు అమ్మాయిలకు ఏమైందో తెలియదు. పైగా వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. టీనేజ్లో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వీరు ఇద్దరు వృద్దులుగా మారిపోయారు. జుట్టు రాలిపోవడం.. ముఖం కళవిహీనంగా అయిపోవడంతో ముసలి వాళ్ళ లాగా కనిపిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చెందిన రాజకుమారి, రోషిని ఇలా అయిపోవడానికి ప్రధాన కారణం అత్యంత అరుదైన ప్రొగేరియ జెనెటిక్ డిసార్డర్. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. చూస్తుండగానే చర్మం సాగిపోతూ ఉంటుంది. అవయవాలు అత్యంత బలహీనంగా ఉంటాయి. కనీసం అద్దంలో ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్లే వీరిద్దరూ టీనేజ్ లోనే వృద్ధుల మాదిరిగా కనిపిస్తున్నారు. కనీసం స్కూల్ కి కూడా వెళ్లలేకపోతున్నారు. 80 లక్షల మందిలో ఒక్కరికే ఈ వ్యాధి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే చాలా ఖర్చవుతుందని.. పైగా మందులు కూడా అత్యంత అరుదుగా లభిస్తాయని వైద్యులు అంటున్నారు.

చిన్నప్పుడు మీరు బాగానే ఉన్నారని ఆ తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని.. చివరికి ఇలా మారిపోయారని తెలుస్తోంది. తమ పిల్లలకు ఇలా కావడానికి ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆర్థిక శక్తి మేరకు అనేక రకాల ఆస్పత్రులలో చూపించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆ ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా జీవితాన్ని సాగించాల్సిన వారు.. నిర్వేదంలో కనిపిస్తున్నారు. తమ పిల్లల దుస్థితిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు భావిస్తున్నారు.. అయితే ఈ వ్యాధి నివారణకు అయ్యే చికిత్స అత్యంత ఖరీదు కావడంతో.. ఆ ప్రభుత్వ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

రూ.10 కోట్లు సంపాదించినా విదేశాల్లోనే భారతీయులు.. డబ్బు కన్నా జీవనశైలికి ప్రాధాన్యం?

Indian Immigrants Lifestyle
Indian Immigrants Lifestyle

Indian Immigrants Lifestyle: చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లేటప్పుడు ఒకే ప్రణాళికతో వెళ్తారు. కొన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసి, తగినంత సంపాదన చేసుకొని, భారత్‌ వచ్చి సుఖంగా స్థిరపడాలని అనుకుంటారు. చాలా మందికి ఆ ‘‘మ్యాజిక్‌ నంబర్‌’’ రూ.10 కోట్లు. కానీ ఈ కల నిజం కావడం చాలా అరుదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో దశాబ్దాలు గడిపిన భారతీయులను అడిగితే ఒక వాస్తవం బయటపడుతుంది. ఎక్కువ మంది శాశ్వతంగా తిరిగి రావడం లేదు. ఇటీవల అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళ వీడియో వైరల్‌ అయ్యాక ఈ చర్చ మళ్లీ జాతీయ స్థాయిలో మండిపోయింది.

డబ్బు సమస్య కాదు..

వీడియోలో ఆ మహిళ విదేశాల్లో ఉండిపోవడానికి ప్రధాన కారణం డబ్బు సరిపోకపోవడం కాదని, డాలర్‌ ఆదాయం మొదలైన తర్వాత ‘మంచి జీవితం’ అనే భావన పూర్తిగా మారిపోతుందని తెలిపింది. నెలకు 50 వేలు లేదా ఒక లక్ష రూపాయలు ఇంటికి పంపడం అక్కడి వృత్తి నిపుణులకు చాలా సాధారణం అని పేర్కొంది. ఒకప్పుడు దూరంగా అనిపించిన ఆర్థిక లక్ష్యాలు చాలా త్వరగా సాధ్యమవుతాయని చెపిపంది. కానీ ఆ లక్ష్యం నెరవేరాక కూడా చాలా మంది తిరిగి రావడం లేదు. ఐదు సంవత్సరాలు అనుకున్నది పది, పది అనుకున్నది ఇరవై సంవత్సరాలు అవుతోంది.

మంచి జీవనశైలి కోసం..
కాలం గడిచేకొద్దీ వలస జీవితం కేవలం ఆర్థికం కాకుండా జీవనశైలి సంబంధిత నిర్ణయంగా మారిపోతుంది. వృత్తి పురోగతి, పిల్లల విద్య, స్నేహాలు, సమాజంలో ఏర్పడే స్థానం.. ఇవన్నీ బలపడతాయి. విదేశీ నెట్‌వర్క్‌లు భారత్‌లోని సంబంధాల కంటే ఎక్కువ బలం పొందుతాయి. ఒకప్పుడు తాత్కాలికంగా ఉన్న దేశం నెమ్మదిగా సొంత ఇల్లులా అనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. మొదట ఉన్నత సాలరీ కోసం వెళ్లినా, తర్వాత పిల్లలకు మంచి విద్యా వ్యవస్థ, ఉన్నతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన పబ్లిక్‌ సేవలు, సురక్షిత వాతావరణంచ మొత్తం జీవన నాణ్యత కోసం అక్కడే స్థిరపడతారు.

భారత్‌ మారుతున్నా..
గత రెండు దశాబ్దాల్లో భారత్‌ ఆర్థికంగా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా చాలా ముందుకు వచ్చింది. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాలు ప్రపంచ స్థాయి అవకాశాలు అందిస్తున్నాయి. కొంతమంది ఉన్నత స్థాయి టెక్‌ ప్రొఫెషనల్స్‌ తిరిగి వస్తున్నారు కూడా. అయినప్పటికీ, ఇప్పటికీ ఏటా సుమారు 7 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్‌(సుమారు 135 బిలియన్‌ డాలర్లు) పొందుతున్న దేశం కావడం ఈ వలసల ఆర్థిక ప్రయోజనాన్ని చూపిస్తుంది. కానీ ఇది ఒకేసారి బ్రెయిన్‌ డ్రెయిన్, బ్రెయిన్‌ గెయిన్‌ రెండింటినీ సూచిస్తోంది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట డబ్బు గురించి మాట్లాడుతారు, చివరికి సంస్కృతి, భావోద్వేగాలు, పిల్లల భవిష్యత్తు, సమాజంలో భాగస్వామ్యం వంటి అంశాల వైపు మళ్లిపోతారు. రూ.10 కోట్లు సంపాదించడం కంటే, ఒకసారి ఏర్పడిన జీవనశైలిని, సంబంధాలను, సామాజిక మూలాలను తొలగించడం చాలా కష్టం. డబ్బు పెంచడం సాధ్యమైనా, మనసులో ఏర్పడిన ఇల్లును మార్చుకోవడం అంత సులభం కాదు. కొందరు ఎప్పటికీ తిరిగి రారు. కొందరు ఎప్పటికైనా వస్తారని ఆశపడుతూ ఉంటారు. మరికొందరు రెండు దేశాల మధ్యనే జీవితం గడుపుతారు.

లక్ష డాలర్ల ఫీజు.. తలబొప్పి కట్టింది.. ఇక జన్మలో హెచ్1బీ ఊసు ట్రంప్ ఎత్తడు.. ఎత్తలేడు..

US Federal Court Decision H1B Charges
US Federal Court Decision H1B Charges

US Federal Court Decision H1B Charges: దెబ్బ మీద దెబ్బ.. ఇది మామూలు దిబ్బ కాదు. ట్రంప్ దిమ్మ తిరిగిపోయే దెబ్బ. కాళ్ళ కింద భూమి కంపించి పోయే దెబ్బ. ఇక జన్మలో ఆ మాట కూడా ఎత్తడానికి కూడా భయపడే దెబ్బ.. అమెరికాలో ఏకచత్రాధిపత్యంగా.. మూర్ఖుడి మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ కు అక్కడి కోర్టు తిరుగులేని తీర్పు ఇచ్చింది. ఇకపై జన్మలో ఆ ఊసు ఎత్తడానికి కూడా వణుకు పుట్టేలా చేసింది.

ట్రంప్ తన పరిపాలన నిర్లక్ష్యాన్ని ప్రపంచ మీద రుద్దడానికి రకరకాల విన్యాసాలకు పాల్పడుతున్నాడు. ప్రపంచ దేశాల మీద అనవసరమైన సుంకాలు విధించడం.. ఇంకా లేనిపోని షరతులు విధించడం.. యుద్ధాలు చేయడం.. ఇలాంటి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే. ట్రంప్ తీసుకున్న మరో దారుణమైన నిర్ణయం అమెరికా కంపెనీలకు కోలుకోలేని ఇబ్బందిగా మారింది. అమెరికా యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశం లో భాగంగా.. అమెరికన్ కంపెనీల పై ట్రంప్ ప్రత్యేకమైన రుసుము వసూలు చేస్తామని ప్రకటించారు.. ప్రత్యేకమైన నైపుణ్యాల కోసం విదేశీ కార్మికులను నియమించుకునే యాజమాన్యాలు లక్ష డాలర్లు రుసుము చెల్లించాలని ట్రంప్ ఒక పనికిమాలిన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

ట్రంప్ తీసుకొని నిర్ణయం పట్ల అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదం తెలపలేదు. దీనిని చట్ట విరుద్ధమైన పన్ను అని బోస్టన్ ఫెడరల్ కోర్టు అభిప్రాయపడింది. విదేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణులకు హెచ్ 1 బీ వీసాలు ఇవ్వడానికి లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం ఏంటని కోర్టు మండిపడింది.

ట్రంప్ తీసుకున్న నిర్ణయం చల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియోసోరోకిన్ సోమవారం అత్యంత చారిత్రాత్మకమైన తీర్పు చెప్పారు.. గత ఏడాది సెప్టెంబర్ లో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలలో ఉంటూ అమెరికా తాత్కాలిక వలస వీసా ఆయన హెచ్1బికి ఎంపికైన వారు లక్ష డాలర్ల ఫీల్ చెల్లించాలని ఒక విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీనిని దాదాపు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్ తీవ్రంగా తప్పుపట్టారు. అదే కాదు పోస్ట్ అని కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని జడ్జి విచారించారు. లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం ఏంటని మండిపడ్డారు..

“అది పెనాల్టీ ఎలా అవుతుంది. అలా తీసుకోవడానికి మీరెవరు. అటువంటి విధానం అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఎలా సాధ్యమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని”కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. “కళాశాలలు.. ఆస్పత్రులు.. వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులను నియమించుకోవడానికి మా సామర్థ్యానికి మించి లక్ష డాలర్ల రుసుము చెల్లించాలంటే ఇబ్బందిగా ఉండేదని” ఆయా రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును కోర్టు తీవ్రంగా పరిగణించి.. ట్రంప్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇక జన్మలో లక్ష డాలర్ల రుసుము వసూలు చేయాలనే ఆలోచన ట్రంప్ మదిలో ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అపారమైన సంపద..

Today 9 June 2026 Horoscope
Today 9 June 2026 Horoscope

Today 9 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అపారమైన సంపద లభిస్తుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): రాసి ఉద్యోగులు ఈరోజు ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రయాణాల వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అనుకోకుండా అపారమైన సంపద లభిస్తుంది. శక్తి సామర్థ్యాల మేరకు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో సంతోషంగా గడుపుతారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాల వల్ల సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు తమ అవసరాల మేరకు వనరులను ఏర్పాటు చేసుకుంటారు. గతంలో చేపట్టిన పనుల నుంచి ఇప్పుడు విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు కలుస్తారు. వీరి వల్ల అనేక లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల పనితీరుపై అధికారులు పరిశీలిస్తారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొందరు శుభవార్తలు వినే అవకాశముంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల నుంచి ఉద్యోగులకు ప్రశ్నించలు అందుతాయి. ఇతరులకు మాట ఇవ్వడం మానుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కొన్ని సమస్యలను పరిష్కరించడంలో స్నేహితుల సహాయం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు గణనీయమైన లాభాలను పొందుతారు. విలాసాల కోసం ఖర్చు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు సవాళ్లు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఏ పని చేపట్టిన ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వీరితో అనేక పనులు పూర్తవుతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. అనుకున్న పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో గంట ఎప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగులకు ఈరోజు అన్ని కలిసి వస్తాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇతరులకు వాగ్దానాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాలు బలపడతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనుల విషయంలో ఏకాగ్రత సాధించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి వీఆర్ యాత్రలకు వెళ్తారు. కొందరికి పనిపారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు బడ్జెట్ కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

మన బ్రహ్మోస్‌కు మస్తు డిమాండ్‌.. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రపంచ దేశాలు!

BrahMos Missile Demand
BrahMos Missile Demand

BrahMos Missile Demand: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్‌లోని నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడంతోపాటు పాకిస్తాన్‌ చేసిన ప్రతిదాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా భారత్‌ జరిపిన దాడులతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా భారత ఆయుధాలపై పడింది. ఆపరేషన్‌ సిందూర్‌లో మన బ్రహ్మోస్‌ మిస్సైల్‌ సమర్థవంతంగా పనిచేసింది. దీంతో అత్యాధునిక సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు విక్రయించడంలో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. సింగపూర్‌లో జరిగిన షాంగ్రి–లా డైలాగ్‌లో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ, వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే సంతకం అయిందని, ఇండోనేషియాతో చర్చలు తుది దశలో ఉన్నాయని ప్రకటించారు. ఇది భారత రక్షణ ఎగుమతుల రంగంలో కొత్త అధ్యాయం.

ఒప్పందాల పురోగతి..
వియత్నాంతో 2012 నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత ఒప్పందం ఖరారైంది. అయితే ఒప్పంద విలువ, ఎన్ని క్షిపణులు అందించాలనే వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నాయి. ఇండోనేషియాతో కూడా చర్చలు దగ్గరలో ముగిసే దశలో ఉన్నాయి. ఇంతకు ముందు 2022లో ఫిలిప్పీన్స్‌తో సంతకం చేసిన 375 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 3,100 కోట్లు) ఒప్పందం కింద మూడు బ్రహ్మోస్‌ వ్యవస్థలను అందించాల్సి ఉంది. ఇప్పటికే రెండు సెట్లు డెలివరీ అయ్యాయి. ఫిలిప్పీన్స్‌ వీటిని తన తీరప్రాంత రక్షణ కోసం మోహరించింది.ౖ

చెనా అంశంతో భారత్‌ జాగ్రత్త..
వియత్నాం–చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదం ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్‌ విక్రయం చైనా అసంతృప్తిని రేకెత్తించవచ్చని భారత్‌ గతంలో జాగ్రత్తగా వ్యవహరించింది. ఇప్పుడు ఒప్పందం ఖరారు కావడం దక్షిణ తూర్పు ఆసియాలో చైనా ప్రభావానికి వ్యతిరేకంగా భారత్‌ సక్రమమైన రణనీతిని అవలంబిస్తోందని సూచిస్తుంది.

బ్రహ్మోస్‌ క్షిపణి విశేషాలు..
భారత్‌–రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి భారతప్రదేశ్‌ బ్రహ్మపుత్ర నది, రష్యా మాస్క్వా నది పేర్లను కలిపి పెట్టారు. హైదరాబాద్‌లో తయారవుతుంది. దీని బరువు సుమారు 3 వేల కిలోలు. పొడవు సుమారు 10 మీటర్లు. దీని దాడి పరిధి 300 కిలో మీటర్లు. ఇటవల భారత సాంకేతికతతో 500 కిలోమీటర్లకు పెంచారు. గంటకు సుమారు 4 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భూమికి చాలా దగ్గరగా పయనిస్తూ రాడార్‌లకు తప్పించుకుంటుంది. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా ఛేదిస్తుంది.

అనుమతులు లేకుండా ఎగుమతి..
బ్రహ్మోస్‌ అణ్వాయుధాలను మోసుకెళ్లలేని కన్వెన్షనల్‌ క్షిపణి కాబట్టి అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు లేకుండా ఎగుమతి చేయవచ్చు. దీనిలో 85 శాతం సాంకేతికత భారత్‌ సొంతం. మిగిలిన 15 శాతం (ప్రధానంగా ఇంజిన్, కొన్ని లోహ భాగాలు) రష్యా నుంచి వస్తాయి.

భారత్‌ వైపు ప్రపంచ దేశాల మొగ్గు..
ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు బ్రహ్మోస్‌ను ఎంచుకోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇది ఇప్పటికే యుద్ధక్షేత్రంలో పరీక్షించి నిరూపించుకున్న విజయవంతమైన క్షిపణి.
పశ్చిమ దేశాలు లేదా ఇతర మేజర్‌ సరఫరాదారుల కంటే తక్కువ ఖర్చు.
భారత్‌ శిక్షణ, మోహరింపు సహాయం, స్పేర్‌ పార్ట్స్‌ను తక్కువ ధరకు లేదా ఉచితంగా అందిస్తోంది. ఈ క్షిపణిని భూమి నుంచి, నౌకలు, జలాంతర్గాములు, విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు.

పెరిగిన భారత రక్షణ ఎగుమతులు..
కొన్ని సంవత్సరాల్లో భారత రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ. 21 వేల కోట్లు, 2024–25లో రూ. 28 వేల కోట్లు, 2025–26లో రూ. 38 వేల కోట్లకు చేరాయి. 2029–30 నాటికి రూ. 50 వేల కోట్ల లక్ష్యం నిర్దేశించారు. బ్రహ్మోస్‌తో పాటు ఆకాశ్, పినాకా, డ్రోన్లు, మందుగుండు సామగ్రి వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

గతంలో ప్రభుత్వ ఏకస్వామ్యంగా ఉన్న రక్షణ రంగం ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థల సహకారంతో వేగంగా మారుతోంది. ఇది స్వావలంబన (ఆత్మనిర్భర్‌ భారత్‌) లక్ష్యానికి దోహదపడుతోంది. బ్రహ్మోస్‌ ఎగుమతులు కేవలం వ్యాపారం కాదు. చైనా ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ తూర్పు ఆసియాలో భారత్‌ తన రణనీతి, సాంకేతిక సామర్థ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తున్న సంకేతం. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా చూడడం భారత రక్షణ రంగానికి పెద్ద విజయం.

న్యూయార్క్‌లో తానా ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం..

TANA New York, Srinivasa Kalyanam

– భారీగా తరలివచ్చిన భక్తులు

TANA Sri Srinivasa Kalyanam : హిక్స్‌విల్లే, న్యూయార్క్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వంలో, తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో హిక్స్‌విల్లేలోని అసామై హిందూ టెంపుల్‌లో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విశేష భక్త జన సందోహంతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, ఈవెంట్ కోఆర్డినేటర్లు ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి తెలిపారు.

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సుమారు 500 మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో, పిట్స్‌బర్గ్ హెడ్ ప్రీస్ట్ శ్రీ వెంకటాచార్యులు, ప్రముఖ వేద పండితులు శ్రీ హనుమంతరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంప్రదాయ పద్ధతిలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి, కోశాధికారి రాజా కసుకుర్తి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ నారెపలేపు, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఓరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక, దశరథ్ తలపనేని తదితరులు హాజరై కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.

ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, న్యూయార్క్‌లో ఇంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం ఆనందదాయకమని, తానా చరిత్రలో ఇది ఒక విశిష్టమైన కార్యక్రమంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ భర్తవరపు, ప్రసాద్ కోయి మరియు న్యూయార్క్ టీమ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

మహోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించగా, రిజిస్ట్రేషన్లు మరియు ఆర్థిక సహకారం అందించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నమోదు చేసుకోలేకపోయిన భక్తులు సైతం స్వామివారి దర్శనం, ఆశీర్వాదాలు పొందడంతో పాటు ప్రసాదం స్వీకరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణతో పాటు కమ్యూనిటీ బలోపేతమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ భర్తవరపు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ భర్తవరపు, ప్రసాద్ కోయిని తానా నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.

కార్యక్రమ విజయానికి న్యూయార్క్ టీమ్ సభ్యులు దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ల, జితేంద్ర యార్లగడ్డ, ఉమా పోలిరెడ్డి, శ్రీనివాస్ పలాటి, ప్రదీప్ అరవేటి, రాజేష్ కడియాల, సునీల్ చల్లగుళ్ల, రవీంద్ర ఉప్పాల, సురేష్ మల్నీడి, కృష్ణకిషోర్ జమ్ముల, శ్రీహరి పర్ణ, కలీం మహమ్మద్, రాఘవేంద్ర మాదాల, విజయ్ కుమార్ లావు విశేషంగా కృషి చేశారు.

అలాగే తానా వాలంటీర్లు ఆశ్రిత కోయి, సమన్విత మిన్నెకంటి, గీతికా చల్ల, వరుణ్ భర్తవరపు, శరణ్ భర్తవరపు, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, శ్రీప్రియా శ్రీధర్, కావ్య మల్లేపల్లి, మజ్జి తులసీలక్ష్మి, శాన్వి కంకణాల అందించిన సేవలు కార్యక్రమ విజయానికి ప్రధాన కారణమయ్యాయి.

ప్రత్యేకంగా దైవ భక్తి గీతాలు ఆలపించిన ఆశ్రిత కోయి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టౌన్ ఆఫ్ నార్త్ హేంప్స్టీడ్ టౌన్ క్లర్క్ రాగిణి శ్రీవాస్తవ ప్రత్యేక అతిథిగా హాజరై తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ తానా న్యూయార్క్ టీమ్ తరఫున రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహోత్సవం ద్వారా తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు తానా మరోసారి తన నిబద్ధతను చాటిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

32,679 జాబ్ లు.. 28.86 లక్షల దరఖాస్తులు . . నిరుద్యోగం ఈ స్థాయిలో ఉంది మరి..

Pakistan unemployment crisis
Pakistan unemployment crisis

Unemployment in India : “ఓ చేత్తో డిగ్రీ పట్టా.. మరో చేత్తో ఖాళీ పొట్ట పట్టుకుని తిరుగుతున్నాం సార్. ఉద్యోగం ఎవడూ ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్లినా రిఫరెన్సులు అడుగుతున్నారు. ఉద్యోగం ఇవ్వకుంటే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది.. ఈ దేశం ఇలా నాశనం అవుతోంది అంటే దానికి ప్రధాన కారణం మీరే సార్. మీరు ఉద్యోగాలు ఇవ్వరు. మమ్మల్ని బతకనివ్వరు” అప్పట్లో విపరీతంగా ప్రాచుర్యం పొందిన ఓ చిత్రంలో కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఇది.

ఆ సినిమా ఇప్పటికాలానికి నిజంగా సరిపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఇప్పటి పరిస్థితి ఊహించి ఆ సినిమా తీసినట్టు కనిపిస్తోంది. ఆ సినిమాలో మాదిరిగానే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు హాహా కారాలు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు భారీగా దరఖాస్తులు చేస్తున్నారు. ఆ పోటీ ఎంతలా ఉందంటే ఒక్క ఉద్యోగానికి దాదాపు 88 మంది దరఖాస్తు చేసుకునేలా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 32,679 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు దాదాపు 28.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రకారం ఒక్కొక్క పోస్టుకు 88 మంది పోటీ పడుతున్నారు.

సోమవారం నుంచి మూడు రోజులపాటు రాధా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తండోపతండాలుగా వెళ్లిపోతున్నారు. అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రవాణా ఏర్పాటు చేయలేకపోవడంతో.. రైల్వే స్టేషన్ లు.. బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో తర్వాత పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు మొత్తం కిక్కిరిసి వెళ్ళిపోవాల్సి వస్తోంది. బస్సులు.. రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. అక్కడ జనాభా కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే నిరుద్యోగ యువతకు తగ్గట్టుగా అక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాకాల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి 88 మంది పోటీ పడుతున్నారంటే అక్కడ నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉత్తరప్రదేశ్లో కొన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పుడు కూడా ఇంతే సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు కూడా రైల్వే స్టేషన్ లు.. బస్ స్టేషన్ లు నిరుద్యోగులతో కిటకిటలాడాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది.

లీకైన హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రైవేట్ చాట్స్.. వామో.. ఈ రేంజ్ లో మాట్లాడుతుండేంటి..

Janhvi Kapoor Private Chats

Janhvi Kapoor Private Chats : భారీ అంచనాల నడుమ విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ బంపర్ హిట్ అయ్యింది. ఎక్కడ చూసినా ఆడియన్స్ ఈ సినిమాలోని రామ్ చరణ్ అద్భుతమైన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ గురించే ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పాజిటివ్ గా కాదు , నెగెటివ్ గా.. ఒక హీరోయిన్ పాత్ర పై ఈ రేంజ్ నెగెటివిటీ ఈ మధ్య కాలం లో ఈ సినిమాకు చూసినంతగా , ఏ సినిమాకు కూడా చూడలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత చెత్తగా ఆ పాత్రని డిజైన్ చేశాడు డైరెక్టర్ బుచ్చి బాబు. జాన్వీ కపూర్ అందాలను చూపిస్తూ , ఆమెని హీరోయిన్ కంటే వ్యాంప్ అనే విధంగా ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసాడు.

డైరెక్టర్ బుచ్చి బాబు పై ఈ విషయం లో సోషల్ మీడియా లో ఎలాంటి నెగెటివిటీ ఏర్పడిందో , జాన్వీ కపూర్ కి కూడా అదే రేంజ్ నెగెటివిటీ ఏర్పడింది. ఈమెని తిట్టని వాళ్లంటూ ఎవ్వరు లేరంటే అతిశయోక్తి లేదేమో. అయితే సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేసే కామెంట్స్ గురించి కాసేపు పక్కన పెడితే, సినీ సెలబ్రిటీల నుండి మాత్రం ఆమెకు మంచి సపోర్టు వస్తోంది. ఇప్పటి వరకు యాంకర్ అనసూయ , హీరోయిన్ ఆశికా రంగనాథ్, జగపతి బాబు , కంగనా రనౌత్ వంటి వారు ఈ అంశంపై స్పందించారు. ఇలాంటి నేపథ్యం లో జాన్వీ కపూర్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ చాట్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ ప్రైవేట్ చాట్ లో ఆమె ఒక వ్యక్తితో మాట్లాడిన మాటలు , సంచలనంగా మారాయి.

ఆమె మాట్లాడుతూ ‘డైరెక్టర్ కి ఈ స్థాయి అందాల ఆరబోత నాకు ఇష్టం లేదని చెప్పాను , కానీ ఆయన వినిపించుకోలేదు. రామ్ చరణ్ గారు కూడా నా ఇబ్బందిని గమనించి , డైరెక్టర్ కి అలాంటి సీన్స్ తీయొద్దని చెప్పాడు , అయినప్పటికీ డైరెక్టర్ తగ్గలేదు. నాకు రామ్ చరణ్ షూటింగ్ మొదలైన రోజు నుండి , ఎండింగ్ వరకు చాలా సపోర్ట్ గా నిలుస్తూ వచ్చాడు. ఆయనతో పని చేయడం ఒక గొప్ప అనుభూతి. నేను ఇండస్ట్రీ లో పని చేసిన వారిలో ది బెస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రామ్ చరణ్ మాత్రమే’ అంటూ ఆమె ఆ ప్రైవేట్ చాట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి , చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

'కరుప్పు' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఇండియా లోనే ఈ రేంజ్ కం బ్యాక్ మరొకటి లేదు..

Karuppu 11 Days Collections
Karuppu 11 Days Collections

Karuppu Closing Collections : కొంతమంది హీరోల కం బ్యాక్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అలా చరిత్రలో నిల్చిపోయిన కం బ్యాక్స్ లో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన పవన్ కళ్యాణ్ , ‘గబ్బర్ సింగ్’ చిత్రం తో ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి , ఆల్ టీం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఇలాంటి కం బ్యాక్ ని మళ్లీ చూడలేమని అంతా అనుకున్నారు. కానీ 14 ఏళ్ళ తర్వాత అలాంటి కం బ్యాక్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశాడు తమిళ హీరో సూర్య. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసే స్థాయికి వచ్చేసింది. ఈ సినిమా ఈ నెల 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళం , హిందీ , మలయాళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే క్లోజింగ్ లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 156 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ , విజయ్ , అజిత్ లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి.

ఇప్పుడు వాళ్ళ స్థానం లోకి చేరిపోయాడు సూర్య. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 33 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. సూర్య సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు చూసి ఎన్ని రోజులైందో. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళ రాష్ట్రం నుండి 13 కోట్లు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల రూపాయిలు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఏకంగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 308 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 148 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి దాదాపుగా 72 కోట్ల రూపాయలకు పైగానే లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది.

4వ రోజు 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాలు ఇవే.. చరిత్ర తిరగరాసిన 'పెద్ది'..

Ram Charan Fan Viral Video
Ram Charan Fan Viral Video

Peddi Movie Collections : ప్రస్తుత ఓటీటీ యుగం లో ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడమే చాలా కష్టం. ఈమధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలకు కూడా సరిగా ఓపెనింగ్ పడట్లేదు. ఓపెనింగ్స్ రావడమే గగనం అని అనుకుంటున్న సమయం లో కొన్ని కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. నాల్గవ రోజున ఏకంగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రావడం చాలా అరుదుగా మనం చూస్తుంటాము . అలాంటి అరుదైన సినిమాల గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సినది , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురించి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు నాల్గవ రోజున ఏకంగా 27 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఈ రేంజ్ షేర్ , రేపు భవిష్యత్తులో రాజమౌళి సినిమాకు రావడం కూడా కష్టమే అనుకోవచ్చు. ఆ తర్వాతి స్థానం లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘కల్కి’ చిత్రం నిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు నాల్గవ రోజున 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం లో రీసెంట్ గా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం నిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి నాల్గవ రోజున 20 కోట్ల క్లబ్ లోకి చేరిన ఏకైక మూడు సినిమాలు ఇవే. ‘పెద్ది ‘ చిత్రానికి నాల్గవ రోజున నైజాం ప్రాంతం లో వచ్చిన వసూళ్లు , రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ చేంజర్ ‘ కి మొదటి రోజు కూడా రాలేదు. దీనిని బట్టీ ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఏకంగా 100 కథలను రిజెక్ట్ చేసిన మెగా హీరో వైష్ణవ్ తేజ్.. చివరికి ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్..

Panja Vaisshnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ హీరో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకొని , ఇండస్ట్రీ లో మంచి స్థానం లో కొనసాగుతున్నారు. ఒక్క అల్లు శిరీష్ మాత్రమే ఇండస్ట్రీ లో సక్సెస్ సాధించలేకపోయారు. చివరికి ‘ఉప్పెన’ తో ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా బంపర్ హిట్ కొట్టాడు. ఆయన మొదటి చిత్రం ‘ఉప్పెన’ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కెరీర్ రాబోయే రోజుల్లో పీక్ రేంజ్ కి వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని , దిక్కులేని స్థితికి వెళ్ళిపోయాడు.

ఈయనతో పాటు ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలు , ఈయన తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలు కూడా వరుస విజయాలను అందుకుంటూ మార్కెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ కి అలాంటి పరిస్థితి లేదు. ‘ఉప్పెన’ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘రంగ రంగ వైభవంగా’, ‘కొండపోలం’, ‘ఆదికేశవ’ వంటి సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ సినిమాలు ఎప్పుడు విడుదలైందో , ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఆడియన్స్ కి తెలీదు , కనీసం మెగా హీరోలు కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేదు. అలాంటి సినిమాలు చేశాడు. ఆయన చివరి చిత్రం ‘ఆదికేశవ’ 2023 వ సంవత్సరం లో విడుదలైంది. అంటే దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల చేయకపోవడం తో వైష్ణవ్ తేజ్ సినిమాలను ఆపేశాడా అనే అనుమానం అందరిలో కలిగింది.

కానీ ఆయన ఈ మోడీల్లాలో సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడట. దాదాపుగా ఆయన 100 కథలను ఈ మూడేళ్ళలో రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి కొడితే ‘ఉప్పెన’ ని మించిన హిట్ కొట్టాలని పంజా వైష్ణవ్ తేజ్ ఫిక్స్ అయ్యాడు. అందుకే కథ ఎంపిక విషయం లో ఇంతటి జాప్యం జరిగింది. ఎట్టకేలకు రీసెంట్ గానే ఆయన ఒక కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ మహేష్ రీసెంట్ గానే వైష్ణవ్ తేజ్ ని కలిసి ఒక కథ వినిపించాడట. ఈ కథ వైష్ణవ్ తేజ్ కి పిచ్చి పిచ్చిగా నచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

తానా వేసవి క్రీడా సంబరాలకు ఘన శ్రీకారం

TANA Pickleball Tournament

చార్లెట్‌లో పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు విశేష స్పందన.. 65కిపైగా జట్లు పోటీ

TANA Pickleball Tournament : చార్లెట్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు కమ్యూనిటీ కోసం సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ముందంజలో నిలుస్తోంది. వేసవి సీజన్ ప్రారంభం సందర్భంగా తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవాలకు భారీ స్పందన లభిస్తోంది. అందులో భాగంగా జూన్ 6న నార్త్ కరోలినాలోని కన్నపోలిస్ నగరంలో ఉన్న కరోలినా పికిల్‌బాల్ క్లబ్ వేదికగా నిర్వహించిన తానా పికిల్‌బాల్ టోర్నమెంట్ అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

తెలుగు కమ్యూనిటీలో పికిల్‌బాల్ క్రీడను ప్రోత్సహించడం

లో తానా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్నేళ్ల క్రితమే ఈ క్రీడను తెలుగు సంఘాలకు పరిచయం చేసిన ఘనత కూడా తానాదే. అప్పటి నుంచి పికిల్‌బాల్ పట్ల ఆసక్తి క్రమంగా పెరుగుతూ వస్తుండగా, ఈసారి నిర్వహించిన టోర్నమెంట్‌లో మహిళలు, పురుషులు, యువతతో పాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

వివిధ విభాగాల్లో హోరాహోరీ పోటీలు

టోర్నమెంట్‌లో బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్‌డ్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 65కుపైగా జట్లు పాల్గొనడంతో ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఆటగాళ్ల నైపుణ్యం, పోటీ స్ఫూర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నిర్వాహకులకు తానా నాయకత్వం అభినందనలు

ఈ మెగా క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆటగాళ్లు, వాలంటీర్లు, నిర్వాహక బృందాన్ని తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు కమ్యూనిటీ ఆరోగ్యకర జీవనశైలికి, పరస్పర సత్సంబంధాల బలోపేతానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

రవి (నాని) వడ్లమూడి నేతృత్వంలో విజయవంతమైన నిర్వహణ

తానా అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్ రవి (నాని) వడ్లమూడి నేతృత్వంలో టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. చార్లెట్ పికిల్‌బాల్ టీమ్ సభ్యులు తారక్ పూడి, కార్తీక్ పాండ్రా, పవన్ పెట్టంబరం వెంకట, తానా స్పోర్ట్స్ చైర్ దినేష్ దొంగ తదితరులు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

అలాగే స్థానిక తానా నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, అన్నే రమణ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేశారు.

ఆర్థిక సమన్వయంలో ట్రెజరర్ రాజా కసుకుర్తి సేవలు

టోర్నమెంట్ నిర్వహణలో తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి అందించిన సహకారం విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చెల్లింపుల పర్యవేక్షణ, ఆర్థిక వ్యవహారాల సమన్వయం వంటి అంశాలను క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా కార్యక్రమం విజయవంతం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

విజేతలకు ఘన సత్కారం

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు, రన్నరప్ జట్లకు ముగింపు కార్యక్రమంలో ట్రోఫీలు అందజేసి సత్కరించారు. ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ తానా నాయకత్వం వారికి అభినందనలు తెలిపింది.

 

స్పాన్సర్లకు కృతజ్ఞతలు

ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో సహకరించిన నవాబీ హైదరాబాద్ హౌస్, కోల్డ్‌వెల్ బ్యాంకర్ రియల్టీ – రఘు వేమూరి, ట్యుటెలరీ ఇంక్ సంస్థలకు తానా నాయకత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

మరిన్ని క్రీడా పోటీలకు తానా సన్నాహాలు

వేసవి కాలంలో తెలుగు కమ్యూనిటీని మరింతగా క్రీడల వైపు ఆకర్షించే లక్ష్యంతో తానా మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించనుంది. రాబోయే రోజుల్లో బ్యాడ్మింటన్, క్రికెట్, పురుషుల మరియు మహిళల వాలీబాల్, కిడ్స్ స్పోర్ట్స్, ఐపీఎల్ స్టైల్ వాలీబాల్, త్రోబాల్ వంటి పోటీలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు కమ్యూనిటీలో ఆరోగ్యం, ఐక్యత, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా తానా చేపడుతున్న ఈ కార్యక్రమాలు సభ్యుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.

ఇంత మంచి రోహిత్ మీద గంభీర్ కక్ష కట్టాడా.. వైరల్ వీడియో

Rohit Sharma Coach, Dinesh Lad

Rohit Sharma Viral Video : ధోని తర్వాత టీమిండియాలో అంతటి ప్రభావాన్ని చూపించిన నాయకుడు రోహిత్ శర్మ.. టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా టీమ్ ఇండియాను తీసుకెళ్లాడు. భారత జట్టుకు చాంపియన్ ట్రోఫీ అందించాడు. రోహిత్ శర్మ ఎలాంటి ఫార్మాట్లోనైనా అద్భుతంగా ఆడగలడు. అందువల్లే అతడిని ప్రమాదకర ఆటగాడు అని పిలుస్తారు.

టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఒత్తిడి.. గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన ఒత్తిడి.. వల్ల అతడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఎవరు అంచనా వేయకుండానే.. ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండానే అతడు జట్టు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకోవడం చాలామంది అభిమానులకు రుచించలేదు. చాలామంది అభిమానులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికీ గౌతమ్ గంభీర్ ను రోహిత్ అభిమానులు ఏమాత్రం సహించడం లేదు. అతడు కనిపిస్తే చాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గౌతమ్ గంభీర్ ఎందుకు రోహిత్ ను పక్కన పెట్టాడు.. జట్టు నుంచి ఎందుకు వెళ్లిపోయేలా చేశాడు.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.. తను వెళ్లిపోవడానికి అధికారికంగా గౌతమ్ గంభీర్ కారణమని ఇంతవరకు రోహిత్ చెప్పలేదు. అయితే పెద్దల విషయంలో.. తనకు కోచింగ్ ఇచ్చిన వారి విషయంలో రోహిత్ ఎంతో మర్యాదగా ఉంటాడు. ఆ మధ్య తన పేరు మీద ముంబై మైదానంలో స్టాండ్ ఏర్పాటు చేసినప్పుడు.. తనకు శిక్షణ ఇచ్చిన వారిని అభినందించాడు. ఆ సమావేశంలో వారందరిని తలుచుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ముంబై t20 లీగ్ లో కూడా రోహిత్ తన శిక్షణ ఇచ్చిన చిన్ననాటి కోచ్ ను ప్రేమను చూపించాడు. అంతేకాదు అతని పాదాల మీద పడి నమస్కరించాడు.

రోహిత్ శర్మకు కు చిన్నతనంలో దినేష్ ల్యాడ్ అనే వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. అతడి నేతృత్వంలో రోహిత్ రాటు తేలాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంలో దినేష్ పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాలలో రోహిత్ బయటపెట్టాడు. తాజాగా ముంబై t20 లీగ్ చూసేందుకు రోహిత్ వాంఖడే స్టేడియానికి వెళ్ళాడు. స్టేడియం వెళ్తుండగా దినేష్ తన సతీమణితో కనిపించాడు. ఆయనను చూసిన రోహిత్ వెంటనే కాళ్ళ మీద పడి నమస్కరించాడు. అతడిని చూసి ఆనంద పరవశుడయ్యాడు. తన దగ్గర శిక్షణ పొందిన రోహిత్ ఈ స్థాయిలో ఎదగడం పట్ల దినేష్ హర్షం వ్యక్తం చేశాడు.

చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ లాంటి కోట.. రామోజీరావు ఆలోచన అలా ఉంటుంది మరి..

Ramoji Rao Death Anniversary

Ramoji Rao Death Anniversary : ఈరోజు రామోజీరావు వర్ధంతి.. సహజంగానే తెలుగు పత్రికా రంగంలో ఎన్నో రకాల మార్పులకు.. సంచలనాలకు ఆయన కారణం. ఎక్కడో ఖమ్మంలో చిన్నపాటి ఫెర్టిలైజర్ షాపు పెట్టిన అతను.. ఈరోజు వేలకోట్లు సంపాదించాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంపాదన అక్రమమా.. సక్రమమా అనే విషయాన్నీ పక్కన పెడితే.. పేపర్, పచ్చళ్ళు, సినిమాలు, హోటళ్లు, చానెళ్ళు .. ఆయన అడుగుపెట్టని రంగం అంటూ లేదు. చేయని వ్యాపారం అంటూ లేదు. లాభాలు వచ్చాయి.. నష్టాలు కూడా పలకరించాయి. అయినప్పటికీ రామోజీరావు వెనుకడుగు వేయలేదు. వెనకడుగు వేస్తే ఆయన రామోజీరావు ఎందుకు అవుతారు.

మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన ఇబ్బందులు.. రాజశేఖర్ రెడ్డి చూపించిన చుక్కలు.. ఆ స్థానంలో మరొకరు ఉంటే చేతులు జోడించి వెళ్లిపోయేవారు. నాటి రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వ్యక్తిత్వం అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతోనే రాజశేఖర్ రెడ్డికి చెప్పించాడు అంటే రామోజీరావు గుండె ధైర్యం ఎంతటిదో వివరించాల్సిన అవసరం లేదు. అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో కమ్యూనిస్టులు ధర్నాలు చేస్తుంటే.. తన రామోజీ ఫిలిం సిటీ అక్రమం అని ఆరోపణలు చేస్తుంటే.. వారి మూతులకు గట్టి బిరడా బిగించాడు. అంతటి సాహసి రామోజీరావు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో చెరువులు ఆక్రమించారని.. అసైన్డ్ భూముల్లో ఫిలిం సిటీ కట్టారని.. ఆ భూములు మొత్తం పేదలకు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. అధికారులను పంపించారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రామోజీ ఫిలిం సిటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సాక్షి ఎన్నో రాతలు రాసినప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ఇటుక కూడా ఊడిపోలేదు.. అంతటి సౌధాలు నిర్మించుకున్నాడు.. వ్యాపార సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు రామోజీ.

“వార్త” పత్రికను తొక్కిపెట్టాడు. తనకు నచ్చని దాసరి నారాయణరావు ఉదయాన్ని చీకట్లో కలిపేశాడు. తనకంటూ పోటీ లేకుండా చేసుకున్నాడు. తను నిత్యం వ్యాపారం మాత్రమే చూస్తాడు. అందులో సెంటిమెంట్ కలిపి దర్జాగా వెనకేసుకుంటాడు. లేకపోతే తుఫాన్ సమయంలో విమానాలలో పత్రికను సరఫరా చేయడమేంటి.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తన ఈనాడు పత్రికను సమయానికి పంపించడమేంటి.. పని చేయించుకునే విషయంలో.. డబ్బులు సమయానికి చెల్లించే విషయంలో.. రామోజీరావు ఓ రాక్షసుడు. ఈ మాట ఆయనతో పని చేసిన వారు ఇప్పటికీ అంటూనే ఉంటారు. గజ్జల మల్లారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి నాగేశ్వరరావు, డిఎన్ రావు వరకు.. అతడు స్నేహం సాగించాడు. ఆ స్నేహంలోనే పనిని మరింత ముందుకు తీసుకెళ్లాడు.

నేడు రామోజీరావు వర్ధంతి. అతడు విలువల సవ్యసాచి కాకపోవచ్చు. సక్రమంగా వ్యాపారం సాగించిన బిజినెస్మెన్ కాకపోవచ్చు.. కానీ వేలాది మందికి ఉపాధి కల్పించాడు. లక్షల మందికి పరోక్షంగా భరోసా ఇచ్చాడు. అతడి కోటను చూస్తే.. అచ్చం కేజీఎఫ్ సినిమాలో సౌధం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కోటలో రామోజీరావు కచ్చితంగా ఉండే ఉంటాడు. కాకపోతే భౌతికంగా లేడు కాబట్టి.. మానవమాత్రులకు కనిపించడు. ఎందుకంటే రామోజీరావు ఇప్పుడు మనిషి కాదు.. తాను నిర్మించిన వేలకోట్లకు కనిపించని అధిపతి. అన్నిటికంటే ముఖ్యంగా బతికున్నప్పుడే తనకంటూ సమాధిని నిర్మించుకున్న స్థపతి.