Home Blog Page 166

నెహ్రూను దాటేస్తాడంతే.. మోడీతో అట్లుంటదీ మరీ

Modi India GDP Growth
Modi India GDP Growth

Narendra Modi surpasses Nehru: పదవిలో నిరంతరంగా ఉండటం ఒక నాయకుడి సామర్థ్యమని కొందరు అంటారు. మరికొందరు అది ప్రజాస్వామ్యానికి విఘాతం అంటారు. నరేంద్ర మోదీ 2014లో మొదట బాధ్యతల్ని స్వీకరించినప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ జవహర్‌లాల్‌ నెహ్రూను దాటి దేశంలో ఎక్కువకాలం ఎన్నికై ప్రధాని ఉన్న రికార్డును తమ ఖాతాలో పెట్టుకోబోతున్నారు. గణాంకంగా ఇది ఒక సాధారణ విషయం కాదు. పాలనా సమర్థతపై, ప్రజాప్రతినిధ్యంపైన తీవ్రమైన చర్చలకు స్పందన. ఒకవైపు, స్థిరత్వం లభించడం నిర్దిష్ట విధానాలను కొనసాగించడానికి సౌకర్యం ఇస్తుంది.

కేంద్రం విధానాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానాలు, స్నేహపూర్వక సంక్షేమ పథకాలు, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలు నిరంతర ప్రత్యేక పథకాల రూపంలో కొనసాగుతున్నాయి. ఈ పథకాలను విజయాలుగా చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించటం స్వభావికం. ముఖ్యంగా గ్రామీణ, నిర్లక్ష్యమైన వర్గాలకు చేరే ప్రభావం ఉంటే ఇదే ప్రభుత్వ వైఖరికి శక్తివంతంగా మారుస్తుంది. కానీ దీర్ఘ పాలనకు ప్రతికూలమైన పాక్షికతలను నిర్లక్ష్యం చేయరాదు. మరో ముఖ్య అంశం మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నిర్వహించిన వ్యవహారాలు, తరువాత అదే పాలసీని అన్వయించడం దేశ ప్రజలను ఆకట్టుకుంది.

నెహ్రూతో పోలిక…
జవహర్‌లాల్‌ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా కొనసాగారు. మొత్తం 6,130 రోజులు పాలించారు. 1947 ఆగస్టు 15న ఆయన ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని కాదు. 1952, మే 13న జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యారు. మొత్తం 6,130 రోజులు పాలించారు. అయితే ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగు కానుంది. మోదీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి రికార్డు సృష్టించబోతున్నారు. నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా 4,398 రోజులు పాలించారు. మోదీ దానిని అధిగమించనున్నారు. 4,399 రోజులు జూన్‌ 10న పూర్తిచేసుకుంటారు. దీంతో నెహ్రూ రెండో స్థానానికి పడిపోతారు. మూడో స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పాలన సాగించారు.

ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం..
నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పనిచేసిన రికార్డును ఇప్పటికే సొంతం చేసుకున్నారు. సిక్కిం సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ 8,930 రోజులు ప్రభుత్వాధినేతగా పనిచేయగా, మోదీ ఈ ఏడాది మార్చిలోనే దానిని అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్‌ సీఎంగా మోదీ పనిచేశారు.

మొత్తంగా నరేంద్రమోదీ జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును చెరిపేశారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. దటీజ్‌ మోదీ అనిపించుకున్నారు.

రాజకీయ క్రీడ.. దారి తప్పుతున్న యువత!

Cockroach Janata Party youth politics
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party youth politics: ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న కొన్ని నిరసన కార్యక్రమాలు యువత మానసిక స్థితిని, రాజకీయ ఉద్దేశాలను, దేశ భద్రతను ఒకేసారి ప్రశ్నించేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘‘కాక్రోచ్‌ జనతా పార్టీ’’ పేరుతో వచ్చిన ఈ ఉద్యమం సామాజిక మాధ్యమాల్లో హైప్‌ సృష్టించినప్పటికీ, నిజం పరీక్షలో తేలిపోయింది. జెన్‌జీ యువతలో మానసిక వృద్ధాప్యం, గుర్తింపు సంక్షోభం ఈ నిరసనల్లో పాల్గొన్న యువకులు తాము ఎందుకు రంగంలోకి దిగారో స్పష్టంగా తెలియని పరిస్థితి కనిపించింది. కర్రలు, పెప్పర్‌ స్ప్రేలు తీసుకుని వచ్చి ‘‘కొట్టండి, తిరగబడండి, నరకండి’’ వంటి పిలుపులు ఇవ్వడం హింసా వైఖరిని ప్రతిబింబిస్తోంది. ఇది గుర్తింపు కోసం చేసే ఉద్యమం కాదు, మానసిక అపరిపక్వత వల్ల ఏర్పడిన ఆందోళనగా కనిపిస్తోంది. యువత తమ నిరాశలను, ఉద్యోగాలు, విద్యా వ్యవస్థ సమస్యలను రాజకీయ శక్తులు తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించుకుంటున్నారు.

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన..
నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు లక్షలాది మంది వస్తారని ప్రకటించినప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే ఉండటం ఆయోజకుల తప్పిదాన్ని బయటపెట్టింది. సోషల్‌ మీడియా హైప్‌తో ప్రారంభమైన ఉద్యమం ఆఫ్‌లైన్‌లో తేలిపోవడం ఈ నాటకం పరిమితులను చూపించింది. ఇది నిజమైన ఉద్యమం కాదని, తప్పుడు ప్రచారం ద్వారా యువతను ఆకర్షించి రాజకీయ లాభం కోసం వాడుకోవాలనే ప్రయత్నమని స్పష్టమవుతోంది.

రాజకీయ ఆయుధంగా నీట్‌..
నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలను సమస్యగా చూడాలి, కానీ దాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించడం సరైన విధానం కాదు. కాక్రోచ్‌ జనతా పార్టీ ఈ సమస్యను రాజకీయీకరణ చేసి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యా వ్యవస్థ సంస్కరణ కోసం నిర్మాణాత్మక చర్చలు చేయాల్సిన చోట, హింసాత్మక నినాదాలు, దేశ వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడం యువత భవిష్యత్తును దెబ్బతీస్తోంది.

విదేశీ సహకారంతో దేశ ద్రోహ కార్యకలాపాలు..
కాక్రోచ్‌ జనతా పార్టీ కార్యక్రమాల వెనుక పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల సహకారం ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరగడం ఎవరికీ మంచిది కాదు. చైనాలో ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటారు. కానీ భారతదేశంలో వామపక్ష, కాంగ్రెస్‌ భావజాలం ఉన్నవారు దేశ భావన ఉన్నవారిపై తిరగబడుతున్నారు. జాతీయవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసనలపై దేశభక్తులు తమ నిరసన తెలుపుతున్నారు.

యువ శక్తి నిర్వీర్యం..
తప్పుడు ప్రచారం, మోసాల ద్వారా యువతను రాజకీయ ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. ఇలాంటి ఉద్యమాలు దీర్ఘకాలికంగా యువతలో నిరాశ, విద్వేషాలను మాత్రమే పెంచుతాయి తప్ప, నిజమైన సమస్యలకు పరిష్కారం ఇవ్వవు. విశ్లేషకులు చెబుతున్నట్లు, యువత ఇప్పుడు సరైన మార్గదర్శకత్వం, నిజాయితీ ఉన్న నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది.

నిరసనలు ప్రజాస్వామ్య హక్కు, కానీ దాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలు, హింస, తప్పుడు ప్రచారం కోసం ఉపయోగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కాక్రోచ్‌ జనతా పార్టీ వంటి ఉద్యమాలు యువతను మేల్కొల్పడం కాదు, మరింత గందరగోళంలోకి నెట్టడమే. యువత తమ శక్తిని నిర్మాణాత్మక దిశగా మళ్లించుకోవాలి. దేశం అభివృద్ధి చెందాలంటే, యువతను రాజకీయ మోసాల నుంచి రక్షించడం అందరి బాధ్యత.

బరువులు మోసుకెళ్లడానికి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టాప్ 5 ఇవే..

Best Electric Scooters For Carrying Loads
Best Electric Scooters For Carrying Loads

Best Electric Scooters For Carrying Loads: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ఉద్యోగులతో పాటు వ్యాపారులు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కిరాణం షాపు ఉన్న వారితో పాటు ఇతర సామాగ్రిని తరలించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ తో పాటు ఇతర అవసరాలు తీరడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమయంలో వీరు ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే బెటర్ అన్న సందేహం వస్తుంది. మంచి స్టోరేజ్ స్పేస్, బలమైన లోడ్ సామర్థ్యం, ఎక్కువ రేంజ్ వంటి లక్షణాలతో కొన్ని మోడళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి వివరాల్లోకి వెళితె..

1. Ather Rizta :
అథర్ రిజ్టా ప్రధానంగా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఈ స్కూటర్‌లో సీటు కింద సుమారు 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అదనంగా ఫ్రంట్ స్టోరేజ్ ఎంపిక కూడా ఉండటంతో కూరగాయలు, కిరాణా వస్తువులు, చిన్న బ్యాగులను సులభంగా ఉంచుకోవచ్చు. విశాలమైన సీటింగ్ కారణంగా ఇద్దరు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. రేంజ్ కూడా బాగుండటంతో నగర ప్రయాణాలకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. భారత మార్కెట్లో అథర్ రిజ్టా ధర సుమారు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

2. River Indie:
రివర్ ఇండీని చాలామంది ‘స్కూటర్లలో ఎస్‌యూవీ’ అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం భారీ స్టోరేజ్ సామర్థ్యం. ఈ స్కూటర్‌లో ముందు భాగంలో లాక్ చేయగలిగే గ్లోవ్ బాక్స్‌లు, పెద్ద ఫుట్‌బోర్డ్, సీటు కింద స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద 40 లీటర్లకు పైగా సామాను ఉంచుకునే అవకాశం ఉంటుంది. కిరాణా షాపింగ్ చేసే వారికి ఇది అత్యంత అనుకూలమైన మోడళ్లలో ఒకటిగా భావిస్తారు. దీని ధర సుమారు రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.

3. Bajaj Chetak 3501:
బజాజ్ చేతక్ 3501 ప్రీమియం మెటల్ బాడీ, బలమైన నిర్మాణ నాణ్యతతో ఆకట్టుకుంటుంది. సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ ఉండటంతో రోజువారీ సరుకులు, కార్యాలయ బ్యాగులు లేదా కిరాణా సామగ్రిని తీసుకెళ్లడం సులభం. స్థిరమైన రైడింగ్ అనుభవం, విశ్వసనీయత కారణంగా కుటుంబ వినియోగదారులు ఈ మోడల్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ఉంటుంది.

4. Ola S1 Pro ప్లస్:
ఓలా S1 Pro+ అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరుతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. పెద్ద సీటు కింద స్టోరేజ్, ఎక్కువ రేంజ్, వేగవంతమైన యాక్సిలరేషన్ దీని ప్రధాన ఆకర్షణలు. రోజువారీ ప్రయాణాలతో పాటు సూపర్ మార్కెట్ షాపింగ్ చేసినప్పుడు తీసుకొచ్చే బ్యాగులను సులభంగా ఉంచుకోవచ్చు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ స్కూటర్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఉండవచ్చు.

5. TVS Orbiter:
టీవీఎస్ ఆర్బిటర్ ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న మోడల్ కాకపోయినా, భారీ లోడ్ సామర్థ్యం మరియు యుటిలిటీ ఆధారిత డిజైన్‌తో చర్చనీయాంశమైంది. పెద్ద ఫుట్‌బోర్డ్, అదనపు లగేజ్ స్పేస్ వంటి లక్షణాలతో కిరాణా సరుకులు లేదా డెలివరీ అవసరాలకు అనుకూలంగా రూపొందించే దిశగా అభివృద్ధి జరుగుతోంది. అందుబాటు మరియు ధర ప్రాంతానుసారం మారవచ్చు.

బొత్స వారసులకు అంత ఈజీ కాదు!

Botsa Family Politics Vizianagaram
Botsa Family Politics Vizianagaram

Botsa Family Politics Vizianagaram: రాజకీయాల్లో కొన్ని కుటుంబాలకు కొన్ని ప్రాంతాలు ప్రత్యేకం. అక్కడ దశాబ్దాలుగా కుటుంబాలు రాజకీయం చేస్తాయి. ఉత్తరాంధ్రలో ఈ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళంలో అయితే ధర్మాన, కింజరాపు కుటుంబాలు హవాను చాటుకుంటాయి. విజయనగరానికి వచ్చేసరికి బొత్స వర్సెస్ పూసపాటి రాజ కుటుంబాల మధ్య గట్టి వైరం ఉంటూ వస్తోంది. విశాఖలో పేరు మోసిన కుటుంబాలు రాజకీయం చేస్తూ వస్తున్నాయి. అయితే మునుపటి మాదిరిగా కుటుంబ వారసులు రాజకీయం చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ కోవలోకి వస్తుంది బొత్స ఫ్యామిలీ. విజయనగరం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బొత్స. ఆయన ఒక్కరే కాదు కుటుంబమంతా రాజకీయాలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రెండో తరం రెడీ అవుతోంది.

* అంతటా బొత్స హవా..
విజయనగరం జిల్లా అంటేనే బొత్స హవా ఉంటుంది అనేది ఒక కామెంట్. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గెలిచారు. ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నుంచి.. మరో సమీప బంధువు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి… మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గాను పదవి బాధ్యతలు చేపట్టారు. మిగతా నియోజకవర్గాల్లో తన మనుషులను మాత్రమే పెట్టుకుని గెలిపించుకునేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం తనతో పాటు కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. తాను నిలబెట్టిన నేతలు సైతం ఓటమి చవి చూశారు. పైగా ఇప్పుడు టిడిపి కూటమి పట్టు బిగిస్తోంది. ఇటువంటి తరుణంలో బొత్స ఫ్యామిలీ మునుపటిలా రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఈ సమయంలో బొత్స తన ఇద్దరు పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం నిజంగా సాహసమే.

* ఆ రాజకీయం కుదరదు..
ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. విజయనగరం జిల్లాలో మాత్రం బొత్స ఫ్యామిలీ హవా ఉండేది. ఎందుకంటే అధికార యంత్రాంగంలో బొత్స మనుషులు ఉండేవారు. ప్రత్యర్థి పార్టీల్లో సైతం బొత్స అభిమానులు మెలిగే వారు. బొత్స ఫ్యామిలీ పొలిటికల్ గా ఇంతలా ప్రభావం చూపడానికి అదే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ రాజకీయాలు చేసే అశోక్ గజపతిరాజు ఇప్పుడు లేరు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కిమిడి నాగార్జున వంటి నాయకులు వచ్చారు తెరపైకి. విజయనగరం జిల్లా అంతా లోకేష్ పర్యవేక్షణలో ఉంది. ఇటువంటి సమయంలో బొత్స వారసులు రంగంలోకి దిగడం చూస్తుంటే సరైనదేనా అనే చర్చ మొదలవుతోంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మాదిరిగా వారి పిల్లలు రాజకీయం చేస్తామంటే కుదరదు. కేవలం ప్రజాబలాన్ని మాత్రమే నమ్ముకోవాలి. ప్రజలు అవకాశం ఇస్తే తప్ప.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలను.. యంత్రాంగం మద్దతు దక్కే అవకాశం లేదు. గతంలో బొత్స తన కుటుంబ సభ్యులను రాజకీయానికి పరిచయం చేస్తే విజయం నల్లేరు మీద నడక లా ఉండేది. ఇప్పుడు మాత్రం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే బొత్స వారసులు రాజకీయాల్లో ఎంతవరకు రాణిస్తారు అనేది ఒక అనుమానమే.

ప్రాణం ఇచ్చే వారి కంటే.. జైలుకు వెళ్లే వారికి జగన్ అండ!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఒక వింత వైఖరి కనిపిస్తుంది. పార్టీ కోసం ప్రాణాలు అర్పించే నాయకులను, కార్యకర్తలను ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ అవినీతి చేసే నాయకుల విషయంలో మాత్రం చాలా ఆసక్తి కనబరుస్తారు. అటువంటివారు జైలుకు వెళ్తే వెళ్లి పరామర్శిస్తారు. కేసులకు గురైతే సంఘీభావం తెలుపుతారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో అలానే చేశారు. హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు బ్రహ్మ నాయుడు. తెలంగాణ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా బ్రహ్మానాయుడును పరామర్శించారు. నేను ఉన్నాను అంటూ ఆయన కుమారుడికి భరోసా ఇచ్చారు.

* సహాయం కోసం ఎదురుచూసి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది కష్టాల్లో ఉన్నారు. కొందరైతే అత్యవసర, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అటువంటి వారి గురించి అస్సలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి.. ఎవరైనా దూకుడుగా వ్యవహరించి రాజకీయ ప్రత్యర్థులను తిట్టినా.. అవినీతి కేసుల్లో జైలు పాలు అయినా.. కేసులు ఎదుర్కొంటున్నా చాలా సానుభూతి చూపుతారు. వారిని పరామర్శిస్తారు. తమ పార్టీ వకీలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో న్యాయసహాయం ఇప్పిస్తారు. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడుకు, ఆయన కుటుంబానికి అదే భరోసా ఇచ్చారు జగన్.

* కుమారుడికి పరామర్శ..
చాలా రోజులపాటు పరారీలో ఉన్న బ్రహ్మనాయుడు… తమిళనాడు కాంచీపురంలో తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే బ్రహ్మనాయుడు చేసింది తప్పు పని. ఆపై ప్రభుత్వ భూమికే అసరు పెట్టి వెయ్యికోట్ల ఆస్తులను కొల్లగొట్టాలని చూసారు. అది జగన్మోహన్ రెడ్డికి మంచి పనిగా కనిపించినట్టు ఉంది. అందుకే బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు గిరికి ఫోన్ చేసి.. ఏం కాదులే.. ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చిన క్రీడాకారుల మాదిరిగా అభినందనలు తెలిపినట్టు కనిపించారు. ఎంత పెద్ద స్కాం చేస్తే వైసీపీలో అంత గుర్తింపు అన్న మాదిరిగా జగన్ వ్యవహార శైలి ఉంది. కష్టపడి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తకు పలకరించరు కానీ.. ఇలాంటి అవినీతి చేసే బ్రహ్మానాయుడు లాంటి వారికి మాత్రం భరోసా ఇస్తున్నారు అంటూ నిజమైన కార్యకర్త బాధపడుతున్నారు. ఇలాంటివి పార్టీకి చేటు అని తెలిసిన అధినేత అదే పనిగా చేస్తుండడంపై కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎవరైనా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ప్రజల్లో ప్రతికూలత వచ్చిన అంశాలకు దూరంగా ఉంటారు. కానీ జగన్ అలా మాత్రం కాదు. నలుగురు వెళ్లే రూట్లో ఆయన వెళ్ళరు. ఎందుకంటే ఆయన రూటు సెపరేటు అన్నమాట.

'అమరావతి ఐ'.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!

Amaravati Eye Project
Amaravati Eye Project

Amaravati Eye Project: అమరావతి కేవలం ఏపీ రాజధాని మాత్రమే కాదు. ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు సర్కార్ ప్రణాళిక. కేవలం పాలనాపరమైన పనుల మీద మాత్రమే ప్రజలు రాకూడదు. పర్యాటక రంగంగా కూడా అమరావతిని చూడాలన్నది ఒక ఆలోచన. ఉమ్మడి ఏపీలోనైనా.. ఇప్పుడైనా హైదరాబాదుకు వెళ్లేవారు ఒక్క ప్రభుత్వ పని మీద కాదు. రకరకాల కారణాలతో వెళుతుంటారు. ముఖ్యంగా భాగ్యనగరంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా వెళ్లిన వారు కూడా ఉంటారు. అటువంటి పరిస్థితి అమరావతికి కల్పించాలన్నది చంద్రబాబు సర్కార్ ఆలోచన. బ్రిటన్ రాజధాని లండన్ లోని థేమ్స్ నది ఒడ్డుగా పర్యాటకులకు విశేషంగా ఆకర్షించే ప్రపంచ ప్రఖ్యాత లండన్ ఐ తరహాలోనే.. ఏపీ ప్రభుత్వం అమరావతి ఐ పేరుతో ఒక భారీ అబ్జర్వేషన్ వీల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీంట్లో ఈ ప్రతిష్టాత్మక టూరిజం ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడింది.

కృష్ణా నదికి ఆభరణంగా..
అమరావతికి కృష్ణా నది ఆభరణం. నది ఫ్రంట్ లైన్ లో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత వైభవంగా అమరావతి ఐ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ భారీ వినోద కేంద్రాన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో.. నిర్మించేందుకు ప్రైవేటు భాగస్వామ్యుల నుంచి కాంపిటేటివ్ టెండర్లు, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ఆహ్వానించేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ, నిర్వహణ సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజు వ్యవధిని ప్రభుత్వం ఖరారు చేసింది.
* కృష్ణా నది ఒడ్డున నిర్మితంకానున్న ఈ ప్రాజెక్టులో అన్ని ప్రత్యేకమే. ఒక భారీ అబ్జర్వేషన్ వీల్ ఉంటుంది. ఇందులో సురక్షితమైన, అత్యాధునిక గ్లాస్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ చక్రం చాలా నెమ్మదిగా, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. పర్యాటకులు ఈ క్యాబిన్ లలో కూర్చుని.. ఆకాశమార్గంలోకి పైకి వెళ్లే కొద్ది.. కింద ప్రవహించే కృష్ణానది సుందర దృశ్యాలు, పచ్చని ప్రకృతి పరిసరాలు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు.
* లండన్ వెళ్లేవారు తప్పకుండా లండన్ ఐ ని చూసి వస్తారు. అందుకే ఏపీకి వచ్చే పర్యాటకులకు కూడా ఆ మధురానుభూతి అందించేందుకు అమరావతి ఐ నీ ఒక ల్యాండ్ మార్క్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
* కేవలం పర్యాటకంగానే కాదు .. ఈ ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పుంజుకుంటుంది. పర్యాటకంగా ఈ ప్రాంతం గ్లోబల్ హబ్ గా మారుతుంది.

వైసీపీకి ఆ కుటుంబం గుడ్ బై!

Mekapati Family Quits YSRCP
Mekapati Family Quits YSRCP

Mekapati Family Quits YSRCP: ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగింది మేకపాటి కుటుంబం. కానీ ప్రస్తుతం రాజకీయంగా దాదాపు కనుమరుగైనట్టే. ఎందుకంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారంతో బాధపడుతున్నారు. ఆయన కుమారులు రాజకీయం కంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి సైతం టిడిపిలో ఉన్నారు. కానీ అంతగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగింది ఆ కుటుంబం. తరువాత జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసింది. అయితే ఇప్పుడు రాజకీయంగా వెనుకడుగు వేస్తోంది. కుటుంబ పరంగా కూడా తీవ్ర విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తన వాటా తనకు ఇవ్వాల్సిందేనని రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వీధికి ఎక్కారు. అటు వైసీపీలో సైతం ఆ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గింది. ఈ కారణాలతో రాజకీయాలనుంచి పూర్తిగా ఆ కుటుంబం తప్పుకునే అవకాశం ఉంది. అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన, ఆవేదన కనిపిస్తోంది.

* సుదీర్ఘ నేపథ్యం..
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయం చేస్తూ వచ్చింది మేకపాటి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ కుటుంబానికి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి తో రాజమోహన్ రెడ్డి ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవారు. అదే జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేసేలా చేసింది. రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి రాజమోహన్ రెడ్డి కుటుంబాన్ని కృంగదీసింది. గౌతమ్ రెడ్డి స్థానంలో రాజమోహన్ రెడ్డి మరో కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి తో పాటు విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు.

* వైసిపి ఆదరణ కరువు..
అయితే గత ఎన్నికల ఫలితాలు తర్వాత రాజమోహన్ రెడ్డి జగన్ విషయంలో కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. దీంతో మేకపాటి కుటుంబం టిడిపిలోకి వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే టిడిపిలోకి వెళ్లడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి రాజమోహన్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదం ప్రారంభమైంది. తన వాటా ఆస్తులను ఇవ్వాల్సిందేనని ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు వీధికి ఎక్కారు. ఒకవైపు రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. కుటుంబ పరంగా కూడా వివాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు కుమారులు రాజకీయాల కంటే వ్యాపారాలపై మొగ్గుచూపుతున్నారు. అందుకే రాజమోహన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

అప్పుడు కెసిఆర్.. ఇప్పుడు రేవంత్.. తెలంగాణలో హిట్లర్ ఆత్మ..

Revanth Reddy Vs KCR
Revanth Reddy Vs KCR

Revanth Reddy Vs KCR: కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ అనే సినిమా రూపొందింది. చాలామంది ఆ టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు. చిరంజీవికి ఏమైంది.. ఇలాంటి టైటిల్ పెట్టుకున్నాడు అని అనుకున్నారు. మలయాళం లో విజయవంతమైన ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. అప్పటిదాకా వరుస పరాజయాలతో ఇబ్బందిపడిన చిరంజీవి హిట్లర్ సినిమా ద్వారా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసారు..

ఇప్పుడు హిట్లర్ గురించి ఎందుకు ప్రస్తావన.. అప్పుడప్పుడో ఆయన నియంతలాగా పరిపాలించిన దేశమే కాదనుకుంటుంది కదా.. ఆయన విగ్రహాలను కూడా నేలమట్టం చేస్తోంది కదా.. అనేకదా మీ డౌటు.. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం హిట్లర్ అవతారం ఎత్తారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. నిజమే.. ఎందుకంటే యూట్యూబ్ చూస్తుంటే నాడు కేటీఆర్ నోటి నుంచి వచ్చిన హిట్లర్ మాట ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. నాటి కాలంలో సోషల్ మీడియా అంత బలంగా లేదు కాబట్టి కెసిఆర్ హిట్లర్ అనే మాట మాట్లాడినప్పటికీ జనం పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.

పైగా అక్రమ నిర్మాణాల విషయంలో కెసిఆర్ తాను హిట్లర్ అవుతానని.. వాటిని పడగొడతానని శపథం చేశారు. ఎన్ని అక్రమ నిర్మాణాలు పడగొట్టారో తెలియదు.. ఎంతమంది అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారో తెలియదు.. కానీ కొంతమంది దర్జాగా అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్నారు. వాటి మీదికి బుల్డోజర్లు రాకుండా అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కెసిఆర్ పడగొట్టకుండా వదిలేసిన అక్రమాలు చాలానే ఉంటాయి.

నాడు తనకు తాను హిట్లర్ అనుకొని.. హిట్లర్ మాదిరిగా కెసిఆర్ మాట్లాడి.. మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించారు. అయితే ఇప్పటి కాలంలో నాడు కేసీఆర్ హిట్లర్ మాటలను జనం పెద్దగా గుర్తుంచుకోనట్టు కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే రేవంత్ ది హిందూ పత్రిక నిర్వహించిన ముఖాముఖిలో తనను తాను హిట్లర్ అని చెప్పుకున్నారో.. అక్కడే గులాబీ పార్టీ పట్టేసుకుంది.

కెసిఆర్ గతంలో హిట్లర్ అనే మాట మాట్లాడనట్టు.. తనను తాను హిట్లర్ అని చెప్పుకున్నట్టు కవరింగ్ ఇచ్చింది గులాబీ మీడియా. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలస్యంగా మేల్కొన్నారు. నాడు కేసీఆర్ మాట్లాడిన హిట్లర్ మాటలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రికి.. ఇప్పటి ముఖ్యమంత్రికి ఏమైంది అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. నిజానికి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతాను.. ఆక్రమణలను సహించను.. దుర్మార్గులను తొక్కిపడేస్తాను అనే మాటలు మాట్లాడితే ప్రజల నుంచి విజిల్స్ పడతాయి. వారు ఆ స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ ఎలివేషన్లు ఉంటాయి కాబట్టి జనం ఆ భ్రమలో బతికేస్తూ ఉంటారు. కానీ వాటిని వదిలేసి.. హిట్లర్ చుట్టూ అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి ముఖ్యమంత్రి తిరగడమే ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి హిట్లర్ అనే వ్యక్తిని ఈ ప్రపంచం ఒక నియంత లాగే చూసింది. అతడు ఒక కరుడుగట్టిన వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతీకగానే భావించింది. ఒక దుర్మార్గుడిలాగా ఇప్పటికీ ఈ ప్రపంచం చూస్తోంది. అతడు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. అతని గురించి ఇప్పటికి నెగిటివ్ చర్చ జరుగుతుందంటే.. సృష్టించిన విధ్వంసం అలాంటిది. ఈ విషయాన్ని మర్చిపోయి నాడు కెసిఆర్.. ఇప్పుడు రేవంత్ హిట్లర్ నామస్మరణ చేయడం నిజంగా అవివేకం. అత్యంత హాస్యాస్పదం.

సమాజాన్ని బాగు చేయాలంటే.. పౌరులకు మెరుగైన జీవితాన్ని అందించాలంటే.. అక్రమాలను.. ఆక్రమణలను తొక్కి పెట్టాలంటే కచ్చితంగా హిట్లర్ గానే మారాలా .. హిట్లర్ చేసింది ఇలాంటి పనులు కాదు కదా.. హిట్లర్ మొత్తం వ్యక్తులను తొక్కేశాడు కదా.. తనకు నచ్చని వారిని చంపేశాడు కదా.. ప్రపంచంలో ఘోరమైన యుద్ధం రావడానికి కారణమయ్యాడు కదా.. అటువంటి వ్యక్తిని స్మరించడం.. అతడిలాగా ఉంటానని చెప్పడం నిజంగా ఫాసిజం లక్షణాలు. సాటి మనుషులను ఇబ్బంది పెట్టాలనుకోవడం.. మూర్ఖత్వ గుణానికి. బలమైన నిదర్శనం.

ఇప్పటికైనా హిట్లర్ మాటలు కట్టిపెట్టి.. చేయాల్సిన పనులు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా హిట్లర్ అనే మాటలు మాట్లాడితే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడిన కేసీఆర్ కు ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి చూశాడు. అటువంటి గతి తనకు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది.

సూర్య భాయ్.. మేల్కొన్నాడు.. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది..

Suryakumar Yadav Comeback
Suryakumar Yadav Comeback

Suryakumar Yadav Comeback: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని ఆటగాళ్లు అవకాశాలు సొంతం చేసుకోవాలి. ఒకసారి స్థానం లభిస్తే వస్తే చాలు.. దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆటతీరుతో ఆకట్టుకోవాలి. కానీ సూర్యకుమార్ యాదవ్ కు ఇది చేతకాలేదు. అవకాశం కాదు.. ఏకంగా అతడిని మేనేజ్మెంట్ కెప్టెన్ ను చేసింది. సారధిగా ఓకే అయినప్పటికీ.. టీమిండియా కు టి20 వరల్డ్ కప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విఫలమైన షాట్లు ఆడుతూ పరువు తీసుకున్నాడు. మేనేజ్మెంట్ వరుసగా అతడికి జట్టులో స్థానం కల్పించినప్పటికీ.. ఏళ్ల పాటు ఎదురుచూసినప్పటికీ అతడు తన ఆట తీరు మార్చుకోలేదు. మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది.. అవకాశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చేసింది.. ఆ తర్వాత ఓపిక నశించింది. ఇంకేముంది జట్టు నుంచి పక్కన పెట్టింది. కనీసం ఆటగాడిగా కూడా అతడిని ఎంపిక చేయలేదు. భారత జట్టుకు టి20 వరల్డ్ కప్ అందించిన ఆటగాడికి ఈ స్థాయిలో పనిష్మెంట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

సూర్య కుమార్ యాదవ్ నేషనల్ టీమ్ లో చోటు కోల్పోవడంతో.. తనను తాను నిరూపించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముంబై t20 లీగ్ లో అతడు సత్తా చూపిస్తున్నాడు.. మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు.. ఇటీవల జరిగిన మ్యాచ్లో 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతడు ఆడిన ఆటతీరును మెచ్చి నిర్వాహకులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందించారు. అయితే ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన తన జట్టు బౌలర్ డిసౌజా తో అప్ పురస్కారాన్ని పంచుకున్నాడు. నిర్వాహకులు తనకిచ్చిన అవార్డును అతనికి ఇచ్చేసి.. గొప్ప మనసు చాటుకున్నాడు.

సూర్య కుమార్ యాదవ్ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే మళ్లీ జాతీయ జట్టులో చోటు లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి టీమిండియా లో చోటు కోల్పోతే మళ్ళీ సాధించడం అంత ఈజీ కాదు. అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కు తెలుసు.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత వారు తిరిగి మళ్ళీ జట్టులోకి రావడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్భాలలో తమ స్థాయిని మించి ఆడారు. అప్పటికి గాని మేనేజ్మెంట్ కరుణ చూపలేదు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అలానే చేయాలి. అంతకుమించి ఆడితేనే అతడికి జట్టులో మళ్ళీ అవకాశం లభిస్తుంది. మిస్టర్ 360 తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేయాలని అభిమానులు కోరుతున్నారు.

పాకిస్తాన్ ఆర్మీ ప్యాంట్లు విప్పుకుని తిరుగుతోంది..ఇది మామూలు దెబ్బ కాదు

Pakistan Occupied Kashmir Protests
Pakistan Occupied Kashmir Protests

Pakistan Occupied Kashmir Protests: పాకిస్థాన్ ఆర్మీ ప్యాంట్లు విప్పుకుని తిరుగుతోంది. మీరు చదువుతున్నది నిజమే. పాకిస్తాన్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మీర్ పూర్, ముజఫర్బాద్, కోట్లి, పూంచ్ ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. దాదాపు ఇప్పటికే 200 మందికి పైగా చనిపోయారు. అయితే ఈ వార్తలు బయటికి రాకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ లు ఆపేసింది. వివిధ మార్గాల ద్వారా సమాచారం రాకుండా ఉండేందుకు తొక్కేస్తోంది. రావల్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ ఉద్యమంలో.. వేలాదిమంది ప్రజలు పాల్గొంటున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న దాడులను తట్టుకోలేక అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ లో సైనికులను పట్టుకొని.. వారి మీద దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తొడుకున్న ప్యాంట్లను తొలగించి ప్రదర్శన చేస్తున్నారు. జూలై 9 నుంచి ఇక్కడ భారీ ఎత్తున ప్రదర్శన చేసేందుకు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ తీరును నిరసిస్తూ.. ప్యాత్లూన్ పరేడ్ నిర్వహిస్తున్నారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విలువైన ఖనిజాలు.. వనరులను వెలికి తీయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాటిని సింధు ప్రావిన్స్.. పంజాబ్.. ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు.

జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ 12 సీట్లను పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటినుంచో తన చేతిలో పెట్టుకుంది. ఈ 12 స్థానాలలో పాకిస్తాన్ దేశానికి చెందిన వారిని నియమిస్తోంది పాకిస్థాన్ ఆర్మీ. దీనివల్ల అక్కడి పార్లమెంటు నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమంత్రి పాకిస్తాన్ మంత్రి వచ్చినా లేచి నిలబడాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

జూలై 27న జరిగే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని.. జమ్ము కాశ్మీర్లో భారత్ నిర్వహిస్తున్నట్టుగా జరపాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో విలువైన వనరులు ఉన్న నేపథ్యంలో.. అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా ఆర్మీ ని రంగంలోకి దించుతోంది.. అవసరమైతే హింసాత్మక విధానంలో ప్రజల నిరసనను తొక్కి వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

పాక్ ను చూసి ఎగిరిపడింది.. ఇప్పుడేమో టర్కీ కాళ్ల బేరానికి వచ్చింది.. నరేంద్ర మోడీతో అట్లుంటది మరి

Turkey India Relations
Turkey India Relations

India Turkey Relations: అరచిన వాడు గొప్పవాడు కాదు. నిశ్శబ్దంగా ఉన్నవాడు మూర్ఖుడు కాదు.. టర్కీ మొన్నటి దాకా పాకిస్తాన్ కు వంత పాడింది. అంతటి భూకంపం లో కూడా భారత్ సహాయం చేస్తే ఆ విషయాన్ని కూడా మర్చిపోయి.. జమ్ము కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ను విపరీతంగా సపోర్ట్ చేసింది. అంతర్జాతీయ వేదికలలో పాకిస్థాన్ దేశాన్ని వెనకేసుకొచ్చింది. మన దేశం మీద లేనిపోని విమర్శలు చేసింది. వీటన్నిటినీ కూడా భారత్ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. టర్కీ మాదిరిగా అరవలేదు.. అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడలేదు.

భారత్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి.. పాకిస్తాన్ దేశానికి వంత పాడిన టర్కీకి ఇప్పుడు అసలు విషయం అర్థమవుతోంది. మధ్య ఆసియాలో యుద్ధాలు.. ఆర్థికంగా ఒత్తిడి.. పర్యాటక రంగంపై తీవ్రమైన ప్రభావం.. ఇవన్నీ కూడా టర్కీ దేశాన్ని తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ఇన్నాళ్లపాటు భారతదేశంతో విరోధం కొనసాగించిన టర్కీ ఇప్పుడు ఆకస్మాత్తుగా స్నేహం గుర్తుకొచ్చింది. అందువల్లే భారతదేశంతో మిత్రమా రా.. నాతో చేతులు కలుపు అన్నట్టుగా సంకేతాలు ఇస్తుంది. అయితే దీనిని భారత్ సరిగా పట్టించుకోవడం లేదు. టర్కీ బుద్ధి వచ్చేలా చేసేందుకు భారతదేశం గట్టిగా అరవలేదు.. ప్రపంచ వేదికల ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడలేదు. కేవలం లెక్కలు మాత్రమే వేసింది. ఆ లెక్కలు టర్కీ మొత్తాన్ని కదిలించాయి. లేని భూకంపాన్ని తెప్పించాయి. దీంతో టర్కీ కి ఇండియా అంటే ఏంటి.. నరేంద్ర మోడీ అంటే ఏంటో తెలిసింది. అందువల్లే కాళ్ళ బేరానికి వచ్చింది.

చైనాలో యుగర్ ముస్లింల మీద దాడి చేస్తుంటే టర్కీ మాట్లాడలేదు. ఇరాన్, యోమన్, ఇరాక్ దేశాలలో ముస్లింలు చనిపోతుంటే టర్కీ మాట్లాడలేదు. కానీ కాశ్మీర్ విషయంలో మాత్రం గొంతు సవరించుకుంది. భారతదేశం మీద విష ప్రచారం చేసింది. భారత్ సైలెంట్ గా ఆర్మీనియా వైపు నడిచింది. సైప్రస్ మీద దృష్టి సారించింది. అంతేకాదు అత్యంత ఆధునికమైన ఆయుధాలను ఈ రెండు దేశాలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో భారత్ తనకు తెలియకుండానే తనకింద మంట పెడుతుందని టర్కీ కి అర్థమైంది. అందువల్లే ఇన్నాళ్లపాటు సాగించిన విరోధాన్ని.. శత్రుత్వాన్ని మర్చిపోయింది. స్నేహ హస్తాన్ని చాచింది.

టర్కీని భారత్ నమ్మదు. అంతటి భూకంపం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు భారత్ మాత్రమే టర్కీలో సహాయం చేసింది. మందుల నుంచి మొదలుపెడితే ఆహారం వరకు సరఫరా చేసింది. ఇవన్నీ మర్చిపోయి టర్కీ పాకిస్తాన్ దేశానికి జై కొట్టింది. దీనిని మనసులో పెట్టుకున్న భారత్ ఆర్మీనియా, గ్రీస్, సైప్రస్ దేశాలతో మాట్లాడింది. డిఫెన్స్ సహకారం పెంచింది.. ఫలితంగా టర్కీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఆకాష్ యాంటీ మిస్సైల్ సిస్టమ్స్.. ఫినాక రాకెట్ లాంచర్స్.. స్వాతి రాడార్లు.. బ్రహ్మోస్.. ప్రళయ్ మిస్సైల్స్.. ఇవన్నీ కూడా ఇచ్చేస్తోంది. దీంతో టర్కీ అన్ని మూసుకుంది. నాతో కలువు అంటూ భారతదేశానికి సంకేతాలు పంపిస్తోంది. టర్కీ మాటలు భారత్ వింటుందా నెవర్.. ఎందుకంటే ఆ దేశం పాము లాంటిది.. పాలు పోసినా సరే విషమే చిమ్ముతుంది.

రోత పుట్టిస్తున్న పూరి జగన్నాథ్ 'స్లమ్ డాగ్' టీజర్.. విజయ్ సేతుపతి ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడో..

Puri Jagannadh Slum Dog Teaser Review
Puri Jagannadh Slum Dog Teaser Review

Puri Jagannadh Slum Dog Teaser Review: అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఒకే మూసలో సినిమాలను తెరకెక్కిస్తూ, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే , అది పూరి జగన్నాథ్ మాత్రమే. ఒకప్పుడు రాజమౌళి ని మించిన టాప్ డైరెక్టర్ , కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ఆడియన్స్ కి విరక్తి కలిగే పరిస్థితి ఏర్పడింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు పూరి జగన్నాథ్. ఇక ఆయనకు తిరుగులేదు , పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తాడు , పూరి పవర్ ఏంటో ఈ జనరేషన్ ఆడియన్స్ చూస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.

దీంతో పూరి జగన్నాథ్ కం బ్యాక్ ఇవ్వడం అసాధ్యమని అంతా అనుకున్నారు. సరిగ్గా అలాంటి సమయం లో తమిళ హీరో విజయ్ సేతుపతి తో ‘స్లండాగ్’ చిత్రాన్ని ప్రకటించాడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ మీద నమ్మకం లేకపోయినప్పటికీ, విజయ్ సేతుపతి మంచి సినిమాలు చేస్తాడు కాబట్టి , ఆయన ఊరికే ఈ కథని ఒప్పుకొని ఉండడు, కచ్చితంగా విషయం ఉండే ఉంటుందని అంతా అనుకున్నారు. అలా మంచి పాజిటివ్ వైబ్స్ తోనే ఈ చిత్రం మొదలైంది. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి నెటిజెన్స్ నుండి భయంకరమైన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. పూరి జగన్నాథ్ ఈ మూస నుండి బయటకి వచ్చే ప్రసక్తే లేదా?, ఇంకెన్ని రోజులు ఇవే సినిమాలు , రోత పుట్టిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈ టీజర్ చూసిన తర్వాత కథ విషయం లో ఒక క్లారిటీ వచ్చేసింది.

హీరో విజయ్ సేతుపతి బిక్షగాళ్ల తరుపున నిలబడి పోరాటం చేసే మనిషి అని. వీళ్లకు ఎదో ఒక సమస్య వస్తుంది , వాళ్ళ తరుపున నిలబడి పోరాడుతాడు. లైన్ మంచిదే , కానీ పూరి జగన్నాథ్ తన మార్క్ లో , అవసరం లేని హీరోయిజం తో హీరో ని చూపించడమే చెత్తగా అనిపించింది. ఇదే సినిమాని వేరే యాంగిల్ లో తీయొచ్చు , ఇలాంటి కంటెంట్ సినిమాలను నిజాయితీగా తీస్తే ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు , ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. కానీ పూరి జగన్నాథ్ ట్రెండ్ కి విరుద్ధంగా వెళ్తున్నాడు. ఇదే ఆడియన్స్ కి నచ్చడం లేదు. ఈ టీజర్ ని చూసిన తర్వాత ఫ్లాప్ కల ఉట్టిపడుతోంది. కానీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం లాగానే ఈ సినిమా కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుందో లేదో చూడాలి.

 

 

జూలై 4 వరకు గజలక్ష్మీ యోగం.. ఈ 4 రాశుల వారికి సిరి సంపదలు..

Gajalakshmi Rajyog 2026
Gajalakshmi Rajyog 2026

Gajalakshmi Rajyog 2026: జ్యోతిష శాస్త్రంలో గురు గ్రహం జ్ఞానం, సంపద, ధర్మం, శుభఫలితాలకు కారకుడిగా భావిస్తారు. అలాగే శుక్ర గ్రహం ఐశ్వర్యం, విలాసం, కళలు, దాంపత్య సుఖం, భోగభాగ్యాలకు ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ రెండు శుభగ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శుభప్రదమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష పండితులు చెబుతారు. 2026 జూన్ 2న గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించగా, జూన్ 8న శుక్రుడు కూడా అదే రాశిలోకి చేరి గురువుతో సంయోగం చెంది జులై 4 వరకు ఉండనున్నాడు. ఈ అరుదైన సంయోగాన్ని “గజలక్ష్మీ రాజయోగం”గా పేర్కొంటారు. గజం అంటే ఏనుగు, లక్ష్మీ అంటే సంపదకు అధిష్ఠాన దేవత. ఈ యోగం ఏర్పడినప్పుడు ఐశ్వర్యం, గౌరవం, సౌఖ్యం, సామాజిక ప్రతిష్ఠ పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి విశేష శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి:
గజలక్ష్మీ రాజయోగం కారణంగా మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలను ఇవ్వవచ్చని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరగడం, నిలిచిపోయిన ధనం తిరిగి రావడం, వ్యాపారాల్లో లాభాలు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశమూ ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

కన్యా రాశికి అదృష్టం:
ఈ రాశి వారికి ఈ యోగం అనేక రంగాల్లో అనుకూల ఫలితాలను ఇవ్వగలదని భావిస్తున్నారు. విద్యార్థులకు చదువులో పురోగతి, పోటీ పరీక్షల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశికి విజయాలు:
ఈవారికి ఈ కాలం కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశముంది. ఉద్యోగరంగంలో గుర్తింపు, గౌరవం పెరగవచ్చు. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా పురోగతి కనిపించవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

మీన రాశికి ధనలాభం:
మీన రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం అత్యంత అనుకూలంగా పనిచేసే అవకాశముందని భావిస్తున్నారు. పెట్టుబడుల ద్వారా లాభాలు రావచ్చు. కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపించవచ్చు. వివాహ యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరగడం లేదా కొత్త అవకాశాలు లభించడం వంటి శుభఫలితాలు కనిపించవచ్చు.

మహేంద్రగిరి వారాహి టీజర్ రివ్యూ...అది మాత్రం హైలెట్ అబ్బ...

Mahendragiri Varahi Teaser Review
Mahendragiri Varahi Teaser Review

Mahendragiri Varahi Teaser Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సుమంత్ హీరోగా ‘సంతోష్ జాగర్లపూడి’ దర్శకత్వంలో తనకిచ్చిన ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమా కి సంబంధించిన టీజర్ గత కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ లో కథను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మహేంద్రగిరి రాజవంశంలో 33 సంవత్సరాలు వచ్చిన ప్రతి మగ బిడ్డ చనిపోతున్నాడు. దానికి కారణం అమ్మవారి శాపమా అనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమానైతే తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుమంత్ మరోసారి ఒక డీసెంట్ కల్ట్ క్లాసికల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఈ టీజర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా హై విజువల్స్ తో ప్రేక్షకుడికి ఒక సూపర్ ట్రీట్ ఇచ్చే సినిమాగా కనిపిస్తుంది. ముఖ్యంగా డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్లో ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే ఉండాలి. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో టీజర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ప్రతి ఎలిమెంట్ కూడా ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇచ్చే విధంగానే కనిపిస్తుంది.

అలాగే దానికి తోడు సినిమాలో సీజీ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా కనిపించింది. ముఖ్యంగా ఒక పాంథర్ ఎవరి పైనో దూకుతున్నట్టుగా అది ఎవరి మీదనో ఎటాక్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. మరి హీరో దానిని నుంచి ఎవరిని సేవ్ చేస్తున్నాడు అనేది కూడా టీజర్ లో చాలా మిస్టేరియస్ గా చూపించారు. అలాగే ఐశ్వర్య రాజేష్ మాళవిక నాయర్ ల క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఈ టీజర్ ఎండింగ్ లో వారాహి అమ్మవారు ఉగ్రరూపమైతే మనకు చూపించారు… అది ఈ టీజర్ మొత్తానికైతే హైలెట్ అనే చెప్పాలి…

అంటే ఈ సినిమాలో అమ్మవారు అంతర్లీనంగా భాగమవ్వడమే కాకుండా సినిమా మొత్తం ఆమె మీద బేస్ చేసుకుని నడుస్తుందనే విషయమైతే మనకు చాలా క్లారిటిగా తెలిసింది. ఇక సుమంత్ మరోసారి కల్ట్ క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే విషయం కూడా చాలా క్లారిటిగా తెలుస్తుంది…

 

 

భారత్‌లో పడిపోతున్న ఫర్టిలిటీ రేటు.. ప్రయోజనమా.. ప్రమాదామా?

India Fertility Rate Decline 2026
India Fertility Rate Decline 2026

India Fertility Rate Decline 2026: ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ భారత్‌పై మరోసారి దృష్టి సారించారు. భారత్‌లో జనన రేటు రీప్లేస్‌మెంట్‌ లెవల్‌ కంటే తగ్గిపోయింది. చదువుకున్న, అత్యంత విద్యావంతులైన వర్గాల్లో ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతోంది అని హెచ్చరించారు. 2024లో విడుదలైన లేటెస్ట్‌ సాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదిక ప్రకారం భారతదేశ టోటల్‌ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్‌ఆర్‌) 1.9కి పడిపోయింది. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే స్పష్టంగా తక్కువ.

ఒకప్పుడు జనాభా విస్పోటనం..
నాలుగైదు దశాబ్దాల క్రితం జనాభా గణనీయంగా పెరిగింది. ‘‘జనాభా బాంబు’’ అని ప్రపంచం భయపడిన భారత్‌ ఇప్పుడు జనాభా తగ్గుదల వైపు వేగంగా పయనిస్తోంది. ఇది మన సమాజం, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ రూపురేఖలను పూర్తిగా మార్చగల ఒక మహత్తరమైన మలుపు.

గతం నుంచి వర్తమానం వరకు…
1950–60లలో భారత్‌ ఫర్టిలిటీ రేటు 5.5 నుంచి 6 వరకు ఉండేది. అధిక మరణాల రేటు, వైద్య సదుపాయాల కొరత, వ్యవసాయ ఆధారిత జీవనం, ఉమ్మడి కుటుంబాలు, కుమారుడు సంతానం కోసం అనవసరమైన గర్భాలు ఇవన్నీ పెద్ద కుటుంబాలకు దోహదపడ్డాయి. పిల్లలు కుటుంబానికి శ్రమ బలం మాత్రమే కాకుండా, వృద్ధాప్యంలో భరోసా అని భావించారు. కానీ 1990ల నుంచి సమాజం వేగంగా మారింది. మహిళల విద్య, ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ, పిల్లల పెంపకం ఖర్చులు (చదువు, ఆరోగ్యం, హౌసింగ్‌) ఇవన్నీ చిన్న కుటుంబాల వైపు మనస్తత్వాన్ని మార్చాయి. ‘‘ఒక్కడు/ఒక్కతే చాలు’’ అన్న భావన సామాన్యమైంది. ఫలితంగా 2024లో టీఎఫ్‌ఆర్‌ 1.9కు పడిపోయింది.

ఉత్తరాదిలో మెరుగు…
ఇక్కడే మనకు అసలు సవాలు కనిపిస్తుంది. దక్షిణాది మరియు పశ్చిమ రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉంది (తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు 1.4–1.7 మధ్య ఉండగా, ఢిల్లీ వంటి నగరాలు 1.2 వరకు పడిపోయాయి. అయితే బీహార్‌ (2.9), ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ వంటి ఆరు రాష్ట్రాలు మాత్రమే ఇంకా రీప్లేస్‌మెంట్‌ లెవల్‌పై ఉన్నాయి. ఈ ప్రాంతీయ అసమానత భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.

ఎలాన్‌ మస్క్‌ చెప్పిన చైనా సారూప్యత..
చైనా తన ‘‘ఒక్క పిల్లవాడు’’ విధానంతో యువ జనాభాను తగ్గించుకుంది. ఇప్పుడు అక్కడ వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి, శ్రమ శక్తి తగ్గి, ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. జపాన్, దక్షిణ కొరియా, రష్యా వంటి దేశాలు ఇప్పటికే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్‌ కూడా అదే మార్గంలో నడుస్తుందని మస్క్‌ హెచ్చరిక. మన దేశంలో డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ అన్న ఆశలు ఇక త్వరలో ముగియవచ్చు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఉద్యోగుల కొరత, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం, ఒక తరం మరొక తరానికి సహాయం చేసే సామాజిక చక్రం దెబ్బతినడం ఇవన్నీ రాబోయే దశాబ్దాల్లో మన ముందు నిలబడతాయి. అయినా ఇది పూర్తి విపత్తు కాదు. ఈ తగ్గుదలను పూర్తిగా ప్రమాదంగా చూడకూడదు. ఇది మహిళల సాధికారత, విద్య, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ నియంత్రణ అవగాహన వంటి సానుకూల మార్పుల ఫలితం. పిల్లల సంఖ్య తగ్గడం వల్ల ప్రతి పిల్లవాడికి మంచి పోషణ, విద్య, ఆరోగ్యం ఇవ్వడం సాధ్యపడుతోంది. గుణాత్మక జనాభా అన్న లక్ష్యం సాధ్యమవుతోంది.

భారత్‌ ఇప్పుడు ఒక చారిత్రక మలుపు వద్ద నిలబడి ఉంది. జనాభా పెరుగుదల సమస్య నుంచి జనాభా తగ్గుదల సవాలు వైపు మారుతోంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కూడా కాదు. సమయం ఉంది. సరైన విధానాలు, సమగ్ర ఆలోచన, సమతుల్య దృక్పథంతో ఈ మార్పును అవకాశంగా మలచుకోగలిగితే మన భవిష్యత్‌ తరాలు మన్నించే దేశంగా మారవచ్చు. లేకపోతే, చైనా, జపాన్‌ మాదిరిగా ఆలస్యంగా బాధపడే దేశంగా మిగిలిపోవచ్చు. సమయం మన చేతిలో ఉంది. ఆలోచనలు మార్చుకునే సమయం ఇదే.

కోటరీ దోపిడి.. జగన్ షాక్!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Coterie Corruption Allegations: వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉండేది. జగన్ సైతం వారినే నమ్మేవారు. వారు కూడా ఆర్థికంగా బలపడ్డారు. అయితే ఇప్పుడు అలా చుట్టూ ఉన్న నేతల అవినీతి బయటపడుతోంది. తనకు తెలియకుండా ఇంత అవినీతి చేశారా అన్నట్టు.. ఒక్కో లెక్క బయటకు వస్తోంది.. దీంతో ప్యాలెస్ లోపల తీవ్ర అప నమ్మకం, నిశ్శబ్దం కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో దోపిడీ చేసి.. తనకు మాత్రం సగం కూడా ఇవ్వలేదని అంతిమ లబ్ధిదారుడు బాధపడుతున్నారట. కేవలం ఒకరు ఎంత పోగేసుకున్నారో.. ప్రత్యేక దర్యాప్తు బృందం లెక్కలు చెప్పడంతో తాడేపల్లి కోటరిలో ప్రకంపనలు రేగినట్లు తెలుస్తోంది . ఒకప్పుడు జగన్ చుట్టూ ఉంటూ.. పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను శాసించిన ఈ కోటరి పూర్తిగా చెల్లాచెదురయ్యింది. అయితే ఈ కోటరిలో క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ముందుగానే బయటకు వెళ్లిపోయారు. అలా అనేదానికంటే జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పడేశారు.

* సాయి రెడ్డి స్థానంలో చెవిరెడ్డి..
అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సాయి అన్నకు వయసు అయిపోయింది అంటూ తేల్చి చెప్పి ఆస్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి పెట్టారు. అయితే చెవిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో వందల కోట్లు వెనుకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం కుంభకోణం దర్యాప్తు తర్వాత చెవిరెడ్డి సంపాదన బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయారట. అందుకే ఇటీవల చెవిరెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారట. అనవసరంగా చెవిరెడ్డిని తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని వదులుకున్నానని బాధపడుతున్నారట జగన్మోహన్ రెడ్డి.

* మాజీ పిఏ సంపాదన చూశాక..
జగన్ కోటరీలో ఎలానూ పిఎ నాగేశ్వర్ రెడ్డి ఉంటారు. అయితే ఆయన సంపాదన ఇప్పుడు బయటపడడంతో జగన్మోహన్ రెడ్డి నోట మాట రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫండ్స్, ప్రభుత్వ కాంట్రాక్టులు, బదిలీల వ్యవహారాల్లో అసలు కంటే ఆయన తిన్న కొసరు వందల కోట్లు ఎక్కువగా ఉందని ఆధారాలతో సహా తేలడంతో తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆశ్చర్యపడుతూ చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయనకు తెలియకుండానే ఈ కోటరీ నేతలు సమాంతర సామ్రాజ్యాలను నడిపించారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరానికి ఉత్సాహం ఇచ్చే విషయం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీగా వచ్చారు. ఇప్పుడు అదే చెవిరెడ్డి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇదంతా మద్యం కుంభకోణం ద్వారానే జరగడంతో ఖుషి గా ఉంది సజ్జల వర్గం. అయితే మొత్తం సజ్జల సేఫ్ గా ఉంటే.. తనకు తెలియకుండానే ఇంత దోపిడీ రాజ్యం నడిసిందా? అని ఆశ్చర్యపోతున్నారట జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

ఎన్ని కోర్టులు తీర్పులిచ్చినా తిక్క ట్రంప్ ఊరుకునే రకం కాదు

H1B Visa Fee Ruling
H1B Visa Fee Ruling

H1B Visa Fee Ruling: హెచ్ 1 బీ వీసా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న లక్ష డాలర్ల ఫీజు వసూలు నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రవాస భారతీయ సంఘాలు స్వాగతిస్తున్నాయి.. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

“అమెరికా దేశంలో సాంకేతిక విభాగాలలో పనిచేయడానికి.. హెల్త్ కేర్ లో పని చేయడానికి.. ఆత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలలో పనిచేయడానికి.. ప్రతిభావంతులు అవసరం. చైనా ఈ విభాగాలలో అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను భర్తీ చేసుకున్నది. అందువల్లే ఈ రంగాలలో అద్భుతాలు చేస్తోంది. అమెరికా మాదిరిగా పనికిమాలిన ఫీజులను వసూలు చేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం లేనిపోని నిబంధనలను తీసుకొస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నారు. దీనివల్ల అమెరికా వెనుకబడిపోతుంది. ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో మాలాంటి వాళ్ళలో హర్షం వ్యక్తం అవుతుందని” ప్రభాస భారతీయులు చెబుతున్నారు.

అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఫెడరల్ కోర్టు తీర్పును ట్రంప్ ఏ విధంగా చూస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అనే అంశాలపై రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ యంత్రాంగానికి.. న్యాయవ్యవస్థలకు మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు జరుగుతున్నాయి. చట్ట విరుద్ధమైన అంశాలను ట్రంపు ప్రభుత్వం పదేపదే తెరపైకి తీసుకువస్తుంది. విధానపరమైన అంశాలలో కూడా అనవసరమైన వేలుపెడుతోంది. దీనివల్ల న్యాయవ్యవస్థలు ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా తీర్పులు ఇస్తున్నాయి. అయితే విధానపరమైన అంశాలలో ట్రంప్ ప్రభుత్వం వేలు పెడుతుందని.. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా దారులకు రకరకాల సమస్యలను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెచ్ వన్ బీ వీసా ఫీజును లక్ష దారాలకు పెంచుతూ గత ఎడాది ట్రంప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్.. డెమోక్రటిక్ పార్టీ కోర్టులో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో బోస్టన్ కోర్టు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం తీసుకొస్తుందని మండిపడింది. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. అయితే బోస్టన్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల.. శ్వేత సౌధం లోని యంత్రాంగం పైకోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.