Home Blog Page 165

టిడిపికి బిగ్ ఆఫర్!

Big offer for TDP
Big offer for TDP

Big offer for TDP: ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. రెండో పెద్ద పార్టీ కూడా. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీని కూడా టిడిపి అందించగలిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. ఇప్పటికే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టును తెలుగుదేశం పార్టీకి కేటాయించింది కేంద్రం. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. రేపు ఎన్డీఏ పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రేపు ఎన్ డి ఏ పక్ష సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

నేడు ఢిల్లీకి చంద్రబాబు..
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు రేపు ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. నీతి ఆయోగ్ తో పాటు ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని చర్చిస్తారు. అయితే ప్రధానితో జరిగే భేటీలో చంద్రబాబుకు ఆయన గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. ఒక సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేస్తారని సమాచారం.

మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు జనసేనకు ఇద్దరు.. బిజెపికి మరో ముగ్గురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రం నుంచి. తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్రమంత్రి పదవులను కేటాయించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ కు క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి ఇచ్చి.. సహాయ మంత్రిగా మరొకరికి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ సైతం చాలా రోజులుగా ఖాళీ ఉంది. దానిని సైతం ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టిడిపికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

అవినీతిలో ఈ ఆఫీసర్ కొత్త బెంచ్ మార్క్.. ఏకంగా 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యింది

ACB raids on government officer
ACB raids on government officer

ACB raids on government officer: ఆ నోట్ల కట్టలు బ్యాంకును తలపించాయి. బంగారు ఆభరణాలు జువెలరీ షాపును గుర్తుకు తీసుకొచ్చాయి. ఆస్తి పత్రాలు రియల్ ఎస్టేట్ కంపెనీని కళ్ళ ముందు నిలిపాయి. అతడి కార్లు.. ద్విచక్ర వాహనాలు.. బ్యాంకు లాకర్లు.. ఇలా ఒక్కటేమిటి.. అంబానీ కూడా ఈర్ష పడేలాగా ఉంది అతడి సంపాదన. అలాగని అతడేమి ఆగర్భ శ్రీమంతుడు కాదు.. ఎలాన్ మస్క్ కు తోబుట్టువు కాదు. కానీ ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అంటే..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏసీబీ డిపార్ట్మెంట్ కు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అవినీతి తిమింగలాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. వారి వద్ద నుంచి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. కొంతకాలంగా తెలంగాణలో ఈ ప్రక్రియ నిరాటంకంగా సాగిపోతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ అవినీతి అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. పైగా వసూల విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తున్నారు. బినామీ పేర్లతో భారీగా ఆస్తులను సంపాదించుకుంటున్నారు. ఒకటి, రెండు కాకుండా ఏకంగా వందల కోట్ల ఆస్తులను కూడబెడుతున్నారు.

హైదరాబాదులో ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్.. ఆయన బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భారీగా బంగారం బిస్కెట్లు.. ఆభరణాలు.. వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగదు కూడా భారీగా ఉండడంతో ఏకంగా లెక్కింపు యంత్రాలను తీసుకొచ్చారు. నచ్చిన వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వడం.. కాంట్రాక్టులు ఇచ్చినందుకు లంచాలు తీసుకోవడం మోహన్ నాయక్ అలవాటుగా మార్చుకున్నాడు.

ఇలా అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇచ్చి భారీగా దండుకోడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఖరీదైన నివాసాలు.. ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. బంగారం.. ఇతర వ్యవసాయ భూములు కొన్నాడు. కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఆస్తులను కొనుగోలు చేశాడు. ఇతడి వద్ద ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా వంద కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంకా కొన్ని భూమి పత్రాలను.. స్థిరాస్తులను లెక్కించాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేసినప్పటికీ.. అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అందువల్లే ఎవరిని వదిలిపెట్టకుండా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవినీతి తేలితే కటకటాల వెనక్కి పంపిస్తున్నారు.

వైసీపీకి అలవాటైన శవ రాజకీయం!

YSRCP reaction to Vizag Steel Plant accident
YSRCP reaction to Vizag Steel Plant accident

YSRCP reaction to Vizag Steel Plant accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది కార్మికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అయితే స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసింది. బాధ్యత తీసుకొని ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి నారా లోకేష్ కేజీహెచ్ కు వెళ్లారు. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని చూసింది. సాక్షి మీడియా రిపోర్టర్ నినాదాలు చేయాలని అక్కడ ఉన్న వారిని పురమాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని..
నిన్న ఘటన జరిగిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక రాజకీయ కోణంలో వినియోగించుకోవాలని చూసింది. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణాలు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘాల నేతలను, వామపక్షాల ప్రతినిధులను రెచ్చగొట్టింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో మాట్లాడి బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా తో పాటు., ఇంట్లో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య అందేలా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరితగతిన స్పందిస్తే.. ఇటువంటి విషాదఛాయల్లో కూడా రాజకీయ లాభం వెతుక్కునే పనిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆ పార్టీ తప్పుడు విధానాలను తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ పర్యటన ఉందని తెలుసుకొని పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులను రంగంలోకి దించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

కావాలని పని గట్టుకొని..
మంత్రులు పరామర్శిస్తున్న ఆసుపత్రుల ప్రాంగణంలో కొంతమందిని నిలబెట్టి.. ప్రభుత్వంపై నిందలు వేసేలా బలవంతంగా నినాదాలు చేయించి.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వికృతానందం పొందుతోంది. కార్మికులు చనిపోయారన్న బాధ కంటే.. ఈ ఘటన ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి ఒక అవకాశం దొరికిందని వైసిపి నేతలు సంతోష పడుతున్నారు. మరోవైపు కేజీహెచ్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ ను వామపక్ష నేతలు చుట్టుముట్టారు. మృతుల కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీనిపై మంత్రి లోకేష్ అత్యంత హుందాగా.. అంతే గట్టిగా సమాధానం చెప్పారు. మేం కేవలం ఇక్కడకు వచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులుపు కోవడానికి రాలేదంటూ తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాలు కోలుకునే వరకు.. ఆయా కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం అని లోకేష్ స్పష్టం చేయడంతో వారు నోరు మెదపలేకపోయారు.

అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ..
స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 100% కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. అక్కడ ఏదైనా లోపం తలెత్తితే దానికి ప్లాంట్ యాజమాన్యం బాధ్యత వహించాలి. కేంద్ర ఉక్కు శాఖ బాధ్యత తీసుకోవాలి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం పై రుద్దేందుకు వైసిపి ప్రయత్నించడం చూస్తుంటే వారి రాజకీయ కాంక్ష ఇస్తే అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా, ఎవరైనా చనిపోయినా.. శవాలపై పేలాలు ఏరుకునే చందంగా శవ రాజకీయాలు చేయడానికి వైసిపి ఏమాత్రం సిగ్గుపడడం లేదు. వారికి బాధితులకు న్యాయం చేయడం ఇష్టం లేదు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే ఎజెండా.

శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ.. చేతిలో గ్లాస్ తో తండ్రి తీన్మార్ స్టెప్పులు.. వైరల్ వీడియో

Shreyas Iyer father viral video
Shreyas Iyer father viral video

Shreyas Iyer father viral video: పిల్లలు ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. కట్టలు తెంచుకున్న నీరు లాగా.. ఒక్కసారిగా బయటపడిపోతుంది. ఆ ఆనందం.. ఆ సంతోషం వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాయి. ఇప్పుడు ఇదే ఉత్సాహాన్ని టీమ్ ఇండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తండ్రి ఆస్వాదిస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్ తండ్రి పేరు సంతోష్. చిన్నప్పటినుంచి అయ్యర్ కు ఏది ఇష్టమో అదే నేర్పించారు. క్రికెట్ విషయంలో కూడా ఆయన ఏమాత్రం అడ్డు చెప్పలేదు. పైగా కొడుకు ఇష్టాన్ని కాదనలేక తన సంతోషాలను కూడా త్యాగం చేశారు. కొడుకు ఉన్నతి కోసం కష్టపడ్డారు. ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చేర్పించి.. అతడిని ఉన్నతమైన క్రికెటర్ లాగా తీర్చిదిద్దారు. అయ్యర్ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం సంతోష్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తన కొడుకు బాగా ఆడితే ఉప్పొంగిపోయేవాడు. సరిగా ఆడకపోతే బాధపడిపోయేవాడు. కానీ ప్రతి సందర్భంలోనూ అతడి వెంట ఉన్నాడు సంతోష్. తనకు అవకాశాలు లభించినప్పుడు గొప్పగా చెప్పుకునేవాడు. అవకాశాలు రానప్పుడు ధైర్యం కల్పించేవాడు. ఏనాడు కూడా మేనేజ్మెంట్ మీద విమర్శలు చేయలేదు.

ఇప్పుడు టీమ్ ఇండియా టి20 జట్టు సారధిగా అయ్యర్ ప్రమోషన్ పొందాడు. ఈ నేపథ్యంలో సంతోష్ సంతోషానికి అవధులు లేవు. తన కొడుకు కెప్టెన్ కావడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు సంతోష్. వారితో కలిసి మలయాళం.. హిందీ పాటలకు స్టెప్పులు వేశాడు. చేతులో గ్లాస్ తో తీన్మార్ డ్యాన్స్ వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. తండ్రి అంటే ఇలా ఉండాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయ్యర్ కు ఇలాంటి తండ్రి ఉన్నాడు కాబట్టి అతడు కెప్టెన్ అయ్యాడని.. ఇక అతడికి తిరుగులేదని చెబుతున్నారు.

తన తండ్రి తనకు అనేక సందర్భాల్లో అండగా నిలిచాడని.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓదార్చాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు. 2024లో షారుక్ ఖాన్ జట్టును ఐపీఎల్ విజేతగా నేర్పినప్పుడు శ్రేయస్ తన తండ్రి గురించి చెప్పాడు. తన తండ్రి లేనిదే తాను ఇక్కడికి వచ్చేవాడిని కాదని.. ఈ స్థాయిలో గుర్తింపును పొందేవాడిని కాదని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఇజ్రాయిల్ లో శివాజీ విగ్రహం..దీని వెనుక రోమాలు నిక్కబొడిచే వెయ్యేళ్ల చరిత్ర..

Shivaji statue in Israel
Shivaji statue in Israel

Shivaji statue in Israel: మనదేశంలో శివాజీ మహారాజు జయంతి ఉత్సవాల నిర్వహిస్తుంటే కొంతమంది ఉదారవాదులకు కడుపు మండుతుంది. శివాజీ మహారాజ్ ను కీర్తిస్తుంటే వారికి కడుపులో దేవి నట్టు ఉంటుంది. ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశపు తిండి తింటూ.. ఈ దేశం కల్పించిన సౌకర్యాలు అనుభవిస్తూ.. ఈ దేశ ఉన్నతికి పాటుపడిన మహానుభావులను తలుచుకుంటే ఉదారవాదులకు ఎందుకో అంత కడుపునొప్పి..

శివాజీ విగ్రహాలను ఇటీవల కాలంలో హిందువులు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. తమ జాతి ఐక్యతకు శివాజీ మహారాజ్ కృషి చేశారని కొనియాడుతున్నారు. జయంతి.. ఇతర ఉత్సవాల సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహాలను ఊరేగిస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు హిందువుల్లో ఐక్యత పెరిగిపోయింది. వారిలో చైతన్యం ఎక్కువైంది. అందువల్లే తమ జాతి అభ్యున్నతికి కృషి చేసిన వారందరినీ తలచుకుంటున్నారు. స్మరించుకుంటున్నారు. హిందువులు గొప్పగా చెప్పుకునే వ్యక్తులలో శివాజీ మహారాజ్ ఒకరు.

మహారాష్ట్రలో అద్భుతమైన పరిపాలన అందించి.. మహారాష్ట్ర ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు శివాజీ. నేటికీ మహారాష్ట్రలో శివాజీ ని తలవని ప్రాంతం.. స్మరించని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే శివాజీ విగ్రహాలను మనదేశంలో ఏర్పాటు చేయడం ఇటీవలీ కాలంలో పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ఇజ్రాయిల్ కూడా వచ్చి చేరింది. అదేంటి ఇజ్రాయిల్ కు, శివాజీకి ఏంటి సంబంధం.. ఇజ్రాయిల్ దేశం ఎందుకు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది.. అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.

ఇజ్రాయిల్ దేశంలో యూదులపై హింస చెలదగింది. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో వినయ్ ఇజ్రాయిల్ తెగ ప్రజలు ఓడలో ముంబై నగరానికి వచ్చారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని.. వ్యాపారాలు మొదలుపెట్టారు. సరిగ్గా 17వ శతాబ్దంలో శివాజీ వారి స్థావరాలను గుర్తించారు. సామర్ధ్యాలను పరీక్షించారు. ఆ తర్వాత వారిని తమ సైన్యంలో చేర్చుకున్నారు. అలా మరాఠీలు.. యూదులు కలిసిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు వారి మధ్య బలమైన బంధం ఉంది. ఆ బంధాన్ని మరింత బాధపేతం చేసుకోవడానికి ఇజ్రాయిల్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

శివాజీ శౌర్యత్వానికి.. వీరత్వానికి ప్రతీక అని ఇజ్రాయిల్ దేశస్తులు చెబుతుంటారు. అతడిని తమ వాళ్ళ ప్రాణాలు కాపాడిన వీరుడిలాగా చెబుతుంటారు. మన పక్కనే ఉన్న పాకిస్తాన్ హిందుస్థాన్ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తోంది. తమ దేశంలో ఉన్న భారత మూలాలను తొక్కిపెట్టేస్తోంది. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం శివాజీ చేసిన మంచితనాన్ని గుర్తించి.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికీ భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఇజ్రాయిల్ దేశం కొనసాగుతోంది.

నా తమ్ముడు రామ్ చరణ్ ని చూసి గర్వపడుతున్నాను అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..

Allu Arjun emotional post on Ram Charan
Allu Arjun emotional post on Ram Charan

Allu Arjun emotional post on Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ప్రతీ ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కచ్చితంగా నేషనల్ అవార్డు ని అందుకుంటాడని అంటున్నారు. అయితే ఇంత అద్భుతంగా నటించినప్పటికీ కూడా టాలీవుడ్ నుండి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ సినిమా గురించి కానీ , రామ్ చరణ్ నటన గురించి కానీ అభినందిస్తూ ట్వీట్లు వేయలేదని రామ్ చరణ్ అభిమానులు బాధపడ్డారు. అయితే కాసేపటి క్రితమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ట్వీట్ చేయగా , అది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నిన్న రాత్రే పెద్ది చిత్రాన్ని వీక్షించాను. నా సోదరుడు రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో మైమరచి పోయేలా చేసాడు. నా తమ్ముడు కి లభిస్తున్న ప్రశంసలు చూస్తుంటే నాకు చాలా గర్వం గా ఉంది. అందుకు ఆయన అర్హుడు. అదే విధంగా ఈ చిత్రం లో జగపతి బాబు గారు అద్భుతంగా నటించారు , జాన్వీ కపూర్ వెండితెర పై చూసేందుకు ఎంతో చక్కగా ఉంది. జగపతి బాబు గారు కూడా అదిరిపోయే రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రామ్ చరణ్ ని అద్భుతంగా చూపించినందుకు , ప్రతీ ఫ్రేమ్ లో ఆయన్ని ఎలివేట్ చేసినందుకు డైరెక్టర్ బుచ్చి బాబు కి ప్రత్యేక అభినందనలు , పెద్ది చిత్రం ఈ రేంజ్ ఘనవిజయం సాధించినందుకు టీం మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమా గురించి అల్లు అర్జున్ ఈ రేంజ్ లో మాట్లాడడం పై మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

చాలా కాలం నుండి అల్లు అర్జున్ , రామ్ చరణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ మీడియా ఒక రేంజ్ లో ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా ఈ కజిన్స్ నిరూపిస్తూనే ఉన్నారు. మా ఇద్దరి మధ్య పోటీ ఉన్నది వాస్తవమే , కానీ అది స్పోర్టివ్ నేచర్ లో ఉంటుంది అని చెప్పకనే చెప్తూ వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీ నుండి పెద్ది సినిమా గురించి మాట్లాడిన మొట్టమొదటి స్టార్ సెలబ్రిటీ గా నిలవడం తో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

బెంగళూరు విజయంపై మౌనం.. ఇన్నాళ్లకు కోహ్లీ స్పందించాడు.. వైరల్ వీడియో..

Virat Kohli reacts to Bengaluru victory
Virat Kohli reacts to Bengaluru victory

Virat Kohli reacts to Bengaluru victory: ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు 2024 వరకు దరిద్రం వైఫై లాగా ఉండేది. అనేక పర్యాయాలు ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీ ఆదుకోలేకపోయింది. ఇకపై ఎప్పటికీ ట్రోఫీ అందుకోలేదా.. బెంగళూరు జట్టుకు ఆ యోగం లేదా అని చాలామంది కామెంట్ చేసేవారు. ఇక అభిమానులైతే తీవ్రంగా కలత చెందేవారు. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది.

గత ఏడాది బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించింది. తద్వారా తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ ఏడాది కూడా బెంగళూరు అదరగొట్టింది. ప్రారంభం నుంచి విజేతగా నిలిచే వరకు సత్తా చూపించింది. ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టను వారి సొంత మైదానంలో ఓడించి సత్తా చూపించింది. తద్వారా వరుసగా రెండవసారి ట్రోఫీ అందుకొని సరికొత్త చరిత్రను లిఖించింది.

బెంగళూరు సాధించిన విజయం పట్ల ఆ జట్టు ఆటగాళ్లు రకరకాలుగా స్పందించారు. కోహ్లీ తీన్మార్ డాన్స్ వేసినప్పటికీ.. తన అసలైన ప్రతిస్పందన మాత్రం తెలియజేయలేదు. దీంతో అభిమానుల్లో ఏదో ఒక కలత ఉండేది. అనుమానం కూడా ఉండేది. అయితే వాటన్నింటిని విరాట్ కోహ్లీ పటా పంచలు చేశాడు. ఒక స్పెషల్ వీడియోతో అభిమానులను ఆకట్టుకున్నాడు..

“ఈ సీజన్ ను సానుకూల దృక్పథంతో ప్రారంభించాం.. చివరికి విజేతగా నిలిచి దానిని ముగించాం.. వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలవడం చాలా గొప్ప విషయం. బెంగళూరు దీనిని సాధించింది.. విజయాలు సాధ్యమయ్యాయి. ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టింది. అడ్డంకులు కూడా అవరోధాలు కలిగించాయి. ఇవన్నీ కూడా ఫాన్స్ సపోర్ట్ వద్దు పారిపోయాయి. అని భావోద్వేగాలను జట్టుగా కలిసి అనుభవించాం. బెంగళూరు జట్టు నాకు ఇల్లు లాంటిది.. ఈ అభిమానాన్ని మర్చిపోలేనని.. ఈ ట్రోఫీ సాధించడానికి గొప్పగా భావిస్తున్నానని” విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఏకంగా 675 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ చివరి వరకు నిలబడి సొంత జట్టును గెలిపించి.. విజేతగా నిలబడేలా చేశాడు. గత సీజన్ ఫైనల్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తనను రన్ మిషన్ అని ఎందుకంటారో.. చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. కాగా విరాట్ కోహ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.

భర్తతో హనీమూన్.. అక్కడే అనుకోని ఘటన.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Honeymoon dispute leads to divorce
Honeymoon dispute leads to divorce

Honeymoon dispute leads to divorce: సరిగా గత ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన సోనం, రఘు వంశీ అనే నూతన దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే సోనికి గతంలోనే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అతడితో పెళ్లి జరిపించాలని చెబితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో రఘు వంశీకి ఇచ్చి పెళ్లి చేశారు. రఘు వంశీతో ఉండడం ఇష్టం లేక సోనీ తన ప్రియుడిని అక్కడికి పిలిపించుకుంది. అతడి సహాయంతో రఘు వంశీని అంతం చేసింది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం కలిగించింది.

ఈ ఘటన జరిగిన తర్వాత హనీమూన్ కు వెళ్లే వారి దంపతుల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని కేసులు కూడా ఇటువంటివే వెలుగులోకి వచ్చాయి.. దీంతో చాలామంది యువకులు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ముఖ్యంగా మధ్యప్రదేశ్.. రాష్ట్రానికి చెందిన చాలామంది యువకులు పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మేఘాలయ హనీమూన్ తరహా కేసులు చాలావరకు వెలుగులోకి వచ్చాయి. మీడియా కూడా వాటికి విపరీతమైన ప్రయారిటీ ఇవ్వడంతో.. పరిస్థితి దారుణంగా మారిపోయింది.

తాజాగా ఇటువంటి హనీమూన్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే అది చాలా వింతగా ఉంది. హనీమూన్ వెళ్లి.. దగ్గరవలసిన భార్యాభర్తలు.. చివరికి విడిపోయారు. విడాకులు తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో చోటుచేసుకుంది. మీరట్ ప్రాంతానికి చెందిన యువతితో ఢిల్లీ నగరానికి చెందిన యువకుడికి వివాహం జరిగింది. ఆ తర్వాత నూతన దంపతులు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే కాబోయే భర్త నుంచి ఏకాంతాన్ని కోరుకున్న ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

హనీమూన్ కు ఆ యువకుడు తన తోబుట్టువు.. పేరెంట్స్ ను తీసుకొచ్చాడు. ఇది ఆ నూతన వధువుకు నచ్చలేదు. భర్తతో ఏకాంతం లభించలేదు. దీంతో ఆమెలో నైరాశ్యం పెరిగిపోయింది. మరో మాటకు తాగు లేకుండా విడాకులకు దరఖాస్తు చేసింది. ఇప్పటివరకు మూడుసార్లు ముఖాముఖీ నిర్వహించినప్పటికీ నూతన దంపతుల్లో మార్పు రాలేదు. దీంతో మరో సెషన్ కౌన్సిలింగ్ నిర్వహించి.. ఆ తదుపరి చర్యలను కోర్టు తీసుకునే అవకాశం ఉంది.

తన భార్య వాదనతో ఆ భర్త అంగీకరించడం లేదు. పేరెంట్స్ ని తీసుకొస్తే తప్పేంటి అని అతడు వాదిస్తున్నాడు. భార్యనేమో హనీమూన్ కి వెళ్తే తోడుగా పేరెంట్స్ ఎందుకని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. ఇండోర్ లాంటి ప్రాంతంలో భార్య భర్తను చంపితే.. మీరట్ ప్రాంతంలో మాత్రం హనీమూన్ కు తన భర్త పేరెంట్స్ ను తీసుకురావడంతో భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తంగా హనీమూన్ కేసులు మనదేశంలో భలే సాగుతున్నాయి.

అలా ఉండడం ఆమె తప్పా.. మగాడని పేరు పెడతారా.. ఏం చిల్లరగాళ్ళున్నర్రా.. పాపం ఈ మహిళ క్రికెటర్..

Bharti Fulmali social media trolling
Bharti Fulmali social media trolling

Bharti Fulmali social media trolling: ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుడుతున్నప్పుడు.. తల్లిదండ్రుల పోలికలతోనే జన్మిస్తాడు. పుట్టేది ఆడపిల్ల అయినా.. మగ పిల్లాడైనా సరే.. పుట్టే పిల్లలు అమ్మానాన్నల నుంచి జన్యులను.. వారి రూపురేఖలను.. చర్మం, అలవాట్ల వరకు అన్ని పుణికి పుచ్చుకుంటారు. కానీ ఈ విషయం తెలియని కొంతమంది మూర్ఖులు ట్రోల్ చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వాగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిని టీమిండియా మహిళా క్రికెటర్ ఎదుర్కొంటున్నది.

త్వరలో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది.. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో భారతి ఫుల్మాలి అనే ప్లేయర్ ఫోటోలను కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. మగాడిలా ఉందంటూ.. ఉమెన్స్ క్రికెట్ లోకి పురుషుడిని తీసుకున్నారా.. అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

భారతి ఎత్తుకు ఎత్తు.. సౌష్టవానికి సౌష్టవంతో కనిపిస్తూ ఉంటుంది. పైగా ఈమె అద్భుతమైన క్రికెటర్. వయసు దాదాపు 31 సంవత్సరాలు వరకు ఉంటుంది. మహారాష్ట్రలో పుట్టింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈ స్థాయి దాకా ఎదిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ ఈమెకు విపరీతంగా ఉంది. అందువల్లే నచ్చిన క్రికెట్లో మెచ్చిన ప్లేయర్ లాగా ఎదిగింది. అనేక కష్టాలు పడి.. ఈ స్థాయి దాకా వస్తే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నది. ఆడ పుట్టుక పుట్టినప్పటికీ.. కొంతమంది మూర్ఖుల వల్ల మగాడిగా ఉందని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కొంతమంది అయితే భారతిని ఉద్దేశించి ట్రాన్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు. రాయడానికి వీలు లేని భాషలో తిడుతున్నారు. వాస్తవానికి మహిళా జట్టులో అవకాశాలు రావాలంటే అంత సులభం కాదు. అనేక పరీక్షలు ఎదుర్కోవాలి. మెరుగైన ట్రాక్ రికార్డు కొనసాగించాలి. కొన్ని సందర్భాలలో ఇన్ని చేసినప్పటికీ అవకాశాలు లభించవు. ఈ స్థాయిలో ప్రతిభ చూపించినప్పటికీ కొంతమంది భారతిని విమర్శించడం ఆవేదన కలిగిస్తోంది. ఇదే క్రమంలో ఆమెకు తోటి ప్లేయర్లు అండగా ఉంటున్నారు. ఇటువంటివి కామన్ అని.. ఆట ద్వారా మాత్రమే నిరూపించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు.. 31 సంవత్సరాల భారతి టి20 వరల్డ్ కప్ లో కనుక సత్తా చూపిస్తే అందరి నోర్లు మూతపడతాయని విశ్లేషకులు అంటున్నారు.

ఆ రెండు ప్రాంతాల్లో 'పెద్ది' కి భారీ నష్టాలు తప్పేలా లేవుగా.. ఇలా జరుగుతుందని ఊహించలేదు..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi movie losses in two regions: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో ఎంత సూపర్ హిట్ సినిమాకు అయినా , మొదటి వీకెండ్ తర్వాత భారీ వసూళ్లు రావడం అనేది చాలా కష్టం గా మారింది. అలాంటిది ఈ చిత్రానికి సోమవారం రోజు కూడా అద్భుతమైన గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి భారీ లాభాలను సొంతం చేసుకుంటుంది , అందులో ఎలాంటి సందేహం లేదు.

కానీ ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. ఆ ప్రాంతం లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడబోతుంది ఈ చిత్రం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం , ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్ల పే రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వస్తుందని అనుకున్నారు కానీ , 5 రోజులు దాటినప్పటికీ కూడా అంతటి గ్రాస్ నమోదు అవ్వలేదు. దీంతో ఓవర్సీస్ బయ్యర్స్ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 7 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పటి వరకు కేవలం ఆ ప్రాంతం నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఈ వారం తో పూర్తిగా థియేట్రికల్ రన్ కూడా అయిపోనుంది. మరో పక్క నైజాం ప్రాంతం లో కూడా ఈ చిత్రానికి నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 58 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి. అయితే ఈ సినిమా 50 కోట్ల మార్కుని అయితే కచ్చితంగా అందుకుంటుందని , 58 కోట్లు వసూలు చేయడం ప్రస్తుతానికి కష్టమని , ఈ ప్రాంతంలో భారీ నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు , చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది.

వైట్ జెర్సీ వేసుకున్నాను.. అంపైర్ అర్థం చేసుకున్నారు.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్మృతి మందాన స్టోరీ

Smriti Mandhana emotional story
Smriti Mandhana emotional story

Smriti Mandhana emotional story: భారత మహిళా క్రికెట్ జట్టులో విమెన్ విరాట్ కోహ్లీ మాదిరిగా పేరు తెచ్చుకుంది స్మృతి మందాన. ఆమె ఫార్మాట్ తో సంబంధం లేకుండానే పరుగులు తీస్తూ ఉంటుంది. ఓపెనర్ గా బరిలోకి దిగే ఆమె.. శివంగి మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె నిలబడితే చాలు టీమిండియా భారీ స్కోర్ చేసినట్టే.. తోటి ప్లేయర్లకు కష్టపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసి ఆమెకు ఇచ్చేస్తే సరిపోతుంది.

స్మృతి మందాన అనేక కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి దాకా వచ్చింది. వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు గురైనప్పటికీ.. రకరకాల విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. పైగా రాకెట్ వేగంతో దూసుకు వచ్చింది. ఇప్పుడు టీం ఇండియాలో అసలు సిసలైన ప్లేయర్ గా ఆమె నిలబడింది. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు ఆశా కిరణం లాగా కనిపిస్తోంది.

స్మృతి మందాన కొన్ని సందర్భాలలో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కాలంలో అనేక సందర్భాలలో ఆమె తన జీవితంలో చోటు చేసుకున్న విషయాలను వెల్లడించింది. అయితే క్రికెట్ ఆడుతున్నప్పుడు తన ఇబ్బందులను ఇటీవల చెప్పిన తీరు కంటనీరు తెప్పిస్తోంది.. కొన్ని సందర్భాలలో దేశం కోసం ఆడుతున్నప్పుడు రకరకాల నొప్పులను అనుభవించాల్సి ఉంటుందని ఆమె చెప్పిన తీరు గుండెను ద్రవింపజేస్తోంది.

అప్పట్లో స్మృతి ఒక మ్యాచ్ ఆడుతోంది. ఆమె వైట్ జెర్సీ ధరించి ఉంది. అకస్మాత్తుగా ఆమెకు నెలసరి వచ్చింది. భరించలేని నొప్పి ఆమెను ఇబ్బంది పడుతోంది. అప్పటికి తట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ ఇక ఆమె వల్ల కావడం లేదు. దీంతో ఆమె పరిస్థితిని మైదానంలో ఉన్న అంపైర్ అర్థం చేసుకున్నారు. వెంటనే ఆమె మైదానం నుంచి బయటికి పరుగులు పెట్టింది. తనకు కావలసిన రక్షణ చర్యలను తీసుకుంది. కొన్ని సందర్భాలలో దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆ నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది అని చెప్పడం స్మృతి వ్యక్తిత్వానికి నిదర్శనం గా నిలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఐసీసీ నిబంధనలలో మహిళా ప్లేయర్లకు నెలసరి విషయంలో ఎటువంటి రూల్ లేకపోవడం గమనార్హం. ఇకపై నైనా ఐసీసీ ఆ రూల్ సవరిస్తుందో చూడాల్సి ఉంది.

సాధారణంగా ఆ సమయంలో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. కొందరికి ఆరోగ్యరీత్యా సమస్య అధికంగా ఉంటుంది. భరించలేని నొప్పి కూడా ఉంటుంది. అలాంటప్పుడు వారు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దేశం కోసం ఆడుతున్నప్పుడు మహిళా క్రీడాకారులకు అటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వారు ఇబ్బంది పడుతూనే మ్యాచ్ సాగించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఐసీసీ మహిళా క్రీడాకారులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని.. వెసలు బాటు ఇవ్వాలని మాజీ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ టి20 వరల్డ్ కప్ లోనైనా ఐసీసీ ఆ నిబంధన తీసుకొస్తుందో చూడాల్సి ఉంది.

పిచ్చి వేశాలు వేస్తే ఒంటరి అవుతావు.. నెతన్యాహుకు ట్రంప్‌ వార్నింగ్‌!

Trump warning to Netanyahu
Trump warning to Netanyahu

Trump warning to Netanyahu: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్‌ మాటను ఇజ్రాయెల్‌ పట్టించుకోవడం లేదు. ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందానికి విఘాతం కలుగుతోంది. ఇరాన్‌పై దాడి చేయొద్దని ఇప్పటికే ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు సూచించారు. ఈమేరకు ఫోన్‌లో మాట్లాడారు. అయినా నెతన్యాహు పట్టించుకోలేదు. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నారు. దీంతో తాజాగా ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు.

ఇంటర్వ్యూలో వార్నింగ్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును ‘బి కేర్‌ఫుల్‌‘ అని హెచ్చరించారు. ఇరాన్‌పై మరొక ప్రత్యక్ష దాడికి దిగితే ఇజ్రాయెల్‌ ఒంటరి అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. ట్రంప్‌ హెచ్చరిక వెనుక మూడు రాజకీయ సందేశాలు ఉన్నాయి. అమెరికా పాక్షికంగా ఇజ్రాయెల్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వదనే సంకేతం, ప్రాంతీయ స్థిరత్వాన్ని పరిరక్షించాలనే కోరిక, అలాగే దౌత్యపరమైన ఒత్తిడితో ఇజ్రాయెల్‌ చర్యలను నిరోధించాలనే ఉద్దేశ్యం.

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘనలు..
అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య ఏప్రిల్‌లో తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిరింది. కానీ, ఇటీవల అమెరికా ఇరాన్‌పై దాడులు చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలతోపాటు ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేసింది. దీనిని సవాల్‌గా తీసుకున్న ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై భీకర దాడుల ప్రారంభించింది. తాజాగా ట్రంప్‌ సూచన తరువాత ఇజ్రాయెల్‌ తక్షణంగా దాడులను నిలిపివేసినట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్‌ రెండూ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రాంతీయ ప్రభావాలు
మధ్య ప్రాచ్యంలో ప్రతీ యుద్ధ సంకేతం ఇంధన మార్కెట్లపై, శాంతి ప్రక్రియలపై తక్షణ ప్రభావం చూపుతుంది. సౌదీ అరేబియా, ఐరాన్‌కు శత్రుత్వం కలిగిన సభ్యదేశాలు, అలాగే రష్యా–చైనా వంటి ప్రధాన శక్తులు తమ స్థానాన్ని పునర్నిర్వచించుకోవచ్చు. చిన్న శక్తి గుంపులు, ప్రాదేశిక మిలిషియా సంస్థలు కూడా తమ చర్యల మాధ్యమంగా పరిసర వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చవచ్చు.

దౌత్య వ్యూహాలు..
ట్రంప్‌ హెచ్చరికతో అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా నిలిపవేసే అవకాశం ఉంది. సైనిక సహకారం అందించకపోవచ్చు. ఇజ్రాయెల్‌ లోకల్‌ పాలనా, నెతన్యాహు తన నిర్ణయాలను స్థానిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయ మధ్యస్థత్వం, మూడవ పక్షాల పర్యవేక్షణ కీలకం అవుతుందని దౌత్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్రంప్‌ హెచ్చరిక నెతన్యాహు, ఇజ్రాయెల్‌ నిర్ణయాల్లో తాత్కాలిక ఒత్తిడిని సృష్టించింది. అయితే సీజోన్‌ఫైర్‌ ప్రకటనలపై నమ్మకంపై పశ్చాత్తాపాలేవు. మైదానంలో నియమాలు మారడానికి, ప్రాంతీయ అల్లర్లు తగ్గడానికి అంతర్జాతీయ డిప్లొమసీ, పాక్షిక పర్యవేక్షణ, సుస్థిర విధానాల అమలే కీలకం.

అంతలా ఇబ్బంది పెడితే సూర్య వంశీ మాత్రం ఏం చేస్తాడు..బుడ్డోడిని వదిలేయండ్రా ప్లీజ్

Vibhav Surya Vamsi under pressure
Vibhav Surya Vamsi under pressure

Vibhav Surya Vamsi under pressure: కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటిపోతుంది. అంచనాలను మించిపోతుంది. మన వరకు అభిమానం కరెక్ట్ గానే ఉంటుంది. కానీ దాన్ని మోసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు. ఆ బరువు దించుకునే క్రమంలో సెలబ్రిటీలు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఒక వయసులో ఆ ఇబ్బంది పెద్దగా బరువు అనిపించదు గాని.. 15 సంవత్సరాల వయసులో టన్నుల అభిమానాన్ని మోయాలంటే చాలా కష్టం. దాన్ని దించుకోవాలంటే కూడా కష్టమే. ఇప్పుడు ఇదే పరిస్థితిని టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ అనుభవిస్తున్నాడు.

సూర్య వంశీ ఇటీవలి ఐపిఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఒక సెంచరీ.. హాఫ్ సెంచరీలతో అతడు అదరగొట్టాడు. మూడుసార్లు సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొట్టిన నేపథ్యంలో అతడికి జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ టూర్ లో అతడికి చోటు కల్పించారు.

ప్రస్తుతం సూర్య వంశీ శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆడుతున్నాడు. అతడి మీద భారీగా అంచనాలు ఉండడంతో.. తట్టుకోలేకపోయాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. మూడు బౌండరీలు సాధించి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. అతడు మహమ్మద్ షిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున అదరగొట్టిన ప్రభ్ సిమ్రాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.. ప్రియాంష్ ఆర్య 32.. పరుగులతో సత్తా చూపించాడు. అయితే చెన్నై జట్టు సారధిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 101 పరుగులు చేసి సత్తా చూపించాడు.

సూర్యవంశీ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. కెప్టెన్ తిలక్ వర్మ (60) గైక్వాడ్ తో కలిసి సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. అందువల్లే టీం ఇండియా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్య వంశీ మీద మీడియా కూడా విపరీతంగా ఫోకస్ పెట్టడం.. అతని ఆట ఎలా ఉంటుందో ముందస్తుగానే అంచనాలు వేయడంతో.. సూర్య వంశీ ఒత్తిడి ఎదుర్కొన్నాడు. మైదానంలోకి దిగడమే అతడు కాస్త అసహనంగా కనిపించాడు. అందువల్లే త్వరగా అవుట్ అయ్యాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై అతడిని స్వేచ్ఛగా ఆడుకొని ఇవ్వాలని.. అతడి మీద అనవసరమైన ఒత్తిడి పెట్టకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

నిన్న ఫిలిప్పీన్స్‌.. నేడు క్యూబా, ఇరాన్‌.. వణికిస్తున్న వరుస భూకంపాలు!

Cuba earthquake
Cuba earthquake

Cuba earthquake: వరుస భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. జూన్‌ 8, 2026న ఫిలిప్పీన్స్‌లో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా ఆస్తి నష్టం జరిగింది. సునామీ హెచ్చరిక జారీ అయింది. సముద్రపు అలలు పోటెత్తాయి. తాజాగా జూన్‌ 9న క్యూబా, ఇరాన్‌ను భూకంపాలు వణికించాయి. రెండు రోజుల వ్యవధిలో మూడు దేశాల్లో భూకంపాలు రావడం గమనార్హం.

ఫిలిప్పీన్స్‌లో ఇలా..
ఫిలిప్పీన్స్‌లో భూకంపం పెద్ద నష్టాలకు కారణమైంది. 32 మంది మరణించారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఇక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సునామీ హెచ్చరికతో తీరప్రాంతంలోని వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరుద్ధరణకు చాలా సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

క్యూబాలో 6.1 తీవ్రత..
క్యూబాలోని మాంటువా సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే రికార్డు ప్రకారం ఈ ప్రదేశంలో 1880 తర్వాత ఇది అత్యంత శక్తివంతమైనదని స్థానికులు తెలిపారు. కెరీబియన్‌ నుంచి ఫ్లోరిడా, మెక్సికో వరకు భూమి కంపించింది. ఫ్లోరిడా వంటి ప్రాంతాలు భూమి మీద నేరుగా నష్టం లేకపోయినా, కంపనలు భద్రత భావనలో లేదా నిర్మాణపరమైన చిన్న లోపాల్లో లలిత ప్రభావం చూపవచ్చు.

ఇరాన్‌లో 5.0 తీవ్రత..
ఇక ఇరాన్‌లోని హర్మూజ్‌ ప్రాంతంలో 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. స్థానిక మెట్రిక్స్‌ ప్రకారం మధ్యస్థాయిలోనే తీవ్రత ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద మానవ నష్టం జరుగలేదు. కొన్ని భవనాలు కూలిపోయాయి. భూకంప కేంద్రం హర్మూజ్‌కు సమీపంగా ఉన్నందున సముద్ర సంబంధిత సాంకేతికుల పర్యవేక్షణ అవసరం

ఈ మూడు సంఘటనలు, భాగంగా ఒకే సమయక్రమంలో సంభవించడం, ప్రపంచ వ్యాప్తంగా భూకంప ప్రమాదాలపై మన దృష్టిని ఆలోచింపజేసింది. భౌగోళిక లక్షణాలు, నిర్మాణ స్థానములు, ప్రాథమిక సేవల సామర్థ్యం అనుసరించి ప్రతిస్పందన వ్యూహాలు మారాలి. స్థానిక ప్రభుత్వాలు, జాతీయ సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు సమన్వయంగా పనులు చేయాలి.

నెహ్రూను దాటేస్తాడంతే.. మోడీతో అట్లుంటదీ మరీ

Modi India GDP Growth
Modi India GDP Growth

Narendra Modi surpasses Nehru: పదవిలో నిరంతరంగా ఉండటం ఒక నాయకుడి సామర్థ్యమని కొందరు అంటారు. మరికొందరు అది ప్రజాస్వామ్యానికి విఘాతం అంటారు. నరేంద్ర మోదీ 2014లో మొదట బాధ్యతల్ని స్వీకరించినప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ జవహర్‌లాల్‌ నెహ్రూను దాటి దేశంలో ఎక్కువకాలం ఎన్నికై ప్రధాని ఉన్న రికార్డును తమ ఖాతాలో పెట్టుకోబోతున్నారు. గణాంకంగా ఇది ఒక సాధారణ విషయం కాదు. పాలనా సమర్థతపై, ప్రజాప్రతినిధ్యంపైన తీవ్రమైన చర్చలకు స్పందన. ఒకవైపు, స్థిరత్వం లభించడం నిర్దిష్ట విధానాలను కొనసాగించడానికి సౌకర్యం ఇస్తుంది.

కేంద్రం విధానాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానాలు, స్నేహపూర్వక సంక్షేమ పథకాలు, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలు నిరంతర ప్రత్యేక పథకాల రూపంలో కొనసాగుతున్నాయి. ఈ పథకాలను విజయాలుగా చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించటం స్వభావికం. ముఖ్యంగా గ్రామీణ, నిర్లక్ష్యమైన వర్గాలకు చేరే ప్రభావం ఉంటే ఇదే ప్రభుత్వ వైఖరికి శక్తివంతంగా మారుస్తుంది. కానీ దీర్ఘ పాలనకు ప్రతికూలమైన పాక్షికతలను నిర్లక్ష్యం చేయరాదు. మరో ముఖ్య అంశం మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నిర్వహించిన వ్యవహారాలు, తరువాత అదే పాలసీని అన్వయించడం దేశ ప్రజలను ఆకట్టుకుంది.

నెహ్రూతో పోలిక…
జవహర్‌లాల్‌ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా కొనసాగారు. మొత్తం 6,130 రోజులు పాలించారు. 1947 ఆగస్టు 15న ఆయన ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని కాదు. 1952, మే 13న జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యారు. మొత్తం 6,130 రోజులు పాలించారు. అయితే ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగు కానుంది. మోదీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి రికార్డు సృష్టించబోతున్నారు. నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా 4,398 రోజులు పాలించారు. మోదీ దానిని అధిగమించనున్నారు. 4,399 రోజులు జూన్‌ 10న పూర్తిచేసుకుంటారు. దీంతో నెహ్రూ రెండో స్థానానికి పడిపోతారు. మూడో స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పాలన సాగించారు.

ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం..
నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పనిచేసిన రికార్డును ఇప్పటికే సొంతం చేసుకున్నారు. సిక్కిం సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ 8,930 రోజులు ప్రభుత్వాధినేతగా పనిచేయగా, మోదీ ఈ ఏడాది మార్చిలోనే దానిని అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్‌ సీఎంగా మోదీ పనిచేశారు.

మొత్తంగా నరేంద్రమోదీ జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును చెరిపేశారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. దటీజ్‌ మోదీ అనిపించుకున్నారు.

రాజకీయ క్రీడ.. దారి తప్పుతున్న యువత!

Cockroach Janata Party youth politics
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party youth politics: ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న కొన్ని నిరసన కార్యక్రమాలు యువత మానసిక స్థితిని, రాజకీయ ఉద్దేశాలను, దేశ భద్రతను ఒకేసారి ప్రశ్నించేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘‘కాక్రోచ్‌ జనతా పార్టీ’’ పేరుతో వచ్చిన ఈ ఉద్యమం సామాజిక మాధ్యమాల్లో హైప్‌ సృష్టించినప్పటికీ, నిజం పరీక్షలో తేలిపోయింది. జెన్‌జీ యువతలో మానసిక వృద్ధాప్యం, గుర్తింపు సంక్షోభం ఈ నిరసనల్లో పాల్గొన్న యువకులు తాము ఎందుకు రంగంలోకి దిగారో స్పష్టంగా తెలియని పరిస్థితి కనిపించింది. కర్రలు, పెప్పర్‌ స్ప్రేలు తీసుకుని వచ్చి ‘‘కొట్టండి, తిరగబడండి, నరకండి’’ వంటి పిలుపులు ఇవ్వడం హింసా వైఖరిని ప్రతిబింబిస్తోంది. ఇది గుర్తింపు కోసం చేసే ఉద్యమం కాదు, మానసిక అపరిపక్వత వల్ల ఏర్పడిన ఆందోళనగా కనిపిస్తోంది. యువత తమ నిరాశలను, ఉద్యోగాలు, విద్యా వ్యవస్థ సమస్యలను రాజకీయ శక్తులు తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించుకుంటున్నారు.

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన..
నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు లక్షలాది మంది వస్తారని ప్రకటించినప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే ఉండటం ఆయోజకుల తప్పిదాన్ని బయటపెట్టింది. సోషల్‌ మీడియా హైప్‌తో ప్రారంభమైన ఉద్యమం ఆఫ్‌లైన్‌లో తేలిపోవడం ఈ నాటకం పరిమితులను చూపించింది. ఇది నిజమైన ఉద్యమం కాదని, తప్పుడు ప్రచారం ద్వారా యువతను ఆకర్షించి రాజకీయ లాభం కోసం వాడుకోవాలనే ప్రయత్నమని స్పష్టమవుతోంది.

రాజకీయ ఆయుధంగా నీట్‌..
నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలను సమస్యగా చూడాలి, కానీ దాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించడం సరైన విధానం కాదు. కాక్రోచ్‌ జనతా పార్టీ ఈ సమస్యను రాజకీయీకరణ చేసి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యా వ్యవస్థ సంస్కరణ కోసం నిర్మాణాత్మక చర్చలు చేయాల్సిన చోట, హింసాత్మక నినాదాలు, దేశ వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడం యువత భవిష్యత్తును దెబ్బతీస్తోంది.

విదేశీ సహకారంతో దేశ ద్రోహ కార్యకలాపాలు..
కాక్రోచ్‌ జనతా పార్టీ కార్యక్రమాల వెనుక పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల సహకారం ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరగడం ఎవరికీ మంచిది కాదు. చైనాలో ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటారు. కానీ భారతదేశంలో వామపక్ష, కాంగ్రెస్‌ భావజాలం ఉన్నవారు దేశ భావన ఉన్నవారిపై తిరగబడుతున్నారు. జాతీయవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసనలపై దేశభక్తులు తమ నిరసన తెలుపుతున్నారు.

యువ శక్తి నిర్వీర్యం..
తప్పుడు ప్రచారం, మోసాల ద్వారా యువతను రాజకీయ ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. ఇలాంటి ఉద్యమాలు దీర్ఘకాలికంగా యువతలో నిరాశ, విద్వేషాలను మాత్రమే పెంచుతాయి తప్ప, నిజమైన సమస్యలకు పరిష్కారం ఇవ్వవు. విశ్లేషకులు చెబుతున్నట్లు, యువత ఇప్పుడు సరైన మార్గదర్శకత్వం, నిజాయితీ ఉన్న నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది.

నిరసనలు ప్రజాస్వామ్య హక్కు, కానీ దాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలు, హింస, తప్పుడు ప్రచారం కోసం ఉపయోగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కాక్రోచ్‌ జనతా పార్టీ వంటి ఉద్యమాలు యువతను మేల్కొల్పడం కాదు, మరింత గందరగోళంలోకి నెట్టడమే. యువత తమ శక్తిని నిర్మాణాత్మక దిశగా మళ్లించుకోవాలి. దేశం అభివృద్ధి చెందాలంటే, యువతను రాజకీయ మోసాల నుంచి రక్షించడం అందరి బాధ్యత.

బరువులు మోసుకెళ్లడానికి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టాప్ 5 ఇవే..

Best Electric Scooters For Carrying Loads
Best Electric Scooters For Carrying Loads

Best Electric Scooters For Carrying Loads: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ఉద్యోగులతో పాటు వ్యాపారులు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కిరాణం షాపు ఉన్న వారితో పాటు ఇతర సామాగ్రిని తరలించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ తో పాటు ఇతర అవసరాలు తీరడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమయంలో వీరు ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే బెటర్ అన్న సందేహం వస్తుంది. మంచి స్టోరేజ్ స్పేస్, బలమైన లోడ్ సామర్థ్యం, ఎక్కువ రేంజ్ వంటి లక్షణాలతో కొన్ని మోడళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి వివరాల్లోకి వెళితె..

1. Ather Rizta :
అథర్ రిజ్టా ప్రధానంగా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఈ స్కూటర్‌లో సీటు కింద సుమారు 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అదనంగా ఫ్రంట్ స్టోరేజ్ ఎంపిక కూడా ఉండటంతో కూరగాయలు, కిరాణా వస్తువులు, చిన్న బ్యాగులను సులభంగా ఉంచుకోవచ్చు. విశాలమైన సీటింగ్ కారణంగా ఇద్దరు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. రేంజ్ కూడా బాగుండటంతో నగర ప్రయాణాలకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. భారత మార్కెట్లో అథర్ రిజ్టా ధర సుమారు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

2. River Indie:
రివర్ ఇండీని చాలామంది ‘స్కూటర్లలో ఎస్‌యూవీ’ అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం భారీ స్టోరేజ్ సామర్థ్యం. ఈ స్కూటర్‌లో ముందు భాగంలో లాక్ చేయగలిగే గ్లోవ్ బాక్స్‌లు, పెద్ద ఫుట్‌బోర్డ్, సీటు కింద స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద 40 లీటర్లకు పైగా సామాను ఉంచుకునే అవకాశం ఉంటుంది. కిరాణా షాపింగ్ చేసే వారికి ఇది అత్యంత అనుకూలమైన మోడళ్లలో ఒకటిగా భావిస్తారు. దీని ధర సుమారు రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.

3. Bajaj Chetak 3501:
బజాజ్ చేతక్ 3501 ప్రీమియం మెటల్ బాడీ, బలమైన నిర్మాణ నాణ్యతతో ఆకట్టుకుంటుంది. సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ ఉండటంతో రోజువారీ సరుకులు, కార్యాలయ బ్యాగులు లేదా కిరాణా సామగ్రిని తీసుకెళ్లడం సులభం. స్థిరమైన రైడింగ్ అనుభవం, విశ్వసనీయత కారణంగా కుటుంబ వినియోగదారులు ఈ మోడల్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ఉంటుంది.

4. Ola S1 Pro ప్లస్:
ఓలా S1 Pro+ అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరుతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. పెద్ద సీటు కింద స్టోరేజ్, ఎక్కువ రేంజ్, వేగవంతమైన యాక్సిలరేషన్ దీని ప్రధాన ఆకర్షణలు. రోజువారీ ప్రయాణాలతో పాటు సూపర్ మార్కెట్ షాపింగ్ చేసినప్పుడు తీసుకొచ్చే బ్యాగులను సులభంగా ఉంచుకోవచ్చు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ స్కూటర్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఉండవచ్చు.

5. TVS Orbiter:
టీవీఎస్ ఆర్బిటర్ ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న మోడల్ కాకపోయినా, భారీ లోడ్ సామర్థ్యం మరియు యుటిలిటీ ఆధారిత డిజైన్‌తో చర్చనీయాంశమైంది. పెద్ద ఫుట్‌బోర్డ్, అదనపు లగేజ్ స్పేస్ వంటి లక్షణాలతో కిరాణా సరుకులు లేదా డెలివరీ అవసరాలకు అనుకూలంగా రూపొందించే దిశగా అభివృద్ధి జరుగుతోంది. అందుబాటు మరియు ధర ప్రాంతానుసారం మారవచ్చు.