Homeక్రీడలుక్రికెట్‌Bharti Fulmali social media trolling: అలా ఉండడం ఆమె తప్పా.. మగాడని పేరు పెడతారా.....

Bharti Fulmali social media trolling: అలా ఉండడం ఆమె తప్పా.. మగాడని పేరు పెడతారా.. ఏం చిల్లరగాళ్ళున్నర్రా.. పాపం ఈ మహిళ క్రికెటర్..

Bharti Fulmali social media trolling: ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుడుతున్నప్పుడు.. తల్లిదండ్రుల పోలికలతోనే జన్మిస్తాడు. పుట్టేది ఆడపిల్ల అయినా.. మగ పిల్లాడైనా సరే.. పుట్టే పిల్లలు అమ్మానాన్నల నుంచి జన్యులను.. వారి రూపురేఖలను.. చర్మం, అలవాట్ల వరకు అన్ని పుణికి పుచ్చుకుంటారు. కానీ ఈ విషయం తెలియని కొంతమంది మూర్ఖులు ట్రోల్ చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వాగుతూ ఉంటారు. ఇటువంటి […]

Bharti Fulmali social media trolling: ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుడుతున్నప్పుడు.. తల్లిదండ్రుల పోలికలతోనే జన్మిస్తాడు. పుట్టేది ఆడపిల్ల అయినా.. మగ పిల్లాడైనా సరే.. పుట్టే పిల్లలు అమ్మానాన్నల నుంచి జన్యులను.. వారి రూపురేఖలను.. చర్మం, అలవాట్ల వరకు అన్ని పుణికి పుచ్చుకుంటారు. కానీ ఈ విషయం తెలియని కొంతమంది మూర్ఖులు ట్రోల్ చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వాగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిని టీమిండియా మహిళా క్రికెటర్ ఎదుర్కొంటున్నది.

త్వరలో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది.. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో భారతి ఫుల్మాలి అనే ప్లేయర్ ఫోటోలను కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. మగాడిలా ఉందంటూ.. ఉమెన్స్ క్రికెట్ లోకి పురుషుడిని తీసుకున్నారా.. అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

భారతి ఎత్తుకు ఎత్తు.. సౌష్టవానికి సౌష్టవంతో కనిపిస్తూ ఉంటుంది. పైగా ఈమె అద్భుతమైన క్రికెటర్. వయసు దాదాపు 31 సంవత్సరాలు వరకు ఉంటుంది. మహారాష్ట్రలో పుట్టింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈ స్థాయి దాకా ఎదిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ ఈమెకు విపరీతంగా ఉంది. అందువల్లే నచ్చిన క్రికెట్లో మెచ్చిన ప్లేయర్ లాగా ఎదిగింది. అనేక కష్టాలు పడి.. ఈ స్థాయి దాకా వస్తే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నది. ఆడ పుట్టుక పుట్టినప్పటికీ.. కొంతమంది మూర్ఖుల వల్ల మగాడిగా ఉందని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కొంతమంది అయితే భారతిని ఉద్దేశించి ట్రాన్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు. రాయడానికి వీలు లేని భాషలో తిడుతున్నారు. వాస్తవానికి మహిళా జట్టులో అవకాశాలు రావాలంటే అంత సులభం కాదు. అనేక పరీక్షలు ఎదుర్కోవాలి. మెరుగైన ట్రాక్ రికార్డు కొనసాగించాలి. కొన్ని సందర్భాలలో ఇన్ని చేసినప్పటికీ అవకాశాలు లభించవు. ఈ స్థాయిలో ప్రతిభ చూపించినప్పటికీ కొంతమంది భారతిని విమర్శించడం ఆవేదన కలిగిస్తోంది. ఇదే క్రమంలో ఆమెకు తోటి ప్లేయర్లు అండగా ఉంటున్నారు. ఇటువంటివి కామన్ అని.. ఆట ద్వారా మాత్రమే నిరూపించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు.. 31 సంవత్సరాల భారతి టి20 వరల్డ్ కప్ లో కనుక సత్తా చూపిస్తే అందరి నోర్లు మూతపడతాయని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper