Home Blog Page 164

'డ్యూడ్ 2' వచ్చేస్తోంది.. సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈసారి స్టోరీ ఏంటంటే..

Dude 2 Sequel Update
Dude 2 Sequel Update

Dude 2 Sequel Update: ‘లవ్ టుడే’ , ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత, ప్రదీప్ రంగనాథన్ చేసిన చిత్రం ‘డ్యూడ్’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చింది , కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపేసింది. దాదాపుగా 124 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. థియేటర్స్ లో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చి ఉండొచ్చు కానీ , ఓటీటీ లో విడుదలయ్యాక మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా విడుదలై ఏడాది కావొస్తుంది , కానీ ఇప్పటికీ ఈ చిత్రం మేనియా నుండి ఆడియన్స్ బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను రీల్స్ గా , మీమ్స్ గా వాడుతూనే ఉన్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కీర్తి స్వరణ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘డ్యూడ్ చిత్రానికి సీక్వెల్ చేయదగ్గ కథ నా దగ్గర ఉంది. వర్కౌట్ అయితే , పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తాను , కచ్చితంగా ఈ చిత్రానికి సీక్వెల్ కార్యరూపం దాలుస్తుంది అనే నమ్మకం నాకు బలంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మొదటి భాగం లో తానూ ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని , స్వయంగా దగ్గరుండి పెళ్లి చేసి పంపిస్తాడు హీరో. అదే విధంగా హీరోయిన్ కూడా హీరో కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. కథ సుఖాంతం , ఇక ఏముంది అని మీరు అనుకోవచ్చు.

పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి కాపురాల్లో చిచ్చు చెలరేగి విడిపోయి, మళ్లీ హీరో హీరోయిన్ కలిస్తే?, అలాంటి లైన్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా?, ఇలాంటి స్టోరీ లైన్ మీద సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఇలా కొనసాగింపుగా కాకుండా, వేరే కథ తో ఈ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ కి రీసెంట్ గానే ‘LIK ‘ తో బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయనకు సూపర్ హిట్ కచ్చితంగా అవసరం. కాబట్టి ఆయన తదుపరి చిత్రం ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

'బిగ్ బాస్ 10' ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా.. ఈసారి వివాదాలు.. గొడవలు మామూలుగా ఉండవు..

Bigg Boss 10 Telugu
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముందు సీజన్స్ తో పోలిస్తే , గత సీజన్ లో జరిగిన గొడవలు చాలా తక్కువే, కానీ కంటెస్టెంట్స్ మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం తో ఈ సీజన్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సీజన్ గా నిల్చింది ‘బిగ్ బాస్ 9’. ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో మరొకటి ‘అగ్నిపరీక్ష’ అనే షో. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామాన్యులు సాలిడ్ కంటెంట్ ఇచ్చారు. వారిలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలబడగా, మరొకరు టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా రెడీ అయిపోయిందని అంటున్నారు . వారిలో ఒక పది మంది పేర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తోంది. వారిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది తేజస్విని గౌడ. సీరియల్ హీరోయిన్ గా ఈమెకు ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. పైగా అమర్ దీప్ చౌదరి వంటి క్రేజీ టాప్ టీవీ సీరియల్ హీరో కి సతీమణి అవ్వడం తో ఈమెకు క్రేజ్ ఇంకా ఎక్కువ పెరిగింది . గత రెండు సీజన్స్ నుండి ఈమె కోసం బిగ్ బాస్ టీం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఎట్టకేలకు ఈ సీజన్ లో ఆమె పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న , బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కూడా ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని టాక్.

బయట ఉన్నప్పుడే ఇతగాడు ఏ రేంజ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసేవాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నాడు , గొడవలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. అదే విధంగా ఈ షోలో కంటెస్టెంట్స్ గా పల్లవి గౌడ , హరి , నూకరాజు , రాకింగ్ రాకేష్ , పండు మాస్టర్ , జ్యోతి , రాయల్ మేక్ రమణ, నందూస్ వరల్డ్ నందూ , శివ కుమార్ వంటి కంటెస్టెంట్స్ కూడా పాల్గొనబోతున్నారు. దశావతారం థీమ్ తో నడవనున్న ఈ సీజన్ లో సరికొత్త రూల్స్, ఎప్పుడూ చూడనటువంటి టాస్క్స్ ని డిజైన్ చేస్తున్నారట. చూడాలి మరి , ఈ సీజన్ కూడా గత సీజన్ లాగానే బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో అనేది.

నిర్మాతగా మారిన అక్కినేని నాగ చైతన్య.. తొలి ప్రాజెక్ట్ లో హీరో ఎవరంటే..

Akkineni Naga Chaitanya Producer Debut
Akkineni Naga Chaitanya Producer Debut

Akkineni Naga Chaitanya Producer Debut: అక్కినేని కుటుంబం లో ప్రస్తుతం మినిమం గ్యారంటీ రేంజ్ లో వసూళ్లను రాబట్టే హీరోలలో ఒకరు అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య సినిమా వస్తుందంటే , కచ్చితంగా బాగుంటుంది , థియేటర్ లోనే చూడాలి అని అనుకునే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కెరీర్ లో చాలా ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, కల్ట్ క్లాసిక్ చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి తండేల్ చిత్రం ఎలాంటి బిగ్ రిలీఫ్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకంటే ముందుగా ఆయన ‘దూత’ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ కి పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ గా ‘దూత 2’ రాబోప్తుంది.

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. మొదటి సీజన్ లో నటించిన నటీ నటులే రెండవ సీజన్ లో కూడా నటించబోతున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించబోతుంది. ఇక నాగ చైతన్య ఈ సిరీస్ లో హీరో గా నటించడమే కాకుండా, సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దీని గురించి మాట్లాడుతూ ‘నటన కంటే భిన్నంగా ఎదో ఒక కొత్త ప్రయత్నం చెయ్యాలని అనిపించింది. అందుకే ఈ సిరీస్ కి నిర్మాతగా మారాను. ఏదైనా ఒక పనికి కమిట్ అయ్యినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి , నాకు ఉన్న ఆ లక్షణమే ‘దూత 2′ కి నిర్మాతగా వ్యవహరించేలా ప్రేరేపించింది’ అంటూ నాగ చైతన్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పటి వరకు హారర్ థ్రిల్లర్ జానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు , వెబ్ సిరీస్ లు వచ్చాయి. కానీ దూత లాంటి కాన్సెప్ట్ తో ఒక్క వెబ్ సిరీస్ కూడా రాలేదు. నిజంగా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు రెండవ సీజన్ ని ఆయన ఎలా నడిపిస్తాడో చూడాలి. ఈ సిరీస్ లో నాగ చైతన్య కి జోడీగా ప్రియా భవాని శంకర్ నటించబోతుంది. మొదటి సీజన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ చైతన్య , రెండవ సీజన్ తో అదే రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. ఈ నెలాఖరు నుండి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సిబిల్ స్కోర్ ఫాస్ట్ గా పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

How to increase CIBIL score fast
How to increase CIBIL score fast

How to increase CIBIL score fast: ప్రస్తుతం వ్యక్తిగత రుణం, హోం లోన్, వాహన రుణం పొందేటప్పుడు బ్యాంకులు ఎక్కువగా పరిశీలించే అంశం సిబిల్ స్కోరు. సాధారణంగా సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు సిబిల్ స్కోరును 750కు పైగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఒక్కోసారి సిబిల్ స్కోరు తగ్గితే వడ్డీ రేటు ఎక్కువగా విధిస్తారు. ఇలాంటప్పుడు సిబిల్ స్కోరును త్వరగా పెంచుకోవాలంటే ఏం చేయాలి?

సిబిల్ స్కోరు అనేది వ్యక్తి రుణాలను ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నాడో తెలియజేసే క్రెడిట్ రేటింగ్. సాధారణంగా ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. స్కోరు ఎక్కువగా ఉంటే బ్యాంకులకు ఆ వ్యక్తిపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా రుణం త్వరగా మంజూరు కావడం, తక్కువ వడ్డీ రేటు లభించడం, ఎక్కువ క్రెడిట్ పరిమితి పొందడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.

సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నవారు ముందుగా ఇప్పటికే ఉన్న రుణాల ఈఎంఐలను సమయానికి చెల్లించాలి. ఒక్క EMI కూడా మిస్ కాకుండా చెల్లించడం వల్ల క్రమంగా స్కోరు మెరుగుపడుతుంది. అయితే క్రెడిట్ హిస్టరీ బలహీనంగా ఉన్నవారికి లేదా మొదటిసారి క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవాలనుకునేవారికి FD ఆధారిత క్రెడిట్ కార్డు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

FD ఆధారిత క్రెడిట్ కార్డు అంటే ఏమిటి?
ఇది సాధారణ క్రెడిట్ కార్డు లాంటిదే. అయితే బ్యాంకు ముందుగా మీ పేరుపై ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తీసుకుని, దానిని భద్రతగా ఉంచి క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. దీనిని సాధారణంగా “సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్” అని కూడా పిలుస్తారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నా లేదా అసలు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా ఈ కార్డు పొందడం సులభంగా ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?
చాలా బ్యాంకులు మరియు ఫిన్‌టెక్ సంస్థలు ఆన్‌లైన్‌లోనే FD ఆధారిత క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సంబంధిత బ్యాంకు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి Secured Credit Card లేదా Credit Card Against FD ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత అవసరమైన KYC పూర్తి చేసి, నిర్ణీత మొత్తాన్ని FDగా డిపాజిట్ చేయాలి. డిపాజిట్ పూర్తైన తర్వాత కార్డు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

కొన్ని బ్యాంకులు, డిజిటల్ ఫైనాన్స్ సంస్థలు రూ.2,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో కూడా FD ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సాధారణంగా రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ FD చేస్తే ఫిజికల్ క్రెడిట్ కార్డు కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే కనీస FD మొత్తం బ్యాంకు లేదా సంస్థను బట్టి మారవచ్చు.

సిబిల్ స్కోరు ఎలా పెరుగుతుంది?
FD ఆధారిత క్రెడిట్ కార్డు ద్వారా చిన్న చిన్న కొనుగోళ్లు చేసి, ప్రతి నెల బిల్లు గడువు తేదీకి ముందే పూర్తిగా చెల్లిస్తే ఆ వివరాలు క్రెడిట్ బ్యూరోలకు చేరతాయి. దీంతో మీరు బాధ్యతాయుతంగా క్రెడిట్ వినియోగిస్తున్నారని రికార్డు ఏర్పడుతుంది. ఇది క్రమంగా సిబిల్ స్కోరు పెరగడానికి సహాయపడుతుంది.క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని పూర్తిగా వినియోగించకుండా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు లిమిట్‌లో 30 శాతం వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తారు. అలాగే కనీస బకాయి మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించడం వల్ల క్రెడిట్ ప్రొఫైల్ మరింత బలపడుతుంది. ఆలస్య చెల్లింపులు చేస్తే స్కోరు పెరగడం బదులుగా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.

సిబిల్ స్కోరు తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయానికి EMIలు చెల్లించడం, క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగించడం, ముఖ్యంగా FD ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును సక్రమంగా నిర్వహించడం ద్వారా కొద్ది నెలల్లోనే క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందాలనుకునేవారికి ఇది ఉపయోగకరమైన మార్గంగా చెప్పవచ్చు.

హార్ముజ్‌ జలసంధిలో కూలిన అమెరికా హెలికాప్టర్‌.. పైలట్లు క్షేమం!

US helicopter crash Strait of Hormuz
US helicopter crash Strait of Hormuz

US helicopter crash Strait of Hormuz: అమెరికా, ఇరాన్‌ యుద్ధ కారణంగా హర్మూజ్‌ జలసంధికి ప్రపంచవ్యాప్తగా గుర్తింపు దక్కింది. అందరి నోళ్లలో నానుతోంది. ఎందుకంటే గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా అయ్యేది ఇక్కడి నుంచే. యుద్ధం కారణంగా ఇరాన్‌ మొదట దీనిని మూసివేసింది. తర్వాత అమెరికా పట్టు సాధించింది. తాజాగా ఈ జలసంధి వద్ద భారత నౌకపై అమెరికా సైనికులు దాడి చేశారు. ఇలాంటి ఒమన్‌ నౌకలో ఉన్న 20 మంది భారత సిబ్బందిని కాపాడింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే హర్మూజ్‌ వద్ద అమెరికా గస్తీ మెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. హెలికాప్టర్‌ పూర్తిగా ధ్వంసమైనా ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

ఇరాన్‌ దిగ్బంధం తొలగించేందుకు..
ఇరాన్‌ విధించిన జలసంధి దిగ్బంధనాన్ని తొలగించడానికి అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యాచరణలో అపాచీ హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు, డ్రోన్లు కలిసి నిరంతర పహారా కాస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఏం జరిగింది?
అయితే హెలికాప్టర్‌ కూలడానికి కారణం ఏమిటి అన్నది ఎవరూ ప్రకటించలేదు. ఇరాన్‌ మాత్రం తన దళాలు అమెరికా రీపర్‌ డ్రోన్లను కూల్చివేశాయని ప్రకటించింది. దీంతో అపాచీ హెలికాప్టర్‌ ఇరాన్‌ క్షిపణి దాడికి గురై కూలిందా లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల పతనమైందా అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి అమెరికా–ఇరాన్‌ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి కూలిన మొదటి సైనిక హెలికాప్టర్‌ ఇదే.

ఇరాన్‌ సైన్యం పూర్తిగా నాశనం..
అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి చేపట్టిన దాడుల వల్ల ఇరాన్‌ సైనిక బలాలు సమూలంగా నాశనమయ్యాయని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టెహ్రాన్‌ వద్ద కేవలం 21 శాతం మాత్రమే క్షిపణి సామర్థ్యం మిగిలి ఉందని చెప్పారు. మళ్లీ ఇరాన్‌ దాడులు ప్రారంభిస్తే అమెరికా సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నాహాలతో ఉందని హెచ్చరించారు.

యుద్ధం కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయాన్ని సెంట్రల్‌ కమాండ్‌ స్వయంగా అంగీకరించింది. ఇరాన్‌ దాడుల్లో ఇప్పటివరకు 13 మంది అమెరికన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 399 మంది గాయపడ్డారు. అనేక యుద్ధ విమానాలు కూడా కూల్చివేయబడ్డాయి.

లక్ష్యద్వీప్‌కు లిక్కర్‌ వచ్చింది.. 47 ఏళ్ల తర్వాత అమ్మకాలకు అనుమతి!

Lakshadweep liquor sale permission
Lakshadweep liquor sale permission

Lakshadweep liquor sale permission: లిక్కర్‌.. ప్రస్తుతం పాలకులకు ఆదాయ మార్గం. ఒకప్పుడు మద్య నిషేధం అమలు చేసిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు లిక్కర్‌ అమ్మకాలను ఎంకరేజ్‌ చేస్తున్నాయి. అయతే దేశంలో ఆ రాష్ట్రంలో 47 ఏళ్లుగా మద్యం అమ్మకాలపై నిషేధం అమలులో ఉంది. కేంద్రం అధీనంలో ఉన్న ఆ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలకు తాజాగా కేంద్రం అనుమతి ఇచ్చింది. తీరప్రాంత వినియోగాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో 1979లో ప్రకటించిన మధ్యపాన నిషేధంలోని కొన్ని నిబంధనలను మార్చింది. లక్షద్వీప్‌లో అధికారికంగా మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేసింది.

నిబంధనల మేరకు అనుమతి..
మధ్యపాన నిషేధానికి సంబంధించి ప్రస్తుత తీర్మానంలో కేంద్రం గుర్తించిన మార్పుల ద్వారా లక్షద్వీప్‌లో ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన సంస్థలు మాత్రమే మద్యం దిగుమతి చేసుకోవాలి. విక్రయించాలి. ఈ మార్పు ఫిర్యాదులలో లైసెన్సింగ్, నియంత్రణా బోధనల ద్వారా నడిపించబడే విధంగా రూపొందించారు. అనారోగ్యకర వినియోగం నియంత్రణతో ఒక నియంత్రిత మార్కెట్‌ స్థాపించడం.

పర్యాటకాభివృద్ధి, ఆదాయం..
కేంద్రం పర్యాటకాభివృద్ధి, ఆదాయం దృష్టిలో పెట్టుకుని మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మద్యం ధరలపై ఎక్సైజ్‌ సుంకం భారీగా పెంచింది. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 400%, బీర్‌ 200%, వైన్‌ 80% సుంకాలు విధించింది. మద్యం లభ్యత కారణంగా పర్యాటకుల పెరిగడంతోపాటు ఆదాయం వస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లకు, ట్రావెల్‌ సర్వీసులకు ఆదాయం వస్తుంది. అయితే అధిక ధరల కారణంగా కొంతమంది పర్యాటకులు లేదా స్థానికులు మద్యం కొనుగోలు తగ్గిస్తారు.

సామాజిక, సాంస్కృతిక పరిణామాలు
లక్షద్వీప్‌లో ముస్లిం ఆధిక్య వున్న ప్రాంతం కావడంతో మద్యం విధానం సామాజిక సున్నితతలకు దారితీస్తుంది. సభ్య సమాజాలలో మద్యం అందుబాటును సహజరీతిలో అంగీకరించకపోవచ్చు. స్థానిక నాయకులు, మద్దతుదారులు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశముంది. మద్యం వినియోగం పెరిగితే సామాజిక సమస్యలు, పేదరిక నియంత్రణ, అల్లకల్లోలం మొదలైన సమస్యలు ఎదురుకావచ్చునని ఆరోగ్య నిపుణులు సూచించవచ్చు. స్థానిక పరిమితుల ద్వారా విక్రయ స్థలాలు, వయస్సు నిర్ధారణ, సమయ పరిమితి వంటి నియమాలు అమలు చేయాలని స్థానిక పాలక సంస్థలపై ఒత్తిడి ఉంటుంది.

నియంత్రణ నిబంధనలు ఇలా..
ప్రభుత్వ లైసెన్సింగ్‌ దశలో ముఖ్యంగా విద్యార్థుల వయస్సు నిర్ధారణ, గంటల పరిమితి, హోటల్‌లలో ప్రత్యేక జోన్‌ల ఏర్పాటు వంటి నియమాల అమలు తప్పనిసరి. అధిక పన్నుల వల్ల అధికారిక మార్గం కాకుండా లోకల్‌ మార్కెట్లు, అక్రమ సరఫరాల ప్రభవం నివారించాల్సి ఉంటుంది. పోలీస్‌ మరియు పౌర ఆరోగ్య విభాగాల సమన్వయం అనివార్యం.

లక్షద్వీప్‌లో 47 ఏళ్ల తర్వాత మద్యం విక్రయం ప్రారంభించడం పర్యాటకాభివృద్ధికి అవకాశం కల్పిస్తుందన్నది నిజం. అయితే ఎక్సైజ్‌ పన్నుల తీవ్రత, స్థానిక సామాజిక స్వభావం, నియంత్రణా వ్యవస్థల అమలుపై ఆక్సిడెంట్‌లపై దృష్టి పెట్టకపోతే ఆశించిన లాభాలు తగ్గే అవకాశముంది. సమతుల్యత సాధించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక నేతలు, కమ్యూనిటీ లీడర్లు కలిసి స్పష్టమైన పాలసీలు రూపొందించి అమలు చేయాలి.

OnePlus ఈ మొబైల్ పై రూ.17,000 డిస్కౌంట్.. వెంటనే తెలుసుకోండి..

OnePlus mobile discount offer
OnePlus mobile discount offer

OnePlus mobile discount offer: ప్రీమియం ఫోన్లు కొనాలని అనుకునేవారు OnePlus కంపెనీ వైపు ఎక్కువగా చూస్తారు. అయితే ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదే సమయంలో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన మొబైల్స్ పై ఆపర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా తన వినియోగదారుల కోసం ప్రస్తుతం ‘వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ 2026’ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ జూన్ 4న ప్రారంభమై జూన్ 10, 2026 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా, వన్‌ప్లస్ తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13 పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితె..

వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ 2026 లో భాగంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ. 17,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. దీని అసలు ధర రూ. 69,999 ఉండగా.. కంపెనీ రూ. 12,000 వరకు తాత్కాలిక ధర తగ్గింపును అందిస్తోంది. దీనికి అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ లేదా EMI లావాదేవీలపై మరో రూ. 5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లన్నింటినీ కలుపుకుంటే, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 52,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 13 మొబైల్ లో 6.82 అంగుళాల క్యూహెచ్‌డి ప్లస్ తో పాటు ఎల్‌టిపిఓ ప్రో-ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండి.. అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్’ మొబైల్ ప్లాట్‌ఫామ్ చిప్‌సెట్ ఉంది. ఇది అత్యంత వేగవంతమైన గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్‌కు సహకరిస్తుంది.

ఈ మొబైల్ లో సోనీ LYT-808 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా ఉంది. 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. దీంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం ఇది సపోర్టుగా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6,000mAh పెద్ద బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

ఈ సేల్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు, మీరు ఆరు నెలల వరకు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వారికి వన్‌ప్లస్ 13 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఆఫర్లు జూన్ 10 వరకు మాత్రమే ఉన్నాయని గుర్తుంచుకోండి.

5 రోజుల్లో 50 లక్షల టిక్కెట్లు.. కళ్ళు చెదిరే గ్రాస్.. చరిత్ర తిరగరాసిన 'పెద్ది'..

Peddi 5 Days Box Office Collections
Peddi 5 Days Box Office Collections

Peddi 5 Days Box Office Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త అద్భుతాలను సృష్టిస్తూ, కరువులో ఉన్న టాలీవుడ్ థియేటర్స్ కి సరికొత్త జోష్ ని తీసుకొచ్చింది. వర్కింగ్ డేస్ లో హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం అనేది చాలా అరుదు. అది కూడా భారీ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ వేసి , లాంగ్ వీకెండ్ చూసిన తర్వాత , మొదటి సోమవారం హోల్డ్ సాధించడం అనేది అసాధారణమైన టాస్క్. కానీ ‘పెద్ది’ ఈ టాస్క్ ని అవలీలగా ఛేదించి , కేవలం 5 రోజుల్లోనే రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంతే కాకుండా బుక్ మై షో , డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి ఈ చిత్రానికి 55 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. హిందీ వెర్షన్ నుండి భారీ రేంజ్ లో వసూళ్లు రాకపోయినప్పటికీ కూడా , ఈ రేంజ్ లో టిక్కెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 5 వ రోజున 2 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 5 రోజుల్లో నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 43.66 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 5 రోజుల్లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 5 వ రోజున 1 కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చినట్టు సమాచారం. సీడెడ్ ప్రాంతం కంటే ఉత్తరాంధ్ర నుండి ఈ చిత్రానికి ఎక్కువ షేర్ రావడం గమనార్హం. ఈ ప్రాంతం లో ఈ చిత్రానికి 5 రోజుల్లో 16 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. 5 వ రోజు అయితే ఏకంగా 1 కోటి 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 6 కోట్ల 93 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 10 కోట్ల 55 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 8 కోట్లు , నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 115 కోట్ల 93 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 171 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 11 కోట్ల 80 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 1 కోటి 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్లు , ఓవర్సీస్ నుండి 20 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 157 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 260 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

టి20 జట్టు నుంచి సిరాజ్ ను ఎందుకు తప్పించారు.. ఏం జరిగింది..

Mohammed Siraj T20 team exclusion
Mohammed Siraj T20 team exclusion

Mohammed Siraj T20 team exclusion: టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 300 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది . టీం ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయంలో టీమిడియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు. టీమ్ ఇండియా తదుపరి ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే టి20 సిరీస్ లు ఆడుతుంది. ఈ టోర్నీలకు సిరాజ్ కు చోటు లభించింది.

త్వరలోనే టీమిండియా ఐర్లాండ్ బయలుదేరాల్సి ఉండగా.. ఊహించని వార్త స్పోర్ట్స్ వర్గాల్లో కనిపిస్తోంది. ఎందుకంటే టి20 జటలో కీలకమైన బౌలర్ గా ఉన్న సిరాజ్ ను తప్పించారు. దీని వెనక ప్రధాన కారణం అతని మీద వర్క్ లోడ్ తగ్గించడమే. అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణకు అవకాశం కల్పించారు. వర్క్ లోడ్ తగ్గించుకొని.. విశ్రాంతి తీసుకోవాలని మేనేజ్మెంట్ సూచించినట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సిరాజ్ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. బుమ్రా కు వర్క్ లోడ్ పేరుతో మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వడంతో.. జట్టు బౌలింగ్ భారాన్ని మొత్తం ఇతడే మోసాడు. అంతటి ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది అంటే దానికి ప్రధాన కారణం సిరాజ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అతడు కూడా ఇటీవల కాలంలో వర్క్ లోడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. దీనిని మేనేజ్మెంట్ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక మ్యాచ్లో సిరాజ్ తన స్థాయి బౌలింగ్ వేయలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం వర్క్ లోడ్ అని గుర్తించడం మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు అతనికి విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో ప్రసిద్ ను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు సిరాజ్ ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అయితే అతడు వర్క్ లోడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు.. దీనిని గుర్తించిన మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది..

ఈ సిరీస్ లు ముగిసిన తర్వాత టీమ్ ఇండియా న్యూజిలాండ్.. శ్రీలంక జట్లతో టెస్ట్ సిరీస్ లు ఆడాల్సి ఉంది. అందువల్ల మేనేజ్మెంట్ దానిని దృష్టిలో పెట్టుకొని సిరాజ్ ను విశ్రాంతి తీసుకోమని సూచించింది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే కచ్చితంగా ఆ రెండు సిరీస్ లు గెలవాలి.. దానిని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధార్ కార్డులో సెంటర్ కు వెళ్లకుండా మార్చుకునేవి ఇవే.. కొన్నింటికి మాత్రం నో ఛాన్స్..

Aadhaar card update online
Aadhaar card update online

Aadhaar card update online: ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి భారతీయుడికి అత్యంత ముఖ్యమైన గుర్తింపుగా మారింది. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, పాన్ కార్డు లింకింగ్ వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరిగా మారింది. దీంతో ఆధార్‌లో ఉన్న వివరాలు ఎప్పటికప్పుడు సరిగా ఉండటం చాలా అవసరం. అంతేకాకుండా మొబైల్ నెంబర్లు, అడ్రస్ మారిన సమయంలో దీనిని అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఎన్నో పనుల కారణంగా బీజీగా ఉండేవారు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ లో ఈ పనులు చేసుకునే సదుపాయం ఉంది. ఎలాగో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోడి..

అడ్రస్ మార్చుకోవాల్సి వస్తే..:
ఆధార్‌లో అడ్రస్‌ను మార్చుకోవడానికి తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్‌కు ఇప్పటికే లింక్ అయిన మొబైల్ నంబర్ పనిచేస్తూ ఉండాలి. ఆ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అయి అవసరమైన అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసి మార్పు కోసం దరఖాస్తు చేయవచ్చు. ముందుగా MyAadhaar పోర్టల్లోకి వెళ్లాలి. అక్కడ ఆధార్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ కావాలి. అనంతరం ‘Update Aadhaar Online’ ఎంపికను ఎంచుకుని కొత్త అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత అడ్రస్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేసి నిర్ణీత ఫీజు చెల్లించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత మీకు ఒక SRN నంబర్ వస్తుంది. దాని ద్వారా స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.

మొబైల్ నంబర్ మార్పు అయితే..
చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే మొబైల్ నంబర్‌ను కూడా ఇంట్లో నుంచే మార్చుకోవచ్చా..? అనేది. ప్రస్తుతం ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ లేదా కొత్త నంబర్ జోడింపు సేవను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రక్రియను బయోమెట్రిక్ ధ్రువీకరణతో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆధార్‌కు లింక్ అయిన నంబర్ పోయినా లేదా కొత్త నంబర్ జోడించాలన్నా సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్మెంట్ లేదా అప్‌డేట్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డు చూపించి వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా గుర్తింపు ధ్రువీకరించిన తర్వాత కొత్త మొబైల్ నంబర్ నమోదు చేస్తారు. సాధారణంగా కొన్ని రోజుల్లో ఆ నంబర్ ఆధార్‌కు లింక్ అవుతుంది.

అయితే ప్రస్తుతం UIDAI అందిస్తున్న ఆన్‌లైన్ సేవల ద్వారా ప్రధానంగా అడ్రస్ వంటి కొన్ని వివరాలను మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మొబైల్ నంబర్, బయోమెట్రిక్స్, ఫోటో వంటి సున్నితమైన వివరాల మార్పులకు వ్యక్తిగతంగా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉంటే అనేక సేవలను ఇంట్లో నుంచే సులభంగా పొందవచ్చు. అందుకే మొబైల్ నంబర్ మారిన వెంటనే ఆధార్‌లో అప్‌డేట్ చేయించుకోవడం మంచిది. అలాగే అడ్రస్ మారినప్పుడు ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్ ద్వారా సవరించుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.

విలువైన సెలబ్రిటీ విరాట్‌ కోహ్లీ.. తాజా సర్వేలో గుర్తింపు!

Virat Kohli most valuable celebrity
Virat Kohli most valuable celebrity

Virat Kohli most valuable celebrity: భారత దేశంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు. క్రీడలు, సినిమాలు, వ్యాపారం, వ్యవసాయం, కళలు ఇలా అనేక రంగాల నుంచి అనేక మంది ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. అయితే దేశంలో విలువైన సెలబ్రిటీ ఎవరు అన్నది వారి ఆదాయం ఆధారంగా ఉంటుంది. దీనిని గుర్తించేందుకు ఫార్చూన్‌ ఇండియా ఇంటర్‌బ్రాండ్‌తో కలిసి తొలిసారిగా చేపట్టిన ‘ఇండియా’స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ సెలబ్రిటీస్‌’ స్టడీలో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానం సాధించారు. అతని బ్రాండ్‌ వాల్యూ రూ.3,542 కోట్లుగా నిర్ధారణ అయింది. ఇది ఎంతగా అనుసరిస్తారు, ఏ స్టార్‌ బ్రాండ్లకు నిజమైన విలువనిస్తారు అనేది స్పష్టంగా చెప్పే ఒక మైలురాయి.

కోహ్లీ టాప్‌..
క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సాధించిన ఈ స్థానం ఆయన క్రికెట్‌ ప్రదర్శన మాత్రమే కాదు. అతని ఫిట్‌నెస్‌ జీవనశైలి, స్థిరత్వం, గ్లోబల్‌ అప్పీల్, సోషల్‌ మీడియా ప్రభావం (270 మిలియన్‌ ఫాలోవర్లు), ప్రీమియం బ్రాండ్లతో దీర్ఘకాలిక సంబంధాలు ఇవన్నీ కలిసి అతన్ని భారతదేశ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా నిలిపాయి. ఇంటర్‌బ్రాండ్‌ పద్ధతిలో బ్రాండ్‌ వాల్యూను నిర్ణయించేటప్పుడు కేవలం పాపులారిటీ లేదా ఆదాయం మాత్రమే కాకుండా డిస్టినెక్టివ్‌నెస్, రిలవెన్స్, ఎంగేజ్‌మెంట్, ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలను కూడా పరిగణించారు. ఈ అన్ని పారామీటర్లలోనూ కోహ్లీ టాప్‌లో నిలిచారు.

టాప్‌ 20 ర్యాంకులు ఇలా..
1. విరాట్‌ కోహ్లీ
2. షారుఖ్‌ ఖాన్‌
3. ప్రియాంక చోప్రా జోనాస్‌
4. మహేంద్ర సింగ్‌ ధోనీ
5. రణవీర్‌ సింగ్‌
6. అక్షయ్‌ కుమార్‌
7. అమితాబ్‌ బచ్చన్‌
8. సచిన్‌ తెండుల్కర్‌
9. ఆలియా భట్‌
10. అల్లు అర్జున్‌
11. దీపికా పదుకొణె
17. రష్మిక మందన్న

టాప్‌లో క్రికెటర్లు…
టాప్‌–10లో మూడు స్థానాలు (కోహ్లీ, ధోనీ, సచిన్‌) క్రికెటర్లది కావడం భారతదేశంలో క్రికెట్‌పై ఉన్న అపారమైన ఆధారణ, సామాజిక–ఆర్థిక ప్రభావాన్ని మరోసారి నిరూపిస్తోంది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్ల కంటే క్రికెట్‌ ఐకాన్లు బ్రాండ్‌గా ఎక్కువ విలువనిస్తున్నారు.

బలంగా బాలీవుడ్‌
బాలీవుడ్‌ ఇంకా బలంగానే ఉంది, కానీ సవాళ్లు ఎదుర్కొంటోంది. షారుఖ్, ప్రియాంక, రణవీర్, అక్షయ్, అమితాబ్, ఆలియా వంటి స్టార్లు టాప్‌–10లో స్థానం సంపాదించడం బాలీవుడ్‌ ఇప్పటికీ బలమైన బ్రాండ్‌ శక్తిని కలిగి ఉందని చెబుతోంది. ముఖ్యంగా ప్రియాంక గ్లోబల్‌ ఇమేజ్‌ ఆమెను మూడో స్థానానికి చేర్చింది.

పాన్‌ ఇండియా స్టార్లుగా దక్షిణాది యాక్టర్లు..
అల్లు అర్జున్‌ 10వ స్థానం, రష్మిక మందన్న 17వ స్థానం సాధించడం దక్షిణ భారత సినిమా (ముఖ్యంగా తెలుగు–కన్నడ) జాతీయ స్థాయి ప్రభావాన్ని సూచిస్తోంది. ఇది భారతదేశ ఎంటర్‌టైన్‌మెంట్‌ ల్యాండ్‌స్కేప్‌ మారుతోందని తెలియజేస్తుంది.

ఫార్చూన్‌–ఇంటర్‌బ్రాండ్‌ స్టడీ భారతదేశంలో సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యూ ఎలా కొలవాలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానం సాధించడం ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ నిజమైన బ్రాండ్‌ వాల్యూ కేవలం పాపులారిటీ లేదా ఫాలోవర్ల సంఖ్యపై మాత్రమే ఆధారపడదు. అది స్థిరత్వం, విశ్వసనీయత, సామాజిక ప్రభావం, ఆధునిక భారతీయ యువత ఆశించే విలువలపై ఆధారపడి ఉంటుంది.

కొత్త సమస్యల్లో చిక్కుకున్న 'పెద్ది'.. నిర్మాత అరెస్ట్ కాబోతున్నాడా? అసలు ఏమి జరుగుతోంది..

Peddi producer arrest
Peddi producer arrest

Peddi producer arrest: హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ కారణంగా ఇప్పటికే పెద్ది చిత్రం అనేక వివాదాలను ఎదురుకుంటోంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే ఇప్పుడు చర్చ. డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఈ అంశంపై స్పందిస్తూ , తక్షణమే ఆ సన్నివేశలను తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే నిన్న జరిగిన థాంక్యూ మీట్ లో జరుగుతున్న ఈ వివాదం పై బుచ్చి బాబు నోరు మెదపకపోవడం గమనార్హం. ఉన్న ఈ ఒక్క వివాదం చాలదు అన్నట్టు , మరో వివాదం ఈ సినిమా మెడకు చుట్టుకుంది. ఈ చిత్రం లో విజయనగరం జిల్లాలోని ఆదివాసీయులను కించపరిచారని ఆదివాసీ సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. 3 గంటల సినిమాలో , దాదాపుగా 15 సందర్భాల్లో మమ్మల్ని దారుణంగా అవమానించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఇంత దారుణంగా మమ్మల్ని అవమానించినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు చూసి చూడనట్టు వ్యవహరించి , ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం అత్యంత దారుణమైన విషయమని చెప్పుకొచ్చారు. తమ పూర్వికులు రామాయణం , మహాభారతం వంటి ఘట్టాల్లో భాగం అయ్యారని , అలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మూవీ టీం స్పందిస్తుందో లేదో చూడాలి. అయితే ఏ సందర్భాల్లో ఆదివాసీయులను అవమానించారో చెప్పాలంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక కొండ ప్రాంతం నుండి వచ్చిన ఆదివాసీయుడు , తన అద్భుతమైన టాలెంట్ తో ఒలంపిక్స్ లో గేమ్స్ ఆడి ఇండియా కి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు , ఇది ఎంతో ఆదర్శవంతమైన విషయం , ఆదివాసీయుల గొప్పదనం , సత్తా ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడం. మెచ్చుకోవాల్సింది పోయి , కేసులు పెడుతారా అంటూ అభిమానులు మండిపడుతున్నారు , మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో శివ రాజ్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తో పాటు, కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసి , రామ్ చరణ్ – జగపతి బాబు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను జత చేయనున్నారని , త్వరలోనే ఈ కొత్త వెర్షన్ కి సెన్సార్ చేయించి థియేటర్స్ లో వదులుతారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇకపోతే ఈ చిత్రం 5 రోజుల్లో 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది, ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ప్రీమియం మార్కెట్ ను షేక్ చేయనున్న Yamaha కొత్త స్కూటర్.. ఎప్పుడొస్తుందంటే..

Yamaha NMax 155 launch India
Yamaha NMax 155 launch India

Yamaha NMax 155 launch India: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రీమియం స్కూటర్ల హవా నడుస్తోంది. కేవలం సిటీ ప్రయాణాలకే పరిమితం కాకుండా, పవర్, స్టైల్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం ప్రముఖ కంపెనీలు సరికొత్త మాక్సీ స్కూటర్లను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో Yamaha తన పాపులర్ NMax 155 స్కూటర్‌ను 2027 నాటికి భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

యమహా NMax 155 అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందింది. ఇది యమహా ‘ఏరోక్స్ 155’ అనే ప్లాట్‌ఫామ్‌పైనే తయారైనప్పటికీ, డిజైన్ పరంగా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో మస్క్యులర్ బాడీవర్క్ పెద్ద విండ్‌స్క్రీన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఉంటాయి. ఇందులో 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చనున్నారు, ఇది సుమారు 15.4PS పవర్, 14.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు లాంగ్ రైడ్స్‌కు కూడా అనువుగా ఉంటుంది.

భారత మార్కెట్లో హోండా కూడా తన అత్యంత ఆసక్తికరమైన అడ్వెంచర్ స్కూటర్ ADV160ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. యమహా NMax 155 , హోండా ADV160 రెండూ కూడా ఒకదానికొకటి గట్టి పోటీనివ్వనున్నాయి. ADV160 అడ్వెంచర్ లుక్‌తో అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది గతుకుల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేలా చేస్తుంది. యమహా NMax 155 ప్రధానంగా సిటీ క్రూయిజర్‌గా, లాంగ్ టూరింగ్‌కు అనువుగా నిలుస్తుంది.

ఈ రాబోయే స్కూటర్లలో అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. కీ లెస్ ఇగ్నిషన్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉండే అవకాశం ఉంది. NMax 155 లో 13 అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్‌లు ఉండటం వల్ల రైడింగ్ చాలా స్థిరంగా ఉంటుంది. అలాగే, ఏరోక్స్ 155 తో పోలిస్తే, NMax లో కొంత ఎక్కువ స్టోరేజ్ స్పేస్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని ఆశించవచ్చు.

భారతీయ యువత ఇప్పుడు సాధారణ స్కూటర్ల నుంచి పవర్‌ఫుల్, స్టైలిష్ మాక్సీ-స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 150 నుంచి160cc సెగ్మెంట్‌లో యమహా, హోండా, హీరో వంటి కంపెనీలు పోటీ పడుతుండటంతో వినియోగదారులకు ఎంపికలు పెరుగుతున్నాయి.

కొన్ని అంచనాల ప్రకారం, యమహా NMax 155 ధర రూ. 1.50 లక్షల ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. అధికారికంగా లాంచ్ తేదీలపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ, 2027 ప్రారంభంలో లేదా అంతకంటే ముందే భారత రోడ్లపై ఈ ప్రీమియం స్కూటర్లను మనం చూడవచ్చు.

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ ఇదే..

Tata Tiago EV best budget electric car
Tata Tiago EV best budget electric car

Tata Tiago EV best budget electric car: మిడిల్ క్లాస్ పీపుల్స్ కొత్తగా కారు కొనాలని అనుకుంటే తక్కువ ధరలో చూస్తారు. అలాగే వీరికి అనుగుణంగా ఉండే ఫీచర్లు కలిగిన వెహికల్ కోసం చూస్తారు. ఇలాంటి వారి కోసం 2026 టాటా టియాగో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఈ కారు ఇప్పుడు ఈవీ (Tata Tiago EV) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుతం మార్కెట్లో ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

2026 మోడల్ టియాగో ఈవీ బాహ్యంగా మెరుగైన డిజైన్ మార్పులను పొందింది. ముందు భాగంలో కొత్త బంపర్ మరియు ఫేసియా డిజైన్‌తో ఇది మరింత ఆధునికంగా కనిపిస్తోంది. లోపలి భాగంలో అయితే, పూర్తిగా కొత్త డాష్‌బోర్డ్, లేయర్డ్ ఫ్యాబ్రిక్ అప్‌హోల్స్టరీని జోడించారు. దీనివల్ల కారు లోపల చాలా ప్రీమియం మరియు విశాలమైన అనుభూతి కలుగుతుంది. అయితే, ప్యానెల్ గ్యాప్స్ మరియు ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయంలో టాటా ఇంకాస్త మెరుగుపరచాల్సి ఉంది.

ఈ సెగ్మెంట్‌లో అత్యధిక ఫీచర్లు కలిగిన కారుగా టియాగో ఈవీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అలాగే, వెనుక భాగంలో ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు దీనిని కుటుంబ అవసరాలకు తగిన వాహనంగా మారుస్తున్నాయి.

నగర ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి ఇది అత్యంత సౌకర్యవంతమైన కారు. ఇందులో 75bhp ఎలక్ట్రిక్ మోటార్ ఉండడంతో నగరంలో వేగంగా దూసుకుపోవడానికి కావాల్సిన పవర్‌ను అందిస్తుంది. సస్పెన్షన్ సెటప్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇండియన్ రోడ్లపై ఉండే గుంతలను చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. 30kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో, బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లో సుమారుగా పూర్తిస్థాయిలో ఛార్జ్ చేయవచ్చు, ఇది సిటీ ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరం.

టాటా టియాగో ఈవీ కారును రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.99 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BaaS) పద్ధతిలో కారును కొనుగోలు చేసే వారికి ప్రారంభ ధర కేవలం రూ. 4.69 లక్షల నుంచే మొదలవుతుంది. ఇది బడ్జెట్ ధరలో ఒక నమ్మకమైన ఎలక్ట్రిక్ కారును కోరుకునే వారికి గొప్ప అవకాశం.

మొదటిసారి ఎలక్ట్రిక్ కారును కొనాలని చూస్తున్నట్లయితే, ముఖ్యంగా సిటీలో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక. దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ మరియు నడపడానికి ఎంతో సులభంగా ఉంటుంది. అయితే, ఇది ప్రధానంగా సిటీ కారు మాత్రమే అని, లాంగ్ హైవే ప్రయాణాలకు దీని పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. మొత్తంమీద, 2026 టాటా టియాగో ఈవీ దాని ఫీచర్లు, ధర మరియు పనితీరుతో ఎంట్రీ-లెవల్ ఈవీ సెగ్మెంట్‌లో ఒక బలమైన బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

వాట్సాప్ లో కొత్త ఫీచర్లు.. నెలకు 79 చెల్లిస్తే.. ఇవన్నీ మీ సొంతం..

WhatsApp Username Feature
WhatsApp Username Feature

WhatsApp new features: సోషల్ మెసేజ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. మారిన అవసరాలకు తగ్గట్టుగా.. యూజర్లకు సదుపాయాలు కల్పిస్తోంది. తాజాగా వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈసారి యూజర్లను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల మార్పులు చేర్పులు చేపట్టింది.

వాట్సప్ లో ఇకపై వాట్సప్ ప్లస్ పేరుతో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అనేది తెరపైకి వచ్చింది. నెలకు 79 రూపాయల చెల్లిస్తే ప్రత్యేకమైన స్టిక్కర్లు.. యాప్ థీమ్.. రింగ్టోన్స్ వంటి ఫీచర్లను ఆస్వాదించవచ్చు. 20 చాట్ లను పిన్ కూడా చేసుకోవచ్చు.. కాంట్రాక్టులకు ప్రత్యేకంగా రింగ్టోన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సేవలను నెల రోజులపాటు వాట్సప్ యాజమాన్యం ఫ్రీగా అందిస్తోంది.. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్లి సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దానిని ఆక్టివేట్ చేసుకోవాలి.

మొదట్లో దీనిని ప్రయోగాత్మకంగా అమెరికాలో చేపట్టింది మెటా కంపెనీ. అది విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది. యూజర్లకు రొటీన్ ఎక్స్పీరియన్స్ కాకుండా.. సరికొత్త అనుభవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెటా కంపెనీ ఈ ఫీచర్లను తెరపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తు కాలంలో ఇంకా అనేక రకాల మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మెటా యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది.

గతంలో మెటా కంపెనీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లను అందుబాటులోకి తెచ్చేది కాదు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులో నేపథ్యంలో ప్రీమియం వైపు వెళ్తోంది. యూజర్లు సరికొత్త సౌకర్యాలను కోరుకోవడం.. అటువంటి వాటికోసం టెక్నాలజీని విస్తృతం చేయడం.. ఉద్యోగులను నియమించుకోవడం వంటివి మెటా కంపెనీకి భారంగా మారుతోంది. అందువల్లే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇటువంటి ప్రీమియం ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయోగాత్మక దశలో ఇవి విజయవంతం కావడంతో.. వీటిని అమలు చేయడం మొదలుపెట్టింది.

భవిష్యత్ కాలంలో వీడియో ఎడిటింగ్.. కంటెంట్ క్రియేషన్.. అప్పటికప్పుడు మార్పులు చేసుకునే విధానం.. నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం వంటి వాటిని కల్పించే దిశగా మిఠాయి యాజమాన్యం కసరత్తులు చేస్తోంది. ఇవన్నీ ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత యూజర్లకు వీటిని అందుబాటులో తీసుకొచ్చేందుకు మెటా యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీకి కేంద్రంలోని రాజ్యాంగబద్ధ పదవి.. ఆమెకే ఛాన్స్!

Daggubati Purandeswari constitutional post
Daggubati Purandeswari constitutional post

Daggubati Purandeswari constitutional post: నందమూరి ఆడపడుచులు చాలా యాక్టివ్ గా ఉంటారు. పాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్నారు. అయితే రాజకీయంగా మాత్రం ఆ ఫ్యామిలీ నుంచి మహిళల్లో తనకంటూ రాజకీయ ముద్ర చాటుకున్నారు దగ్గుబాటి పురందేశ్వరి. కేంద్రమంత్రిగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా తన రాజకీయ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవికి ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మేరకు బిజెపి పెద్దలు ఆమెను ఎంపిక చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు పురందేశ్వరి. అయితే ఆమెకు ఇప్పుడు కేంద్రంలో కీలక పదవి కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర పెద్దలు ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటే ఆ పదవికి పురందేశ్వరి పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.

పుష్కరకాలంగా బిజెపిలో..
భారతీయ జనతా పార్టీలో పుష్కరకాలంగా పనిచేస్తూ వచ్చారు పురందేశ్వరి. 2024 ఎన్నికల్లో బిజెపికి ఓట్లు, సీట్లు పెరగడానికి ఆమె ఒక కారణం. ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు వెనుక ఆమె కృషి ఉంది. ఆ ఎన్నికల్లో ఆమె రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ దొరకలేదు. అయితే ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిగా ఉన్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆమెకు కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
చాలా రోజులుగా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ భర్తీ చేయడం లేదు భారతీయ జనతా పార్టీ. అయితే ఆ పోస్ట్ ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తూ వస్తోంది సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక ఆ పోస్టును కేటాయించడం లేదు భారతీయ జనతా పార్టీ. గత కొన్నేళ్లుగా పూర్తిగా భర్తీ చేయకుండా వస్తోంది. అయితే వివిధ బిల్లులను అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ప్రయోజనం చేకూర్చే బిల్లులను సైతం అడ్డు తగులుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా.. మరో పార్టీకి కేటాయించకుండా.. బిజెపి తన వద్ద ఉంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా మహిళా నేత అయిన దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

టిడిపికి బిగ్ ఆఫర్!

Big offer for TDP
Big offer for TDP

Big offer for TDP: ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. రెండో పెద్ద పార్టీ కూడా. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీని కూడా టిడిపి అందించగలిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. ఇప్పటికే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టును తెలుగుదేశం పార్టీకి కేటాయించింది కేంద్రం. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. రేపు ఎన్డీఏ పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రేపు ఎన్ డి ఏ పక్ష సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

నేడు ఢిల్లీకి చంద్రబాబు..
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు రేపు ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. నీతి ఆయోగ్ తో పాటు ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని చర్చిస్తారు. అయితే ప్రధానితో జరిగే భేటీలో చంద్రబాబుకు ఆయన గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. ఒక సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేస్తారని సమాచారం.

మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు జనసేనకు ఇద్దరు.. బిజెపికి మరో ముగ్గురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రం నుంచి. తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్రమంత్రి పదవులను కేటాయించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ కు క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి ఇచ్చి.. సహాయ మంత్రిగా మరొకరికి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ సైతం చాలా రోజులుగా ఖాళీ ఉంది. దానిని సైతం ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టిడిపికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.