Home Blog Page 163

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా..

Sleeping After Dinner
Sleeping After Dinner

Sleeping After Dinner: ప్రస్తుత రోజుల్లో చాలామంది ది బిజీ జీవనశైలి. ఈ క్రమంలో రాత్రి భోజనం చేసిన వెంటనే మంచం ఎక్కేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నిద్రించడం వల్ల శరీరంలోని జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆ సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం..

మన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడానికి కొంత సమయం అవసరం. భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే శరీర కదలికలు తగ్గిపోతాయి. దీంతో ఆహారం ద్వారా వచ్చిన కేలరీలు పూర్తిగా వినియోగం కాకుండా కొవ్వు రూపంలో నిల్వ కావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. వీటితోపాటు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి కడుపులో భారంగా అనిపించడం, అసౌకర్యం కలగడం కూడా జరుగుతుంది.అలాగే కడుపులోని ఆమ్లాలు పైకి అన్నవాహికలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీని వల్ల గుండెల్లో మంట, గొంతులో మంట, నోటిలో చేదు రుచి వంటి సమస్యలు ఎదురవుతాయి. తరచూ ఇలా జరిగితే జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి కష్టపడుతున్న సమయంలో పడుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. రాత్రి మధ్యలో మేల్కొనడం, అసౌకర్యంగా అనిపించడం, ఉదయం లేచినప్పుడు అలసటగా ఉండటం వంటి సమస్యలు కనిపించవచ్చు. దీని ప్రభావం మరుసటి రోజు పనితీరుపై కూడా పడుతుంది.

వైద్యుల సూచనల ప్రకారం.. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు భోజనం చేస్తే 10 గంటల తర్వాత నిద్రపోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం చిన్న అలవాటులా కనిపించినా, దీని ప్రభావం ఆరోగ్యంపై పెద్దగా ఉంటుంది. బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలను నివారించాలంటే భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం, కనీసం రెండు గంటల తర్వాత మాత్రమే పడుకోవడం ఉత్తమమైన అలవాటు అని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈ రోజు లక్ష్మీ తాండవం.. డబ్బు కట్టలు లెక్క పెట్టాల్సిందే..

Today 10 july 2026 Horoscope
Today 10 july 2026 Horoscope

Today 10 June 2026 Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఇంట్లో ఈరోజు లక్ష్మీ తాండవం చేస్తుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన అవకాశాలు ఉండలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం. ఉద్యోగులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు కోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఎవరికీ డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. వ్యాపారులకు కొత్త అవకాశాలు అందుతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి అనుకున్న కోరికలలో ఈరోజు ఒకటి నెరవేరుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారులకు మద్దతు ఉండడంతో అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెట్టిన వాళ్ళు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా ఉద్యోగులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. అయితే ఇదే సమయంలో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వస్తువు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యక్తిగత జీవితం సంతోషంగా గడుస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. స్నేహితుల అండదండలతో అప్పుల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులను నెరవేర్చుకోవడంలో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు అపారమైన లాభాలు పొందుతారు. వ్యాపారులకు అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థుల పోటీ పరీక్షలు పాల్గొంటే రాణిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. కొందరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నట్టుండి వ్యాపారులకు ఘననీయంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

రజినీకాంత్ ని చూసి నా కెరీర్ ని నాశనం చేసుకున్నా.. స్టూడియో మూతపడింది - మాధవన్

R Madhavan
R Madhavan

R Madhavan: తమిళనాడు లో ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రంగనాథన్ మాధవన్. ముఖ్యంగా లేడీస్ లో ఈయనకి ఉన్నటువంటి ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇప్పటికీ మంచి సినిమా తీస్తే ఆయన భారీ బ్లాక్ బస్టర్ ని అందుకునే అవకాశం ఉంది . తమిళం తో పాటు తెలుగు , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో హీరో గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు మాధవన్. రీసెంట్ గా ‘ధురంధర్’ సిరీస్ లో ఆయన చేసిన పాత్రకు ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము . ఇలాంటి సంచలనాత్మక పాత్రలతో నేటి తరం ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మాధవన్. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఒకానొక సమయం లో కొంతమంది విశ్లేషకులు నా దగ్గరకు ఒక డేటా తో వచ్చారు. మీకు A సెంటర్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది , కానీ బీ , సి సెంటర్స్ లో లేదు , అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయకపోతే మీరు రజినీకాంత్ లాగా అవ్వలేరు అని చెప్పారు. గ్రామీణ ప్రేక్షకులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆదరించినప్పుడే మరో రజినీకాంత్ కాగలరు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సలహాలు తీసుకొనే , నాకు సరిపోయే ఒక కథ కు ఒకే చెప్పను . అందులో నా పాత్ర చాలా వీక్ గా ఉంటుంది. తనని తానూ పోషించుకోవడానికి కూడా చాలా కష్టపడేలా ఉంటుంది. పైగా చదువు లేదు , క్రికెట్ లో రాణించాలి అనే గొప్ప కల ఉన్న యువకుడి కథ అది. ఎన్నో ఆశలతో సినిమా తీస్తే , అది పెద్ద ఫ్లాప్ అయ్యింది , దెబ్బకు స్టూడియో ని కూడా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ మాధవన్ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు .

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆ దెబ్బతో నా కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలు గుడ్డిగా తీసుకోవడం మానేసాను , నాకు నచ్చితేనే సినిమాలు చేయడం మొదలు పెట్టాను , పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే రీసెంట్ గా మాధవన్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం లో హనుమంతుడి క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి తట్టుకోలేక ట్వీట్స్ డిలీట్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ..

Rahul Ramakrishna
Rahul Ramakrishna

Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఎంత వయొలెంట్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గురించి చిన్న మాట అన్నా తీసుకోలేరు , రక్తం వచ్చేలా రక్కేస్తారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎవరైనా పొరపాటున నోరు జారితే అయిపోయినట్టే. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తూ కొన్ని ట్వీట్లు వేశాడు . సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 4.1 (B) ప్రకారం పారదర్శకత , ముందస్తు సమాచార వెల్లడి గురించి పవన్ కళ్యాణ్ ని ఆయన నిలదీశాడు , ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఈ హామీ సంగతేంటి అని నిలదీస్తూ , చివర్లో జై తెలంగాణ అంటూ ట్వీట్ వేశాడు . రాహుల్ రామకృష్ణ వేసిన ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అభిమానులు ఈ స్థాయిలో రాహుల్ పై సైబర్ దాడి చేయడం తో ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాదు’ అంటూ ట్వీట్ చేశాడు . ఆ తర్వాత కాసేపటికి ఆయన నటించిన ‘జాతి రత్నాలు’ చిత్రం లోని ఫేమస్ డైలాగ్ , నా వల్లే ప్రోబ్లం అంటే వెళ్ళిపోతా మావా ఇక్కడి నుండి అంటూ ట్వీట్ వేసాడు. అయితే చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు రాహుల్ కిందకు దిగాక తప్పలేదు , పవన్ కళ్యాణ్ మీద వేసిన ట్వీట్స్ అన్నిటిని డిలీట్ చేశాడు . రాహుల్ రామకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు , తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా , నిర్మొహమాటంగా చెప్తుంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై కూడా ఇలాగే ట్వీట్లు వేసాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని తెలంగాణ లో యాక్టీవ్ చేయడం తో , ఇప్పుడు ఆయన మీద ఇలాంటి ట్వీట్లు వేసాడు. ఇలాంటి నోటి దూల కారణంగానే , ఆయనకు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ , ఈమధ్య కాలం లో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మహేష్ బాబు హాట్ కామెంట్స్ వైరల్..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: అభిమానుల ఉత్సాహం సినీ సెలబ్రిటీలపై ఒక పరిధి లో ఉంటే చాలా బాగుంటుంది , పరిధి దాటి ప్రవర్తిస్తే , తమ అభిమాన తారలకు ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవ్వలేము , చిరాకు కలిగించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా హీరోయిన్స్ ఈమధ్య కాలంలో పబ్లిక్ ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులను ఎదురుకోవాల్సి వచ్చిందో మన అందరికీ తెలిసిందే. స్త్రీలకూ మాత్రమే కాదు , పురుషులకు కూడా ఇదే స్థాయిలో అభిమానుల అత్యుత్సాహం ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులను మహేష్ బాబు ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా, ఎక్కువ కాలం ప్రైవేట్ గా ఫ్యామిలీ తో గడపాలి అని కోరుకునే వ్యక్తి .

కానీ ఆయన తన కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు , విమానాశ్రయం లో అభిమానులు మీద పడడం వంటివి తీవ్రమైన ఇబ్బందికి గురి చేశాయట. దీని పై ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో మొబైల్ ఫోన్స్ , కెమెరాలు ఉండేవి కాదు కాబట్టి , మేము బయట తిరిగినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము బయట కనిపిస్తే అభిమానులు ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అది తప్పు అని నేను అనడం లేదు . అభిమానుల ఉత్సాహం అలాగే ఉంటుంది , అది కామన్, అర్థం చేసుకోగలం , కానీ ఆ ఉత్సాహం పరిధి దాటినప్పుడే ప్రైవసీ కి భంగం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరిగితే పర్వాలేదు అనుకోవచ్చు , ప్రతీ సారీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటే ఇబ్బంది’ అంటూ మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వం లో ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కాబోతుంది. కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా, ఫారిన్ భాషల్లో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు మార్కెట్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు . ఈ ఏడాది ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర లో 'పెద్ది' ప్రభంజనం.. ఈ రికార్డుని అందుకోవడం 'వారణాసి' కి కూడా కష్టమే..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీ ని చూస్తుంటే , ఈ చిత్రం లాంగ్ రన్ రంగస్థలం ని మించి ఉంటుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి వర్కింగ్ డే ఈ రేంజ్ షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రావడం చూసి దాదాపుగా రెండేళ్లు అయ్యింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లు వర్ణనాతీతం. ఈమధ్య కాలం లో ఉత్తరాంధ్ర ప్రాంతం సంక్రాంతి సీజన్ లో మాత్రమే సినిమాలకు అనుకూలంగా ఉంటూ వచ్చింది.

మిగిలిన సీజన్స్ లో ఈ ప్రాంతం నుండి వసూళ్లు పెద్దగా నమోదు అవ్వలేదు. కానీ ‘పెద్ది’ చిత్రానికి సంక్రాంతికి సీజన్ ని మించిన వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదు అవుతున్నాయి. 5 వ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రానికి 1 కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా 6 వ రోజు కూడా ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే వరుసగా 6 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాబట్టిన అరుదైన సినిమాల్లో ఒకటిగా ‘పెద్ది’ చిత్రం నిలిచిపోతుంది. ప్రస్తుతానికి అయితే 5 రోజుల్లో ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది ‘దేవర’, ‘ఓజీ’ ఉత్తరాంధ్ర ప్రాంతం క్లోజింగ్ తో సమానం అట.

ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా ప్రతిష్టాత్మక 20 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని , ఫుల్ రన్ లో ఆల్ టైం రికార్డు ని నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా ఉత్తరాంధ్ర లో ఈ రేంజ్ సునామీ ని క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం , ఈ చిత్రం ఉత్తరాంధ్ర యాసలో తెరకెక్కడమే అని అంటున్నారు విశ్లేషకులు. రాయలసీమ , తెలంగాణ యాసలో ఇది వరకు గతం లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి , కానీ ఉత్తరాంధ్ర యాసలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. ‘పెద్ది ‘ చిత్రం ఆ యాసలో తెరకెక్కడం వల్ల, ఈ ప్రాంతం నుండి కాసుల కనకవర్షం కురిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ రికార్డు ని భవిష్యత్తులో వారణాసి కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు.

అప్పుడే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసిన 'దృశ్యం 3'.. ఎందులో చూడాలంటే..

Drishyam 3 OTT Release
Drishyam 3 OTT Release

Drishyam 3 OTT Release: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం 3’. మలయాళం తో పాటు , తెలుగు లో కూడా ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి క్రేజ్ ఉండేది. ఎందుకంటే తెలుగు లో వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం తో ఆడియన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ సినిమాకు కమర్షియల్ గా కాసుల కనకవర్షం భారీగానే కురిసింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ కేవలం 30 కోట్ల రూపాయలకే అమ్మారు. బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రం బయ్యర్స్ కి డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.

తెలుగు వెర్షన్ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఇలాంటి సమయం ల్లో ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. విడుదలకు ముందు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. గతం లో తెలుగు , మలయాళం , హిందీ వెర్షన్స్ కి సంబంధించిన దృశ్యం సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3’ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 18 వ తారీఖున లేదా, 25 తారీఖున స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు . ఈ వారం లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

అయితే ఈ చిత్రం హిందీ బాషా మినహా, మిగిలిన అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. హిందీ లో ఎందుకు స్టెమ్మింగ్ అవ్వడం లేదంటే , ఈ సినిమా హిందీ లో గ్రాండ్ గా తెరకెక్కుతుంది కాబట్టి . అజయ్ దేవగన్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు. మొదటి రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించిన శ్రియ శరన్ ఈ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ , ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది. ఇక మలయాళం వెర్షన్ విషయానికి వస్తే , థియేటర్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ రాబోతుందో చూడాలి.

రోజ్ సర్దానా అందాలు చూడతరమా?

Rose Sardana photos
Rose Sardana photos

నా చావుకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చాడు అంటూ హాట్ కామెంట్స్ చేసిన జగపతి బాబు..

Jagapathi Babu
Jagapathi Babu

Jagapathi Babu: ప్రస్తుతం జగపతి బాబు పేరు ఇండస్ట్రీ లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో మన కళ్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కీలక పాత్ర పోషించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతే కాకుండా నటన పరంగా రామ్ చరణ్ తర్వాత, ఆ స్థాయి రెస్పాన్స్ జగపతి బాబు కే వచ్చింది. హీరో క్యారెక్టర్స్ నుండి విలన్ మరియు క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిన జగపతి బాబు కి , పాన్ ఇండియా లెవెల్ లో టాప్ డైరెక్టర్స్, స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కింది. పాజిటివ్ , నెగెటివ్ క్యారెక్టర్స్ తో ఆయన అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనే చెప్పొచ్చు.

అయితే ఈమధ్య కాలం లో జగపతి బాబు జోరు కాస్త తగ్గింది. ముఖ్యంగా టాలీవుడ్ లో గత రెండు సంవత్సరాలుగా జగపతి బాబు స్థాయి కి తగ్గ పాత్రలు దక్కలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సమయం లో ఆయనకు ‘పెద్ది’ చిత్రం ద్వారా దొరికిన ఈ అప్పలసూరి క్యారెక్టర్ , మంచి బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. లెజెండ్ చిత్రం తో నెగెటివ్ రోల్ ద్వారా ఆయన ఎలాంటి ప్రభావం చూపించాడా , ‘పెద్ది’ చిత్రం లో పాజిటివ్ క్యారెక్టర్ ద్వారా ఆయన అలాంటి ప్రభావమే చూపించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రీసెంట్ గా జగపతి బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , సోషల్ మీడియా లో జరిగే ఫేక్ వార్తల ప్రచారాల పై , ఫేక్ థంబ్ నెయిల్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా ఈమధ్య కాలం లో దారుణంగా తయారైంది , నేను చనిపోయానంటూ కొన్ని వార్తలు కూడా ఈ సోషల్ మీడియా లో ప్రచారమయ్యాయి. నా మృత దేహం పక్కన జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతర నటీనటులు కూడా నిల్చొని ఏడుస్తున్నట్టు కొన్ని థంబ్ నెయిల్స్ ఎడిట్ చేశారు. కానీ అలాంటి వాటి గురించి నేను ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు , స్పందించాలని అనుకోలేదు, మరణించానని చెప్పినా, నిజాయితితో జీవిస్తున్నాను’ అంటూ జగపతి బాబు తన స్టైల్ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ‘పెద్ది’ లో జగపతి బాబు సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో , ఎడిటింగ్ లో తొలగించబడిన జగపతి బాబు , రామ్ చరణ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను ఈ చిత్రం లో జత చేయబోతున్నారు. ఈ వారం నుండే ఈ కొత్త సన్నివేశాలను థియేటర్స్ లో ఆడియన్స్ చూడొచ్చు.

బీచ్ లో బి*కి*నీలో రోశిణీ అందాలు

Roshni Walia latest photos
Roshni Walia latest photos

సినిమాలకు 'గుడ్ బై' చెప్పనున్న బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ.. కారణం ఏంటంటే..

Vijay Antony
Vijay Antony

Vijay Antony: తమిళ హీరోలకు మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ ఇండస్ట్రీ లో చిన్న స్థాయిలో ఉన్న హీరోలు కూడా, ఇక్కడ తమ సినిమాలను డబ్ చేసి భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ సినిమాతో ఈయన తెలుగు , తమిళ ఇండస్ట్రీస్ లో ఎలాంటి సునామీ క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమాకు మన టాలీవుడ్ ఆడియన్స్ మినిమం గ్యారంటీ వసూళ్లు అందించారు. ప్రస్తుతం ఆయన ‘నూరుసామి’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. తనతో ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఏర్పడ్డాయి.

ఈ నెల 19 న తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలు ఆసక్తికరమైన సమాదానాలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఈ చిత్రం లో రైతుగా నటించారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది?’ అని అడుగుతాడు, అందుకు విజయ్ ఆంటోనీ సమాధానం చెప్తూ ‘నేను నిత్యం ఆహ్లాదకరమైన జీవితాన్ని కోరుకునే మనిషి. ప్రస్తుతం నాకు పని చెన్నై లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నేను ఎక్కువగా అక్కడే ఉండాల్సి వస్తోంది. సినీ సెలబ్రిటీ ఫేమ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ , కానీ నాకు సాధనమైన జీవిన శైలి నే ఇష్టం. పల్లెటూరిలో జీవించడం సాయంత్రం 6 నుండి 7 గంటల లోపే పడుకోవడం , పక్షుల కిలకిలారావాలు , కూడి కూతలు నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి.

రాబోయే రెండు మూడు ఏళ్ళల్లో పొలాచ్చి తరహా ప్రాంతం లో ఒక స్థలం కొనుగోలు చేసి, అక్కడే స్థిరపడతాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ. ఆ వ్యాఖ్యలు చేయడం తో త్వరలోనే విజయ్ ఆంటోనీ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా కాకుండా తన సినిమాకు పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మరికొందరు ఆంటున్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

'డ్యూడ్ 2' వచ్చేస్తోంది.. సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈసారి స్టోరీ ఏంటంటే..

Dude 2 Sequel Update
Dude 2 Sequel Update

Dude 2 Sequel Update: ‘లవ్ టుడే’ , ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత, ప్రదీప్ రంగనాథన్ చేసిన చిత్రం ‘డ్యూడ్’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చింది , కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపేసింది. దాదాపుగా 124 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. థియేటర్స్ లో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చి ఉండొచ్చు కానీ , ఓటీటీ లో విడుదలయ్యాక మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా విడుదలై ఏడాది కావొస్తుంది , కానీ ఇప్పటికీ ఈ చిత్రం మేనియా నుండి ఆడియన్స్ బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను రీల్స్ గా , మీమ్స్ గా వాడుతూనే ఉన్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కీర్తి స్వరణ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘డ్యూడ్ చిత్రానికి సీక్వెల్ చేయదగ్గ కథ నా దగ్గర ఉంది. వర్కౌట్ అయితే , పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తాను , కచ్చితంగా ఈ చిత్రానికి సీక్వెల్ కార్యరూపం దాలుస్తుంది అనే నమ్మకం నాకు బలంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మొదటి భాగం లో తానూ ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని , స్వయంగా దగ్గరుండి పెళ్లి చేసి పంపిస్తాడు హీరో. అదే విధంగా హీరోయిన్ కూడా హీరో కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. కథ సుఖాంతం , ఇక ఏముంది అని మీరు అనుకోవచ్చు.

పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి కాపురాల్లో చిచ్చు చెలరేగి విడిపోయి, మళ్లీ హీరో హీరోయిన్ కలిస్తే?, అలాంటి లైన్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా?, ఇలాంటి స్టోరీ లైన్ మీద సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఇలా కొనసాగింపుగా కాకుండా, వేరే కథ తో ఈ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ కి రీసెంట్ గానే ‘LIK ‘ తో బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయనకు సూపర్ హిట్ కచ్చితంగా అవసరం. కాబట్టి ఆయన తదుపరి చిత్రం ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

'బిగ్ బాస్ 10' ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా.. ఈసారి వివాదాలు.. గొడవలు మామూలుగా ఉండవు..

Bigg Boss 10 Telugu
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముందు సీజన్స్ తో పోలిస్తే , గత సీజన్ లో జరిగిన గొడవలు చాలా తక్కువే, కానీ కంటెస్టెంట్స్ మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం తో ఈ సీజన్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సీజన్ గా నిల్చింది ‘బిగ్ బాస్ 9’. ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో మరొకటి ‘అగ్నిపరీక్ష’ అనే షో. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామాన్యులు సాలిడ్ కంటెంట్ ఇచ్చారు. వారిలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలబడగా, మరొకరు టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా రెడీ అయిపోయిందని అంటున్నారు . వారిలో ఒక పది మంది పేర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తోంది. వారిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది తేజస్విని గౌడ. సీరియల్ హీరోయిన్ గా ఈమెకు ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. పైగా అమర్ దీప్ చౌదరి వంటి క్రేజీ టాప్ టీవీ సీరియల్ హీరో కి సతీమణి అవ్వడం తో ఈమెకు క్రేజ్ ఇంకా ఎక్కువ పెరిగింది . గత రెండు సీజన్స్ నుండి ఈమె కోసం బిగ్ బాస్ టీం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఎట్టకేలకు ఈ సీజన్ లో ఆమె పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న , బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కూడా ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని టాక్.

బయట ఉన్నప్పుడే ఇతగాడు ఏ రేంజ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసేవాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నాడు , గొడవలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. అదే విధంగా ఈ షోలో కంటెస్టెంట్స్ గా పల్లవి గౌడ , హరి , నూకరాజు , రాకింగ్ రాకేష్ , పండు మాస్టర్ , జ్యోతి , రాయల్ మేక్ రమణ, నందూస్ వరల్డ్ నందూ , శివ కుమార్ వంటి కంటెస్టెంట్స్ కూడా పాల్గొనబోతున్నారు. దశావతారం థీమ్ తో నడవనున్న ఈ సీజన్ లో సరికొత్త రూల్స్, ఎప్పుడూ చూడనటువంటి టాస్క్స్ ని డిజైన్ చేస్తున్నారట. చూడాలి మరి , ఈ సీజన్ కూడా గత సీజన్ లాగానే బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో అనేది.

నిర్మాతగా మారిన అక్కినేని నాగ చైతన్య.. తొలి ప్రాజెక్ట్ లో హీరో ఎవరంటే..

Akkineni Naga Chaitanya Producer Debut
Akkineni Naga Chaitanya Producer Debut

Akkineni Naga Chaitanya Producer Debut: అక్కినేని కుటుంబం లో ప్రస్తుతం మినిమం గ్యారంటీ రేంజ్ లో వసూళ్లను రాబట్టే హీరోలలో ఒకరు అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య సినిమా వస్తుందంటే , కచ్చితంగా బాగుంటుంది , థియేటర్ లోనే చూడాలి అని అనుకునే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కెరీర్ లో చాలా ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, కల్ట్ క్లాసిక్ చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి తండేల్ చిత్రం ఎలాంటి బిగ్ రిలీఫ్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకంటే ముందుగా ఆయన ‘దూత’ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ కి పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ గా ‘దూత 2’ రాబోప్తుంది.

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. మొదటి సీజన్ లో నటించిన నటీ నటులే రెండవ సీజన్ లో కూడా నటించబోతున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించబోతుంది. ఇక నాగ చైతన్య ఈ సిరీస్ లో హీరో గా నటించడమే కాకుండా, సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దీని గురించి మాట్లాడుతూ ‘నటన కంటే భిన్నంగా ఎదో ఒక కొత్త ప్రయత్నం చెయ్యాలని అనిపించింది. అందుకే ఈ సిరీస్ కి నిర్మాతగా మారాను. ఏదైనా ఒక పనికి కమిట్ అయ్యినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి , నాకు ఉన్న ఆ లక్షణమే ‘దూత 2′ కి నిర్మాతగా వ్యవహరించేలా ప్రేరేపించింది’ అంటూ నాగ చైతన్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పటి వరకు హారర్ థ్రిల్లర్ జానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు , వెబ్ సిరీస్ లు వచ్చాయి. కానీ దూత లాంటి కాన్సెప్ట్ తో ఒక్క వెబ్ సిరీస్ కూడా రాలేదు. నిజంగా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు రెండవ సీజన్ ని ఆయన ఎలా నడిపిస్తాడో చూడాలి. ఈ సిరీస్ లో నాగ చైతన్య కి జోడీగా ప్రియా భవాని శంకర్ నటించబోతుంది. మొదటి సీజన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ చైతన్య , రెండవ సీజన్ తో అదే రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. ఈ నెలాఖరు నుండి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సిబిల్ స్కోర్ ఫాస్ట్ గా పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

How to increase CIBIL score fast
How to increase CIBIL score fast

How to increase CIBIL score fast: ప్రస్తుతం వ్యక్తిగత రుణం, హోం లోన్, వాహన రుణం పొందేటప్పుడు బ్యాంకులు ఎక్కువగా పరిశీలించే అంశం సిబిల్ స్కోరు. సాధారణంగా సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు సిబిల్ స్కోరును 750కు పైగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఒక్కోసారి సిబిల్ స్కోరు తగ్గితే వడ్డీ రేటు ఎక్కువగా విధిస్తారు. ఇలాంటప్పుడు సిబిల్ స్కోరును త్వరగా పెంచుకోవాలంటే ఏం చేయాలి?

సిబిల్ స్కోరు అనేది వ్యక్తి రుణాలను ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నాడో తెలియజేసే క్రెడిట్ రేటింగ్. సాధారణంగా ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. స్కోరు ఎక్కువగా ఉంటే బ్యాంకులకు ఆ వ్యక్తిపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా రుణం త్వరగా మంజూరు కావడం, తక్కువ వడ్డీ రేటు లభించడం, ఎక్కువ క్రెడిట్ పరిమితి పొందడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.

సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నవారు ముందుగా ఇప్పటికే ఉన్న రుణాల ఈఎంఐలను సమయానికి చెల్లించాలి. ఒక్క EMI కూడా మిస్ కాకుండా చెల్లించడం వల్ల క్రమంగా స్కోరు మెరుగుపడుతుంది. అయితే క్రెడిట్ హిస్టరీ బలహీనంగా ఉన్నవారికి లేదా మొదటిసారి క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవాలనుకునేవారికి FD ఆధారిత క్రెడిట్ కార్డు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

FD ఆధారిత క్రెడిట్ కార్డు అంటే ఏమిటి?
ఇది సాధారణ క్రెడిట్ కార్డు లాంటిదే. అయితే బ్యాంకు ముందుగా మీ పేరుపై ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తీసుకుని, దానిని భద్రతగా ఉంచి క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. దీనిని సాధారణంగా “సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్” అని కూడా పిలుస్తారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నా లేదా అసలు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా ఈ కార్డు పొందడం సులభంగా ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?
చాలా బ్యాంకులు మరియు ఫిన్‌టెక్ సంస్థలు ఆన్‌లైన్‌లోనే FD ఆధారిత క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సంబంధిత బ్యాంకు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి Secured Credit Card లేదా Credit Card Against FD ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత అవసరమైన KYC పూర్తి చేసి, నిర్ణీత మొత్తాన్ని FDగా డిపాజిట్ చేయాలి. డిపాజిట్ పూర్తైన తర్వాత కార్డు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

కొన్ని బ్యాంకులు, డిజిటల్ ఫైనాన్స్ సంస్థలు రూ.2,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో కూడా FD ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సాధారణంగా రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ FD చేస్తే ఫిజికల్ క్రెడిట్ కార్డు కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే కనీస FD మొత్తం బ్యాంకు లేదా సంస్థను బట్టి మారవచ్చు.

సిబిల్ స్కోరు ఎలా పెరుగుతుంది?
FD ఆధారిత క్రెడిట్ కార్డు ద్వారా చిన్న చిన్న కొనుగోళ్లు చేసి, ప్రతి నెల బిల్లు గడువు తేదీకి ముందే పూర్తిగా చెల్లిస్తే ఆ వివరాలు క్రెడిట్ బ్యూరోలకు చేరతాయి. దీంతో మీరు బాధ్యతాయుతంగా క్రెడిట్ వినియోగిస్తున్నారని రికార్డు ఏర్పడుతుంది. ఇది క్రమంగా సిబిల్ స్కోరు పెరగడానికి సహాయపడుతుంది.క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని పూర్తిగా వినియోగించకుండా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు లిమిట్‌లో 30 శాతం వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తారు. అలాగే కనీస బకాయి మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించడం వల్ల క్రెడిట్ ప్రొఫైల్ మరింత బలపడుతుంది. ఆలస్య చెల్లింపులు చేస్తే స్కోరు పెరగడం బదులుగా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.

సిబిల్ స్కోరు తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయానికి EMIలు చెల్లించడం, క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగించడం, ముఖ్యంగా FD ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును సక్రమంగా నిర్వహించడం ద్వారా కొద్ది నెలల్లోనే క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందాలనుకునేవారికి ఇది ఉపయోగకరమైన మార్గంగా చెప్పవచ్చు.

హార్ముజ్‌ జలసంధిలో కూలిన అమెరికా హెలికాప్టర్‌.. పైలట్లు క్షేమం!

US helicopter crash Strait of Hormuz
US helicopter crash Strait of Hormuz

US helicopter crash Strait of Hormuz: అమెరికా, ఇరాన్‌ యుద్ధ కారణంగా హర్మూజ్‌ జలసంధికి ప్రపంచవ్యాప్తగా గుర్తింపు దక్కింది. అందరి నోళ్లలో నానుతోంది. ఎందుకంటే గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా అయ్యేది ఇక్కడి నుంచే. యుద్ధం కారణంగా ఇరాన్‌ మొదట దీనిని మూసివేసింది. తర్వాత అమెరికా పట్టు సాధించింది. తాజాగా ఈ జలసంధి వద్ద భారత నౌకపై అమెరికా సైనికులు దాడి చేశారు. ఇలాంటి ఒమన్‌ నౌకలో ఉన్న 20 మంది భారత సిబ్బందిని కాపాడింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే హర్మూజ్‌ వద్ద అమెరికా గస్తీ మెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. హెలికాప్టర్‌ పూర్తిగా ధ్వంసమైనా ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

ఇరాన్‌ దిగ్బంధం తొలగించేందుకు..
ఇరాన్‌ విధించిన జలసంధి దిగ్బంధనాన్ని తొలగించడానికి అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యాచరణలో అపాచీ హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు, డ్రోన్లు కలిసి నిరంతర పహారా కాస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఏం జరిగింది?
అయితే హెలికాప్టర్‌ కూలడానికి కారణం ఏమిటి అన్నది ఎవరూ ప్రకటించలేదు. ఇరాన్‌ మాత్రం తన దళాలు అమెరికా రీపర్‌ డ్రోన్లను కూల్చివేశాయని ప్రకటించింది. దీంతో అపాచీ హెలికాప్టర్‌ ఇరాన్‌ క్షిపణి దాడికి గురై కూలిందా లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల పతనమైందా అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి అమెరికా–ఇరాన్‌ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి కూలిన మొదటి సైనిక హెలికాప్టర్‌ ఇదే.

ఇరాన్‌ సైన్యం పూర్తిగా నాశనం..
అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి చేపట్టిన దాడుల వల్ల ఇరాన్‌ సైనిక బలాలు సమూలంగా నాశనమయ్యాయని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టెహ్రాన్‌ వద్ద కేవలం 21 శాతం మాత్రమే క్షిపణి సామర్థ్యం మిగిలి ఉందని చెప్పారు. మళ్లీ ఇరాన్‌ దాడులు ప్రారంభిస్తే అమెరికా సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నాహాలతో ఉందని హెచ్చరించారు.

యుద్ధం కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయాన్ని సెంట్రల్‌ కమాండ్‌ స్వయంగా అంగీకరించింది. ఇరాన్‌ దాడుల్లో ఇప్పటివరకు 13 మంది అమెరికన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 399 మంది గాయపడ్డారు. అనేక యుద్ధ విమానాలు కూడా కూల్చివేయబడ్డాయి.

లక్ష్యద్వీప్‌కు లిక్కర్‌ వచ్చింది.. 47 ఏళ్ల తర్వాత అమ్మకాలకు అనుమతి!

Lakshadweep liquor sale permission
Lakshadweep liquor sale permission

Lakshadweep liquor sale permission: లిక్కర్‌.. ప్రస్తుతం పాలకులకు ఆదాయ మార్గం. ఒకప్పుడు మద్య నిషేధం అమలు చేసిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు లిక్కర్‌ అమ్మకాలను ఎంకరేజ్‌ చేస్తున్నాయి. అయతే దేశంలో ఆ రాష్ట్రంలో 47 ఏళ్లుగా మద్యం అమ్మకాలపై నిషేధం అమలులో ఉంది. కేంద్రం అధీనంలో ఉన్న ఆ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలకు తాజాగా కేంద్రం అనుమతి ఇచ్చింది. తీరప్రాంత వినియోగాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో 1979లో ప్రకటించిన మధ్యపాన నిషేధంలోని కొన్ని నిబంధనలను మార్చింది. లక్షద్వీప్‌లో అధికారికంగా మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేసింది.

నిబంధనల మేరకు అనుమతి..
మధ్యపాన నిషేధానికి సంబంధించి ప్రస్తుత తీర్మానంలో కేంద్రం గుర్తించిన మార్పుల ద్వారా లక్షద్వీప్‌లో ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన సంస్థలు మాత్రమే మద్యం దిగుమతి చేసుకోవాలి. విక్రయించాలి. ఈ మార్పు ఫిర్యాదులలో లైసెన్సింగ్, నియంత్రణా బోధనల ద్వారా నడిపించబడే విధంగా రూపొందించారు. అనారోగ్యకర వినియోగం నియంత్రణతో ఒక నియంత్రిత మార్కెట్‌ స్థాపించడం.

పర్యాటకాభివృద్ధి, ఆదాయం..
కేంద్రం పర్యాటకాభివృద్ధి, ఆదాయం దృష్టిలో పెట్టుకుని మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మద్యం ధరలపై ఎక్సైజ్‌ సుంకం భారీగా పెంచింది. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 400%, బీర్‌ 200%, వైన్‌ 80% సుంకాలు విధించింది. మద్యం లభ్యత కారణంగా పర్యాటకుల పెరిగడంతోపాటు ఆదాయం వస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లకు, ట్రావెల్‌ సర్వీసులకు ఆదాయం వస్తుంది. అయితే అధిక ధరల కారణంగా కొంతమంది పర్యాటకులు లేదా స్థానికులు మద్యం కొనుగోలు తగ్గిస్తారు.

సామాజిక, సాంస్కృతిక పరిణామాలు
లక్షద్వీప్‌లో ముస్లిం ఆధిక్య వున్న ప్రాంతం కావడంతో మద్యం విధానం సామాజిక సున్నితతలకు దారితీస్తుంది. సభ్య సమాజాలలో మద్యం అందుబాటును సహజరీతిలో అంగీకరించకపోవచ్చు. స్థానిక నాయకులు, మద్దతుదారులు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశముంది. మద్యం వినియోగం పెరిగితే సామాజిక సమస్యలు, పేదరిక నియంత్రణ, అల్లకల్లోలం మొదలైన సమస్యలు ఎదురుకావచ్చునని ఆరోగ్య నిపుణులు సూచించవచ్చు. స్థానిక పరిమితుల ద్వారా విక్రయ స్థలాలు, వయస్సు నిర్ధారణ, సమయ పరిమితి వంటి నియమాలు అమలు చేయాలని స్థానిక పాలక సంస్థలపై ఒత్తిడి ఉంటుంది.

నియంత్రణ నిబంధనలు ఇలా..
ప్రభుత్వ లైసెన్సింగ్‌ దశలో ముఖ్యంగా విద్యార్థుల వయస్సు నిర్ధారణ, గంటల పరిమితి, హోటల్‌లలో ప్రత్యేక జోన్‌ల ఏర్పాటు వంటి నియమాల అమలు తప్పనిసరి. అధిక పన్నుల వల్ల అధికారిక మార్గం కాకుండా లోకల్‌ మార్కెట్లు, అక్రమ సరఫరాల ప్రభవం నివారించాల్సి ఉంటుంది. పోలీస్‌ మరియు పౌర ఆరోగ్య విభాగాల సమన్వయం అనివార్యం.

లక్షద్వీప్‌లో 47 ఏళ్ల తర్వాత మద్యం విక్రయం ప్రారంభించడం పర్యాటకాభివృద్ధికి అవకాశం కల్పిస్తుందన్నది నిజం. అయితే ఎక్సైజ్‌ పన్నుల తీవ్రత, స్థానిక సామాజిక స్వభావం, నియంత్రణా వ్యవస్థల అమలుపై ఆక్సిడెంట్‌లపై దృష్టి పెట్టకపోతే ఆశించిన లాభాలు తగ్గే అవకాశముంది. సమతుల్యత సాధించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక నేతలు, కమ్యూనిటీ లీడర్లు కలిసి స్పష్టమైన పాలసీలు రూపొందించి అమలు చేయాలి.