Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp new features: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు.. నెలకు 79 చెల్లిస్తే.. ఇవన్నీ మీ...

WhatsApp new features: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు.. నెలకు 79 చెల్లిస్తే.. ఇవన్నీ మీ సొంతం..

WhatsApp new features: సోషల్ మెసేజ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. మారిన అవసరాలకు తగ్గట్టుగా.. యూజర్లకు సదుపాయాలు కల్పిస్తోంది. తాజాగా వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈసారి యూజర్లను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల మార్పులు చేర్పులు చేపట్టింది. వాట్సప్ లో ఇకపై వాట్సప్ ప్లస్ పేరుతో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అనేది తెరపైకి వచ్చింది. నెలకు 79 రూపాయల చెల్లిస్తే ప్రత్యేకమైన స్టిక్కర్లు.. యాప్ థీమ్.. […]

WhatsApp new features: సోషల్ మెసేజ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. మారిన అవసరాలకు తగ్గట్టుగా.. యూజర్లకు సదుపాయాలు కల్పిస్తోంది. తాజాగా వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈసారి యూజర్లను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల మార్పులు చేర్పులు చేపట్టింది.

వాట్సప్ లో ఇకపై వాట్సప్ ప్లస్ పేరుతో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అనేది తెరపైకి వచ్చింది. నెలకు 79 రూపాయల చెల్లిస్తే ప్రత్యేకమైన స్టిక్కర్లు.. యాప్ థీమ్.. రింగ్టోన్స్ వంటి ఫీచర్లను ఆస్వాదించవచ్చు. 20 చాట్ లను పిన్ కూడా చేసుకోవచ్చు.. కాంట్రాక్టులకు ప్రత్యేకంగా రింగ్టోన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సేవలను నెల రోజులపాటు వాట్సప్ యాజమాన్యం ఫ్రీగా అందిస్తోంది.. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్లి సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దానిని ఆక్టివేట్ చేసుకోవాలి.

మొదట్లో దీనిని ప్రయోగాత్మకంగా అమెరికాలో చేపట్టింది మెటా కంపెనీ. అది విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది. యూజర్లకు రొటీన్ ఎక్స్పీరియన్స్ కాకుండా.. సరికొత్త అనుభవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెటా కంపెనీ ఈ ఫీచర్లను తెరపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తు కాలంలో ఇంకా అనేక రకాల మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మెటా యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది.

గతంలో మెటా కంపెనీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లను అందుబాటులోకి తెచ్చేది కాదు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులో నేపథ్యంలో ప్రీమియం వైపు వెళ్తోంది. యూజర్లు సరికొత్త సౌకర్యాలను కోరుకోవడం.. అటువంటి వాటికోసం టెక్నాలజీని విస్తృతం చేయడం.. ఉద్యోగులను నియమించుకోవడం వంటివి మెటా కంపెనీకి భారంగా మారుతోంది. అందువల్లే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇటువంటి ప్రీమియం ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయోగాత్మక దశలో ఇవి విజయవంతం కావడంతో.. వీటిని అమలు చేయడం మొదలుపెట్టింది.

భవిష్యత్ కాలంలో వీడియో ఎడిటింగ్.. కంటెంట్ క్రియేషన్.. అప్పటికప్పుడు మార్పులు చేసుకునే విధానం.. నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం వంటి వాటిని కల్పించే దిశగా మిఠాయి యాజమాన్యం కసరత్తులు చేస్తోంది. ఇవన్నీ ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత యూజర్లకు వీటిని అందుబాటులో తీసుకొచ్చేందుకు మెటా యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper