Homeఎంటర్టైన్మెంట్Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి తట్టుకోలేక ట్వీట్స్ డిలీట్ చేసిన కమెడియన్ రాహుల్...

Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి తట్టుకోలేక ట్వీట్స్ డిలీట్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ..

Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఎంత వయొలెంట్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గురించి చిన్న మాట అన్నా తీసుకోలేరు , రక్తం వచ్చేలా రక్కేస్తారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎవరైనా పొరపాటున నోరు జారితే అయిపోయినట్టే. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తూ కొన్ని ట్వీట్లు వేశాడు . సమాచార హక్కు […]

Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఎంత వయొలెంట్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గురించి చిన్న మాట అన్నా తీసుకోలేరు , రక్తం వచ్చేలా రక్కేస్తారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎవరైనా పొరపాటున నోరు జారితే అయిపోయినట్టే. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తూ కొన్ని ట్వీట్లు వేశాడు . సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 4.1 (B) ప్రకారం పారదర్శకత , ముందస్తు సమాచార వెల్లడి గురించి పవన్ కళ్యాణ్ ని ఆయన నిలదీశాడు , ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఈ హామీ సంగతేంటి అని నిలదీస్తూ , చివర్లో జై తెలంగాణ అంటూ ట్వీట్ వేశాడు . రాహుల్ రామకృష్ణ వేసిన ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అభిమానులు ఈ స్థాయిలో రాహుల్ పై సైబర్ దాడి చేయడం తో ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాదు’ అంటూ ట్వీట్ చేశాడు . ఆ తర్వాత కాసేపటికి ఆయన నటించిన ‘జాతి రత్నాలు’ చిత్రం లోని ఫేమస్ డైలాగ్ , నా వల్లే ప్రోబ్లం అంటే వెళ్ళిపోతా మావా ఇక్కడి నుండి అంటూ ట్వీట్ వేసాడు. అయితే చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు రాహుల్ కిందకు దిగాక తప్పలేదు , పవన్ కళ్యాణ్ మీద వేసిన ట్వీట్స్ అన్నిటిని డిలీట్ చేశాడు . రాహుల్ రామకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు , తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా , నిర్మొహమాటంగా చెప్తుంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై కూడా ఇలాగే ట్వీట్లు వేసాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని తెలంగాణ లో యాక్టీవ్ చేయడం తో , ఇప్పుడు ఆయన మీద ఇలాంటి ట్వీట్లు వేసాడు. ఇలాంటి నోటి దూల కారణంగానే , ఆయనకు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ , ఈమధ్య కాలం లో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper