Home Blog Page 140

గోల్డ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..

Gold Loans
Gold Loans

Gold Loans: బంగారంపై రుణం తీసుకునే వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా రుణగ్రహీతలకు మరింత ఎక్కువ మొత్తంలో రుణం అందేలా లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిలో సడలింపులు ప్రకటించింది. దీంతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునే వారికి గతంతో పోలిస్తే అధిక మొత్తంలో లోన్ పొందే అవకాశం లభించనుంది. ఆ వివరాల్లోకి వెళితె..

ఇప్పటి వరకు సాధారణంగా బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే రుణం మంజూరు చేసేవారు. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2.5 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకునేవారికి బంగారం విలువలో 85 శాతం వరకు రుణం ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనివల్ల అత్యవసర అవసరాల కోసం చిన్న మొత్తాల రుణాలు తీసుకునే వారికి పెద్ద ఉపశమనం కలగనుంది. ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన బంగారం ఉంటే, గతంలో గరిష్టంగా రూ.75,000 మాత్రమే రుణంగా లభించేది. కొత్త నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల లోపు రుణాల కేటగిరీలోకి వస్తే అదే బంగారంపై రూ.85,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

అలాగే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే వారికి బంగారం విలువలో 80 శాతం వరకు లోన్ మంజూరు చేయనున్నారు. ఇది మధ్యస్థాయి రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయంగా బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అదే బంగారంపై గతంతో పోలిస్తే ఎక్కువ నిధులు పొందే అవకాశం ఉంటుంది.

ఇక రూ.5 లక్షలకు మించిన గోల్డ్ లోన్ల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 75 శాతం LTV నిష్పత్తినే కొనసాగించనున్నారు. అధిక మొత్తంలో రుణాలు తీసుకునే సందర్భాల్లో బ్యాంకుల రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.

ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు, రైతులు, అత్యవసర నగదు అవసరాలు ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా వైద్య ఖర్చులు, విద్య, వ్యవసాయ అవసరాలు, చిన్న వ్యాపారాల నిర్వహణ కోసం గోల్డ్ లోన్లపై ఆధారపడే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.

అయితే రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణ కాలపరిమితి, చెల్లింపు నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తున్నప్పటికీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రుణం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

జగన్ పేరులో G అంటే Gen G కాదు.. సరికొత్త అర్థం చెప్పిన లోకేష్

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh on Jagan: గతంలో నారా లోకేష్ మాట్లాడితే వైసీపీ వాళ్లు కాచుకుని కూర్చునే వారు. ఆయన మాట్లాడే మాటల్లో తప్పులు వెతికి ట్రోల్ చేసేవారు. దీంతో లోకేష్ తీవ్రంగా ఇబ్బందిపడేవారు. తెలుగుమీద నారా లోకేష్ కు అంతగా పట్టు ఉండేది కాదు. దానిని ఆసరాగా చేసుకుని వైసీపీ నాయకులు ఆయనను రకరకాలుగా విమర్శించేవారు. ఆ విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక లోకేష్ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కాలంమారింది. నారా లోకేష్ మాట్లాడిన ఏ తెలుగునైతే వైసీపీ వాళ్లు విమర్శించారో.. ఇప్పుడు అదే లోకేష్ తెలుగులో ఇరగదీస్తున్నాడు.

తెలుగులో అనర్ఘళంగా మట్లాడుతున్న లోకేష్..వైసీపీ వాళ్లు అంచనా వేయలేని విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రతి సమావేశం చివరిలో నారా లోకేష్ తనదైన పంచ్ లు వేస్తూ మీడియా కావాల్సిన మసాలా అందిస్తున్నారు. దీంతో మీడియాలో, సోషల్ మీడియాలో నారా లోకేష్ పేరు హోరెత్తిపోతోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రెండెళ్లపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం తిరుపతి సమీపంలో సభ నిర్వహించింది. ఈసభలో నారా లోకేష్ అడుగడుగునా పంచ్ లు వేశారు. వైసీపీ నాయకులకు గుక్క తిప్పుకోని పరిస్థితి కల్పించారు.

జగన్ ఇటీవల చంద్రబాబు పరిపాలనను విమర్శిస్తూ కాక్రోచ్ లు వస్తాయని, జన్ జెడ్ తరం ఉద్యమిస్తుందని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి లోకేష్ తిరుపతి వేదికగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తన పేరులో ఉన్న జీ ని చూసి జన్ జీ అనుకుంటున్నారని..కానీ జీ అంటే గొడ్డలి అని లోకేష్ ఆరోపించారు. అందువల్లే వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామని లోకేష్ విమర్శించారు.

జగన్ మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ జబ్బు ఉందని లోకేష్ విమర్శించారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ ప్రాజెక్టులను తానే తెచ్చానని చెబుతుంటారని, చివరికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది మా తాతే అంతారేమోనని లోకేష్ విమర్శించారు. తిరుపతి సభలో లోకేష్ తన చెప్పులు విడిచి ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణ చేసి.. తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ప్రారంభంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను, పథకాలను వివరించారు. ఆ తర్వాత వైసీపీ రెండేళ్ల పాలనపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ ఎంతలా నష్టపోయిందో అంకెలతో సహా వివరించారు. లోకేష్ ప్రసంగిస్తుంటే చంద్రబాబు, పవన్ ఆసక్తిగా విన్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసిన రాఘవ లారెన్స్.. సంచలనం రేపుతున్న వీడియో..

Raghava Lawrence Career
Raghava Lawrence Career

Raghava Lawrence Political Entry: కొరియోగ్రాఫేర్, హీరో , డైరెక్టర్ గా తెలుగు , తమిళ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్న రాఘవ లారెన్స్ కి మొదటి నుండి సేవ చెయ్యాలనే తత్త్వం ఉండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పూర్తితో ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వికలాంగులకు , అనాధలకు దానం చేస్తుంటాడు. ఇలాంటి గొప్ప మనసు ఉన్నవాడికి దేవుడు కచ్చితంగా మంచి చెయ్యాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మంచి చేయడం వల్లనే ఏమో , లారెన్స్ కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ఉన్నాడు. అయితే లారెన్స్ మనస్తత్వం , మంచితనాన్ని చూసి , ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడని అంతా అనుకున్నారు. ఈ కుళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెడితే , స్వచ్ఛమైన మనస్సు ఉన్నటువంటి లారెన్స్ లాంటోళ్ళు కూడా కలుషితం అయిపోతారు అనేది విశ్లేషకుల భావన.

కానీ ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ , రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా ఒక 18 నిమిషాల నిడివి ఉన్న వీడియో తో అధికారిక ప్రకటన చేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నేను ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు , కానీ పరిస్థితులు నన్ను రాజకీయ అరంగేట్రం చేసేలా చేస్తున్నాయి, కొన్ని మంచి పనులు చెయ్యాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి. అయితే ఆయన ఏ పార్టీ లో చేరబోతున్నాడు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

లారెన్స్ మాట తీరు చూస్తుంటే , విజయ్ TVK పార్టీ నుండే పోటీ చేయబోతున్నాడని తెలుస్తోంది. తమిళనాడు మీడియా కూడా లారెన్స్ TVK నుండే తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోతున్నాడని అంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలపనున్నాడు లారెన్స్. ఇకపోతే ప్రస్తుతం ఆయన ‘బెంజ్’, ‘కాంచన 4’ వంటి చిత్రాల్లో హీరో గా నటిస్తున్నాడు. బెంజ్ చిత్రానికి లోకేష్ కనకరాజ్ శిష్యుడు బక్కియా రాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తుండగా , ‘కాంచన 4’ చిత్రం తన స్వీయ దర్శకత్వం లోనే తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమా కమిట్మెంట్స్ ని క్లియర్ చేసుకున్నాడు. మరి భవిష్యత్తులో సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.

'ఓజీ 2' తోనే అకిరా నందన్ గ్రాండ్ ఎంట్రీ ఉండనుందా.. పవన్ ఫ్యాన్స్ కి మరో బంపర్ న్యూస్..

Akira Nandan OG 2 Entry
Akira Nandan OG 2 Entry

Akira Nandan OG 2 Entry: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో , ఎంతో ఆతృతగా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు , ఇకపవు ఆయన సినిమాలు ఒకవేళ చేసిన, ఒకటి , రెండుకి మించి ఉండకపోవచ్చు , వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం రేస్ లో ఉండొచ్చు, కాబట్టి అకిరా నందన్ ఎంట్రీ ఇవ్వాలని చాలా బలంగా కోరుకున్నారు. అయితే అకిరా సినిమాల్లోకి వస్తాడా లేదా ?, అతని అమ్మ రేణు దేశాయ్ అకిరా ని నటన మీద ఆసక్తి లేదు , మ్యూజిక్ మీద ఆసక్తి ఉంది అంటుంది , కానీ రామ్ చరణ్ మాత్రం త్వరలోనే ఎంట్రీ ఉండబోతుంది అంటున్నాడు , ఏది నిజం?, ఏది అబద్దం? అనే డైలమా లో పడ్డారు పవన్ ఫ్యాన్స్. కానీ వాస్తవం ఏమిటంటే అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ ఏడాది లోనే ఆయన ఎంట్రీ కి సంబంధించిన అధికారిక ప్రకటన జరగబోతుంది. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. అయితే అకిరా ఎంట్రీ మామూలు రేంజ్ లో ఉండకూడదు , దేశం మొత్తం అతని ఎంట్రీ గురించి హాట్ టాపిక్ గా మాట్లాడుకోవాలి , అలా మాట్లాడుకోవాలంటే , ఆ రేంజ్ ప్రాజెక్ట్ తో ఆయన ఎంట్రీ ఇవ్వాలి , అందుకు ‘ఓజీ’ ని మించిన ఎంట్రీ మరొకటి ఉండదని డైరెక్టర్ సుజిత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న ‘ఓజీ’ సీక్వెల్ గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక అప్డేట్ సోషల్ మీడియా ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ట్వీట్ కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఈ రేంజ్ లో ఒక ట్వీట్ కి రీచ్ రావడం గతం లో ఏ సినిమా అప్డేట్ కి కూడా నెటిజెన్స్ చూడలేదు.

ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది , అదే విధంగా ప్రీక్వెల్ కూడా ఉంటుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఒకేసారి మొదలు కాబోతుంది. ఈ ఏడాది డిసెంబర్ నెల నుండే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రీక్వెల్ లో అకిరా నందన్ కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ , సీక్వెల్ లో మాత్రం కచ్చితంగా కనిపిస్తాడట. పవన్ కళ్యాణ్ కి శిష్యుడిగా ఆయన ఈ సీక్వెల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఓజీ సిరీస్ అకిరా నందన్ మీదనే ఉంటుందని , ఈ ఓజీ సిరీస్ తో పవన్ కళ్యాణ్ కూడా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయో చూడాలి.

భారత షిప్‌లను టార్గెట్‌ చేసిన అమెరికా.. వారం వ్యవధిలో మూడు నౌకలపై దాడి!

US Targets Indian Ships
US Targets Indian Ships

US Targets Indian Ships: ఆవులు పోట్లాడుకుని లేగలమీద పడినట్లు ఉంది అగ్రరాజ్యం అమెరికా తీరు. ఇరాన్‌–అమెరికా యుద్ధం కారణంగా హర్మూజ్‌ మూతపడింది. అమెరికా హర్మూజ్‌ బ్యాలకేజ్‌ కొనసాగిస్తోంది. శాంతి ఒప్పందం కుదిరితేనే బ్లాకేజ్‌ ఎత్తేస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో అమెరికా భారతీయ నౌకలను టార్గెట్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై గెలవడం చేతగాని ట్రంప్‌.. వారం వ్యవధిలో మూడు భారత నౌకలపై దాడి చేయించడు. ముగ్గురు భారతీయులు మరణించారు. అందులో ఒక తెలుగు వ్యక్తి ఉన్నాడు.

నౌకలపై వరుస దాడులు..
జూన్‌ 8 నుంచి 11 వరకు ఒమన్‌ గల్ఫ్, ఒమన్‌ తీర ప్రాంతంలో మూడు వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉన్నారు. మొదటి దాడిలో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. రెండో దాడిలో ముగ్గురు భారతీయులు చనిపోయారు. తాజాగా జూన్‌ 11న మూడో జరిగింది. ఈ దాడి నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ వరుస ఘటనలు సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల భద్రతపై సందేహాలు రేకెత్తించాయి.

– జూన్‌ 8న ఒమన్‌ గల్ఫ్‌లో వెళ్తున్న ఎంటీ మారివెక్స్‌ ట్యాంకర్‌పై అమెరికా అబ్రహం లింకన్‌ యుద్ధనౌక నుంచి దాడి జరిగింది. ఆ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఒమన్‌ సైనిక హెలికాప్టర్లు వెంటనే రంగంలోకి దిగి వారందరినీ సురక్షితంగా రక్షించాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఒమన్‌ సైన్యం యొక్క త్వరిత చర్య భారతీయ సిబ్బంది ప్రాణాలు కాపాడింది.

– జూన్‌ 10న ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా దాడి చేసింది. నౌక ఇంజిన్‌ రూమ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ వరుస ఘటనల్లో అత్యంత విషాదకరమైనది. భారతీయ సిబ్బంది మరణం కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటన సముద్రంలో వాణిజ్య నౌకల్లో పనిచేసే భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించింది.

– జూన్‌ 11న ఒమన్‌ తీరంలో ఎంటీ జల్‌వీర్‌ నౌకపై అమెరికా దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ హాని కలగలేదు. నౌకలోని అందరు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇది మునుపటి రెండు ఘటనలతో పోలిస్తే కొంత ఊరట కలిగించినప్పటికీ, వరుస దాడులు సముద్ర మార్గాల్లో అస్థిరతను స్పష్టం చేస్తున్నాయి.

భారతీయ సిబ్బంది భద్రతపై ప్రభావం..
ఈ మూడు ఘటనలు ఒకే వారంలో జరగడం యాదృచ్ఛికం కాదని, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు సూచిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సముద్ర నావికులను అందించే దేశం. ఈ దాడుల్లో భారతీయులు ఎక్కువగా ఉండటం వల్ల మానవ నష్టం ఎక్కువగా ఉంది. ఒక ఘటనలో ముగ్గురు మరణించడం కుటుంబాలకు తీరని నష్టం. ఒమన్‌ సైన్యం రక్షణ చర్య చేసినప్పటికీ, వాణిజ్య నౌకల భద్రత కోసం అంతర్జాతీయ స్థాయిలో మరింత బలమైన ఏర్పాట్లు అవసరం.

దౌత్య, వాణిజ్య పరిణామాలు..
ఈ ఘటనలు భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం తన పౌరుల భద్రతను ఎల్లప్పుడూ ప్రాధాన్యతగా చూస్తుంది. అందువల్ల ఈ దాడులపై భారత ప్రభుత్వం తగిన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒమన్‌ వంటి స్నేహపూర్వక దేశాల సహకారం ఈ సందర్భంలో కీలకంగా మారింది. వాణిజ్యపరంగా చూస్తే, ఈ ఘటనలు ఓమన్‌ గల్ఫ్, సమీప సముద్ర మార్గాల్లో భయాన్ని కలిగించి, షిప్పింగ్‌ ఖర్చులు పెంచే అవకాశం ఉంది. భారతీయ కంపెనీలు, నావికులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నందున, వారి భద్రతకు హామీ ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత.

ఓమన్‌ గల్ఫ్‌లో జరిగిన ఈ వరుస దాడులు భారతీయ సిబ్బందికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఒక వైపు ముగ్గురు ప్రాణాలు పోగా, మరోవైపు రక్షణ చర్యలు ప్రాణాలు కాపాడాయి. ఈ ఘటనలు సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ సహకారం, భారతీయ నావికుల రక్షణపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

జగన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వీట్ వార్నింగ్!

Byreddy-Siddharth-Warning to Jagan
Byreddy-Siddharth-Warning

Byreddy Siddharth Warning to Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు యాక్టివయ్యారు. అయితే సీనియర్లు మాత్రం మౌనంగా ఉన్నారు. జూనియర్ లు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇలా దూకుడు తనం ప్రదర్శిస్తున్న వారిలో కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముందుంటారు. 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువనేత ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. సొంత నియోజకవర్గంలో నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం చిక్కలేదు. కానీ 2029 ఎన్నికల్లో మాత్రం తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ కాకుండా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే ఛాన్స్ కల్పించాలని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన వైరల్ గా మారింది. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముంగిట ప్రత్యక్షమయ్యే నాయకులకు అస్సలు ఛాన్స్ ఇవ్వొద్దని ఆయన నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డిని మీడియా ముఖ్యంగా కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బలమైన నేపథ్యం..
బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పదునైన మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. నందికొట్కూరు ప్రాంతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత శేష శయనా రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఎమ్మెల్యే తో పాటు మంత్రిగా వ్యవహరించారు. మరోవైపు ఆయన వారసుడిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపిలో ప్రభావం చూపారు. తర్వాత టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ నుంచి బిజెపిలోకి వచ్చారు. ఇప్పుడు టిడిపి గూటికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి ప్రస్తుతం నంద్యాల ఎంపీగా ఉన్నారు. అయితే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో వైసీపీలోకి వెళ్లిన సిద్ధార్థ రెడ్డి మాత్రం అక్కడే ఉండిపోయారు. తనకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చిన అక్క శబరి ఎంపీ అయ్యారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు.

పోటీ చేసేందుకు ఆసక్తి..
అయితే వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో దిగాలని భావిస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆయన కర్నూలు అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అవసరం అనుకుంటే నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధం అన్నట్లు సమాచారం. కానీ గత మూడు ఎన్నికల్లో వివిధ సమీకరణల పేరు చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. ఈసారి మాత్రం తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు బైరెడ్డి. 2019 ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు శాప్ చైర్మన్గా అవకాశము ఇచ్చారు. ఈసారి మాత్రం ఎంపీగా కానీ.. ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇవ్వాల్సిందేనని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు బైరెడ్డి. మరి జగన్ ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి.

వైసీపీ కాక్రోచ్ లకు బిజెపి అంటే భయం!

YSRCP Kapu Politics
YSRCP Kapu Politics

YCP cockroaches: ప్రస్తుతం దేశంలో కాక్రోచ్ కేంద్రంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారుతుంది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కి సంబంధించి పరీక్షల రద్దు కారణంగా కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అయితే ఏపీలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాక్రోచ్ పార్టీతో పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏడాది కిందట జరిగిన డీఎస్సీ నియామకాల కు సంబంధించి అవకతవకులు చోటు చేసుకున్నాయి అనేది వైసిపి వాదన. నిన్ననే రెండు గంటలపాటు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ పై మరోసారి విషం చిమ్మారు. ఏపీలో కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాక్రోచ్లు రోడ్డుపైకి వస్తాయని తేల్చి చెప్పారు.

ఆ రెండు పార్టీలను మాత్రమే..
అయితే ఏపీలో పుట్టుకొచ్చే కాక్రోచ్లు కేవలం టిడిపి తో పాటు జనసేనను మాత్రమే టార్గెట్ చేస్తాయి. బిజెపిని మాత్రం ఏమీ చేయవు. ఎందుకంటే జగన్ చెప్పే కాక్రోచ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అంటే చాలా భయం అంతకుమించి భక్తి. నీట్ పేపర్ లీక్ మీద కనీసం నోరు తెరవలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నీట్ పరీక్ష రద్దు తో ఏపీలో చాలామంది విద్యార్థులు నష్టపోగా.. వారి గురించి కనీసం ప్రస్తావించే సాహసం కూడా చేయడం లేదు వైసిపి. మరి అటువంటి జగన్ తన పార్టీని కాక్రోచ్తో పోల్చుకోవడం ఏమిటి అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

బిజెపి విరుగుడు మంత్రం..
జగన్ చెప్పే కాక్రోచ్లు ఏపీలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయగలవా? ఎందుకంటే బిజెపి వద్ద జగన్ అక్రమస్తుల కేసులకు సంబంధించి HIT అనే కాక్రోచ్ల నియంత్రణకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఉంది. అందుకే వైసిపి కాక్రోచ్లు కేంద్రంలో ఉన్న బిజెపిపై కన్నెర్ర చేయలేవు. నోరు తెరిచి ఆరోపణలు చేయలేవు. అందుకే కేంద్రం పై దండయాత్ర ప్రారంభించిన కాక్రోచ్లు ఎక్కడ.. వైసిపి కాక్రోచ్లు ఎక్కడా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నిన్ననే మీడియా ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ల రూపంలో సోషల్ మీడియా యాక్టివిస్టులకు గొప్ప కామెడీ వరం చూపించారు.

వైసీపీకి టిడిపి ఫేస్ బుక్ షాక్!

TDP Social Media Strategy
TDP Social Media Strategy

TDP Social Media Strategy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను మెటా నిలిపివేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి వందలాది ఫిర్యాదులు వెళ్లడం, చట్టపరంగా అభ్యంతరాలు వెళ్లడంతో మెటా అధికారికంగా 12 లక్షల ఖాతాలు ఉన్న వైసిపి అధికారిక ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం విశేషం. ఇది ఒక రకంగా షాకింగ్ పరిణామమే. ఇప్పటివరకు హ్యాకింగ్ మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ను.. విపరీతమైన ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ను మెటా బ్లాక్ చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంలో తెలుగుదేశం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తమ చేతికి మట్టి అంటకుండా.. ఒక ప్రత్యేక ప్రణాళికతో ఈ తతంగాన్ని ముగించింది.

అశ్లీలత కంటెంట్ పై..
సాధారణంగా కంటెంట్ లో హింస, అశ్లీలత ఉంటే.. కచ్చితంగా మెటా గుర్తిస్తుంది. ఆపై అభ్యంతరాలతో పాటు చట్టపరమైన హెచ్చరికలు వస్తే నిలిపివేస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్ విషయంలో అలానే ఫిర్యాదులు రావడంతో స్పందించి నిలిపివేసింది. అయితే ఈ విషయంలో టిడిపి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు అర్థం అవుతోంది. తమ చేతికి మట్టి అంటకుండా.. అనుమానిత, అభ్యంతరకర, అశ్లీలత పోస్టుల విషయంపై పోలీస్ శాఖకు ఫిర్యాదులు చేయడం.. అదే పోలీస్ శాఖ నుంచి మెటాకు సమాచారం వెళ్లడం, దర్యాప్తులో భాగంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్ నిలిచిపోయింది. దాదాపు 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నిలిచిపోవడం అంటే చిన్న విషయం కాదు.

సోషల్ మీడియాలో ప్రచారం..
అశ్లీలత కంటెంట్ తో వైయస్సార్ కాంగ్రెస్ ఫేస్బుక్ అకౌంట్ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఫేస్బుక్ అకౌంట్లు కొనసాగించడం ఆనవాయితీ. అయితే రాజకీయంగా ప్రత్యర్థ్ది పార్టీలను టార్గెట్ చేసుకునేందుకు ఫేస్బుక్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో అక్కడ అశ్లీలతను హెచ్చరిస్తూ చాలామంది ఫిర్యాదులు చేశారు. వందలాదిమంది ఒకేసారి ఫిర్యాదు చేయడం, పోలీసుల ప్రమేయంతో మెటా వైయస్సార్ కాంగ్రెస్ ఫేస్బుక్ అకౌంట్ ను పరిశీలించగా అభ్యంతరకర పోస్టులు కనిపించాయి. వెంటనే ఆ ఖాతాను నిలిపివేసింది మెటా. ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ అంశమే. దానిని కక్కలేక మింగలేక.. ఫేస్బుక్ అకౌంట్ ను బతికించే ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

హాస్పిటల్ బెడ్ మీద రియాన్ పరాగ్.. ఏమైంది..

Riyan Parag Shoulder Surgery
Riyan Parag Shoulder Surgery

Riyan Parag Shoulder Surgery: టీమిండియాలో యంగ్ ఆటగాడిగా.. ఐపీఎల్ లో రాజస్థాన్ సారధిగా రియాన్ పరాగ్ అందరికీ సుపరిచితుడే. దూకుడు అయిన ఆట తీరుకు ఇతడు పెట్టింది పేరు. మైదానంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా నేర్పరి. అందువల్లే అతడిని రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ సీజన్ లో సారధిగా నియమించింది. ఇతడి నాయకత్వంలో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. కీలక దశలో గుజరాత్ చేతిలో ఓడిపోయింది.

ఇటీవల ప్రకటించిన టి20 జట్టులో పరాగ్ చోటు దక్కించుకోలేదు. అతడు ఆసుపత్రిలో బెడ్ మీద కనిపించాడు. పైగా అతడి చేతికి సెలైన్ బాటిళ్లు ఎక్కుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీంతో అతడికి ఏం జరిగిందని చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అయితే అతడికి అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స జరిగిందని కొంతమంది అంటున్నారు. చివరికి తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకు బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది అనే విషయాలపై పరాగ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

పరాగ్ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల ఈ ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసే అతడు.. త్వరగానే అవుట్ అయి వచ్చాడు. గత రెండు సంవత్సరాలుగా అతడు ఈ భుజం నొప్పితో బాధపడుతున్నాడు చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ఉపయోగపడటం లేదు.. అందువల్లే వైద్యుల సలహా మేరకు ఈసారి ఏకంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అతడు మునుపటి మాదిరిగా చెలరేగిపోతాడు.

ఈ భుజం నొప్పి నేపథ్యంలో తాను తీవ్రంగా ఇబ్బంది పడినట్టు పరాగ్ వ్యాఖ్యానించాడు. కొన్నిసార్లు భుజం సహకరించేది కాదని.. బ్యాటింగ్ చేయడం సాధ్యమయ్యేది కాదని.. తీవ్రమైన ఒత్తిడి అనుభవించాల్సి వచ్చిందని అతడు వాపోయాడు. చివరికి ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత భుజం నొప్పి మొత్తం మాయమైపోయిందని.. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మైదానంలోకి అడుగు పెడతానని అతడు స్పష్టం చేశాడు. అతడు భుజం నొప్పి నుంచి త్వరగా కోలుకోవాలని.. టీమిండియా కు.. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాలని అభిమానులు కోరుతున్నారు.

ఫిఫా వరల్డ్‌ కప్‌లో గీతికా తాలుక్‌దార్‌.. చరిత్ర సృష్టించిన మన ఫొటో జర్నలిస్ట్‌!

Geetika Talukdar FIFA World Cup
Geetika Talukdar FIFA World Cup

Geetika Talukdar FIFA World Cup: జర్నలిజంన అనేది వృత్తి కాదు.. పైకి ఈజీగా కనిపించినా అది ఒక ప్యాషన్‌. అందరికీ అంది చేతకాదు.. జర్నలిస్టులకు వేరే పనిచేయడం రాదు. అందుకే తక్కువ జీతాలు ఉన్నా.. దానిపై ఉన్న ప్యాషన్‌తో ఇప్పటికీ కొనసాగిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది టాప్‌ క్లాస్‌ జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిజంలో ఫొటో జర్నలిస్టులది మరో కీలక రోల్‌. ఫొటోలతో అనేక భావాలు పలికేలా షూట్‌ చేయడం వారి కళ. నైపుణ్యం ఉన్న ఫొటో జర్నలిస్టులు చాలా తక్కువ. అలాంటి వారిలో భారత్‌కు చెందిన మహిళా ఫొటో జర్నలిస్టు గీతికా తాలుక్‌దార్‌ ఒకరు. తాజాగా ఈమెకు అరుదైన అవకాశం దక్కింది. అతి పెద్ద క్రీడా వేడుక ఎంపికఫిఫా మెన్స్‌ వరల్డ్‌ కప్‌ కవర్‌ చేయడానికి అవకాశం దక్కింది. భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఫోటో జర్నలిస్టుగా గీతికా తాలుక్‌దార్‌ చరిత్ర సృష్టించారు. ఇది భారతదేశంలోని మహిళలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చినవారు, అంతర్జాతీయ వేదికలపై తమ సామర్థ్యాలను నిరూపించుకోవచ్చని చాటుతుంది. ఫోటో జర్నలిజం రంగంలో లింగ సమానత్వం వైపు సాగుతున్న మార్పుకు ఇది నిదర్శనం.

గీతికా విద్యా నేపథ్యం..
అస్సాంకు చెందిన గీతికా పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. దీనితోపాటు మాస్‌ కమ్యూనికేషన్‌ మరియు మీడియా టెక్నాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, అంతర్జాతీయ సంబంధాలపై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కూడా చేశారు. ఈ విభిన్న విద్యా అర్హతలు ఆమెకు కేవలం ఫోటోలు తీయడం మాత్రమే కాకుండా, ఈవెంట్ల వెనుక ఉన్న రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ సందర్భాలను అర్థం చేసుకుని విశ్లేషణాత్మకంగా చిత్రీకరించడానికి సహాయపడతాయి. ఫిఫా వరల్డ్‌ కప్‌ వంటి ఈవెంట్లలో దేశాల మధ్య సంబంధాలు, క్రీడా దౌత్యం వంటి అంశాలను ఫోటోల ద్వారా సమర్థవంతంగా చెప్పడంలో ఈ నేపథ్యం ఆమెను మరింత సమర్థురాలిగా చేస్తుంది.

తాతయ్య నుంచి స్ఫూర్తి..
గీతికా విజయానికి ఆమె తాతయ్య నుంచి వచ్చిన స్ఫూర్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. కుటుంబం నుంచి వచ్చిన మద్దతు, ప్రోత్సాహం యువతీలను తమ ఆసక్తులను అనుసరించి వృత్తిని ఎంచుకోవడానికి బలం ఇస్తుంది. ఈ వ్యక్తిగత కథ ఆమె సాధనకు మానవీయ స్పర్శను ఇస్తుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. కుటుంబ స్ఫూర్తి ఎలా ఒక వ్యక్తిని గొప్ప సాధనల వైపు నడిపించగలదో ఇది చూపిస్తుంది.

అంతర్జాతీయ అనుభవాలు..
గీతికా రష్యా, ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌లు, టోక్యో, పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో తన ఫోటోగ్రాఫీ నైపుణ్యాలను విజయవంతంగా ప్రదర్శించారు. ఈ పెద్ద ఈవెంట్ల కవరేజీ అనుభవం ఆమెకు ఒత్తిడిని నిర్వహించడం, వేగంగా పని చేయడం, వృత్తి నిబద్ధతను అందించింది. అలాంటి అనుభవం ఉన్న వారిని ఎంపిక చేయడం ద్వారా ఫిఫా వంటి సంస్థలు నిజమైన ప్రతిభను గుర్తిస్తున్నాయని స్పష్టం అవుతుంది.

మీడియా రంగంలో మార్పు..
గీతికా తాలుక్‌దార్‌ ఎంపిక ఫోటో జర్నలిజం, స్పోర్ట్స్‌ మీడియా రంగంలో లింగ సమానత్వం వైపు సాగుతున్న ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. గతంలో పురుషులు ఆధిపత్యం చెలాయించిన ఈ రంగంలో మహిళలు తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఫోటోలు కథలను చెప్పే శక్తిని కలిగి ఉంటాయి. విభిన్న దృక్పథాలు ఈ కథలను మరింత సమగ్రంగా, సమతుల్యంగా చేస్తాయి. గీతికా విజయాలు యువ మహిళలను ఈ రంగంలోకి రావడానికి ప్రోత్సహిస్తాయి. అలాగే సంస్థలు మరింత సమ్మిళిత విధానాలను అనుసరించడానికి ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా, ఈశాన్య భారతదేశం నుంచి వచ్చిన ప్రతిభను ప్రపంచ వేదికపై చూపించడం ద్వారా ప్రాంతీయ సమానత్వానికి కూడా దోహదపడుతుంది.

గీతికా తాలుక్‌దార్‌ చరిత్ర సృష్టి కేవలం ఒక విజయం కాదు. ఇది శ్రమ, విద్య, కుటుంబ స్ఫూర్తి, అంకితభావం ఫలితం. ఆమె కథ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి∙వచ్చిన యువతీలకు తమ కలలను చేరుకోవచ్చని నమ్మకం కలిగిస్తుంది. ఫిఫా వరల్డ్‌ కప్‌ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ఆమె ఫొోటోలు ప్రపంచానికి క్రీడా స్ఫూర్తిని మరింత దగ్గర చేస్తాయని ఆశించవచ్చు.

ఈరోజు నుంచే పాఠశాలలు.. అప్పుడే సెలవులను ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం!

Andhra Pradesh Schools Reopening 2026
Andhra Pradesh Schools Reopening 2026

Andhra Pradesh Schools Reopening 2026: ఏపీవ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 రోజుల వేసవి సెలవుల అనంతరం విద్యా సంస్థలు ప్రారంభం అయ్యాయి ఈరోజు. వేసవి ఉష్ణోగ్రతలతో సెలవులు పొడిగిస్తారు అన్న ప్రచారం సాగింది. కానీ అటువంటి వాటిని నమ్మవద్దు అని కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈరోజు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో.. అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు ఉన్నాయి. సెలవులతో పాటు ఆదివారాలను కలుపుకొని మొత్తం 87 సెలవులు ఉండనున్నాయి.

* పండుగ సెలవులు ఎన్నంటే?
విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం దసరాతో పాటు సంక్రాంతి సెలవులను సైతం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. పది రోజులపాటు దసరా సెలవులు కొనసాగనున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు సెలవులు ప్రకటించారు.. అయితే ఇవి కేవలం క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. మరోవైపు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. జనవరి 11 నుంచి 17 వరకు కేవలం వారం రోజులపాటు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. మరోవైపు ఆదివారాలతో పాటు ప్రత్యేక పర్వదినాలు, రెండో శనివారాలు సైతం సెలవులను ప్రకటించారు. ఇలా అన్ని సెలవులు కలుపుకొని 87 ఉండనున్నాయి.

* నో బ్యాగ్ డే పై ఆదేశాలు..
మరోవైపు ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులపై చదువుల ఒత్తిడి తగ్గించేందుకు, పుస్తకాల బరువు లేకుండా, సృజనాత్మక, క్రీడా మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నో బ్యాగ్ డేను అమలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఈ క్యాలెండర్ లో పేర్కొంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ను పరిశీలించి తమ విద్యాప్రణాళికలను రూపొందించుకోవచ్చు.

పునర్విభజనతో 'రాయలసీమ' పైచేయి!

Rayalaseema Constituency Delimitation
Rayalaseema Constituency Delimitation

Rayalaseema Constituency Delimitation: మరోసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో పునర్విభజన బిల్లును వెనక్కి తీసుకుంది కేంద్రం. అయితే ఎట్టి పరిస్థితుల్లో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గ రాజకీయ పరిస్థితులు కలిసి వస్తున్నాయి. బెంగాల్ తో పాటు తమిళనాడులో లోక్సభ సభ్యుల బలం ఎన్డీఏకు అదనపు బలంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నిన్ననే తాజా వర్కింగ్ పేపర్ నియోజకవర్గాల పునర్విభజనపై విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు పెరగడంతో పాటు ఏపీలో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్న 25 పార్లమెంట్ స్థానాలకు గాను మరో పదమూడు సీట్లు పెరుగుతాయి. అయితే సింహభాగం పెరుగుదల అనేది రాయలసీమలో కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

* సరికొత్త ప్రతిపాదనలు..
గత కొంతకాలంగా తీవ్ర అధ్యయనం చేసిన ఈ ఆర్థిక మండలి తన నివేదికను బయటపెట్టింది. కొత్త ప్రతిపాదనలను పెట్టింది. వీటిని చూస్తే పునర్విభజనతో ఎక్కువగా లాభపడేది రాయలసీమ. అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్ సభ స్థానాలుగా ఉన్న కడప, కర్నూలు, అనంతపురం, రాజంపేట నియోజకవర్గాల పరిధి చాలా పెద్దదిగా ఉంది. ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని మూడు గా విభజిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అభిప్రాయపడింది. ఈ నాలుగు సీట్ల పరిధిలో మరో 8 పెరగనున్నాయన్నమాట. ఇదే జరిగితే భవిష్యత్తులో దేశ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో అధికార పీఠాన్ని శాసించడంలో రాయలసీమ విపరీతమైన ప్రభావం చూపి అవకాశం ఉంది.

* ఏకంగా 8 పెరుగుదల..
రాయలసీమలో పునర్విభజనతో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం కేవలం రెండు లోక్ సభ సీట్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. విశాఖ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలని ఈ మండలి ప్రతిపాదించింది. అంటే విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న పార్లమెంట్ స్థానాలను యధాతధంగా ఉంచి.. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఓ రెండు స్థానాలను విభజించి పెంచుతారు అనేది ఈ ప్రతిపాదనల సారాంశం. అయితే ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా, రాజకీయ ప్రాధాన్యత కలిగిన కోస్తాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పుడున్న సీట్లను యధాతధంగా ఉంచాలని ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. కోస్తా జిల్లాల్లో జనాభా నియంత్రణ ప్రమాణాలు స్థిరంగా ఉండటం, నియోజకవర్గాల భౌగోళిక పరిమితులు ఓటర్ల సంఖ్యకు అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 2027 జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన చేపడితే రాజకీయంగా రాయలసీమ మరోసారి పై చేయి సాధించే అవకాశం ఉంది. దాదాపు 13 పార్లమెంటు స్థానాలు పెరగడంతో అన్ని పార్టీల్లో ఆశావహులకు అవకాశాలు దక్కుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

అమరావతికి మరో అంతర్జాతీయ సంస్థ!

Bedford School Amaravati
Bedford School Amaravati

Bedford School Amaravati: అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు సర్కార్ ప్రణాళిక. కేవలం ఒక్క రాజధాని మాత్రమే కాదు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నది ఒక టార్గెట్. అందులో భాగంగా అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాల అన్నది కూడా ఒక ఆలోచన. అందులో భాగంగా ఒక అంతర్జాతీయ సంస్థ తన క్యాంపస్ ను అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లండన్ లో 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బెడ్ ఫోర్డ్ తమ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాజధాని ప్రాంతానికి వస్తున్న మొట్టమొదటి విదేశీ విద్యాసంస్థ ఇదే కావడం విశేషం. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం కూడా దీనికి ఆమోదం తెలిపింది. అందుకే ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

* ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు..
బెడ్ ఫోర్డ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. లండన్ లో అత్యంత పురాతనమైన పాఠశాల ఇది. విపరీతమైన క్రెడిబిలిటీ సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక పాఠశాలను బ్రిటన్ లోని బెడ్ ఫోర్టులో 1552వ సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్-6 నెలకొల్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, క్రీడలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే బ్రిటన్ లో మాతృ సంస్థ ఉండగా.. మనదేశంలోని మొహాలీలో మాత్రమే అంతర్జాతీయ క్యాంపస్ ఉంది. అమరావతిలో మూడో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు రావడం విశేషం.

* 8 ఎకరాల కేటాయింపు..
రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణం కోసం సిఆర్డిఏ 8 ఎకరాల భూమిని కేటాయించింది. తుళ్లూరు సమీపంలో ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున విక్రయించింది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న బెడ్ ఫోర్డ్ సంస్థ గ్లోబల్ స్కూల్ ను అమరావతిలో నిర్మించింది.. అయితే ఇప్పుడు కేటాయించిన స్థలంలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ లో జరిగిన అంతర్జాత యాజమాన్య మార్పు నేపథ్యంలో.. ఇండస్ స్థానంలో గ్లోబల్ బ్రాండ్ అయిన బెడ్ ఫోర్టును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్తగా ఈ మోడల్ స్కూల్ అందుబాటులోకి రానుంది. అమరావతిని అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. రాజధాని పరిధిలో ఇప్పటివరకు 22 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. వీటికి గాను 844.897 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నాలుగు ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండగా.. 18 ప్రైవేట్, అంతర్జాతీయ విద్యాసంస్థలు ఉండడం విశేషం.

దక్షిణాది రాష్ట్రాలకు మోడీ బంపర్ బొనాంజా.. పెరిగే పార్లమెంటు స్థానాలు ఇవే..

Modi India GDP Growth
Modi India GDP Growth

Narendra Modi South India Parliament Seats: దక్షిణది రాష్ట్రాలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. కొంతకాలంగా కొంతమంది రాజకీయ నాయకులు దక్షిణాది మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కెసిఆర్ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు దక్షిణాది రాష్ట్రాలను నరేంద్ర మోడీ పట్టించుకోవడంలేదని.. పార్లమెంటు స్థానాల పెంపు విషయంలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై బీజేపీ సరిగా కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు బిజెపి తీసుకొచ్చిన ప్లాన్ ఆ తరహా నాయకుల నోర్లు మూసే విధంగా ఉంది.

గతంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం తేలిపోయింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపకపోవడంతో ఆ అంశంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు అంచనాలకు మించిన బలాన్ని సొంతం చేసుకున్న తర్వాత కేంద్రం మరొకసారి డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తీసుకొస్తుంది. మన దేశంలో 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని పెంచాలని కేంద్రం భావిస్తున్నది. దీనివల్ల ప్రజలకు మరింత సమర్థవంతమైన పరిపాలన లభిస్తుందని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల పెంపు విషయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రకటించింది. కీలకమైన ప్రతిపాదనలను అందించింది.

జనాభా పెరిగినప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుంది.నియోజకవర్గాల పెంపునకు పెరిగిన జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రస్తుత జనాభా నివేదికలో పట్టణీకరణ.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచించింది. దీనివల్ల దేశంలో అన్ని ప్రాంతాలకు పరిపాలన మరింత చేరువవుతుందని.. ఆ ప్రజలకు ప్రతినిధులుగా ఎంపీలు ఉంటారని ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రకటించింది..

ఇక దేశంలో 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలను కేంద్రం అమలు చేస్తే వాటి సంఖ్య 824కు చేరుకునే అవకాశం ఉంది. పెద్ద రాష్ట్రాలలో సీట్ల పెంపు ఏకంగా 50% వరకు ఉంటుంది. చిన్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న స్థానాలను రెట్టింపు చేస్తారని సమాచారం. దీనివల్ల ఎంపీలు ప్రజలకు మరింత చేరువగా ఉంటారని తెలుస్తోంది.. ప్రధాని ఆర్థిక మండలి నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 170 పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. ఇందులో 59 నియోజకవర్గాలు రెండు భాగాలవుతాయి. 111 నియోజకవర్గాలు మూడు భాగాలవు తాయి. దీనివల్ల ప్రజలకు ఎంపీలు మరింత దగ్గరవుతారు. సమస్యలను నేరుగా పరిష్కరిస్తారు.

నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాలకు పునర్విభజనలో అదిరిపోయే కానుక ఇచ్చే అవకాశం ఉంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 20 స్థానాలు ఉండగా.. అవి 30 కి పెరుగుతాయి. తమిళనాడులో 39 నుంచి 59.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇక మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు 120కి పెరిగే అవకాశం ఉంది. అక్కడ దాదాపు 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.

కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వల్ల ప్రజల ప్రాతినిధ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ఓటింగ్ కూడా 2.3 శాతం వరకు పెరుగుతుంది. మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా మహిళల కోసం పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2027 జనాభా లెక్కల తర్వాతనే చేపట్టాలని కమిటీ ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే దేశంలో రాజకీయంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

వర్షం పడితే.. మట్టి నుంచి ఎందుకు ఆ వాసన.. కారణం ఏమై ఉంటుంది..

Why Soil Smells After Rain
Why Soil Smells After Rain

Why Soil Smells After Rain: ఆకాశం లో దట్టంగా మబ్బులు ఏర్పడిన తర్వాత.. చల్ల గాలులు వీస్తాయి. ఆ గాలుల తీవ్రతకు మేఘాలు కరిగిపోతాయి. మేఘాలలో ఏర్పడిన నీటి బిందువుల ఆధారంగా వర్షాలు కురుస్తుంటాయి. వర్షాలు కురిసినప్పుడు నేల పులకించిపోతుంది. సమస్త ప్రకృతి ఆనంద పరవశంలో తేలియాడుతూ ఉంటుంది.

వర్షం కురిసినప్పుడు మట్టి వాసన అద్భుతంగా ఉంటుంది. ఆ వాసన అలానే పీల్చాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఎటువంటి కృత్రిమ తత్వం ఉండదు. ఆరోగ్యానికి ఎటువంటి హాని చెయ్యదు. పైగా ఆ వాసన పీల్చుతూ నాసికాలు కూడా ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. ఆ అనుభూతిని ఇలా రాయడం కాదు గాని.. అనుభవిస్తేనే అర్థమవుతుంది.

వర్షం కురిసే ముందు లేదా వర్షం పడుతున్న సమయంలో మట్టి సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దీని వెనక ఒక సైన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని సైన్స్ పరిభాషలో పెట్ట్రీ చోర్ అని పిలుస్తుంటారు. నేలలో స్ట్రెప్టో మైసిస్ అనే బాక్టీరియా ఉంటుంది. మట్టి ఎండిపోయినప్పుడు కొన్ని రకాల బీజాలను అది విడుదల చేస్తూ ఉంటుంది. వాన చినుకులు పడిన తర్వాత అందులో ఉన్న జియో స్మిన్ అనే రసాయనం గాలిలోకి విడుదలవుతుంది. దీనికి కొన్ని రకాల మొక్కల నూనెలు కలుస్తాయి. మెరుపుల వల్ల ఓజోన్ ఏర్పడుతుంది. ఆ ఓజోన్ గాలిలో కలిసిపోవడం వల్ల ఈ వాసన వస్తుంది.. అందువల్లే తొలకరి చినుకులు పడుతున్నప్పుడు చాలామంది మట్టి వాసనను ఆస్వాదించడానికి తాపత్రయపడుతుంటారు.

నేటి కాలంలో మట్టి వాసనను కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే పీల్చడానికి అవకాశం ఉంది. నగరాలు, పట్టణ ప్రాంతాలలో దాదాపు కాంక్రీట్ జంగిల్స్ ఏర్పడ్డాయి. మట్టి అనేది కనిపించడం లేదు. దీనివల్ల మట్టి వాసన పీల్చడానికి నగరవాసులకు అవకాశం లేకుండా పోతుంది. ఇది ప్రకృతి అందించే గొప్ప వరం. దీనివల్ల నాసిక గ్రంధులు తేలిక అవుతాయని.. మనసు ఉత్తేజితమవుతుందని. సానుకూల దృక్పథం అల వడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా వ్యవసాయం కొనసాగుతోంది. మట్టి రోడ్లు ఉన్నాయి. అందువల్లే వర్షం పడగానే మట్టి వాసన వస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

తొలి మ్యాచ్లోనే మూడు రెడ్ కార్డులు.. ఆ రిఫరీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేయండి..

FIFA 2026: ఫిఫా వరల్డ్ కప్ ఘనంగా మొదలైంది. మెక్సికో వేదికగా అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. తొలి మ్యాచ్లో ఆతిధ్య మెక్సికో జట్టు ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా మీద 2-0 తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ గెలుపు ద్వారా మెక్సికోలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు మీద చాలామంది అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మ్యాచ్ రిఫర్.

మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రిఫరీగా విల్టన్ వ్యవహరించాడు. అయితే దక్షిణాఫ్రికా ప్లేయర్లకు ఇతడు మూడు రెడ్ కార్డులు ఇచ్చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా ఓవటానికి ప్రధాన కారణంగా వ్యవహరించిన విల్టన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అతడి మీద మీమ్స్ రూపొందించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రారంభ మ్యాచ్ లోనే ఈ స్థాయిలో రెడ్ కార్డులు జారీ చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన ఇద్దరు ప్లేయర్లకు నేరుగా రెడ్ కార్డ్ జారీ చేయడంతో.. కేవలం 9 మంది ప్లేయర్లతోనే దక్షిణాఫ్రికా ఆడాల్సి వచ్చింది.

2022లో ఫిఫా వరల్డ్ కప్ జరిగింది. మొత్తం ఆటోనిలో కేవలం నాలుగు రెడ్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. అయితే ఈ సీజన్లో తొలి మ్యాచ్ లోనే మూడు రెడ్ కార్డులు ఇవ్వడం విశేషం. ఒక మ్యాచ్లో ఎన్ని రెడ్ కార్డులు ఇవ్వడం ఒక వింత అయితే.. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఈసారి జరిగే ఫిఫా కప్ లో రెడ్ కార్డుల జారీ మరింత పెరుగుతుందని అభిమానులు చెబుతున్నారు.

సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిబంధనలు పాటించని ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డ్ ఇస్తూ ఉంటాడు. ఆటగాడికి రెండుసార్లు ఎల్లో కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పటికి అతని ప్రవర్తన మారకపోతే రెడ్ కార్డు ఇస్తుంటారు. ఆ తర్వాత ఆ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. మరొకరితో అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో రెడ్ కార్డు ఎదుర్కొనే ప్లేయర్ పై తర్వాతి మ్యాచ్లో నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా కూడా రిఫరీ చేతుల్లోనే ఉంటుంది. మెక్సికో.. దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం ముగ్గురు ప్లేయర్లకు ఒక్కసారి కూడా ఎల్లో కార్డు జారీ చేయలేదు. నేరుగా రెడ్ కార్డు చూపించడం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది. దీనిపై ఫిఫా నిర్వాహకులు ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడాలి మరి.. నిర్వాహకులు ఏం చెబుతారో..

2027 వరల్డ్ కప్ లో కష్టమే.. ఈ ముగ్గురు ఎంతగా ఆడినా.. వాళ్లు కర్చీఫ్ చేశారు

2027 ODI World Cup India Squad
2027 ODI World Cup India Squad

2027 ODI World Cup India Squad: ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అదే ఆఫ్గనిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో ముగ్గురు యంగ్ ప్లేయర్లకు అవకాశం లభించింది. అయితే వారు గనుక సత్తా చూపిస్తే 2027 మెన్స్ వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం. అయితే అది అంత ఈజీ కాదు.

2027 ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నాహాలు చేస్తోంది. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని ప్లేయర్లు ఉపయోగించుకోవాలి. అయితే ఈ సిరీస్లో గొప్పగా ఆడినంత మాత్రాన ఆ ప్లేయర్లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం వస్తుందని చెప్పడానికి లేదు.. ఎందుకంటే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా గాయాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు దూరమయ్యారు. కోహ్లీ, పాండ్యా కు గాయాల వల్ల వారి స్థానంలో జైస్వాల్ ను తీసుకున్నారు. నిలకడైన ఆటతీరితో ఆకట్టుకుంటున్న ఇతడు.. 2027 ప్రపంచ కప్ లో జట్టులో చోటు సంపాదించుకోవడం అనుమానమే. ఒకవేళ ఇతడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అదరగొట్టినప్పటికీ.. విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకుని వస్తే మాత్రం ఇతడికి చోటు ఉండదు.

2027 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని రవీంద్ర జడేజా కు రెస్ట్ ఇచ్చారు. అతడి స్థానంలో ఎడమ చేతివాటం ఆర్థోడాక్స్ పిన్నర్ హర్ష్ దూబే చోటు దక్కించుకున్నాడు.. ఒకవేళ ఇతడు ఆఫ్గనిస్తాన్ సిరీస్ లో అదరగొట్టినప్పటికీ.. 2027 వరల్డ్ కప్ లో కచ్చితంగా జడేజా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దూబే తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.

బుమ్రా కు వర్క్ లోడ్ వల్ల మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. అతని స్థానంలో గుర్నూర్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ తరఫున ఇతడు తొమ్మిది లిస్టు ఏ మ్యాచ్ లు ఆడాడు. అతడు ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా ఆడటం ఖాయం. అతడు జట్టులోకి వస్తే గుర్నూర్ వెళ్ళిపోవాల్సిందే.

మరోవైపు విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా.. బుమ్రా తరచు గాయాల బారిన పడటం వల్ల మేనేజ్మెంట్ వారికి అవకాశాలు ఇస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే యంగ్ ప్లేయర్లతో వరల్డ్ కప్ పాటించాలని గంభీర్ భావిస్తున్నాడు. అందువల్లే సీనియర్ ప్లేయర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఒకవేళ గంభీర్ మాట గనుక చెల్లుబాటు అయితే అప్పుడు విరాట్ కోహ్లీ.. బుమ్రా. . హార్దిక్ పాండ్యా జట్టులో స్థానం కోల్పోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో రోహిత్ కూడా ఉంటాడు. అప్పుడు ఆఫ్గనిస్తాన్ సిరీస్లో సత్తా చూపించిన ప్లేయర్లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం లభిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..