Home Blog Page 139

కేన్ విలియంసన్ మామ.. ఇలా చేస్తావని అనుకోలేదు.. మనసంతా భారంగా ఉంది..

Kane Williamson Retirement
Kane Williamson Retirement

Kane Williamson Retirement: మనం క్రికెట్ ను ప్రేమిస్తాం. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తాం. క్రికెట్ ఆడే ప్లేయర్లను ఆరాధిస్తాం. వాళ్ళు ఏ దేశమైనా సరే.. మనవాళ్లు అనుకొని పొంగిపోతాం. మన గుండెల్లో స్థానం కల్పిస్తాం. అవసరమైతే గుండెల్లో గుడి కూడా కట్టేస్తుంటాం. ఇప్పుడు వరకు భారతీయులు ఎంతోమంది క్రికెటర్లను అభిమానించారు. ఆరాధించారు. ప్రేమించారు. ఈ జాబితాలో కేన్ విలియమ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అతడు న్యూజిలాండ్ ఆటగాడిగా.. ఐపీఎల్ లో సన్రైజర్స్ ప్లేయర్ గా మనకు సుపరిచితుడు.

జెంటిల్మెన్ క్రికెట్లో జెంటిల్మెన్ మాదిరిగా అతడు ఆడుతుంటాడు. లక్షల మంది అభిమానిస్తుంటారు. చివరికి అతడిని మనం కేన్ మామ అని పిలుచుకుంటున్నామంటే అతడు మన మీద ఏ స్థాయిలో ముద్ర వేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. మైదానంలో చలాకీగా ఉంటాడు. మ్యాచ్ ఓడిపోయినా.. గెలిచినా సరే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఓడిపోయినప్పుడు బాధపడడు. గెలిచినప్పుడు విర్రవీగడు. అతడి మెరుగైన వ్యక్తిత్వం ఎంతమంది అభిమానులను సాధించిపెట్టింది..

విలియమ్స్ పేరుతో అభిమానులు సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. పైగా అతడు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. ఇండియాలోనే విలియమ్సన్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీన్నిబట్టి అతడిని మనవాళ్లు ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ క్రికెట్ మీద తనదైన ముద్ర వేసిన కేన్ విలియంసన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అతడు 110 టెస్ట్ లు ఆడాడు. ఇందులో 33 శతకాలు ఉన్నాయి. 9515 రన్స్ చేశాడు. ఇందులో 175 వన్డేలలో 15 సెంచరీలు చేశాడు. 7256 రన్స్ చేశాడు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు.

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు 2015 నుంచి 2022 వరకు ప్రాతినిధ్యం వహించాడు. కొన్నిసార్లు ఆ జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరించాడు. హైదరాబాద్ జట్టుతో ఉన్న ప్రత్యేకమైన అభిమానం వల్ల అతడిని చాలామంది కేన్ మామ అని పిలుస్తుంటారు. అతడు కూడా ఆ పిలుపును ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో హైదరాబాద్ అభిమానుల మీద తన ప్రేమను వ్యక్తం చేశాడు.”మీ బిర్యాని తిన్నాను. మీ హలీం రుచికి చూశాను. మీ ప్రేమకు ఫిదా అయ్యాను” అంటూ అప్పట్లో కేన్ మాట్లాడిన మాటలు హైదరాబాద్ అభిమానులకు సరికొత్త ఉత్తేజాన్నిచ్చాయి.

మ్యూజిక్ డైరెక్టర్ ను పాతిపెట్టిన అనిల్ రావిపూడి.. ఇదేం ప్రమోషన్ సామి.. వీడియో వైరల్..

Anil Ravipudi G V Prakash Viral Video
Anil Ravipudi G V Prakash Viral Video

Anil Ravipudi G V Prakash Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు రాజమౌళి వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి 9 విజయాలను సాధించి తన కంటు ఒక క్రెడిబులిటి ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని కూడా తను ఇచ్చాడు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అఫీషియల్ గా ముహూర్తం జరుపుకోబోతుంది. ఇక దానికి ముందే అనిల్ రావిపూడి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు.

మొదటిసారి జీవి ప్రకాష్ తన సినిమాకి సంగీత దర్శకుడుగా తీసుకున్న అనిల్ రావిపూడి అతనితో మంచి ట్యూన్స్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దాని కోసం ఆయన విభిన్నమైన పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. జంధ్యాల సినిమాలోని సుత్తి వీరభద్ర రావు చెప్పే ఫేమస్ డైలాగులైన హైదరాబాద్, సికింద్రాబాద్ అనేదాన్ని స్ఫూఫ్ గా వాడుకొని జీవి ప్రకాష్ కుమార్ ని ఇసుక లో పాతిపెట్టి మరి అతని చేత మ్యూజిక్ ని చేయించుకుంటున్నాడు.

అతనితోపాటు ఆ సాంగ్ కి లిరిక్ రైటర్ గా వ్యవహరిస్తున్న అనంత శ్రీరామ్ ను సైతం ఇసుకలో పాతి పెట్టడం విశేషం… మొత్తానికైతే తను మ్యూజిక్ సిట్టింగ్ కోసం సంగీత దర్శకుడిని పట్టుబట్టి మరి వారి చేత మంచి మ్యూజిక్ ను ఇప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.

దానికి దీన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక అనిల్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అంటూ ఆయన పెట్టిన వీడియోలు లో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి… ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆయన వరుసగా 10 విజయాలను అందుకున్న దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు…లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది…

నేటి నుంచి ఉమెన్స్ టి20 వరల్డ్ కప్.. ఎందులో చూడొచ్చు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Women T20 World Cup 2026
Women T20 World Cup 2026

Women T20 World Cup 2026: నేటి నుంచి మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ టోర్నీ కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ శ్రీలంకతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల నుంచి పది గంటల 40 నిమిషాల వరకు ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 11 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపు 12 జట్లు పోటీ పడుతున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ వన్ లో భారత్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ 2 లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఐర్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగుతుంది. ప్రతి గ్రూపులో జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఆయా గ్రూపులలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సెమీస్ వెళ్ళిపోతాయి. లీగ్ స్టేజ్లో 30 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఫస్ట్ సెమి ఫైనల్ మ్యాచ్ జూన్ 30న.. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జూలై 2న జరుగుతాయి. జూలై 5న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లాండ్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి, న్యూజిలాండ్ ఒకసారి పొట్టి ప్రపంచ కప్ అందుకున్నాయి. మా దేశం ఇప్పటివరకు ఒకసారి కూడా t20 వరల్డ్ కప్ అందుకోలేదు. మరోవైపు ఈ టూర్ ని బ్రాడ్ కాస్ట్ రైట్స్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ లు మొత్తం టీవీలలో స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో వీక్షించవచ్చు.. ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 14న పాకిస్తాన్ తో ఆడుతుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఇటీవల భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. సెమీస్ లో ఆసీస్ ను మట్టి కరిపించింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. తద్వారా సరికొత్త చరిత్ర నెలకొల్పింది. ఈసారి కూడా భారత మహిళలు అదే ఘనతను రిపీట్ చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

వైభవ్ సూర్య వంశీ ఎంట్రీకి . అనేక చిక్కుముళ్లు.. జాతీయ జట్టులో అడుగు పెట్టడం కష్టమేనా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi India Team Chances: చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టులో అడుగుపెడతాడని మొన్ననే కదా అనుకున్నాం. ఈ బుడ్డోడు ఊచ కోత మొదలుపెడితే పరుగుల సునామీ ఖాయమని అంచనా వేశాం. కానీ మన అంచనాలు.. తప్పే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియాలో అడుగుపెట్టేది.. సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 26 నుంచి ఐర్లాండ్ జట్టుతో జరిగే రెండు టి20 మ్యాచ్ ల సిరీస్ లో వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఐర్లాండ్ దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ఉత్తర ఐర్లాండ్ ప్రాంతంలో అక్కడి బెల్ ఫాస్ట్ ఏరియాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ఇండియా, ఐర్లాండ్ సిరీస్ వాయిదా పడి అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే వైభవ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కాస్త ఆలస్యం అవుతుంది.

అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. భారీగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.. అక్కడ నిరసనలు తగ్గుముఖం పట్టకపోవడంతో లిస్ బర్న్ ప్రాంతంలో జరగాల్సిన ఇంటర్ ప్రెవెన్షియల్ టి20 టోర్నీని మొత్తానికి రద్దు చేశారు. ఈ ఆదివారం జరిగే సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్ ల పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ ల పై వచ్చే నలభై ఐదు గంటల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఐర్లాండ్ వెల్లడించింది.

ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్లేయర్లు, కోచ్ లు, అభిమానుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఐర్లాండ్ క్రికెట్ స్పష్టం చేసింది. ఒకవేళ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తే ఇండియాతో సిరీస్ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు దిగజారిపోతే అప్పుడు సిరీస్ షెడ్యూల్ మారుతుంది. ఐర్లాండ్ తో భారత్ ఈనెల 26న తొలి టి20 మ్యాచ్ ఆడుతుంది. 28న రెండవ మ్యాచ్ ఆడుతుంది. బెల్ ఫాస్ట్ లోనే ఈ రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే.. అప్పుడు సూర్య వంశీ జాతీయ జట్టులో ఎంట్రీ ఇవ్వడానికి ఇంగ్లాండ్ సిరీస్ దాకా ఎదురుచూడాల్సి ఉంటుంది. సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. ఇండియా ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టుపై 14 పరుగులు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 44 పరుగులు చేశాడు.

నాని 'బ్లడీ రోమియో' మూవీ పరిస్థితి ఏంటి..? సుజిత్ 'ఓజీ 2' పైనే ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నాడా!

Bloody Romeo
Bloody Romeo

Nani Bloody Romeo Movie Update: ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ సుజిత్ నేచురల్ స్టార్ నాని తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని కూడా విడుదల చేశారు. దానికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి లెక్క ప్రకారం ఈపాటికి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిపోవాలి. కానీ నాని ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల , ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గత కొంత కాలం నుండి సుజిత్ ప్రస్తుతానికి ‘బ్లడీ రోమియో’ మూవీ ని పక్కన పెట్టాడని, ‘ఓజీ 2’ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని మొదలుపెట్టాడని, ముందుగా ఈ సినిమానే మొదలు అవ్వబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఆ ప్రచారానికి తగ్గట్టుగానే , నిన్న పవన్ కళ్యాణ్ టీం ‘ఓజీ 2’ రెడీ అవుతోందని, సుజిత్ విదేశాల నుండి తిరిగి రాగానే షూటింగ్ షెడ్యూల్స్ కి సంబంధించిన చర్చ ఉంటుందని చెప్తూ ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి , పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది. కొంతమంది అయితే సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే , ‘ఓజీ 2’ మూవీ షూటింగ్ నే మొదలు పెట్టబోతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. మరి బ్లడీ రోమియో పరిస్థితి ఏంటి?, ‘ది ప్యారడైజ్’ మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది. కాబట్టి ఇప్పట్లో నాని అందుబాటులో లేడు కాబట్టి , ముందుగా ఓజీ సిరీస్ ని పూర్తి చేస్తే బాగుండును అనే ఆలోచన లో కూడా సుజిత్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి , పవన్ కళ్యాణ్ లుక్స్ ఇప్పుడు ఇంత యంగ్ గా తయారు అవ్వడానికి కారణం ‘ఓజీ 2’ లుక్స్ అయ్యిందొచ్చని అంటున్నారు.

అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టీ చూస్తే , సుజిత్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడట. అక్కడ ‘బ్లడీ రోమియో’ మూవీ కోసం ఆయన కొన్ని లొకేషన్స్ ని రెక్కీ చేసాడట. అంతే కాకుండా ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్న మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ డేట్స్ కూడా ఖాలీగా లేవట. ఒక్కసారి ఆయన డేట్స్ అందుబాటులోకి రాగానే , ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని , దాదాపుగా 90 రోజులపాటు షూటింగ్ సాగే ‘బ్లడీ రోమియో’ పూర్తి అయ్యాకనే సుజిత్ ‘ఓజీ 2’ వైపు అడుగులు వేస్తాడని తెలుస్తోంది. వీటిల్లో ఏది నిజం అనేది తెలియాలంటే సుజిత్ ఇండియా వచ్చే వరకు ఆగాల్సిందే.

కాలిపోయిన 4 వేల ఈవీఎంలు.. ప్రమాదామా.. కుట్రా?

4000 Burnt EVMs
4000 Burnt EVMs

4000 Burnt EVMs: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రోజులైంది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ప్రజలు చరమగీతంపాడారు. బీజేపీకి అధికారం కట్టబెట్టారు. ఇలాంటి పరిస్థితిలో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు సొంత దేశానికి వెళ్లిపోతున్నారు. ఇక టీఎంసీ అరాచకాలతో బాధపడ్డ ప్రజలు టీఎంసీ నేతలపై ప్రత్యక్ష దాడులు చేస్తున్నారు. మరోవైపు టీఎంసీ చీలిపోతోంది. అందరి దృష్టి వీటిపై ఉండగా, తాజాగా కోల్‌కతాలోని అలీపుర్‌ ప్రాంతంలో 4 వేల ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్లు(ఈవీఎంలు) కాలిపోవడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు ఉండడం గమనార్హం. ఈ ఘటనపై మంత్రి కౌశిక్‌ చౌదరి స్పష్టమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది సాధారణ అగ్ని ప్రమాదం కాదని, దీని వెనుక కుట్ర ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలు బయటకు రావాలని ఆయన కోరారు.

ప్రమాదంపై అనుమానాలు?
మంత్రి చౌదరి ఘటనలోని మంటల వ్యాప్తి విధానాన్ని ఎత్తి చూపారు. భవనంలో మొదట 2, 3వ అంతస్తులలో మంటలు మొదలైనట్లు తెలిసింది. తర్వాత అవి నేరుగా 7, 8, 9, 10వ అంతస్తులకు వ్యాపించాయని, అయితే మధ్యలో ఉన్న 4, 5, 6వ అంతస్తులపై మంటలు ప్రభావం చూపలేదని ఆయన చెప్పారు. ఈ విధంగా మంటలు దూకడం సాధారణ అగ్ని ప్రమాదంలో అరుదని, దీని వెనుక ఏదైనా ప్రణాళికాబద్ధమైన చర్య ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అసాధారణ విధానం దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఎన్నికల వ్యవస్థపై ప్రభావం..
ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్లు భారతదేశ ఎన్నికల వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. లక్షలాది ఈవీఎంలు దేశవ్యాప్తంగా ఉపయోగంలో ఉండగా, వాటి భద్రత, సురక్ష ఎన్నికల ప్రక్రియలో ప్రజా నమ్మకానికి ముఖ్యమైనది. 4 వేల ఈవీఎంలు ఒక్కసారిగా నష్టపోవడం ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా, ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఘటనలో కుట్ర ఉంటే అది దేశ ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన ఆందోళనలను సృష్టించవచ్చు.

నిష్పక్షపాత దర్యాప్తు..
ఈ ఘటనలో మంత్రి వ్యక్తం చేసిన అనుమానాలు తీవ్రమైనవి. మంటలు అసాధారణంగా వ్యాపించడం, మధ్య అంతస్తులు ప్రభావితం కాకపోవడం వంటి అంశాలు సాధారణ అగ్ని ప్రమాదంలో చాలా అరుదు. దీని వెనుక కుట్ర ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అందువల్ల దర్యాప్తు సంస్థలు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, వాస్తవాలను బయటకు తీసుకురావాలి. పారదర్శకమైన దర్యాప్తు జరిగితేనే ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం కాపాడబడుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, దర్యాప్తుకు సహకరించాలి.

కోల్‌కతా అలీపుర్‌లో జరిగిన 4 వేల ఈవీఎంల దహనం ఘటన దేశ ఎన్నికల వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. మంత్రి కౌశిక్‌ చౌదరి వ్యక్తం చేసిన అనుమానాలు, మంటల వ్యాప్తి విధానం దర్యాప్తును మరింత తీవ్రంగా చేయాల్సిన అవసరాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో కుట్ర ఉంటే అది దేశ ప్రజాస్వామ్యానికి హానికరం. అందువల్ల సమగ్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగి, నిజాలు బయటకు రావాలి.

TVS ఎలక్ట్రిక్ స్కూటర్స్ సరికొత్త రికార్డు..

TVS Electric Scooters Record
TVS Electric Scooters Record

TVS Electric Scooters Record: భారత ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయ మార్కెట్లో 10 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల మార్క్‌ను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థగా టీవీఎస్ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈ స్కూటర్ లో ఉండే ఫీచర్స్.. అనుకూలమైన ధర తో చాలామంది వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 11 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 10.04 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. దీంతో భారతదేశంలో 10 లక్షల ఈ-స్కూటర్ల విక్రయాలను దాటిన ప్రముఖ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణ, విస్తృత డీలర్ నెట్‌వర్క్, మెరుగైన సాంకేతికత ఈ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

టీవీఎస్ తన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత కేవలం 6.5 సంవత్సరాల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. భారత ఈవీ మార్కెట్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ, తక్కువ కాలంలోనే 10 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు చేయడం సంస్థ వ్యూహాత్మక విజయానికి నిదర్శనంగా నిలిచింది.

ప్రస్తుతం టీవీఎస్ భారత మార్కెట్లో TVS iQube మరియు TVS Orbiter పేర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. వీటి ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన రేంజ్, ఆధునిక కనెక్టెడ్ ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు ఈ స్కూటర్లు మంచి ఎంపికగా మారాయి.

టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రస్తుతం మార్కెట్లో భారీ డిమాండ్ కనిపిస్తోంది. కంపెనీ సగటున రోజుకు 1,361 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తూ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈవీ విక్రయాల వృద్ధికి తోడ్పడుతున్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో టీవీఎస్ సాధించిన ఈ మైలురాయి పరిశ్రమకు కీలక సంకేతంగా మారింది. భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను, అధునాతన సాంకేతికతలను పరిచయం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విజయంతో టీవీఎస్ కేవలం ఒక ఆటోమొబైల్ కంపెనీగానే కాకుండా, భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా సాగుతున్న ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాండ్‌గా మరోసారి తన సత్తా చాటుకుంది. 10 లక్షల విక్రయాల మైలురాయి సంస్థకు మాత్రమే కాకుండా దేశీయ ఈవీ రంగ అభివృద్ధికి కూడా ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

ఫుట్ బాల్ రేంజ్ క్రికెట్ అందుకోలేదా.. ఎందుకు..

Football vs Cricket Popularity
Football vs Cricket Popularity

Football vs Cricket Popularity: మనదేశంలో క్రికెట్ ను చాలా మంది చూస్తుంటారు. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం వంటి రాష్ట్రాలలో ఫుట్ బాల్ కూడా చూస్తుంటారు. మనదేశంలో చాలామంది ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ లు చాలామంది ఉన్నారు. చత్రి లాంటివాళ్ళు ఇండియన్ ఫుట్ బాల్ కు సరికొత్త గుర్తింపును తీసుకొచ్చారు.

100 కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశంలో క్రికెట్ చాలామంది చూడటం వల్ల విశేషమైన క్రీడగా పేరు తెచ్చుకుంది. ఐపీఎల్ లాంటి లీగ్ లక్ష కోట్లకు పైచిలుకు బ్రాండ్ వ్యాల్యూ ను సొంతం చేసిందంటే దానికి భారతీయుల అభిమానమే కారణం. ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న నేపథ్యంలో క్రికెట్ ఫుట్ బాల్ రేంజ్ కు ఎదుగుతుందని అందరు అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తప్పు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఫుట్ బాల్ ఫీవర్ తో ఊగిపోతోంది. మెక్సికో వేదికగా 2026 ఫిఫా ప్రపంచకప్ మొదలైంది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై మెక్సికో విజయం సాధించింది. ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తంగా 48 జట్లు పోటీలో ఉంటున్నాయి. 16 మైదానాలలో 39 రోజులపాటు 104 మ్యాచులు నిర్వహించబోతున్నారు. ఫిఫా చరిత్రలో ఇదే అతి పెద్ద టోర్నీగా రికార్డులోకి ఎక్కింది.

1998 తర్వాత తొలిసారిగా జట్ల సంఖ్యను ఫిఫా పెంచింది.. ఈసారి బహుమతిని కూడా పెంచేసింది. 655 మిలియన్ డాలర్లను పంపిణీ చేస్తోంది. ఇది మన దేశ కరెన్సీ ప్రకారం చెప్పుకుంటే 6,250 కోట్లు. గడచిన ఫిఫా ప్రపంచకప్ పోల్చి చూస్తే ఇది 50% ఎక్కువ.

ఫిఫా లో విజేతగా నిలిచే జట్టుకు 476 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.. రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 314 కోట్లు లభిస్తాయి. మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు 276 కోట్లు లభిస్తాయి. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 257 కోట్లు లభిస్తాయి.

క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చిన జట్టుకు 181 కోట్లు లభిస్తాయి.. ప్రీ క్వార్టర్ దాకా వచ్చిన జట్టుకు 142 కోట్లు లభిస్తాయి. గ్రూపు దశలో ఆడే జట్లకు 85 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు ప్రపంచ కప్ కోసం అర్హత సాధించిన జట్టుకు సన్నాహక ఖర్చులకోసం 1.5 మిలియన్ డాలర్లు ఇస్తారు. ఈసారి ఫిఫా ఖర్చు కోసం 727 మిలియన్ డాలర్లను కౌన్సిల్ ఆమోదించింది.

ఇటీవల icc t20 ప్రపంచ కప్ నిర్వహించింది. మొత్తంగా 107 కోట్లను ప్రైజ్ మనీ ఖర్చు చేసింది. భారత జట్టు విజేతగా నిలవడంతో.. 25 కోట్లు లభించాయి. రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు 13.53 కోట్లు లభించాయి. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు 1 మిలియన్ డాలర్లు లభించాయి. ఫిఫా ప్రపంచ కప్ లో విజేతగా నిలిచే జట్టుకు.. టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన జట్టు కంటే దాదాపు 19రెట్ల నగదు బహుమతి ఎక్కువగా అందుకుంటుంది.

ఫిఫా కప్ లో చివరి స్థానంలో నిలిచే జట్టుకు.. దాదాపు 100 కోట్ల వరకు లభిస్తాయి. ఫిఫా కప్పులో చివరి స్థానంలో నిలిచే జట్టుకు.. టీ20 వరల్డ్ కప్ లో అన్ని జట్లకు లభించే ప్రైజ్ మనీ దాదాపు సమానం.. ఫుట్ బాల్ కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంటుంది. ప్రసార హక్కులు కూడా వేల కోట్లకు అమ్ముడుపోతుంటాయి. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఫుట్ బాల్ ఆట విస్తరించి ఉంటుంది. అందువల్లే నగదు బహుమతి ఎక్కువగా ఉంటుంది.

బాలయ్య - కొరటాల కాంబోలో వచ్చిన మూవీ ని ఆ హిట్ సినిమా నుంచి కాపీ చేస్తున్నారా..?

Balakrishna Koratala Siva Movie
Balakrishna Koratala Siva Movie

Balakrishna Koratala Movie Copy: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతు ముందుకు దూసుకెళ్తుంది. బాలయ్య బాబు లాంటి సీనియర్ నటుడు సైతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు బాలయ్య బాబు తను చేసిన తక్కువ సినిమాలతోనే తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయనే రీతిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక మొత్తానికైతే బాలయ్య తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్నాడు.

వరుసగా నాలుగు సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో ఆవరేజ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి తన స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరోసారి భారీ విజయాన్ని సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కథను ఒక సూపర్ హిట్ సినిమా నుంచి కాపీ చేశారంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వం అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని బేస్ పాయింట్ తీసుకుని ఈ సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుందిరా…

ఈ మూవీ కథ పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తు ఇండియన్ రాజకీయాలను కూడా ప్రశ్నించే విధంగా ఈ సినిమా ఉంటుందట…ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో హిట్ కొట్టి భారీ విజయాన్ని అందిస్తే మరోసారి వీళ్ళ కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక కొరటాల ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ బాలయ్య ను మాత్రం టాప్ లెవల్లో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

FIFA 2026: ఈ ఫుట్ బాల్ ఆటగాడి సంపాదన నిమిషానికి 33 లక్షలు

Cristiano Ronaldo Earnings
Cristiano Ronaldo Earnings

Cristiano Ronaldo Earnings: శీర్షిక చదివారు కదా.. అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు.. సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటున్నాడు.. ఫుట్ బాల్ ఎంత ప్రాచుర్యం పొందిన క్రీడ అయితే మాత్రం.. ఆటగాడు నిమిషానికి 33 లక్షలు సంపాదించడం ఏంటీ అనుకుంటున్నారు కదా.. వాస్తవానికి ఆటగాడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడి పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది.

నిమిషానికి 33 లక్షల సంపాదించే ఆటగాడి పేరు రోనాల్డో. ఇతడు పోర్చుగల్ ఫుట్బాల్ జట్టుకు ఆడుతుంటాడు. ఇతడు సౌదీ క్లబ్ ఐన ఆల్ నాసర్ తో ఒప్పందం కురుచుకున్నాడు. ప్రతి ఏడాది 1700 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. అదే దేశం తరఫున ఆడినందుకు మాత్రం డబ్బు తీసుకోడు. మొత్తంగా దేశం, క్లబ్ తరఫున ఏడాదికి 55 గేమ్స్ ఆడుతాడు అనుకుంటే.. ఒక్కో మ్యాచ్ కు 30 కోట్లు పైగా తీసుకుంటాడని ఒక అంచనా. ఇక మనదేశంలో ఒక ప్రొఫెషనల్ ఇండియన్ ఫుడ్ బాల్ ప్లేయర్ ఏడాదికి సంపాదించేది కేవలం 12 లక్షలు మాత్రమే.

రోనాల్డో అద్భుతమైన ఆటగాడు. ప్రపంచంలోనే మేటి అథ్లెట్ గా పేరు తెచ్చుకున్నాడు. మైదానంలో పాదరసం మాదిరిగా కదులుతూ ఉంటాడు. అలుపు అనేది లేకుండా బంతిని గోల్ పోస్ట్ వైపు పంపిస్తుంటాడు. ప్రత్యర్థులకు చిక్కకుండా బంతిని పాస్ చేయడంలో ఇతడి తర్వాతే ఎవరైనా. అందువల్లే పోర్చుగల్ అభిమానులు విపరీతంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో రోనాల్డోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఇతడు విపరీతంగా సంపాదిస్తూ. ఒక పోస్ట్ పెడితే చాలు చూస్తుండగానే అది మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుంటూ ఉంటుంది.

శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉండడానికి రోనాల్డో అత్యంత కఠినమైన డైట్ పాటిస్తూ ఉంటాడు. ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్లడు. మీట్ పరిమితంగా తీసుకుంటాడు. ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు. కూరగాయలు.. ఆకుకూరలు.. పండ్లు ఎక్కువగా తింటూ ఉంటాడు. పాల ఉత్పత్తుల జోలికి అసలు వెల్లడు. కాఫీ లాంటి బేవరేజస్ ముట్టుకోడు. అందువల్లే రోనాల్డో ఈ స్థాయిలో ఆడుతున్నాడు. నిమిషానికి అతడు 33 లక్షల సంపాదిస్తున్నాడు అంటే.. అతడికి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

పశ్చిమాసియా యుద్ధం.. ఇంధన సంక్షోభానికి కేంద్రం చెక్‌!

West Asia War Fuel Crisis
West Asia War Fuel Crisis

West Asia War Fuel Crisis: పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు.. హర్మూజ్‌ ఎప్పుడు తెరుచుకుంటుందో అర్థం కావడం లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా దిగుమతిపై ఆధారపడిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతోపాటు యురోపియన్‌ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. భారత్‌లో గ్యాస్, చమురు ధరలను కేంద్రం పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో చమురు సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని 50 శాతం పెంచబోతోంది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉండగా, వాటిని 90 రోజుల వరకు పెంచే దిశగా అడుగులేస్తోంది. ఆయిల్‌ కంపెనీలను ఫ్యూయల్‌ కెపాసిటీని పెంచుకోవాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

దిగుమతులే ఆధారం..
దేశంలోని మొత్తం ఇంధన అవసరాల్లో సుమారు 90 శాతం విదేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఎక్కువగా చమురు వస్తోంది. ఆ ప్రాంతంలో ఏర్పడిన సంక్షోభం వల్ల సరఫరా చైన్‌ దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, పరిశ్రమలు దెబ్బతినకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం..
ఇంధన నిల్వలను పెంచడం అనేది కేవలం నిల్వల సామర్థ్యం పెంచడం మాత్రమే కాదు. ఇది దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే వ్యూహాత్మక చర్య. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అలాంటి సమయంలో దేశంలో తగినంత నిల్వలు ఉంటే, ధరలు ఎక్కువగా పెరగకుండా నియంత్రించవచ్చు. అలాగే రవాణా రంగం, వ్యవసాయం, పరిశ్రమలు అంతరాయం లేకుండా కొనసాగవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే ఈ చర్య ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. అయితే నిల్వలు పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నిల్వ ఖర్చులు భారీగా ఉంటాయి. ఆయిల్‌ కంపెనీలపై ఈ భారాన్ని ఎలా పంచాలనేది కూడా ముఖ్యమైన అంశం.

ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో..
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పుడు చమురు సరఫరా ఎప్పుడైనా ప్రభావితం కావచ్చు. భారతదేశం వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఇది పెద్ద సవాల్‌. అందుకే ప్రభుత్వం ముందస్తుగా నిల్వలు పెంచి, సంక్షోభం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చర్య ద్వారా దేశం ఆకస్మిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన భద్రతపై దృష్టి పెట్టిన ఇతర దేశాలతో సమానంగా భారతదేశం కూడా అడుగులేస్తోంది. దీర్ఘకాలంలో ఇంధన వైవిధ్యీకరణవైపు కూడా అడుగులేయడం మరింత మంచిదని నిపుణుల అభిప్రాయం.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన నిల్వలను 50 శాతం పెంచే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశ ఇంధన భద్రతకు ముఖ్యమైన అడుగు. 60 రోజుల నుంచి 90 రోజులకు నిల్వలు పెంచడం ద్వారా ఆకస్మిక సరఫరా అంతరాయాలను ఎదుర్కోవచ్చు. ఈ చర్య ఆర్థిక స్థిరత్వం, ధరల నియంత్రణ మరియు దేశ భద్రతకు దోహదపడుతుంది.

త్వరలో OPPO నుంచి మూడు ప్రీమియం ఫోన్లు.. ఎలా ఉన్నాయంటే..

OPPO Premium Phones 2026
OPPO Premium Phones 2026

OPPO Premium Phones 2026: OPPO Reno 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో ఐరోపా మార్కెట్‌లోకి రాబోతున్నాయని సమాచారం. ఇటలీకి చెందిన ‘Epto’ అనే రిటైలర్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ల ధరలకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ప్రీమియం ఫోన్ల కోసం ఎదురుచూసేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఈ ఫోన్లు ఎలా ఉంటాయంటే..

ఇటలీకి చెందిన రిటైలర్ వెబ్‌సైట్ జాబితా ప్రకారం.. OPPO Reno 16 సిరీస్ కింద మూడు మోడల్స్ Reno 16, Reno 16 Pro, Reno 16 FS అనే మూడు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో

Oppo Reno 16 FS 5G: సుమారు 791.90 యూరోలు ( రూ.78,400)

Oppo Reno 16 5G: సుమారు 890.91 యూరోలు (రూ. 88,200)

Oppo Reno 16 Pro 5G: సుమారు 1,087.90 యూరోలు (రూ. 1,07,700)

అయితే ఇవి ఖచ్చితమైన అధికారిక ధరలు కాకపోయినా.. ఐరోపాలో లాంచ్ సమయానికి ఉండబోయే అంచనా ధరలను ఇవి సూచిస్తున్నాయి.

ఈ సిరీస్ ఫోన్లు ఇప్పటికే మే 25, 2026న చైనాలో లాంచ్ అయ్యాయి. Reno 16 మోడల్‌లో 6.32-అంగుళాల OLED డిస్‌ప్లే, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8550 ప్రాసెసర్ ఉన్నాయి. అలాగే 6,700mAh భారీ బ్యాటరీ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 200MP ప్రధాన కెమెరా 50MP అల్ట్రా-వైడ్ , 50MP టెలిఫోటో సెన్సార్లతో కూడిన అద్భుతమైన కెమెరా సెటప్ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ ఫోన్ల కోసం యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే త్వరలో యూరప్ మార్కెట్లోకి వస్తున్నాయి. భారతీయ మార్కెట్ కోసం కూడా ఈ సిరీస్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇటీవల ఇండియన్ వేరియంట్ కూడా గీక్‌బెంచ్ సైట్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోన్లు బ్లాక్, వైట్ రంగుల్లో కనిపిస్తున్నాయి.

53 రోజులు జైల్లో పెట్టారు..నాటి చీకటి రోజులను తలుచుకుని చంద్రబాబు భావోద్వేగం

Chandrababu
Chandrababu

Chandrababu Emotional Speech: చంద్రబాబు గుంభనంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే చిత్తాన్ని కోల్పోరు. పైగా ఆయన ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అటువంటి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మాట్లాడుతూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుతున్నారు.. ఆ తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలన కాలంలో పడిన ఇబ్బందులు ఏకరువు పెట్టుకుంటూ పోయారు.

“2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు గురైంది. ఆంధ్రప్రదేశ్ .. తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నాడు రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. ఇక 2019 నుంచి 2024 వరకు వైసిపి పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. జగన్ పరిపాలన కాలంలో వైసీపీ నాయకులు పెట్టుబడిదారులను వేధించారు. వెంటపడి తరిమేశారు. యువత భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. రాజకీయంగా.. పరిపాలన పరంగా తనకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ.. తనని కూడా 53 రోజులపాటు జైలో పెట్టారని” చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ఉన్న జైల్లో కనీసం సౌకర్యాలు కూడా లేవు. ఆయనకు ఉన్న ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కనీసం భోజనం చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. కోర్టు అనుమతులతో చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి భోజనం తెప్పించుకోవలసి వచ్చింది. కరడు కట్టిన దుర్మార్గులు ఉండే బ్యారక్ లో చంద్రబాబును వేశారు. నాడు ఆయన భద్రతపై లోకేష్.. ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబుకు బెయిల్ లభించలేదు. చివరికి న్యాయస్థానంలో చంద్రబాబు తరఫున లాయర్లు గట్టిగా వాదనలు వినిపించడంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎటువంటి అక్రమాలు జరగని వ్యవహారంలో చంద్రబాబును దోషిగా పేర్కొంటూ నాడు జగన్ ప్రభుత్వం ఆయనను జైల్లో వేసింది. చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని సగటు తెలుగువాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు జగన్ ప్రభుత్వం అత్యంత పైశాచికంగా వ్యవహరించడంతో.. ఏపీ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు.

ఇక అప్పటినుంచి జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని టిడిపి నేతలు అంటుంటారు. సరిగా నాటి రోజులను గుర్తు చేసుకొని చంద్రబాబు బాధపడ్డారు. అంతేకాదు ఆ చీకటి పాలనను చీల్చుకొని ప్రజాపాలన తెచ్చుకుందామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని బట్టి ఆ యాభై మూడు రోజులు ఆయన ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు జగన్ కక్ష సాధింపు తోనే ఆ స్థాయిలో వ్యవహరించారు. ఫలితంగా 11 సీట్లతో ప్రతిపక్ష స్థానాన్ని కూడా సాధించుకోలేక అభాసు పాలయ్యారు.

క్రికెట్‌ అంటే లిటిల్‌ మాస్టరే.. ప్రైవేట్‌ జెట్‌లో సచిన్‌ కుటుంబంతో గేమ్‌.. వీడియో వైరల్‌!

Sachin Tendulkar Private Jet Video
Sachin Tendulkar Private Jet Video

Sachin Tendulkar Private Jet Video: ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ఫాదర్‌గా సునీల్‌ గవాస్కర్‌ను పేర్కొన్నారు. ఆ తర్వాత అంతలా క్రికెట్‌ అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌. 90వ దశకంలో ఓ ఊపు ఊపిన ఈ లిటిల్‌ మాస్టర్‌ భారత జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి మాస్టర్‌ రిటైర్‌ తర్వాత కూడా క్రికెట్‌పై తన ప్రేమ అభిమానం కోల్పోలేదు. సాధారణంగా రిటైర్మెట్‌ తర్వాత క్రికెటర్లు గోల్ఫ్, ఇతర క్రీడలపై దృష్టిపెడతరు. మాస్టర్‌ మాత్రం క్రికెట్‌ ఎక్కడైనా ఆడేందుకు రెడీ అంటున్నాడు. తాజాగా తన ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి క్రికెట్‌ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

విమానం ఎగురుతున్నప్పుడు..
విమానం గాలిలో ఎగురుతున్నప్పుడు లోపల బ్యాట్, బాల్‌తో ఆట ఆడటం అసాధారణమైన అనుభవం. సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, ఆయన కోడలు బౌలింగ్‌ చేశారు. కూతురు సారా క్యాచ్‌ పట్టి తండ్రిని ఔట్‌ చేశారు. ఈ క్షణాలు కేవలం ఆట కాదు, కుటుంబంలోని స్నేహం, సరదా, ఒక్కటిగా ఉండడం యొక్క ప్రతీకగా మారాయి.

సచిన్‌ పెట్టిన క్యాప్షన్‌ వైరల్‌…
ఈ వీడియోను షేర్‌ చేస్తూ సచిన్‌ ‘‘ఆల్టిట్యూడ్‌ (ఎత్తు) ఏదైనా సరే, ఆటిట్యూడ్‌ (వైఖరి) మారకూడదు’’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ ఒక్క వాక్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, విజయాలు ఎంత ఎత్తుకు చేరినా, మనిషి వైఖరి మాత్రం మారకూడదని ఆయన చెప్పాలనుకున్నారు. ఈ సాధారణమైన, కానీ శక్తివంతమైన సందేశం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

సోషల్‌ మీడియాలో విశేష స్పందన..
సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. చాలామంది ఈ క్షణాలను చూసి సచిన్‌ ఎప్పుడూ అలాగే ఉంటారు, కుటుంబంతో ఉండే సరదా ఇలాంటిదే, ఆటిట్యూడ్‌ అనే పదం ఎంత బాగా వాడారు అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ వీడియోను చూసి తమ జీవితాల్లో కూడా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని ప్రేరణ పొందుతున్నారు.

ఎదిగినా ఒదిగి ఉండాలని..
ఈ వీడియో సచిన్‌ వ్యక్తిత్వాన్ని, ఆయన విలువలను స్పష్టంగా చెబుతుంది. విజయాలు, గౌరవాలు, సంపదలు ఎంత ఎత్తుకు చేరినా, ఆయన ఎప్పుడూ సాధారణంగా, వినయంగా ఉండడం ఆయన ఆటిట్యూడ్‌కు నిదర్శనం. కుటుంబంతో కలిసి ఫ్లైట్‌లో కూడా ఆట ఆడడం ద్వారా ఆయన చెప్పిన సందేశం ఏమిటంటే జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్లినా, మనం మనల్ని మనం మరచిపోకూడదు. క్రికెట్‌పై ఆయనకున్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. అది గ్రౌండ్‌లో ఉన్నా, ఆకాశంలో ఉన్నా మారదు. ఈ వీడియో ద్వారా యువతకు ఒక మంచి సందేశం వెళ్తోంది.

విజయం వచ్చినప్పుడు వినయం కోల్పోకూడదు, కుటుంబంతో సరదాగా ఉండడం జీవితంలోని అతి పెద్ద సంపద. సచిన్‌ ఇలాంటి చిన్న చిన్న క్షణాల ద్వారా కూడా ఎంతో పెద్ద సందేశాలు ఇస్తున్నారు. ఆల్టిట్యూడ్‌ ఎంత ఎత్తుగా ఉన్నాం ఆటిట్యూడ్‌ మాత్రం ఎప్పుడూ నేలకు అతుక్కుని ఉండాలి. ఇదే సచిన్‌ బోధించిన నిజమైన పాఠం.

సౌత్ ఇండియా లోనే నెంబర్ 1 గా నిల్చిన 'పెద్ది'..8 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Peddi 8 Days Collection
Peddi 8 Days Collection

Peddi 8 Days Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం , రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కం బ్యాక్ చిత్రం గా నిల్చింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మొదటి వారం లోనే కొన్ని సూపర్ హిట్ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసింది. అంతే కాకుండా తన కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిల్చిపోయిన #RRR మొదటి వారం వసూళ్లను కూడా అధిగమించి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమాకు నమోదు అవుతున్న వసూళ్లు సాధారమైనవి కాదు. ఈ రేంజ్ వసూళ్లు ఈ ప్రాంతం లో సంక్రాంతికి మాత్రమే నమోదు అవుతుంటాయి. కానీ ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు సంక్రాంతి వాతావరణాన్ని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చింది. నైజాం ప్రాంతం లో కూడా ఈ సినిమా అరుదైన రికార్డు ని నెలకొల్పింది. వరుసగా 8 రోజుల వరకు నాన్ స్టాప్ గా 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లను ఈ ప్రాంతం నుండి రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

చాలా అరుదుగా కొన్ని సినిమాలు మాత్రమే ఈ ప్రాంతం లో అలాంటి వసూళ్లను రాబడుతుంటాయి. ఆ కొన్ని సినిమాల్లో పెద్ది ఒకటిగా నిలిచిపోవడం గమనార్హం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 8 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఓవరాల్ గా 174 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ తో 200 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి ఈ చిత్రం చాలా దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో తక్కువ వసూళ్లే వచ్చాయి కానీ , స్టడీ గా ఉన్నాయి , సినిమాలు కూడా పెద్దగా ఏమి లేకపోవడం తో మరో 10 రోజుల లాంగ్ రన్ ఓవర్సీస్ లో వస్తుందనే ధీమా తో ఉన్నారు.

ఇదంతా పక్కన పెడితే , ఈ చిత్రం ఈ ఏడాది సౌత్ లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కోలీవుడ్ లో విడుదలైన సూర్య ‘కరుప్పు’ , అదే విధంగా సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. ‘పెద్ది’ చిత్రం ఈ వీకెండ్ తో 320 కోట్ల గ్రాస్ మార్కుని దిగ్విజయంగా దాటుతుందని, సౌత్ లోనే ఫస్ట్ హాఫ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

ఈ ఫోన్ వెనకాల 49 రకాల యానిమేషన్లు.. ఏ కంపెనీది.. ధర ఎంత..

Tecno Pova 8 49 Animations
Tecno Pova 8 49 Animations

Tecno Pova 8 49 Animations: కొత్త మొబైల్ కొనాలని అనుకునేవారికి Tecno Pova కంపెనీ గుడ్ న్యూస్ తెలపింది. లేటేస్ట్ గా Tecno Pova 8 స్మార్ట్‌ఫోన్ ఇటీవలే (జూన్ 11, 2026) భారత మార్కెట్‌లో విడుదలైంది. అద్భుతమైన డిస్ ప్లే, బలమైన బ్యాటరీ కావాలని అనుకునేవారికి ఈ ఫోన్ స్పెషల్ గా ఉంటుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Tecno Pova 8 ఒక విభిన్నమైన మరియు ఆకర్షణీయమైన గేమింగ్ డిజైన్‌తో వస్తుంది. దీని వెనుక భాగంలో ‘ఎలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’ అనే ప్రత్యేకమైన లైట్ ప్యానెల్ ఉంటుంది. ఇది కాల్స్, నోటిఫికేషన్లు మరియు ఛార్జింగ్ సమయంలో దాదాపు 49 రకాల యానిమేషన్లను ప్రదర్శిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.76-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ప్యానెల్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.దీనివల్ల గేమింగ్ మరియు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇది 950 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ బలమైన బ్యాటరీ. ఇందులో 8,000mAh బ్యాటరీని చేర్చారు. సాధారణంగా ఇతర స్మార్ట్‌ఫోన్ల కంటే ఇది చాలా ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం..ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది బ్యాటరీని నిర్ణీత సమయంలో ఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇది 8GB వరకు ర్యామ్ , 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అలాగే, కనెక్టివిటీ కోసం ఇందులో ప్రత్యేకమైన G1 మరియు SE1 సిగ్నల్ చిప్‌సెట్‌లను అమర్చారు. ఇవి బలహీనమైన సిగ్నల్ ఉన్న చోట కూడా నెట్‌వర్క్ స్థిరంగా ఉండేలా చూస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్‌తో కూడిన కెమెరా ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా మంచి క్లారిటీని అందిస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. అలాగే, ఇది IP64 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉండి, MIL-STD-810H సర్టిఫికేషన్‌తో దృఢంగా ఉంటుంది.

భారతదేశంలో Tecno Pova 8 ధర 6GB+128GB వేరియంట్ రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.31,999 వరకు ఉంది. ఈ ఫోన్ జూన్ 18, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన స్టార్ డైరెక్టర్..అసలు ఏమైందంటే..

Megoti Sanjeev Apologizes to Varalaxmi
Megoti Sanjeev Apologizes to Varalaxmi

Megoti Sanjeev Apologizes to Varalaxmi: హీరోయిన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న పవర్ ఫుల్ ఇమేజ్ సాధారమైనది కాదు. ఈమె ఒక సినిమాలో ఒప్పుకొని నటించిందంటే చాలు , కచ్చితంగా ఆ చిత్రంలో ఎదో ఒక విశేషం ఉంది అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యే రేంజ్ నమ్మకాన్ని సొంతం చేసుకుంది. తెలుగు ఆడియన్స్ కి ఈమె విలన్ గానే ఎక్కువ సుపరిచితమైంది. క్రాక్ , యశోద, తెనాలి రామకృష్ణ BABL వంటి చిత్రాల్లో ఈమె పోషించిన విలన్ రోల్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం విలన్ రోల్స్ లో మాత్రమే కాదు , పాజిటివ్ రోల్స్ తో కూడా ఈమె చాలా బలమైన ఇంప్యాక్ట్ చూపించింది. రీసెంట్ గానే ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సరస్వతి’. ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించడమే కాదు , దర్శకురాలిగా కూడా వ్యవహరించింది. ఆ చిత్రానికి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి కానీ , ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేకపోయింది.

రీసెంట్ గా ఈమె ‘పోలీస్ కంప్లైంట్’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ సమయం లో డైరెక్టర్ మేగోటి సంజీవ్ చేసిన వివాదాస్పద ఆరోపణలు సంచలనంగా మారింది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనమని ఆమెని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదని, ఈమెకు ప్రొమోషన్స్ కోసం ప్రత్యేకమైన రెమ్యూనరేషన్ ప్యాకేజ్ ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు , మరికొంత మంది వరలక్ష్మి కి సపోర్టుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ అంశం పై డైరెక్టర్ మేగోటి సంజీవ్ వరలక్ష్మి కి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘సినిమా విడుదల బాగా ఆలస్యం అయ్యింది అనే ఒత్తిడి లో ఉన్నాను , ఆ ఒత్తిడి లో వరలక్ష్మి గారిపై పొరపాటున నోరు జారాను. ఆమె చేతికి గాయం అయ్యినప్పటికీ కూడా, ఈ సినిమాని పూర్తి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయం లో ఆమె మమ్మల్ని తన సొంత కుటుంబ సభ్యులు లాగానే చూసింది. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో విడుదలైంది.