Homeక్రీడలుCristiano Ronaldo Earnings: FIFA 2026: ఈ ఫుట్ బాల్ ఆటగాడి సంపాదన నిమిషానికి 33...

Cristiano Ronaldo Earnings: FIFA 2026: ఈ ఫుట్ బాల్ ఆటగాడి సంపాదన నిమిషానికి 33 లక్షలు

Cristiano Ronaldo Earnings: శీర్షిక చదివారు కదా.. అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు.. సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటున్నాడు.. ఫుట్ బాల్ ఎంత ప్రాచుర్యం పొందిన క్రీడ అయితే మాత్రం.. ఆటగాడు నిమిషానికి 33 లక్షలు సంపాదించడం ఏంటీ అనుకుంటున్నారు కదా.. వాస్తవానికి ఆటగాడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడి పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది. నిమిషానికి 33 లక్షల సంపాదించే ఆటగాడి పేరు రోనాల్డో. ఇతడు పోర్చుగల్ ఫుట్బాల్ జట్టుకు ఆడుతుంటాడు. ఇతడు సౌదీ […]

Cristiano Ronaldo Earnings: శీర్షిక చదివారు కదా.. అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు.. సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటున్నాడు.. ఫుట్ బాల్ ఎంత ప్రాచుర్యం పొందిన క్రీడ అయితే మాత్రం.. ఆటగాడు నిమిషానికి 33 లక్షలు సంపాదించడం ఏంటీ అనుకుంటున్నారు కదా.. వాస్తవానికి ఆటగాడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడి పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది.

నిమిషానికి 33 లక్షల సంపాదించే ఆటగాడి పేరు రోనాల్డో. ఇతడు పోర్చుగల్ ఫుట్బాల్ జట్టుకు ఆడుతుంటాడు. ఇతడు సౌదీ క్లబ్ ఐన ఆల్ నాసర్ తో ఒప్పందం కురుచుకున్నాడు. ప్రతి ఏడాది 1700 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. అదే దేశం తరఫున ఆడినందుకు మాత్రం డబ్బు తీసుకోడు. మొత్తంగా దేశం, క్లబ్ తరఫున ఏడాదికి 55 గేమ్స్ ఆడుతాడు అనుకుంటే.. ఒక్కో మ్యాచ్ కు 30 కోట్లు పైగా తీసుకుంటాడని ఒక అంచనా. ఇక మనదేశంలో ఒక ప్రొఫెషనల్ ఇండియన్ ఫుడ్ బాల్ ప్లేయర్ ఏడాదికి సంపాదించేది కేవలం 12 లక్షలు మాత్రమే.

రోనాల్డో అద్భుతమైన ఆటగాడు. ప్రపంచంలోనే మేటి అథ్లెట్ గా పేరు తెచ్చుకున్నాడు. మైదానంలో పాదరసం మాదిరిగా కదులుతూ ఉంటాడు. అలుపు అనేది లేకుండా బంతిని గోల్ పోస్ట్ వైపు పంపిస్తుంటాడు. ప్రత్యర్థులకు చిక్కకుండా బంతిని పాస్ చేయడంలో ఇతడి తర్వాతే ఎవరైనా. అందువల్లే పోర్చుగల్ అభిమానులు విపరీతంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో రోనాల్డోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఇతడు విపరీతంగా సంపాదిస్తూ. ఒక పోస్ట్ పెడితే చాలు చూస్తుండగానే అది మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుంటూ ఉంటుంది.

శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉండడానికి రోనాల్డో అత్యంత కఠినమైన డైట్ పాటిస్తూ ఉంటాడు. ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్లడు. మీట్ పరిమితంగా తీసుకుంటాడు. ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు. కూరగాయలు.. ఆకుకూరలు.. పండ్లు ఎక్కువగా తింటూ ఉంటాడు. పాల ఉత్పత్తుల జోలికి అసలు వెల్లడు. కాఫీ లాంటి బేవరేజస్ ముట్టుకోడు. అందువల్లే రోనాల్డో ఈ స్థాయిలో ఆడుతున్నాడు. నిమిషానికి అతడు 33 లక్షల సంపాదిస్తున్నాడు అంటే.. అతడికి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper