Homeఎంటర్టైన్మెంట్Peddi 8 Days Collection: సౌత్ ఇండియా లోనే నెంబర్ 1 గా నిల్చిన 'పెద్ది'..8...

Peddi 8 Days Collection: సౌత్ ఇండియా లోనే నెంబర్ 1 గా నిల్చిన ‘పెద్ది’..8 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Peddi 8 Days Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం , రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కం బ్యాక్ చిత్రం గా నిల్చింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మొదటి వారం లోనే కొన్ని సూపర్ హిట్ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసింది. అంతే కాకుండా తన కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిల్చిపోయిన #RRR మొదటి వారం వసూళ్లను కూడా అధిగమించి సంచలనం సృష్టించింది ఈ […]

Peddi 8 Days Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం , రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కం బ్యాక్ చిత్రం గా నిల్చింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మొదటి వారం లోనే కొన్ని సూపర్ హిట్ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసింది. అంతే కాకుండా తన కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిల్చిపోయిన #RRR మొదటి వారం వసూళ్లను కూడా అధిగమించి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమాకు నమోదు అవుతున్న వసూళ్లు సాధారమైనవి కాదు. ఈ రేంజ్ వసూళ్లు ఈ ప్రాంతం లో సంక్రాంతికి మాత్రమే నమోదు అవుతుంటాయి. కానీ ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు సంక్రాంతి వాతావరణాన్ని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చింది. నైజాం ప్రాంతం లో కూడా ఈ సినిమా అరుదైన రికార్డు ని నెలకొల్పింది. వరుసగా 8 రోజుల వరకు నాన్ స్టాప్ గా 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లను ఈ ప్రాంతం నుండి రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

చాలా అరుదుగా కొన్ని సినిమాలు మాత్రమే ఈ ప్రాంతం లో అలాంటి వసూళ్లను రాబడుతుంటాయి. ఆ కొన్ని సినిమాల్లో పెద్ది ఒకటిగా నిలిచిపోవడం గమనార్హం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 8 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఓవరాల్ గా 174 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ తో 200 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి ఈ చిత్రం చాలా దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో తక్కువ వసూళ్లే వచ్చాయి కానీ , స్టడీ గా ఉన్నాయి , సినిమాలు కూడా పెద్దగా ఏమి లేకపోవడం తో మరో 10 రోజుల లాంగ్ రన్ ఓవర్సీస్ లో వస్తుందనే ధీమా తో ఉన్నారు.

ఇదంతా పక్కన పెడితే , ఈ చిత్రం ఈ ఏడాది సౌత్ లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కోలీవుడ్ లో విడుదలైన సూర్య ‘కరుప్పు’ , అదే విధంగా సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. ‘పెద్ది’ చిత్రం ఈ వీకెండ్ తో 320 కోట్ల గ్రాస్ మార్కుని దిగ్విజయంగా దాటుతుందని, సౌత్ లోనే ఫస్ట్ హాఫ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper