Tuni Child Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులు దాటుతున్న ఎటువంటి క్లూ లభించడం లేదు. ఆ చిన్నారి కోసం వందలాది మంది పోలీసులు గట్టిగానే గాలిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయినా సరే ఆచూకీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ.. రోజుకో కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే చివరకు పూర్తి కిడ్నాప్ కోణంలోని ఈ ఘటన జరిగినట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పెంపుడు కుక్కకు జిపిఆర్ఎస్ అమర్చి వెతుకులాట ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు కుటుంబ కలహాల అనుమానాల నేపథ్యంలో తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇలా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఏది కూడా కొలిక్కి రావడం లేదు. చిన్నారి ఆచూకీ దొరకడం లేదు.
* తల్లి ఇచ్చిన వాంగ్మూలంతో…
చిన్నారి తల్లి భవాని ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో పెద్ద గొడవ జరిగిందని ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి తన భర్తను చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని ఆయన పేర్కొన్నారు. అక్కడ కొద్ది రోజులకే మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని ఆమె తెలిపారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇంకోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాధారణంగా ఎంత చిన్న వయసున్న చిన్నారులు పూర్తిగా పరిచయం ఉన్న వారితోనే వెళ్తారు. అందుకే ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక తెలిసిన వారి పని అయి ఉంటుందన్న పోలీస్ అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల కాల్ డేటా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.
* దొరకని ఆనవాళ్లు..
పాప అదృశ్యమైన మొదటి రెండు నుంచి మూడు గంటల సమయాన్ని పోలీసులు గట్టిగా గమనిస్తున్నారు. గ్రామంలో సిసి పుటేజీలు పరిశీలిస్తున్నారు. కానీ ఎక్కడ చిన్నారి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడైనా దాచారా? లేకుంటే గ్రామాన్ని దాటించేసారా అనే కోలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీయడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
* తండ్రిని ప్రశ్నిస్తున్న పోలీసులు..
మరోవైపు చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆకస్మాత్తుగా వచ్చిన ఆ కుక్క కళ్ళలో భయం కనిపించింది. కానీ పోలీసులతో పాటు అక్కడ ఉన్న వారిని చూసి కొంత భయపడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకుల సహాయంతో చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో, రౌద్రంగా కనిపిస్తోంది ఆ కుక్క. అయితే ఆ కుక్కకు జిపిఎస్ పరికరాన్ని అమర్చి పోలీసులు మళ్లీ అడవిలోకి ఆ కుక్కను వదిలారు. అయితే కొంత దూరం వెళ్లిన ఆ కుక్క తిరిగి మళ్ళీ చిన్నారి ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయింది. దీంతో పోలీసులు రూటు మార్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏమైనా ఘటన జరిగి ఉంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వారం రోజులు దాటుతున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.




















డబ్బుకు విలువుండదు... ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. ప్రపంచ కుబేరుడి జోష్యం!
Elon Musk Prediction: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఎలాన్ మస్క్. త్వరలోనే మొదటి ట్రిలియనీర్‌గా (సుమారు రూ. కోటి కోట్ల విలువ గల ఆస్తి) అవతరించేందుకు చాలా దగ్గరగా ఉన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ గొప్ప సంపదను సాధించిన మస్క్, డబ్బు గురించి చాలా ఆసక్తికరమైన, భవిష్యత్తును సూచించే వ్యాఖ్యలు చేశారు.
డబ్బుకు విలువ ఉండదట..
రానున్న రోజుల్లో డబ్బుకు ఇప్పటి విలువ ఉండదని మస్క్ పేర్కొన్నారు. కారణం కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోలు అనేక రకాల వస్తువులను సులభంగా తయారు చేస్తాయని తెలిపారు. అవి మనుషులు చేసే అనేక సేవలను కూడా అందిస్తాయని వెల్లడించారు. ఫలితంగా మనుషులకు చేయడానికి పనులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని జోష్యం చెప్పారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పని, ఆదాయం, డబ్బు అనే మౌలిక భావనలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేశారు.
ఏఐ, రోబోలతో ఆర్థిక విప్లవం..
మస్క్ చెప్పిన ఈ దృశ్యం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లు పని చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో వస్తువులు కొనడం అనే చక్రం మారిపోతుంది. ఏఐ, రోబోలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీంతో వస్తువుల కొరత తగ్గి, సమృద్ధి పెరుగుతుంది. దీంతో డబ్బు అనే విలువ క్రమంగా తగ్గిపోతుందని మస్క్ భావిస్తున్నారు.
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ ట్రాష్..
ఎలాన్ మస్క్ ఇలా చెప్పడం ఆయన సాధారణ ఆలోచన కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయనే డబ్బుకు విలువ లేని రోజులు రానున్నాయని చెప్పడం ఆసక్తికరం. ఇది ఒక విధంగా పోస్ట్–స్కార్సిటీ ఎకానమీ (కొరత లేని ఆర్థిక వ్యవస్థ) గురించి ఆయన చేస్తున్న అంచనా. ఏఐ, ఆటోమేషన్ వల్ల మనుషులు చేసే పనులు తగ్గిపోతాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి నెలవారీగా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా చూడాలని మస్క్ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది కేవలం సానుకూల వైపు మాత్రమే కాదు. పని లేకపోతే మనుషులకు జీవితంలో ఉత్సాహం తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు, ఏఐ వల్ల వచ్చే సమృద్ధిని సరిగ్గా పంపిణీ చేయగలిగితే మానవజాతి మరింత సుఖంగా జీవించే అవకాశం ఉంది.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వైపు ఆయన టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని చెబుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సంపద, విలువ, పని అనే భావనలు పూర్తిగా మారిపోతాయని సూచిస్తున్నాయి. ట్రిలియనీర్ అవ్వబోయే వ్యక్తి కూడా డబ్బు అనేది శాశ్వతం కాదని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పడం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.