Homeఎంటర్టైన్మెంట్Gopichand Singa Teaser: సంచలనం రేపుతున్న గోపిచంద్ 'సింగా' టీజర్.. ఇలాంటి లుక్ లో అసలు...

Gopichand Singa Teaser: సంచలనం రేపుతున్న గోపిచంద్ ‘సింగా’ టీజర్.. ఇలాంటి లుక్ లో అసలు ఊహించలేదు..

Gopichand Singa Teaser: విలన్ గా ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని , ఆ తర్వాత అదే ఆడియన్స్ తో హీరో గా కూడా మెప్పించుకోవడం అనేది , సాధారణమైన టాస్క్ కాదు, గతం లో చిరంజీవి , రజినీకాంత్ , కృష్ణం రాజు, మోహన్ బాబు వంటి వారు ముందుగా విలన్స్ గా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హీరోలుగా మారి పెద్ద స్టార్స్ అయ్యారు. నేటి తరం లో […]

Gopichand Singa Teaser: విలన్ గా ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని , ఆ తర్వాత అదే ఆడియన్స్ తో హీరో గా కూడా మెప్పించుకోవడం అనేది , సాధారణమైన టాస్క్ కాదు, గతం లో చిరంజీవి , రజినీకాంత్ , కృష్ణం రాజు, మోహన్ బాబు వంటి వారు ముందుగా విలన్స్ గా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హీరోలుగా మారి పెద్ద స్టార్స్ అయ్యారు. నేటి తరం లో అలా గోపీచంద్ ఒక్కడే రాణించాడు. మొదట్లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు, పెద్దగా సక్సెస్ అవ్వలేదు , ఆ తర్వాత విలన్ గా మారి , తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న తర్వాత , హీరో గా రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా విజయాలను అందుకుంటూ మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

ఒకప్పుడు గోపీచంద్ చిత్రానికి స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ వచ్చేవి, కానీ ఆ తర్వాత ఎందుకో ఆయన నేటి తరం ఆడియన్స్ కి తగ్గ సినిమాలు చేయడం మానేసాడు. ఒకే మూస సినిమాలు తీస్తూ, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన డిఫరెంట్ తరహా సినిమాలు చేస్తూ , బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ‘భరత వర్ష’ అనే డిఫరెంట్ జానర్ సినిమాని ప్రకటించి , టీజర్ ని విడుదల చేశాడు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నుండి మరో చిత్రం రాబోతున్నట్టు అధికారికంగా ఒక గ్లింప్స్ వీడియో ద్వారా ప్రకటించాడు. ఈ చిత్రం పేరు సింగా. ఇందులో గోపీచంద్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి , ఈమధ్య కాలం లో ఆయన ఇలాంటి గెటప్ లో కనిపించలేదు.

ఈ గ్లింప్స్ వీడియో సౌండింగ్ ఎఫెక్ట్స్ ని చూస్తుంటే , ఇది హారర్ థ్రిల్లర్ జానర్ సినిమా అనిపిస్తోంది. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ నుండి కళ్ళు చూపించిన విధానం నిజంగా గూస్ బంప్స్ రప్పించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. గతం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పని చేసిన వీ వెంకట్ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారాడు. సామ్ సి ఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper