Homeఎంటర్టైన్మెంట్Rao Bahadur Trailer: గూస్ బంప్స్ రప్పిస్తున్న 'రావు బహదూర్' ట్రైలర్.. ఇలాంటి కాన్సెప్ట్...

Rao Bahadur Trailer: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘రావు బహదూర్’ ట్రైలర్.. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా అంటే సాహసమే..

Rao Bahadur Trailer: విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సత్యదేవ్. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై, ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ లో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ చిత్రాలు ఏమి లేవు కానీ , పర్వాలేదు , అద్భుతమైన నటుడు , డిఫరెంట్ తరహా సినిమాలు చేస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా ఆయన ‘కేర్ ఆఫ్ […]

Rao Bahadur Trailer: విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సత్యదేవ్. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై, ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ లో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ చిత్రాలు ఏమి లేవు కానీ , పర్వాలేదు , అద్భుతమైన నటుడు , డిఫరెంట్ తరహా సినిమాలు చేస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా ఆయన ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేష్ మహా తో ‘రావు బహదూర్’ అనే సినిమా చేశాడు . ఈ చిత్రానికి నిర్మాత మరెవరో కాదు , సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫస్ట్ లుక్ , గ్లింప్స్ వీడియో దగ్గర నుండే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఎప్పటి లాగానే సత్య దేవ్ మరో డిఫరెంట్ జానర్ సినిమా చేసాడు అనిపించుకున్నాడు.

అయితే నేడు విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే, సత్యదేవ్ ఈసారి కమర్షియల్ గా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో మాత్రమే కాదు , ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక సినిమా కూడా తెరకెక్కలేదు. క్యాన్సర్ చివరి స్టేజి లో ఉన్న రావు బహదూర్ , అన్నేళ్లు ఎలా బ్రతికాడు?, ఇతను సామాన్యుడు కాదు , ‘మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్’ అంటూ డాక్టర్లు సైతం చెప్తుంటారు ఈ టీజర్లో. అదే విధంగా ఈ టీజర్ లో హీరో సత్యదేవ్ ని గతం వెంటాడుతున్నట్టు కూడా చూపించారు. కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా ఆడియన్స్ కి అర్థం అయ్యేలా ఈ టీజర్ ని కట్ చేయలేదు కానీ , కచ్చితంగా సినిమాలో వావ్ అనిపించే మూమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది.

వెంకటేష్ మహా దర్శకత్వం లో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో వచ్చే ట్విస్ట్ ఒకటి ఆడియన్స్ ని మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ ట్విస్టులలో ఇది ఒకటి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక నేడు టీజర్ లాంచ్ ఈవెంట్ లో ‘రావు బహదూర్’ గురించి హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ ని చూసే ఆ రేంజ్ లో షాక్ కి గురయ్యారు. ఇక ఈ చిత్రం లో వచ్చే ట్విస్టులు , స్క్రీన్ ప్లే ని చూసి మీరంతా ఏమైపోతారో అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా , ఈ టీజర్ ని చూసి థ్రిల్ కి గురై కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు . ఆ పోస్టు ని మీరు క్రింద చూడొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper