Today 13 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు స్నేహితుల సహాయంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి పనులన్నీ ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అనుకున్న కోరికలను ఈరోజు నెరవేరుస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సీనియర్ల మద్దతు ఉండడంతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దుబార ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విహారయాత్రలకు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా నడుస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని గ్రహాల అనుకూలతతో మనోధైర్యం పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాలు అందుతాయి. కొత్త బాధ్యతలు అందే అవకాశం ఉంది. వ్యాపారులు అనుకోకుండా ఆదాయం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని అవసరాల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ప్రాజెక్టులు పూర్తికావడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు తమ తెలివిని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించని లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. స్నేహితుల నుంచి సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త బాధ్యతలను చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది.
డబ్బుకు విలువుండదు... ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. ప్రపంచ కుబేరుడి జోష్యం!
Elon Musk Prediction: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఎలాన్ మస్క్. త్వరలోనే మొదటి ట్రిలియనీర్‌గా (సుమారు రూ. కోటి కోట్ల విలువ గల ఆస్తి) అవతరించేందుకు చాలా దగ్గరగా ఉన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ గొప్ప సంపదను సాధించిన మస్క్, డబ్బు గురించి చాలా ఆసక్తికరమైన, భవిష్యత్తును సూచించే వ్యాఖ్యలు చేశారు.
డబ్బుకు విలువ ఉండదట..
రానున్న రోజుల్లో డబ్బుకు ఇప్పటి విలువ ఉండదని మస్క్ పేర్కొన్నారు. కారణం కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోలు అనేక రకాల వస్తువులను సులభంగా తయారు చేస్తాయని తెలిపారు. అవి మనుషులు చేసే అనేక సేవలను కూడా అందిస్తాయని వెల్లడించారు. ఫలితంగా మనుషులకు చేయడానికి పనులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని జోష్యం చెప్పారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పని, ఆదాయం, డబ్బు అనే మౌలిక భావనలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేశారు.
ఏఐ, రోబోలతో ఆర్థిక విప్లవం..
మస్క్ చెప్పిన ఈ దృశ్యం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లు పని చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో వస్తువులు కొనడం అనే చక్రం మారిపోతుంది. ఏఐ, రోబోలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీంతో వస్తువుల కొరత తగ్గి, సమృద్ధి పెరుగుతుంది. దీంతో డబ్బు అనే విలువ క్రమంగా తగ్గిపోతుందని మస్క్ భావిస్తున్నారు.
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ ట్రాష్..
ఎలాన్ మస్క్ ఇలా చెప్పడం ఆయన సాధారణ ఆలోచన కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయనే డబ్బుకు విలువ లేని రోజులు రానున్నాయని చెప్పడం ఆసక్తికరం. ఇది ఒక విధంగా పోస్ట్–స్కార్సిటీ ఎకానమీ (కొరత లేని ఆర్థిక వ్యవస్థ) గురించి ఆయన చేస్తున్న అంచనా. ఏఐ, ఆటోమేషన్ వల్ల మనుషులు చేసే పనులు తగ్గిపోతాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి నెలవారీగా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా చూడాలని మస్క్ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది కేవలం సానుకూల వైపు మాత్రమే కాదు. పని లేకపోతే మనుషులకు జీవితంలో ఉత్సాహం తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు, ఏఐ వల్ల వచ్చే సమృద్ధిని సరిగ్గా పంపిణీ చేయగలిగితే మానవజాతి మరింత సుఖంగా జీవించే అవకాశం ఉంది.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వైపు ఆయన టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని చెబుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సంపద, విలువ, పని అనే భావనలు పూర్తిగా మారిపోతాయని సూచిస్తున్నాయి. ట్రిలియనీర్ అవ్వబోయే వ్యక్తి కూడా డబ్బు అనేది శాశ్వతం కాదని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పడం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.