Homeఆంధ్రప్రదేశ్‌TekkalI Mandal Incident: చావును ముందే ఊహించి సెల్ఫీ వీడియో.. ఏపీలో పరువు *హ*త్య!

TekkalI Mandal Incident: చావును ముందే ఊహించి సెల్ఫీ వీడియో.. ఏపీలో పరువు *హ*త్య!

TekkalI Mandal Incident: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హ*త్య* చేసింది. పరువు పోతుందనే భయంతో హైదరాబాదు నుంచి రప్పించి మరి ఈ ఘాతుకానికి పాల్పడింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు సైతం పూర్తి చేశారు. అయితే ఈ పరిణామాలను గమనించిన మృతురాలు ముందుగానే అప్రమత్తం అయ్యింది. ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసింది.. ఆ వీడియో శక్తి యాప్ ద్వారా పోలీసులకు చేరడంతో దారుణం వెలుగులోకి […]

TekkalI Mandal Incident: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హ*త్య* చేసింది. పరువు పోతుందనే భయంతో హైదరాబాదు నుంచి రప్పించి మరి ఈ ఘాతుకానికి పాల్పడింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు సైతం పూర్తి చేశారు. అయితే ఈ పరిణామాలను గమనించిన మృతురాలు ముందుగానే అప్రమత్తం అయ్యింది. ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసింది.. ఆ వీడియో శక్తి యాప్ ద్వారా పోలీసులకు చేరడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లో హరిణి అనే మహిళ *హ*త్య కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

* మేనమామతో వివాహం..
శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లకు చెందిన దుంపల హరిణికి 2020లో టెక్కలి మండలం సోర్లిగాం గ్రామానికి చెందిన ఆమె మేనమామ దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. హరి నీ వివాహం తర్వాత డిగ్రీ పూర్తి చేసింది. గ్రూప్ వన్ పరీక్షల కోసం హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటోంది. ఈ తరుణంలో హైదరాబాదులో నాగేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. భర్తకు విడాకులు ఇచ్చి నాగేంద్ర ను పెళ్లి చేసుకోవాలని భావించింది. కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు అభ్యంతరం తెలిపారు. తనను నిర్బంధించి దాడి చేశారని హైదరాబాద్ బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హరిణి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ కేసు ఇలానే నడుస్తూ ఉంది.

* హ*త్యకు ముందే ప్రణాళిక..
హైదరాబాదులో ఉన్న హరిణికి గత నెలలో తల్లి ఫోన్ చేసింది. భర్తతో విడాకుల గురించి మాట్లాడాలని రమ్మని పిలిచింది. గత నెల 30న హైదరాబాదులో బయలుదేరి 31న సోర్లిగాం చేరుకుంది హరిణి. అప్పటికే హరిణిని మట్టుబెట్టాలని కుటుంబ సభ్యులు ప్రణాళిక రూపొందించుకున్నారు. భర్త దంతీశ్వరరావును సినిమాకు పంపారు.. ఆమె మంచం పై నిద్రపోతున్న సమయంలో తల్లి ఇనుప రాడ్డుతో గట్టిగా కొట్టి *హ*త్య చేసింది. పక్కన హరిణి తాతయ్య కూడా ఉన్నారు. కేకలు వేయకుండా నోరు నొక్కి చనిపోయిన తర్వాత భర్తకు ఫోన్ చేసి చెప్పారు. హరిణి గుండెపోటుతో చనిపోయినట్లు అందర్నీ నమ్మించారు. ఆమెకు గుండెపోటు రావడం ఏంటని ప్రశ్నిస్తే ఆత్మహత్యగా నమ్మించారు. మృతదేహాన్ని హడావిడిగా అర్ధరాత్రి స్మశాన వాటికలో దహనం చేశారు.

* ముందుగానే గ్రహించి..
అయితే ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించారు హరిణి. తన కుటుంబ సభ్యులు తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్లే సమయంలో ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు. తనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయని.. తాను జూన్ 5 లోగా తిరిగి హైదరాబాద్ జరగకపోతే.. తన మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తే.. తనకు ఏదో జరిగిందని భావించి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆ వీడియోను నాగేంద్రకు పంపించింది. అయితే ఆమె ఊహించినట్టే అంతా జరిగింది. హరిణి హైదరాబాద్ తిరిగి రాకపోవడం.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆ రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆ మరుసటి రోజు శక్తి యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగేంద్ర. ఏపీ శక్తి యాప్ కంట్రోల్ రూమ్ నుంచి శ్రీకాకుళం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు సొర్లిగాం గ్రామంలో ఆర్ఆర్ తీస్తే అప్పటికే హరిణి చనిపోయినట్లు తేలింది. *హ*త్యకు పాల్పడిన తల్లితోపాటు తాత, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper