Home Blog Page 130

దాడి చేసి ముగ్గురిని చంపిందే గాక.. భారత్ పై అమెరికా కండ ఖావరం

US Reaction To India Attack
US Reaction To India Attack

US Reaction To India Attack: అమెరికాది ముమ్మాటికి మూర్ఖత్వం. దుర్మార్గం. అగ్రరాజ్యమననే పేరుతో ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. తమకు నచ్చని దేశాల మీద దాడులు చేస్తోంది. యుద్దాలకు కూడా దిగుతోంది. చివరికి దేశ అధ్యక్షులను అపహరించి.. రాక్షసానందం పొందుతోంది. చివరికి మన దేశంపై కూడా దారుణంగా ప్రవర్తిస్తోంది.

ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత దేశం మీద అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ దేశానికి సహకారం అందిస్తోంది. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడిని ట్రంప్ తన వద్దకు పిలిపించుకొని.. విందు కూడా ఇచ్చారు. ఉగ్రవాద దేశం అని తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్ దేశంతో అమెరికా అంటకాగడం ఆందోళన కలిగిస్తోంది. స్వీయ సమృద్ధి.. ఇతర అంశాలలో స్వయం ప్రతిపత్తిని సాధిస్తున్న భారత్ మీద అమెరికా కక్ష సాధింపులకు దిగుతోంది. రష్యా నుంచి.. గల్ఫ్ దేశాల నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుంటే.. అమెరికా కడుపు మంటతో రగిలిపోతుంది. ఇటీవల కాలంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో భారత్ వచ్చారు. ఇక్కడ కూడా అదే కడుపు మంటను ప్రదర్శించారు.

ఇటీవల కాలంలో మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ముందు కూడా యూరప్ దేశాలు క్రూడ్ ఆయిల్ ప్రస్తావన తీసుకొచ్చారు. దానిని జై శంకర్ మొహమాటం లేకుండా తిప్పి కొట్టారు. భారత్ తన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడైనా ఆయిల్ కొనుగోలు చేస్తుందని.. యూరప్ ఆయుధాలు మా మీద దాడి చేస్తున్నాయని.. భారత్ ఆయుధాలు యూరప్ మీద దాడి చేయడం లేదు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల వరకు భారత్ మీద సాగిస్తున్న దాడి మామూలుది కాదు.. పైగా ఒకప్పటి మాదిరిగా భారత్ సైలెంట్ గా ఉండడం లేదు. గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఇండియా వచ్చారు. ఈ సమయంలో మన ప్రభుత్వం పరోక్షంగా నిరసన వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అమెరికా మన నౌక మీద దాడి చేసింది. మన దేశానికి చెందిన మెరైన్ ఇంజనీర్లు చనిపోయారు. వాస్తవానికి కమర్షియల్ నౌకల మీద దాడులు చేయకూడదు. పైగా యుద్ధంలో భారత్ ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గాని పాల్గొనడం లేదు. అలాంటప్పుడు అమెరికా దాడి చేయడమే అతిపెద్ద దారుణం. పైగా ఈ దాడిని అమెరికా సమర్ధించుకుంటున్నది. మొదట్లో ఆ దాడి ఇరాన్ చేసిందని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. ఇప్పుడేమో రూబియో మాట మార్చి.. మా దాడులు అలాగే ఉంటాయని అంటున్నాడు. పైగా దాడి చేసిన విషయంలో ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. అమెరికా తీరు పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కండ ఖావరంతో అమెరికా ప్రవర్తిస్తోందని భారతీయులు మండిపడుతున్నారు. మరోవైపు అమెరికా ముందు నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయారని.. భారతీయులను చంపినప్పటికీ స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంబర్‌ 12... రోజువారీ జీవితంలో ప్రభావం

Significance Of Number 12

Significance Of Number: మన నిత్యజీవితంలో 12 సంఖ్య అనేక రంగాల్లో సహజంగా కనిపిస్తుంది. ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక రోజులో 12 గంటలు (ఏఎం/పీఎం), ఒక డజన్‌లో 12 వస్తువులు.. ఇలా అనేక చోట్ల ఈ సంఖ్యను వాడుతుంటాం. అలాగే జోడియాక్‌లో 12 రాశులు, సంగీతంలో ఒక ఆక్టేవ్‌లో 12 సెమిటోన్లు, ఇంపీరియల్‌ కొలతల్లో 12 అంగుళాలు ఒక అడుగు ఇవన్నీ కూడా 12 సంఖ్య యొక్క విస్తృత ఉపయోగాన్ని చాటుతాయి.

గణితపరమైన బలం..
12 సంఖ్యను 10 కంటే ఎందుకు ఎక్కువగా ఎంచుకున్నారనేది ఆసక్తికరమైన విషయం. 12 ఒక హైలీ కంపోజిట్‌ నంబర్‌. దీనికి 1, 2, 3, 4, 6, 12 అనే ఆరు భాగహారులు ఉన్నాయి. ఇది 10 సంఖ్యకు (భాగహారులు: 1, 2, 5, 10) కంటే ఎక్కువ. దీనివల్ల వస్తువులను, డబ్బును లేదా పనులను 2, 3, 4, 6 మంది మధ్య సమానంగా పంచడం చాలా సులభం. ప్రాచీన కాలంలో వ్యాపారం, వ్యవసాయం, పన్నులు వసూలు చేయడం వంటి పనుల్లో ఈ సౌలభ్యం చాలా ముఖ్యంగా ఉండేది.

చేతి వేళ్లతో లెక్కించే ప్రాచీన పద్ధతి..
మరో ముఖ్యమైన కారణం చేతి వేళ్లతో లెక్కించే విధానం. బొటనవేలిని ఉపయోగించి మిగిలిన నాలుగు వేళ్లలోని మూడు కణుపుల చొప్పున మొత్తం 12 కణుపులను సులభంగా లెక్కించవచ్చు. ఇది ప్రాచీన మెసొపొటేమియా, ఈజిప్ట్, భారతదేశం వంటి నాగరికతల్లో విస్తృతంగా వాడుకలో ఉండేది. రాత, కాగితం లేని కాలంలో ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి. ఈ విధంగా లెక్కించడం వల్ల వ్యాపారులు, రైతులు త్వరగా లెక్కలు వేయగలిగేవారు.

నాగరికతల్లో 12 పాత్ర
బాబిలోనియన్లు (మెసొపొటేమియా) సంఖ్యా వ్యవస్థలో 60ని ఉపయోగించేవారు. 60ని 12తో సులభంగా భాగించవచ్చు కాబట్టి, వారు సమయాన్ని 12 గంటలుగా విభజించారు. ఈజిప్టు వారు కూడా 12 గంటల రోజు వ్యవస్థను అనుసరించారు. రోమన్లు, గ్రీకులు కూడా 12 సంఖ్యను వాణిజ్యం, క్యాలెండర్‌లో ఉపయోగించారు. హిందూ సంప్రదాయంలో కూడా 12 జ్యోతిర్లింగాలు, 12 రాశులు వంటి వాటిలో ఈ సంఖ్యకు ప్రాధాన్యం ఉంది.

ఆధునిక కాలంలో ప్రాధాన్యత..
ఈరోజు కూడా డజన్‌లో వస్తువులు అమ్మడం(గుడ్లు, పెన్సిళ్లు, బ్రెడ్‌), పాఠశాలల్లో 12 తరగతుల విద్యా వ్యవస్థ, సినిమా, టీవీలో 12 ఎపిసోడ్ల సీరియల్స్‌ వంటివి ఇంకా కొనసాగుతున్నాయి. డిజిటల్‌ యుగంలో కూడా 12 సంఖ్య తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఎందుకంటే ఇది మనుషుల ఆచరణాత్మక అవసరాలకు బాగా సరిపోయే సంఖ్య.

మొత్తంమీద, 12 సంఖ్య కేవలం ఒక లెక్క కాదు. అది మన పూర్వీకులు గణితపరమైన సౌలభ్యం, చేతి లెక్కింపు సౌకర్యం, వ్యాపార అవసరాలను బట్టి ఎంచుకున్న తెలివైన వ్యవస్థ. ఆధునిక యుగంలో కూడా దాని ఉపయోగం కొనసాగడం దాని బలాన్ని చాటుతోంది.

జీ-7, జీ-20, బ్రిక్స్‌.. ఆధిపత్యం ఎవరిది?

Who Dominates G7 G20 BRICS
Who Dominates G7 G20 BRICS

Who Dominates G7 G20 BRICS: ఫ్రాన్స్‌ వేదికగా జీ-7 సమావేశాలు ఈనెల 17న జరుగనున్నాయి. భారత్‌ సభ్యదేశం కాకపోయినా మన ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో మోదీ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. అక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని జీ-7, జీ-20, బ్రిక్స్‌ కూటములపై కొత్త చర్చ మొదలైంది. ఈ మూడింటిలో ఆధిపత్యం ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది..

జీ-7 సమూహం..
అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల సంఘం ఇది. ఇందులో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, కెనడా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ జీడీపీలో సుమారు 40-45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అలాగే అధునాతన సాంకేతికత, ఆర్థిక సంస్థలు (ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు) రిజర్వ్ కరెన్సీలు (ముఖ్యంగా అమెరికన్ డాలర్), బహుళజాతి కంపెనీలు, సైనిక పరంగా గణనీయమైన నియంత్రణ ఉంది. జీ7 దేశాలు టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థలు, గ్లోబల్ ఫైనాన్స్‌లో ఇంకా బలంగా ఉన్నాయి. అయితే వీటిలో జనాభా వృద్ధి తగ్గుతోంది, ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాతో పెరుగుతున్న పోటీ కారణంగా జీ-7 దేశాలు ఒక్కటై పనిచేస్తున్నాయి.

బ్రిక్స్‌ విస్తరణ…
పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాల్‌ చేసేందుకు 2009లో బ్రిక్స్‌ ఏర్పడింది. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా ఉన్నాయి. తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా చేరాయి. బ్రిక్స్‌ బలం దాని జనాభా (ప్రపంచ జనాభాలో 40 శాతం కంటే ఎక్కువ), వనరులు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి. చైనా, ఇండియా వంటి దేశాలు తయారీ రంగం, డిజిటల్ ఎకానమీ, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి సాధించాయి. బ్రిక్స్‌ దేశాలు కలిసి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఏర్పాటు చేసి, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రష్యా-చైనా సన్నిహిత సంబంధాలు వంటి అంతర్గత వ్యత్యాసాలు బ్రిక్స్‌ ఐక్యతకు సవాల్‌గా ఉన్నాయి.

జీ-20కి పరిమితులు..
జీ-20ని 1999లో జీ-7 ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను కలుపుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇందులో జీ-7 దేశాలతో పాటు బ్రిక్‌‍్స దేశాలు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, సౌదీ అరేబియా వంటి 20 దేశాలు ఉన్నాయి. జీ-20 ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పు, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించే వేదికగా పనిచేస్తుంది.అయితే జీ-20కి బైండింగ్ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఇది ఎక్కువగా చర్చా వేదికగానే మిగిలిపోతోంది. జీ-7, బ్రిక్స్‌ దేశాలు రెండూ ఉన్నందున, తరచూ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యం పరంగా జీ-7 ఇంకా ముందంజలో ఉంది. డాలర్ ప్రాబల్యం, అధునాతన టెక్నాలజీ, పశ్చిమ దేశాల సైనిక బలంతో జీ-7 తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. అయితే బ్రిక్స్‌ జనాభా, వనరులు, ఆర్థిక వృద్ధి రేటు ద్వారా తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. బ్రిక్స్‌ దేశాలు డీ-డాలరైజేషన్ (డాలర్ ఆధిపత్యం తగ్గించడం), స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. జీ-20 మాత్రం రెండు వైపుల మధ్య సమన్వయం చేసే వేదికగా ఉంటుంది కానీ నిర్ణయాత్మక శక్తి కలిగి లేదు.

షిప్‌పై దాడుల వివాదం.. తమ పని కాదన్న ట్రంప్‌.. తామే చేశామన్న ఆర్మీ!

Trump
Trump

Ship Attack Controversy: హర్మూజ్‌ జలసంధి, ఓమన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో భారత వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇండియన్‌ క్రూతో కూడిన మూడు వాణిజ్య నౌకలు ఈ ఘటనల్లో చిక్కుకున్నాయి. ఒక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ సంఘటనలు అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగాయి. అమెరికా ఇరాన్‌ చమురు ఎగుమతులపై నిషేధాన్ని అమలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్‌ పను అన్న ట్రంప్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ భారత నౌకలపై డ్రోన్‌ దాడి చేసినట్లు ఆరోపించారు. ఇండియన్‌ నౌకలపై జరిగిన దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ, ఇరాన్‌ను బాధ్యులుగా చూపించారు. ఈ ఆరోపణలు భారత్‌లో ఉన్న ఆందోళనను మరింత పెంచాయి. ట్రంప్‌ ప్రకటన రాజకీయంగా ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో, ఇది వాస్తవాలను ఎంతవరకు ప్రతిబింబిస్తుందో చర్చనీయాంశంగా మారింది.

తామే చేశామన్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌..
ఇదిలా ఉంటే అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ మాత్రం భిన్నమైన వాస్తవాలను వెల్లడించింది. ఇరాన్‌ చమురు రవాణా చేస్తున్న నౌకలపై అమెరికా దళాలు హెల్‌ఫైర్‌ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. హెచ్చరికలను పట్టించుకోని మూడు నౌకలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని, ఇంజన్‌ రూమ్‌పై దాడి చేసి నౌకలను నిలిపివేసినట్లు తెలిపింది. ఈ చర్యలు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు భాగమని అమెరికా వాదిస్తోంది.

భారత్‌ తీవ్ర నిరసన..
భారత్‌ ఈ ఘటనలపై తీవ్రంగా నిరసన తెలిపింది. ముగ్గురు భారతీయ నావికుల మరణం తర్వాత భారత ప్రభుత్వం అమెరికా దౌత్యాధికారులను పిలిపించి బలమైన నిరసన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వేలాది మంది నావికులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భారత్‌–అమెరికా సంబంధాలపై తాత్కాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

నిజం ఎవరిది?
ఈ వివాదంలో రెండు వైపుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. అమెరికా సైనిక దళాలు హెల్‌ఫైర్‌ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా అంగీకరించడం వాస్తవం. అయితే ట్రంప్‌ ఇరాన్‌పై డ్రోన్‌ దాడి ఆరోపణ చేయడం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. భారత్‌లో ఉన్న ఆగ్రహం నుంచి దృష్టిని మరల్చేందుకు, లేదా ఇరాన్‌పై అదనపు ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్‌ మధ్య ఉన్న పాత శత్రుత్వం, చమురు ఎగుమతులపై నిషేధం, హార్ముజ్‌ జలసంధి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఈ ఘటనలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలకు ఇది రెండు పక్షాల మధ్య చిక్కుకున్న పరిస్థితిని సృష్టిస్తోంది. నావికుల భద్రతను నిర్ధారించడం, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కోరడం భారత్‌ ముందున్న ప్రధాన సవాల్‌.

'పెద్ది' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. మరో మైలురాయిని దాటిన గ్లోబల్ స్టార్..

Peddi 12 Days Collections
Peddi 12 Days Collections

Peddi 10 Days Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద మరో సరికొత్త మైలు రాయిని దాటింది. మన టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. మేకర్స్ ఈ చిత్రం కేవలం 8 రోజుల్లో 366 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టినట్టు పోస్టర్లు వేశారు కానీ , అందులో ఎలాంటి నిజం లేదు. ప్రతీ నిర్మాత తమ సూపర్ హిట్ సినిమాకు చేసినట్టుగా, ‘పెద్ది’ నిర్మాతలు కూడా చేశారంతే. కానీ క్లోజింగ్ లో మాత్రం ఈ చిత్రం 366 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే నేటి నుండి ఈ చిత్రానికి మామూలు రేట్స్ లోనే టిక్కెట్స్ అందుబాటులోకి రానుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ , రిపీట్ గా చూసే ఆడియన్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 10 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 3 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 8 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు 9 కోట్ల రూపాయిల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 305 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 182 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. నైజాం , ఈస్ట్ గోదావరి , కృష్ణ , గుంటూరు , ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. మిగిలిన ప్రాంతాల్లో నేడు బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్స్ లో మాత్రం దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. 10 రోజుల్లో ఈ చిత్రానికి 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు , కేవలం ప్రీమియర్స్ + మొదటి రోజు నుండి వస్తుందని అంచనా వేశారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ చివరికి అది క్లోజింగ్ లో వచ్చింది. 10 మిలియన్ డాలర్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే , 50 శాతం నష్టాలు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా నార్త్ ఇండియా లో కూడా ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇప్పటి వరకు కేవలం పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 80 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి. ఓవరాల్ గా ఈ సినిమా లాంగ్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ.. రంగంలోకి పవన్!

Gnaneswari Missing Case Latest Update
Gnaneswari Missing Case Latest Update

Gnaneswari Missing Case Latest Update: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఆ చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తోంది. వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇంతవరకు ఆచూకీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీసారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుకునేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గాలింపు చర్యల్లో పోలీస్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్టీఆర్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. దట్టమైన అడవుల్లో సైతం వెళ్ళగలిగే అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంపు వాచర్స్, నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్.

పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 8 రోజులు దాటుతున్న ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాదాపు 400 మంది పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు పాల్గొంటున్నారు. అత్యాధునిక డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క ప్రత్యక్షం కావడంతో.. దానికి జిపిఆర్ఎస్ కట్టి అడవుల్లో వదిలారు.. అయినా సరే ఎటువంటి ఫలితం లేకపోయింది. అయినా సరే ప్రయత్నాల్లో ఉంది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. కాకినాడ ఎస్పీకి నేరుగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

చనిపోయిన కుక్క..
అయితే పోలీస్ శాఖ గత ఎనిమిది రోజులుగా చేపట్టిన దర్యాప్తును వివరించారు కాకినాడ జిల్లా ఎస్పీ. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించామని ఎస్పీ వివరించారు. కాగా జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన పెంపుడు కుక్క ఊహించని రీతిలో చనిపోయింది. గత రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తించిన ఆ కుక్క.. చివరకు శనివారం చనిపోయింది. చిన్నారితో పాటుగానే ఈ కుక్క కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల కిందట తిరిగి వచ్చింది. చిన్నారి ఇంటి వద్దకు చూసి కంగారుతో అడవిలోకి పారిపోయింది. అతి కష్టం మీద ఆ కుక్కను బంధించారు. ఆ కుక్కకు జిపిఎస్ ట్రాకర్ అమర్చి చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలం కాగా.. శనివారం కుక్క సైతం చనిపోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

బాహుబలి మూవీలో అంత మంచి క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న మోహన్ బాబు..

Mohan Babu Missed Baahubali
Mohan Babu Missed Baahubali

Mohan Babu Missed Baahubali: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ఎన్ని రికార్డులను సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించిన మొదటి సినిమాగా హిస్టరీలో నిలిచింది. అలాగే అప్పటివరకు ఎవరు కూడా తెలుగు సినిమాన పాన్ ఇండియాలో రిలీజ్ చేయలేదు. మొదటిసారి ఈ సినిమాను చేసి ఆ సాహసం చేసిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…అయితే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను మొదట వేరే వాళ్ళతో చేయించాలని అనుకున్నారు. కానీ ఎవరికి వాళ్లు ఈ సినిమాని చూసి భయపడి మేము చేయలేము అని తప్పుకోవడంతో మరి కొంతమంది ఆర్టిస్టులు ఈ సినిమాకి ఆడ్ అయ్యారు.

దాంతో వాళ్ళకి ఎక్కడ లేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా ప్రభాస్ రానాలతో పాటు సరిసమానమైన గుర్తింపును సంపాదించుకున్న క్యారెక్టర్ కట్టప్ప… సత్యరాజ్ చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ క్యారెక్టర్ ను మొదట మోహన్ బాబు తో చేయించాలనుకున్నారట.

కానీ మోహన్ బాబు ఆ క్యారెక్టర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అతన్ని కాద సత్య రాజ్ కి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ వల్లే సినిమా చాలావరకు హై ఎలివేషన్స్ ని మూటగట్టుకుంది. ఆయన బాహుబలి గురించి ఇచ్చే ఎలివేషన్స్ కావచ్చు. యుద్ధ సమయంలో ఆయన పోరాడిన విధానం కావచ్చు అన్నీ కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సత్యరాజ్ కి ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

మొత్తానికైతే మోహన్ బాబు ఈ సినిమాలో ఒక మంచి రోల్ ను మిస్ చేసుకున్నాడు అంటు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్యారడైజ్, శ్రీనివాస మంగాపురం సినిమాల్లో వైవిధ్యమైన నటనను చూపిస్తానని గతంలో మోహన్ బాబు చెప్పాడు. తన నటనతో ఏ రేంజ్ గుర్తింపును సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

బాలయ్య డాన్ గా కనిపిస్తే థియేటర్స్ తగలడిపోతాయా..?

Balayya Koratala Shiva Film
Balayya Koratala Shiva Film

Balakrishna As Don: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘ఎన్ బి కె 111’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలయ్య బాబు డాన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇప్పటి వరకు బాలయ్య ఫుల్ లెంత్ డాన్ క్యారెక్టర్ లో ఎప్పుడు నటించలేదు. ఇక ఈ మధ్య కాలంలో బాలయ్యకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి క్రేజ్ దక్కుతుంది. కాబట్టి అతన్ని డిఫరెంట్ పాత్రలో చూడడానికి అతని అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఈ మూవీలో డాన్ గా నటించి ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

రీసెంట్ గా బాలయ్య బాబు బర్త్ డే ను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నిజానికి తమన్ ను నందమూరి తమన్ అని ఎందుకు అంటారు అనే డౌట్ అందరికీ ఉండేది. కానీ ఈ గ్లింప్స్ లో తన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తే అందరికీ క్లారిటీ వచ్చింది. అలాంటి తమన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

ముఖ్యంగా బాలయ్య బాబు సినిమా అంటే చాలు తమన్ పూనకాలతో బ్యాగ్రౌండ్ స్కోర్ ని కొడతాడని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. బాలయ్య బాబు కి డాన్ క్యారెక్టర్ ఎంత వరకు కలిసి వస్తుంది. యావత్ ప్రేక్షక లోకం మొత్తాన్ని ఈ సినిమాతో తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

సినిమాల్లోకి రాకముందు పాపం సోనూసూద్ అలాంటి పనులు చేసేవాడా.. చివరికి ట్రైన్ లో అలా..

Sonu Sood Before Movies
Sonu Sood Before Movies

Sonu Sood Before Movies: సినీ ఇండస్ట్రీ లో నేడు పెద్ద స్టార్స్ గా కనిపిస్తున్న ఎంతో మంది నటీనటులకు ఆ లగ్జరీ జీవితం అంత తేలికగా రాలేదు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత పెద్ద సినీ స్టార్ వారసుడు అయినా కష్టపడి టాలెంట్ నిరూపించుకుంటూనే ఈ ఇండస్ట్రీ లో కొనసాగగలరు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్స్ వారసులుగా వచ్చిన వాళ్ళ పరిస్థితే అలా ఉంది, ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , నేడు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కొంతమంది స్టార్స్ , సినిమాల్లోకి రాకముందు ఎలాంటి పరిస్థితులను ఎదురుకొని ఉండుంటారో మీరే ఊహించుకోండి. నేడు అలాంటి పరిస్థితులను ఎదురుకున్న సోనూసూద్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. హీరో అవుదామని ఇండస్ట్రీ లోకి వచ్చాడు , కానీ పరిస్థితులు అతన్ని వెండితెర పై విలన్ గా మార్చాయి.

కానీ కష్టసమయంలో జనాలకు అండగా నిలిచి , నిజ జీవితం లో హీరో గా నిలిచాడు సోనూ సూద్. ఆ విధంగా ఆయన హీరో అవ్వాలనే కథ ని నిజం చేసుకున్నాడు. అయితే సినిమాల్లోకి రాక ముందు ఆయన పడిన కష్టాలు ఎలాంటివో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు సోనూసూద్. అవి విన్న తర్వాత ఒక్క పైసా సంపాదించాలంటే, ఇంత కష్టపడాలా ? అనేది నేటి యువతకు అర్థం అవుతుంది. రీసెంట్ గానే ఆయన వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించాడు. దీని అనుభవాన్ని ఆయన పంచుకుంటూ , ఆరోజుల్లో రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు ట్రైన్ రిజర్వేషన్లు లేక, రైళ్లలో న్యూస్ పేపర్లు పరుచుకొని పడుకునేవాడిని. అలాంటిది నేడు రైలు సౌకర్యం ఈ స్థాయిలోకి వస్తుందని ఊహించలేదు. నేడు వండేభారత్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాను, ఇందులో నాణ్యమైన ఆహరం , అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయి. సామాన్య భారతీయుల ప్రయాణ నాణ్యతని పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు సోనూ సూద్.

ఒకప్పుడు రిజర్వేషన్లు దొరకక, సోనూసూద్ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకున్నాడు అంటే, ఆయన ఆర్ధిక పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనం ట్రైన్ టిక్కెట్స్ దొరక్కపోతే బస్సులో టిక్కెట్ బుక్ చేసుకొని వెళ్తాము, కానీ సోనూ సూద్ అదే ట్రైన్ లో పేపర్లు పడుకొని వెళ్ళేవాడంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆయన ఆర్ధిక స్తొమత ఎలాంటిది అనేది. అంతే కాదు , హోటల్స్ లో వెయిటర్ గా కూడా అప్పట్లో సోనూ సూద్ పని చేసేవాడట. అలా ఎన్నో కష్టాలు అనుభవించి , మొదటి సినిమాలో విలన్ గా నటించే రేంజ్ కి ఎదిగేందుకు సోనూ సూద్ కి పదేళ్లకు పైగానే సమయం పట్టిందట.

బ్రేకులు లేని బుల్డోజర్ లా గిల్.. టీమిండియా సారధిగా సరికొత్త రికార్డు

Shubman Gill New Record
Shubman Gill New Record

Shubman Gill Record : టీమిండియా వన్డే సారథి గిల్ దూసుకుపోతున్నాడు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో అదరగొట్టిన అతడు.. అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ ముందు తన మీద అంచనాలను అమాంతం పెంచేసుకుంటున్నాడు.. దీంతో భారత మేనేజ్మెంట్ ఉత్సాహంతో కనిపిస్తోంది.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో గిల్ సత్తా చూపించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 88* పరుగులు చేశాడు గిల్.

సరికొత్త రికార్డు

88 పరుగులు చేసిన గిల్ తన పేరు మీద అద్భుతమైన రికార్డును లిఖించుకున్నాడు.. వన్డే ఫార్మేట్ లో టీం ఇండియా తరఫునుంచి అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.. 62 ఇన్నింగ్స్ లలో అతడు 3000 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అతడు రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా కొనసాగుతున్నాడు.. కేవలం 57 ఇన్నింగ్స్లలో ఆమ్లా 3 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. గిల్ 1000 పరుగులు సాధించడానికి 19 ఇన్నింగ్స్ లు.. రెండు వేల పరుగులు సాధించడానికి 38 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి.

కొంతకాలంగా గిల్ స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు.. అద్భుతమైన టెక్నిక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ లో అతడు ఆడిన తీరే దీనికి బలమైన నిదర్శనం.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో కూడా గిల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 16 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అయినప్పటికీ.. అయ్యర్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. భారీ లక్ష్యాన్ని గిల్ సులువుగానే చేజ్ చేయగలిగాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని సునాయాసంగా ఎదుర్కొన్నాడు.. ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. ఒత్తిడికి గురి కాలేదు. దీంతో గిల్ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

గిల్ కనుక ఇలానే ఆడితే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియాకు తిరుగుండదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అతడి నాయకత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న జట్ల నాయకులను పరిశీలిస్తే గిల్ మాత్రమే సమర్థవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు.. జట్టును సమర్థవంతమైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నాడు. అతడు తన జోరు ఇలాగే కొనసాగిస్తే టీమిండియా 2023లో కోల్పోయిన అవకాశాన్ని మళ్లీ అందిపుచ్చుకొని.. ట్రాఫిక్ గెలిచే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. చూడాలి మరి గిల్ ఏం చేస్తాడో..

బ్రేకులు లేని బుల్డోజర్ లా గిల్.. టీమిండియా సారధిగా సరికొత్త రికార్డు

Shubman Gill New Record
Shubman Gill New Record

Shubman Gill New Record: టీమిండియా వన్డే సారథి గిల్ దూసుకుపోతున్నాడు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో అదరగొట్టిన అతడు.. అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ ముందు తన మీద అంచనాలను అమాంతం పెంచేసుకుంటున్నాడు.. దీంతో భారత మేనేజ్మెంట్ ఉత్సాహంతో కనిపిస్తోంది.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో గిల్ సత్తా చూపించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 88* పరుగులు చేశాడు గిల్.

సరికొత్త రికార్డు

88 పరుగులు చేసిన గిల్ తన పేరు మీద అద్భుతమైన రికార్డును లిఖించుకున్నాడు.. వన్డే ఫార్మేట్ లో టీం ఇండియా తరఫునుంచి అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.. 62 ఇన్నింగ్స్ లలో అతడు 3000 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అతడు రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా కొనసాగుతున్నాడు.. కేవలం 57 ఇన్నింగ్స్లలో ఆమ్లా 3 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. గిల్ 1000 పరుగులు సాధించడానికి 19 ఇన్నింగ్స్ లు.. రెండు వేల పరుగులు సాధించడానికి 38 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి.

కొంతకాలంగా గిల్ స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు.. అద్భుతమైన టెక్నిక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ లో అతడు ఆడిన తీరే దీనికి బలమైన నిదర్శనం.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో కూడా గిల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 16 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అయినప్పటికీ.. అయ్యర్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. భారీ లక్ష్యాన్ని గిల్ సులువుగానే చేజ్ చేయగలిగాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని సునాయాసంగా ఎదుర్కొన్నాడు.. ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. ఒత్తిడికి గురి కాలేదు. దీంతో గిల్ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

గిల్ కనుక ఇలానే ఆడితే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియాకు తిరుగుండదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అతడి నాయకత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న జట్ల నాయకులను పరిశీలిస్తే గిల్ మాత్రమే సమర్థవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు.. జట్టును సమర్థవంతమైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నాడు. అతడు తన జోరు ఇలాగే కొనసాగిస్తే టీమిండియా 2023లో కోల్పోయిన అవకాశాన్ని మళ్లీ అందిపుచ్చుకొని.. ట్రాఫిక్ గెలిచే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. చూడాలి మరి గిల్ ఏం చేస్తాడో..

కోటి కోట్ల మస్క్.. అతడి సంపద ప్రపంచం మొత్తం పంచితే ఎంత వస్తుందో తెలుసా..

Elon Musk Net Worth
Elon Musk Net Worth

Elon Musk Net Worth: టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు మస్క్ ఇటీవల అతడు ఐపిఓ ద్వారా నిధులు సేకరించాడు. తద్వారా కోటికోట్లకు తన ఆస్తులను పెంచుకున్నాడు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అయిపోయాడు. వాస్తవానికి అతని దరిదాపుల్లో ఏ వ్యాపారి కూడా లేడు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే స్పేస్లో అతడికి పోటీ లేదు. అంతటి నాసాకు కూడా అతడే సహకారం అందించాల్సి వస్తోంది. పైగా స్పేస్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి అడుగుపెట్టిన మస్క్.. భారీగా సంపాదిస్తున్నాడు.

మస్క్ కోటి కోట్లకు తన ఆస్తులను పెంచుకున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఒకవేళ అతడి సంపద మొత్తం ప్రపంచం మొత్తం పంచితే ఒక్కొక్కరికి 11600 వస్తాయి. ఒకవేళ అతడు సంపాదించిన సంపాదన మీద వెల్త్ టాక్స్ గనుక వేస్తే ప్రపంచంలో దాదాపు 80 కోట్ల మంది పేదరికం తీరుతుంది. అంతేకాదు.. వారికి సరికొత్త జీవితాన్ని కూడా అందించవచ్చు. విద్య, వైద్యం, ఇంకా అనేక విభాగాలలో వారికి శిక్షణ ఇవ్వవచ్చు.

ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో 75% సంపాద కేవలం 56,000 మంది వద్ద మాత్రమే ఉంది. వీరంతా కూడా వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదించారు. కరోనా తర్వాత వీరి వ్యాపారాలు మరింత పెరిగాయి. విభిన్న రంగాలలో ప్రవేశించడం ద్వారా వీరు తమ ఆస్తులను మరింతగా పెంచుకున్నారు. అయితే సంపద వీరి వద్ద మాత్రమే పోగుపడుతున్న నేపథ్యంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందువల్లే ఆర్థిక నిపుణులు ఇటువంటి విధానాలు మంచివి కావు అని చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు సంపద వికేంద్రీకరణ జరగాలని.. అప్పుడే ఆర్థిక అసమానతలు లేని సమాజం ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.

మస్క్ తాను మాత్రమే కోటీశ్వరుడు కాలేదు.. తన సంస్థలో పనిచేసే కొంతమందిని కూడా కోటీశ్వరులను చేశాడు. దీనికి ప్రధాన కారణం ఆ ఉద్యోగులకు షేర్లు కేటాయించడమే. ఐపీఓ కు వెళ్లడం ద్వారా మాస్క్ తన ఆదాయాన్ని భారీగా పెంచుకున్నాడు. షేర్ విలువ కూడా పెరిగిపోవడంతో.. షేర్లు కేటాయించిన ఉద్యోగులు కోటీశ్వరులు అయిపోయారు. అయితే వారంతా కూడా మస్క్ కంపెనీలలో ఎప్పటి నుంచే పని చేస్తున్నారు. అందువల్లే మస్క్ వారికి షేర్లు కేటాయించాడు.

జీ-7 వేదికపై కీలక భేటీ.. ట్రంప్‌తో మోదీ సమావేశం!

G7 trump modi

G7 Summit 2026 : ప్రపంచ వేదికపై మరో ఆసక్తికర సమావేశం జరగబోతోంది. పశి‍్చమాసియాకు చెందిన సంపన్న దేశాలు జీ-7 సమావేశం జూన్‌ 17న ఫ్రాన్స్‌లో జరుగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం ఒక వ్యూహాత్మక సంభాషణగా మారే అవకాశం ఉంది. చివరిసారిగా వీరు గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్‌టన్‌లో సమావేశమయ్యారు.

భద్రత, సమన్వయంపై చర్చ..?
ఈ భేటీకి ప్రధాన నేపథ్యం పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులే. హర్మూజ్ జలసంధిలోని వాణిజ్య మార్గాల భద్రత, నౌకల సంరక్షణ, చమురు రవాణా పరిణామాలపై అమెరికా ఆందోళనలు తీవ్రంగా ఉన్నప్పటికీ, భారత్ కూడా ఈ ప్రాంతంలోని తన ప్రయోజనాలు, పౌరుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల హర్మూజ్‌లో ప్రయాణించే వాణిజ్య నౌకలపై అమెరికా ఆదేశాల కట్టుబాటును స్పష్టం చేయగా, ఇరాన్ చమురు అక్రమ రవాణాను అంగీకరించబడదని హెచ్చరించాడు. దీనిని భారత విదేశాంగ మంత్రి జయంత్ సిన్హా (జైశంకర్)తో చర్చించిన సమయంలో భారత అపార్థాలు, హామీలు వంటి అంశాలు వికసించాయి. భారతీయ నౌకలపై దాడుల విషయంలో భారత్ నిరసనను రూబియో దృష్టికి తీసుకెళ్లారు.

వ్యూహాత్మక అంశాలపై..
ఈ ముఖాముఖి సమావేశం సామాన్య ఇంధన సరఫరా, వాణిజ్య రక్షణా అంశాలకే కాకుండా భారత-అమెరికా సంబంధాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ నియమానికి చెందిన సుస్థిర విధానాల వెనుక, భారత్ బహుళ దశాబ్దాల వాణిజ్య, రక్షణ సహకారాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిందే. హర్మూజ్ మార్గంలో ప్రయాణించే భారత నౌకలకు ప్రత్యేక రక్షణ హామీలు. ఇంధన సరఫరా క్లిష్టతలు ఎదుర్కొనే విధానాల్లో చేర్పులు. ద్వైపాక్షిక ఆర్థిక పెట్టుబడుల, టెక్నికల్ కోఆపరేషన్ మరింత విస్తరించడం గురించి చర్చిస్తారని తెలుస్తోంది.

స్పష్టమైన కమ్యూనికేషన్లు, ప్రాంతీయ భద్రతా కదలికలకు సంసిద్ధకరమైన రూట్ మ్యాప్స్, వాణిజ్య నౌకల రక్షణకు సంబంధించిన నిబంధనలపై సంయుక్త విధాన సూచనలు. అయితే ఈ అంశాలన్ని పత్రంగా మారనప్పుడు, వాటి అమలు పధ్ధతులు, కాలవిధులు, మరియు పర్యవేక్షణకు సంబంధించిన మెకానిజమ్‌లు స్పష్టంగా ఉండాలి.

నేటితరం ఆడపిల్లలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు..

Why Girls Mature Early
Why Girls Mature Early

Why Girls Mature Early: వాతావరణం మార్పులతో కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మనం తినే ఆహారం, వీచే గాలి కలుషితం కావడంతో చిన్న వయసులోనే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో రుతుక్రమం ప్రారంభమయ్యే వయస్సు క్రమంగా తగ్గిపోతుండటం వైద్య నిపుణులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో సాధారణంగా 13 నుంచి14 ఏళ్ల వయస్సులో ప్రారంభమయ్యే రుతుక్రమం, ప్రస్తుతం చాలా మంది బాలికల్లో 11 నుంచి12 ఏళ్ల వయస్సుకే మొదలవుతోంది. అసలు ఈ సమస్యలు కావడానికి కారణం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కొన్ని పరిశోధనల ప్రకారం …2000 తర్వాత జన్మించిన బాలికలు సగటున 11.9 ఏళ్ల వయస్సులోనే యుక్తవయస్సు దశలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అందుకు ఆధునిక జీవనశైలి ఈ మార్పులకు ప్రధాన కారణంగా వైద్యులు భావిస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్కువసేపు ఇంట్లోనే గడపడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, రుతుక్రమం త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా బాలికల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాతావరణంలో ఉండే కొన్ని రసాయన కణాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి యుక్తవయస్సు దశను ముందుగానే ప్రారంభించే ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల్లో మిగిలిపోయే పురుగుమందుల అవశేషాలు కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ రసాయనాల్లో కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ (Endocrine Disruptors) గా పనిచేస్తాయి. అంటే ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసి ఎదుగుదల ప్రక్రియను వేగవంతం చేయగలవు.

శారీరకంగా త్వరగా మెచ్యూర్ కావడం మాత్రమే కాదు, దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న వయస్సులోనే శరీరంలో మార్పులు రావడంతో కొందరు బాలికలు ఆందోళన, ఆత్మన్యూనత భావం, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, ఈ మార్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం.

తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలకు సమతుల ఆహారం అందించడం, రోజూ వ్యాయామం లేదా ఆటలు ఆడేలా ప్రోత్సహించడం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం, పండ్లు-కూరగాయలను బాగా శుభ్రపరిచి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిల్లల్లో రుతుక్రమం, శారీరక ఎదుగుదల, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను గమనిస్తూ అవసరమైతే పిల్లల వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

అయితే ప్రతి బాలికలో త్వరగా రుతుక్రమం ప్రారంభమవడం అనేది తప్పనిసరిగా వ్యాధి సంకేతం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జన్యుపరమైన అంశాలు, కుటుంబ నేపథ్యం, పోషకాహారం వంటి అనేక అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. కానీ చాలా చిన్న వయస్సులోనే యుక్తవయస్సు లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్య సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మగాళ్ళకే కాదు.. మగ సింహాలకు కూడా రాలిపోతోంది..

Male Lion Mane Loss
Male Lion Mane Loss

Male Lion Mane Loss: పాతికేళ్లకే తెల్ల జుట్టు వస్తోంది. 30 సంవత్సరాలకే ఉన్న జుట్టు ఊడిపోతుంది. 35 ఏళ్లకే అంకుల్ అని పిలిపించుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో సగటు మగాళ్ల పరిస్థితి ఇలా మారిపోయింది. చదువు పూర్తికాకముందే 60, 70 లలో రావాల్సిన తెల్ల జుట్టు వస్తోంది. దానిని కవర్ చేయడానికి నలుపు రంగు వేసుకోవాల్సి వస్తోంది.

ఎలాగోలా కవర్ చేసినప్పటికీ.. మళ్లీ ఇంకో సమస్య ఎదురవుతోంది. ఉన్న ఆ కాస్త జుట్టు కూడా ఊడిపోతుంది. స్నానం చేస్తున్నప్పుడు.. నెత్తి దువ్వుకుంటున్నప్పుడు చేతికి వస్తున్న వెంట్రుకలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇలా చూస్తుండగానే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి బట్ట తల కనిపిస్తోంది. దానికి కవర్ చేయడానికి క్యాప్ లేదా విగ్గు వాడాల్సి వస్తోంది. ఈ సమస్య మగాళ్ళకు మాత్రమే కాదు.. మగ సింహాలకు కూడా ఉంది. మగాళ్ళకు ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయి.. కానీ మగ సింహాలకు ఎందుకు జుట్టు ఊడిపోతుంది అనేకదా మీ డౌటు.. దీనికి సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగు చూసింది.

కేవలం మనుషులకు మాత్రమే కాదు అడవికి రాజు అయిన సింహానికి కూడా జుట్టు ఊడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దట్టమైన జుట్టుతో గంభీరమైన ముఖంతో కనిపించాల్సిన ఒక సింహం.. తలపై జుట్టు ఊడిపోవడంతో అంకుల్ లుక్ లోకి వచ్చేసింది. వయసు పైబడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోవడం.. తక్కువ స్థాయిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కావడం.. పోషకాహార లోపం.. విపరీతమైన వేడి వల్ల సింహాలు జుట్టును కోల్పోతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మిన్నే సోటా పరిశోధకులు ఇటీవల ఈ సింహాల గురించి అధ్యయనం చేశారు. అనేక అంశాలను పరిశీలించారు. చివరికి జుట్టు ఊడిపోవడానికి అసలు కారణాలను విశ్లేషించారు.

మనుషులంటే విగ్గులు పెట్టుకుంటారు. రంగులు వేసుకుంటారు. కానీ, సింహాలు అలా కాదు. జుట్టు ఊడిపోతే సింహాలకు విగ్గు పెట్టుకునే అవకాశం ఉండదు. కనీసం కవర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. అడవికి రాజు అనే మాటగాని.. జుట్టు ఊడిపోతే సింహాన్ని మిగతా జంతువులు రాజుగా ఎలా పరిగణిస్తాయి.. జుట్టు ఉంటేనే సింహానికి అందం. పైగా అది వేటాడుతుంటే జుట్టు మొత్తం గాలికి ఎగురుతుంటుంది. అప్పుడు సింహం సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోతుంటే.. సింహం ముఖం మారిపోతుంటే.. అది అడవికి రాజు ఎలా అవుతుంది.. జుట్టు ఊడిపోతే సింహం ముఖమే మారిపోతుంది. అలాంటప్పుడు సింహం కనిపిస్తే భయపడకుండా.. మిగతా జంతువులు వ్యవహరిస్తాయి. అంతేకాదు, హే అంకుల్ వచ్చాడు అంటూ ట్రోల్ చేస్తాయి. ఇందులో డౌటే లేదు.

నేడు ట్రంప్ బర్త్ డే.. ముసలోడే కానీ విలాస పురుషుడు.. వైట్ హౌస్ లో ఏం చేస్తున్నాడో తెలుసా..

donald-trump-80th-birthday-white-house-grand-celebration

Trump 80th Birthday నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 80వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. తన జన్మదినాన్ని పురస్కరించుకొని వైట్ హౌస్ లో అంగరంగ వైభవంగా ట్రంప్ వేడుకలు జరుపుకుంటున్నాడు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా చేసుకోలేని విధంగా తన జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాడు.

గ్లోబల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వైట్ హౌస్ లో ది క్లా పేరుతో భారీ కేజ్ ఫైట్ నిర్వహించబోతున్నారు. వివిధ ఫైటర్లతో ట్రంప్ ఏడు మ్యాచ్లు ఆడ బోతున్నాడు. అయితే ఇవి కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్లు మాత్రమే. మొత్తంగా ట్రంప్ జన్మదిన వేడుకకు 4000 మంది అతిథులకు ఆహ్వానం అందింది. మొత్తంగా 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. యు ఎఫ్ సి పి ఖర్చు మొత్తం భరిస్తోంది.

ఇటీవల కాలంలో ట్రంపు పరిపాలన మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ట్రంప్ దిగి పోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఇటీవల కాలంలో అమెరికా తనకు అవసరం లేకపోయినప్పటికీ యుద్ధాలు చేయడం వల్ల ప్రజలు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. అమెరికాలో విపరీతంగా ధరలు పెరిగిపోవడం వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. యుద్ధం చేయడం వల్ల వాటి భారాన్ని అమెరికా ప్రభుత్వం ప్రజల మీద వేధిస్తోంది. అన్నింటి మీద అక్కడ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అక్కడ ఉద్యోగాలు కూడా సక్రమంగా అందడం లేదు. నిరుద్యోగశాతం పెరిగిపోవడంతో అక్కడి ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదు.

ట్రంప్ తన మీద వస్తున్న విమర్శలను డైవర్ట్ చేసుకోవడానికి ఈ స్థాయిలో జన్మదిన వేడుకలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 80 సంవత్సరాల పడిలోకి అడుగుపెడుతున్న ట్రంప్.. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుంచుకునే విధంగా జరుపుకుంటున్నాడు. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. వచ్చే అతిధులకు ఖరీదైన కానుకలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. వారందరికీ సపరేట్ డ్రెస్ కోడ్ కూడా నిర్ణయించారు. ఏడుగురు ఫైటర్లతో మ్యాచులు ఆడిన తర్వాత.. ప్రత్యేకంగా రూపొందించిన కేక్ ను ట్రంప్ కట్ చేస్తారు. ఆ తర్వాత అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు. మరోవైపు ట్రూత్ సోషల్ లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జన్మదినం సందర్భంగా ఇరాన్ ఒప్పందం కుదరచుకుంటుందని.. ఇప్పటికే ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. అయితే ఇరాన్ ఇంతవరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

మొరాకో కొట్టిన దెబ్బ అలాంటిది మరి.. పాపం బ్రెజిల్

Morocco vs Brazil

FIFA 2026 Morocco vs Brazil : ఫిఫా లో ఇప్పటివరకు సంచలనాలు నమోదు కాలేదు. కానీ మొరాకో చేసి చూపించింది.. దీంతో ఫిఫా కప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పరిస్థితి దారుణంగా మారింది.. బ్రెజిల్ జట్టును మొరాకో నిలువరించి చుక్కలు చూపించింది.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరుగుతుందని.. బ్రెజిల్ ఘన విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను మొరాకో తలకిందులు చేసింది.

17 సార్లు విజేత

ఫిఫా లో బ్రెజిల్ 17 సార్లు విజేత.. 1934 నుంచి ఆ జట్టు ఫిఫాలో ఇప్పటివరకు సత్తా చూపిస్తూనే ఉంది. 17 సార్లు ట్రోఫీలు అందుకుందంటే ఆ జట్టులో ఆటగాళ్ల స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.. అయితే ఆ జట్టులో కీలకమైన ఆటగాడు నెయ్ మార్ లేడు. గాయం వల్ల అతడు కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉంటాడని మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతడు లేకుండానే బ్రెజిల్ రంగంలోకి దిగింది. అయితే మొరాకో ఇచ్చిన షాక్ కు బ్రెజిల్ కు దిమ్మ తిరిగిపోయింది.

మొరాకోతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ నిర్ణీత సమయంలో ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. మొరాకో కూడా ఒకే ఒక్క గోల్ చేయగలిగింది. మరోవైపు బ్రెజిల్ ఆటగాళ్లు ఇంకో గోల్ చేయకుండా మొరాకో ప్లేయర్లు అడ్డుకోగలిగారు. గోల్ పోస్ట్ మీద పదేపదే దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ మొరాకో ప్లేయర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు.. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయింది.

ఈ మ్యాచ్ డ్రా అయింది అనేకంటే బ్రెజిల్ ఓడిపోయింది అని చెప్పడం సబబు. ఎందుకంటే ఆట తీరు.. అటాకింగ్.. డిఫెన్స్.. బాల్ పాసింగ్.. ఇలా ఏ విషయంలో కూడా మొరాకో బ్రెజిల్ జట్టుతో సరితూగదు.. కానీ మొరాకో జట్టు అంచనాలకు మించి ఆకట్టుకుంది. ఆ జట్టు ప్లేయర్లు అవిశ్రాంతంగా పోరాటాన్ని సాగించారు. మైదానంలో కట్టుదిట్టంగా కదిలారు. బ్రెజిల్ ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అదరగొట్టారు. ఫలితంగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్.. చివరికి డ్రా అయింది. అంతేకాదు బ్రెజిల్ ఆశల మీద నీళ్లు చల్లింది. సంచలన ఆట తీరితో ఆకట్టుకున్న మొరాకో.. ఆ దేశ అభిమానుల ప్రేమను చూరగొన్నది.