Home Blog Page 131

నేటితరం ఆడపిల్లలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు..

Why Girls Mature Early
Why Girls Mature Early

Why Girls Mature Early: వాతావరణం మార్పులతో కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మనం తినే ఆహారం, వీచే గాలి కలుషితం కావడంతో చిన్న వయసులోనే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో రుతుక్రమం ప్రారంభమయ్యే వయస్సు క్రమంగా తగ్గిపోతుండటం వైద్య నిపుణులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో సాధారణంగా 13 నుంచి14 ఏళ్ల వయస్సులో ప్రారంభమయ్యే రుతుక్రమం, ప్రస్తుతం చాలా మంది బాలికల్లో 11 నుంచి12 ఏళ్ల వయస్సుకే మొదలవుతోంది. అసలు ఈ సమస్యలు కావడానికి కారణం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కొన్ని పరిశోధనల ప్రకారం …2000 తర్వాత జన్మించిన బాలికలు సగటున 11.9 ఏళ్ల వయస్సులోనే యుక్తవయస్సు దశలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అందుకు ఆధునిక జీవనశైలి ఈ మార్పులకు ప్రధాన కారణంగా వైద్యులు భావిస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్కువసేపు ఇంట్లోనే గడపడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, రుతుక్రమం త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా బాలికల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాతావరణంలో ఉండే కొన్ని రసాయన కణాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి యుక్తవయస్సు దశను ముందుగానే ప్రారంభించే ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల్లో మిగిలిపోయే పురుగుమందుల అవశేషాలు కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ రసాయనాల్లో కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ (Endocrine Disruptors) గా పనిచేస్తాయి. అంటే ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసి ఎదుగుదల ప్రక్రియను వేగవంతం చేయగలవు.

శారీరకంగా త్వరగా మెచ్యూర్ కావడం మాత్రమే కాదు, దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న వయస్సులోనే శరీరంలో మార్పులు రావడంతో కొందరు బాలికలు ఆందోళన, ఆత్మన్యూనత భావం, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, ఈ మార్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం.

తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలకు సమతుల ఆహారం అందించడం, రోజూ వ్యాయామం లేదా ఆటలు ఆడేలా ప్రోత్సహించడం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం, పండ్లు-కూరగాయలను బాగా శుభ్రపరిచి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిల్లల్లో రుతుక్రమం, శారీరక ఎదుగుదల, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను గమనిస్తూ అవసరమైతే పిల్లల వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

అయితే ప్రతి బాలికలో త్వరగా రుతుక్రమం ప్రారంభమవడం అనేది తప్పనిసరిగా వ్యాధి సంకేతం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జన్యుపరమైన అంశాలు, కుటుంబ నేపథ్యం, పోషకాహారం వంటి అనేక అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. కానీ చాలా చిన్న వయస్సులోనే యుక్తవయస్సు లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్య సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మగాళ్ళకే కాదు.. మగ సింహాలకు కూడా రాలిపోతోంది..

Male Lion Mane Loss
Male Lion Mane Loss

Male Lion Mane Loss: పాతికేళ్లకే తెల్ల జుట్టు వస్తోంది. 30 సంవత్సరాలకే ఉన్న జుట్టు ఊడిపోతుంది. 35 ఏళ్లకే అంకుల్ అని పిలిపించుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో సగటు మగాళ్ల పరిస్థితి ఇలా మారిపోయింది. చదువు పూర్తికాకముందే 60, 70 లలో రావాల్సిన తెల్ల జుట్టు వస్తోంది. దానిని కవర్ చేయడానికి నలుపు రంగు వేసుకోవాల్సి వస్తోంది.

ఎలాగోలా కవర్ చేసినప్పటికీ.. మళ్లీ ఇంకో సమస్య ఎదురవుతోంది. ఉన్న ఆ కాస్త జుట్టు కూడా ఊడిపోతుంది. స్నానం చేస్తున్నప్పుడు.. నెత్తి దువ్వుకుంటున్నప్పుడు చేతికి వస్తున్న వెంట్రుకలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇలా చూస్తుండగానే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి బట్ట తల కనిపిస్తోంది. దానికి కవర్ చేయడానికి క్యాప్ లేదా విగ్గు వాడాల్సి వస్తోంది. ఈ సమస్య మగాళ్ళకు మాత్రమే కాదు.. మగ సింహాలకు కూడా ఉంది. మగాళ్ళకు ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయి.. కానీ మగ సింహాలకు ఎందుకు జుట్టు ఊడిపోతుంది అనేకదా మీ డౌటు.. దీనికి సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగు చూసింది.

కేవలం మనుషులకు మాత్రమే కాదు అడవికి రాజు అయిన సింహానికి కూడా జుట్టు ఊడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దట్టమైన జుట్టుతో గంభీరమైన ముఖంతో కనిపించాల్సిన ఒక సింహం.. తలపై జుట్టు ఊడిపోవడంతో అంకుల్ లుక్ లోకి వచ్చేసింది. వయసు పైబడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోవడం.. తక్కువ స్థాయిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కావడం.. పోషకాహార లోపం.. విపరీతమైన వేడి వల్ల సింహాలు జుట్టును కోల్పోతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మిన్నే సోటా పరిశోధకులు ఇటీవల ఈ సింహాల గురించి అధ్యయనం చేశారు. అనేక అంశాలను పరిశీలించారు. చివరికి జుట్టు ఊడిపోవడానికి అసలు కారణాలను విశ్లేషించారు.

మనుషులంటే విగ్గులు పెట్టుకుంటారు. రంగులు వేసుకుంటారు. కానీ, సింహాలు అలా కాదు. జుట్టు ఊడిపోతే సింహాలకు విగ్గు పెట్టుకునే అవకాశం ఉండదు. కనీసం కవర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. అడవికి రాజు అనే మాటగాని.. జుట్టు ఊడిపోతే సింహాన్ని మిగతా జంతువులు రాజుగా ఎలా పరిగణిస్తాయి.. జుట్టు ఉంటేనే సింహానికి అందం. పైగా అది వేటాడుతుంటే జుట్టు మొత్తం గాలికి ఎగురుతుంటుంది. అప్పుడు సింహం సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోతుంటే.. సింహం ముఖం మారిపోతుంటే.. అది అడవికి రాజు ఎలా అవుతుంది.. జుట్టు ఊడిపోతే సింహం ముఖమే మారిపోతుంది. అలాంటప్పుడు సింహం కనిపిస్తే భయపడకుండా.. మిగతా జంతువులు వ్యవహరిస్తాయి. అంతేకాదు, హే అంకుల్ వచ్చాడు అంటూ ట్రోల్ చేస్తాయి. ఇందులో డౌటే లేదు.

నేడు ట్రంప్ బర్త్ డే.. ముసలోడే కానీ విలాస పురుషుడు.. వైట్ హౌస్ లో ఏం చేస్తున్నాడో తెలుసా..

donald-trump-80th-birthday-white-house-grand-celebration

Trump 80th Birthday నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 80వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. తన జన్మదినాన్ని పురస్కరించుకొని వైట్ హౌస్ లో అంగరంగ వైభవంగా ట్రంప్ వేడుకలు జరుపుకుంటున్నాడు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా చేసుకోలేని విధంగా తన జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాడు.

గ్లోబల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వైట్ హౌస్ లో ది క్లా పేరుతో భారీ కేజ్ ఫైట్ నిర్వహించబోతున్నారు. వివిధ ఫైటర్లతో ట్రంప్ ఏడు మ్యాచ్లు ఆడ బోతున్నాడు. అయితే ఇవి కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్లు మాత్రమే. మొత్తంగా ట్రంప్ జన్మదిన వేడుకకు 4000 మంది అతిథులకు ఆహ్వానం అందింది. మొత్తంగా 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. యు ఎఫ్ సి పి ఖర్చు మొత్తం భరిస్తోంది.

ఇటీవల కాలంలో ట్రంపు పరిపాలన మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ట్రంప్ దిగి పోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఇటీవల కాలంలో అమెరికా తనకు అవసరం లేకపోయినప్పటికీ యుద్ధాలు చేయడం వల్ల ప్రజలు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. అమెరికాలో విపరీతంగా ధరలు పెరిగిపోవడం వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. యుద్ధం చేయడం వల్ల వాటి భారాన్ని అమెరికా ప్రభుత్వం ప్రజల మీద వేధిస్తోంది. అన్నింటి మీద అక్కడ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అక్కడ ఉద్యోగాలు కూడా సక్రమంగా అందడం లేదు. నిరుద్యోగశాతం పెరిగిపోవడంతో అక్కడి ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదు.

ట్రంప్ తన మీద వస్తున్న విమర్శలను డైవర్ట్ చేసుకోవడానికి ఈ స్థాయిలో జన్మదిన వేడుకలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 80 సంవత్సరాల పడిలోకి అడుగుపెడుతున్న ట్రంప్.. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుంచుకునే విధంగా జరుపుకుంటున్నాడు. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. వచ్చే అతిధులకు ఖరీదైన కానుకలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. వారందరికీ సపరేట్ డ్రెస్ కోడ్ కూడా నిర్ణయించారు. ఏడుగురు ఫైటర్లతో మ్యాచులు ఆడిన తర్వాత.. ప్రత్యేకంగా రూపొందించిన కేక్ ను ట్రంప్ కట్ చేస్తారు. ఆ తర్వాత అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు. మరోవైపు ట్రూత్ సోషల్ లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జన్మదినం సందర్భంగా ఇరాన్ ఒప్పందం కుదరచుకుంటుందని.. ఇప్పటికే ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. అయితే ఇరాన్ ఇంతవరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

మొరాకో కొట్టిన దెబ్బ అలాంటిది మరి.. పాపం బ్రెజిల్

Morocco vs Brazil

FIFA 2026 Morocco vs Brazil : ఫిఫా లో ఇప్పటివరకు సంచలనాలు నమోదు కాలేదు. కానీ మొరాకో చేసి చూపించింది.. దీంతో ఫిఫా కప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పరిస్థితి దారుణంగా మారింది.. బ్రెజిల్ జట్టును మొరాకో నిలువరించి చుక్కలు చూపించింది.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరుగుతుందని.. బ్రెజిల్ ఘన విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను మొరాకో తలకిందులు చేసింది.

17 సార్లు విజేత

ఫిఫా లో బ్రెజిల్ 17 సార్లు విజేత.. 1934 నుంచి ఆ జట్టు ఫిఫాలో ఇప్పటివరకు సత్తా చూపిస్తూనే ఉంది. 17 సార్లు ట్రోఫీలు అందుకుందంటే ఆ జట్టులో ఆటగాళ్ల స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.. అయితే ఆ జట్టులో కీలకమైన ఆటగాడు నెయ్ మార్ లేడు. గాయం వల్ల అతడు కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉంటాడని మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతడు లేకుండానే బ్రెజిల్ రంగంలోకి దిగింది. అయితే మొరాకో ఇచ్చిన షాక్ కు బ్రెజిల్ కు దిమ్మ తిరిగిపోయింది.

మొరాకోతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ నిర్ణీత సమయంలో ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. మొరాకో కూడా ఒకే ఒక్క గోల్ చేయగలిగింది. మరోవైపు బ్రెజిల్ ఆటగాళ్లు ఇంకో గోల్ చేయకుండా మొరాకో ప్లేయర్లు అడ్డుకోగలిగారు. గోల్ పోస్ట్ మీద పదేపదే దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ మొరాకో ప్లేయర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు.. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయింది.

ఈ మ్యాచ్ డ్రా అయింది అనేకంటే బ్రెజిల్ ఓడిపోయింది అని చెప్పడం సబబు. ఎందుకంటే ఆట తీరు.. అటాకింగ్.. డిఫెన్స్.. బాల్ పాసింగ్.. ఇలా ఏ విషయంలో కూడా మొరాకో బ్రెజిల్ జట్టుతో సరితూగదు.. కానీ మొరాకో జట్టు అంచనాలకు మించి ఆకట్టుకుంది. ఆ జట్టు ప్లేయర్లు అవిశ్రాంతంగా పోరాటాన్ని సాగించారు. మైదానంలో కట్టుదిట్టంగా కదిలారు. బ్రెజిల్ ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అదరగొట్టారు. ఫలితంగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్.. చివరికి డ్రా అయింది. అంతేకాదు బ్రెజిల్ ఆశల మీద నీళ్లు చల్లింది. సంచలన ఆట తీరితో ఆకట్టుకున్న మొరాకో.. ఆ దేశ అభిమానుల ప్రేమను చూరగొన్నది.

పాకిస్తానే కదా.. అలసత్వం వద్దు.. హర్మన్ సేన చేయాల్సింది అదే..

IND vs PAK Women

IND vs PAK : టి20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో భారత మహిళలు ఆదివారం పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్లో భారత జట్టు మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళల క్రికెట్లో పాకిస్తాన్ జట్టు భారతదేశం తో ఏ మాత్రం పోటీ పడలేదు. రికార్డులు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. కానీ సంచలన ఆట తీరుకు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఆ జట్టు ఈ క్షణంలో ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. అందువల్లే హర్మన్ సేన ఏమాత్రం నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు ఆదిలోనే బ్రేక్ వేయాలి. బౌలర్లను ఒక ఆట ఆడుకోవాలి. అలా అయితేనే భారత్ లో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.

కొద్దిరోజులుగా భారత మహిళల జట్టు ఇంగ్లాండ్లోనే ఉంటున్నది. టి20 వరల్డ్ కప్ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టుతో భారత మహిళలు టి20 టోర్నీ ఆడారు. ఆ టోర్నీలో ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు. ఇంగ్లాండ్ మైదానాల ముందు భారత మహిళలు తేలిపోయారు. ముఖ్యంగా స్మృతి.. హర్మన్.. రిచా.. జమీమాంటివారు తమ స్థాయిలో ఆడలేకపోయారు. ఈ నేపథ్యంలో జరిగే మ్యాచ్లో వీరు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్లో కాస్త మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. టి20 వరల్డ్ కప్ సాధించాలంటే ఇది సరిపోదు.

పాకిస్తాన్ జట్టుతో భారత్ ఆడిన మ్యాచ్లను ఒకసారి పరిశీలిస్తే.. టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు పాకిస్తాన్, భారత్ 8 సార్లు తలపడ్డాయి.. ఇందులో భారత్ ఆరుసార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ రెండుసార్లు విషయాలు అందుకుంది. మొత్తం టి20 లలో భారత్, పాకిస్తాన్ 16 సార్లు పోటీపడ్డాయి. ఇందులో భారత్ 13 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ మూడుసార్లు గెలుపును సొంతం చేసుకుంది.

మొత్తంగా చూస్తే భారత జట్టుది పై చేయి లాగా కనిపిస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ జట్టును అంత సులభంగా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆ జట్టు ప్లేయర్లు ఎప్పుడు ఎలా ఆడతారు ఎవరికి తెలియదు. పైగా భారత్ అంటే పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చిపోతారు. కొన్ని సందర్భాలలో అనితర సాధ్యమైన అటుతీరుతో ఆకట్టుకుంటారు. అలాంటప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లకు భారత్ ప్లేయర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. భారత జట్టులో శపాలి, స్మృతి, యస్తిక, జమీమా, రిచా, క్రాంతి, దీప్తి, శ్రీ చరణి వంటి వారు ఉన్నారు.. ఇంగ్లాండ్ గడ్డమీద వీరు సత్తా చూపిస్తే టీమిండియా కు అడ్డు అనేది ఉండదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతుంది.

45 రోజుల కష్టం..లక్షల రూపాయిలు వృధా.. కన్నీళ్లు పెట్టుకున్న తమన్..

OG 2 Thaman Controversy
OG 2 Thaman Controversy

Thaman OG Tour : టాలీవుడ్ క్రేజీ  మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గత కొంతకాలం నుండి ‘ఓజీ టూర్’ అనే లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్స్ ని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటికి మ్యూజిక్ లవర్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నేడు ఆయన ఈ ‘ఓజీ టూర్’ ని హైదరాబాద్ లో నిర్వహించాలని అనుకున్నాడు. అందుకోసం కొన్ని రోజుల క్రితం ఆయన ఒక భారీ ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు. తమన్ ఫ్యాన్స్ లో కూడా ఈ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ పై ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఎంత టిక్కెట్ రేట్ ఉన్నా సరే , కొని వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి కూడా అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కానీ చివరి నిమిషం లో హైదరాబాద్ లో ఏర్పడిన వాతావరణం కారణం గా రద్దు చేయాల్సి వచ్చింది.

ఈ విషయాన్నీ తమన్ తన ట్విట్టర్ వేదిక ద్వారా చాలా ఎమోషనల్ గా ఒక ట్వీట్ వేశాడు , ఆయన మాట్లాడుతూ ‘నాకు , నా 56 మంది టీం సబ్యులకు ఇది గుండెలు ఆగిపోయే వార్త. ఓజీ టూర్ తో గత 45 రోజులుగా విశ్రాంతి లేకుండా పని చేస్తూ , అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ వచ్చాం. మేమంతా ఒక టీం గా పని చేస్తూ , మంచి జోష్ తో ఈ కాన్సర్ట్ ని నివహించడానికి రెడీ అయ్యాం.  కానీ మనం ఒకటి తలిస్తే , దైవం మరొకటి తలుస్తాది అంటారు కదా, నేనెప్పుడూ దేవుడి పట్ల చాలా విశ్వాసంతో ఉంటాను. అదే విధంగా విధిని చాలా గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా మీ ప్రేమ, నమ్మకం. ఈసారి మరింత జోష్ తో ఈ ఓజీ కాన్సర్ట్ ఉంటుంది. నా కం బ్యాక్ ఈసారి మామూలు రేంజ్ లో ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్. ఆయన మాట్లాడిన ఈ మాటల్లో బాధని చూస్తుంటే , ఈ కాన్సర్ట్ పై ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుస్తోంది.

'పంజా' రీ రిలీజ్ థియేటర్స్ లో 'ఓజీ 2' టీజర్..? ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్..

Panjaa Movie Heroine
Panjaa Movie Heroine

Panjaa re release : పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ మంచి రోజులు మొదలైనట్టుగానే అనిపిస్తోంది. ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 100 కోట్ల గ్రాస్ ని క్లోజింగ్ లో అందుకోవడానికి ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. మొదటి రోజుకి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్ కి , క్లోజింగ్ లో 100 కోట్ల గ్రాస్ రావడానికి కష్టం అయ్యిందంటే అభిమానులకు ఎంతటి అవమానం అనేది అర్థం చేసుకోవచ్చు. అంతటి అవమానం తర్వాత ఫ్యాన్స్ కూడా ఇక సినిమాల విషయం లో లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరంగా ఫుల్ బిజీ అవ్వడం , ఈ బిజీ లో ఆయన తదుపరి చిత్రం ఏంటో కూడా క్లారిటీ లేకపోవడమే.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ‘ఓజీ 2’ నే అని , ఈ ఏడాది నవంబర్ నుండే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు అవుతుందని , పవన్ కళ్యాణ్ ఈసారి సుజిత్ కోరినన్ని డేట్స్, భారీ విదేశీ షెడ్యూల్స్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అధికారికంగా టీం నుండి ఖరారు అవ్వడం తో , అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ గురించే చర్చ. లోకల్ మీడియా నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు ఈ సినిమా పై ఆర్టికల్స్ రాయడం వంటివి , చర్చించుకోవడం వంటివి అభిమానులకు చెప్పలేని ఆనందాన్ని కలిగించాయి. ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా , ఓజీ 2 కి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా తెలుపనున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఇదే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ చిత్రం గా నిల్చిన ‘పంజా ‘ రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యింది కానీ, నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో మాత్రం సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. సెప్టెంబర్ 2 న ‘ఓజీ 2’ టీజర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో , కచ్చితంగా ‘పంజా’ చిత్రానికి ఆ టీజర్ ని అటాచ్ చేస్తారనే ఆశలో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఒకవేళ ఇదే జరిగితే ‘పంజా’ రీ రిలీజ్ మొదటి రోజే 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

పెద్ది' చూసిన తర్వాత నిద్ర లేదు.. చరణ్ అసలు నటించలేదు అంటూ చిరంజీవి షాకింగ్ కామెంట్స్..

Chiranjeevi comments on Peddi

Chiranjeevi comments on Peddi గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మూత పడిపోనున్న థియేటర్స్ ని మరోసారి తెరిపించి , జనాల తో కిక్కిరిసిపోయేలా చేసింది. సంక్రాంతి తర్వాత మేకర్స్ కి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం పెద్ద సవాల్ గా మారింది. విడుదలైన ప్రతీ సినిమా డిజాస్టర్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మీద చాలా ఆశలే పెట్టుకున్నారు కానీ , ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. దీంతో ట్రేడ్ ‘పెద్ది’ పై భారీ ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలకు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతుంది. 10 రోజుల్లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి , డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘పది రోజుల నుండి నా కొత్త సినిమా షూటింగ్ పొలాచ్చి లో ఉండడం తో బిజీ గా ఉండడం వల్ల, పెద్ది చిత్రాన్ని చూడలేకపోయాను. నిన్న ఇక్కడికి రాగానే , ఈ సినిమాని చూశాను , చాలా గొప్పగా అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఆ మూడ్ నుండి బయటకు రావడం చాలా కష్టమైంది. అంతటి అద్భుతంగా ఈ చిత్రాన్ని నువ్వు తెరకెక్కించావు. నీ బుర్రలో వచ్చిన గొప్ప ఆలోచనని , వెండితెర మీద ఎమోషనల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యావు. ఈ సినిమాలో చరణ్ అసలు నటించలేదు, జీవించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు అందరూ ముక్తకంఠం తో ‘చరణ్ జీవి’ అని అంటున్నారు సార్ అని చిరంజీవి తో బుచ్చి బాబు చెప్పగా, చిరంజీవి అందుకు కూడా చాలా ఎమోషనల్ గా రెస్పాన్స్ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘చరణ్ నాకు నేషనల్ అవార్డు ని సాధిస్తే ఎంత సంతృప్తి ఇస్తుందో , అంతకు మించిన సంతృప్తిని ఇచ్చేసాడు. ఒక తండ్రి గా , తోటి నటుడిగా ఎంతో గర్వకారణం గా నిలిచాడు. తండ్రిని ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు , ప్రేక్షకులే మాట్లాడేశారు నా బిడ్డ నటన గురించి. ఇక్కడ నాకు పెద్దలు చెప్పిన ఒక సామెత గుర్తుకొస్తుంది. పుత్రోత్సాహం బిడ్డని కన్నప్పుడు కాదు , ఆ బిడ్డ సాధించిన విజయాలను నలుగురు గుర్తించినప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని, దాని అనుభవం చరణ్ నాకు ఎన్నో సార్లు కలిగించేలా చేశాడు ‘ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇంకా ఆయన ఈ ఇంటర్వ్యూ లో ఏమేమి మాట్లాడాడో మీరే చూడండి. మెగా ఫ్యాన్స్ కి ఈ ఇంటర్వ్యూ ఒక విజువల్ ఫీస్ట్ అనుకోవచ్చు.

"బాబు" బంగారం.. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అది.. అపోలో వారసురాలి మాటలకు చప్పట్లు కొట్టాల్సిందే..

_Chandrababu Naidu, Apollo Hospitals, Sangeeta Reddy

Chandrababu Naidu : కొందరి మాటలు విన్నప్పుడు అరే ఇన్నాళ్లు మనకు ఈ విషయం తెలియదే.. అనుకుంటాం. అదేంటి ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోతాం. అది తెలిసిన తర్వాత మనకు తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తుంటాం. అటువంటిదే ఇప్పుడు జరిగింది. అది కాస్త ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టింది.

చంద్రబాబును చాలామంది సీఈవో అంటుంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కంటే.. ఒక రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే వ్యవహరిస్తూ ఉంటారు. ఎకనామిక్స్ బాగా చదువుకున్న ఆయనకు.. డబ్బు విలువ తెలుసు. అందువల్లే రాష్ట్రం బాగుండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు గొప్పగా ఉండాలని తపిస్తూ ఉంటారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బిల్ క్లింటన్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వంటి కార్యాలయాన్ని హైదరాబాద్ వంటి నగరంలో ఏర్పాటు చేయించ గలిగారు. హైదరాబాద్ నగరానికి ఐటీని సరికొత్తగా పరిచయం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ దేశంలోనే రెండవ ఐటి నగరం గా పేరు తెచ్చుకున్నదంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేశాయి.

ఈ విషయాన్ని టిడిపి నేతలు చెబితే కొంతమంది తట్టుకోలేరు.. పైగా నాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ నగరంలో ఐటి పురుడు పోసుకుందని అంటుంటారు. ఇక గులాబీ పార్టీ నాయకుల కైతే చెప్పాల్సిన పనిలేదు. అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. ఆ చరిత్ర నిశితంగా పరిశీలించిన వారికి అది అర్థమవుతుంది.

చంద్రబాబు గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అది తక్కువే అవుతుంది. తాజాగా ఆయనలో ఉన్న మరో కోణాన్ని.. ప్రపంచానికి తెలియని అసలు వాస్తవాన్ని బయటపెట్టారు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ శ్రీ రెడ్డి కుమార్తె సంగీతారెడ్డి. ఈమె అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఓ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పారు.

“ఒకప్పుడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మౌలిక వసతులు లేకుండా ఉండేది. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో బాగు చేశారు. దీనికోసం అపోలో ఆసుపత్రి సహకరించింది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అత్యధిక వసతులతో ఆసుపత్రి రూపురేఖలు మార్చేశారు. ఈ ప్రాజెక్టు ఈ స్థాయిలో విజయవంతం కావడం వెనుక కేవలం మేము మాత్రమే లేము. మమ్మల్ని చంద్రబాబు నిత్యం గైడ్ చేశారు. మాతో మాట్లాడారు. మార్పు వెనుక సలహాలు ఇచ్చారు. ఆయన అనుభవం చాలా గొప్పది. మాలో ఈ స్థాయిలో ఆయన ప్రేరణ కలిగించారు. ఇప్పుడే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. బిల్ క్లింటన్ వంటి వ్యక్తిని హైదరాబాద్ గడ్డమీద కాలు మోపేలా చేశారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు విశాఖ నగరాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ జీవనాడిగా రూపాంతరం చెందిస్తున్నారు.. ఇంతకంటే గొప్ప విషయం ఏమంటుంది. ఇదంతా కూడా రిక్రియేషన్ లాగా కనిపిస్తోందని” సంగీతారెడ్డి వ్యాఖ్యానించారు.

కొందరు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతారు. ఇంకొందరు వ్యాపారాలు మాత్రమే మాట్లాడుతారు. కానీ చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన వారు.. వర్తమానాన్ని చూస్తున్నవారు నిజాలు మాత్రమే మాట్లాడతారు. సంగీత రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గురించి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎప్పటిలాగానే వైసీపీ దీని మీద విమర్శలు చేస్తుంది. అడ్డగోలుగా మాట్లాడుతుంది. కానీ అసలు వాస్తవం ఏపీ ప్రజలకు తెలుసు.

ఆర్కే కొత్త పలుకు.. బిజెపిలోకి రేవంత్, హరీష్ రావు

Radhakrishna comments

RK Kotha Paluku : ఇదే ఆశ్చర్యం కాదు.. అతిశయోక్తి అంతకంటే కాదు. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారమే. కాకపోతే కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాశారు. దీంతో కొంత చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. నాతో చేతులు కలుపు అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేవలం సరదా కోసం చేసిన వ్యాఖ్య కాదు. దాని వెనుక బలమైన కారణం ఉంది. బలమైన నేపథ్యం కూడా ఉంది.

ఆదివారం కొత్త పలుకులో నరేంద్ర మోడీ గురించి రాధాకృష్ణ బాగానే రాశారు.. ఇందిరా గాంధీ కంటే రాజకీయాలలో మోడీ మహాబలుడు అంటూ.. జవహర్ లాల్ నెహ్రూ మించిన వాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ లో ఉన్నాడు కాబట్టి రాధాకృష్ణకు తప్పదు. పైగా ఇప్పుడు మోడీ గురించి పాజిటివ్ గానే రాసుకుంటూ పోవాలి.. మోడీ ఏం తప్పులు చేసినా సరే చూసీ చూడకుండా వదిలేయాలి. రాధాకృష్ణకు దీనివల్ల ఏం అవసరం ఉంది.. ఎందుకిలా రాస్తున్నాడనే ప్రశ్నలు సమాధానాలు లేనివి కావు.

దేశ రాజకీయాలను పక్కన పెడితే తెలంగాణ విషయంలో రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బహిరంగంగానే నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలలో.. నాయకులను మోడీ ఆకర్షిస్తున్నారని.. తన పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కోవలోని వారేనని.. రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితిలో హరీష్ రావు ను తమలో చేర్చుకోవడానికి బిజెపి సిద్ధంగా ఉందని రాధాకృష్ణ రాశారు. పైగా ఆ మధ్య హరీష్ రావు బిజెపిలో చేరబోతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని ఇన్నాళ్లకు రాధాకృష్ణ అధికారికంగానే ద్రువీకరించారు..

హరీష్ రావు అనేక సందర్భాలలో తాను భారత రాష్ట్ర సమితిలోనే రాజకీయాలు మొదలుపెట్టానని.. తన జీవితం కూడా ఆ పార్టీలోనే ముగిసిపోతుందని చెప్పారు. అయినప్పటికీ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా దాల్ మే కుచ్ కాలా హై అనే సామెతను రుజువు చేస్తోంది.. రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. పైగా కాంగ్రెస్ జాతీయస్థాయిలో ఇప్పుడు సత్తా చూపించే అవకాశం లేదు. ఇండియా కూటమి అంత బలంగా లేదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి బిజెపిలోకి వెళ్తున్నారా.. హరీష్ రావు కూడా అదే దారిలో నడుస్తున్నారా.. అనే ప్రశ్నలు రాధాకృష్ణ కొత్త పలుకు ద్వారా వ్యక్తమవుతున్నాయి. ప్రతి సభలోను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. తాను భారత రాష్ట్ర సమితిలోనే ఉంటానని హరీష్ రావు చెబుతున్నారు. అలాంటప్పుడు వీరిద్దరూ బీజేపీలోకి ఎందుకు వెళ్తారు అని ప్రశ్నను అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇటు గులాబీ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.. కాకపోతే రాజకీయాలలో పరస్పర అవసరాలు మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావచ్చు. గతంలో షర్మిల పార్టీ పెడుతుంది అనే విషయాన్ని రాధాకృష్ణనే బయటికి చెప్పారు. కవిత కెసిఆర్ ఫ్యామిలీ నుంచి బయటికి వస్తుంది అని కూడా రాధాకృష్ణనే చెప్పారు. అవి రెండు నిజమయ్యాయి. ఈ ప్రకారం రాధాకృష్ణ రాసినట్టుగా రేవంత్.. హరీష్ రావు బిజెపిలోకి వెళ్లడం ఖాయమేనా.. చూడాలి ఏం జరుగుతుందో..

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జగన్ అంతకుట్ర చేశాడా.. ఇన్నాళ్లకు నిజం వెలుగులోకి..

Visakhapatnam Steel Plant controversy

Visakhapatnam Steel Plant controversy : ఇటీవల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం చోటుచేసుకుంది. గాయపడిన కార్మికులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది.. మృతులకు వెంటనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంది. గాయపడిన వారి వైద్య చికిత్సలు.. పరిహారం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది.. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది.

ఈ ఘటన జరిగిన తర్వాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయన రాజకీయంగా బలప్రదర్శన చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎల్జీ కంపెనీ ప్రమాదం జరిగినప్పుడు తాము వ్యవహరించినట్టుగా.. కూటమి ప్రభుత్వం పని చేయడం లేదని ఆరోపించారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు, పవన్ కుట్ర చేశారని.. ఆ ఫ్యాక్టరీని కార్మికులు ఉద్యమాలు చేసి కాపాడుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు.. అంతేకాదు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూములను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చిన కార్యక్రమాన్ని పక్కనపెట్టి.. అక్కడ కూడా రాజకీయాలను చేశారు జగన్. చివరికి తన పార్టీ కార్యకర్తలను భారీగా మోహరింపజేసి.. జై జగన్ అంటూ నినాదాలు చేయించారు.. దీంతో ఆ పరామర్శ కార్యక్రమం కాస్త రాజకీయ కార్యక్రమంగా మారిపోయింది.

జగన్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను పరామర్శించి వెళ్లిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం కొన్ని విషయాలను బయటపెట్టారు. అమరావతి విషయంలో మొదటి నుంచి కూడా జగన్ ఒక రకమైన భావనతోనే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం రోడ్లు వేయలేదు. భవనాలు నిర్మించలేదు. రాజధాని నిర్మాణం అడుగు ముందుకు పడకపోవడంతో అక్కడ ముళ్ళకంప చెట్ల విపరీతంగా పెరిగిపోయాయి.. రోడ్లు మొత్తం నాశనం అయ్యాయి. అమరావతిని పక్కనపెట్టిన జగన్.. నాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మూసివేసి.. ఆ భూముల్లో రాజధాని నిర్మించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం తో చెప్పారు. దీనిని ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యతిరేకించారు. “అలా కుదరదు.. అలా చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేక ఉద్యమాల ద్వారా సాగింది. ఆ ఉద్యమాలను అపహస్యం చేసే విధంగా ప్రయత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని” ఎల్వి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

దానికి జగన్ ఒప్పుకోలేదు..”నువ్వేంటన్న ప్రతిదానికి అడ్డుపడుతుంటావ్. ఏం చెప్పినా సరే వినిపించుకోవు. పైగా కాదంటావ్. కుదరదంటావ్.. ఇలా అయితే కష్టమన్న నీతో” అని సుబ్రహ్మణ్యం తో జగన్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బయటికి వచ్చేసారు. స్టీల్ ఫ్యాక్టరీ భూముల్లో రాజధాని నిర్మించాలని జగన్ అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదు. చివరికి అక్కడ కార్మికులు ఉద్యమాలు చేయడంతో జగన్ తన ఆలోచన విరమించుకున్నారు. చివరికి రిషికొండ మీద ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టి.. కొంతలో కొంత తన అహాన్ని నెగ్గించుకున్నారు. నాడు స్టీల్ ఫ్యాక్టరీ భూముల్లో రాజధాని నిర్మిస్తానని జగన్ చెప్పిన విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు..

తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. ఆ 15 నిమిషాల్లోనే అంతా జరిగింది

Tuni Missing Girl
Tuni Missing Girl

Tuni Jnaneswari missing case : తుని ప్రాంతంలో సరిగా ఎనిమిది రోజుల క్రితం మిస్ అయిన జ్ఞానేశ్వరి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ పాప ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో అత్యంత కీలకమైన కుక్క శనివారం ఎవరూ ఊహించని విధంగా మృతి చెందింది. దీంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసు పై పోలీసులకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక బృందాలను నియమించారు. అందరూ సమన్వయం చేసుకొని పాప ఆచూకీ అని పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఆ 15 నిమిషాలే..

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈనెల 6న పాప మిస్సయింది. ఉదయం 11 గంటల యాభై నిమిషాలకు పాపను భార్యకు ఇచ్చి భర్త పొలానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో వేరే పాప వారి ఇంటికి వచ్చింది. ఆ పాపను చూస్తూ జ్ఞానేశ్వరిని ఆమె పట్టించుకోలేదు. తల్లి పట్టించుకోకపోవడంతో జ్ఞానేశ్వరి బయటికి వచ్చింది. తండ్రి ఏ దారిలో అయితే వెళ్లాడో.. తను కూడా అదేదారిలో వెళ్లడం మొదలుపెట్టింది.. పాప వెళుతూ ఉంటే ఒక వ్యక్తి ఆమెను గమనించి.. ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. అయితే కుక్క గట్టిగా అరవడంతో అతడు వెళ్లిపోయాడు.

మధ్యాహ్న 12 గంటల నుంచి 12:15 నిమిషాల మధ్యలో పాప మిస్ అయినట్టు తెలుస్తోంది. ఆ 15 నిమిషాల్లోనే పాప దారి తప్పింది. తండ్రి వెళ్లిన దారిలో ప్రయాణం సాగిస్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పాప ఉండాలి. కానీ పాప అక్కడ లేదు. పైగా పాప ఇప్పటికే కనిపించక 8 రోజులు అవుతుంది.. ఈ కేసులో అత్యంత కీలకమైన కుక్క కూడా చనిపోయింది. కుక్క కూడా సమీప ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ వెంటనే వచ్చింది. కుక్క మెడకు జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఎటువంటి పురోగతి లభించలేదు.. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి ఎటువైపు వెళ్ళింది.. ఎక్కడికి వెళ్ళింది.. ఇన్ని రోజులపాటు ఆకలిదప్పులను ఎలా తట్టుకుంటున్నదని.. స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీస్ అధికారులు.. అటవీ శాఖ అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేశారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పాప ఇంటి దగ్గర నుంచి.. తన తండ్రి వెళ్లిన మార్గంలోనే పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.. ఒకవేళ పాప ఇతర ప్రాంతాలకు వెళ్ళిందేమోనని.. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. కాగా.. పాపను ఎత్తుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అనేక పర్యాయాలు ప్రశ్నించారు.. ఆ పాప తల్లిదండ్రులకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రాశుల వారి ఇంట్లో ఈరోజు ధన రాశి పండుగ.. వద్దన్నా డబ్బు..

Horoscope
Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అపారమైన ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈరోజు ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు తోటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఖర్చులు ఆచితూచిపెట్టాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి కూడా వస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో పనిచేసే వారికి శుభవార్తలు అందుతాయి. నాణ్యమైన పనితీరును ప్రదర్శించడం వల్ల ప్రశంసలు అందుతాయి. పదోన్నతులు పొందేందుకు ఇదే మంచి సమయం. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా విహార యాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. పాత స్నేహితులు కలవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఏ పని మొదలుపెట్టిన వెంటనే పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ఆలోచన ఉంటే మానుకోవడమే మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలను ఉపయోగించొద్దు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ చిన్న పని చేసినా దానిపై ప్రశంసలు అందుతాయి. అనుభవం ఉన్న వారి నుంచి ఉద్యోగులు సలహాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. వ్యాపారులకు పెద్దల అండదండలు ఉండడంతో కొత్తపెట్టబడులు పెడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయాల్లో అన్నీ అనుకూలమైన సమయాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు.. కొందరికి కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు కొత్త పెట్టుబడులు విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కార్యాలయాల్లో అన్ని పనులను పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కోసం వికార యాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారులు కొన్ని రిస్కులు తీసుకుంటారు. వీటివల్ల అనేక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో కొన్ని ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కొందరు తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ఎలాంటి మాటలు మాట్లాడకపోవడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీతం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. వ్యాపారులు ఆహ్లాదంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఇంట్లో ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఏదైనా పనిని మొదలు పెడితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఇదే మంచి సమయం.

చివరికి రోబోలతో ఆ పని కూడా చేయిస్తున్నారు.. ఖర్మ రా బాబూ

robot begging in China

robot begging in China అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో.. హ్యూమనాయిడ్ రోబో ఐశ్వర్యరాయ్ ని ప్రేమిస్తుంది. చివరికి రజనీకాంత్ ను చంపడానికి కూడా వెనకాడదు. అప్పట్లో ఇది సంచలనం. వాస్తవానికి రోబో అలా చేస్తుందా అని అందరూ అనుకున్నారు.

ఇప్పుడు రోబోలు అంతకుమించి చేస్తున్నాయి. చైనా దేశంలో రోబోల మీద కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రయోగాలు జరగడం మాత్రమే కాదు రోబోలతో రకరకాల పనులు కూడా చేయిస్తున్నారు. ఆ మధ్య చైనాలో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణంలో రోబోలను వినియోగించారు. అంతకంటే ముందు రోబోలతో పరుగు పందెం పోటీలు కూడా నిర్వహించారు. ఆ పోటీలలో రోబోలే విజేతలుగా నిలవడం విశేషం. అంతేకాదు తొలి 5 స్థానాలలో రోబోలే నిలిచాయి.

పనిచేయించడం, పరుగు పందాలు నిర్వహించడం మాత్రమే కాదు.. రోబోలతో ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు సరికొత్త పనులు చేస్తున్నారు. చైనాలో ఓ కంపెనీ రోబోలతో భిక్షాటన చేయించింది. అవి భిక్షాటన చేస్తున్న తీరు చూస్తే ఫ్యూచర్లో మనుషులకు పోటీ వచ్చే విధంగా కనిపిస్తోంది. ఒక రోబో అడుక్కుంటున్న తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. జన సమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతంలో ఒక రోబో మోకాలు మీద కూర్చుంది. అంతేకాదు దర్జాగా భిక్షాటన చేస్తోంది. ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్టబుల్ అన్నట్టుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా ముందు పెట్టుకుంది. ఇది కావాలని చేస్తున్నారా.. లేదా ప్రమోషన్ కోసమా అనేది తెలియడం లేదు. కాకపోతే రోబోలతో భిక్షాటన చేయించడం అనేది మాత్రం వింతగా ఉంది. ఆ రోబో అలా అడుక్కుంటుంటే చాలామంది చైనా దేశస్తులు తమ దగ్గర ఉన్న చిల్లర వేస్తున్నారు. కొందరేమో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంతో కొంత డబ్బులు పంపిస్తున్నారు. మొత్తానికి రోబోలతో భిక్షాటన చేయిస్తున్న చైనా శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తున్నారు.

రోబోలతో ఈ పనులు మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కాలంలో ఇంకా క్లిష్టమైన పనులు కూడా చేయించే అవకాశం కనిపిస్తుంది. అంతరిక్షంలోకి.. భూగర్భ గనులలోకి.. ఇలా అన్నిట్లోకి రోబోలను పంపించి అత్యంత క్లిష్టమైన పనులు చేయించి.. ప్రపంచానికి కొత్త పాఠాలు చెప్పే విధంగా చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో రోబోలు ఏం చేస్తాయో..

నోరు.. అండర్ వేరూ.. దేన్ని వదలకుండా పెట్టేశారు.. ఇదేం ఘోరమయ్యా..

uttar-pradesh-police-exam-security-check-controversy-jaunpur-center

Uttar Pradesh police exam : శీర్షిక చదివి ఇదేదో పెద్దల కంటెంట్ అనుకునేరు. బూతు పదమని అనుకునేరు. అలా రాయాల్సిన ఉద్దేశం మాకు లేదు. చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది ముమ్మాటికి చదవాల్సిన కథనం. అర్థం చేసుకోవాల్సిన విషయం.

మనదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ ఒకటి. ప్రస్తుతం అక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక పరీక్షలు జరుగుతున్నాయి.. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి సహజంగానే నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది. పైగా చాలా రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగానే నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. ఇప్పటికే శారీరక దారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. రాత పరీక్షలు నడుస్తున్నాయి. రాత పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పరీక్ష నిర్వహిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. విమర్శలకు దారితీస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో నిర్వహించిన తనిఖీలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. అక్కడ డిటెక్టర్ తో ప్రతి అభ్యర్థిని తనిఖీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి తన అండర్వేర్లో ఫోన్ పెట్టుకుని వచ్చాడు. అది కాస్త డిటెక్టర్ ద్వారా చేసిన తనిఖీల్లో బయటపడింది. దీంతో అభ్యర్థులను ముందుగా అండర్వేర్లో డిటెక్టర్ పెట్టి పరీక్షిస్తున్నారు. ఆ తర్వాత దానిని నోట్లో కూడా పెడుతున్నారు. అండర్వేర్ నుంచి నోరు వరకు దేనిని వదలకుండా డిటెక్టర్ పెడుతుండడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి నోరు మెదపకపోయినప్పటికీ.. ఉద్యోగం కావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దానిని తట్టుకుంటున్నారు.

“ఉద్యోగం సాధించాలంటే కష్టపడాలి. అందులో తప్పులేదు. కానీ ఇలా అండర్వేర్ లో డిటెక్టర్ పెట్టి మళ్ళీ దానిని నోట్లో పెడితే దానిని ఏమనుకోవాలి.. అసలు ఇలా తనిఖీ చేస్తారా.. దీనిని తనిఖీ అంటారా.. ఇంతగనం ఇబ్బంది పెడితే ఎలా పరీక్ష రాయాలి. పరీక్ష రాయడానికి వచ్చిన వారంతా కూడా పేద, మధ్య తరగతివారే. వారికి ఉద్యోగం కావాలి కాబట్టి ఇదంతా భరిస్తున్నారు. కానీ ఇంత ఇబ్బంది పడుతూ ఉద్యోగం సాధించడం అవసరమా అనిపిస్తోందని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

12 సంవత్సరాల బాలికపై ఘోరం జరిగితే.. సెటిల్మెంటా.. ఏం చేయాలి అసలు వీళ్లను..

Khammam child assault case

12 year old girl assault case : మన ఇంట్లో ఆడపిల్లలకు ఏదైనా జరిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం.. చిన్నపాటి జ్వరం వస్తేనే ఇబ్బంది పడిపోతుంటాం కదా.. అటువంటిది ఒక 12 సంవత్సరాల బాలిక మీద ఓ 45 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి మూర్ఖుడిలాగా.. మృగంలాగా మీద పడిపోయి దాడి చేస్తే.. పైగా భవనం నుంచి కింద పడేస్తే.. మనకు ఎలా ఉంటుంది.. మన ఇంట్లో ఆడపిల్ల పై అలా జరిగితే మనం ఎలా స్పందిస్తాం..

చదువుతుంటేనే రక్తం ఉడికిపోతుంది కదూ. కానీ భారత రాష్ట్ర సమితి నాయకులకు మాత్రం అలా ఉడికిపోలేదు. పైగా 12 సంవత్సరాల బాలిక మీద తమ పార్టీ నాయకుడు దారుణం చేస్తే వెనకేసుకొచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ బాలిక శీలానికి వెలకట్టే ప్రయత్నం చేశారు. చివరికి మూడు లక్షల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడడంతో ఆ గులాబీ పార్టీ నాయకుడి ఆగడాలు చెల్లలేదు. అక్కడి పోలీసు అధికారులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఉదయం లేస్తే నీతులు చెప్పే కేటీఆర్.. ఈ వ్యవహారం గురించి ఇంతవరకు మాట్లాడలేదు. హరీష్ రావు నిమ్స్ లో ఆ బాలికను పరామర్శించి.. జరిగిందంట్లో తమ పార్టీ నాయకుడి తప్పులేదు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత లేదని నిందను ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. అక్కడ బాలిక మీద దాడి చేసింది గులాబీ పార్టీ నాయకుడు. పైగా అతని మీద రౌడీషీట్ ఉంది. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం అతిపెద్ద తప్పు. పైగా అతడు ఆ బాలిక మీద అంతటి దారుణానికి పాల్పడితే కనీసం అతడిని ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. పైగా ప్రభుత్వం మీద నింద వేయడం గులాబీ పార్టీ నాయకులకు చెల్లింది.

ఆ బాలిక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మంత్రులు ఆ బాలికను పరామర్శించారు. ఎంతటి ఖర్చైనా సరే వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఎక్కడ ప్రజల నుంచి తమ మీద నిరసన వ్యక్తమౌతుందోనని తెలిసి గులాబీ పార్టీ నాయకులు భలే తెలివిగా కవర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంటే.. ముందుగా సెటిల్మెంట్ కు ప్రయత్నించిన నాయకుల మీద ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయి. అంతేకాదు, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

కేరళలో ప్రభంజనం సృష్టిస్తున్న 'హ్యాపీ' రీ రిలీజ్.. ఏకంగా 'పెద్ది' వసూళ్లనే దాటేసిందిగా..

Happy movie

Happy re release Kerala : అల్లు అర్జున్ కి కేరళ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ ఆయన్ని ‘మల్లు అర్జున్’ అని పిలుస్తుంటారు. యూత్ ఆడియన్స్ లో ఆ స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ అతను. అల్లు అర్జున్ కి కేరళ లో ఇలాంటి క్రేజ్ కి పునాది వేసిన చిత్రం ‘హ్యాపీ’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘హ్యాపీ’ చిత్రం మన తెలుగు లో ఫ్లాప్ అయ్యింది. కానీ కొన్నాళ్ళకు ఇదే చిత్రాన్ని మలయాళం లో డబ్ చేసి కేరళలో విడుదల చేయగా , అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. మమ్మూటీ , మోహన్ లాల్ వంటి కేరళ సూపర్ స్టార్స్ తో సమానంగా ఈ చిత్రం ఆరోజుల్లో అత్యధిక సెంటర్స్ లో 100 రోజులు ఆడడం గమనార్హం.

ఆ చిత్రాన్ని ఇప్పుడు 4K కి మార్చి , డాళ్బీ అట్మాస్ సౌండ్ తో నిన్న గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ఎంతలా అంటే , ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన మన స్టార్ హీరోల కొత్త చిత్రాలు ‘రాజా సాబ్’, ‘పెద్ది’ వంటి వాటికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు అన్నమాట. కేరళ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ‘పెద్ది’ చిత్రానికి మొదటి రోజు 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రాజా సాబ్ చిత్రానికి 19 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాదు, ఈ చిత్రం గత ఏడాది భారీ లెవెల్ లో రీ రిలీజ్ అయినటువంటి ‘బాహుబలి ది ఎపిక్’ మొదటి రోజు వసూళ్లను కూడా కేరళలో దాటింది. ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రానికి 26 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే మొదటి రోజు వచ్చింది.

అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డుని కూడా నెలకొల్పాడు. కేరళలో ఇప్పటి వరకు మోహన్ లాల్ మాత్రమే రీ రిలీజ్ లో 30 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. మరో మలయాళం హీరో ఆయన దరిదాపుల్లో లేరు. అలాంటిది అల్లు అర్జున్ ఆయన తర్వాత స్థానం లో నిలవడం అనేది సాధారమైనది కాదు. ఇతర రాష్ట్రాల్లో మన టాలీవుడ్ నుండి రాజమౌళి తర్వాత , అంతటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఏకైక నటుడు అల్లు అర్జున్ అని ట్రేడ్ అంటూ ఉంటుంది. అలా ఎందుకు అంటుందో , ఈ ‘హ్యాపీ’ రీ రిలీజ్ ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.