Homeఅంతర్జాతీయంElon Musk Net Worth: కోటి కోట్ల మస్క్.. అతడి సంపద ప్రపంచం మొత్తం పంచితే...

Elon Musk Net Worth: కోటి కోట్ల మస్క్.. అతడి సంపద ప్రపంచం మొత్తం పంచితే ఎంత వస్తుందో తెలుసా..

Elon Musk Net Worth: టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు మస్క్ ఇటీవల అతడు ఐపిఓ ద్వారా నిధులు సేకరించాడు. తద్వారా కోటికోట్లకు తన ఆస్తులను పెంచుకున్నాడు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అయిపోయాడు. వాస్తవానికి అతని దరిదాపుల్లో ఏ వ్యాపారి కూడా లేడు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే స్పేస్లో అతడికి పోటీ లేదు. అంతటి నాసాకు కూడా అతడే సహకారం అందించాల్సి వస్తోంది. పైగా స్పేస్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి అడుగుపెట్టిన […]

Elon Musk Net Worth: టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు మస్క్ ఇటీవల అతడు ఐపిఓ ద్వారా నిధులు సేకరించాడు. తద్వారా కోటికోట్లకు తన ఆస్తులను పెంచుకున్నాడు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అయిపోయాడు. వాస్తవానికి అతని దరిదాపుల్లో ఏ వ్యాపారి కూడా లేడు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే స్పేస్లో అతడికి పోటీ లేదు. అంతటి నాసాకు కూడా అతడే సహకారం అందించాల్సి వస్తోంది. పైగా స్పేస్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి అడుగుపెట్టిన మస్క్.. భారీగా సంపాదిస్తున్నాడు.

మస్క్ కోటి కోట్లకు తన ఆస్తులను పెంచుకున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఒకవేళ అతడి సంపద మొత్తం ప్రపంచం మొత్తం పంచితే ఒక్కొక్కరికి 11600 వస్తాయి. ఒకవేళ అతడు సంపాదించిన సంపాదన మీద వెల్త్ టాక్స్ గనుక వేస్తే ప్రపంచంలో దాదాపు 80 కోట్ల మంది పేదరికం తీరుతుంది. అంతేకాదు.. వారికి సరికొత్త జీవితాన్ని కూడా అందించవచ్చు. విద్య, వైద్యం, ఇంకా అనేక విభాగాలలో వారికి శిక్షణ ఇవ్వవచ్చు.

ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో 75% సంపాద కేవలం 56,000 మంది వద్ద మాత్రమే ఉంది. వీరంతా కూడా వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదించారు. కరోనా తర్వాత వీరి వ్యాపారాలు మరింత పెరిగాయి. విభిన్న రంగాలలో ప్రవేశించడం ద్వారా వీరు తమ ఆస్తులను మరింతగా పెంచుకున్నారు. అయితే సంపద వీరి వద్ద మాత్రమే పోగుపడుతున్న నేపథ్యంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందువల్లే ఆర్థిక నిపుణులు ఇటువంటి విధానాలు మంచివి కావు అని చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు సంపద వికేంద్రీకరణ జరగాలని.. అప్పుడే ఆర్థిక అసమానతలు లేని సమాజం ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.

మస్క్ తాను మాత్రమే కోటీశ్వరుడు కాలేదు.. తన సంస్థలో పనిచేసే కొంతమందిని కూడా కోటీశ్వరులను చేశాడు. దీనికి ప్రధాన కారణం ఆ ఉద్యోగులకు షేర్లు కేటాయించడమే. ఐపీఓ కు వెళ్లడం ద్వారా మాస్క్ తన ఆదాయాన్ని భారీగా పెంచుకున్నాడు. షేర్ విలువ కూడా పెరిగిపోవడంతో.. షేర్లు కేటాయించిన ఉద్యోగులు కోటీశ్వరులు అయిపోయారు. అయితే వారంతా కూడా మస్క్ కంపెనీలలో ఎప్పటి నుంచే పని చేస్తున్నారు. అందువల్లే మస్క్ వారికి షేర్లు కేటాయించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper