Home Blog Page 129

ఐదేళ్లపాటు విడాకుల కోసం కోర్టు చుట్టూ.. చివరికిలా కలిశారు.. సినిమాను మించిన స్టోరీ ఇది

couple-reunites-after-5-year-divorce-battle-in-court-heartwarming-story

divorce case reunited : విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగారు. ఐదు సంవత్సరాలపాటు విడాకుల కోసం పోరాడారు.. పెద్దలు.. కోర్టులో న్యాయాధికారులు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. మరి కొద్ది రోజుల్లో విడాకులు మంజూరు అవుతాయనుకుంటున్న క్రమంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీ నగరానికి చెందిన సౌరబ్ అనే వ్యక్తికి 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మొదట్లో చిన్నపాటి గొడవ.. ఆ తర్వాత మరింత పెరిగింది. దీంతో ఇద్దరూ విడిగా ఉండాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.. విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. పరస్పరం కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా విడాకుల కోసం ఫ్యామిలీ కోటు చుట్టూ తిరుగుతున్నారు..

న్యాయవాదుల ఫీజులు.. ఇతర ఫీజులకు సంబంధించిన ఖర్చులు వంటి వాటి వల్ల రెండు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇటీవల ఈ బాధతో శిఖ తండ్రి గుండెపోటు గురయ్యాడు. డబ్బు మొత్తం కోర్టు కేసులకు ఖర్చు కావడంతో.. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించే స్థాయి లేకుండా పోయింది. దీంతో అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సౌరబ్..శిఖ తండ్రిని గురు గ్రామ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించాడు. మెరుగైన వైద్యం అందించడానికి తనవంతుగా సహకారం అందించాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ఇటీవల విడాకుల కేసు విచారణకు సంబంధించి సౌరబ్..శిఖ కోర్టుకు హాజరయ్యారు. వారిద్దరి తరపున న్యాయవాదులు వాదనను వినిపించడం మొదలుపెట్టారు.. కేసు తుది విచారణలో భాగంగా విడాకులు తీసుకుంటారా అని అడిగారు. వెంటనే శిఖ సినిమా స్టైల్ లో తన చేతిలో ఉన్న విడాకుల పత్రాలను చించేసింది. తన భర్తతో విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కలిసి ఉంటామని వివరించింది. మొత్తంగా ఐదు సంవత్సరాలపాటు విడాకులు తీసుకుంటామని అనుకున్న వారిద్దరు.. ఐదు నిమిషాల్లో కలిసిపోయారు. సినిమా స్టోరీని కళ్ళ ముందు ఉంచారు. నేటి కాలంలో చిన్న చిన్న ఘటనలకే గొడవ పడుతున్న వారికి ఈ దంపతులు ఆదర్శంగా నిలిచారు.


image.png

రేయ్ పలాష్ ముచ్చల్.. గుక్కపెట్టి ఏడువు.. ఇదీ మా స్మృతి మందాన రేంజ్

Smriti Mandhana world record
Smriti Mandhana world record

Smriti Mandhana half century : అన్ని అనుకున్నట్లు జరిగితే స్మృతి మందాన పక్కన.. ముచ్చల్ అని ఉండేది. అది వాడి దురదృష్టం. బంగారం లాంటి అమ్మాయి ప్రేమికురాలుగా ఉన్నప్పటికీ.. మరికొద్ది క్షణాల్లో ఆమె మెడలో తాళికట్టే అవకాశం వచ్చినప్పటికీ.. వాడి పాత బాగోతాలు మొత్తం బయటికి వచ్చాయి. అప్పటిదాకా ప్రేమికుడని నమ్మిన ఆమెకు.. విరక్తి వచ్చేసింది. ఇన్ని రోజులపాటు ఇటువంటి వ్యక్తితో నా నేను ఉన్నది అనుకుంది. అంతే మొహమాటం లేకుండా వద్దనుకొంది. అని సంవత్సరాల ప్రేమను పక్కన పెట్టింది. ఏకంగా పెళ్లినే క్యాన్సల్ చేసుకుంది.

ఈ ఎపిసోడ్ తర్వాత స్మృతి డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది.. ఆట మీద దృష్టి పెట్టలేదు.. ఇక కష్టమే అని అందరూ అనుకున్నారు. టీమిండియాలో ఉమెన్ విరాట్ కోహ్లీగా పేరు తెచ్చుకున్న ఆమె.. ఇకపై ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయలేదని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ అలా వెనకడుగు వేస్తే ఆమె స్మృతి ఎందుకు అవుతుంది.. పలాష్ తో జరిగింది మొత్తం ఒక పీడకల అనుకుంది. ఆ బ్యాడ్ ఎపిసోడ్ మొత్తం మర్చిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో వాడి జ్ఞాపకాలు ఉన్న ఫోటోలను మొత్తం తొలగించింది. అంతేకాదు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. సరికొత్త అవతారంలో కనిపించింది.

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు మీద ఏకంగా హాఫ్ సెంచరీ చేసింది. అది కూడా జట్టు 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సందర్భంలో.. గట్టిగా నిలబడింది. 44 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేసింది. సెంచరీ చేస్తుంది అనుకుంటున్న క్రమంలో రమీన్ షమీం బౌలింగ్లో అవుట్ అయింది. అప్పటికి కౌర్ తో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.. తద్వారా పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్ మీద పట్టు బిగించే అవకాశం లేకుండా చేసింది.

పాకిస్తాన్ జట్టుపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా స్మృతి సరికొత్త రికార్డును సృష్టించింది. 26 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. ఈ జాబితాలో మిథాలీ రాజ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆమె 23 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. కెప్టెన్ కౌర్ 34 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. పూనమ్ రౌత్ 15 ఎన్ని నిమిషాలలో 3 హాఫ్ సెంచరీలు చేసింది. రెండు వికెట్లు కోల్పోయినప్పుడు.. కెప్టెన్ కౌర్ తో కలిసి స్మృతి నిదానంగా బ్యాటింగ్ చేసింది. మైదానం మీద అవగాహన ఏర్పడేంతవరకు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత జూలు విధిల్చిన సింహం లాగా రెచ్చిపోయింది. దీంతో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వేరే వాళ్ళ మోజులో పడి పలాష్ స్మృతిని దూరం చేసుకున్నాడు. కానీ, స్మృతికి తాను ఏంటో తెలుసు. అందువల్లే ఈ స్థాయిలో రెచ్చిపోయింది. సూపర్ హాఫ్ సెంచరీ తో అదరగొట్టింది.

టీమిండియా కొట్టిన దెబ్బకు పాక్ అబ్బా.. ఈసారి కూడా అదే జరిగింది..

Team India

IND vs PAK : మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్తాన్ తో తలపడుతోంది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ మైదానం మీద తడబడుతున్న భారత బ్యాటర్లు.. మరోసారి అదే ఇబ్బందిని ఎదుర్కొన్నారు. భీకరమైన ప్లేయర్గా పేరుపొందిన షపాలి వర్మ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సాదిబా ఇక్బాల్ బౌలింగ్లో ఔట్ అయింది. కీలకమైన వన్ డౌన్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తస్మియా బౌలింగ్లో అవుట్ అయింది.

టీమిండియా కేవలం 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో.. పాకిస్తాన్ బౌలర్లు మ్యాచ్ మీద పూర్తిస్థాయిలో పట్టు బిగించారు.. పాకిస్తాన్ బౌలర్లలో ఇక్బాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసింది. తస్మియా కూడా పదునైన బంతులు వేసింది. దీంతో భారత్ పరుగులు తీయడానికి చాలా కష్టపడింది. భారత బ్యాటర్లలో స్మృతి.. కెప్టెన్ కౌర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయిన చోట.. అనవసరమైన షాట్లకు వెళ్లకుండా ఆడుతున్నారు. వీరిద్దరూ ఈ కథనం రాసే సమయం వరకు మూడో వికెట్ కు 66 పరుగులు జోడించారు. తద్వారా భారత జట్టు 11.4 ఓవర్లలో 7.2 రేట్ చొప్పున 84 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో భారత జట్టు తన పంతాన్ని నెగ్గించుకుంది. పాకిస్తాన్ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లను భారత పురుషుల జట్టు ఆడటం లేదు. భారత మహిళల జట్టు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది.. అంతేకాదు, భారత పురుషుల జట్టు పాకిస్తాన్ ప్లేయర్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు.. ఆసియా కప్ లో టాస్ ప్రక్రియ తర్వాత ఒక్కసారి కూడా భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ట్రోఫీ గెలిచిన తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి కప్ అందుకోవడానికి కూడా భారత ప్లేయర్లు ఇష్టపడలేదు. అప్పట్లో ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.. ఇప్పుడు భారత మహిళలు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కనీసం భారత జట్టు కెప్టెన్ పాకిస్తాన్ కెప్టెన్ తో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే భారత కెప్టెన్ వెను తిరిగారు.

పాకిస్తాన్ పదే పదే భారతదేశం మీద ఉగ్రదాడులకు యత్నిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు పెద్దల నిర్ణయాన్ని ఆటగాళ్లు పాటిస్తున్నారు. కొంతమంది కుహనా మేధావులు క్రికెట్లో ఈ పోకడలు ఏంటని ప్రశ్నించినప్పటికీ.. ఉగ్రవాదులతో ఎంత దూరం ఉంటే అంత మంచిదని భారత అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి భారత మహిళలు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మరొకసారి చర్చకు దారి తీసింది.

టిక్కెట్ రేట్స్ తగ్గాక దుమ్ములేపుతున్న 'పెద్ది'..నేడు మ్యాట్నీ షోస్ వరకు నమోదైన గ్రాస్ ఎంతంటే..

Tollywood Box Office Collection
Tollywood Box Office Collection

Peddi collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతూ ముందుకు దూసుకువెళ్తోంది. ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత విడుదలైన ప్రతీ సినిమా , బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలకు టాక్ వచ్చినప్పటికీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి డ్రై సీజన్ లో బయ్యర్స్ కి ‘పెద్ది’ చిత్రం ఇచ్చిన ఊపు సాధారణమైనది కాదు. మూతపడిన థియేటర్స్ కూడా మళ్లీ తెరుచుకున్నాయి. 10 రోజులు దాటినా కూడా, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా చెక్కు చెదరని గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్స్ లో టిక్కెట్ రేట్స్ తగ్గించారు మేకర్స్. దాని ప్రభావం నిన్నటి కలెక్షన్స్ మీద చూపించింది , నేటి కలెక్షన్స్ పైన కూడా చూపిస్తోంది.

నిన్ననే తగ్గించిన టిక్కెట్ రేట్స్ తో ఈరోజుటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. కానీ నిన్నటి టిక్కెట్ రేట్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ఎలాగో రేపు టిక్కెట్ రేట్స్ తగ్గించారు కదా, రేపే వెళ్దాం అనే ఆలోచనలోకి ఆడియన్స్ వచ్చారు , అందుకే నిన్న వీకెండ్ అయినప్పటికీ కలెక్షన్స్ ఆశించినంతగా లేవు. తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ నేడు మాత్రం ప్రతీ సెంటర్ లోనూ హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. వైజాగ్ , కాకినాడ, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి అదనపు థియేటర్స్ ని షెడ్యూల్ చేస్తున్నారు. ఆ థియేటర్స్ ని యాడ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. దీనిని బట్టీ ఫ్యామిలీ ఆడియన్స్ టిక్కెట్ రేట్స్ తగ్గడం తో ఏ రేంజ్ లో థియేటర్స్ కి కదులుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

టిక్కెట్ రేట్స్ తగ్గాయి , పబ్లిక్ లో టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మరో రెండు వారాలు ఈ చిత్రానికి జాతర లాగా కదులుతారని అభిమానులు , మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇక పోతే నేడు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 15 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి. మ్యాట్నీ షోస్ వరకు ఈ చిత్రానికి ఆన్లైన్ లో ట్రాక్ అయినటువంటి గ్రాస్ దాదాపుగా 4 కోట్ల రూపాయిల వరకు ఉందని అంచనా. చూస్తుంటే నేడు ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్టాల నుండే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యేలా అనిపిస్తోంది.

తెలంగాణ టాపర్స్ విద్యార్థుల కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. వీడియో వైరల్..

Vijay Deverakonda scholarship

Vijay Deverakonda scholarship : టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. సినీ నటులు కేవలం సినిమాలు చేయడం , అభిమానులను ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, సామజిక స్పృహ ఇసుమంతైనా ఉండాలి అని చాటి చెప్పే హీరోల్లో ఈయన కూడా ఒకడు. సమయం దొరికినప్పుడల్లా , తనకు తోచిన విధంగా సహాయాలు చేయడం విజయ్ దేవరకొండ హాబీ. హీరోయిన్ రష్మిక తో పెళ్ళైన తర్వాత , ఆయన తన స్వగ్రామానికి వెళ్లి , అత్యధిక మార్కులు సాధించి టాపర్స్ గా నిల్చిన విద్యార్థులకు తమ ‘దేవరకొండ’ ఫౌండేషన్ ద్వారా స్కాలర్ షిప్స్ ఇవ్వాలనేది తన కోరిక అని ఒక సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన చిరాకాల కోరిక ని విజయ్ దేవరకొండ నేడు తీర్చున్నాడు. ఈ విషయం గురించి ఆయనపై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

నేడు ఆయన రష్మిక తో కలిసి తన తండ్రి స్వగ్రామం , నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చం పీత నియోజకవర్గం లోని తుమ్మన్ పేటకు విచ్చేశాడు. ఫిబ్రవరి లో రష్మిక తో కలిసి వచ్చి ప్రకటించిన తన ‘చిన్ననాటి కల’ ని నెరవేర్చుకున్నాడు. అచ్చం పేట మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 9 , 10 తరగతులు చదువుతూ , అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్ షిప్స్ ని విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల పేరుని నిలబెట్టిన 180 మంది విద్యార్థుల వివరాలను ముందుగా తన సోషల్ మీడియా ద్వారా జాబితా ని విడుదల చేశాడు. వాళ్లకు కావాల్సినంత గుర్తింపు ని తీసుకొని రావడం లో ఆయన వంతు పాత్ర పోషించాడు. కేవలం అచ్చం పేట మాత్రమే కాదు , రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా టాపర్స్ కి తమ ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా స్కాలర్ షిప్స్ అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

ఇంకా ఆయన ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి. సినీ రంగం లో తన ఎదుగుదల తో పాటు , ప్రతిభ ఉన్న విద్యార్థులను కూడా గుర్తించడం ద్యేయంగా పెట్టుకున్న విజయ్ దేవరకొండ మంచి మనస్సు కి నెటిజెన్స్ ఫిదా అయిపోయారు. భవిష్యత్తులో ఆయనకు ఇంకా మంచి కార్యక్రమాలను తలపెట్టేంత శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే , విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబలి’, ‘రౌడీ జనార్ధన’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా లో విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ రెండు సినిమాలతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.

ఓహో ఆ చిన్నారిని మోదీ ఎత్తుకోవడం వెనుక ఇంతటి కథ ఉందా

Modi

Narendra Modi France visit : నరేంద్ర మోడీ ప్రస్తుతం జీ7 సమ్మిట్ లో పాల్గొనడానికి ఆయన ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఫ్రాన్స్ దేశంతో భారత్ కు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఉంది. గతంలో అనేక రకాల ఆయుధాలను.. యుద్ధ విమానాలను భారత్ కు అందించింది. భారత్ నుంచి కూడా ఫ్రాన్స్ దేశానికి అనేక రకాల వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల కాలంలో యుద్ధాలు విపరీతంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. భారత్ దౌత్య విధానాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక దేశాలలో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో జరిగే జి7 సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత.. పలు దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు.

ఇటీవల నరేంద్ర మోడీ నార్వేలో పర్యటించారు. అక్కడ ఓ జర్నలిస్ట్ నరేంద్ర మోడీని ప్రశ్నించింది. ఆ సమయంలో అప్పటికే విలేకరుల సమావేశం ముగియడంతో నరేంద్ర మోడీ వెళ్ళిపోతున్నారు. ఆమె ప్రశ్నించడం వల్లే నరేంద్ర మోడీ వెళ్లిపోయారని వెస్ట్రన్ మీడియా ప్రచారం చేసింది. ఇక మన దేశంలోని ఉదార వాదులు నరేంద్ర మోడీ మీద ఇష్టానుసారంగా నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. విదేశాలతో ఒప్పందాలు.. దౌత్య విధానాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ మీద నెగిటివ్ ప్రచారం తీవ్రంగా ప్రభావం చూపించింది.

దీని గమనించిన నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో సరికొత్త విధానానికి శ్రీకారం చెప్పారు. ఒక మాట కూడా మాట్లాడకుండా.. ఫ్రాన్స్ లో అడుగు పెట్టడమే ఆలస్యం.. వెంటనే ఒక చిన్నారిని ముద్దు చేశారు. అక్కడ నైస్ సిటీలో అడుగుపెట్టిన తర్వాత నరేంద్ర మోడీ ముందుగా భారతీయులను కలిశారు. గుజరాత్ నేపథ్యం ఉన్న భారతీయులు నరేంద్ర మోడీని చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. డ్యాన్సులు వేశారు. వాళ్లు డాన్సులు వేస్తుంటే నరేంద్ర మోడీ ఆసక్తిగా గమనించారు.. ఒక చిన్నారిని ముద్దు చేశారు. ఆ చిన్నారి కూడా మోడీ ఆడించినట్టు ఆడుకున్నాడు. కాసేపు ఉన్న ఒత్తిడి మొత్తం పక్కన పెట్టి నరేంద్ర మోడీ ఆనందంగా ఆ బుడ్డోడితో ఆటలాడారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయులను చూడగానే నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారతీయులు బలమైన బంధాలను వ్యక్తం చేస్తారని.. ఫ్రాన్స్ దేశంలో వారిని చూడడం ఆనందంగా ఉందని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

నార్వే పర్యటనలో నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఈసారి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా నేరుగా భారతీయులను కలిశారు. వారితో మాట్లాడారు. తద్వారా వెస్ట్రన్ మీడియాను దూరం ఉంచారు. ఎందుకంటే డీప్ స్టేట్.. జార్జ్ సోరోస్ వంటి వారు భారత్ మీద విషం చిమ్ముతున్నారు. ఎంత చేయాలో అంత చేస్తున్నారు. ఇదంతా గమనించిన నరేంద్ర మోడీ ప్రతీప శక్తులకు అవకాశం ఇవ్వకుండా ఈసారి కొత్త ప్రణాళిక అమలు చేశారు. దీంతో వెస్ట్రన్ మీడియా అన్ని మూసుకోవాల్సి వచ్చింది.

ఫిఫా వరల్డ్ కప్.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు..ఎవరితను..ఏం జరిగింది..

FIFA World Cup

ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. మ్యాచ్ లు మొత్తం ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు హోరాహోరీగా ప్రదర్శన చేస్తున్నారు. గోల్స్ మీద గోల్స్ నమోదవుతున్నాయి. దీంతో అభిమానులకు కావాల్సినంత ఫుట్ బాల్ మజా లభిస్తోంది. ప్రతి మ్యాచ్ కు ప్రేక్షకులు భారీగా హాజరవుతున్నారు. పోటీపోటీగా తమ జట్టు ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఆయాజట్లకు సంబంధించిన జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ ఉత్సాహంగా సాగుతున్న నేపథ్యంలో కెనడా మాజీ ప్రధాని ట్రూడో అడ్డంగా దొరికిపోయాడు. సోషల్ మీడియాలో అతడి గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పైగా సోషల్ మీడియాలో తనదేశానికి సంబంధించిన జెండాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తన మీద వస్తున్న విమర్శలకు సరైన స్థాయిలో సమాధానం చెబుతున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లో అమెరికా, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అమెరికా నాలుగు గోల్స్ చేసింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో అమెరికా చేసిన గోల్సే అధికం. ట్రూడో అమెరికా పరాగ్వే మ్యాచ్ కు హాజరయ్యాడు. అతడు ఒక్కడు మాత్రమే కాకుండా ప్రేయసి పెర్రీతో కలిసి హాజరయ్యాడు. అమెరికా పరాగ్వే మ్యాచ్ చూశాడు. అమెరికా ప్లేయర్లు గోల్స్ కొడుతుంటూ చప్పట్లు కొడుతూ సందడి చేశాడు. అతడి పక్కన కేటీ ఫెర్రీ కూడా ఉంది.

కెనడా మాజీ ప్రధాని అమెరికా మ్యాచ్ కు హాజరుకావడం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.దీనిపై ట్రూడో వివరణ ఇచ్చాడు. ‘కొన్ని సార్లు ఇలాంటి విషయాలలో అడ్డంగా దొరికి పోక తప్పదు. సపోర్టివ్ బాయ్ ఫ్రెండ్ పాత్ర పోషించాల్సి వస్తుంది. నేను ఎవరికి మద్దతు ఇస్తాను?, ఎవరు గెలవాలని కోరుకుంటాను? మీకు తెలుసు’ అంటూ ట్రూడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాదు, కెనడా జాతీయ జెండా ఏమోజీని కూడా దానికి జత చేశాడు. ట్రూడో, ఫెర్రీ కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు. కాగా, బోస్నియాతో జరిగిన మ్యాచ్ ను కెనడా డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ లో కెనడా ఒక్క గోల్ చేసింది. ఫిఫా కప్ ను కెనడా, అమెరికా, మెక్సికో నిర్వహిస్తున్నాయి.

తెలంగాణ బిడ్డ చివరి కోరిక తీర్చనున్న పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan viral video : కొన్ని సంఘటనలు మన హృదయాన్ని కలిచివేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏమి తెలియని పసిబిడ్డలు , జీవితం లో ఎన్నో చూడాల్సిన పసిబిడ్డలు , మన కళ్ళ ముందే అంతు చిక్కని ఆరోగ్య సమస్యలతో చనిపోతున్న సందర్భాలు చూసి , మన హృదయాలు విచారంతో నిండిపోయిన ఘటనలు గతం లో మనం ఎన్నో చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి బాధాకరమైన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రాంతం లోని వరంగల్ కి చెందిన నిరంజన్ అనే కుర్రాడు , గుర్తు తెలియని వ్యాధి తో తీవ్రమైన బాధ పడుతున్నాడు. ఇతని చివరి కోరిక , ప్రముఖ సినీ నటుడు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవడం. రీసెంట్ గానే ఈ చిన్నారి ని రాధా మనోహర్ దాస్ స్వామిజి కలిసాడు.

ఈ చిన్నారి కి ధైర్యం చెప్తూ ‘పోకిరి సినిమా చూశావా ?, ఎప్పుడొచ్చాము అనేది ముఖ్యం కాదు అన్నయ్య , బుల్లెట్ దిగిందా లేదా?, అదే విధంగా ఎన్నాళ్ళు బ్రతికాము అనేది కాదు , ఏమి చేశాము అనేదే ముఖ్యం’ అంటూ ఆ చిన్నారి కి ధైర్యం చెప్పడం చాలా బాగా అనిపించింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కలవడం ఆ చిన్నారి కోరిక అనే విషయం తెలుసుకున్న దాస్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ని కలవాలా?, కలుస్తాడు , కానీ ఇక్కడ కాదు , నువ్వు హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది, ఇతను నిన్ను తీసుకొస్తాడు , నా ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాను , పాతిక వేలమంది చూశారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎన్నో సందర్భాల్లో చిన్నారుల కోరికలను తీర్చాడు. రాబోయే రోజుల్లో ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరితే ఆయన కచ్చితంగా ఈ చిన్నారిని కలుస్తాడని , ఆ చిన్నారిని హైదరాబాద్ కి రప్పించుకోవడం కాదు , స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి ఇంటికి వస్తాడని అంటున్నారు అభిమానులు. నెటిజెన్స్ చేత కంటతడి పెట్టిస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

అంతమంది ముందున్నా.. ఆగమన్నాడు.. నితీష్ కుమార్ రెడ్డికి తల్లి అంటే ఎంత ప్రేమో..

Nitish Kumar Reddy Injury
Nitish Kumar Reddy Injury

Nitish Kumar Reddy : అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు మీద అద్భుతమైన పోరాటం చేసి అదరగొట్టాడు. ఎంతమంది దిగ్గజ ప్లేయర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. రవి శాస్త్రి.. సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్లు అతని ఆట తీరును గొప్పగా వర్ణించారు.. ఇలాంటి ఆట తీరు ఇకపై కూడా కొనసాగించాలని అతడికి సూచించారు.

ఆస్ట్రేలియా జట్టు మీద సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. అతడు ఆడే విధానం సరికొత్తగా ఉండడంతో జాతీయ జట్టులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో అతడికి ఆడే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన అవకాశాలను సద్వినియో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని ఆడుతున్నాడు.

నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ కూడా చేయగలడు. ఇక ఫీల్డింగ్ అయితే మెరుపుతీగ లాగా కదులుతూ ఉంటాడు. జట్టులో ప్లేయర్లకు అతడు అజాతశత్రువుగా ఉంటాడు. అందువల్లే అతడికి విస్తృతంగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ధర్మశాల వన్డేలో విజయం సాధించిన తర్వాత అతడు విలేకరులతో సరదాగా మాట్లాడాడు. అతడు విలేకరులతో మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది అతడి తల్లి. అంతమంది విలేకరులు ఉన్నప్పటికీ వారందరినీ ఆగమని చెప్పి.. ఫోన్ ఎత్తాడు. అమ్మా ఐదు నిమిషాలు ఆగి చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ విలేకరుల సమావేశం కొనసాగించాడు. విలేకరులకు క్షమాపణలు కూడా చెప్పాడు. దానికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నితీష్ కుమార్ రెడ్డికి తన తల్లి అంటే విపరీతమైన ఇష్టం. అందువల్లే అతడు ఆమెకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. ఇటీవల తనకు నచ్చిన కారు కొనుగోలు చేశాడు. ఆ కారులో తన తల్లిని ముందు సీట్ లో కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడు. అంతేకాదు తన ఫేవరెట్ మహేష్ బాబు కొనుగోలు చేసిన రంగు కారునే.. నితీష్ కొనుగోలు చేయడం విశేషం. అంతేకాదు ఆ కారును తల్లితో కలిసి డ్రైవింగ్ చేయడం గమనార్హం. నితీష్ కుమార్ రెడ్డి ఆడే మ్యాచ్ లకు అతడి తల్లిదండ్రులు ఇద్దరు హాజరవుతుంటారు. అతడి సోదరి మైదానంలో మరింత సందడి చేస్తూ ఉంటుంది.

మా మాట వినాల్సిందే.. మీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు.. ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్‌!

US Warning To World Nations
US Warning To World Nations

US Warning To World Nations: మధ్య ప్రాచ్యంలో, ముఖ్యంగా హార్ముజ్‌లో భారత్‌పై వ్యాపార, ఎనర్జీ మార్గాల పరంగా ప్రధాన ఆసక్తి ఉంటుంది. అయితే ఇటీవల మూడు నౌకలపై అమెరికా దాడి చేసింది. ముగ్గురు నావికులు మరణించారు. దీనిపై భారత విదేశాంగ స్పందించింది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికాకు నిరసన తెలిపారు. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

మా ఆదేశాలు పాటించాలి…
ప్రస్తుతం హర్మూజ్‌ అమెరికా బ్లాకేజీలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ చమురు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతో హర్మూజ్‌లో నౌకల కదలికలను నియంత్రిస్తోంది. అమెరికా ఆదేశాలు లేకుండా కదిలే నౌకలపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారత నౌకలపై దాడిచేసింది. హర్మూజ్‌ వంటి కీలక ప్రాంతాల్లో అమెరికా సార్వత్రిక ప్రజాస్వామ్య భద్రతా ఆదేశాలను అనుసరించాలనుకుంటోంది. అందుకే తమ ఆదేశాలు పాటించాలని హుకూం జారీ చేసింది.

భారత ప్రతిస్పందన..
భారతీయులలో విదేశీ సూచనలనన్నా స్వాతంత్య్ర భావనకు బలమైన సున్నితత్వం ఉంటుంది. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్‌ మార్కో రూబియోకు స్పష్టం చేశారు. దాడులపై పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడంపై నిరసన తెలిపారు. కానీ రూబియో మాత్రం అమెరికా ఆదేశాలే కీలకమని, అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

భారత్‌–అమెరికా సంబంధాలు వాణిజ్య, రక్షణ, టెక్నాలజీ ఆధారంగా బలంగా ఉన్నాయి. హార్ముజ్‌ వంటి సున్నిత ప్రాంతాలపై వ్యవహరించే ముందు సంప్రదింపు, సమన్వయం, గడిచిన సందర్భాన్ని పంచుకోవడం అవసరం.

పుట్టింటోళ్లు తరిమేశారు.. నమ్ముకున్న పార్టీ వదిలేసింది.. దువ్వాడ పరిస్థితి ఇలా అయింది..

Duvvada Political Crisis
Duvvada Political Crisis

Duvvada Political Crisis: రీల్స్ “రాజా” పరిస్థితి దారుణంగా మారిపోయింది. పుట్టింటి వాళ్ళు వదిలేశారు. నమ్ముకున్న పార్టీ తరిమేసింది.. అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. తాడేపల్లి నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. రీ ఎంట్రీ లేదని అన్ని మూసుకొని కూర్చోవాలని.. పార్టీ అధిష్టానం చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి.. చీరలు అమ్ముకుంటూ.. రీల్స్ చేసుకుంటూ బతకాలి.. ఇది ఆ సిట్టింగ్ ఎమ్మెల్సీ పరిస్థితి.

ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ కు ఒకప్పుడు భారీగానే ఫాలోయింగ్ ఉండేది. ఫ్యాన్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ కూడా. ఆయన జీవితంలోకి మాధురి రావడంతో పరిస్థితి మారిపోయింది. రాజకీయంలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనే సామెత అతని ద్వారా మరోసారి నిరూపితమైంది. భార్యను.. ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి ఆయన తన దారితను చూసుకున్నాడు. వృద్ధాప్యంలో యవ్వనం లాగా.. పడుచు కుర్రాడి లాగా రెచ్చిపోతున్నాడు. మాధురితో రీల్స్ చేయడం.. టీవీ చానల్స్ లలో ముద్దులు పెట్టడం.. ఇలా రకరకాల హంగామా చేస్తున్నాడు.

దీనివల్ల 2024 లో పార్టీకి చాలావరకు డ్యామేజ్ జరిగింది. టెక్కలి నియోజకవర్గం లోనే కాకుండా.. ఉత్తరాంధ్ర మొత్తంలో పార్టీకి పెద్ద దెబ్బ పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పకపోయినప్పటికీ.. వచ్చి కలువు అన్నారు. అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చేసింది. రీ ఎంట్రీ లేదని స్పష్టంగా వర్తమానం అందింది.

వైసీపీలోకి మళ్ళీ వెళ్లడానికంటే ముందు శ్రీనివాస్ బిజెపి.. టిడిపి.. జనసేన నాయకులతో మంతనాలు జరిపారు. పార్టీలో చేర్చుకోవాలని వర్తమానం పంపించారు. ఏ పార్టీ నుంచి కూడా సరైన స్థాయిలో స్పందన రాలేదు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ గేటు కాదు కదా కనీసం ప్రహరీ గోడ కూడా టచ్ చేయడానికి అవకాశం లేదని వర్తమానం అందడంతో శ్రీనివాస్ అంతర్మదనంలో ఉన్నారు. ఆయన సన్నిహితురాలు ప్రస్తుతం హైదరాబాదులో చీరల వ్యాపారం చేస్తున్నారు. ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్లి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అన్ని పార్టీలు డోర్లు క్లోజ్ చేయడంతో.. శ్రీనివాస్ ఏం చేస్తారు.. ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతారా.. లేక రీల్స్ చేసుకుంటూ.. సోషల్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తారా అనేది చూడాల్సి ఉంది..

దాడి చేసి ముగ్గురిని చంపిందే గాక.. భారత్ పై అమెరికా కండ ఖావరం

US Reaction To India Attack
US Reaction To India Attack

US Reaction To India Attack: అమెరికాది ముమ్మాటికి మూర్ఖత్వం. దుర్మార్గం. అగ్రరాజ్యమననే పేరుతో ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. తమకు నచ్చని దేశాల మీద దాడులు చేస్తోంది. యుద్దాలకు కూడా దిగుతోంది. చివరికి దేశ అధ్యక్షులను అపహరించి.. రాక్షసానందం పొందుతోంది. చివరికి మన దేశంపై కూడా దారుణంగా ప్రవర్తిస్తోంది.

ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత దేశం మీద అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ దేశానికి సహకారం అందిస్తోంది. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడిని ట్రంప్ తన వద్దకు పిలిపించుకొని.. విందు కూడా ఇచ్చారు. ఉగ్రవాద దేశం అని తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్ దేశంతో అమెరికా అంటకాగడం ఆందోళన కలిగిస్తోంది. స్వీయ సమృద్ధి.. ఇతర అంశాలలో స్వయం ప్రతిపత్తిని సాధిస్తున్న భారత్ మీద అమెరికా కక్ష సాధింపులకు దిగుతోంది. రష్యా నుంచి.. గల్ఫ్ దేశాల నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుంటే.. అమెరికా కడుపు మంటతో రగిలిపోతుంది. ఇటీవల కాలంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో భారత్ వచ్చారు. ఇక్కడ కూడా అదే కడుపు మంటను ప్రదర్శించారు.

ఇటీవల కాలంలో మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ముందు కూడా యూరప్ దేశాలు క్రూడ్ ఆయిల్ ప్రస్తావన తీసుకొచ్చారు. దానిని జై శంకర్ మొహమాటం లేకుండా తిప్పి కొట్టారు. భారత్ తన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడైనా ఆయిల్ కొనుగోలు చేస్తుందని.. యూరప్ ఆయుధాలు మా మీద దాడి చేస్తున్నాయని.. భారత్ ఆయుధాలు యూరప్ మీద దాడి చేయడం లేదు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల వరకు భారత్ మీద సాగిస్తున్న దాడి మామూలుది కాదు.. పైగా ఒకప్పటి మాదిరిగా భారత్ సైలెంట్ గా ఉండడం లేదు. గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఇండియా వచ్చారు. ఈ సమయంలో మన ప్రభుత్వం పరోక్షంగా నిరసన వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అమెరికా మన నౌక మీద దాడి చేసింది. మన దేశానికి చెందిన మెరైన్ ఇంజనీర్లు చనిపోయారు. వాస్తవానికి కమర్షియల్ నౌకల మీద దాడులు చేయకూడదు. పైగా యుద్ధంలో భారత్ ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గాని పాల్గొనడం లేదు. అలాంటప్పుడు అమెరికా దాడి చేయడమే అతిపెద్ద దారుణం. పైగా ఈ దాడిని అమెరికా సమర్ధించుకుంటున్నది. మొదట్లో ఆ దాడి ఇరాన్ చేసిందని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. ఇప్పుడేమో రూబియో మాట మార్చి.. మా దాడులు అలాగే ఉంటాయని అంటున్నాడు. పైగా దాడి చేసిన విషయంలో ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. అమెరికా తీరు పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కండ ఖావరంతో అమెరికా ప్రవర్తిస్తోందని భారతీయులు మండిపడుతున్నారు. మరోవైపు అమెరికా ముందు నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయారని.. భారతీయులను చంపినప్పటికీ స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంబర్‌ 12... రోజువారీ జీవితంలో ప్రభావం

Significance Of Number 12

Significance Of Number: మన నిత్యజీవితంలో 12 సంఖ్య అనేక రంగాల్లో సహజంగా కనిపిస్తుంది. ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక రోజులో 12 గంటలు (ఏఎం/పీఎం), ఒక డజన్‌లో 12 వస్తువులు.. ఇలా అనేక చోట్ల ఈ సంఖ్యను వాడుతుంటాం. అలాగే జోడియాక్‌లో 12 రాశులు, సంగీతంలో ఒక ఆక్టేవ్‌లో 12 సెమిటోన్లు, ఇంపీరియల్‌ కొలతల్లో 12 అంగుళాలు ఒక అడుగు ఇవన్నీ కూడా 12 సంఖ్య యొక్క విస్తృత ఉపయోగాన్ని చాటుతాయి.

గణితపరమైన బలం..
12 సంఖ్యను 10 కంటే ఎందుకు ఎక్కువగా ఎంచుకున్నారనేది ఆసక్తికరమైన విషయం. 12 ఒక హైలీ కంపోజిట్‌ నంబర్‌. దీనికి 1, 2, 3, 4, 6, 12 అనే ఆరు భాగహారులు ఉన్నాయి. ఇది 10 సంఖ్యకు (భాగహారులు: 1, 2, 5, 10) కంటే ఎక్కువ. దీనివల్ల వస్తువులను, డబ్బును లేదా పనులను 2, 3, 4, 6 మంది మధ్య సమానంగా పంచడం చాలా సులభం. ప్రాచీన కాలంలో వ్యాపారం, వ్యవసాయం, పన్నులు వసూలు చేయడం వంటి పనుల్లో ఈ సౌలభ్యం చాలా ముఖ్యంగా ఉండేది.

చేతి వేళ్లతో లెక్కించే ప్రాచీన పద్ధతి..
మరో ముఖ్యమైన కారణం చేతి వేళ్లతో లెక్కించే విధానం. బొటనవేలిని ఉపయోగించి మిగిలిన నాలుగు వేళ్లలోని మూడు కణుపుల చొప్పున మొత్తం 12 కణుపులను సులభంగా లెక్కించవచ్చు. ఇది ప్రాచీన మెసొపొటేమియా, ఈజిప్ట్, భారతదేశం వంటి నాగరికతల్లో విస్తృతంగా వాడుకలో ఉండేది. రాత, కాగితం లేని కాలంలో ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి. ఈ విధంగా లెక్కించడం వల్ల వ్యాపారులు, రైతులు త్వరగా లెక్కలు వేయగలిగేవారు.

నాగరికతల్లో 12 పాత్ర
బాబిలోనియన్లు (మెసొపొటేమియా) సంఖ్యా వ్యవస్థలో 60ని ఉపయోగించేవారు. 60ని 12తో సులభంగా భాగించవచ్చు కాబట్టి, వారు సమయాన్ని 12 గంటలుగా విభజించారు. ఈజిప్టు వారు కూడా 12 గంటల రోజు వ్యవస్థను అనుసరించారు. రోమన్లు, గ్రీకులు కూడా 12 సంఖ్యను వాణిజ్యం, క్యాలెండర్‌లో ఉపయోగించారు. హిందూ సంప్రదాయంలో కూడా 12 జ్యోతిర్లింగాలు, 12 రాశులు వంటి వాటిలో ఈ సంఖ్యకు ప్రాధాన్యం ఉంది.

ఆధునిక కాలంలో ప్రాధాన్యత..
ఈరోజు కూడా డజన్‌లో వస్తువులు అమ్మడం(గుడ్లు, పెన్సిళ్లు, బ్రెడ్‌), పాఠశాలల్లో 12 తరగతుల విద్యా వ్యవస్థ, సినిమా, టీవీలో 12 ఎపిసోడ్ల సీరియల్స్‌ వంటివి ఇంకా కొనసాగుతున్నాయి. డిజిటల్‌ యుగంలో కూడా 12 సంఖ్య తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఎందుకంటే ఇది మనుషుల ఆచరణాత్మక అవసరాలకు బాగా సరిపోయే సంఖ్య.

మొత్తంమీద, 12 సంఖ్య కేవలం ఒక లెక్క కాదు. అది మన పూర్వీకులు గణితపరమైన సౌలభ్యం, చేతి లెక్కింపు సౌకర్యం, వ్యాపార అవసరాలను బట్టి ఎంచుకున్న తెలివైన వ్యవస్థ. ఆధునిక యుగంలో కూడా దాని ఉపయోగం కొనసాగడం దాని బలాన్ని చాటుతోంది.

జీ-7, జీ-20, బ్రిక్స్‌.. ఆధిపత్యం ఎవరిది?

Who Dominates G7 G20 BRICS
Who Dominates G7 G20 BRICS

Who Dominates G7 G20 BRICS: ఫ్రాన్స్‌ వేదికగా జీ-7 సమావేశాలు ఈనెల 17న జరుగనున్నాయి. భారత్‌ సభ్యదేశం కాకపోయినా మన ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో మోదీ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. అక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని జీ-7, జీ-20, బ్రిక్స్‌ కూటములపై కొత్త చర్చ మొదలైంది. ఈ మూడింటిలో ఆధిపత్యం ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది..

జీ-7 సమూహం..
అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల సంఘం ఇది. ఇందులో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, కెనడా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ జీడీపీలో సుమారు 40-45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అలాగే అధునాతన సాంకేతికత, ఆర్థిక సంస్థలు (ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు) రిజర్వ్ కరెన్సీలు (ముఖ్యంగా అమెరికన్ డాలర్), బహుళజాతి కంపెనీలు, సైనిక పరంగా గణనీయమైన నియంత్రణ ఉంది. జీ7 దేశాలు టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థలు, గ్లోబల్ ఫైనాన్స్‌లో ఇంకా బలంగా ఉన్నాయి. అయితే వీటిలో జనాభా వృద్ధి తగ్గుతోంది, ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాతో పెరుగుతున్న పోటీ కారణంగా జీ-7 దేశాలు ఒక్కటై పనిచేస్తున్నాయి.

బ్రిక్స్‌ విస్తరణ…
పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాల్‌ చేసేందుకు 2009లో బ్రిక్స్‌ ఏర్పడింది. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా ఉన్నాయి. తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా చేరాయి. బ్రిక్స్‌ బలం దాని జనాభా (ప్రపంచ జనాభాలో 40 శాతం కంటే ఎక్కువ), వనరులు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి. చైనా, ఇండియా వంటి దేశాలు తయారీ రంగం, డిజిటల్ ఎకానమీ, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి సాధించాయి. బ్రిక్స్‌ దేశాలు కలిసి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఏర్పాటు చేసి, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రష్యా-చైనా సన్నిహిత సంబంధాలు వంటి అంతర్గత వ్యత్యాసాలు బ్రిక్స్‌ ఐక్యతకు సవాల్‌గా ఉన్నాయి.

జీ-20కి పరిమితులు..
జీ-20ని 1999లో జీ-7 ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను కలుపుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇందులో జీ-7 దేశాలతో పాటు బ్రిక్‌‍్స దేశాలు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, సౌదీ అరేబియా వంటి 20 దేశాలు ఉన్నాయి. జీ-20 ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పు, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించే వేదికగా పనిచేస్తుంది.అయితే జీ-20కి బైండింగ్ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఇది ఎక్కువగా చర్చా వేదికగానే మిగిలిపోతోంది. జీ-7, బ్రిక్స్‌ దేశాలు రెండూ ఉన్నందున, తరచూ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యం పరంగా జీ-7 ఇంకా ముందంజలో ఉంది. డాలర్ ప్రాబల్యం, అధునాతన టెక్నాలజీ, పశ్చిమ దేశాల సైనిక బలంతో జీ-7 తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. అయితే బ్రిక్స్‌ జనాభా, వనరులు, ఆర్థిక వృద్ధి రేటు ద్వారా తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. బ్రిక్స్‌ దేశాలు డీ-డాలరైజేషన్ (డాలర్ ఆధిపత్యం తగ్గించడం), స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. జీ-20 మాత్రం రెండు వైపుల మధ్య సమన్వయం చేసే వేదికగా ఉంటుంది కానీ నిర్ణయాత్మక శక్తి కలిగి లేదు.

షిప్‌పై దాడుల వివాదం.. తమ పని కాదన్న ట్రంప్‌.. తామే చేశామన్న ఆర్మీ!

Trump
Trump

Ship Attack Controversy: హర్మూజ్‌ జలసంధి, ఓమన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో భారత వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇండియన్‌ క్రూతో కూడిన మూడు వాణిజ్య నౌకలు ఈ ఘటనల్లో చిక్కుకున్నాయి. ఒక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ సంఘటనలు అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగాయి. అమెరికా ఇరాన్‌ చమురు ఎగుమతులపై నిషేధాన్ని అమలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్‌ పను అన్న ట్రంప్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ భారత నౌకలపై డ్రోన్‌ దాడి చేసినట్లు ఆరోపించారు. ఇండియన్‌ నౌకలపై జరిగిన దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ, ఇరాన్‌ను బాధ్యులుగా చూపించారు. ఈ ఆరోపణలు భారత్‌లో ఉన్న ఆందోళనను మరింత పెంచాయి. ట్రంప్‌ ప్రకటన రాజకీయంగా ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో, ఇది వాస్తవాలను ఎంతవరకు ప్రతిబింబిస్తుందో చర్చనీయాంశంగా మారింది.

తామే చేశామన్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌..
ఇదిలా ఉంటే అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ మాత్రం భిన్నమైన వాస్తవాలను వెల్లడించింది. ఇరాన్‌ చమురు రవాణా చేస్తున్న నౌకలపై అమెరికా దళాలు హెల్‌ఫైర్‌ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. హెచ్చరికలను పట్టించుకోని మూడు నౌకలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని, ఇంజన్‌ రూమ్‌పై దాడి చేసి నౌకలను నిలిపివేసినట్లు తెలిపింది. ఈ చర్యలు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు భాగమని అమెరికా వాదిస్తోంది.

భారత్‌ తీవ్ర నిరసన..
భారత్‌ ఈ ఘటనలపై తీవ్రంగా నిరసన తెలిపింది. ముగ్గురు భారతీయ నావికుల మరణం తర్వాత భారత ప్రభుత్వం అమెరికా దౌత్యాధికారులను పిలిపించి బలమైన నిరసన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వేలాది మంది నావికులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భారత్‌–అమెరికా సంబంధాలపై తాత్కాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

నిజం ఎవరిది?
ఈ వివాదంలో రెండు వైపుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. అమెరికా సైనిక దళాలు హెల్‌ఫైర్‌ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా అంగీకరించడం వాస్తవం. అయితే ట్రంప్‌ ఇరాన్‌పై డ్రోన్‌ దాడి ఆరోపణ చేయడం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. భారత్‌లో ఉన్న ఆగ్రహం నుంచి దృష్టిని మరల్చేందుకు, లేదా ఇరాన్‌పై అదనపు ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్‌ మధ్య ఉన్న పాత శత్రుత్వం, చమురు ఎగుమతులపై నిషేధం, హార్ముజ్‌ జలసంధి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఈ ఘటనలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలకు ఇది రెండు పక్షాల మధ్య చిక్కుకున్న పరిస్థితిని సృష్టిస్తోంది. నావికుల భద్రతను నిర్ధారించడం, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కోరడం భారత్‌ ముందున్న ప్రధాన సవాల్‌.

'పెద్ది' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. మరో మైలురాయిని దాటిన గ్లోబల్ స్టార్..

Peddi 12 Days Collections
Peddi 12 Days Collections

Peddi 10 Days Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద మరో సరికొత్త మైలు రాయిని దాటింది. మన టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. మేకర్స్ ఈ చిత్రం కేవలం 8 రోజుల్లో 366 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టినట్టు పోస్టర్లు వేశారు కానీ , అందులో ఎలాంటి నిజం లేదు. ప్రతీ నిర్మాత తమ సూపర్ హిట్ సినిమాకు చేసినట్టుగా, ‘పెద్ది’ నిర్మాతలు కూడా చేశారంతే. కానీ క్లోజింగ్ లో మాత్రం ఈ చిత్రం 366 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే నేటి నుండి ఈ చిత్రానికి మామూలు రేట్స్ లోనే టిక్కెట్స్ అందుబాటులోకి రానుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ , రిపీట్ గా చూసే ఆడియన్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 10 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 3 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 8 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు 9 కోట్ల రూపాయిల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 305 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 182 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. నైజాం , ఈస్ట్ గోదావరి , కృష్ణ , గుంటూరు , ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. మిగిలిన ప్రాంతాల్లో నేడు బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్స్ లో మాత్రం దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. 10 రోజుల్లో ఈ చిత్రానికి 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు , కేవలం ప్రీమియర్స్ + మొదటి రోజు నుండి వస్తుందని అంచనా వేశారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ చివరికి అది క్లోజింగ్ లో వచ్చింది. 10 మిలియన్ డాలర్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే , 50 శాతం నష్టాలు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా నార్త్ ఇండియా లో కూడా ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇప్పటి వరకు కేవలం పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 80 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి. ఓవరాల్ గా ఈ సినిమా లాంగ్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ.. రంగంలోకి పవన్!

Gnaneswari Missing Case Latest Update
Gnaneswari Missing Case Latest Update

Gnaneswari Missing Case Latest Update: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఆ చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తోంది. వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇంతవరకు ఆచూకీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీసారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుకునేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గాలింపు చర్యల్లో పోలీస్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్టీఆర్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. దట్టమైన అడవుల్లో సైతం వెళ్ళగలిగే అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంపు వాచర్స్, నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్.

పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 8 రోజులు దాటుతున్న ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాదాపు 400 మంది పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు పాల్గొంటున్నారు. అత్యాధునిక డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క ప్రత్యక్షం కావడంతో.. దానికి జిపిఆర్ఎస్ కట్టి అడవుల్లో వదిలారు.. అయినా సరే ఎటువంటి ఫలితం లేకపోయింది. అయినా సరే ప్రయత్నాల్లో ఉంది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. కాకినాడ ఎస్పీకి నేరుగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

చనిపోయిన కుక్క..
అయితే పోలీస్ శాఖ గత ఎనిమిది రోజులుగా చేపట్టిన దర్యాప్తును వివరించారు కాకినాడ జిల్లా ఎస్పీ. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించామని ఎస్పీ వివరించారు. కాగా జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన పెంపుడు కుక్క ఊహించని రీతిలో చనిపోయింది. గత రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తించిన ఆ కుక్క.. చివరకు శనివారం చనిపోయింది. చిన్నారితో పాటుగానే ఈ కుక్క కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల కిందట తిరిగి వచ్చింది. చిన్నారి ఇంటి వద్దకు చూసి కంగారుతో అడవిలోకి పారిపోయింది. అతి కష్టం మీద ఆ కుక్కను బంధించారు. ఆ కుక్కకు జిపిఎస్ ట్రాకర్ అమర్చి చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలం కాగా.. శనివారం కుక్క సైతం చనిపోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.