Home Blog Page 112

జగన్ 'కాపు' రాజకీయం.. ఈసారి ముద్రగడ కాదు!

YSRCP Kapu Politics
YSRCP Kapu Politics

YSRCP Kapu Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తప్పును తెలుసుకుంది. మొన్నటి ఎన్నికల్లో కాపులను వదులుకొని మూల్యం చెల్లించుకుంది. అందుకే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు ఓటు బ్యాంకు ను మళ్లీ పొందేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ బాధ్యతను గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేత తోట త్రిమూర్తులకు అప్పగించారు. ఆయన కాపు నేతలకు భారీ విందు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులకు అండగా అంబటి రాంబాబు, కన్నబాబు లను అందించారు జగన్. ఈ ముగ్గురు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నేతలను సమీకరించి… వైసీపీ వైపు కాపులు టర్న్ అయ్యేలా.. కూటమిపై కాపులు తిరగబడేలా ప్లాన్ చేయనున్నారు.

* ప్రతిపక్షంలో ఉంటేనే..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపుల కోసం జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యం చేయక మానరు. 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ సమయంలో కాపుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు ముద్రగడ పద్మనాభం ను వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేయించారు. తుని రైలు విధ్వంస ఘటనతో ఆ ఉద్యమం హింసాత్మక పరిస్థితికి దారితీసింది. కాపులు టిడిపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. దాని ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించింది. అయితే అలా వైసీపీకి దగ్గరైన కాపులను అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు జగన్. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో చూసారు. కాపులు పవన్ వెంట నడిచారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేయాలని చూస్తున్నారు జగన్. ఆ బాధ్యతను వైసీపీలో ఉన్న కాపు నేతలకు అప్పగించారు.

* కాపులు లేనిదే కష్టం..
కాపులు లేనిదే రాజకీయం చేయలేనని ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంబటి రాంబాబు తో తిట్టించి ఆయన జైలుకు వెళ్లాక కాపు టైగర్ గా చిత్రీకరించారు. కాపుల విషయంలో ఏ పరిణామం జరిగినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు. తాజాగా సాయి కృష్ణ అనే కాపు యువకుడు పై క్రిమినల్ కేసు లు ఉంటే.. ఆయనను సాధారణంగా జైలుకు తీసుకెళ్లారు. తర్వాత ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. ఇలా అదృశ్యం వెనుక కూటమి ప్రభుత్వ వైఫల్యం ఉందని.. కాపుల్లో ఒక రకమైన వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో ఉన్నారు.

* తోట త్రిమూర్తులు కొత్త పాత్రలో ..
ఇప్పుడు తోట త్రిమూర్తులకు కాపుల బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకు అప్పగిస్తే గతం మాదిరిగా కాపులు నమ్మే పరిస్థితిలో లేరు. అలా నమ్మి ఉంటే కచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ మాట వినేవారు కదా ప్రజలు. అయితే ఇప్పటికీ వైసీపీ పట్ల కాపుల అభిప్రాయం మారలేదు. ఇప్పుడు తోట త్రిమూర్తులు లాంటి వారికి బాధ్యతలు కట్టబెట్టినా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

అల్లు అర్జున్ కంటే ముందే లోకేష్ కనకరాజ్ ఆ కథ ను ఆ స్టార్ హీరోకి చెప్పాడా..?

Allu Arjun And Lokesh Kanagaraj
Allu Arjun And Lokesh Kanagaraj

Lokesh Kanagaraj Allu Arjun Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో తన మార్కును చూపించాడు. ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ గా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అని అందరు అనుకున్నారు. కానీ లియో, కూలీ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు.

ఇక తనకు అవకాశం ఇచ్చే హీరోలు కూడా కరువైపోయారు అంటూ చాలామంది కామెంట్లు చేసినప్పటికి ఆయన ఎట్టకేలకు అల్లు అర్జున్ కి ఒక కథను చెప్పి ఒప్పించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ తో చేయబోతున్న కథని మొదట కొంతమంది పాన్ ఇండియా స్టార్ హీరోలకు వినిపించారట.

వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరికి ఆ కథ వెళ్లిందని చాలామంది చెబుతున్నారు. మొత్తానికైతే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా ఈ కథనైతే వినిపించారట. కానీ కూలీ సినిమా తేడా కొట్టడంతో షారుక్ లోకేష్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ లోకేష్ ను అంతగా నమ్మడానికి గల కారణం ఏంటి అంటే లోకేష్ చాలా మంచి మేకింగ్ స్టాండర్డ్స్ ఉన్న దర్శకుడు…

సరైన కథ దొరికితే మాత్రం దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగే కెపాసిటి అతనికి ఉంది. అందువల్లే అతన్ని అల్లు అర్జున్ నమ్మి మరి అతనికి సినీ చేసే అవకాశం ఇస్తున్నాడు. ఈ కథని షారుక్ ఖాన్ రిజక్ట్ చేసినప్పటికి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథనైతే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. లోకేష్ అల్లు అర్జున్ కి భారీ విజయాన్ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

ఒక్క హీరో కూడా నాతో అలాంటి పని చేసే సాహసం చేయలేదంటూ రోజా హాట్ కామెంట్స్..

Roja
Roja

Roja: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మన టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూ , ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమె అసలు పేరు లతా రెడ్డి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రొజాగా మార్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన ‘ప్రేమ తపస్సు ‘ అనే చిత్రం ద్వారా మన వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వంటి బడా సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రోజా. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఈమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది.

ముందుగా తెలుగు దేశం పార్టీ లో చాలా ఏళ్ళు కొనసాగింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చింది , రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీ లోకి చేరింది. మూడు సార్లు వైసీపీ పార్టీ నుండి నగరి నియోజకవర్గం నుండి పోటీ చెయ్యగా, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యింది. 2019 – 2024 వైసీపీ పాలనలో మంత్రి కూడా అయ్యింది. ఇలా రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలను చూసిన రోజా , ఇప్పటికీ రాజకీయాల్లో యాక్టీవ్ గానే కొనసాగవుతుంది. మధ్యలో కొన్ని టీవీ షోస్ లో కూడా కనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో పని చేస్తున్నప్పుడు తనకు ఎదురైనా అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది.

తనకు సినీ ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేదని, కానీ ఏ హీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేకపోయారని చెప్పుకొచ్చింది రోజా. అందుకు కారణం కెరీర్ ప్రారంభం లోనే ఈమె ప్రముఖ డైరెక్టర్ సెల్వమణి దృష్టిలో పడడం వల్లే అట. రోజా ని చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడట సెల్వమణి , అప్పటి నుండి ఆయన రోజా పట్ల స్పెషల్ కేర్ చూపించడం మొదలు పెట్టాడట, హీరోలకు సెల్వమణి తనని ప్రేమిస్తున్నాడనే విషయం అర్థం అవ్వడం వల్ల, ఎవ్వరూ తనకు లవ్ ప్రపోజల్స్ పెట్టలేదని, ఒక రోజు సెల్వమణి వచ్చి లవ్ ప్రపోజ్ చేశాడని , కొన్ని రోజులు అతనితో ట్రావెల్ చేసిన తర్వాత ఇంట్లో చెప్పి పెళ్ళికి ఒప్పించానని చెప్పుకొచ్చింది రోజా.

సుకుమార్ - ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన మరో సినిమా ఆగిపోవడానికి కారణం ఎవరంటే..?

Sukumar NTR Movie
Sukumar NTR Movie

Sukumar NTR Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ‘ఆర్య’ సినిమా నుంచి మొదలైన తన ప్రస్థానం ‘పుష్ప 2’ వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే వచ్చింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’ సినిమా చేసి ఫ్లాప్ ను మూట గట్టుకున్న తర్వాత ఎన్టీఆర్ ఏరికోరి మరి సుకుమార్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఆ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో అనే సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఎన్టీఆర్ కెరియర్ లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేయాలని వీళ్లిద్దరు అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటంటే సుకుమార్ ఎన్టీఆర్ కి చెప్పిన కథ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదట. దానికి తోడుగా ఆ కథలో చాలా లేయర్స్ అయితే ఉన్నాయి. ఒకదాని తోడుగా స్క్రీన్ ప్లే లో కూడా చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయట. వాటన్నింటినీ క్లియర్ చేసుకున్న తర్వాత సినిమా చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ చెప్పడంతో సుకుమార్ సరేనని చెప్పాడట.

ఇక ఆ క్రమంలోనే అంతకు ముందే రాసుకున్న ‘రంగస్థలం’ సినిమాను రామ్ చరణ్ తో చేసి భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఆ వెంటనే అల్లుఅర్జున్ తో పుష్ప, పుష్ప 2 లాంటి సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించాడు… ఇక అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.

నిజానికి సుకుమార్ తో సినిమా చేసే అవకాశం వస్తే చాలు అని చాలామంది హీరోలు ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సుకుమార్ స్క్రీన్ ప్లే లో అంత క్లారిటి లేదని ఆ కథను రిజెక్ట్ చేశాడని అతనికి మరి కొంత మంది చెప్తున్నారు. ఎందుకంటే సుకుమార్ కి సరిగ్గా కథ చెప్పడం రాదని చాలామంది నటులైతే చెప్పారు.

ఆ కన్ఫ్యూజన్ తోనే ఆయన ఏదో చెప్పినట్టున్నాడు. కానీ స్క్రీన్ మీద మాత్రం దాన్ని పర్ఫెక్ట్ గా పోట్రే చేయగలుగుతాడు అని మరి కొంతమంది భావిస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళు కలిసి మరో సినిమా చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి…

పవన్ కళ్యాణ్ లోని ఫైర్ ను బయటికి తీసే సినిమా చేయగలిగిన దర్శకుడు ఆయనొక్కడేనా..?

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలతో పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా సంపాదించుకున్నాడు. అలాంటి నటుడు భారీ విజయాలను సాధించడమే కాకుండా ‘జనసేన’ పార్టీ పెట్టి రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలాగే తన అభిమానులను సైతం ఆనందింపచేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇక మీదట చేయబోయే సినిమాల మీద చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ లోని ఫైర్ మొత్తాన్ని బయటికి తీసి అతని చేత ఒక భారీ హై వోల్టేజ్ సినిమాని చేయించగలిగే దర్శకుడు ఎవరు అంటూ కొన్ని రోజులుగా కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి దేవకట్ట లాంటి దర్శకుడికి పవన్ కళ్యాణ్ దొరికితే ఆయన సోషల్ మెసేజ్ ని ఇస్తు సినిమాని ఆద్యంతం రక్తి కట్టించగలిగే టాలెంట్ దేవకట్ట కి ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ లో దేవకట్టా తో ఒక సినిమా చేస్తాను అని మాట కూడా ఇచ్చాడు. కానీ ఫ్యూచర్లో అది వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాతో మరోసారి దేవకట్టా టాలెంటెడ్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తారా స్థాయికి వెళ్ళిపోతుంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న '#Mega158' షూటింగ్.. ౩వ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..

Chiranjeevi Mega158 movie new look
Chiranjeevi Mega158 movie new look

Mega158: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే డైరెక్టర్ బాబీ తో ఒక సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఈ సినిమాని ప్రస్తుతం అభిమానులు #Mega158 అనే పేరుతో పిలుస్తున్నాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు వెయ్యనటువంటి మాఫియా డాన్ పాత్రని ఇందులో చేయబోతున్నాడు. ఇది కచ్చితంగా అభిమానులకు పండుగ లాంటి వార్తనే. రీసెంట్ గానే పొలాచ్చి లో ఒక 12 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, నివేత పెత్తురాజ్ మరియు అనశ్వర రాజన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి అట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి సంబంధించిన మూడవ షెడ్యూల్ ని ఈ నెల 19 న ప్రారంభించబోతున్నారు అట. చిరంజీవి , ప్రకాష్ రాజ్ లతో పాటు పలువురు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద ఈ సినిమాకు 105 వర్కింగ్ డేస్ ప్లాన్ చేసాడట డైరెక్టర్ బాబీ. ఇంత స్పీడ్ లో షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నాడంటే , కచ్చితంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు గట్టి ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతోంది. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ని చాలా కాలం తర్వాత వింటేజ్ కామెడీ టైమింగ్ లో చూపించే ప్రయత్నం చేసాడు.

అలాంటి సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ నుండి రాబోతున్న చిత్రం కాబట్టి , చిరంజీవి ని వేరే లెవెల్ లో చూపిస్తాడని బలంగా నమ్ముతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే టాక్ ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అదే నిజమైతే సౌత్ లోనే ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో పెరుగుతాయి. ఒకే తరానికి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ వెండితెర పై కనిపిస్తే మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ కదా మరీ. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 22 న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఒకే రోజు విడుదల కాబోతున్న 'ఒక్కడు', 'గబ్బర్ సింగ్'.. రీ రిలీజ్ హిస్టరీ లో అరుదైన ఘట్టం..

Gabbar Singh Re Release
Gabbar Singh Re Release

Gabbar Singh Re Release: టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మధ్య ఒకప్పుడు పోటీ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి కి ముందు టాలీవుడ్ రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి ఖాతాల్లోనే ఉండేవి. ఆ రేంజ్ డామినేషన్ చూపించారు. అయితే ఎప్పుడూ కూడా వీళ్లిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు లేవు. ఒక్కసారైనా అలా జరిగితే బాగుండును అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది సాధ్యం అవ్వలేదు. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా , వీళ్లిద్దరి కెరీర్స్ లో కల్ట్ క్లాసిక్స్ గా పిలవబడే మురారి, జల్సా సినిమాలను ఒకే రోజున విడుదల చేశారు. ఈ రెండు సినిమాల్లో జల్సా చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అంత కూడా , మురారి చిత్రానికి లేకపోవడం గమనార్హం.

ఆ రేంజ్ మార్జిన్ తో మహేష్ బాబు ని బీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి రీ రిలీజ్ సినిమాల మధ్య భారీ క్లాష్ జరగబోతుంది. ఈ నెల 26 వ తేదీన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ‘గబ్బర్ సింగ్’, మహేష్ బాబు సెన్సేషనల్ హిట్ ‘ఒక్కడు’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఇద్దరి స్టార్ హీరోల కెరీర్స్ లో ఈ రెండు సినిమాలు కూడా మైల్ స్టోన్స్ లాంటివి. ఈ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి రేంజ్ మారిపోయింది. అలాంటి సినిమాలను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. దేనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది?, ఏ చిత్రానికి ఎక్కువ గ్రాస్ వస్తుంది? అంటూ సోషల్ మీడియా లో లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ రెండు సినిమాలను వివిధ సందర్భాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు.

‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని అనేక సందర్భాల్లో రీ రిలీజ్ చేశారు. చివరగా 2024 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయగా, ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండియన్ రికార్డు గా నిల్చింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి , ఒక్కటి కూడా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు రికార్డు ని బద్దలు కొట్టలేయకపోయాయి అంటే , ఈ రీ రిలీజ్ ఎంత క్లిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ఒక్కడు చిత్రాన్ని ఏకంగా నాలుగు సార్లు రీ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు చిత్రాలను ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి.

చంద్రబాబుకు 'చింత'మనేని.. ఇలాంటి వారితో దెబ్బతింటున్న ఇమేజ్!

Chandrababu Naidu, Chintamaneni

Chandrababu Chintamaneni : కొంతమంది టీడీపీ నేతల వ్యవహార శైలి అధినేత చంద్రబాబుకు ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి చికాకు పెడుతోంది. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాచుకుని కూర్చుంది. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకండి అని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేస్తూ వచ్చారు. కానీ రెండు పార్టీల్లోనూ ఎమ్మెల్యేలపై రోజురోజుకు ఆరోపణలు పెరుగుతున్నాయి. లైంగిక ఆరోపణలు రావడం, చాలామంది దూకుడుగా వ్యవహరిస్తుండడంతో… వారిని ఎలా కట్టడి చేయాలో కూడా తెలియడం లేదు. ప్రభుత్వ పెద్దలుగా వారు బాగానే పని చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలోగా.. కొంతమంది వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది.

* చింతమనేని హల్ చల్..
తాజాగా చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి బయటపడింది. రోడ్డుపై అర్ధరాత్రి ఆయన హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసిపి ట్రాప్ లో పడి ప్రభాకర్ అలా చేశారని.. అందుకు కారణమైన టిడిపి నేతను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అంతకుముందు విజయవాడ ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి ఉండేది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో కూడా కనిపించాయి. ఎంపీపై నేరుగా విమర్శలు చేశారు తిరువూరు ఎమ్మెల్యే.. ఏడాది కిందట అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. ఇలా చాలామంది ఎమ్మెల్యేల పనితీరు వివాదాస్పదంగా మారింది. ఇటువంటి వివాదాలు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి.

* చాలా రకాల ఆరోపణలు..
చాలా జిల్లాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు అంతర్గతంగా అరాచకాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆరోపణలతో పాటు వివాదాల్లో చిక్కుకుంటున్న వారు ఉన్నారు. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలో చంద్రబాబుకు తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం. వీరిపై చర్యలు తీసుకోవడం లేదు. చాలా స్ట్రిక్ అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఇటువంటి వారితో దెబ్బతింటుంది. రాజకీయాల్లో మర్యాదస్తులుగా పేరుపొందిన చాలామంది సైతం ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నారు. వారి వ్యక్తిగత ప్రవర్తన పై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాష్ట్రాన్ని ఏదో చేయాలన్న ఆలోచనతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాజకీయంగా వారికి సొంత పార్టీ నేతలతో ఇబ్బందులు వస్తుండడంతో ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు.

* ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా..
సీఎం చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు ఉంది. గతానికి భిన్నంగా ఆయన వైఖరి ఉండి. వీలైనంతగా ప్రజలతో మమేకం కావడానికి నవ్వుతూ ప్రజల మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సొంత పార్టీ వారితో పాటు కూటమి ఎమ్మెల్యేలకు ఆయన ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నారు. శాంతంగా ఉండండి.. వివాదాలకు దూరంగా ఉండండి.. ప్రజల మధ్య ఉండండి అని ఎమ్మెల్యేలకు పదేపదే చెబుతున్నారు. చాలామందికి ఈ విషయం అర్థం అవుతోంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం తత్వం బోధపడడం లేదు.

రాజమౌళి తండ్రి ఫోన్ చేసి నన్ను అలాంటి సహాయం కోరారు - పూరి జగన్నాథ్

Puri Jagannadh
Puri Jagannadh

Puri Jagannadh: మన టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్స్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా పూరి జగన్నాథ్ పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన ఫార్మ్ లో లేదు , చాలా చెత్త సినిమాలు ఈమధ్య కాలంలో వరుసగా తీస్తూ వస్తున్నాడు, అయినప్పటికీ జనాల్లో పూరి జగన్నాథ్ కి ఇంతటి క్రేజ్ ఉండడానికి కారణం , ఆయన గతం లో ఎలాంటి సినిమాలు తీసేవాడో అందరికీ తెలుసు కాబట్టి. బద్రి , పోకిరి , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు , శివమణి, చిరుత, బుజ్జిగాడు , టెంపర్, బిజినెస్ మ్యాన్ , ఇలా ఒక్కటా రెండా?, ఎన్నో కల్ట్ క్లాసిక్ కమర్షియల్ సినిమాలను అందించిన లెజెండ్ ఆయన. అలాంటి డైరెక్టర్ నేడు తీస్తున్న సినిమాలు చూస్తుంటే ఆయన్ని అభిమానించే వాళ్లకు ఎంత బాధగా ఉంటుందో మాటల్లో వర్ణించలేము.

ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనతో మాట్లాడిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నా సినిమా ఒకటి ఫ్లాప్ అయ్యినప్పుడు , ఒకరి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఆయన ఎవరో కాదు , విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన నాకు ఫోన్ చేసి ఒక సహాయం కోరారు, ఏంటి సార్ అని అడగ్గా, ఇక నుండి నువ్వు తీసే సినిమాలు తీసేముందు , ఒక్కసారి నాకు నీ స్టోరీలను వినిపించు , ఎందుకంటే నీలాంటి గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ఇలాంటి ఫ్లాప్స్ ని అందుకోవడం చూడలేకపోతున్నాను అని అన్నాడు. ఆయన మాట్లాడిన మాటలకు , చూపిన ప్రేమకు ఎంతో ఎమోషనల్ అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ పడ్డ బాధనే ఇప్పుడు తెలుగు ప్రజలు పూరి జగన్నాథ్ విషయం లో పడుతున్నారు.

పూరి జగన్నాథ్ లో క్రియేటివ్ డైరెక్టర్ , డైలాగ్ రైటర్ ఇంకా బ్రతికే ఉన్నాడు , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఆయనలోని రైటర్ చనిపోయాడు. ఇది కచ్చితంగా ప్రతీ ఒక్కరు నమ్మాల్సిందే. టెంపర్ చిత్రాన్ని ఎలా అయితే ఆయన వక్కంతం వంశీ స్టోరీ ని తీసుకొని తెరకెక్కించాడో , అలా ఒక రైటర్ అందించే స్టోరీలను తన దర్శకత్వ ప్రతిభ తో తెరకెక్కిస్తే , పూరి జగన్నాథ్ ని మించిన డైరెక్టర్ ఇప్పటికీ ఇండియా లో ఉండదు. కానీ ఆ దిశగా పూరి జగన్నాథ్ అసలు అడుగులు వేయడం లేదు. అదే అభిమానుల్లో నెలకొన్న బాధ. లేటెస్ట్ గా ఆయన విజయ్ సేతుపతి తో ‘స్లం డాగ్’ అనే చిత్రం చేశాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది, అభిమానులు పెదవి విరిచారు, మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సుకుమార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ వీళ్ళేనా..?

Sukumar
Sukumar

Sukumar remuneration : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారిన తర్వాత వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీ స్థాయిలో పెంచేశారు. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలకు ఇండియా వైడ్ గా పాపులారిటి దక్కుతుంది. అలాగే కలెక్షన్స్ సైతం భారీగా వస్తున్నాయి. కాబట్టి ఆయా దర్శకులు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే ఛార్జ్ చేస్తున్నారు… ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన సుకుమార్ ఆ తర్వాత చేయబోయే రామ్ చరణ్ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి…నిజానికి సుకుమార్ కంటే కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులు ముగ్గురు ఉన్నారు. ఇక మొదటి ప్లేస్ లో రాజమౌళి ఉన్నాడు. ఒక సినిమా కోసం రాజమౌళి 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక అతని తర్వాత స్థానంలో ప్రశాంత్ నీల్ ఒక సినిమా కోసం 120 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. సందీప్ రెడ్డి వంగ సైతం 110 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ కంటే కూడా వీళ్ళు ముగ్గురు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

కాబట్టి వీళ్ళు కూడా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. మొత్తానికైతే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాతో 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఆ మూవీని నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికోసమే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నాడు…

రామ్ చరణ్ తో చేయబోయే సినిమా విజువల్ వండర్ ని క్రియేట్ చేయబోతుందట. ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అంటూ సుకుమార్ తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది…

ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ ముందుకు అడుగులు వేస్తున్నాడు. దానికోసమే కథ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటిని మెయిటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

హోం మంత్రి అనిత పై గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.. పవన్ సంచలనం

Gudivada Amarnath, Vangalapudi Anitha, Pawan Kalyan

Pawan Kalyan reaction : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయడం లేదు. ఇంకా అవే దూషణలతో రెచ్చిపోతున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. మేకప్ మంత్రి అనేసారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ దళిత మహిళ.. ఆపై ఉపాధ్యాయురాలు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. అటువంటి మహిళను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడంపై గుడివాడ అమర్నాథ్ తీరును తప్పుపడుతున్నారు. కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం తాను విధానపరమైన విమర్శలు చేశానని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. నాయకులు తాము ఆడే ప్రతి మాట బాధ్యతగా ఆడాలని ఇతవు పలికారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే ఆ విధానంలో ఉన్న లోపాలను నిశితంగా విమర్శించాలి కానీ.. వ్యక్తిగత జీవితాలపై బురద జల్లడం దారుణమన్నారు. మహిళల కట్టూ బొట్టు పై మాట్లాడే స్థాయికి రాజకీయ నాయకులు దిగజారి పోవడం దారుణమని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను గట్టిగానే తిప్పికొట్టాలని కూటమినేతలకు పిలుపునిచ్చారు. పౌర సమాజం హర్షించే భాషను మాత్రమే వినియోగించాలని కూటమి పార్టీల నాయకులను సూచించారు పవన్ కళ్యాణ్.

* అప్పట్లో బూతులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులు ఏ స్థాయిలో మాట్లాడేవారు తెలియంది కాదు. నీ అమ్మ మొగుడా అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు కొడాలి నాని. అంటే తండ్రిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసేవారు. మధ్యలో తల్లి ప్రస్తావన కూడా తెచ్చేవారు. గతంతో పోల్చితే రాజకీయాల్లో బూతు పదాలు తగ్గుతాయి అని భావించారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, పెద్దగా ప్రజా మద్దతు లేకపోవడంతో వెనక్కి తగ్గుతారని భావించారు. కానీ నేతలు శృతిమించి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు అయితే నడిరోడ్డుపై సీఎం చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. మహిళా నేత రోజా సైతం వెనక్కి తగ్గడం లేదు. రోజు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విషయంలో సైతం అదే మాదిరిగా వ్యవహారం నడిచింది. ఒక దళిత మహిళ, ఆపై ఉపాధ్యాయురాలుగా చేసిన మహిళ, ఈ రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వంగలపూడి అనిత పై ఆ తరహా వ్యాఖ్యలు చేయడం పై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

* కూటమి నేతలకు సూచన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించే క్రమంలో కూటమి నేతలకు సైతం కీలక సూచనలు చేశారు. అవతలి వారు సంస్కారహీనంగా మాట్లాడినంత మాత్రాన కూటమికి అలాంటి అలవాట్లు అవసరం లేదంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. మనం మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలని స్పష్టం చేశారు. వారు చేసిన తప్పులను, అసభ్య ప్రసంగాలను పదేపదే జనాలలో ఎండగట్టడమే మన మొదటి కర్తవ్యం అని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటన తప్పకుండా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే దళిత మహిళపై ఈ స్థాయి ఆరోపణలు చేయడం పై ఆవర్గంలో కూడా చర్చ ప్రారంభం అయింది. అయితే తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని గుడివాడ అమర్నాథ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా.

కోచ్ అవతారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొంతమంది డైరెక్టర్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేయబోతున్నాడని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. నాగ్ అశ్విన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కానీ వీటిల్లో బుచ్చి బాబు తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. రీసెంట్ గా ‘పెద్ది’ మూవీ సక్సెస్ మీట్ లో కూడా విలేఖరులు మీ తదుపరి సినిమా మహేష్ బాబు తో అని ప్రచారం జరుగుతుంది , దీనిపై మీ కామెంట్స్ అని అడగ్గా, దేనికైనా సమయం రావాలి అండీ, చూద్దాం అంటూ చెప్పుకొచ్చాడు.

అంటే ఆయన సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే ఈ వార్తలను ఖండించలేదు అంటే , కచ్చితంగా చర్చలు జరిగాయి అనే దాని అర్థం. ఇది కాసేపు పక్కన పెడితే , ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని , ఈ చిత్రాన్ని ఏషియన్ సునీల్ నిర్మిస్తాడని అంటున్నారు. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని , ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కోచ్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు మాత్రమే , ఏది కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ‘వారణాసి’ పూర్తి అయ్యాకే మహేష్ తదుపరి చిత్రం పై స్పష్టమైన క్లారిటీ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా సందీప్ రెడ్డి వంగ తో మహేష్ బాబు సినిమా అయితే లేదు.

ఇక ‘వారణాసి’ విషయానికి వస్తే, ఈ చిత్రం షూటింగ్ విరామం లేకుండా శరవేగంగా సాగుతోంది. సెప్టెంబర్ నెల లోపు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని అంటున్నారు. ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదనే ద్రుష్టి పెడతారట. ఎందుకంటే ఈ సినిమా అత్యధిక శాతం VFX మీద ఆధారపడింది. అందుకే ఈ చిత్రం ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7 న విడుదల అవ్వడం కష్టమని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఫుట్ బాల్ నుంచి తప్పుకోవాల్సినవాడు.. 40 ఏళ్ళ వయసులో సాకర్ ను ఊపేస్తున్నాడు..

Vozinha
Vozinha

Vozinha: ఫుట్ బాల్ ఆడే ప్లేయర్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. మైదానంలో చిరుత పులుల మాదిరిగా పరుగులు తీస్తూ ఉంటారు. బంతిని డిఫెండ్ చేయడం మాత్రమే కాదు… గోల్ పోస్ట్ లోకి పంపించడంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. దీనికోసం విపరీతమైన శిక్షణ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నోటికి తాళం వేస్తారు.. మెచ్చిన మనుషులకు దూరంగా ఉంటారు. కేవలం ఆటే లోకంగా బతికేస్తూ ఉంటారు. ఫుట్ బాల్ ప్లేయర్లు 35 ఏళ్లలోపే ఉంటారు. సాధ్యమైనంత వరకు జట్లు కూడా అటువంటి ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ ఉంటాయి. వయసు పెరిగితే ఉత్సాహంగా ఆడలేరని జట్ల మేనేజ్మెంట్లు భావిస్తూ ఉంటాయి.

ఈ ఆటగాడి వయసు 40 సంవత్సరాలు ఒకానొక దశలో ఫుట్బాల్ కు వీడ్కోలు పలుకుదామని అనుకున్నాడు. దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరూ అభిమానులు భావించారు. మరి కొద్ది రోజుల్లో ఆ ప్రకటన చేస్తాడు అనుకుంటుండగా.. ఉన్నట్టుండి అతడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. కాకపోతే అతడి వయసు 40 సంవత్సరాలు.. అతని మీద అభిమానులకు పెద్దగా అంచనాలు కూడా లేవు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. తన ఉత్సాహానికి అది అడ్డంకి కాదని నిరూపించాడు. ప్రస్తుత సాకర్ టోర్నీలో 40 సంవత్సరాల వయసులో రంగంలోకి దిగి.. తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపాడు. యావత్ ఫుట్బాల్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.. ఇంతకీ ఆటగాడి మరెవరో కాదు.. కాబో వెర్డే జాతీయుడు వోజీనా.

మాజీ ఛాంపియన్.. బలమైన స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వోజీనా దుమ్మురేపాడు. కాబో వేర్ డే జట్టుతో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ దాదాపు 27 సార్లు గోల్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. కానీ ఒక బంతి కూడా నెట్లోకి దూసుకుపోలేకపోయింది.. దీనికి కాబో వెర్ డే ప్లేయర్ల నైపుణ్యం ప్రధాన కారణం. మరోవైపు గోల్ పోస్ట్ దగ్గర వోజీనా అడ్డు గోడ మాదిరిగా నిలిచాడు.. ఇతడు 25 సంవత్సరాల వయసులో ఫుట్బాల్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. అనేక జట్ల తరఫున ఆడాడు. 2012లో కాబో వెర్ డే నేషనల్ టీమ్ లోకి ప్రవేశించాడు.

ఒక దశలో అతడు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకున్నాడు. కానీ సాకర్ లో ఆడాలని భావించి మళ్లీ వెనక్కి వచ్చాడు. స్పెయిన్ జట్టుతో చేసిన ప్రదర్శన నేపథ్యంలో అతడు రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. ప్రపంచ కప్ ముందు వోజీనా కు ఇన్స్టాగ్రామ్ లో 50000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 24 లక్షల మించిపోయింది. అన్నట్టు ఇతడిని పెంచి పెద్ద చేసిన తాత.. అమ్మమ్మ.. అమ్మ మ్యాచ్ చూడలేకపోయారు. కొంతకాలం క్రితం అతడి తాత.. అమ్మమ్మ మరణించారు. అతని తల్లికి శ్వేత దేశం వెళ్లడానికి డబ్బులు సమకూరలేదు. దీంతో ఆమె ప్రపంచకప్ చూసేందుకు రాలేకపోయింది. ఇప్పుడు టీవీలో తన కొడుకు ప్రదర్శన చూసి ఎగిరి గంతులు వేసింది.

తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా లారెన్స్ ..? వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్..

Raghava Lawrence
Raghava Lawrence

Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్ , డైరెక్టర్ , హీరో రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తన అభిమానులకు రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసి , మీ వద్దంటే ఆగిపోతాను , రమ్మంటేనే వస్తాను , మీ అభిప్రాయాలూ చెప్పండి అంటూ ఒక వీడియో విడుదల చేశాడు . అభిమానులు అత్యధిక శాతం రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరుతూ , సీఎం విజయ్ TVK పార్టీ లో చేరాల్సిందిగా కోరారు. మరి లారెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కానీ , ఆయన ఇప్పటికే TVK పార్టీ లో చేరడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం విజయ్ ఆయన్ని పార్టీ లోకి ఆహ్వానించడాన్ని , తాను రాజీనామా చేసిన ‘తిరుచ్చి’ ప్రాంతం నుండి పోటీ చేయాల్సిందిగా లారెన్స్ ని విజయ్ కోరినట్టు తెలుస్తోంది.

అందుకే లారెన్స్ ఇప్పుడు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు తమిళనాడు మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. మరో ఆరు నెలల్లో తిరుచ్చి లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి ఉప ఎన్నికలు అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయి కాబట్టి, TVK పార్టీ నే కచ్చితంగా గెలుస్తుంది. లారెన్స్ ఈ స్థానం నుండి పోటీ చేసిన గెలిచిన తర్వాత ఆయన్ని తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. షాకింగ్ ఏంటంటే ఇన్ స్టాగ్రామ్ లో లారెన్స్ అధికారిక పేజీలో తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదా సీటులో కూర్చున్నట్టుగా, AI ద్వారా క్రియేట్ చేసిన ఒక ఫోటో ని అప్లోడ్ చేసాడు. దీనిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. లారెన్స్ పేజీ నుండి ఇలాంటి పోస్ట్ పడిందేంటి?, ఆయనకు తెలియకుండా అకౌంట్ ఏమైనా హ్యాక్ అయ్యిందా?, లేదా సరదాగా లారెన్స్ నే అప్లోడ్ చేశాడా? అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.

అయితే చివరికి తెలిసింది ఏమిటంటే అది ఫ్యాన్ పేజీ అని. ఈ పేజీని దాదాపుగా 12 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈ రేంజ్ ఫ్యాన్ పేజీ సీఎం విజయ్ కే లేదు, లారెన్స్ కి ఎక్కడి నుండి వచ్చింది?, ఇది కచ్చితంగా ఆయన అధికారిక పేజీనే, ఈ పోస్ట్ పడిన తర్వాత ఫ్యాన్స్ పేజీ గా మార్చుకొని ఉండొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. దీనిపై స్వయంగా లారెన్స్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన ‘బెంజ్’, ‘కాంచన 4’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు మార్కెట్ లో ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైనది కాదు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ పూర్తి అయ్యాయి కాబట్టే, రెగ్యులర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లారెన్స్ సిద్దమయ్యాడు.

మెస్సి, రొనాల్డో దిగుతున్నారు.. మైదానాలు హోరెత్తిపోతాయి.. రికార్డులు బద్దలై పోతాయి..

Lionel Messi And Cristiano Ronaldo
Lionel Messi And Cristiano Ronaldo

Lionel Messi And Cristiano Ronaldo: సాకర్ ఫీవర్ ప్రపంచాన్ని మొత్తం ఊపేస్తోంది. ఇందులో భారతదేశం కూడా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులు అభిమానులకు సరికొత్త ఫుట్ బాల్ మజాను అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా హై టెన్షన్ లో సాగుతోంది. కొన్ని మ్యాచ్లు డ్రా అవుతున్నప్పటికీ.. పేరుపొందిన జట్లు కూడా.. చిన్నచిన్న జట్ల చేతిలో ఓడిపోవడం.. లేదా డ్రా గా ముగించడంతో.. సాకర్ కప్ మీద ఉత్కంఠ తార స్థాయికి చేరుతోంది.

ఫేవరెట్ గా రంగంలోకి దిగిన అనేక జట్లు ఇప్పటివరకు తమ స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోతున్నాయి. అండర్ డాగ్ గా రంగంలోకి దిగిన జట్లు అదరగొడుతున్నాయి. అంచనాలకు మించి ఆటతీరుతో సత్తా చూపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సాగిన సాకర్ పోటీలు ఒక ఎత్తు.. ఇప్పుడు జరగబోయే పోటీలు మరొక ఎత్తు. ఎందుకంటే, ఇప్పుడు అసలు సిసలైన ఆటగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. వారు దిగితే చాలు మైదానాలు హోరెత్తిపోతాయి. రికార్డులు గల్లంతయిపోతాయి. చూస్తున్న ప్రేక్షకులకు నరాలు కట్ అయిపోతాయి.

ఫుట్బాల్ టోర్నీకి సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చే ఆటగాళ్లలో మెస్సి, రొనాల్డో ముందు వరసలో ఉంటారు.. వీరు ఇప్పటివరకు ఈ సాకర్ కప్పులో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే బుధవారం వీరు రంగంలోకి దిగుతున్నారు.. మెస్సి అర్జెంటీనా తరఫున ఆడబోతున్నాడు. ఈ జట్టు తన తొలి మ్యాచ్లో అల్జీరియాతో పోటీ పడబోతోంది.. రొనాల్డో పోర్చుగల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ జట్టు డిఆర్ కాంగోతో పోటీ పడబోతోంది.

అర్జెంటీనా డిపెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈ జట్టు విజయం మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు.. మరోవైపు ఈ సాకర్ కప్ లో అర్జెంటీనా స్థాయిలో కాకపోయినప్పటికీ.. పోర్చుగల్ కూడా బలమైన జట్టే.. కాంగో జట్టును సులువుగానే ఓడించగలుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ ల ప్రకారం చూస్తే ఏ జట్టు కూడా అంత సులువుగా లేదు. ఇటీవల మాజీ ఛాంపియన్ స్పెయిన్ జట్టును కాబో వెర్ డే నిలువరించింది.

ఈ ప్రకారం చూసుకుంటే అర్జెంటీనాకి.. పోర్చుగల్ జట్టుకు ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే మెస్సి, రొనాల్డో ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ప్లేయర్లకు మనదేశంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆ మధ్య మెస్సి మనదేశంలో పర్యటించాడు. పశ్చిమ బెంగాల్లో అతని కోసం ఒక స్టాట్యూ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెస్సి సందడి చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగాడు. ఒక మ్యాచ్ కూడా ఆడాడు.

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. ఈసారి బొమ్మలు

Gnaneshwari Missing Case
Gnaneshwari Missing Case

Gnaneshwari Missing Case: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. దీనికి సంబంధించి చిక్కుముళ్ళు అలానే ఉన్నాయి. ఇప్పటివరకు కిడ్నాప్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎస్టిఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో సైతం పోలీసుల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శోధన చేస్తున్నారు. కానీ ఏ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కావడం లేదు. ఇప్పటివరకు కిడ్నాప్ అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. చివరకు తండ్రిని సైతం అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. మరోవైపు చిన్నారితో కనిపించని కుక్క ఇంటి వద్దకు వచ్చినట్టే వచ్చి చనిపోయింది. ఈ పరిస్థితుల్లో అటవీ జంతువుల బారిన పడి ఉండవచ్చు అనే అనుమానం పోలీసుల్లో ఉంది. దానిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టినారు పోలీసులు.

* అటవీ జంతువుల పై అనుమానం..
ఆయిల్ ఫామ్ పాటలు ఉన్న ప్రాంతంలో కొండలు ఎక్కువగా ఉన్నాయి. అటువైపుగా అడవులు విస్తారంగా ఉన్నాయి. దీంతో వన్యప్రాణులు అటాక్ చేసి ఉండవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. కొండచిలువలు ఏమైనా హాని తలపెట్టాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. చిన్నారి మాదిరిగా బొమ్మలను ఏర్పాటు చేసి అందులో కొంత మాంసం పెట్టారు. ఆ వాసనకు అటవీ జంతువులు వచ్చి బొమ్మలను తీసుకెళ్తే.. చిత్రీకరించేందుకు కెమెరాలను సైతం అమర్చారు. ఆ బొమ్మలను అటవీ జంతువులు తీసుకెళ్లే మార్గంలో అన్వేషిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నది పోలీసుల ఆలోచన.

* కుక్క మరణంతో..
వాస్తవానికి చిన్నారితో పాటు పెంపుడు కుక్క కనిపించలేదు. అయితే అక్కడకు రెండు రోజులకు ఆ కుక్క ఇంటి వద్దకు వచ్చింది. కానీ వింత ప్రవర్తనతో కనిపించింది. దీంతో పోలీసులు ఒక ఆలోచన చేశారు. దాని మెడకు జిపిఆర్ఎస్ ట్రాకర్ను అమర్చారు. దానిని అనుసరించే ప్రయత్నం చేశారు కానీ అది అడవికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసింది. అక్కడకు రెండు రోజులకే అలసటతో మృతి చెందింది. అప్పటినుంచి అటవీ జంతువులపై అనుమానాలు మరింత పెరిగాయి. అటవీ జంతువుల బారిన చిన్నారిని తప్పించే క్రమంలో కుక్క పోరాడి ఉంటుందని.. అలా ఫైట్ చేసే క్రమంలో అలసటకు గురై చనిపోయింది అనేది ఒక అనుమానం. అందుకే కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కొన్ని నమూనాలను విశాఖ ల్యాబ్ కు పంపించారు. మొత్తానికి అయితే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు.