Home Blog Page 113

సెగలు రేపుతోన్న అందాల ప్రగ్యా..

Pragya Jaiswal Glamorous Look
Pragya Jaiswal Glamorous Look

ఆ ఎంపీ మీదనే రేవంత్ రెడ్డి ఆశలు

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: అదేంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలలో గండర గండడు కదా.. అంతటి కేసీఆర్ ను ఓడించి ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నాడు కదా.. కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ నిలబడ్డాడు కదా.. ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కదా.. అటువంటి వ్యక్తికి ఒక ఎంపీ ని నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి.. ఎంపీ మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తం అవుతున్నాయి కదా.. కరెక్టే.. కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కొన్ని సందర్భాలలో వద్దు అనుకున్న వాళ్ళతోనే అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ అవసరం రేవంత్ రెడ్డికి పడింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ను పూర్తిగా వదిలేసింది. ప్రతిపక్ష పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో విఫలమౌతుంది. చివరికి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు.. ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతోంది. కొన్ని పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ.. ఆ పత్రికలలో ఆస్థాయిలో ప్రచారం లభించడం లేదు. దీనికి తోడు ప్రభుత్వ పథకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. వారి వ్యక్తిగత ప్రచారానికి మాత్రమే వారు పరిమితం అవుతున్నారు.

గులాబీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ సోషల్ మీడియాను హైజాక్ చేస్తోంది. లెక్కకు మించిన చానల్స్ తో ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద.. ప్రభుత్వం మీద టన్నులకు టన్నులు మట్టిపొస్తోంది. దీంతో అధికార పార్టీకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే రోజుల్లో ఇబ్బంది ఎదురవుతుందని రేవంత్ రెడ్డి భావించారు.

ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నేరుగా క్లాసు పీకారు. మీరు ఇలానే వ్యవహరిస్తే బాగోదని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేల ప్రవర్తన పెద్దగా మారలేదు. ఈ నేపథ్యంలో లాభం లేదనుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ పరంగా.. ప్రభుత్వం పరంగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ప్రచార బాధ్యతలను ఒక ఎంపీకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ ఎంపీ రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉంటారు. గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన సపోర్ట్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నమ్మే అతికొద్ది మంది వ్యక్తులలో ఈ ఎంపీ కూడా ఉంటారు. అందువల్లే ఆ ఎంపీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది..

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. చేసిన అభివృద్ధి.. ఇతర విషయాల మీద ప్రచారాన్ని గట్టిగా చేయాలని ఆ ఎంపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్యచరణ మొదలు పెడతారని.. గులాబీ పార్టీకి ధీటుగా బదులిస్తారని.. తెలుస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా బలం గుర్తించారు. ఇప్పటికైనా సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటే పార్టీకి బాగుంటుంది. ప్రభుత్వానికి అంతకంటే బాగుంటుంది. లేకుంటే అంతే సంగతులు.

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనలో పెద్ద ఎత్తున చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్లతో పాటు నమ్మకస్తులైన నేతలను, మంచి పేరున్న నేతలను, సమాజం పై ప్రభావం చూపే తటస్థులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చేరికలకు గాను 14 మంది పార్టీ నేతలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు చేరికల విషయంలో జనసేన అధినేత పెద్దగా ఆసక్తి కనబరచలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు చేరికల విషయంలో నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే గట్టి వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.

* అప్పట్లో ఆసక్తి చూపలే…
2024 ఎన్నికల కు ముందు వివిధ పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎంపిక చేసుకున్న నేతలను పార్టీలోకి రప్పించి టికెట్లు ఇచ్చారు.. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయ కృష్ణ లాంటి వారిని అలానే రప్పించి టికెట్లు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు వచ్చారు. కిలారు రోశయ్యతో పాటు సామినేని ఉదయభాను వంటి నేతలు జనసేనలోకి వచ్చారు. అంతకుమించి పెద్దగా నేతలు కనిపించలేదు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరికల విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు జనసేన. కానీ ఇప్పుడు చేరికల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది నాయకత్వం. దాని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం, రెండు తటస్తులను చేర్చుకోవడం ద్వారా బలపడటం. ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేయడం. ఈ వ్యూహంతోనే జనసేన చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

* 14 మందితో కమిటీ..
జనసేన జాయినింగ్స్ కమిటీని 14 మంది నేతలతో ఏర్పాటు చేశారు అధినేత పవన్ కళ్యాణ్. ముగ్గురు ఎంపీలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఎమ్మెల్యేలతో పాటు యాక్టివ్ గా ఉన్న నాయకులను ఈ కమిటీలో స్థానం కల్పించారు. దీంతో చేరికలు పెరిగే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్నవారు, వివిధ రంగాల ప్రముఖులను జనసేనలోకి రప్పించే వ్యూహం ఇది అని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో పెట్టుకొని.. తగినంతమంది సమర్థవంతమైన నాయకులను సిద్ధం చేయాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమే.

మీ భర్తలు ఆ పనిచేయడం లేదా.. నేనున్నాను.. మర్చిపోవద్దు..

Karimnagar Fake Swami
Karimnagar Fake Swami

Karimnagar Fake Swami: ప్రస్తుతం మనం సాంకేతిక కాలంలో ఉన్నాం. చిటిక వేస్తే చాలు ఏదైనా తెలుసుకునే పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాం. మొండి వ్యాధులకు మందులు కనిపెడుతున్నాం. వర్షాలు ఎప్పుడు కురుస్తాయి.. కరువులు ఎప్పుడు వస్తాయి.. ఇలా అనేక విషయాలను వెంటనే చెప్పేస్తున్నాం. అంతేకాదు అతి త్వరలో చంద్రుడి మీద నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఇంతటి కాలంలో.. ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న మనం.. కొన్ని విషయాలలో మాత్రం మూస ధోరణిలో ఉంటున్నాం. ఇదే అదునుగా కొంతమంది రెచ్చిపోతున్నారు. దైవంశ సంభూతులుగా మారిపోతున్నారు.

నేటికీ గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది వ్యక్తులు గురువులుగా చలామణి అవుతున్నారు. తమను స్వయం ప్రకటిత దేవుళ్ళుగా ప్రకటించుకుంటున్నారు.. అంతేకాదు విచిత్రమైన వేషాలు వేసుకుంటూ.. చిత్రమైన మాటలు మాట్లాడుతూ.. గుర్రాల మీద.. ప్రత్యేకమైన వాహనాల మీద సంచరిస్తూ ప్రజలను మాయలో పడేస్తున్నారు. అంతేకాదు.. సమస్యలు ఉన్నాయని.. మంత్రాలు చేశారని.. భూతాల పీడ ఉందని అంటున్నారు. ఇటువంటివి కామనే అంటారా. అయితే అందులో ఇతడు ఏకంగా పీహెచ్డీ చేశాడు. వెంట్రుక వాసిలో తప్పిపోయింది గాని.. పోలీసులు సమయానికి వచ్చి ఉంటే ఇతడి వీపు సాపు అయ్యేది..

కరీంనగర్ జిల్లాలోని చందుర్తి.. వేములవాడ మండలాల్లో పలు గ్రామాలలో ఇటీవల ఒక దేశ గురువు సంచరించాడు. జుట్టు పెంచుకున్నాడు. మెడలో మాలలు వేసుకున్నాడు. చుట్టూ పసుపు పంచ ధరించాడు. గుర్రం మీద ఎక్కి గ్రామాలలో తిరిగాడు. అక్కడితోనే ఇతడి వ్యవహారం ఆగిపోలేదు. పలువురి గృహాలకు వెళ్ళాడు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని అడ్డదిడ్డంగా మాట్లాడాడు. మీ మొగుళ్ళు సుఖ పెడుతున్నారా.. దగ్గరగా ఉంటున్నారా.. మీరు నా వైపు రండి. నేను ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోవద్దు అంటూ చేతులతో రకరకాల సంకేతాలు చేశాడు. బూతు మాటలు మాట్లాడాడు. మొదట్లో అతడి వ్యవహారం మహిళలకు అర్థం కాలేదు. ఆ తర్వాత అతడి మీద తిరగబడ్డారు. వ్యవహారం చేయి దాటిపోతున్న నేపథ్యంలో అతడి శిష్యులు రంగంలోకి దిగారు. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి.. అందువల్లే స్వామీజీ అలా ప్రవర్తిస్తున్నారు అంటూ కవరింగ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మహిళలకు ఆగ్రహం మరింత పెరిగి దుమ్ము దులపడానికి ప్రయత్నించారు. అంతకుముందు ఆ స్వామీజీ శిష్యులు ఆయా గ్రామాలలో డబ్బులు వసూలు చేశారు. అయితే ఈ వ్యవహారం తెలిసిన తర్వాత ఖాకీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు రంగంలోకి దిగడంతో.. అప్పటికే ఆ స్వామీజీ తన అనుచరులతో జారుకున్నాడు.

పాత ఫోన్లతో డేటా సెంటరా.. ఇదేందయ్యా ఇది.. మేము ఎక్కడా సూడలే..

Old Smartphones Data Cente
Old Smartphones Data Cente

Old Smartphones Data Center: ఎకరాలకు ఎకరాలు భూమి కావాలి. దండిగా నీళ్లు కావాలి.. కరెంటు.. ఎటువంటి ప్రకృతి విపత్తులు చోటుచేసుకోని ప్రాంతం.. ఇలా అన్ని అనుకూలంగా ఉంటేనే ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా డేటా సెంటర్ వల్ల నీటి వినియోగం కూడా అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్ల మీద రకరకాల విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డేటా సెంటర్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

డేటా సెంటర్ల మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి పెరిగిపోతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డేటా సెంటర్లు ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల వాటి మీద ఒత్తిడి విపరీతంగా ఉంటున్నది. కరెంట్ వినియోగం.. వేడిమి పెరిగిపోవడం.. వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తు కాలంలో ఇలానే జరిగిపోతూ ఉంటాయి. వేరే విధమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.. అందువల్లే డేటా సెంటర్ల విషయంలో గూగుల్ ముందుగానే మేల్కొంది.

మానవ అతీత మేథ ఆధారంగా పనిచేసే సమాచార కేంద్రాల మీద భారం తగ్గించడానికి గూగుల్ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఏకంగా పాత స్మార్ట్ ఫోన్లతో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా పాత ఫోన్లో సహాయంతో ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. హై ప్రాసెసింగ్ పవర్ అవసరం లేకుండానే టాస్క్ లు వీటి ద్వారా చేయవచ్చని గూగుల్ నిపుణులు చెబుతున్నారు.

పాత ఫోన్ లలో ఉన్న మదర్ బోర్డులను అనుసంధానం చేయడం ద్వారా దీనిని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది గనుక విజయవంతం అయితే.. పాత స్మార్ట్ ఫోన్ల ద్వారానే సమాచార కేంద్రాలను నిర్వహించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. భూమి లభ్యత ఎక్కువగా లేకున్నా పర్వాలేదు. దీనికి తోడు ఉష్ణోగ్రత చాలావరకు తగ్గుతుంది. పైగా పర్యావరణం మీద ప్రతికూల ఫలితాలు అంతగా ఉండవు.

ఈ ప్రయోగాన్ని ఇటీవల గూగుల్ మొదలుపెట్టింది. ఇది చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని దశలు మిగిలి ఉన్నాయి. అవి పూర్తి అయితే.. ఇచ్చిన టాస్కులు విజయవంతంగా పూర్తి చేయగలిగితే అప్పుడు గూగుల్ ఈ పాత ఫోన్ల ద్వారా తన సమాచార కేంద్రాలను ఏర్పాటును మొదలుపెడుతుంది. అయితే ఇది జరగడానికి ఇంకా కొంతకాలం పడుతుంది.

అటు వానలు.. ఇటు ఎండలు.. ఏపీకి ఏమైంది?

Andhra Pradesh Weather
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather: ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ పరిస్థితుల్లో ఏపీకి వర్ష సూచన వచ్చింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు, అదే సమయంలో కొన్ని చోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* భారీగా ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇంకా నమోదవుతున్నాయి. అందుకే విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలే పంపుతోంది. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్త పోటు ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచిస్తున్నారు. మొన్ననే నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకాయి. రాష్ట్రం మొత్తం విస్తరించాయి. కానీ వర్షాలు మాత్రం ఆశాజనకంగా పడటం లేదు. గతవారం విస్తారంగా వర్షాలు కురిసాయి కానీ ఆగిపోయాయి. ఇప్పుడు ఉపరితల ద్రోణీ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏపీ ఫై ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. సెప్టెంబర్ వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉంటుందని అంచనా వేశారు. దీంతో ఏపీ ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* ఖరీఫ్ కు నిరాశ..
సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి ఏపీలో ఖరీఫ్ పనులు ప్రారంభం కావడం జరుగుతూ వస్తోంది. కానీ రెండో వారం దాటుతున్న ఇంతవరకు ఖరీఫ్ పనులు మొదలు కాలేదు. నదులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాలువలు బేల చూపులు చూస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో నిల్వలు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి. ఎల్ నినో ప్రభావంతో పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారు. అయితే ఎటువంటి పరిణామాన్నైనా తట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది.

'తల్లికి వందనం'పై ఫుల్ క్లారిటీ.. సాయం అప్పుడే!

Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై క్లారిటీ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. తరగతులు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం పథకం అమలు ఎప్పుడు అని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అధికారులతో సమావేశం అయ్యారు. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చర్చించారు. వీలైనంత త్వరగా విద్యార్థుల తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి.. నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం తల్లికి వందనం నిధుల విడుదల కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. అర్హుడైన ప్రతి విద్యార్థికి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది మాదిరిగానే విజయవంతంగా అమలు చేసేందుకు నిర్ణయించింది.

* పెరగనున్న లబ్ధిదారులు..
పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి చదువు సాయం కింద పదిహేను వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయలు, పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఒక్కో విద్యార్థికి రెండు వేల చొప్పున జమ చేశారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికిపైగా విద్యార్థులకు తల్లికి వందనం కింద సాయం అందింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13 వేల రూపాయల చొప్పున సాయం అందించారు. ఈ ఏడాది కూడా అవే మార్గదర్శకాలతో పథకాన్ని అమలు చేసేందుకు రైతులు సిద్ధపడ్డారు. గత ఏడాదితో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

* అవి తప్పనిసరి..
తల్లికి వందనం పథకం అర్హత కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని విషయాలను గమనించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా.. ఆధార్ కార్డు నంబర్ తో లింక్ అయ్యి ఉండాలి. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ లింకింగ్ అనేది కూడా తప్పనిసరి. అలాగే సచివాలయ మ్యాపింగ్ కూడా ఉండాలి. ఈ అంశాలు సక్రమంగా ఉన్నాయో లేదో విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తల్లికి వందనం అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితా రూపకల్పన తర్వాత సచివాలయాల వారీగా జాబితాలను ప్రదర్శించనున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జూలై మూడో వారంలో తల్లికి వందనం పథకం నిధులు జమ చేసే అవకాశం ఉంది.

వైష్ణవి అందాల అరాచకం..

Vaishnavi Andhale bikini look
Vaishnavi Andhale bikini look

హమ్మయ్య.. అన్నదాత సుఖీభవ నిధులు ఫిక్స్!

Annadata Sukhibhava
Annadata Sukhibhava

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధులపై బిగ్ అప్డేట్ వచ్చింది. రైతులకు ఖరీఫ్ సాగు సాయం కింద నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద సాయం అందించేందుకు నిర్ణయించింది. జూన్ 20న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అన్నదాత సుఖీభవ కింద ఏటా మూడు విడతల్లో సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలు అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు సాయం అందిస్తూ వస్తోంది. ఇప్పటివరకు కేంద్రం పీఎం కిసాన్ కింద 23 విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. గత ఏడాది నుంచి అన్నదాత సుఖీభవ అమలవుతోంది. రెండు విడతల్లో 7000 చొప్పున.. చివరి విడత 6000 రూపాయల చొప్పున జమ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో ఒక విడత నిధులు జమ అయ్యాయి.

* భారీగా పెరిగిన సాయం..
గతంలో రైతు భరోసా పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగు సాయం అందించేది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.7500 మాత్రమే అందించేవారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి కేవలం రూ.13,500 సాయం మాత్రమే అందేది. కానీ ఇప్పుడు ఆ సాయం మొత్తం 20 వేలకు పెరగగా.. రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలు అందిస్తూ వచ్చింది. ఈనెల 20న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు జమ చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

* తప్పుల సవరణకు అవకాశం..
అర్హత గల ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తప్పుల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. ఏవైనా తప్పుల కారణంగా అన్నదాత సుఖీభవ సాయం పొందని రైతులు.. తమ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భూముల వివరాలకు ఆధార్ లింకు చేయించుకోవాలని కూడా చెబుతున్నారు. ఆధార్ ఇన్ యాక్టివ్ అని వస్తుంటే సరి చేయించుకుంటే అన్నదాత సుఖీభవ తో పాటు పిఎం కిసాన్ నిధులు జమకు అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ పొందేందుకు మాత్రం తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. తొలకరి వానలు పడుతుండడంతో రైతులు ఖరీఫ్ కు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ తో పాటు పీఎం కిసాన్ నిధులు జమ కానుండడం రైతులకు ఎంతో ప్రయోజనం.

భారతదేశ రక్షణ వ్యవస్థ.. శత్రు దాడులను ఎదుర్కొనే సత్తా మనకుందా?

India Defense System
India Defense System

India Defense System: భారత దేశం చుట్టూ శత్రుదేశాలే. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మన శత్రువులు ఎవరు.. మిత్రులు ఎవరు అనేది తేలిపోయింది. పక్కలో బల్లాల్లా.. పాకిస్తాన్, చైనా మనపై కారాలు మిరియాలు నూరుతుంటాయి. వీటికి ఇప్పుడు బంగ్లాదేశ్‌ తోడైంది. నేపాల్‌ కూడా అప్పుడప్పుడు కవ్విస్తుంది. ఆపరేషన్‌ సిందూర్‌తో మన శక్తి ప్రపంచానికి తెలిసింది. కానీ మన దేశంపై అణుదాడి జరిగితే ఎదుర్కొనే వ్యవస్థ ఉందా.. ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది.

న్యూక్లియర్‌ దాడి జరిగితే పరిస్థితి ఏమిటి?
మన దేశంపై న్యూక్లియర్‌ దాడి జరిగితే దేశం మొత్తం మీద వినాశనం, రేడియేషన్‌ ప్రభావం, మౌలిక సదుపాయాల నాశనం వంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వ కేంద్రాలు, సైనిక స్థావరాలు, నగరాలు లక్ష్యంగా మారవచ్చు. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థలు దాడిని పూర్తిగా నివారించలేకపోయినా, నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. దాడి తర్వాత పునర్నిర్మాణం, సహాయక చర్యలు, అంతర్జాతీయ సహకారం కీలకం.

పాలనా వ్యవస్థ తుడిచిపెట్టుకుపోతే…
ప్రభుత్వ నాయకత్వం, కేంద్ర కార్యాలయాలు నాశనమైతే దేశం నిర్వాకం అవుతుంది. దీనికి రహస్య ప్రోటోకాల్స్‌ ఉంటాయి. సైనిక దళాలకు ముందుగా ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయి. సైన్యం, నేవీ, వాయుసేనల మధ్య సమన్వయం జరుగుతుంది. రహస్య వ్యవస్థలు, వారసత్వ నియమాలు ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్‌ ఎలాంటి నిర్దిష్ట వ్యవస్థను అనుసరిస్తుందో బహిరంగంగా తెలియదు, కానీ రెండవ దాడి సామర్థ్యం నిర్వహించడానికి రహస్య ఏర్పాట్లు ఉంటాయని అంచనా.

దాడులను తప్పించుకోవడానికి ఉన్న వ్యూహాలు..
భారత్‌ యొక్క ప్రధాన వ్యూహం నిరోధకత. శత్రువుకు ‘‘మనం నాశనమైనా, మేము తిరిగి దాడి చేస్తాం’’ అనే భయం కలిగించడం. ఇందుకు బాలిస్టిక్‌ మిస్సైళ్లు, జలాంతర్గాములు, విమానాలు వంటి వివిధ డెలివరీ సిస్టమ్స్‌ ఉపయోగపడతాయి. ముందస్తు దాడి కాకుండా, రెండవ దాడి సామర్థ్యం మీద దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ ఒప్పందాలు,

దౌత్యం కూడా ముఖ్యం…
శత్రువుల వద్ద ఉన్న ఆయుధాలుచైనా వద్ద బాలిస్టిక్‌ మిస్సైళ్లు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరం వెళ్లి, అధిక వేగంతో భూమిని చేరతాయి. హైపర్‌ సోనిక్‌ మిస్సైళ్లు వేగంగా వెళ్లినా, బరువు మోసే సామర్థ్యం తక్కువ. క్రూయిజ్‌ మిస్సైళ్లు, టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ (చిన్న పరిమాణ న్యూక్లియర్‌ ఆయుధాలు) కూడా ఉన్నాయి. బాలిస్టిక్‌ మిస్సైళ్లు అత్యంత ప్రమాదకరం ఎందుకంటే అవి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు, రాడార్లకు చిక్కడం కష్టం, ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో ఒక్కటి అనేక వార్‌హెడ్స్‌ను మోయగలవు. అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపం నుంచి వచ్చే మిస్సైళ్లకు హెచ్చరిక సమయం కేవలం 8–10 నిమిషాలు మాత్రమే.

భారత్‌ రక్షణ వ్యవస్థలు..
భారత్‌ వద్ద ఎస్‌–400 (రష్యా నుంచి), ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్, పృథ్వి ఇంటర్‌సెప్టర్‌ మిస్సైళ్లు ఉన్నాయి. ఆకాశ్‌ ఎంజీ భరత్‌ వంటి స్వదేశీ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ ఫేజ్‌–1, ఫేజ్‌ – 2 అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి శత్రు మిస్సైళ్లను ఆకాశంలోనే అడ్డుకోవడానికి రూపొందించబడ్డాయి. ఈఎంఐఎస్‌లటీ శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్‌ సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఇవన్నీ లేయర్డ్‌ డిఫెన్స్‌ (బహుళస్థాయి రక్షణ) ఏర్పాటు చేస్తాయి. ఎర్లీ వార్నింగ్, డిటెక్షన్‌ సిస్టమ్సి్మస్సైల్‌ ప్రయోగం జరిగిన వెంటనే గుర్తించడం చాలా ముఖ్యం. ఆర్‌ఐఎస్‌ఏటీ ఉపగ్రహాలు భూమి చిత్రాలు తీసి, లాంచ్‌ సైట్‌లోని మంటలు, పొగను గుర్తిస్తాయి. గ్రౌండ్‌ బేస్డ్‌ రాడార్లు, ఏడబ్ల్యూఏసీఎస్‌ విమానాలు ట్రాకింగ్‌ చేస్తాయి. డేటా డీఆర్డీవోకు పంపబడి, విశ్లేషణ జరుగుతుంది. బాలిస్టిక్‌ మిస్సైల్‌ ఎక్కువ ఎత్తుకు వెళ్లి, తర్వాత భూమిని చేరుతుంది కాబట్టి మధ్య దశలో ట్రాక్‌ చేయడం కష్టం.

ఇంటర్సెప్షన్‌ ప్రక్రియ, కమాండ్‌ వ్యవస్థ..
మిస్సైల్‌ గుర్తించగానే బీఎండీ కంట్రోల్‌ కమాండ్, ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (2019లో ఏర్పాటు) రంగంలోకి దిగుతాయి. ఇందులో ఆర్మీ, నేవీ, వాయుసేన, విదేశాంగ శాఖ, డీఆర్డీవో, రక్షణ శాఖలు ఉంటాయి. మిస్సైల్‌ ఎక్కడ పడుతుందో, ఎప్పుడు చేరుతుందో విశ్లేషించి, ఆకాశంలో పేల్చాలా లేదా భూమికి దగ్గరగా అడ్డుకోవాలా అని నిర్ణయిస్తారు. టర్మినల్‌ ఫేజ్‌లో (భూమిని చేరే సమయం) కేవలం 1–2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. వార్‌హెడ్‌ను నాశనం చేయడం చాలా కష్టం.

అవసరమైన మెరుగుదలలు…
చైనా నుంచి వచ్చే మిస్సైళ్లకు హెచ్చరిక సమయం చాలా తక్కువ (7–9 నిమిషాలు). హైపర్‌ సోనిక్‌ మిస్సైళ్లను అడ్డుకోవడానికి ప్రస్తుత టెక్నాలజీ సరిపోదు. మాన్యువల్‌ కమాండ్‌ మీద ఆధారపడటం, స్పేస్‌ బేస్డ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ లోపం. బాలిస్టిక్‌ మిస్సైళ్ల మధ్య దశలో ట్రాకింగ్‌ కష్టం. టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ను చిన్న ఏరియాలపై ఉపయోగించవచ్చు.

భారత్‌ రక్షణ వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతోంది, కానీ శత్రువుల ఆయుధ సామర్థ్యాలు, తక్కువ హెచ్చరిక సమయం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి టెక్నాలజీలో మరిన్ని పురోగతులు అవసరం. బలమైన డిటరెన్స్, ఆధునిక రక్షణ వ్యవస్థలు మాత్రమే భవిష్యత్‌ బెదిరింపులను తట్టుకోగలవు. దేశ రక్షణ అనేది నిరంతర అభివృద్ధి ప్రక్రియ.

'అగ్నిపరీక్ష 2' కి ఊహించని రెస్పాన్స్.. ఇంత తక్కువ అప్లికేషన్స్ వస్తాయని అనుకోలేదు..

Agnipariksha 2
Agnipariksha 2

Agnipariksha 2: గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ కి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే, ఈ సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్. మామూలు ఎపిసోడ్స్ కి కూడా 7 రేటింగ్స్ కి తక్కువ కాకుండా వచ్చేది. ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘అగ్ని పరీక్ష’ షో. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ సృష్టించిన ఇంప్యాక్ట్ మామూలుది కాదు. కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ అవ్వగా, డిమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. ఆ తర్వాత దివ్య , మాస్క్ మ్యాన్ హరీష్ , శ్రీజ దమ్ము , ప్రియా , ఇలా ఈ షో ద్వారా సమానులుగా అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు దుమ్ములేపేసారు.

అందుకే ‘అగ్ని పరీక్ష 2’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని , గత సీజన్ కంటే ఈ సీజన్ లో వచ్చే అప్లికేషన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని , ఇలా ఎన్నో రకాల అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలన్నీ ఇప్పుడు ఆవిరి అయ్యాయి. ఈ షో కి ఆశించిన స్థాయిలో అప్లికేషన్స్ రాలేదట. మొదటి సీజన్ కంటే తక్కువ అప్లికేషన్స్ వచ్చాయని , ఇది మేకర్స్ కి చాలా పెద్ద షాక్ అని అంటున్నారు. ఈ నెల 12 నుండి దరఖాస్తులకు సంబంధించిన వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మరి రాబోయే రోజుల్లో అప్లికేషన్స్ సంఖ్య పెరుగుతుందో లేదో చూడాలి. చాలా మందికి ఓటీపీ సమస్యలు ఎదురు అవ్వడం తో అప్లికేషన్స్ వెళ్లడం లేదనే కంప్లైంట్ ఉంది.

ఇది సరి చేస్తే అప్లికేషన్స్ పెరగొచ్చేమో అని ఆదిరెడ్డి వంటి వారు యూట్యూబ్ లో విశ్లేషిస్తున్నారు. ఇకపోతే ఈ షో జులై 25 నుండి ప్రసారం కానుంది. జియో హాట్ స్టార్ తో పాటు, స్టార్ మా ఛానల్ లో కూడా ఈ ‘అగ్నిపరీక్ష 2’ ప్రసారం కానుంది. మరి ఈ సీజన్ నుండి ఎలాంటి కంటెస్టెంట్స్ ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెడుతారో, వాళ్ళు ఎలాంటి బలమైన ప్రభావం చూపిస్తారో చూడాలి. గత సీజన్ కి న్యాయ నిర్ణేతలుగా బిందు మాధవి , నవదీప్ , అభిజీత్ వంటి వారు వ్యవహరించారు. ఈ సీజన్ కి శివాజీ , గీత మాధురి , అభిజీత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

కోటి కోట్ల ఎలాన్ మస్క్.. ఆస్తులన్నీ అమ్మేసి ఒక చిన్న ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు.. కారణమేంటి..

Elon Musk Lifestyle
Elon Musk Lifestyle

Elon Musk Lifestyle: మొన్ననే కదా ఐపిఓ ద్వారా కోటి కోట్లను సమీకరించాడు మస్క్. ప్రపంచంలోనే కోటి కోట్లను సంపాదించిన వ్యాపారిగా అవతరించాడు. ఇంతటి స్థాయిలో డబ్బున్న వ్యక్తి ఎలా ఉండాలి.. ఏ స్థాయిలో సౌకర్యాలను అనుభవించాలి.. భోగభాగ్యాలను ఏ విధంగా ఆస్వాదించాలి.. కానీ మస్క్ ఏం చేస్తున్నాడో తెలుసా.. ఎలా ఉంటున్నాడో తెలుసా..

కోటికోట్ల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ మస్క్ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించడం లేదు. ఇతడు టెక్సాస్ లో సుమారు 44.31 లక్షల విలువైన ఇంట్లో ఉంటున్నాడు.. అతడు ఆ స్థాయిలో డబ్బు ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడపడం లేదు. శ్రీమంతుడిలా కాకుండా.. దారిద్ర రేఖకు దిగువన ఉన్న వ్యక్తిలాగా అతని జీవిస్తున్నాడు. ఇతడు పడుకునే పరుపు కు రంద్రం కూడా పడింది. దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయడానికి కూడా మస్క్ ఇష్టపడడం లేదు.

మస్క్ కు అమెరికా వ్యాప్తంగా విలాసవంతమైన భవనాలు ఉన్నప్పటికీ.. వాటిని మొత్తం అమ్మేశాడు. కేవలం టెక్సాస్ లో ఒక మామూలు ఇంట్లో ఉంటున్నాడు. గృహాల మీద ఆయనకు అంతగా ఆసక్తి ఉండదు. కాకపోతే కార్లు.. ప్రైవేట్ జెట్ విమానాలను ఆయన విపరీతంగా కొనుగోలు చేస్తారు. సరిగా నాలుగు సంవత్సరాల క్రితం ఆయన తన వద్ద ఉన్న సొమ్ములో కొంత భాగాన్ని ట్విట్టర్ కొనుగోలు కోసం వెచ్చించారు.. వాస్తవానికి మస్క్ దగ్గర అత్యంత విలాసవంతమైన భవనాలు ఉండేవి. వాటి కోసం ఏకంగా ఆయన 10 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. అవన్నీ కూడా కాలిఫోర్నియా ప్రాంతంలోని బెల్ ఎయిర్ ప్రాంతంలో ఉండేవి.. ఆ నివాసాలలో స్విమ్మింగ్ పూల్స్.. ప్రైవేట్ గ్రంథాలయం.. మద్యం కోసం ప్రత్యేకంగా గదులు ఉండేవి. వీటిని ఆ తర్వాత ఆయన అమ్మేశారు.. అంతేకాదు డబ్బులు అక్కర్లేదని.. తనను తాను భూమికి అంకితం చేసుకుంటున్నట్టు.. ఎక్కువ ఆస్తులు ఉంటే సమస్యలు వస్తాయని మస్క్ అప్పట్లో వ్యాఖ్యానించారు. అందువల్లే ఆయన ఇప్పుడు 50 వేల డాలర్ల విలువచేసే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇంట్లో ఉంటున్నారు. మరోవైపు మస్క్ మానస పుత్రిక స్పేస్ ఎక్స్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. దీనిని స్టార్ బేస్ అని పిలుస్తున్నారు.

మస్క్ తన సొంత ఇంటికి ఎక్కువగా వెళ్లరు. స్నేహితుల ఇళ్లలోనే ఉంటుంటారు. టెస్లా కంపెనీకి సంబంధించిన ఇంజనీరింగ్ పనులు ఎక్కువగా బె ఏరియా ప్రాంతంలో సాగుతూ ఉంటాయి. అక్కడ ఉండే తన స్నేహితుల ఇంటికి వెళ్లి.. అందులోనే ఉంటాడు. ఒకవేళ వారింట్లో పడక గదులు ఖాళీగా ఉంటే అందులోనే పడుకుంటాడు.. మస్క్ ఇళ్ళ విషయంలో పెద్దగా పట్టించుకోరు గాని.. ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మకమైన నాందికి శ్రీకారం చుట్టిన ఫోర్డ్ మోడల్ టీ కారు మస్క్ వద్ద ఉంది. ఇంకా అనేక రకాల కలెక్షన్లు ఆయన వద్ద ఉన్నాయి.

దోమ కంటే చిన్నది.. చైనా సీక్రెట్ వెపన్.. భారత్ లో గుబులు..

China Secret Weapon
China Secret Weapon

China Secret Weapon: ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో కొంత ప్రాంతాన్ని తమది అని చైనా చెబుతోంది.. ఈశాన్య రాష్ట్రాలలో నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.. పాకిస్తాన్ దేశంతో దోస్తీ చేస్తూ.. మన సరిహద్దుల్లో మంటలు పెడుతుంది. ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. అంతర్జాతీయ వేదికలలో కూడా మనమీద నిత్యం మట్టిపోస్తూనే ఉంది. మనం చేసే ప్రతి పనిలో అడ్డు తగులుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంది. ఇక్కడితోనే చైనా ఆగిపోలేదు.

దోమ కంటే చిన్న పరిమాణంలో..

నేటి ఆధునిక కాలంలో యుద్ధాలు మొత్తం కేవలం డ్రోన్ల ద్వారానే జరుగుతున్నాయి. మానవ రహితంగా.. అత్యంత ఆధునికమైన మిస్సయిల్స్.. డ్రోన్లను యుద్ధాలలో వాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కూడా పాకిస్తాన్ మీద మిస్సైల్స్ ఉపయోగించింది. డ్రోన్లను వాడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఇటీవలి అమెరికా, ఇరాన్ యుద్ధంలో కూడా డ్రోన్లను ఉపయోగించారు.. ఆయా దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్లను రూపొందించాయి.

కొన్ని డ్రోన్లు రాడార్ పరిధిలో ఉండవు. వాటి వల్ల జరిగే నష్టం కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ డ్రోన్లను పడగొట్టడానికి అత్యంత శక్తివంతమైన మిసైల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మన కంటికి కనిపించిన పరిమాణంలో డ్రోన్ ఉండేది. అయితే ఇప్పుడు చైనా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏకంగా దోమ కంటే చిన్న పరిమాణంలో ఉన్న డ్రోన్ రూపొందించింది. ఇది 0.6 సెంటీమీటర్ పరిమాణంలో ఉంటుంది. ఈ డ్రోన్ ద్వారా శత్రు దేశాల కదలికలు.. కీలకమైన స్థావరాలు.. ఆదేశ భౌగోళిక వ్యవహారాలు మొత్తం చిత్రీకరించవచ్చు. యుద్ధం వంటి పరిణామం ఏర్పడినప్పుడు.. ఆ డ్రోన్ రూపొందించిన చిత్రాలను బేరిజు వేసుకుంటూ దాడులు చేయవచ్చు. కొన్ని సందర్భాలలో భౌగోళిక ఆక్రమణలకు కూడా పాల్పడవచ్చు.

చైనా దీనిని తయారు చేయడానికి ప్రధాన కారణం భారత్. ఎందుకంటే కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రాలలో చైనా చేస్తున్న ఆకృత్యాలు మామూలుగా లేవు. అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భాగం తమ భూభాగంలో ఉందంటూ చైనా వాదిస్తోంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగం కలుపుకుంటూ ఒక మ్యాప్ కూడా రూపొందించింది.. దీనిపై భారతదేశ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు తైవాన్ తో చైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంది. అందువల్లే ఈ తరహాలో డ్రోన్లు రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై చైనా అధికారికంగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు..

మింగ మెతుకు లేకున్నా.. 90 వేల కోట్లు.. పాకిస్తాన్ మారదు గాక మారదు

Pakistan Defence Budget
Pakistan Defence Budget

Pakistan Defence Budget: ఇండియా, పాకిస్తాన్ ఒకేసారి ఏర్పడ్డాయి. కానీ అభివృద్ధిలో, ఇతర విషయాలలో భారత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులతో సహవాసం చేస్తూ, ఉగ్రవాద దేశంగా మారిపోయింది. సరైన రోడ్లు ఉండవు. వర్షం వస్తే.. కరువు ఇబ్బంది పెడితే.. భూకంపాలు నిండా మునిగేలా చేస్తే.. ఇలా ఏ ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ పాకిస్తాన్ జస్ట్ చేతులెత్తేయడమే. పౌరులకు భద్రత ఉండదు. ఆడవాళ్లకు రక్షణ ఉండదు. కనీసం తినడానికి తిండి గింజలు కూడా దొరకవు. ప్రజలే తమ దరిద్రాన్ని తిట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు.

మింగ మెతుకు లేకపోయినప్పటికీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా.. పాకిస్తాన్ పరిస్థితి ఉంది. ఆ మధ్య భారత్ చేసిన దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు నేల కూలిపోయాయి. అయితే వాటి మరమ్మతుల కోసం.. కొత్త వాటిని నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా భారీగా సహాయం చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి ఉగ్రవాదులకు దండిగా డబ్బులు ఇచ్చింది. ప్రజల విషయంలో మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ఉదారత చూపించదు.

పాకిస్తాన్ ప్రజల భద్రతను పక్కనపెట్టి.. మెరుగైన సౌకర్యాల కల్పన విషయాన్ని దూరం పెట్టి.. కేవలం రక్షణ శాఖకు మాత్రమే బడ్జెట్ కేటాయించుకుంటూ పోతుంది. తాజాగా కూడా 90 వేలకు పైగా కోట్లను రక్షణ శాఖకు కేటాయిస్తూ ప్రకటించింది. పైగా ఇందులో ఏమంటుంది అంటే.. భారత్ నుంచి ముప్పు ఉంది కాబట్టి.. సరిహద్దుల్లో రక్షణ కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడే పాకిస్తాన్ ఒక తప్పు చేస్తోంది. భారత్ కేటాయిస్తున్న కేటాయింపులు చూసి.. తను కూడా రక్షణ శాఖకు భారీగా వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చింది.

భారత రక్షణ శాఖ బడ్జెట్ ఇప్పటికే 7 లక్షల కోట్లకు చేరుకుంది. దానిని చేరుకోవాలని .. భారతదేశానికి మించి ఖర్చు పెట్టాలని ఎప్పటినుంచో పాకిస్తాన్ అనుకుంటున్నది. కానీ ఆ దేశానికి అంత సన్నివేశం లేదు. డిఫెన్స్ మాత్రమే కాదు.. అన్ని రంగాలలోనూ కేటాయింపులు చూసుకుంటే పాకిస్తాన్ ఇంకో వంద జన్మలు ఎత్తినా సరే భారతదేశానికి సాటి రాదు. పులి మాదిరిగా ఉండాలని నక్క వాతులు పెట్టుకుంటే.. కాలేది నక్క శరీరమే. పులికి ఏమీ కాదు.

టీవీకే విజయ్ తో అట్లుంటది మరీ.. ప్రత్యర్థులంతా అవాక్కు

Vijay TVK Channel
Vijay TVK Channel

Vijay TVK Channel: మనదేశంలో.. మిగతా రాష్ట్రాలలో రాజకీయాలు వేరు.. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు వేరు.. అక్కడ రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా ఛానల్స్ ఉంటాయి. ఈ సాంప్రదాయానికి డీఎంకే శ్రీకారం చుడితే.. అన్నా డీఎంకే దానిని కొనసాగించింది.. ఇప్పుడు ఇదే వ్యవహారాన్ని దేశంలో మిగతా పార్టీలు కూడా అనుసరిస్తున్నాయి. తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి అనుబంధంగా చానల్స్.. యూట్యూబ్ ఛానల్స్.. పత్రికలు ఉన్నాయి. నిజాలను నిష్పక్షపాతంగా వెల్లడించాల్సిన మీడియా.. పార్టీలకు భజన చేసే వ్యవస్థగా మారిపోవడం నిజంగా బాధాకరం.

తమిళనాడులో..

తమిళనాడులో డీఎంకే పార్టీకి అనుబంధంగా కలైంజర్, సన్ టివి ఉన్నాయి. ఇవి ఎప్పటినుంచో ఆ పార్టీకి అనుకూలంగా ప్రసారాలు చేస్తున్నాయి. అన్నా డీఎంకే పార్టీకి అనుకూలంగా జే టీవీ ప్రసారాలు సాగిస్తూ ఉంటుంది. పత్రికలు కూడా ఆయా పార్టీలకు అనుబంధంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో టీవీ కే విజయ్ కూడా చేరిపోయారు.

కొత్త ఛానల్ ఏర్పాటు

విజయ్ తన అమలు చేస్తున్న పథకాలు.. పరిపాలన.. ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి వెట్రీ పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెట్రీ అంటే తమిళంలో విజయం అని అర్థం.. తన పార్టీలో ఉన్న వెట్రి పేరును ఛానల్ కు తమిళనాాడు ముఖ్యమంత్రి ఖరారు చేశాడు. ఇప్పటికే అన్ని అనుమతులు కూడా కేంద్రం ఇచ్చింది.. ఈ ఛానల్ కు సంబంధించి ఇతర వ్యవహారాలు కూడా పూర్తి చేశారు. క్లాస్ 38 కింద ఈ వ్యవహారం మొత్తం పూర్తి చేశారు.

ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులను.. యాంకర్లను.. ఇతర విభాగాలలో పని చేసే వారిని తీసుకున్నారు. వారికి భారీగానే జీతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ ప్రసారాలు మాత్రమే కాకుండా.. డిజిటల్ విభాగంలో కూడా ఈ ఛానల్ ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ తన ముఖ్యమంత్రిగా చేస్తున్న పనులు.. పథకాల గురించి యువతకు తెలియడానికి డిజిటల్ వేదికలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టా, యూట్యూబ్ ఇతర వేదికలలో కూడా వెట్రీ ఛానల్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పటికే పరిపాలన విషయంలో సరికొత్త విధానంలో దూసుకుపోతున్న విజయ్.. ఇప్పుడు ఏకంగా మీడియాలోకి కూడా అడుగుపెడుతున్నారు. రాజకీయ పార్టీ పెట్టిన కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చారు విజయ్. ఇప్పుడు చానల్ నిర్వహణలోకి ప్రవేశించి ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

జట్టులో చోటు లేదు. సిక్స్ ప్యాక్ తో సినిమాల్లోకి స్టార్ క్రికెటర్

Rinku Singh Fitness Transformation
Rinku Singh Fitness Transformation

Rinku Singh Fitness Transformation: అన్ని అనుకూలంగా ఉంటే ఈ సమయం వరకు అతడు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా తరఫున ఆడేవాడు. అంతేకాదు ఆ తదుపరి జరిగే టి20 సిరీస్ లలో కూడా అతడికి ఆడే అవకాశం లేదు. ఎందుకంటే అతడి ప్రదర్శన కొంతకాలంగా బాగోలేదు. ఐపీఎల్ లో కూడా తన స్థాయిలో ఆడలేదు. దీంతో జట్టు నుంచి ఉద్వాసన తప్పలేదు. ఫలితంగా ఇప్పుడు అతడు ఖాళీగా లేడు. తనను తాను మార్చుకునే పనిలోపడ్డాడు.

సిక్స్ ప్యాక్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాడు రింకు సింగ్. ఐపీఎల్ లో కోల్కతా జట్టు తరఫున ఆడిన అతడు.. తన స్థాయి ప్రదర్శన చేయలేదు. పైగా కొన్ని సందర్భాలలో చేతులెత్తేశాడు. అతడు విఫలం కావడం కోల్కతా జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అంతేకాదు, రింకు సింగ్ కెరియర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. తాజాగా రింకు సింగ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు.. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగే టి20 సిరీస్ లకు కూడా చోటు దక్కించుకోలేదు. ఖాళీగా ఉంటే మెదడు లో రకరకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయని భావించిన అతడు.. తన శరీరాన్ని మెరుగు పరుచుకునే పనిలోపడ్డాడు.

జిమ్ లో అతడు తీవ్రంగా సాధన చేస్తున్నాడు. తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకుంటున్నాడు. ఇప్పటికే అతడు ఆరు పలకల దేహంతో కనిపిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను అతడు సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. అతడి శ్రమను చాలా మంది మెచ్చుకుంటున్నారు. కాకపోతే ఇదే ఫోకస్ క్రికెట్ మీద కూడా చూపెట్టాలని.. బ్యాటింగ్లో అద్భుతాలు చేయాలని.. అప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించే అవకాశం ఉంటుందని అభిమానులు అతనికి సూచిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టి అదరగొట్టాలని అతడికి హితవు పలుకుతున్నారు.

ఇటీవల ఎంపీ సరోజ్ తో వివాహాన్ని నిశ్చయం చేసుకున్నాడు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచింది. పైగా ఆమె లాయర్ కూడా. రింకు సింగ్ మంచితనాన్ని చూసి ఆమె ఇష్టపడింది.. అది కాస్త ప్రేమకు దారి తీసింది. చాలా రోజులపాటు వారిద్దరు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఎంగెజ్మెంట్ చేసుకున్నారు.

రిషి కొండ ప్యాలెస్ ను అలా చేయాల్సిందే.. కనీసం ఆ ఖర్చులకైనా వస్తాయి..

Rishikonda Palace
Rishikonda Palace

Rishikonda Palace: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో రిషికొండను తొలచి ఒక ప్యాలెస్ నిర్మించారు. అసలు ఆ ప్యాలస్ ఎందుకు కట్టారు.. దేనికోసం కట్టారు.. అనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అయితే.. అందులో నుంచి పరిపాలన చేద్దామనుకున్నారా.. లేక ఇంకా ఎవరికోసమైనా కానుకగా కట్టించారా.. అనే ప్రశ్నలపై ఇంతవరకు క్లారిటీ లేదు.

అప్పట్లో కొంతమంది వైసీపీ నాయకులు అత్యుత్సాహంతో రెండవసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ప్రకటించుకున్నారు. అంతేకాదు రిషికొండ ప్యాలస్ నుంచి జగన్ పరిపాలన చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. రిషికొండ ప్యాలస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నారా లోకేష్ వేరువేరుగా పరిశీలించారు. అయితే ఇప్పటివరకు కూడా అది అలానే ఉంది. అప్పట్లో టూరిజం కోసం దానిని వాడుకుంటామని ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదన అలానే ఉండిపోయింది.

తాజాగా రిషికొండ ప్యాలస్ పై విశాఖపట్నం ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని గదులున్న ఈ ప్యాలెస్ ను ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.. కొందరైతే ఈ ప్యాలెస్ ఉపయోగపడదు కాబట్టి.. హైదరాబాదు నమూనా అమలు చేయాలని.. ఫలక్ నామ ప్యాలస్ మాదిరిగా సినిమా షూటింగ్లకు అద్దెక్కించుకుంటే.. ఎంతో కొంత మిగులుతుందని.. కనీసం నిర్వహణ ఖర్చులకైనా డబ్బులు వస్తాయని చెబుతున్నారు. మరి దీనిపై కూటమినేతలు ఏం ఆలోచిస్తారో చూడాలి. ఎందుకంటే ఆ ప్యాలెస్ కరెంట్ బిల్లు.. నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.. అలాంటప్పుడు టూరిజం సెంటర్ లాగా దాన్ని మార్చి.. అద్దెలకు ఇచ్చుకుంటే కొంతలో కొంత డబ్బులు వస్తాయని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు.

నాడు ఈ ప్యాలస్ నిర్మించడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డగోలు పనులు చేసింది. పచ్చని చెట్లతో నిండుగా కనిపించిన రిషికొండ.. బోడి గుండు లాగా మారింది.. విశాఖపట్నం నగరానికి అద్భుతమైన మణిహారంగా రిషికొండ ఉండేది. కాని దానిని పూర్తిగా తొలచి.. ఇలాంటి నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం కోసం నాడు వందల కోట్లు ఖర్చుపెట్టారు. అసలు ఎందుకిలా ఖర్చు పెట్టారో ఇప్పటికీ తెలియదు.. రాత్రికి రాత్రి ఆ కొండమీద చెట్లను తొలగించారు. పగలు రాత్రి తేడా లేకుండా పనులు సాగించారు. అయితే ఈ భవనాన్ని తమ ఘనతగా వైసిపి నాయకులు చెప్పుకున్నారు. కానీ ఎందుకు నిర్మించారో ప్రజలకు వివరించలేకపోయారు. అందువల్లే ప్రజలు కూడా 11 స్థానాలకు పరిమితం చేసి.. ప్రజా ధనాన్ని అడ్డగోలు ఖర్చులకు పెడితే ఎలా ఉంటుందో చూపించారు.. మరి ఈ భవనంపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఏ విధంగా ఉపయోగించుకుంటుంది.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.