Subhas Chandra Bose Biopic: మన భారత దేశానికీ స్వాతంత్రం తీసుకొని రావడం లో ప్రధాన పాత్ర పోషించిన సమర యోధుల్లో ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి , మన దేశాన్ని వదిలి పారిపోయేలా చేసిన ఘనుడు సుభాష్ చంద్ర బోస్. అలాంటి అమరుడి చరిత్ర గురించి నేటి తరం ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే తెలుసు. అసలు సుభాష్ చంద్ర బోస్ చరిత్ర ఏంటి?, స్వతంత్రం తీసుకొని రావడంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచించాడు?, ఆయన అకస్మాత్తుగా ఎందుకు మాయం అయ్యాడు?, ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారని కొందరు నమ్ముతున్నారు, అందులో నిజమెంత?, ఇలాంటి విషయాలను ఆధారంగా తీసుకొని ఆయన బయోపిక్ ని తీసేందుకు సౌత్ ఇండియా లో ప్రముఖ నిర్మాణ సంస్థ గా పేరు తెచ్చుకున్న ‘జెమినీ ఫిలిం సర్క్యూట్’ ముందుకొచ్చింది. ఈ చిత్రంలో సుభాష్ చంద్ర బోస్ గా ఆర్యన్ శ్యామ్ నటించనున్నారు.
చూసేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ లాగా కనిపిస్తున్న ఈ ఆర్యన్ శ్యామ్ , సుభాష్ చంద్రబోస్ గెటప్ లో అదిరిపోయాడు. ఈ చిత్రానికి ‘సుభాష్’ అనే టైటిల్ ని లాక్ చేశారు. ఆనంద్ వీ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు రీసెంట్ గానే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్ర సమరంలో ఆయన పోషించిన పాత్ర, పోరాట లక్ష్యం వంటి విషయాలను పరిశోధించి వివరంగా ఈ సినిమాలో చూపించబోతున్నాము. భారత సైనిక దళం కి కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత, ఆయనకు ఎదురైనా సవాళ్లు, వాటిని అధిగమించి చేసిన సేవలు , ఈ తరం లో చాలా మందికి తెలియదని , వాటిని మేము వెండితెర పై అద్భుతంగా ఆవిష్కరించి చూపిస్తామని, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషల్లోనూ విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ గా నటించడం నా జీవితం లో ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నానని , ఇది ఒక బాధ్యత గా తీసుకొని నటిస్తానని, హీరో ఆర్యన్ శ్యామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ ఆర్యన్ శ్యామ్ మరెవరో కాదు, ఇండియా లో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆజ్యం పోసిన వీ.కృష్ణ స్వామి అయ్యర్ మనవడు అట. సినిమాల్లోకి ఇలాంటి గొప్ప చరిత్ర కారుడి బయోపిక్ తో రావడం ఆయన అదృష్టం అనే చెప్పాలి. బయోపిక్స్ ని పర్ఫెక్ట్ గా తీస్తే , బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతున్న రోజులివి, మరి ‘సుభాష్’ చిత్రం తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
