Homeఎంటర్టైన్మెంట్Buchi Babu Next Movie: బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా కథ ఆ బ్యాక్ డ్రాప్ లో...

Buchi Babu Next Movie: బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా కథ ఆ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందా..?

Buchi Babu Next Movie: సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో మెలుకువలు నేర్చుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘ఉప్పెన’ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ట్రై […]

Buchi Babu Next Movie: సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో మెలుకువలు నేర్చుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘ఉప్పెన’ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే బుచ్చిబాబు తన తదుపరి సినిమా విషయంలో కూడా సరైన క్లారిటితో వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఒక పిరియాడికల్ డ్రామా సినిమాని తన నెక్స్ట్ సబ్జెక్టుగా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కూడా ఒక స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోలను కలిసి బుచ్చిబాబు కథనైతే వినిపించాడట. మరి వాళ్ళందరు కూడా ఈ సినిమా విషయంలో ఇంట్రెస్ట్ గా ఉన్నప్పటికి ఇందులో ఏ హీరో ఫైనల్ అవుతాడానే విషయంలో మాత్రం సరైన క్లారిటి రావడం లేదు. బుచ్చిబాబు సినిమా అంటే హీరో బాడీ లో ఏదో ఒక పార్ట్ కట్ అయిపోవడం పక్కా అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది.

మరి తదుపరి సినిమా విషయంలో కూడా అలాంటిదే ఏదైనా ఉంటుందా? లేదంటే హీరో ను పూర్తి ఫిట్ గా చూపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే బుచ్చిబాబు ప్రస్తుతం ఉన్న దర్శకులలో చాలా డిఫరెంట్ వే లో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటి ఇవ్వడం లేదు కానీ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

బుచ్చిబాబు సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ భారం పడకూడదనే ఉద్దేశ్యంతో వీలైనంత తొందరగా సినిమాని స్టార్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమా సినిమాకి ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోవడం అనేది తనకు నచ్చదట. అందుకోసమే వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper