Homeలైఫ్ స్టైల్Keeping Turtles At Home Benefits: తాబేళ్లను ఇంట్లో పెంచుకుంటే ఐశ్వర్యం వస్తుందా?

Keeping Turtles At Home Benefits: తాబేళ్లను ఇంట్లో పెంచుకుంటే ఐశ్వర్యం వస్తుందా?

Keeping Turtles At Home Benefits: ప్రకృతిలో ఉండే జీవరాశుల్లో తాబేలు ప్రత్యేకం. మిగతా జంతువలన్నీ దాదాపు హడావుడిగా ఉంటే.. తాబేలు మాత్రం నిదానంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే తాబేలును భారతీయ సంస్కృతిలో కేవలం జీవరాశిగా మాత్రమే కాకుండా కూర్మ(తాబేలు) అవతారం ఎత్తిన విష్ణువుగా భావిస్తారు. దీంతో ఇంట్లో తాబేలును పెంచుకుంటే ధనం, ఐశ్వర్యం, అదృష్టం వస్తాయని నమ్ముతుంటారు. కానీ తాబేలును ఇంట్లో పెంచుకోవడం కంటే పర్యావరణంలో దానిని సంరక్షించడం వల్ల ఎంతోపుణ్యం వస్తుందని కొందరు […]

Keeping Turtles At Home Benefits: ప్రకృతిలో ఉండే జీవరాశుల్లో తాబేలు ప్రత్యేకం. మిగతా జంతువలన్నీ దాదాపు హడావుడిగా ఉంటే.. తాబేలు మాత్రం నిదానంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే తాబేలును భారతీయ సంస్కృతిలో కేవలం జీవరాశిగా మాత్రమే కాకుండా కూర్మ(తాబేలు) అవతారం ఎత్తిన విష్ణువుగా భావిస్తారు. దీంతో ఇంట్లో తాబేలును పెంచుకుంటే ధనం, ఐశ్వర్యం, అదృష్టం వస్తాయని నమ్ముతుంటారు. కానీ తాబేలును ఇంట్లో పెంచుకోవడం కంటే పర్యావరణంలో దానిని సంరక్షించడం వల్ల ఎంతోపుణ్యం వస్తుందని కొందరు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అసలు తాబేలుకు సాయం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం వస్తుంది? పురాణాల్లో తాబేలుకు ఎటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి? పూర్తి వివరాల్లోకి వెళితె..

హిందూ పురాణాల్లో తాబేలుకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ముఖ్యంగా మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారమైన ‘కూర్మావతారం’ తాబేలు రూపంలోనే అవతరించిందని చెబుతారు. ఈ కారణంగా తాబేలును పవిత్ర జీవిగా భావిస్తారు. స్థిరత్వం, రక్షణ, ఓర్పు వంటి లక్షణాలకు ఇది ప్రతీకగా నిలిచింది.

క్షీరసాగర మథనంలో తాబేలు పాత్ర:
దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు భారీ సమస్య ఎదురైంది. మథనానికి ఉపయోగించిన మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుండటంతో మథనం కొనసాగడం కష్టమైంది. అప్పుడు మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి, తన భారీ తాబేలు రూపాన్ని సముద్రం అడుగున ఉంచి, మందర పర్వతాన్ని తన వీపుపై మోశాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పర్వతం స్థిరంగా నిలిచి, క్షీరసాగర మథనం విజయవంతంగా పూర్తయింది.

క్షీరసాగర మథనంలో కీలక పాత్ర పోషించిన కారణంగా తాబేలు స్థిరత్వం, భారం మోయగల శక్తి, ఓర్పు, ధైర్యానికి ప్రతీకగా మారింది. కష్టసమయంలో ఆధారంగా నిలిచే జీవిగా పురాణాలు దీనిని చిత్రీకరించాయి. అందుకే అనేక దేవాలయాల్లో కూడా తాబేలు ఆకారాలను చూడవచ్చు. భక్తి సంప్రదాయాల్లో ఇది ఆధ్యాత్మిక స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఇంట్లో తాబేలు పెంచుకోవాలా?
కొంతమంది తాబేలును ఇంట్లో పెంచుకుంటే అదృష్టం వస్తుందని నమ్మి కొనుగోలు చేస్తుంటారు. కానీ జీవ తాబేళ్లను పెంచడం అంత సులభం కాదు. వాటికి ప్రత్యేక ఆహారం, నీటి వాతావరణం, తగిన ఉష్ణోగ్రత, వైద్య సంరక్షణ అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి అనారోగ్యానికి గురవుతాయి. కేవలం అదృష్టం కోసం ఒక జీవిని బంధించడం సరైన పద్ధతి కాదని జంతు సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

తాబేళ్లు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం, కొన్ని రకాల జలచరాల సంఖ్యను నియంత్రించడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం వంటి పనుల్లో అవి సహాయపడతాయి. సముద్ర తాబేళ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే తాబేళ్లు ఉండే ప్రాంతాల్లో వాటిని సంరక్షించడం మంచింది. వాటికి అవసరైమన నీటి సౌకర్యాన్ని అందించడం వల్ల పర్యావరణాన్ని కాపాడగలుగుతామని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper