Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Fan Niranjan: చిన్నారి కోరికని నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. వరంగల్ లో హృదయాలను...

Pawan Kalyan Fan Niranjan: చిన్నారి కోరికని నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. వరంగల్ లో హృదయాలను హత్తుకునే ఘటనలు..

Pawan Kalyan Fan Niranjan: గత కొన్నేళ్ల నుండి జన్యుపరమైన ఇబ్బందులతో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదురుకుంటున్న నిరంజన్ అనే వరంగల్ ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని , తనకు పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉందని, అదే తన చివరి కోరిక అంటూ ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరింది , ఆయన హృదయం కలిచివేయడం తో , ఢిల్లీ టూర్ ముగియగానే , వరంగల్ కి చేరుకొని ఈ చిన్నారి కోరిక నెరవేర్చాడు. అతని ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులతో చర్చించి, ఆర్ధిక పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని మాట ఇచ్చారు. అంతే కాకుండా భావంతుడి తీర్థప్రసాదాలు కూడా ఆ బాలుడికి అందించారు పవన్ కళ్యాణ్. అనంతరం నిరంజన్ తల్లితండ్రులైన రాంగోపాల్ , మానస లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఎక్కడ ఈ బాలుడికి చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఏమి చేస్తే ఈ చిన్నారి ప్రాణాలు నిలుస్తాయో వివరాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, తక్షణమే వైద్యానికి అవసరమయ్యే 1 లక్ష రూపాయిలను అందించాడు. ధైర్యం గా ఉండాలని , భగవంతుడి ఆశీస్సులు నిరంజన్ పై కచ్చితంగా ఉంటాయని, భవిష్యత్తులో ఈ బాలుడికి అవసరమయ్యే వైద్యం ఖర్చుల బాధ్యత మొత్తం తానే తీసుకుంటానని భరోసా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వరంగల్ లో విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయాళం లో ప్రత్యేకంగా నిరంజన్ పేరిట పూజలు కూడా చేయిస్తానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంట్లోకి రాగానే పైకి లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉన్న నిరంజన్ దయనీయమైన పరిస్థితి ని చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. అట్నాని మంచం పై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. చిన్నతనం నుండి మీరంటే విపరీతమైన అభిమానం అని ఆ కుర్రాడు చెప్పడం తో , పవన్ కళ్యాణ్ కదిలిపోయారు.

అనంతరం తిరుమల నుండి తీసుకొచ్చిన వస్త్రాన్ని అతనికి కప్పి , కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. తనకు ఒక కుక్కపిల్లని పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా , కచ్చితంగా కొని పంపుతానని మాట ఇచ్చాడు. కుక్క పిల్లని పెంచుకోవడానికి ఇంటి ఓనర్లు ఒప్పుకోవడం లేదని చెప్పగా, ఇంటి ఓనర్లను పిలిపించి మాట్లాడాడు. అంతే కాకుండా, ఈ కుటుంబం జీవనోపాధి కోసం వీళ్ళతో ఒక క్యాంటీన్ పెట్టించాలని పవన్ కళ్యాణ్ తన జనసేన నాయకులకు ఆదేశించాడు. అభిమాని పట్ల, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, తన విలువైన సమయాన్ని కేటాయించి చూపించిన ప్రేమాభిమానాలు చూసి , పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకే కదా పవన్ కళ్యాణ్ ని అందరూ ఇంతలా ఆరాదించేది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular